dinakaran
-
టీటీవి దివాలా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో టీటీవీ దినకరన్‌కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్ విచారణను న్యాయమూర్తుల బెంచ్ ముగించింది. -
మదురైలో మంతనాలు .. వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయం
సాక్షి, చెన్నై(తమిళనాడు): చిన్నమ్మ శశికళ రాజకీయ దూకుడు పెరగడంతో.. అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చిన్నమ్మ ప్రతినిధిగా ముద్ర పడ్డ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పన్నీరుసెల్వం సోదరుడు రాజ భేటీ కావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారాలతో సేలంలో ఉన్న పళనిస్వామి హుటాహుటిన గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. ఇక చిన్నమ్మ శశికళను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించే విషయంపై అన్నాడీఎంకే సమన్వ య కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ, మాజీ మంత్రి సెల్లూరు రాజుతో సహా పలువురు అన్నాడీఎంకే నేత లు గురువారం ప్రకటనలు చేశారు. దీంతో చిన్నమ్మ వ్యవహారం అన్నాడీఎంకేలో హట్‌టాఫిక్‌గా మారింది. ఈ వ్యవహారాలు ఓ వైపు ఉంటే, మరోవైపు చిన్నమ్మ రాజకీయ మంతనాలు ఊపందుకున్నాయి. బుధవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు తంజావూరులో ఉన్న ఆమెను పలువురు నేతలు కలిసి మాట్లాడినట్టు తెలిసింది. దినకరన్ ఇంటి శుభ కార్యక్రమానికి చిన్నమ్మ హాజరు కావడం, అక్కడికి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో పాటుగా దక్షిణ తమిళనాడులో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, సన్నిహితులు రావడం చర్చనీయాంశమైంది. భేటీపై ఆసక్తి తంజావూరు పర్యటన ముగించుకుని మదురైకు గురువారం మధ్యాహ్నం చిన్నమ్మ వెళ్లారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ముఖ్య నేతలతో శశికళ భేటీ అయ్యారు. దక్షిణ తమిళనాడులోని దేవర్ సామాజిక వర్గాన్ని ఏకం చేసే రీతిలో, తనకు సన్నిహితంగా, మద్దతుగా ఉన్న అన్నాడీఎంకే మాజీలతో ఈ సంప్రదింపులు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ముందుగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టారని చెప్పవచ్చు. తాను పయనిస్తున్న మార్గంలో రైతులతో ముచ్చటిస్తూ, పంట పొలాల్లోకి వెళ్లి పలకరిస్తూ ముందుకు సాగారు. చెన్నైకు పళని స్వామి.. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో కన్వీనర్ పళనిస్వామి సేలం నుంచి గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్నారు. చిన్నమ్మ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైతం వ్యూహ రచనల్ని వేగవంతం చేశారు. ఇక, చిన్నమ్మకు మద్దతు గళం పెరుగుతున్న నేపథ్యంలో దినకరన్‌తో పన్నీరు సోదరుడు రాజ భేటీ కావడాన్ని తీవ్రంగానే పరిగణించారు. అదే సమయంలో మనస్సు నొప్పించే విధంగా ఇతరులపై వ్యాఖ్య లు చేయవద్దు అని తన మద్దతు దారులకు పళని స్వామి హితవు పలికినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, పళనిస్వామి కేవలం వైద్య చికిత్స కోసం చెన్నైకు వచ్చారేగానీ, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టేందుకు కాదంటూ ఆయన వర్గీయులు పేర్కొనడం గమనార్హం. చదవండి: మంత్రి వర్గంలో సంస్కార హీనులు -
Tamil Nadu: దినకరన్‌కు చిన్నమ్మ చెక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారు. బంధువుల నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉండిన జయలలిత మృతి తరువాత శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారి తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణం సమయంలో సీఎంగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. సీఎంగా పదవీ ప్రమాణం చేసేందుకు గవర్నర్ ఆమోదం పొందేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తనకు బదులు ఎడపాడి పళనిస్వామిని సీఎంగా చేసి పార్టీ బాధ్యతలు టీటీవీ దినకరన్‌కు అప్పగించారు. అయితే పార్టీని వీడిన పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకమై దినకరన్, శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతో అగ్గిరాసుకుంది. 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్ తనవైపునకు తిప్పుకున్నారు. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్ ఏఎంఎంకేను స్థాపించగా వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయవద్దు, ఉప ఎన్నికల్లో మాత్రమే పోటీచేయండని జైలు నుంచి శశికళ ఆదేశించారు. అయితే ఆమె ఆదేశాలను ధిక్కరించి తమిళనాడు, పాండిచ్చేరీల్లో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి మొత్తం 40 స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఘోరపరాజయం పొందారు. తన మాట పెడచెవిన పెట్టిన ఫలితంగా అవమానాలపాలు కావాల్సి వచ్చిందని దినకరన్‌పై శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అవే దుష్పలితాలు పునరావృతం కావడంతో ఏఎంఎంకే శ్రేణులు పార్టీని వీడి అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చేరడం ప్రారంభించారు. ముఖ్యనేతలంతా తమదారి చూసుకోవడంతో ఏఎంఎంకే గుడారం ఖాళీ అయ్యేదశకు చేరుకుంది. దినకరన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీ పతనం దిశగా పయనిస్తోందని కొందరు నేతలు శశికళకు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింతగా మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికికే ముప్పువాటిల్లగలదని ఆందోళన చెందిన శశికళ ఇటీవల దినకరన్‌తో ఫోన్ ద్వారా సంభాషించినట్లు సమాచారం. “పార్టీని నేను చూసుకుంటాను, కొంతకాలం బాధ్యతల నుంచి తప్పుకో’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక పార్టీ కార్యకలాపాలకు అన్న కుమారుడు, భర్త సోదరుడిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో దినకరన్ రాజకీయ ప్రకటనలు చేయడం, చెన్నై రాయపేటలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయానికి రావడం మానివేశారు. పార్టీ శ్రేణులను కలుసుకోవడం కూడా మానేశారు. -
చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళను జైలు నుంచి బయటకు తీసుకొస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. జైళ్ల శాఖకు విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికలో చిన్నమ్మ పేరు లేదని, దీన్ని బట్టి చూస్తే ఆమెకు క్లీన్చిట్ ఇచ్చినట్టు స్పష్టం అవుతోందన్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ సత్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది చివరి నాటికి జైలు నుంచి బయటకు రాబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఆనందంతో ఉన్న సమయంలో సత్ ప్రవర్తన జాబితాలో చిన్నమ్మ పేరు లేదన్నట్టుగా రెండు రోజుల క్రితం సమాచారాలు వెలువడ్డాయి. దీంతో వారి ఆశలు అడియాశలయ్యారు. శశికళ విడుదల ఇక, ఇప్పట్లో లేనట్టేనని, శిక్షా కాలం పూర్తిగా ఆమె జైలుకు పరిమితం కావాల్సిందేనా అన్న చర్చ జోరందుకుంది. అయితే, ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని న్యాయవాది రాజచెందూర్ పాండియన్ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం తథ్యం అని ధీమా వ్యక్తంచేశారు. దీపావళి రోజున ఆమె బయటకు వస్తారని ఎవ్వరూ చెప్పలేదే అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆమెపై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేదని స్పష్టం చేశారు. జైలులో అందరి ఖైదీలకు వర్తిసున్న నిబంధనలు చిన్నమ్మ కూడా పాటిస్తున్నారని, వస్త్రధారణలోనూ సమానమేనని పేర్కొన్నారు. ఆమె జైలు నుంచి బయటకు వెళ్లి వచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయని, అయితే, విచారణ కమిషన్ నివేదికలో ఆమె పేరు అన్నది అసలు లేదని వ్యాఖ్యానించారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ ఏ తప్పూ చేయలేదని క్లీన్చిట్ ఇచ్చనట్టేగా అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చిన్నమ్మను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు తగ్గ చర్యలు చేపట్టి ఉన్నామని, ఆమె తప్పకుండా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బయటకు రాకుండా రాజకీయాలు చేసే వాళ్లుచేస్తుంటారని, వాటన్నింటినీ అధిగమించి బయటకు చిన్నమ్మ వచ్చి తీరుతారని పేర్కొన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు రాజకీయ పార్టీ గుర్తింపు వ్యవహారం మీద విచారణ ముగిసి ఉన్నదని, త్వరలో ఈసీ అధికారిక ప్రకటన చేయ వచ్చని చెప్పారు. ఉప ఎన్నికల్లో ధనబలం, డీఎంకే చేత గాని తనం వెరసి అన్నాడీఎంకేను గెలిపించాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే గెలిచినంత మాత్రాన అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేదని , పేర్కొన్నారు. ఇది ఎన్నికలకు రెఫరెండం మాత్రం కాదన్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందని, తమకు అంతలోపు ఎన్నికల కమిషన్ గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నామన్నారు. -
బీజేపీలోకి శశికళ నమ్మిన బంటు?!
సాక్షి, చెన్నై: బీజేపీలోకి చేరడానికి చిన్నమ్మ శశికళ నమ్మినబంటు పుహళేంది సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే, చిన్నమ్మతో సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పుహళేంది మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆయనతో టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. మంచి వ్యాఖ్యాతగా ఉన్న ఆయన్ను తమ వైపునకు తిప్పుకుంటే ఉపయోగపడుతాడనే భావనతో కమలనాథులు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే.. చిన్నమ్మ శశికళతో సాగే భేటీ మేరకు తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సంకల్పించి ఉన్నా, కమలనాథుల ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపే విధంగా పుహళేంది స్పందించడం గమనార్హం. ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన పుహళేంది...చిన్నమ్మ శశికళ త్వరలో బయటకు రానున్నారని, ఆమె రాకతో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. ఒక్క జయకుమార్ తప్ప..సీఎంతో పాటు మిగిలిన మంత్రులు ఎవరూ కూడా శశికళకు వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆమె బయటకు వస్తే, పరిస్థితులు అన్నీ మారుతాయని, ఆమె త్వరలో వస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం పలికినట్టుగా మీడియాల్లో వార్తలు చూశానని, అలా జరిగి ఉంటే.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మ రాకతో అందరూ ఆమె చుట్టు చేరుతారని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ శశికళ విడుదలకు తగ్గ చర్యలు, ప్రయత్నాలు వేగవంతం చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దృష్ట్యా, శశికళ ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నమ్మతో ములాఖత్
సాక్షి, చెన్నై : బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ శశికళతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ములాఖత్ అయ్యారు. జరిమానా చెల్లింపు వ్యవహారంగా చర్చ సాగినట్టు సమాచారం.అక్రమాస్తుల కేసులో అమ్మ జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కారణంగా చిన్నమ్మను ముందస్తుగానే విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రయత్నాల్లో అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. అయితే, జైలు శిక్ష సమయంలో వి«ధించిన జరిమానాను ఇంకా చెల్లించనట్టు, ఇది కాస్త విడుదలకు అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారాలు గత వారం వెలువడ్డాయి. దీంతో జరిమానా చెల్లింపు వ్యవహారంతో పాటుగా, రాజకీయ పరంగా చిన్నమ్మను సంప్రదించి, సలహాలు, సూచనలకు దినకరన్ బెంగళూరు వెళ్లారు. సోమవారం శశికళతో ములాఖత్ అయ్యారు. ఆమె ఇచ్చిన సలహాల్ని అమలు చేయడానికి తగ్గట్టుగా సిద్ధం అయ్యారు. ఈ సందర్భంగా దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం బలహీన పడలేదన్నారు. తాము బలంగానే ఉన్నామని, తమ వాళ్లు తమ వెన్నంటే ఉన్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో సంబంధాల్ని ఏర్పరచుకోవద్దని కేడర్‌కు హెచ్చరికలు పంపారు. -
మోదీపై దినకరన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
చెన్నై : తమిళనాడులో పాలక ఏఐఏడీఎంకేను ప్రధాని నరేంద్ర మోదీయే కాదు ఆయన తండ్రి కూడా కాపాడలేరని ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీయే తండ్రి తరహాలో ఆ పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. కాగా దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 17 మందిపై తమిళనాడు స్పీకర్ తీసుకున్న వేటు నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్ధించడంతో ఈ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 18న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలు పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ 17 నియోజకవర్గాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు దారుణ పరాజయం ఎదురైతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని ఏఎంఎంకే పేరుతో సొంత పార్టీని ఏర్పాటు చేసిన దినకరన్ పేర్కొన్నారు. మరోవైపు డీఎంకే దిగ్గజ నేత ఎం కరుణానిధి మరణంతో ఖాళీ అయిన తిరువూర్ అసెంబ్లీ స్ధానంలోనూ 18న పోలింగ్ నిర్వహిస్తారు. -
దూకుడు పెంచిన దినకరన్
సాక్షి, చెన్నై: ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ దూకుడు పెంచారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించారు. గెలుపు తమదేనన్న ధీమాను సైతం వ్యక్తం చేశారు. దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ ప్రతినిధిగా అన్నాడీఎంకేను చీల్చడంలో టీటీవీ దినకరన్ సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకేను, ఆ పార్టీ చిహ్నం రెండాకులను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసి విఫలమైన దినకరన్ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంతో రాజకీయ పయనాన్ని సాగిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయంటూ తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. అలాగే, తనకు మద్దతుగా నిలిచి అనర్హత వేటు వేయబడ్డ ఎమ్మెల్యేల్ని ఉప ఎన్నికల ద్వారా మళ్లీ గెలిపించుకునేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ, తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్న దినకరన్ ఈ ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. కలిసి వచ్చే వాళ్లు లేని దృష్ట్యా, తన బలం ఏమిటో తనకే తెలుసునన్నట్టుగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే కన్నా ముందుగా, తన అభ్యర్థులను ప్రకటించారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించారు. వీరందరి పేర్లను ప్రకటించడమే కాదు, అన్నాడీఎంకే బలహీన పడిందని, గెలుపు తమదే అన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేయడం గమనార్హం. అభ్యర్థులు: తిరువళ్లూరు–పొన్రాజ్, దక్షిణ చెన్నై–మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య, శ్రీపెరంబదూరు–తాంబరం నారాయణన్, కాంచీపురం–ఏ.మునుస్వామి, విల్లుపురం–ఎన్.గణపతి, సేలం–ఎస్కే సెల్వం, నామక్కల్–పీపీ.స్వామినాథన్, ఈరోడ్ – కేసీ సెంథిల్‌కుమార్, తిరుప్పూర్ –ఎస్ఆర్ సెల్వం, నీలగిరి–రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామస్వామి, కోయంబత్తూరు ఎన్ఆర్ అప్పాదురై, పొల్లాచ్చి–ఎస్పీ ముత్తుకుమార్, కరూర్– ఎన్.తంగవేల్, తిరుచ్చి– మాజీ మేయర్ చారుబాల తొండైమాన్, పెరంబలూరు– రాజశేఖరన్, చిదంబరం– ఇలవరసన్, మైలాడుతురై – ఎస్.సెంతమిళన్, నాగపట్నం–టి.సెంగుడి, తంజావూరు–మురుగేషన్, శివగంగై–వి.పాండి, మదురై–డేవిడ్ అన్నాదురై, రామనాథపురం–ఆనందన్, తెన్కాశి– ఎస్.పొన్నుతాయి, తిరునల్వేలి–జ్ఞాన అరుల్‌మణిలు పోటీ చేస్తారని దినకరన్ ప్రకటించారు. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు సీట్లను కేటాయించారు. ఇక, అనర్హత వేటుకు గురైన వారికి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మళ్లీ సీటు అప్పగించారు. పూందమల్లి–ఏలుమలై, పెరంబూరు–వెట్రివేల్, తిరుప్పోరూర్–ఎం.కోదండపాణి, గుడియాత్తం–జయంతి పద్మనాభన్, ఆంబూర్–ఆర్.బాలసుబ్రమణి, హరూర్–మురుగన్, మానామదురై–ఎస్ మారియప్పన్ కెన్నడి, సాత్తూరు–ఎస్జి సుబ్రమణియన్, పరమ కుడి–డాక్టర్ ఎస్.ముత్తయ్య పోటీ చేయనున్నారు. -
మళ్లీ కోర్టుకు రెండాకులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది. ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. పిటిషన్: రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు. -
సీఆర్పీఎఫ్లో అందరూ భారతీయులే
న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు పోలీస్ దళం(సీఆర్పీఎఫ్)లో అందరినీ భారతీయులుగానే గుర్తిస్తామనీ, ఇక్కడ కులం, మతం వంటి విభజనలు ఉండవని సీఆర్పీఎఫ్ డీఐజీ ఎం.దినకరణ్ తెలిపారు. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లలో వెనుకబడ్డ, దళిత, ఆదివాసీలే అధికంగా ఉన్నారని కారవాన్ అనే మ్యాగజీన్లో కథనం రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘సీఆర్పీఎఫ్లో మేం అందరినీ భారతీయులుగానే పరిగణిస్తాం. ఇక్కడ ఎక్కువ, తక్కువలు ఉండవు. కులం, మతం, రంగు, వంటి చెత్త విభజన మా రక్తంలోనే లేదు’ అని దినకరణ్ స్పష్టం చేశారు. ‘అమరులైన జవాన్లను అవమానించడం మానుకోవాలి. వారు అర్థంపర్థంలేని మీ రాతలు, కథనాలకు గణాంకాలు కాదు’ అని సదరు పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో దాడిని చనిపోయిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లలో 19 మంది ఓబీసీలు లేదా బీసీలు, ఏడుగురు ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, అగ్రకులాలకు చెందిన నలుగురు, ముగ్గురు జాట్ సిక్కులు, ఓ ముస్లిం, బెంగాలీ అగ్రకులానికి చెందిన మరొకరు ఉన్నట్లు కారవాన్ కథనాన్ని ప్రచురించింది. -
దినకరన్ ఇంటిపై దాడి
సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్‌నగర్‌లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దినకరన్‌కు పచ్చ జెండా
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్లో దినకరన్ గెలుపునకు మద్రాసు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆర్కేనగర్ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ముచ్చెమటలు పట్టించే రీతిలో స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్ రేసులో నిలబడి భారీ ఆధిక్యంతో విజయ కేతనం ఎగురవేశారు. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టు ఆరోపణలు, ప్రచారాలు జోరుగానే సాగా యి. అయితే, అందుకు తగ్గ ఆధారాల సేకరణలో ఎన్నికల యంత్రాంగం గానీ, పోలీసులు గానీ విఫలం అయ్యారు. భారీ ఆధిక్యంతో విజయ కేత నం ఎగురవేసిన దినకరన్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు కోర్టు మెట్లు ఎక్కలేదు. అయితే, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఎంఎల్ రవి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, పోలీసులు, ప్రభుత్వం వద్ద వివరణలను సైతం కోర్టు సేకరించింది. అన్ని ప్రక్రియలు ముగియడంతో బుధవారం ఆ పిటిషన్ విచారణయోగ్యం కాదని కోర్టు తేల్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా పిటిషనర్ పేర్కొంటున్నారని, అయితే, అందుకు తగ్గ ఆధారాలు ఎక్కడ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.30 లక్షలు నియోజకవర్గంలో పట్టుబడ్డట్టు పోలీసులు, ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నా, ఆ మొత్తం పలాన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఎలాంటి వివరాలు లేవని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు ఇచ్చినట్టు పేర్కొంటున్నారని, అయితే, ఎవరు ఎవరికి ఇచ్చారు అన్న వివరాలు కూడా లేవని వివరించారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం మేరకు ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని, దీనిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తన గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన ఒక్కగానొక్క పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో దినకరన్‌కు ఊరట లభించింది. -
సొంత గూటికి వచ్చేయండి: సీఎం
సాక్షి, చెన్నై : అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత వేటు పడినవారంతా మళ్లీ చేరాలని వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దినకరన్ గూటికి చేరిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఒకవేళ వారు తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామ’ని పేర్కొన్నారు. ఆ 18 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారటగా అని విలేకరులు ప్రశ్నించగా ‘అది నేను ఎలా ఇవ్వగలను’ అని సమాధానమిచ్చారు. అనర్హత పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందా అని అడగ్గా.. ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి మాట్లాడబోమని అన్నారు. కాగా, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా, స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
చిన్నమ్మ ఫైర్
సాక్షి, చెన్నై: సోదరుడు దివాకరన్ చర్యలపై చిన్నమ్మ శశికళ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆమెతో ములాఖత్ అయిన న్యాయవాదులు, ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందరూ దినకరన్‌కు అండగా ఉండాలని ఆమె సూచించినట్టు, త్వరలో కేడర్‌కు ఓ లేఖాస్త్రం సంధించపోతున్నట్టుగా సమాచారం. చిన్నమ్మ శశికళ కుటుంబ విభేదాలు రచ్చకెక్కి ఉన్నవిషయం తెలిసిందే. ఆమె సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ల మధ్య సాగుతున్న ఈ సమరంలో కుటుంబ పరువు గంగలో కలిసే రీతిలో ఉన్నట్టుగా చిన్నమ్మ పరిగణించారు. అలాగే, రాజకీయంగా మున్ముందు పెనుముప్పు తప్పదన్న విషయాన్ని గ్రహించి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో దివాకరన్ను పక్కన పెట్టి, దినకరన్‌కు అండగా నిలబడేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గతంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, దినకరన్‌కు మద్దతుగానే శశికళ వ్యవహరించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో అనేక సమస్యలు ఉన్నా, తాను జైలుకు వెళ్తూ దినకరన్ భుజం మీద బాధ్యతల్ని ఉంచి వెళ్లారని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా, కుటుంబం పరువు మరింత రచ్చకెక్కకుండా ఉండే రీతిలో, దివాకరన్‌కు చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా చిన్నమ్మ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆమెతో ములాఖత్ అయిన ముఖ్యులు, న్యాయవాదుల వద్ద దివాకరన్ చర్యల్ని తీవ్రంగా ఖండించినట్టు చర్చ ఊపందుకుంది. అమ్మ శిబిరం పేరిట దివాకరన్ ముందుకు సాగుతుండడంతో, ఆయన వెంట కేడర్ గానీ, మద్దతు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలుగానీ వెళ్లకుండా జాగ్రత్లకు సిద్ధం అవుతున్నారు. అందరూ దినకరన్‌కు అండగానే ఉండాలని సూచించడంతోపాటు, త్వరలో కేడర్‌ను ఉద్దేశించి జైలు నుంచి శశికళ ఓ లేఖ విడుదలచేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దివాకరన్ రూపంలో ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉండే విధంగా, దినకరన్‌కు మద్దతుగా ఆమె స్పందించేందుకు సిద్ధం అవుతున్న సమాచారంతో మద్దతుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెప్పవచ్చు. అందుకే కాబోలు దివాకరన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అమ్మ శిబిరం ఆవిర్భావ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనించి దగ్గ విషయం. తంగతమిళ్ సెల్వన్ దివాకరన్‌కు అత్యంత సన్నిహితుడైనా, చిన్నమ్మ గతంలో అప్పగించిన బాధ్యత మేరకు తాను మాత్రం దినకరన్ వెన్నంటే ఉంటానని ప్రకటిం చడం విశేషం.తనతో పాటు అనర్హత వేటు పడ్డ వాళ్లు, ముఖ్యులు, కేడర్ దినకరన్‌కు అండగా ఉంటారని వ్యాఖ్యానించే పనిలో తంగతమిళ్ సెల్వన్ ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దర్శకత్వంలోనే దివాకరన్ అడుగుల వేగా న్ని పెంచనున్నట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆ వేగానికి కళ్లె్లం వేయడం లక్ష్యంగా చిన్న మ్మ స్పందన కోసం కేడర్ ఎ దురుచూపుల్లో ఉంది. దివాకరన్ తీరుపై దినకరన్ తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డా రు.ఆయన మానసిక రోగి అని నిన్నటి రో జున వ్యాఖ్యానించారు.తాజాగా దివాకర న్కు పిచ్చి పట్టినట్టుందని మండిపడ్డారు. -
రూ. 20 పట్టు...పది వేలు కొట్టు
సాక్షి, చెన్నై : దినకరన్‌కు బ్రహ్మరథం పట్టిన ఆర్కేనగర్ ఓటరు ప్రస్తుతం తిరగబడే పనిలో పడ్డారు. రూ.20 నోట్లను చేత పట్టి.. రూ. పది వేలు కొట్టు అన్న నినాదంతో ఆదివారం దినకరన్‌ను మహిళలు చుట్టుముట్టారు. తన నియోజకవర్గ ప్రజలు ఘోరావ్ చేయడంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే డిపాజిట్లు గల్లంతు కాగా, అన్నాడీఎంకేను ఢీ కొడుతూ భారీ ఆధిక్యంతోనే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఓటుకు నోటు తాండవం గుట్టు రట్టుతో గతంలో ఉప ఎన్నిక రద్దును పరిగణించిన దినకరన్ ఈసారి కొత్త బాణి అనుసరించారని ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నోట్లు చల్లినా, మరికొన్ని చోట్ల గెలుపు తదుపరి నోటు అంటూ కొత్త మార్గాన్ని అనుసరించారని ప్రచారం. ఓటుకు నోటుకు చిహ్నంగా రూ. 20 నోటును ఎన్నికల సమయంలో అందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తామిచ్చిన రూ. 20 నోటు ఎవరి వద్ద ఉందో వారందరికి గెలుపు తదుపరి రూ.10 వేలు ఇస్తామని నమ్మ బలికినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, గెలుపు తదుపరి ఆయన ఆ రూ.20 నోటు గురించి పట్టించుకోలేదని ఆగ్రహిస్తూ అనేకచోట్ల ఆందోళనలు సైతం సాగాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్కేనగర్ పర్యటనకు వచ్చిన దినకరన్ మీద బ్రహ్మరథం పట్టిన వాళ్లే తిరగబడడం గమనార్హం. రూ.20 పట్టు.. రూ. పది వేలు కొట్టు ఆర్కేనగర్ ఎమ్మెల్యే, అమ్మ మక్కల్ కళగం నే త టీటీవీ దినకరన్ ఆదివారం ఉదయం ఆర్కేనగర్ పరిధిలోని నేతాజీ నగర్‌లోని మురుగన్ ఆలయానికి వచ్చారు. అక్కడ జరిగిన చిత్రా పౌర్ణమి ఉత్సవాలకు ఆయన వస్తున్న సమాచారంతో ఓటర్లు తిరగబడేందుకు సిద్ధం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఓ వర్గానికి చెందిన వారు చుట్టుముట్టారు. ఘోరావ్ చేస్తూ, ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. పెద్ద సంఖ్యలో మహిళలు రూ. 20 నోట్లు ఇదిగో.. హామీ ఇచ్చినట్టుగా రూ.పదివేలు ఇవ్వు.. అంటూ ఆయన్ను నిలదీస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అదే సమయంలో దినకరన్ మద్దతుదారులు ఆందోళనకారుల మీద తిరగబడడంతో ఉద్రిక్తత తప్పలేదు. పోలీసులు ఇరువర్గాల్ని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకున్న దినకరన్ ఆలయం వద్దకు వెళ్లి ఆగమేఘాలపై పూజలు చేసి మరో మార్గంలో దూసుకెళ్లారు. మరోచోట దినకరన్ చలివేంద్రం ఏర్పాటుకు వచ్చి తీరాల్సి ఉండడంతో, అక్కడే ఆందోళనకారులు బైఠాయించారు. చివరకు అటు వైపు రాకుండానే దినకరన్ జారుకున్నారు. కాగా, దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారంతా అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారేనని, పని గట్టుకుని మరీ రాద్దాంతం చేసినట్టుగా దినకరన్ మద్దతుదారుడు వెట్రివేల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలే మేనమామ రూపంలో ఫ్యామిలీ వార్ ను ఎదుర్కొంటున్న దినకరన్‌కు తాజాగా రూ.20 నోటు రూపంలో ఓటరు తిరగబడే పనిలో పడడం మరింత శిరోభారంగా మారింది. -
రచ్చ కెక్కిన ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: మేనమామ దివాకరన్ను ఢీకొట్టే రీతిలో పరోక్షంగా మంగళవారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యలు సంధించారు. కేడర్‌కు లేఖాస్త్రం సందిస్తూ, దివాకరన్ కుట్రల్ని భగ్నం చేద్దామన్నట్టుగా పిలుపు నివ్వడం గమనార్హం. దినకరన్ పరోక్షంగా స్పందిస్తే, దివాకరన్ బహిరంగంగానే ఎదురుదాడికి దిగడంతో చిన్నమ్మ కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ వార్ మరింతగా ముదురుతోంది. ఆమె సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌ల మ«ధ్య ఈ సమరం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారుడు వెట్రివేల్ ద్వారా దివాకరన్‌కు చెంపపెట్టు తగిలే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దినకరన్, తాజాగా తానే రంగంలోకి దిగి కేడర్‌కు లేఖాస్త్రం సంధించడమే కాదు, పరోక్షంగా మేనమామకు చురకలు అంటించే పనిలో పడడం గమనార్హం. ఐక్యతతో తిప్పి కొడదాం :అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీని రక్షించుకునేందుకు చిన్నమ్మ శశికళ రంగంలోకి దిగాల్సి రావడానికి గల పరిస్థితులను ఆ లేఖాస్త్రంలో గుర్తు చేశారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో అధికారంలో ఉన్న ద్రోహులు పార్టీని ౖకైవసం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని వివరించారు. ద్రోహుల వైపుగా వెళ్లకుండా అమ్మ ఆశయ సాధన నినాదంతో చిన్నమ్మకు మద్దతుగా లక్షలాదిగా కేడర్ తన వెంట కదిలిందని గుర్తు చేశారు. ప్రజా మద్దతు ఈ కళగంకు హోరెత్తుతుండడంతో నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు బయలు దేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మధ్యమాల ద్వారా కళగంలో గందరగోళ పరిస్థితులు సృష్టించే కుట్రలు సాగుతున్నాయని పరోక్షంగా మేనమామ దివాకరన్ను ఉద్దేశించి వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. ద్రోహులతో కలిసి ఈ గందరగోళ ప్రయత్నాలకు దిగారని, ఈ కుట్రల్ని భగ్నం చేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో కొత్త కుట్రలకు సాగుతున్న ప్రయత్నాల్ని ఐక్యతతో తిప్పి కొడదామని కేడర్‌కు పిలుపునిచ్చారు. చిన్నమ్మే మార్గదర్శి అని పరోక్షంగా దివాకరన్ను ఎలాంటి సంబంధాలు లేదన్న వ్యాఖ్యల్ని ఆ లేఖలో దినకరన్ స్పందించడం గమనార్హం. తగ్గని మేనమామ.. దినకరన్ వ్యాఖ్యల తూటాలకు మేనమామ దివాకరన్ ఏమాత్రం తగ్గలేదు. ఢీకి సై అన్నట్టు ఎదురుదాడికి దిగారు. మన్నార్‌కుడిలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ దినకరన్‌పై విరుచుకుపడడంతో చిన్నమ్మ ఫ్యామిలీ వార్ రచ్చకెక్కింది. అన్నా, ద్రవిడం అన్న పదాలు లేని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. దినకరన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇక దినకరన్‌తో కలిసి పయనం సాగించే ప్రసక్తే లేదని తేల్చారు. దినకరన్ వెన్నంటి ఉన్న కొం దరు ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చిన వారేనని వారికి అంతా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జయలలితతో కలిసి అన్నాడీఎంకేకు దశాబ్దాల తరబడి తాను సేవల్ని అందించానని, ఆ సేవలు ఇక, మరింత విస్తృతం అవుతా యని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఎప్పుడో సీఎం అయ్యే వాడిని!
సాక్షి,చెన్నై : తలచుకుని ఉంటే, తానెప్పుడో సీఎం అయ్యే వాడినని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. ద్రోహుల్ని తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని, పళని సర్కారు కుప్ప కూలడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. గురువారం ఈరోడ్‌లో కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ నినాదంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం సాగింది. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడారు. కావేరి వ్యవహారంలో కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని పళని ప్రభుత్వం పథకం ప్రకారం కపట నాటకాలను ప్రదర్శిస్తున్నాయని మండి పడ్డారు. కేంద్రానికి రాష్ట్ర ప్రయోజనాలను పళని, పన్నీరు తాకట్టుపెట్టేశారని, వాటిని మళ్లీ దక్కించుకోవాలంటే, ఈ ప్రభుత్వం కుప్పకూలాల్సిందేనని పేర్కొన్నారు. అందుకు తగ్గ సమయం ఆసన్నమైందన్నారు. అనర్హత వేటు వ్యవహారంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన మరుక్షణం పళని సర్కారు కుప్పకూలినట్టేనని, తీర్పు త్వరితగతిన వెలువరించేందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని తాము అభ్యర్థిస్తున్నామన్నారు. ద్రోహుల్ని తరిమి కొడతాం రాజకీయాలంటే ఏమిటో తెలియని పన్నీరు సెల్వంను తీసుకొచ్చి సీఎం పదవిలో చిన్నమ్మ శశికళ కూర్చొబెట్టారన్నారు. అమ్మ మరణం తదుపరి రెండో సారిగా కూడా చాన్స్ ఇస్తే, ఏకంగా అన్నాడీఎంకేని బీజేపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. పళని స్వామిని సీఎంగా చేస్తే, ఆయన ఏకంగా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి, వారి అడుగులకు మడుగులు వత్తే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తాను తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వాడినని ధీమా వ్యక్తంచేశారు. అయితే, తనకు గాని, తన కుటుంబంలోని వారికి గాని పదవీ ఆశ లేనందున, అన్నాడీఎంకే కోసం అమ్మ వెన్నంటి ఉండి శ్రమించామన్నారు. అయితే, ప్రస్తుతం ఆ పార్టీని రక్షించుకోవాలని తాపత్రయపడుతున్నట్టు వివరించారు. ఆ ఇద్దరు ద్రోహులకు గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని, వారిని తరిమి కొట్టే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. పోలీసుల్ని తమ మీదకు ఉసిగొల్పుతున్నారని, మున్ముందు అదే పోలీసులు ఆ ఇద్దరినీ టార్గెట్ చేయడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. -
దినకరన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన ఇటీవల స్థాపించిన కొత్త పార్టీ గుర్తు, పార్టీ పేరు ఉపయోగించొద్దని దినకరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దినకరన్ పార్టీ గుర్తు, పేరుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు తాను స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనని స్వయంగా దినకరన్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. పైన నలుపు, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఎరుపు, మధ్యలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దినకరన్ ప్రకటించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బహిష్కృతులైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా ఉండటం గమనార్హం. -
‘అమ్మ’ పేరుతో దినకరన్ పార్టీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో గురువారం నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏఐఏడీఎంకే పార్టీని ద్రోహుల నుంచి తిరిగి దక్కించుకునేందుకు పోరాడుతామని సీఎం, డెప్యూటీ సీఎంలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇది రాజకీయ పార్టీ కాదు, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కేటాయించిన కుక్కర్ గుర్తునే పార్టీ చిహ్నంగా ఖరారు చేసుకున్నామన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐఏడీఎంకే నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకావటం గమనార్హం. -
సర్కారును కూల్చడమే లక్ష్యం..!
అన్నాడీఎంకే సర్కారును కూల్చడమే లక్ష్యంగా అమ్మ శిబిరం నేత దినకరన్ దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఆ కోవలో ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలమనే సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రులతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి సర్కారును కూల్చడయే లక్ష్యంగా ఆది నుంచి అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. కాగా, ఇంకొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని సీఎం పళని స్వామిని గద్దె దించాలనే లక్ష్యంగా దినకరన్ సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటుకున్న దినకరన్ వెన్నంటి నడిచేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ ఆయన వర్గం చెబుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్‌తో కలిసి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నా, అనర్హత వేటుకు జడిసి, వెనక్కు తగ్గారు. ఇలాంటి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ నిర్ణయిం చుకున్నారు. సీఎం పళని స్వామిపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు తిప్పుకుని బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ద్వారా సీఎం పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రంగంలోకి కమిటీ సీఎంకు వ్యతిరేకంగా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను , తటస్థంగా ఉన్న మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ ఓ కమిటీని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ నేతృత్వంలో ఆ కమిటీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభును తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యే దినకరన్‌తో భేటీ కావడం గమనార్హం. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. ఇంకొందరు లక్ష్యంగా సాగుతున్నారు. వారంతట వారే వస్తున్నారు.. విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, ఎమ్మెల్యేలు తమంతకు తాము తమ వెంట వస్తున్నారన్నారు. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ పేరు చెప్పుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజల్ని అష్టకష్టాలు గురిచేస్తున్నారని మండి పడ్డారు. తాను ఎక్కడకు వెళ్లినా, త్వరితగతిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేడర్ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. వారి ఆశ కొన్ని రోజుల్లో సాకారం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. మంత్రి తంగమణి మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టున్నాడని మండిపడ్డారు. వారికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోరనే ధీమాను వ్యక్తం చేశారు. -
కుటుంబీకులపై శశికళ అసహనం
సాక్షి, చెన్నై: బంధుగణానికి చిన్నమ్మ శశికళ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తున్నది. న్యాయవాదుల ద్వారా తన సందేశాన్ని పంపించారు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ ప్రతినిధి, అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్‌కు వ్యతిరేకంగా ఆ కుటుంబంలోనే విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఓ వైపు, వదిన ఇలవరసి కుమార్తె కృష్ణ ప్రియ మరో వైపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దినకరన్‌కు వ్యతిరేకంగా కృష్ణప్రియ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. కుటుంబంలో ఆస్తుల వ్యవహారంలో చాపకింద నీరులా సాగుతూ వచ్చిన విభేదాలు, తాజాగా రాజకీయ వేదికగా తలబడ్డేందుకు సిద్ధం అవుతుండడం చర్చకు దారి తీసింది. ఈ సమాచారాలు ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ దృష్టికి చేరింది. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో కుటుంబంలో సాగుతున్న పరిణామలపై చిన్నమ్మ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలంటూ వాదులాటలు వద్దని, సంయమనంతో వ్యవహరించాలని, దూకుడును పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు సాగాలని కుటుంబీకులకు న్యాయవాదులు ద్వారా ఆమె సందేశాన్ని పంపించినట్టు అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో చర్చసాగుతోంది. -
నా కొద్దు పెంపు జీతం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ నినాదం కోసం ఆర్కేనగర్ ఎమ్మెల్యే దినకరన్ ప్రయత్నాలు చేపట్టారు. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కేనగర్లో ఎన్నికల ఖర్చులు, లెక్కలు తేలని దృష్ట్యా, దినకరన్‌పై అనర్హత వేటు పడేనా అన్న చర్చ ఏర్పడింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం తమకు దూరం కావడంతో ఒక వేదిక కోసం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధపడ్డా, చివరి క్షణంలో మనసు మార్చుకున్నారు. ఇందుకు కారణం తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ విచారణలో ఉండడమే. ఈ సమయంలో పార్టీ ప్రకటించిన పక్షంలో వారి పదవులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పవన్న విషయాన్ని పరిగణించారు. ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రస్తుతం ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని కొనసాగించేందుకు సిద్ధం అయ్యారు. అయితే, వేదిక ఏర్పాటులో జాప్యంతో తన పక్షాన ఉన్న వాళ్లు మళ్లీ సొంతగూటి వైపుగా తొంగి చూస్తుండడంతో దినకరన్ అప్రమత్తం అయ్యారు. అమ్మ నినాదాన్ని సొంతం చేసుకునేందుకు తగ్గ అనుమతుల కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఓ వైపు ఎన్నికల యంత్రాంగాన్ని ఆశ్రయిస్తూ, మరో వైపు కోర్టు ద్వారా అనుమతి పొందేందుకు సిద్ధం అయ్యారు. హైకోర్టులో పిటిషన్: దినకరన్ తరఫున అన్నాడీఎంకే అమ్మ శిబిరం నినాదాన్ని సొంతం చేసుకునే విధంగా ఢిల్లీ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం వ్యవహారంలో ఎన్నికల యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు గుర్తు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, తాము అన్నాడీఎంకే అమ్మ శిబిరంగా ముందుకు సాగేందుకు నిర్ణయించినట్టు వివరించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ ఎన్నికల్లో తమ శిబిరం అన్నాడీఎంకే అమ్మ పేరుతో ముందుకు సాగేందుకు నిర్ణయించి ఉన్నామని, తమకు ఎన్నికల యంత్రాంగం ఒకే చిహ్నం కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే, అన్నాడీఎంకే అమ్మ పేరును రిజిస్టర్ చేయాలని కోరుతూ ఎన్నికల యంత్రాంగానికి లేఖను దినకరన్ తరఫున ప్రతినిధులు సమర్పించారు. వేటు పడేనా.. : దినకరన్ ఎమ్మెల్యే పదవికి వేటు పడేనా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నోట్ల కట్టలు తాండవం చేసినట్టుగా ఆరోపణలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో ఆయా అభ్యర్థులు పెట్టిన ఖర్చుల వివరాల మీద లెక్కల్ని తేల్చేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పర్యవేక్షణ బృందం రంగంలోకి దిగింది. అయితే, ఆయన సమర్పించిన లెక్కల వివరాలు తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. అధికారుల పరిశీలనలో సాగిన లెక్కలు, దినకరన్ సమర్పించిన లెక్కల్లో తేడాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేనా అన్న ఉత్కంఠ తప్పడం లేదు. డీఎంకే, బీజేపీ అభ్యర్థుల లెక్కలు తేలగా, అన్నాడీఎంకే అభ్యర్థి మదుసూదనన్ ఖర్చుల లెక్కలు కూడా తేలకపోవడంతో సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఆ బృందం సమాయత్తం అవుతోంది. నా కొద్దు పెంపు జీతం: తన ఎమ్మెల్యే పదవికి ప్రభుత్వం అందించనున్న జీతం పెంపును దినకరన్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్‌కు బుధవారం లేఖ రాశారు. ఎమ్మెల్యేలకు జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని, ఈ దృష్ట్యా, తనకు పెంపు వద్దే వద్దు అని అందులో వివరించారు. తనకు పాత జీతాన్ని ఇస్తే చాలని పేర్కొన్నారు. -
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
కమల్‌పై పిటిషన్
సాక్షి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు ఆయనను వివాదాల్లోకి నెట్టాయి. దినకరన్ అభిమానులు ఆగ్రహంతో కమల్ దిష్టిబొమ్మను దహనం చేయగా, మరో అభిమాని కోర్టులో పిటిషన్ వేయడంతో వివాదం మరింత ముదిరింది. గత నెల 21వ తేదీన హోరాహోరీగా సాగిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. అన్నాడీఎంకే అభ్యర్థి మినహా అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం కమల్ మీడియా వద్ద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని దుయ్యబట్టారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. పెద్ద సంఖ్యలో దినకరన్ అనుచరులు చెన్నై పూందమల్లి గుమన్చావడి జంక్షన్లో శుక్రవారం ఉదయం కమల్ దిష్టిబొమ్మను, ఫొటోలను సైతం తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కమల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు దినకరన్ అనుచరులు చెన్నై ఎల్డామ్స్రోడ్డులోని ఇంటిని ముట్టడించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో కమల్ ఇంటి ముందు పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కమల్‌పై కోర్టులో పిటిషన్ చెన్నై ఆర్కేనగర్ ప్రజలను, ఓటర్లను అవమానించే విధంగా నటుడు కమల్‌హాసన్ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేశాడని ఆరోపిస్తూ కోయంబత్తూరు గణపతి మణియక్కరాణ్ పాళంకు చెందిన దినకరన్ అనుచరుడు ఇళంగోవన్ కోయంబత్తూరు మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ 80వేలకు పైగా ఓట్లు పొంది 40 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ గెలుపుతో దినకరన్‌కు ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరిగాయి. అయితే ఆర్కేనగర్ ప్రజలు ఓటుకు రూ.20వేలు పొందడం ద్వారా దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని నటుడు కమల్‌హాసన్ విమర్శించారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను, ఓటర్లను కళంకితులను చేసేలా ఉన్నాయి. కమల్ వ్యాఖ్యలతో సమాజంలో నేను హేళనకు గురై తీవ్ర మనోవేదన చెందుతున్నాను. ఈ కారణంగా కమల్‌హాసన్‌పై కఠిన చర్య తీసుకోవాలని పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్‌ను ఈనెల 12వ తేదీన విచారణకు స్వీకరిస్తామని మేజిస్ట్రేట్ రాజ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. అన్నాడీఎంకే (అమ్మ) కర్ణాటక శాఖ కార్యదర్శి పుహళేంది శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆర్కేనగర్ ప్రజలను బిక్షగాళ్లని కమల్ నీచమైన వ్యాఖ్యలు చేశాడని అన్నారు. కమల్ నిద్రిస్తున్న సమయంలో రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడంతో ఉలికిపాటుకు గురికావడం వల్లనే కమల్ నోటి నుంచి ఇలాంటి విమర్శలు వెలువడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. కమల్ రాజకీయాల్లోకి దిగితే కనీసం ఐదుశాతం ఓట్లను కూడా పొందలేరని అన్నారు. దినకరన్ అనుమతితో కమల్‌పై పోరాటం చేస్తామని తెలిపారు. -
‘ధనబలంతో గెలిచారు’
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్ గెలిచారని కమల్ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్కే నగర్ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి (దినకరన్) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్ ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్ ఆరోపణలను దినకరన్ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
నన్ను బెదిరిస్తున్నారు
సాక్షి, చెన్నై: తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఐటీ, సీబీఐ దాడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ బెదిరింపులకు తాను భయ పడనని, త్వరలో అమ్మ జయలలిత ఆశించిన పాలన తమిళనాట రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కుంభకోణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లు తనకు అఖండ మెజారిటీ ఇవ్వడాన్ని రాష్ట్రంలోని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తనకు మద్దతుగా ప్రజానీకం, అన్నాడీఎంకే కేడర్, నేతలు కదులుతున్నారని తెలిపారు. తనను చూసి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దినకరన్ వర్గీయులపై మరో వేటు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపునకు కృషి చేసి పార్టీ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వేలూరు, విరుదునగర్, తూత్తుకూడి జిల్లాలకు చెందిన 9 మంది నేతలను అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి మంగళవారం బహిష్కరించారు. మరోవైపు దినకరన్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే లక్ష్యంతో నేడు అన్నాడీఎంకే సమావేశం జరగనుంది. -
ఎమ్మెల్యేగా దినకరన్ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్ శుక్రవారం పదవీ ప్రమాణం చేశారు. సచివాలయంలో స్పీకర్ ధనపాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణలపై గురువారం 46 మందిపై వేటువేసిన సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం.. శుక్రవారం మాజీ మంత్రి రాధాకృష్ణన్ సహా 164 మంది పార్టీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ బాధ్యతలు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం కూలిపోయేవరకు శశికళ మౌనవ్రతం? అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోయే వరకు శశికళ మౌనవ్రతంలోనే ఉంటారని దినకరన్ అనుచరులు రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. దినకరన్ 2 రోజుల క్రితం బెంగళూరు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసు కున్నారు. జయ వర్ధంతి రోజైన ఈనెల 5 నుంచి శశికళ మౌన వ్రతం లో ఉన్నందున ఆమె ఏమీ మాట్లాడ లేదు.. జనవరి చివరి వరకు వ్రతాన్ని కొనసాగిస్తారని మీడియాతో దినకరన్ చెప్పారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సమర్పించాల్సిందిగా విచారణ కమిషన్ సమన్లు జారీచేసిన సమయంలో శశికళ మౌనవ్రతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. -
శశికళ కుటుంబంలో ‘ఆర్కేనగర్’ చిచ్చు!
ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబంలో ఆధిపత్య పోరుకు దారితీసింది. శశికళ సోదరి కుమారుడైన దినకరన్, ఆయన సోదరుడు భాస్కరన్.. శశికళ మేనకోడలు కృష్ణప్రియల మధ్య రాజకీయ వారసత్వం కోసం అంతర్గత కుమ్ములాట మొదలైనట్టు తెలిసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు, శశికళ కుటుంబంలో సైతం కలకలం రేపాయి. రాజకీయ వారసులు ఎవరనే అంశంలో కలతలు సృష్టించాయి. కుటుంబసభ్యులతో శశికళ భర్త నటరాజన్ ఇటీవల నిర్వహించిన వారసత్వ పంచాయితీ... పార్టీ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు దినకరన్ సిద్ధపడేవరకు వెళ్లింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ అధిక్యతతో దినకరన్ గెలుపొందిన సమయంలో జయలలిత, శశికళకు తానే అసలైన రాజకీయ వారసుడినని దినకరన్ ప్రకటించడం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. ఆర్కేనగర్లో దినకరన్‌ను గెలిపించడం ద్వారా ప్రజలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకు తామే వారసులమని రుజువైందని దినకరన్ తమ్ముడు భాస్కరన్ ప్రచారం మొదలుపెట్టారు. పార్టీ నడిపించే హక్కు తమకు మాత్రమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వద్ద రెండాకుల చిహ్నం మాత్రమే ఉంది, అది వారికి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు, అయితే పార్టీ, కార్యకర్తలు తమవైపు ఉన్నారని భాస్కరన్ చేసిన వ్యాఖ్యలు దినకరన్‌కు ఆగ్రహం తెప్పిం చాయి. తమ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా మాటలు లేవు, నేడు ఈ వాఖ్యానాలు ఏమిటని దినకరన్ ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం ఏదైనా నా మాటే చెల్లుబాటని దినకరన్ చేసిన ప్రకటనను శశికళ కుటుంబ సభ్యులు స్వాగతించడం లేదు. జయలలిత మరణానికి శశికళే కారణమని ప్రజలు ఆరోపించినా ఆమె మౌనంగా భరించారని, అయితే ఎన్నికల కోసం అపోలో దృశ్యాలను విడుదల చేసి జయలలితను దినకరన్ అవమానపరిచారని ఫేస్బుక్, మీడియా వద్ద కృష్ణప్రియ విరుచుకుపడ్డారు. దినకరన్ అనుచరుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తానే శశికళ వారసురాలినని కృష్ణప్రియ ప్రకటించుకోవడం దినకరన్ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించింది. దినకరన్, దివాకరన్, భాస్కరన్, వివేక్, కృష్ణప్రియల మధ్య చోటుచేసుకున్న విభేదాలు విశ్వరూపం దాల్చడంతో చెన్నై అడయారులోని శశికళ భర్త నటరాజన్ ఇంట రెండురోజుల క్రితం పంచాయితీ పెట్టారు. ఈ సమయంలో దినకరన్ మాట్లాడుతూ శశికళనో, మన కుటుంబాన్నో చూసి ఆర్కేనగర్ ప్రజలు ఓటువేయలేదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, తటస్థ ఓట్లే తనను గెలిపించాయని దినకరన్ వారి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మీరంతా ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే మేమే వారసులమని మీడియా ముందు ప్రకటించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కృష్ణప్రియ సీమంతం నాటి ఫొటోలు (ఫైల్) కృష్ణప్రియకు రాజకీయాల గురించి ఏమి తెలుసు, జయలలిత సమక్షంలో పోయెస్‌గార్డెన్‌లో ఏనాడో జరిగిన తన సీమంతం ఫొటోను కృష్ణప్రియ ఇప్పుడు విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని దినకరన్ రెట్టించి ప్రశ్నించారు. సీమంతం ఫొటో ద్వారా జయలలిత రాజకీయ, కుటుంబ వారసురాలిగా ప్రయత్నిస్తున్నారా అని కృష్ణప్రియను నిలదీశారు. మీడియాతో మాటలు, ఫేస్బుక్లో పోస్టింగులు ఇకనైనా నిలిపివేయాలని వారిని దినకరన్ హెచ్చరించినంత పనిచేశారు. అందరం ఇలా వ్యవహరిస్తే మళ్లీ చిక్కుల్లో ఇరుక్కుంటామని హితవు పలికారు. శశికళ చెబితేనే పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆమె ఆదేశిస్తే పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని దినకరన్ కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఈ దినకరన్ ఎక్కడున్నారు, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడని కృష్ణప్రియ వ్యాఖ్యానించడంతో వారసత్వపోరు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. -
ఓటుకు 10 వేలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన దినకరన్ అనుచరులు రూ.10 వేలకు బదులు రూ.20 నోటిచ్చి దానిపై ఉన్న కోడ్ రాసుకున్నారని, ఫలితాలనంతరం ఆ నోటు చూపితే డబ్బిస్తామని హామీ ఇచ్చారని ఓటర్లు వెల్లడించారు. రూ.20 నోట్లు పంచిన వారంతా ఆర్కేనగర్కు చెందిన వ్యక్తులే కావడంతో వ్యవహారం సజావుగా సాగింది. ఇప్పుడు ఫలితం తేలడంతో టోకెన్ ఇచ్చిన వాళ్లను ఓటర్లు నిలదీస్తున్నారు. కొందరు ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టోకెన్ అందని కొందరికి సోమవారం వాటిని ఇస్తుండగా.. ఘర్షణ చోటు చేసుకుంది. దినకరన్ అనుచరులు కార్తికేయన్ అనే వ్యక్తిపై దాడిచేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు దినకరన్ అనుచరులను అరెస్టు చేశారు. -
ఇంతకీ గుండు గీయించుకుంటారా..?
ఆర్కేనగర్లో గెలుపుతో దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. గొంతు నొప్పితో బాధ పడుతున్నా, తన వ్యూహాలకు పదును పెట్టడం లక్ష్యంగా సోమవారం మద్దతు దారులతో ఆయన మంతనాల్లో మునిగారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల్ని తన వైపునకు తిప్పుకునేందుకు పథకం రచించారు. దీన్ని అమలుచేయడానికి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ రంగంలోకి దిగనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఈపీఎస్, ఓపీఎస్ వైపు ఉన్న తన స్లీపర్ సెల్స్ ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేయడానికి దినకరన్ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తదితర డెల్టా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తమ వైపునకు తిప్పుకునే బాధ్యతల్ని చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకరన్ తన భూజాన వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వ్యూహాలకు పదును పెట్టే విధంగా దూకుడు పెంచేందుకు సిద్ధమైన దినకరన్ సోమవారం కూడా తన మద్దతు నేతలతో బిజీగా గడిపారు. సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆయన ద్వారా మరి కొందరు ఎమ్మెల్యేల్ని తిప్పుకోవడంతో పాటు జిల్లాల కార్యదర్శుల్ని గురిపెట్టి మద్దతుదారులతో సంప్రదింపుల్లో మునిగి ఉండడం గమనార్హం. ఓవైపు గొంతు నొప్పి ఉన్నా, మరోవైపు ఏ మాత్రం తగ్గకుండా విజయోత్సాహంతో రెట్టింపు దూకుడుతో ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నాడీఎంకే కేడర్‌లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇక, దినకరన్‌కు సాయంగా కుటుంబానికి చెందిన కృష్ణప్రియ, జయానంద్ సైతం ఇక, చురుగ్గా దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. స్వరం పెంచిన మద్దతు దారులు ఆర్కే నగర్ గెలుపుతో ఈపీఎస్, ఓపీఎస్‌లకు వ్యతిరేకంగా దినకరన్ మద్దతుదారులు స్వరాన్ని పెంచుతున్నారు. మీడియాతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మాట్లాడుతూ, ఆర్కేనగర్ ఎన్నికల్లో తామేదో మాయ చేశామని ఈపీఎస్, ఓపీఎస్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సహాకారాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓటర్లకు తలా రూ.ఆరు వేలు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించబోమని వ్యాఖ్యానించడం శోచనీయమని, వాస్తవానికి చెప్పాలంటే, ఇకనైనా ఈపీఎస్, ఓపీఎస్‌తో పాటు అక్కడున్న మంత్రులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దినకరన్ గెలిస్తే గుండు గీయించుకుంటానని ఓ మాజీ మంత్రి సవాల్ చేశారని, ఇంతకీ గుండు గీయించుకుంటారా..? అని వలర్మతిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. అమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు, ప్రస్తుతం చిన్న పిల్లల చేష్టలతో నిందల్ని తమ మీద మోపే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం వాళ్లకు లేదని స్పష్టంచేశారు. ఓపీఎస్ ఒకప్పుడు దినకరన్, తన ముందుకు చేతులు కట్టుకుని నిలబడ్డ కార్యకర్త అని, ఇప్పుడు తమ మీదే నిందలు వేసే స్థాయికి చేరాడని మండిపడ్డారు. స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయని, ఇక రోజుకో ఎపిసోడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయని ఆయన ముగించడం గమనార్హం. ఇక, దినకరన్ మద్దతు మహిళా నాయకురాలు, నటి సీఆర్ సరస్వతి అయితే, ఆర్కేనగర్లో ఓటుకు తాము ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టలేదని, వచ్చిన మెజారిటీ అంతా ప్రజాదరణే అని వ్యాఖ్యానిస్తున్నారు. అభినందనలు.. విమర్శలు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్న దినకరన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు విశాల్, శరత్‌కుమార్ వంటి వారే కాదు, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు పలు పార్టీలు అభినందిస్తున్నాయి. అలాగే, ఆరుగురు మంత్రులు, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అదే సమయంలో ఈ గెలుపును వ్యతిరేకించే విధంగా, విమర్శలు గుప్పించే రీతిలో స్పందించే వాళ్లూ ఉన్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై ముందంజలో ఉన్నారు. అసలు ఇది కూడా ఒక గెలుపేనా అని ఆమె మండిపడుతున్నారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్ అయితే, గెలిచారు.. అంతే.. అంటూ ముందుకు సాగారు. శుభాకాంక్షలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటితో సంబంధం లేదన్నట్టుగా దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. తన లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్‌ల వద్ద ఉన్న పార్టీ, రెండాకుల చిహ్నం కైవశం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తవైపునకు తిప్పుకునేందుకు కసరత్తుల్లో ఉన్నారు. నమ్మకంతో ఓటు వేశారు : దినకరన్ తన మీద నమ్మకంతో ఆర్కేనగర్ ఓటర్లు ఓటు వేశారేగానీ, తాయిలాలకో, నోట్ల మీదున్న ఆశతో మాత్రం కాదు అని దినకరన్ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తనకు ఫ్రెషర్ కుక్కర్ చిహ్నం వచ్చినప్పుడే అందరికీ ఫ్రెషర్ తెప్తిసానని చెప్పినట్టు గుర్తుచేశారు. అనేకమంది డిపాజిట్లు సైతం గల్లంతు కాబోతున్నాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందే తాను అక్కడి ఓటర్లతో ఏ విధంగా మమేకం అయ్యానో అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఓటర్లు తమ మీద అపార నమ్మకాన్ని కల్గి ఉన్నారని, అందుకే తనకు పట్టం కట్టారని తెలిపారు. అంతేగానీ, తానేదో నోట్లు, తాయిలాలు వెదజల్లినట్టుగా ఆరోపించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను కాదు, అన్నాడీఎంకే పాలకులు రూ.120 కోట్లను నియోజకవర్గంలో చల్లారని, ఒక్కో ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకేతో తానేదో కుమ్మకైన్నట్టు చెబుతున్నారని, డీఎంకే ఎంత పెద్ద పార్టీ అని, ఆ పార్టీ ఓట్లు తనకు ఎవరైనా వేయమని ఆదేశిస్తారా..? అని ప్రశ్నించారు. -
9 మంది దినకరన్ మద్దతుదారులపై వేటు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో దినకరన్ మద్దతుదారులుగా ఉన్న 9 మంది నేతలపై ఆ పార్టీ వేటువేసింది. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులు పి.వెట్రివేల్, ఎన్జీ పార్దిబన్, ఎం.రంగసామి, తంగతమిళ్‌సెల్వన్, వీపీ కలైరాజన్, వి.ముత్తయ్య, పుగళెంది, అధికార ప్రతినిధులు నంచిల్ సంపత్, సీఆర్ సరస్వతీలను పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అన్నాడీఎంకేకు ద్రోహం చేసినందుకే వీరిపై చర్య తీసుకున్నట్లు సీఎం పళనిస్వామి మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కవడం వల్లే దినకరన్ గెలిచారని ఆరోపించారు. దినకరన్‌ను రామాయణంలో ‘మాయలేడి’గా ఆయన అభివర్ణించారు. మరోవైపు తన మద్దతుదారుల్ని పార్టీ నుంచి తొలగించే అధికారం పళనిస్వామి, పన్నీర్‌సెల్వంలకు లేదని దినకరన్ స్పష్టం చేశారు. -
చెన్నైలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
-
ధనాధన్ దినకరన్
-
దినకరన్ సంచలన వ్యాఖ్యలు
-
భారీ ఆధిక్యం దిశగా దినకరన్
-
విజయం దిశగా దూసుకెళ్తున్న దినకరన్
-
ఆర్కేనగర్ ఓట్ల లెక్కింపులో గందరగోళం
-
తొలిరౌండ్లో దినకరన్ ముందంజ
-
లైవ్ అప్ డేట్స్.. అనూహ్యంగా స్వరం మార్చిన అన్నాడీఎంకే నేతలు
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో అన్నాడీఎంకే స్వతంత్ర్య అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపినా ఆయన కంటే చాలా తక్కువ నమోదు కావటం విశేషం. దినకరన్ గెలుపు ఖాయమైపోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఒక్కోక్కరుగా స్వరం మారుస్తున్నారు. ఆ పార్టీ నేత సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ దినకరన్ గెలుపును స్వాగతించటం విశేషం. దినకరన్ తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అపార్థాల వల్లే రెండుగా విడిపోయింది. త్వరలో రెండూ ఒకటవుతాయని ఆశిస్తున్నా.. ఆ మేర నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆయన తెలిపారు. అదే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దినకరన్ ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్‌కు అప్పగించే సమయం వచ్చిందంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ రోడ్లపైకి చేరారు. ఫలితాలపై స్పందించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సుముఖత వ్యక్తం చేయటం లేదు. అయితే బీజేపీ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఓటుకు నోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని.. డబ్బు విచ్చలవిడిగా పంచటంతోనే దినకరన్ గెలుస్తున్నాడంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు చేశారు. సుబ్రమణియన్ స్వామి ట్వీట్... ఇక బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ లో ఆసక్తికర సందేశం ఉంచారు. ఉప ఎన్నికలో దినకరన్ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. Dinakaran seems to have won the R K Nagar election caused by JJ death. I expect to see the two ADMK factions now to unite for 2019 LS poll — Subramanian Swamy (@Swamy39) 24 December 2017 -
గెలుపెవరిదో?
ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతోంది ఎవరో అని ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమా ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల్లో ఉన్నా, ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందో అనేది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక రెఫరెండంగా మారింది. ఈ గెలుపుతో తాము బలహీనపడలేదని చాటుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర వ్యూహాల్నే అమలు చేసింది. అదే గెలుపు తన వశం చేసుకుని సత్తా చాటు కోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం కుస్తీలు పట్టింది. పాలకుల మీద ప్రజలు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారని చాటే రీతిలో, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, అధికారం తమదేనని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికల్ని డీఎంకే తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంది. ఎన్నికల రేసులో చాంతాడంత క్యూ ఉన్నా, గెలుపు ఓటములు మాత్రం డీఎంకే, అన్నాడీఎంకే, అన్నాడీఎంకే అమ్మ శిబిరాల మధ్య ఉందని చెప్పవచ్చు. 21వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుతో తీర్పును ఈవీఎంలలో భద్రతపరిచారు. ఓటింగ్ శాతం మేరకు డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్ మధ్య గెలుపు ధీమా ఉన్నా, ఓటరు నాడి ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ తప్పడం లేదు. మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలోని ఫలితాలు బయటకు రానుండడంతో ఆర్కేనగర్ రేసులో గెలుపు గుర్రంగా నిలబడబోతున్నదెవరోనన్న ఎదురుచూపులు పెరిగాయి. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఓటింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ థౌజండ్ లైట్స్‌లోని క్వీన్ మేరిస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్ర పరిచారు. ఈ పరిసరాల్లో ఐదు అంచెల భద్రతను కల్పించారు. ఆదివారం ఉదయాన్నే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఉదయం ఏడు గంటల్లోపు అక్కడికి చేరుకునే విధంగా ఆదేశాలు ఇచ్చారు. పాస్‌లన్నీ ఇప్పటికే అందించారు. కౌంటింగ్ కేంద్రం, పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించి, భద్రత కల్పించారు. ఎప్పటికప్పుడు ఫలితాల్ని అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. వెబ్ టెలికాస్టింగ్ పద్ధతి ద్వారా ఢిల్లీ, చెన్నై కార్పొరేషన్‌లోని కంట్రోల్ రూమ్‌ల నుంచి లెక్కింపు, ఫలితాల సరళిని ఎన్నికల అధికారులు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. పూర్తిగా వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. 19 రౌండ్లుగా లెక్కింపు ఓట్ల లెక్కింపు 19 రౌండ్లుగా సాగనుంది. ఒక్కో రౌండ్‌కు 14 పోలింగ్ బూత్‌ల ఓట్ల లెక్కింపు సాగుతుంది. చివరి రౌండ్లో మాత్రం ఆరు పోలింగ్ బూత్‌లలో లెక్కింపు జరగనున్నట్టు చెన్నై జిల్లా ఎన్నికల అధికారి, కార్పొరేషన్ కమిషన్ కార్తికేయన్ తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరు కానున్న 200 మంది సిబ్బందికి శనివారం కార్తీకేయన్, ఎన్నికల అధికారి ప్రవీణ్ నాయర్ శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ సరళి, ఏజెంట్లకు సమాచారాలు, అధికారులకు సమాచారాలు, రిటర్నింగ్ అధికారికి వివరాలు, ఇలా అన్ని రకాల అంశాలతో ఈ శిక్షణ సాగింది. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో దినకరన్
చెన్నై: తమిళనాడులోని రాధాకృష్ణ(ఆర్కే)నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ పోటీచేయనున్నారు. డిసెంబర్ 21న జరగనున్న ఎన్నికల్లో దినకరన్ బరిలో నిలుస్తారని ఆయన వర్గంనేత ఎస్ అంబళగన్ చెప్పారు. వీకే శశికళ అంగీకారంతోనే దినకరన్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆయన తెలిపారు. ఆర్కేనగర్ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ఉప ఎన్నికల్లోనూ దినకరన్ పోటీచేశారు. ప్రచారసమయంలో కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ను రద్దుచేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. -
‘అమ్మ’ సంవత్సరికానికి పళనిస్వామి అడ్డు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలితకు సంవత్సరిక తిథి కార్యక్రమాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించేందుకు వెళ్లిన పురోహితుల్ని గార్డెన్‌లోని వేదానిలయంలోకి అనుమతించక పోవడం వివాదానికి దారి తీసింది. చివరకు దినకరన్ పిలుపుతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలివీ.. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి చెంది ఏడాది కావస్తోంది. ఆ కుటుంబ సంప్రదాయం మేరకు సంవత్సరిక తిథిని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. చిన్నమ్మ శశికళ, దినకరన్ ఆదేశాలతో పురోహితులు మంగళవారం తిథి ఇవ్వడానికి అవసరమైన సామగ్రితో పొయేస్ గార్డెన్‌లోని వేద నిలయానికి చేరుకున్నారు. అయితే, వారిని అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం పళనిస్వామి ఆదేశాల మేరకు లోపలికి ఎవ్వరినీ అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పురోహితులు వెనక్కు తగ్గారు. అయితే, సంఘటనను దినకరన్ శిబిరం తీవ్రంగా పరిగణించింది. ఇదేనా అమ్మ మీదున్న భక్తి, గౌరవం అంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంపై దుమ్మెత్తి పోస్తూ బుధవారం పొయేస్ గార్డెన్ వైపు ర్యాలీగా వెళ్లారు. పోలీసులు ఆ పరిసరాల్లో భారీ ఎత్తున బలగాల్ని మోహరింప చేశారు. వేద నిలయంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇంతలో దినకరన్ జోక్యం చేసుకుని అక్కడున్న మద్దతుదారు వెట్రివేల్‌తో ఫోన్లో మాట్లాడారు. అసలే పరిస్థితులు బాగా లేదని, వెనక్కు వచ్చేయాలని సూచించడంతో అక్కడున్న వారంతా తగ్గారు. గార్డెన్ నుంచి వెనక్కు వచ్చేశారు. -
టార్గెట్ ఎనిమిది మంది, ‘వివేక్’ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: ఆదాయ పన్ను శాఖ విచారణ వలయంలోకి చిన్నమ్మ శశికళ కుటుంబం, సన్నిహితులు, సహాయకులు మూడు వందల మందిని తీసుకొచ్చారు. వీరిలో ఎనిమిది మంది టాప్ లిస్టులో ఉన్నారు. వీరందరికీ సమన్లు సిద్ధం చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. ఇక, ఇళవరసి కుమారుడు వివేక్ మెడకు మాత్రం ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. 27 ఏళ్ల వయసు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తులు, పెట్టుబడుల్ని కల్గి ఉన్నట్టు ఐటీ దాడుల్లో వెలుగు చూసి ఉండడంతో చిన్నమ్మ కుటుంబంలో ఉత్కంఠ తప్పడం లేదు. అన్నాడీఎంకే అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబాన్ని, సన్నిహితుల్ని గురి పెట్టి ఐటీ దాడులు గురువారం నుంచి సాగుతున్న విషయం తెలిసిందే. తొలిరోజు 187 చోట్ల, రెండోరోజు 147 చోట్ల, మూడో రోజు 40 చోట్ల తనిఖీలు జరిగాయి. ఇక, నాలుగో రోజుగా 20 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఐటీ విభాగంలో ఉన్నతాధికారులుగా ఉన్న వాళ్లు నాలుగో రోజు రంగంలోకి దిగడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న చర్చ బయలు దేరింది. టార్గెట్ 8 మంది: ఐటీ చరిత్రలో తమిళనాడులో కనీవిని ఎరుగని రీతిలో ఏకకాలంలో, రోజుల తరబడి సాగుతున్న ఈ దాడులపై సర్వత్రా దృష్టి పెట్టారు. రాజకీయ పక్షాలు కొన్ని విమర్శలు గుప్పిస్తుంటే, మరికొన్ని ఐటీ దాడుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ చర్చ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు నాలుగు రోజులుగా చిన్నమ్మ ఫ్యామిలీ, సన్నిహితులకు కంటి మీద కునుకు కరువైందని చెప్పవచ్చు. పట్టువదలని విక్రమార్కుడిలా తిష్ట వేసిన ఐటీ వర్గాలు అణువణువు సోదాలు చేస్తూ, లభించిన ఆధారాలను, వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు, లభించిన ఆధారాలు, రికార్డులు, పెట్టుబడులు, ఆస్తులు, నగలు, నగదులకు సంబంధించి విచారణను ముమ్మరం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇందు కోసం ఓ జాబితాను సిద్ధం చేస్తున్నారు. మూడు వందల మందిని విచారణ వలయంలోకి చేర్చి, ఒక్కొక్కర్ని తమ కార్యాలయం మెట్లు ఎక్కించేందుకు ఐటీ వర్గాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ జాబితాలో టాప్ 8 మందిని తొలుత టార్గెట్ చేశారు. ఇందులో శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్కకుమారులు దినకరన్, భాస్కరన్, అన్న కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణ ప్రియ, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఉన్నట్టు సమాచారం. వివేక్ మెడకు ఉచ్చు: టాప్ 8 మందిలో తొలి పేరుగా వివేక్‌ను చేర్చినట్టు సమాచారం. ఇందుకు కారణం, 27 ఏళ్ల వయస్సు కల్గిన వివేక్ వెయ్యి కోట్ల మేరకు ఆస్తుల్ని, పెట్టుబడుల్ని తన గుప్పెట్లో ఉంచుకున్నట్టుగా ఐటీ దాడుల్లో వెలుగు చూడడమే. జయ టీవీ, నమదు ఎంజీయార్, జాస్ సినిమాస్ ఇలా మరికొన్ని సంస్థలకే ఆయనే అధిపతి అన్నట్టుగా ఆధారాలు చిక్కడంతోనే వివేక్‌ను తొలి జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తదుపరి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ను గురి పెట్టి ఉండడంతో, మున్ముందు ఐటీ వర్గాల విచారణలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. అదే సమయంలో వివేక్‌ను అరెస్టు కూడా చేయవచ్చనట్టు ప్రచారం ఊపందుకుంది. శశికళ భర్త నటరాజన్‌ను టార్గెట్ చేసినా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణకు పిలిచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లభించిన ఆధారాల మేరకు మొత్తం ఆస్తుల వివరాల్ని, పట్టుబడ్డ వాటి గురించిన వివరాల్ని లెక్కించే పనిలో ఐటీ వర్గాలు బిజీగా ఉన్నాయి. వీరు తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా రంగంలోకి దిగేందుకు సీబీఐ, ఈడీ వర్గాలు సిద్ధం అవుతుండం గమనార్హం.లగ్జరీ కార్లు: ఆదివారం 20 చోట్ల దాడులు జరగ్గా, పట్టుబడ్డ రికార్డుల సమగ్ర పరిశీలన మేరకు లగ్జరీ కార్ల కొనుగోళ్లలోనూ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. విదేశాల నుంచి పలు కార్లు అక్రమ మార్గంలో దిగుమతి చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. దివాకరన్ వద్ద విచారణ: మన్నార్ కుడిలోని దివాకరన్, ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌస్, కళాశాలల్లో ఐటీ వర్గాలు తనిఖీలు ముగించాయి. ఆయన కళాశాలలోని ఓ గదిని ఐటీ వర్గాలు తమ గుప్పెట్లోకి తీసుకుని సీల్ వేశాయి. మన్నార్‌కుడిలో లభించిన రికార్డులు, ఇతర వాటిని 14 కార్లో యాభై మంది అధికారులు చెన్నైకు తరలించడం గమనార్హం. అలాగే, మరి కొందరు అధికారులు దివాకరన్ను రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పుదుచ్చేరికి చంద్రశేఖర్: శశికళ జ్యోతిష్కుడు చంద్రశేఖర్ ఇంట్లో , న్యాయవాది సెంథిల్ ఇంట్లో విచారణ ముగిసింది. జ్యోతిష్కుడి ఇంట్లో చిన్నమ్మ ఫ్యామిలికీ సంబంధించిన అనేక దస్తావేజులు ఐటీ వర్గాలకు చిక్కినట్టు సమాచారం. అలాగే, రాష్ట్ర మంత్రి ఒకరు ఈ జ్యోతిష్కుడితో మరీ సన్నిహితంగా ఉండడంతో ఆయన ఎవరో అని ఆరా తీస్తున్నారు. దీంతో చంద్రశేఖర్‌ను విచారించేందుకు ఐటీ వర్గాలు పుదుచ్చేరికి తరలించారు. అక్కడి శ్రీలక్ష్మి జ్యువెలరీస్ అధినేత తెన్నరసును సైతం విచారించేందుకు చర్యలు చేపట్టారు. మోసం చేసి ఆస్తులు గడించారు: అమ్మ జయ లలితను మోసగించిన శశికళ కుటుంబం ఆస్తుల్ని గడించిందని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేనే లేదని స్పష్టం చేశారు. అమ్మకు తెలియకుండా ఏళ్ల తరబడి మోసాలకు, అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాజకీయం చేయొద్దు: ఐటీ దాడుల్ని రాజకీయం చేయవద్దు అని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐటీ పరిశీలనలో తేలిన అంశాలు, లభించిన ఆధారాల మేరకు దాడులు సాగుతున్నాయని తెలిపారు. బీజేపీ మీద నిందల్ని వేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. శశికళ కుటుంబాన్ని మాత్రమే ఐటీ టార్గెట్ చేయలేదని, ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి చెందిన వారిని సైతం గురి పెట్టి తనిఖీలు, సోదాలు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అన్నాడీఎంకేను ముక్కలు చేయాల్సిన అవసరం గానీ, రాజకీయ కక్ష సాధింపులకు దిగాల్సినంత విరోధంగా ఇక్కడి వారితో బీజేపీ పెద్దలకు లేదని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, శశికళ బంధువులు కూడబెట్టిన ఆస్తులను జప్తు చేయాలని, వాటన్నింటిని కేంద్రం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మమ్మల్ని తరిమేయడానికి కుట్ర: తిరువణ్ణామలైలో దైవ దర్శనానికి వెళ్లిన దినకరన్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఈ రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి తమ కుటుంబాన్ని తరిమి వేయడానికి కుట్ర జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె కోరిక మేరకు వీడియో తీశామని, అది తన వద్దే ఉందన్నారు. వైద్య చికిత్సలు, అమ్మకు సంబంధించిన వీడియో తన వద్దే ఉందని, దానిని ఐటీ వర్గాలు తీసుకెళ్ల లేదని స్పష్టం చేశారు. ఈ దాడులతో రాజకీయంగా తాను వెనుక బడ లేదని, ప్రజల మదిలో స్థానం సంపాదించుకున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని పేర్కొంటూ, పదవి చేతిలో ఉంది కదా అని మంత్రులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. మంత్రి సీవీ షణ్ముగం లాంటి వాళ్లు ఎందరో ఎలా ఎమ్మెల్యే సీట్లు దక్కించుకున్నారో అన్న వివరాల్ని బయట పెడితే..అంటూ, ఓ మారు గుర్తుంచుకోండని మంత్రులకు హితవు పలికారు. కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటామని, చట్టపరంగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. మహా అయితే, అరెస్టు చేస్తారేగానీ, కాల్చి చంపరుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
తవ్వే కొద్దీ కోట్లు బయటపడుతున్నాయి...!
సాక్షి, చెన్నై: తమిళనాట సాగుతున్న ఐటీ దాడుల్లో తవ్వే కొద్దీ చిన్నమ్మ శశికళ కుటుంబం అవినీతి భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ. వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగ వేసినట్టుగా శుక్రవారం గుర్తించిన అధికారులు, శనివారం జరిపిన పరిశీలనల్లో రూ. 1500 కోట్లు విలువైన పెట్టుబడుల దస్తావేజుల్ని వెలికి తీసినట్లు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, ఆరు కోట్లు నగదు, పదిహేను కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబంపై ఐటీ కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్ మనీ నినాదంతో గురువారం చేపట్టిన తనిఖీలు శనివారం కూడా కొనసాగాయి. తొలి రోజు 187 చోట్ల, రెండో రోజు 147 చోట్ల విచారణ సాగగా, తాజాగా 40 మందిని గురి పెట్టి అణువణువు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశంతో పాటుగా వివిధ దేశాల్లోని సంస్థల్లో రూ.1500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టి ఉండటం, రూ. 1200 కోట్ల మేరకు ఆస్తుల రికార్డుల్ని ఐటీ వర్గాలు చేజిక్కించుకున్నట్లు సమాచారం. అలాగే, ఆరు కోట్ల మేరకు నగదు, రూ. 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 150 బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక, నీలగిరి జిల్లా కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్లలో పనిచేస్తున్న కార్మికులు 800 మంది ఖాతాల్లో పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. రెండు లక్షలు చొప్పున 16 కోట్లు డిపాజిట్ చేసి, నగదును ఉంచినట్లు ఐటీ వర్గాలు గుర్తించాయి. అలాగే, దివంగత సీఎం జయలలిత ఆస్తులకు సంబంధించిన వీలునామ ఎక్కడ ఉందన్న అనుమానాలు బయలు దేరాయి. జయలలిత పేరిట కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, వాటికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు ఈ దాడుల్లో తమ చేతికి చిక్కని దృష్ట్యా, వాటిని ఎక్కడ దాచి పెట్టి ఉన్నారో అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ప్రధానంగా శశికళ భర్త నటరాజన్, అక్కవణితా మని కుమారుడు దినకరన్ మినహా తక్కిన కుటుంబ సభ్యులు, బంధువులు దివాకరన్, వివేక్, కృష్ణప్రియ, సఖిల, భాస్కర్, ఆడిటర్ సెల్వం, న్యాయవాది సెంథిల్, జ్యోతిష్యుడు చంద్రశేఖర్, శ్రీలక్షి జువెల్లరీ మేనేజింగ్ డైరెక్టర్ తెన్నరసు, కోయంబత్తూరులోని కాంట్రాక్టర్ ఆర్ముగ స్వామిలను ఐటీ వర్గాలు వారి వారి ఇళ్లలోనే విచారిస్తున్నాయి. అలాగే, చెన్నై వెలచ్చేరి ఫీనిక్స్ మాల్లోని 11 స్కీన్లతో కూడిన జాస్ సినిమాస్ ను రూ. వెయ్యి కోట్లు పెట్టి ఎలా కొన్నారో అన్న అంశంపై వివేక్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలిసింది. ఇక, సమగ్ర వివరాలతో సీబీఐ, ఈడీలకు నివేదికల్ని అందించేందుకు ఐటీ వర్గాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
తమిళనాట ఐటీ అటాక్!
సాక్షి, చెన్నై: దినకరన్‌తోపాటు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న శశికళ, ఆమె సన్నిహితుల ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు చేసి.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ చరిత్రలో తొలిసారిగా తమిళనాడు వ్యాప్తంగా గురువారం ఏకకాలంలో 187 చోట్ల ఈ దాడులు జరగటం చర్చనీయాంశమైంది. పుదుచ్చేరి, బెంగళూరుల్లోని వీరి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. అన్నాడీఎంకే (శశికళ వర్గం) ఆధ్వర్యంలో నడుస్తున్న జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రిక కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. ‘ఆపరేషన్ క్లీన్ మనీ’లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. జయలలిత మరణానంతరం శశికళ వర్గం ఆధ్వర్యంలో జయ టీవీ నడుస్తోంది. ఈ దాడుల్లో భారీగానే రికార్డులు బయటపడ్డట్టు సమాచారం. మన్నార్గుడిలో శశికళ సోదరుడు దివాకరన్ ఇంట్లో తనిఖీల అనంతరం అతన్ని అధికారులు విచారణకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఉదయం ఆరుగంటల నుంచే.. జయలలిత నెచ్చెలి శశికళపై ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన కేసులో బుధవారం తుది విచారణ పూర్తయింది. తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ క్రమంలో శశికళ, దినకరన్ కుటుంబాలే లక్ష్యంగా ఏకకాలంలో తమిళనాడు, పుదుచ్చేరి, బెంగళూరుల్లో ఐటీ దాడులు జరగడం తమిళనాట సంచలనం రేపింది. శశికళ భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారులు దినకరన్, భాస్కరన్, అన్న సుందరవనన్ కుమారుడు డాక్టర్ వెంకటేషన్, శశికళతో పాటు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఇలవరసి కుమారుడు వివేక్ జయరామన్, కుమార్తె కృష్ణప్రియ, బంధువు కళియ పెరుమాల్, దివాకరన్ అల్లుడు డాక్టర్ విక్రమ్, స్నేహితులు అగ్రి రాజేంద్రన్, మన్నార్గుడి సుజయ్, సహాయకుడు వినాయకం, న్యాయవాది సెంథిల్, ఆడిటర్ చంద్రశేఖరన్, పారిశ్రామికవేత్త ఆర్ముగస్వామిలతో పాటు శశికళ, దినకరన్ మద్దతు అన్నాడీఎంకే నాయకులు, వారి బంధువులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు సాగాయి. ఉదయం ఆరు గంటల నుంచి 1,800 మంది ఐటీ అధికారులు ఈ దాడుల్లో నిమగ్నమయ్యారు. వేర్వేరు బృందాలుగా తంజావూరు, తిరువారూర్, మన్నార్గుడి, కోయంబత్తూరు, నామక్కల్, తిరుచ్చి, ఈరోడ్, పుదుకోట్టై తదితర ప్రాంతాల్లో పోలీసు పహారాతో తనిఖీలు నిర్వహించారు. చెన్నైలోనే 20 చోట్ల తనిఖీలు చేశారు. గురువారం రాత్రి వరకు ఈ తనిఖీలు జరిగాయి. బెంగళూరులోని మురుగేష్‌పాళ్యలో ఉంటున్న శశికళ ఆప్తుడు, అన్నాడీఎంకే కర్ణాటక ఇన్చార్జ్ పుహళేంది ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. బెదిరింపులకు భయపడం: దినకరన్ తమను అణగదొక్కే లక్ష్యంతో కేంద్రం రచించిన వ్యూహాన్ని ఐటీ వర్గాలు అమలు చేస్తున్నాయని దినకరన్ మండిపడ్డారు. చిన్నమ్మను, తనను రాజకీయాల్లో లేకుండా చేయడం లక్ష్యంగా కుట్ర జరుగుతోందన్నారు. జయ అనారోగ్యం గుట్టు చిక్కినట్లేనా? జయలలితకు ఇష్టమైన జయ టీవీ, నమదు ఎంజీఆర్ పత్రికల కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల కారణంగా టీవీ ప్రత్యక్ష ప్రసారాలకు ఆటంకం కలగటంతో మీడియా వర్గాలనుంచి ఆగ్రహం వ్యక్తమైంది. జయ టీవీ కార్యాలయం తనిఖీల్లో జయ వైద్య చికిత్సల రికార్డులు దొరికినట్లు సమాచారం. దీంతోపాటు జయ టీవీకి అనుబంధంగా ఉన్న మిడాస్ డిస్టిలరీస్, జాజ్ సినిమా, పలు నగల దుకాణాలు, ఇతర కార్యాలయాల్లోనూ సోదాలు సాగాయి. జయకు అత్యంత ఇష్టమైన నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లోనూ ఐటీ దాడులు సాగాయి. కొన్నిచోట్ల ఎవరికీ అనుమానం రాకుండా ‘శ్రీని వెడ్స్ మహి’ అన్న పెళ్లి వేడుక బోర్డు ఉన్న వాహనాల్లో అధికా రులు సోదాలు జరిగే ప్రాంతాలకు వచ్చా రు. అక్రమ పెట్టబడులు, నోట్లరద్దు అనం తరం భారీగా నగదు డిపాజిట్లు, బినామీ ఆస్తులపై ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే దాడు లు జరిగినట్లుగా అధికారులు చెప్పారు. -
మరింత చిక్కుల్లో దినకరన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసినట్లు సేలం పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచటమే అందుకు కారణమని తెలుస్తోంది. నీట్ పరీక్ష విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభించిన వైఖరిని తులనాడుతూ.. హత్యా ప్రభుత్వాలుగా అభివర్ణిస్తూ దినకరన్ వర్గానికి చెందిన నేతలు గత నెల 18న కరపత్రాలు పంచారు. ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాయటం.. తద్వారా ప్రభుత్వంపై తిరుగుబాటు వేయాలంటూ ప్రజలకు దినకరన్ పిలుపునిచ్చారంటూ వినాయకమ్ అనే వ్యక్తి సేలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దినకరన్‌తోపాటు ఆయన మద్ధతుదారులు 16 మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయినవారిలో మాజీ మంత్రి సేఈ వెంకటాచలం కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, తమదే అసలైన పార్టీ అని దినకరన్ వర్గం.. ఎలాగైనా అధికారం చేజార్చుకోనివ్వకుండా పళని-పన్నీర్ వర్గాలు పోటాపోటీగా తమ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి. ఓవైపు దినకరన్ గవర్నర్‌ను ఎప్పటికప్పుడు కలుస్తూ బలనిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించాని కోరుతుండగా.. పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడుపుతున్న వారికి అనర్హత వేటు ద్వారా చెక్ పెట్టాలని పళని ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 18న దినకరన్‌తోపాటు ఆయన సన్నిహితుడు, తిరుగుబాటు ఎమ్మెల్యేలో ఒకరైన వెట్రైవెల్ పై వేటు వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది కూడా. ఇప్పటికే దినకరన్ పై మనీలాండరింగ్, ఈసీకి లంచం ఇవ్వజూపారన్న కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
నా భర్తను చూడాలి.. పంపించండి ప్లీజ్..
సాక్షి,చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు 15 రోజుల పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. కాగా, శశికళకు పెరోల్ మంజూరవుతుందని దినకరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్‌పై వ్యాఖ్యానించేందుకు దినకరన్ నిరాకరించారు. దీనిపై తాము సీబీఐ విచారణను కోరుతున్నామని చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వం త్వరలోనే ఇంటిదారి పడుతుందని వ్యాఖ్యానించారు. -
దినకరన్‌కు షాక్!
సాక్షి, చెన్నై: తెన్కాశి ఎంపీ వసంతి మురుగేషన్ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు షాక్ ఇచ్చారు. ఆ శిబిరం నుంచి సీపీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల శిబిరంలోకి చేరారు. దినకరన్‌ను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేలతో మంతనాల నిమిత్తం కుడగులోని క్యాంప్‌లో దినకరన్ తిష్ట వేశారు. సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌ల కలయికతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ అన్నాడీఎంకేను దక్కించుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఆయనకు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు కదిలినా, 18 మంది మాత్రం కుడుగు క్యాంప్‌లో ఉన్నారు. ఈ 18 మందిపై అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు డైలమాలో పడ్డారు. అలాగే, దినకరన్‌కు మద్దతుగా ఇన్నాళ్లు ఎంపీలు నాగరాజన్, విజిలా సత్యనంద్, సెంగుట్టవన్, ఉదయకుమార్, గోకులకృష్ణన్, నవనీత కృష్ణన్, రాధాకృష్ణన్, వసంతీ మురుగేషన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడడంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఎనిమిది మంది ఎంపీల్లో ఆందోళన బయలు దేరింది. దినకరన్‌కు దూరంగా ఉండడం మంచిదన్న భావనలో ఎంపీలు ఉండగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డైలమాలో ఉన్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎంపీ వసంతీ మురుగేషన్ దినకరన్‌కు షాక్ ఇచ్చి సీఎం ఈపీఎస్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లకు జిందాబాద్ కొట్టారు. దినకరన్‌కు షాక్: తెన్కాశి పార్లమెంట్‌సభ్యురాలు వసంతీమురుగేషన్ ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని సీఎం పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఆశీస్సులు అందుకుంటూ, ఆ శిబిరంలోకి చేరారు. అలాగే, పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం ఓ పన్నీరు సెల్వం ఇంటికి చేరుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఈపీఎస్, ఓపీఎస్‌లతో కలిసి పయనం సాగించనున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను సర్వనాశనం చేయడం లక్ష్యంగా దినకరన్ కుట్రలు చేస్తున్నాడని, అందుకే ఆ శిబిరాన్ని వీడినట్టు పేర్కొన్నారు. దినకరన్‌కు ఇన్నాళ్లు వెన్నంటి ఉంటూ, ఈపీఎస్, ఓపీఎస్‌లపై దుమ్మెత్తి పోశారే అని ప్రశ్నించగా, తమ చేత బలవంతంగా పలికించారని దాట వేయడం గమనార్హం. అలాగే, మిగిలిన ఏడుగురు ఎంపీలతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకటి రెండు రోజుల్లో సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలతో భేటీ కానున్నారని ప్రకటించారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అనేక మంది సీఎం వైపే ఉన్నారని, వాళ్లను క్యాంప్‌లో పెట్టి ఉన్న దృష్ట్యా, బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కుడగుకు దినకరన్: మైసూర్ సమీపంలోని కుడగు క్యాంప్‌లో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్యాంప్‌నకు శుక్రవారం దినకరన్ చేరుకున్నారు. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో తదుపరి కార్యాచరణ మీద మంతనాలు సాగిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా, స్పీకర్ ధనపాల్ జారీ చేసిన అనర్హత ఉత్తర్వులను రద్దు చేయాలని మదురైకు చెందిన సామాజిక కార్యకర్త కేకే రమేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తిరస్కరించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ విచారణ న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ బెంచ్ ముందుకు ఉదయం వచ్చింది. ఇలాంటి పిటిషన్ విచారణ మద్రాసు హైకోర్టు సాగుతుండడం, తదుపరి విచారణ అక్టోబరు నాలుగో తేదీ జరగనున్నడాన్ని గుర్తు చేస్తూ, ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని కోర్టు తిరస్కరించింది. -
ఇదేం చర్య?!
న్యాయస్థానాల హితబోధలు, మందలింపుల మాటెలా ఉన్నా దేశంలో స్పీకర్ల వ్యవస్థ పెద్దగా మారిందేమీ లేదని మరోసారి రుజువైంది. తమిళనాడులో టీటీవీ దినకరన్‌కు చెందిన అన్నా డీఎంకే వర్గం ఎమ్మెల్యేలు 18మందిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ ధన్పాల్ సోమవారం తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదా స్పదమైనది. విచారకరమైనది. పళనిస్వామి ప్రభుత్వం బల పరీక్షకు రాష్ట్ర హైకోర్టు విధించిన గడువుకు రెండు రోజుల ముందు తీసుకున్న ఈ చర్యలోని అంతరా ర్ధమేమిటో సుస్పష్టమే. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల వేరు కుంపటి కారణంగా పళని స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాన్ని కాపాడటం కోసమే స్పీకర్ ఈ చర్యకు ఉపక్రమించారు. నిజానికి ఇలాంటి ప్రమాదాన్ని ఊహించబట్టే తక్షణం బల పరీక్షకు ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. ఆయన ఈ విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటాన్ని గమనించి మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష జరపరాదని కోర్టు స్టే విధించింది. ఈ ఆదేశం వల్ల దినకరన్ వర్గానికి ఒరిగిందేమీ లేకపోగా స్పీకర్‌కు తగినంత సమయం చిక్కింది. దాన్ని వినియోగించుకుని ఆయన పళనిస్వామి ప్రభుత్వాన్ని కాపాడారు. ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకుని తగినంత సంఖ్యాబలాన్ని సాధించు కున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం. అనుకోని పరిణా మాలు సంభవించి ఆ పార్టీ సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని బలాబలాలు తేలాల్సింది చట్టసభలోనే. అక్కడ ఎవరికీ తగినంత బలం లేదని తేలిన పక్షంలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించడమే సబబు. ఎస్ఆర్ బొమ్మై కేసులో చరిత్రాత్మకమైన తీర్పునిస్తూ ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్ట సభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని సుప్రీంకోర్టు ఎన్నడో స్పష్టం చేసింది. అయినా అడపా దడపా ఏదో రకమైన సాకుతో ప్రభుత్వాలను పడగొట్టడం ఆగలేదు. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని సరిదిద్దుతూనే ఉన్నాయి. ఈ దుస్సంప్రదాయాన్ని ప్రారంభించిందీ, యథేచ్ఛగా కొనసాగించిందీ కాంగ్రెసే అయినా... ఆ తర్వాత వచ్చిన ఇతర పార్టీలు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని ఉపయోగిస్తూనే వచ్చాయి. తమిళనాడులో ఇప్పుడు నెలకొన్న పరిస్థితి విచిత్రమైనది. నిరుడు మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే ఘన విజయం సాధించి వరసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. కానీ మూడు నెలలు గడవ కుండానే జయ అనారోగ్యం బారినపడ్డారు. గత డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆ తర్వాత నుంచి తమిళనాడు రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఆమె తర్వాత వచ్చిన పన్నీర్‌సెల్వం చాలా త్వరలోనే రాజీనామా చేయడం, శాసనసభా పక్ష నేతగా శశికళ పేరు ప్రతిపాదించడం, ఆ తర్వాత తిరుగుబాటు చేయడం చకచకా జరిగిపోయాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన శశికళ అవినీతి కేసులో జైలుపాలు కావడంతో ఆమె ఆశీస్సులతో పళనిస్వామి సీఎం పదవి చేపట్టారు. శశికళ మేనల్లుడు దినకరన్ రంగ ప్రవేశం చేశాక పళనిస్వామి కూడా ఆమెకు దూరమయ్యారు. అప్పటినుంచి పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దినకరన్ ప్రయత్నిస్తున్నారు. ఆయన శిబిరంలో 19మంది ఎమ్మెల్యేలున్నారు. పన్నీర్‌సెల్వం పళనిస్వామి వర్గాలు చేతులు కలిపాక వారి బలం 111. 234మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వానికి కావలసిన కనీస సంఖ్యాబలం 117. విపక్షాల బలం 98. వీరితో దినకరన్ వర్గం జతగూడితే పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. పరి స్థితి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు బలపరీక్షలో జాప్యం ఎందుకు జరగాలి? ఒకపక్క దినకరన్ బలవంతంగా ఎమ్మెల్యేలను తన శిబిరంలో ఉంచుకున్నారని పళనిస్వామి ఆరోపిస్తున్నారు. అలాంటపుడు ఓటింగ్‌కు ఆయన ఎందుకు సిద్ధపడలేకపోయారు? ఆయన తప్పించుకు తిరుగుతున్నారు సరే... దానికి గవర్నర్ సహకరించ డంలోని అంతరార్ధం ఏమిటి? కనీసం ఈ వ్యవహారం తన ముందుకొచ్చినప్పుడు మద్రాస్ హైకోర్టయినా వెనువెంటనే బలపరీక్షకు ఆదేశించి ఈ నాటకానికి తెరదిం చాల్సింది. లేదా బలపరీక్ష లోపు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదన్న తాత్కాలిక ఆదేశాలైనా ఇవ్వాల్సింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోను అసెం బ్లీలో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య 215. పర్యవసానంగా ప్రభుత్వానికి కావలసిన కనీస మెజారిటీ 108 అయింది. కనుక పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కడం పెద్ద కష్టం కాదు. కానీ ఇది ఆరోగ్యకరమైన పోకడేనా? అనర్హత వేటు చట్టబద్ధతను ఇప్పుడు ఎటూ దినకరన్ వర్గం న్యాయస్థానంలో సవాల్ చేస్తుంది. కానీ సంక్షోభం ఏర్పడినప్పుడు దానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలన్న ఆత్రుత ఎవరిలోనూ లేకపోవడం విచారకరం. ఆమధ్య పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య పోటీ ఏర్పడినప్పుడు రోజుల తరబడి రెండు వర్గాలూ శిబిరాలు నడిపాయి. మళ్లీ ఇప్పుడు దినకరన్ వర్గం ఆ పనే చేసింది. ఇందువల్ల చట్టసభలపై, మొత్తంగా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. పాలన కుంటుబడుతుంది. అధికారం ఎవరికుంటుంది, ఎవరికి పోతుందన్నది ప్రధానం కాకూడదు. ఏర్పరుచుకున్న నిబంధనలు అమ లయ్యేలా చూడటం, వ్యవస్థలు నవ్వులపాలు కాకుండా చూడటం ప్రధానం. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో తమకు సంబంధం లేదని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. కానీ రాష్ట్రంలో పాలన కుంటుబడినప్పుడు, సంక్షోభం ఎడతెగకుండా సాగుతున్నప్పుడు దాన్ని చక్క దిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? ఇప్పటికైనా తమిళనాట సంక్షోభానికి అర్ధవంతమైన ముగింపు పలకాలి. పళనిస్వామి సర్కారు మనుగడ కన్నా అక్కడ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండటం అవసరమన్న స్పృహ అందరిలోనూ ఏర్పడాలి. -
పళని రాజీనామా చేయాల్సిందేః దినకరన్
సాక్షి,చెన్నయ్: తమిళనాడు సీఎం పళనిస్వామి పదవి నుంచి వైదొలగి నూతన శాసనసభా పక్ష నేత ఎంపికకు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని పార్టీ వేటుకు గురైన టీటీవీ దినకరన్ డిమాండ్ చేశారు. సీఎం ముందుగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించాలని, తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని కోరారు. పళనిస్వామికి సీఎం పదవి, క్యాబినెట్‌ను చిన్నమ్మే (శశికళ) ప్రసాదించారని, అందుకే తాము పళనిని సీఎం పదవికి రాజీనామా చేసి వేరొకరికి అప్పగించాలని కోరుతున్నామన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను పళనిస్వామికి పంపుతానని, అయితే వారు విశ్వాస పరీక్ష సందర్భంగా పళనికి ఓటు వేయకపోతే దానికి తాను బాధ్యత వహించనని దినకరన్ స్పష్టం చేశారు. గత నెలలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఏకమైన క్రమంలో దినకరన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వంపై వేటు వేయాలని కోరుతూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. -
చిన్నమ్మ వద్దు..‘అమ్మ’నే శాశ్వతం
-
చిన్నమ్మ వద్దు.. ‘అమ్మ’నే శాశ్వతం
► పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ తొలగింపు ► జయ శాశ్వత ప్రధాన కార్యదర్శి ► అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో నిర్ణయం ► ప్రభుత్వాన్ని కూలుస్తా: దినకరన్ సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి ‘చిన్నమ్మ’ శశికళ, ఆమె కుటుంబీకులను దూరం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు మరింత వేగం పెంచారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను మంగళవారం తొలగించారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో శశికళ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. గతంలో శశికళ తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం తెలిసిందే.శశికళ చేసిన నియామకాలు చెల్లవని పార్టీ తీర్మానించడంతో దినకరన్‌ను నియామకం కూడా రద్దైనట్లైంది. దినకరన్ సృష్టించిన అడ్డంకులను అధిగమించి, హైకోర్టు అనుమతితో కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నై నగరంలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అన్నాడీఎంకేకు శాశ్వత అధ్యక్షుడు ఎంజీ రామచంద్రన్, శాశ్వత ప్రధాన కార్యదర్శి ‘అమ్మ’ జయలలితేననీ, వారి స్థానాలను మరెవ్వరితోనూ భర్తీ చేయకూడదంటూ సమావేశంలో పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తగా పార్టీలో కో–ఆర్డినేటర్, జాయింట్ కో–ఆర్డినేటర్ పదవులను సృష్టించి వాటిని వరసగా పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలకు కేటాయించారు. వచ్చే ఎన్నికల వరకు వారు ఈ పదవుల్లో కొనసాగుతారు. కొత్త నిబంధనల ప్రకారం పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఈ పదవుల్లోని వారికి ఉంటుంది. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అధ్యక్షతన పళని, పన్నీర్ల నేతృత్వంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పార్టీలో శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ల ఆధిపత్యాన్ని నిలువరించడమే లక్ష్యంగా పళని, పన్నీర్ల వర్గాలు ఇటీవల ఏకమైన విషయం తెలిసిందే. పళని మాట్లాడుతూ అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదనీ, వెయ్యి మంది దినకరన్‌లు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. జయ ఉన్న సమయంలో ఏయే కట్టుబాట్లు పార్టీలో అమల్లో ఉన్నాయో వాటితోనే ముందుకు సాగుతామని పన్నీర్ పేర్కొన్నారు. సమావేశంలో మొత్తం 14 తీర్మానాలు చేశారు. మదురైలో దినకరన్ మంతనాలు శశికళను పదవి నుంచి తొలగించడంతో ఆమె మద్దతుదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. పళని, పన్నీర్ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. మరోవైపు సర్వసభ్య సమావేశం సాగుతుండగానే దినకరన్ మదురైలో తన వర్గం వారితో మంతనాలు సాగించారు. సర్వసభ్య సమావేశాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన శశికళ ఏర్పాటు చేయాల్సి ఉందనీ, కాబట్టి పళని, పన్నీర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం చెల్లదని దినకరన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు సీఎం మార్పు కోసం ప్రయత్నించాననీ, ఇకపై ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ శపథం చేశారు. త్వరలోనే శశికళ ఆదేశాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామంటూ ప్రకటించారు. మంగళవారం నాటి సర్వసభ్య సమావేశంలో తీసుకునే నిర్ణయాలనే తీర్పు సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని మద్రాసు హైకోర్టు చెప్పడం తెలిసిందే. శశికళను పదవి నుంచి తప్పించడం చెల్లుతుందో లేదో హైకోర్టే తన తీర్పులో చెబుతుందని దినకరన్ అన్నారు. కాగా, మైసూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఒకరు... తాము అక్కడ బందీలుగా ఉన్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు సీఎం పళనిస్వామి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకునేలా విశ్వాస పరీక్ష పెట్టేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. -
ఛాలెంజ్.. పళనీ ప్రభుత్వం ఇంటికే..
-
ఛాలెంజ్.. పళనీ ప్రభుత్వం ఇంటికే..: దినకరన్
చెన్నై: తాను తమిళనాడు ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతానని అన్నాడీఎంకే బహిష్కృతనేత టీటీవీ దినకరన్ శపథం చేశారు. తమిళనాడు ప్రజలను, కార్యకర్తలను ముఖ్యమంత్రి పళనీ స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం దారుణంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ పార్టీ చీఫ్, డిప్యూటీ చీఫ్ పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దినకరన్ మధురై నుంచి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాను. పళని స్వామికి ఎవరూ ఓటేయలేదు. మరోసారి మేం అమ్మ పరిపాలనను తీసుకొస్తాం. పోటీ అనేది మాకు, డీఎంకేకి మధ్య మాత్రమే పోరాటం జరుగుతుంది. పళనీస్వామిని సీఎం కుర్చీలో నేను చూడలేను. పన్నీర్ సెల్వం కారణంగా మా ఎన్నికల గుర్తు పోయింది. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు. మేం పన్నీర్, పళనిలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వారికి కావాల్సిందల్లా పదవిలో ఉండటం.. దానిని అనుభవించడం మాత్రమే. నేనే నిజమైన అమ్మ వారసుడిని.. ప్రజలు కూడా నన్నే అమ్మ విశ్వసనీయుడిగా పరిగణిస్తారు. వారికి బలమే లేదు. ఆ విషయం కోర్టు తేలుస్తుంది. ఇప్పటికే 21మంది ఎమ్మెల్యేలకు పళనీస్వామిపై తమకు నమ్మకం లేదని గవర్నర్‌కు లేఖ పంపించాం. నిజంగా వారికి మెజారిటీ ఉంటే బలపరీక్షకు దిగాలి. ఒక వేళ నిజంగా ఆయన సీఎం కాగలిగితే సీఎం పదవికి రాజనామా చేసి మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావచ్చుకదా. దమ్ముంటే మీరు ఎన్నికలు రండి.. నేను సవాల్ చేస్తున్నా. ఈ ప్రభుత్వానికి ఈ 117మంది ఎమ్మెల్యేల బలం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని దినకరన్ చెప్పారు. మరోపక్క, అసలు తమను విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదని సీఎం పళనీస్వామి అన్నారు. ‘‘మమ్మల్ని విమర్శించడానికి దినకరన్‌కు ఎలాంటి అర్హత లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆయనను 10 యేళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంచారు’ అని గుర్తు చేశారు. -
క్యాంప్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్?
-
క్యాంప్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల జంప్?
సీఎం పళని స్వామి కొత్త వ్యూహం సాక్షి, చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలలో తాజాగా ఐదుగురు శాసనసభ్యులు పుదుచ్చేరి క్యాంప్ నుంచి జారుకున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు జారిపోకుండా క్యాంప్‌ను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు మార్చాలని దినకరన్ యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో కార్యక్రమాలు, వ్యక్తిగత పనులు, కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి తీసుకున్నట్లు దినకరన్ వర్గానికి చెందిన నేత జగ్గయ్యన్ తెలిపారు. త్వరలోనే వారందరూ వెనక్కు వస్తారని వెల్లడించారు. మరోవైపు దినకరన్ శిబిరం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి క్యాంప్‌కు వెళ్లకుండా నిరోధించడానికి తమిళనాడు సీఎం పళని స్వామి పలువురు మంత్రులను రంగంలోకి దించినట్లు సమాచారం. -
చలో హైదరాబాద్
∙ పుదుచ్చేరి రిసార్టు నుంచి దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మకాం మార్పు ∙ ఆలయంలో పూజలు ∙ దినకరన్ అనుకూల సీడీలను విడుదల చేసిన మాజీ మంత్రి అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే క్యాంపు రాజకీయాలకు చిరునామాగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో రెండు క్యాంపు రాజకీయాలకు తెరదీసిన అమ్మ అనుచరులు సరికొత్త విధానానికి తెరదీశారు. ఇప్పటివరకు తమిళనాడును వదిలి పుదుచ్చేరికి వెళ్లి తాజాగా తెలంగాణబాట పట్టనున్నారు. పుదుచ్చేరి రిసార్టులోని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు చలో హైదరాబాద్ అంటూ పయనం కానున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీలోనూ, ప్రభుత్వంపైనా తన పెత్తనాన్ని లేకుండా చేసిన సీఎం ఎడపాడి పళనిస్వామిపై ప్రతీకారం తీర్చుకునేలా టీటీవీ దినకరన్ రాజకీయ పావులు కదుపుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా 19 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఉపసంహరింపజేశారు. అంతేగాక గత నెల 22వ తేదీన గవర్నర్‌కు మద్దతు ఉపసంహరణ లేఖలను స్వయంగా అందజేయించారు. దీంతో ఎడపాడి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ దశలో తమ వర్గ ఎమ్మెల్యేలు ఎడపాడి ప్రలోభాలకు గురికాకుండా పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో వారిని ఉంచారు. వీరికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో దినకరన్ వర్గంలో ఎమ్మెల్యేల బలం 21కి పెరిగింది. మద్దతు ఉపసంహరణ తరువాత ఎడపాడిని గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తారని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు ఆశించారు. అయితే ఇటీవల చెన్నైకి వచ్చిన గవర్నర్ ఇదంతా పార్టీ అంతర్గత కలహాలు.. తలదూర్చనని స్పష్టం చేయడంతో వారంతా కంగుతిన్నారు. క్యాంప్‌లో కొనసాగి ఇక ప్రయోజనం ఏమిటని డీలాపడిన ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాక రిసార్టు నాలుగు గోడల మిగతా 2వ పేజీలో u మధ్య బోరు కొడుతోందని వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేల వైఖరితో కంగారుపడిన దినకరన్ వీరందరిని హైదారాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడైతే స్వేచ్ఛగా తిరిగినా ఎవరూ గుర్తుపట్టరూ, ఎడపాడి వర్గం వలవేసి అవకాశాలు తక్కువ అనే అభిప్రాయానికి వచ్చిన దినకరన్ శని, ఆదివారాల్లో తన వర్గ ఎమ్మెల్యేలను హైదరాబాద్ విమానం ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు ఈనెల 5వ తేదీన 19 మంది ఎమ్మెల్యేలమంతా స్పీకర్‌ను విడివిడిగా కలుస్తామని ఆ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శుక్రవారం తెలిపారు. స్పీకర్ వద్దకు వారంతా పుదుచ్చేరి నుంచా లేదా హైదరాబాద్ నుంచి వస్తారా అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. పోటీగా మరో సీడీ విడుదల శశికళ, దినకరన్‌లను విమర్శిస్తూ చేసిన ప్రసంగాల సీడీని మంత్రి ఉదయకుమార్ గత నెల 31వ తేదీన విడుదల చేయగా, ఇందుకు బదులుగా దినకరన్ మద్దతుదారు, మాజీ మంత్రి సెందమిళ్ సెల్వన్ శనివారం ఒక సీడీని విడుదల చేశారు. ఈ సీడీలో శశికళను ప్రశంసిస్తూ జయలలిత చేసిన ప్రసంగాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే పెరియకుళం ఎన్నికల ప్రచారాల్లో అప్పటి అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్‌ను పొగుడుతూ చేసిన ప్రసంగాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. అంతేగాక పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా చేయాలని ఎడపాడి, పన్నీర్ వర్గాలు శపథం చేసిన దృశ్యాలను ఈ సీడీల్లో చూడవచ్చని ఆయన తెలిపారు. శశికళ తల్లిలా తనను చూసుకుంటుందని ప్రధాని సమక్షంలోనే జయలలిత పొగిడినట్లుగా ఆయన అన్నారు. సీఎం ఎడపాడి వర్గానికి అందుబాటులో లేకుండా పుదుచ్చేరిలో రిసార్టులో తలదాచుకుని ఉన్న దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు అక్కడి ఆలంగుడి ఆలయంలో గురుప్రవేశ (గురుపెయర్చి) పూజలను నిర్వహించారు. పూజలు ముగిసిన అనంతరం తిరిగి రిసార్టులోకి వెళ్లిపోయారు. -
హైదరాబాద్‌కు దినకరన్ ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న అన్నాడీఎంకే దినకరన్ వర్గ 19 మంది ఎమ్మెల్యేలు తమ మకాంను పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు మారుస్తున్నారు. పళని వర్గ ప్రలోభాలకు గురికాకుండా దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలను రిసార్టులో ఉంచి కాపాడుతున్నారు. శని లేదా ఆదివారం వారందరినీ దినకరన్ హైదరాబాద్‌కు తరలించనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు మంగళవారం 19 మంది శాసనసభ్యులు స్పీకర్‌ను విడివిడిగా కలుస్తారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ తెలిపారు. శశికళ కుటుంబంపై దివంగత సీఎం జయలలిత చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోను మంత్రి ఉదయకుమార్ రిలీజ్చేయగా, ప్రతిగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మరో వీడియో రిలీజ్చేశారు. పెరియకుళం ఎంపీగా దినకరన్ పోటీచేసినపుడు అతణ్ని, శశికళను జయ పొగిడిన దృశ్యం ఈ వీడియోలో ఉంది. -
నోటీసులు
♦ ఓపీఎస్, శశి, టీటీవీలకు నోటీసులు ♦ రెండాకుల కేసులో ధర్మాసనం నిర్ణయం ♦ కోర్టుకు వేద నిలయం సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌కు వివరణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఓపీఎస్(పన్నీరు సెల్వం), అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం నోటీసులు జారీ చేసింది. ఇక, పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు తగ్గ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో వివాదాలు రెండాకుల చిహ్నం సీజ్‌కు కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓపీఎస్, ఈపీఎస్ ఒక్కటైనా, దినకరన్ రూపంలో చిక్కులు బయలు దేరాయి. ఇక, ఈ రెండాకుల విషయంగా మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో ఓ పిటిషన్ దాఖలైంది. తిరుచెందూరుకు చెందిన రామ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్లో గతంలో కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల్లో చీలికలు వచ్చిన తరుణంలో, మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న శిబిరానికి అధికారిక గుర్తులను కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో చీలికలు బయలు దేరడంతో 45 ఏళ్లుగా అందరి మదిలో పాతుకుపోయిన గుర్తు సీజ్ చేసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలు, తీర్పులను పరిగణలోకి తీసుకుని మెజారిటీ ఎటు వైపు ఉన్నదో వారికి ఆ గుర్తు అప్పగించేందుకు తగ్గ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గురువారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ సూచనను న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, డిప్యూటీ సీఎం ఓపీఎస్‌లతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులను జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబరు 13వ తేదీకి వాయిదా వేశారు. కోర్టుకు వేదనిలయం : దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్‌గార్డెన్‌లోని వేదా నిలయంను స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గ పనులకు అధికార వర్గాలు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ నిర్ణయాన్ని జయలలిత మేనల్లుడు దీపక్, మేన కోడలు దీపలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముసిరికి చెందిన తంగవేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలిత కోర్టు ద్వారా దోషిగా పరిగణించి బడినట్టు గుర్తు చేశారు. ఆమె ప్రస్తుతం లేకున్నా, ఆ కేసులో నిందితురాలేనని పేర్కొన్నారు. అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన లావేదేవిలు, చర్చలు వేదనిలయం వేదికగా సాగినట్టుగా గతంలో కోర్టు పేర్కొందని వివరించారు. కోర్టు జాబితాలో ఉన్న ఆ వేదనిలయాన్ని ఎలా స్మారక మందిరంగా మార్చేందుకు వీలుందని పేర్కొంటూ, ఆ భవనాన్ని స్మారక మందిరంగా మారిస్తే, కోర్టులకు విలువ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. దీనిని పరిగణలోకి తీసుకుని స్మారక మందిరం పనులను నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. -
కథ క్లైమాక్స్‌కు
♦ చిన్నమ్మను సాగనంపేందుకు 12న ముహూర్తం ♦ అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం ♦ న్యాయనిపుణులతో దినకరన్ అన్నాడీఎంకే కథ క్లయిమాక్స్‌కు చేరుకుంది. పార్టీకి తలవంపులు, తలనొప్పులుగా మారిన శశికళ, దినకరన్‌ల శిరోభారాన్ని దించుకునేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ఎడపాడి నిర్ణయం తీసుకున్నారు. శశికళ స్థానంలో ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళ చలవ వల్లనే సీఎం అయిన ఎడపాడికి అదే వ్యక్తి వల్ల చిక్కులు మొదలయ్యాయి. జైలుకెళ్లే ముందు తన ప్రతినిధిగా నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సీఎం ఎడపాడి పాలిట కొరకరాని కొయ్యగా మారారు. పార్టీకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని సైతం కూల్చివేసేందుకు దినకరన్ పూనుకోవడంతో ఇక లాభం లేదనుకుని ఎడపాడి, పన్నీర్ కలిసి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా దినకరన్ వేగం పెంచడంతో అప్రమత్తమైన ఎడపాడి వారిని బహిష్కరిస్తూ సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వారి స్వాధీనంలో ఉన్న నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సీఎం ఎడపాడి అధ్యక్షతన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శశికళ, దినకరన్‌లను దెబ్బతీయడమే లక్ష్యంగా నాలుగు తీర్మానాలు చేశారు. గవర్నర్‌కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగించి శశికళ, దినకరన్‌లపై శాశ్వత వేటు వేయాలని ఎడపాడి వర్గం నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్నే ఎన్నికల కమిషన్ నిర్ధారించని పరిస్థితుల్లో ఆమె నియమించిన దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి కానేరడు, ఆయన నియామకాలు, తొలగింపులు చెల్లవు. కాబట్టి జయలలిత నియమించిన వారే ఆయా పదవుల్లో కొనసాగుతారని తీర్మానించారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ దినపత్రికలను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఈనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, పార్టీని బలోపేతం చేసిన జయలలిత బాటలో నడవాలని తీర్మానించారు. పెరుగుతున్న దినకరన్ బలం ఎడపాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా 19 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లిఖితపూర్వకంగా అందజేశారు. కాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేరడంతో సోమవారం నాటికి దినకరన్ బలం 23 కు చేరుకుంది. శశికళ, దినకరన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై వేటు తప్పదని దినకరన్ వర్గం హెచ్చరిస్తోంది. ఇంతవరకు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించగా, పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం ఎడపాడిని తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి దినకరన్ ప్రకటించడం కలకలం రేపింది. అలాగే మంత్రులు తంగమణి, వేలుమణిలను కూడా పార్టీ నుంచి దినకరన్ సోమవారం తొలగించారు. కాగా, ఎడపాడి సోమవారం నిర్వహించిన సమావేశానికి 113 మందిలో 83 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. గైర్హాజరైన 30 మంది దినకరన్ వైపు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు ఎంపీలు కూడా రాలేదు. అన్నాడీఎంకేని బీజేపీలో నూరుశాతం విలీనం చేశారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. దిష్టిబొమ్మల దహనం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా ఎడపాడి వర్గీయులు దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మదురై జిల్లా మేలూరులో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వందమందిని అరెస్ట్ చేశారు. నేడు ఢిల్లీకి వైరి వర్గాలు సీఎం ఎడపాడి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ యుద్ధం సాగుతుండగా, ఇరుపక్షాలు మంగళవారం ఒకేసారి ఢిల్లీకి చేరుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేందుకు సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళుతోంది. అలాగే రాష్ట్రపతిని కలిసి ఎడపాడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరేందుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు సైతం మంగళవారం ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే బోస్ ఎడపాడిని హెచ్చరించారు. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టి సోమవారానికి ఏడు రోజులైంది. ఏ వర్గంలో చేరాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎడపాడి ప్రయత్నాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు దినకరన్ న్యాయనిపుణులతో సమావేశం అయ్యారు. ఎడపాడి, టీటీవీ దినకరన్ ఎవరికి వారు బహిష్కరణలు, నియామకాలు సాగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర కార్యనిర్వాహకులుగా తయారయ్యారు. మరోసారి పేరు మార్పు అన్నాడీఎంకే రెండుగా చీలడం వల్ల ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంంతో ఎడపాడి వర్గం ‘అన్నాడీఎంకే (అమ్మ)’ అని, పన్నీర్‌సెల్వం వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ రెండు వర్గాలు ఇటీవల ఏకం కావడంతో అన్నాడీఎంకే (అమ్మ, పురట్చి తలైవి అమ్మ) అని పేరు మార్చుకున్నట్లుగా పార్టీ లెటర్హెడ్ల ద్వారా వెల్లడైంది. -
తమిళ రాజకీయాల్లో రోజుకో మలుపు
-
శశికళ, దినకరన్‌లపై వేటు
► సీఎం పళని నిర్ణయం ► పార్టీ భేటీకి 30 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతున్నాయి.తాజాగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తూ సీఎం పళని స్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయించారు. వారి అధీనంలోని నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకోవాలని, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు వచ్చేనెల 12న పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ భేటీకి 113 మంది ఎమ్మెల్యేలకుగానూ 83 మంది మాత్రమే హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని ఎన్నికల సం ఘం గుర్తించలేదని, అందువల్ల ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదని పళని చెప్పారు. ఢిల్లీకి పళని, దినకరన్ వర్గాలు సీఎం పళని, దినకరన్ వర్గాల పంచాయతీ ఢిల్లీకి చేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేందుకు సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఈసీని కలవనుంది. పళని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. కాగా, జూలై 18న అసెంబ్లీలో నిషేధిత గుట్కాల్ని ప్రదర్శిం చారంటూ ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా 21 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని జారీచేశారు. -
దూకుడు పెంచిన దినకరన్
చెన్నై: ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల గురించి బహిష్కరణకు గురైన ఏఐఏడీఎంకే (అమ్మ) వర్గం నేత టీటీవీ దినకరన్ దూకుడు మరింత పెంచారు. పార్టీని సోమవారం పునర్వ్యవస్థీకరించారు. ఇందులోభాగంగా సీనియర్ నేతలతోపాటు మంత్రులను సైతం పార్టీ పదవులనుంచి తప్పించారు. ఈ జాబితాలో సీనియర్ మంత్రులు పి.తంగమణి, ఎస్పీ వేలుమణిలున్నారు. నమ్మక్కల్, కోయంబతూర్ జిల్లా శాఖ కార్యదర్శుల పదవుల్లో ఉన్న వీరిని తొలగించారు. తిరుచిరాపల్లి నగర శాఖ కార్యదర్శి నటరాజన్‌ను సైతంఆ పదవి నుంచి తప్పించారు. ఇంకా తిరుచిరాపల్లి శాఖ కార్యదర్శి రతినవేల్ను సైతం తొలగించారు. ఇతర జిల్లాల శాఖలను సైతం పునర్వ్యవస్థీకరిస్తామని, పార్టీ అధినేత్రి శశికళ ఆమోదంతోనే ఇదంతా చేశానని ప్రకటించారు. ఎప్పుడో సాగనంపాం కదా: పళనిస్వామి ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి దినకరన్‌ను ఈ నెల పదో తేదీనే తొలగించామని, అందువల్ల ఆయన చేపట్టే మార్పులుచేర్పులు చెల్లబోవని ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన సోమవారం జరిగిన ఏఐఏడీఎంకే సమావేశం తేల్చిచెప్పింది. జయలలిత హయాంలో జరిగిన నియామకాలను తొలగించే అధికారం ఆయనకు ఎంతమాత్రం లేదంటూ ఓ తీర్మానం చేశారు. పళనిస్వామి నేతృత్వంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తదితరులు హాజరయ్యారు. -
దినకరన్ దిష్టిబొమ్మ దహనం
వేలూరు: జిల్లా కార్యదర్శి పదవి నుంచి మంత్రి కేసీ.వీరమణిని తొలగించడాన్ని ఖండిస్తూ కార్యకర్తలు టీటీవీ.దినకరన్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. జిల్లా కార్యదర్శిగా వీరమణిని తొలగించి ఎమ్మెల్యే బాలసుబ్రమణ్యంను నియమించడంతో దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మాదనూర్, ఆంబూరు, వానియంబాడి,, తిరుపత్తూరు, గుడియాత్తం ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలు దినకరన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన చిత్ర పటాలను దహనం చేస్తున్నారు. గురువారం ఉదయం వేలూరు ఎంజీఆర్ మండ్ర జిల్లా కార్యదర్శి నారాయణన్ అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయం చేరుకుని దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దినకరన్ వెంటనే పార్టీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. గుడియాత్తం ఎమ్మెల్యే కార్యాలయానికి తాళం గుడియాత్తం ఎమ్మెల్యే జయంతి పద్మనాభన్ దినకరన్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ గుడియాత్తం పట్టణ కార్యదర్శి పయణి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆమె దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు కార్యాలయానికి తాళం వేశారు. -
దేనికైనా సిద్ధం
► ప్రభుత్వాన్ని కూల్చం ► ‘అంతా’ ఒక్కటే ► హైజాక్‌కు ప్రయత్నిస్తే.. ఉపేక్షించను ► కేడర్‌ను విస్మరిస్తే.. ఊరుకోను ► తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యేవాడిని ► కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుదాం ► దినకరన్ పలుకులు ► అమ్మ మరణంపై న్యాయ విచారణకు వేడుకోలు ► బల నిరూపణ కేడర్‌ను విస్మరిస్తే.. దేనికైనా సిద్ధం అని సీఎం పళని స్వామి నేతృత్వంలోని మంత్రివర్గాన్ని టీటీవీ దినకరన్ హెచ్చరించారు. అన్నాడీఎంకే గొడుగు నీడలో ఉన్నవాళ్లు అందరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. అయితే, పార్టీని దొడ్డిదారిన హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించనన్నారు. అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో తాను ముందుకు సాగనున్నట్టు తెలిపారు. చిన్నమ్మ తలచుకుని ఉంటే, ఎప్పుడో సీఎం అయ్యే వారని స్పందించారు. జైలుకు వెళ్తూ, తనను సీఎం చేసి ఉండే వారంటూ పేర్కొన్నారు. సాక్షి, చెన్నై : పదవులపై తనకు, తన కుటుంబానికి ఆశ లేదని టీటీవీ దినకరన్ చెప్పారు. దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత చేతుల మీదుగా మహా శక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను రక్షించుకోవడం బాధ్యత అని మదురైలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో పేర్కొన్నారు. అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం చెల్లదంటూ సీఎం పళనిస్వామి నేతృత్వంలోని శిబిరం తేల్చడం ఆ పార్టీలో ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో మదురై వేదికగా సోమవారం సాయంత్రం దినకరన్ ఎంజీయార్ శత జయంతి బహిరంగ సభకు పిలుపునివ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దినకరన్ వెన్నంటి ఎంత మంది ఎమ్మెల్యేల నడవనున్నారు? తదుపరి ఆయన అడుగులు ఎలా ఉంటాయో? అన్న చర్చ బయలుదేరింది. సీఎం పళని స్వామిని గద్దెదించే ప్రయత్నాలు సాగబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. అయితే, వీటన్నింటికి తెరదించుతూ, అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటేనని, అయితే, పార్టీని హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే సహించబోనని దినకరన్ హెచ్చరికలు చేయడం గమనార్హం. అలాగే, ప్రభుత్వాన్ని కూల్చబోమని, అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో బలోపేతం వైపుగా సాగనున్నామన్నారు. అదే సమయంలో కేడర్‌ను ఉపేక్షిస్తే మాత్రం దేనికైనా సిద్ధం అని హెచ్చరించారు. ఎప్పుడో సీఎం అయ్యేవాడిని కరుణానిధిని సీఎంను చేసిన ఘనత ఎంజీయార్‌కే దక్కిందని దినకరన్ వ్యాఖ్యానించారు. అయితే, ఎంజీయార్‌కు కరుణాని«ధి తీవ్ర ద్రోహంచేశారని, అందుకే అన్నాడీఎంకేతో ఆయనకు గట్టి గుణపాఠం చెప్పినట్టు గుర్తుచేశారు. తిన్నింటి వాసాలు లెక్క పెడితే, ప్రజలు ఉపేక్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పరోక్షంగా సీఎం పళని స్వామికి ఈసందర్భంగా హెచ్చరికలు చేశారు. ఎంజీయార్ మరణంతో రెండుగా చీలిన పార్టీని మహాశక్తిగా నిలబెట్టడం అమ్మ జయలలిత ఘనత అని వ్యాఖ్యానించారు. అమ్మ మరణం తదుపరి పరిణామాలను గుర్తుచేస్తూ, త్యాగ తల్లి చిన్నమ్మ శశికళ తలచుకుని ఉంటే, డిసెంబరు ఐదోతేదీ రాత్రే సీఎంగా పగ్గాలు చేపట్టి ఉండేవారని తెలిపారు. ఆమెకు పదవులు ఇష్టం లేదని, అమ్మ ప్రభుత్వం కొనసాగాలన్న కాంక్షతో ఒకర్ని సీఎం చేస్తే, ఆయన మరొకరి(డీఎంకే) చేతిలో ప్రభుత్వాన్ని పెట్టే ప్రయత్నం చేశారని పన్నీరు సెల్వంను ఉద్దేశించి విరుచుకుపడ్డారు. ఈ కుట్రల్ని భగ్నం చేయడం లక్ష్యంగా చిన్నమ్మ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పరిస్థితులు అనుకూలించని దృష్ట్యా, ఆ సమయంలో ప్రమాదవశాత్తుగా పళని సీఎం అయ్యారని ఎద్దేవాచేశారు. ఈ సమయంలో చిన్నమ్మ తలచుకుని ఉంటే, తాను సీఎం అయ్యేవాడినని, అయితే, ఆ ఆశ తనకు గానీ, తన కుటుంబానికి గాని ఎన్నడూ లేదని స్పష్టంచేశారు. అమ్మ మరణంపై న్యాయ విచారణ 30 మంది కలిస్తే పార్టీ కాదు అని, కోటిన్నర మంది మనోగతం ముఖ్యం.. అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎంకు హెచ్చరికలు చేశారు. అమ్మ పాలన కొనసాగుతుందని, ఇది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి తనవల్ల ఎన్నడూ రాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తన వద్దకు వచ్చే ఎమ్మెల్యేలందరూ వారి మదిలోని మనోగతం, ఆవేదనను చెప్పుకుంటున్నారని వివరించారు. అంతేగానీ, తలుపులు మూసుకుని, ఫోర్జరీ సంతకాలు, తీర్మానాల ద్వారా పార్టీని హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించనని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్రంతో స్నేహపూర్వకంగా మెలుగుదామంటూ, ప్రజాహితాన్ని కాంక్షించే పథకాల అమలుతో అమ్మ సుపరిపాలనను అందిద్దామని పిలుపునిచ్చారు. అమ్మ మరణంలో అనుమానాలు అంటూ ఆ పెద్దాయన(పన్నీ రు) డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేస్తూ, ఆయన అభీష్టం మేరకు న్యాయ విచారణకు ఈ ప్రభుత్వం ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు. విచారణకు ఆదేశిస్తే, ముందుగా విచారణను ఎదుర్కొనబోయేది ఆయనేనని, ఈ విచారణలకు తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణ కైనా సిద్ధం అని స్పష్టం చేశారు. కేడర్‌ను అణగదొక్కడం మానుకోండి తమకు పదవుల ఆశ లేదన్న విషయం తెలిసిన కొందరు మూర్ఖులు, ఇప్పుడు తామేదో ప్రమాదాన్ని సృష్టించబోతున్నట్టుగా ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ఆ రోజున కూవత్తురులో చిన్నమ్మ క్యాంప్ పెట్టకుండా ఉండి ఉంటే, ఈరోజు పదవుల్లో ఉండే వారా..? అని పళని సర్కారును ఉద్దేశించి ప్రశ్నించారు. ఓమారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అధికారం చేతిలోకి రాగానే, గర్వం నెత్తికెక్కినట్టుందని, పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంజీయార్ శత జయంతికి తరలి వస్తున్న వాళ్లను అడ్డుకోవడం, ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం బట్టి చూస్తే, ఏమేరకు దిగజారి వ్యవహరిస్తున్నారో అంటూ, ఇదో సిగ్గు చేటుగా అభివర్ణించారు. కోల్పోయిన చిహ్నం కైవశం, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బలోపేతం వైపుగా అడుగులు వేయకుండా, ఆ 30మంది తలుపులు మూసుకుని నిర్ణయాలు తీసుకోవడం శోచనీయమని విమర్శించారు. కేడర్‌కు వ్యతిరేకం, ఎమ్మెల్యేలను అణగదొక్కే రీతిలో వ్యవహరించడం మానుకుంటే మంచిదని మంత్రులకు హితవు పలికారు. కేడర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకోని పక్షంలో తాను దేనికైనా సిద్ధం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తాను ‘420’ అన్న పదాన్ని సంతాకాల విషయంగా ప్రయోగిస్తే, గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టుగా సీఎం పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. -
'మేం తలచుకుంటే సీఎం పదవి ఊడుతుంది'
చెన్నై: అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న తనపై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేయడంపై దినకరన్ స్పందించారు. గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తనను తొలగించే అథికారం పళని స్వామికి లేదని మండిపడ్డారు. ఒకవేళ పదవి తనను నుంచి తొలగించాలనుకుంటే ఆ అధికారం ఒక్క శశికళకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తున్న పళనిస్వామికి శశికళ భిక్ష వల్లే ఆభాగ్యం కలిగిందని ఎద్దేవా చేశారు. తన బృందం ఎన్నికల కమీషన్ దగ్గరికి వెళ్తే పళనిస్వామి ముఖ్యమంత్రి పదవి ఊడుతుందన్నారు. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన పళనిస్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. ఇంకా చదవండి: శశికళ, దినకరన్‌కు షాక్! -
శశికళ, దినకరన్‌కు షాక్!
-
శశికళ, దినకరన్‌కు షాక్!
చెన్నై: దివంగత నేత జయలలిత నెచ్చెలి వీకే శశికళ, ఆమె అక్క కొడుకు దినకరన్‌కు అధికార అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న దినకరన్‌పై సీఎం పళనిస్వామి వర్గం వేటు వేసింది. అన్నాడీఎంకే డీప్యూటీ సెక్రటరీ జనరల్‌గా దినకరన్ ఎన్నిక చట్టవిరుద్ధమంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అన్నాడీఎంకేలో కీలక పునరేకీకరణకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడం, ఆమె వారసుడిగా తెరపైకి వచ్చిన దినకరన్ ఎన్నికల గుర్తు కేసులో అరెస్టవ్వడంతో అధికార అన్నాడీఎంకేలో సమీకరణలు మారిపోయాయి. శశికళ అనుచరుడిగా సీఎం పదవి చేపట్టిన ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ.. అధికార పార్టీని తన అధీనంలో తెచ్చుకున్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో మరో కీలక వర్గంగా మారిన మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్)తో చేతులు కలిపి.. పార్టీని పటిష్ట పరుచుకోవడం, తన అధికారాన్ని సుస్థిరపరుచుకోవడంపై దృష్టి పెట్టారు. అయితే, పళనిస్వామితో చేతులు కలుపాలంటే శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి తొలగించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో కీలకంగా ఉన్న ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన దినకరన్ మళ్లీ అలజడి రేపారు. అన్నాడీఎంకే పార్టీ శశికళదేనని, ఆమె స్థానంలో తానే పార్టీ అధినేతనంటూ ప్రకటనలు ఇచ్చారు. ఆయనకు పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకుంటానని దినకరన్ చేసిన ప్రకటనలు ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ క్రమంలోనే దినకరన్‌పై వేటు వేస్తూ ఈపీఎస్ వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఈపీఎస్-ఓపీఎస్ వర్గాల విలీనానికి మార్గం సుగమం అయినట్టు భావిస్తున్నారు. -
ఇక దినకరన్!
► ఉప కార్యదర్శి ఇంటి వైపు ఎమ్మెల్యేలు ► మంతనాల జోరు .. ఆగస్టు ఐదున నిర్ణయం ► కేంద్రంపై సెటైర్లతో ముందుకు అన్నాడీఎంకేలో విలీన చర్చ మళ్లీ తెర మీదకు వస్తున్ననేపథ్యంలో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ తన తంత్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఆయన మద్దతుదారులతో మంతనాల్లో ఉన్న దినకరన్ ఆగస్టు ఐదో తేదీ నుంచి పార్టీ వ్యవహారాల మీద దృష్టి పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల్ని ఏకం చేయడానికి తగ్గ కసరత్తులు మళ్లీ తెర మీదకు రావడంతో దినకరన్ రంగంలోకి వచ్చారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో పార్టీలో తాజా పరిణామాలు ఎలా ఉంటాయో అనే ప్రశ్న తలెత్తింది. అన్నాడీఎంకే నుంచి తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను ఎప్పుడో బహిష్కరించినట్టుగా అమ్మ శిబిరం మంత్రులు ఆమోదించి ఆరునెలల క్రితం కేంద్రానికి పంపారు. అయితే ఈ తీర్మానం ఇంకా రాష్ట్రపతి ఆమోద దశలోనే నిలబడిపోయింది. ఇదిలా ఉండగానే ఇటీవల విడుదలపై నీట్ పరీక్షా ఫలితాల్లో తమిళనాడు విద్యార్థులు వెనుకబడిపోయి తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రజలతోపాటూ ప్రతిపక్షాలు సైతం మండిపడగా ఎడపాడి ప్రభుత్వాన్ని కుదిపేసింది. నీట్ మినహాయింపు సాధించడం చేతకాకుంటే తప్పుకోమని నటుడు కమల్‌హాసన్ సైతం సవాల్ విసిరారు. నీట్ పరీక్ష విషయంలో రాష్ట్రంలో ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్నందున వైద్యవిద్య సీట్ల భర్తీపై కౌన్సెలింగ్ జరగలేదు. ఈ పరిణామంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయోమయంలో పడిపోయారు. ప్రజల ఆక్రందనలపై స్పందించిన సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ నుంచి హామీ పొందినట్లు సమాచారం. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా జల్లికట్టు మినహాయింపు తరహాలో నీట్ కూడా సాధించుకునేందుకు మోదీ సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఒకటి లేదా రెండేళ్లు మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండగా, ఇక జాప్యం లేకుండా గవర్నర్ ఆమోదించి వెంటనే రాష్ట్రపతికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలో ఒక అధికారిక ప్రకటన వెలువడగలదని ప్రభుత్వం ధీమాతో ఉంది. నీట్ మినహాయింపు కేంద్రం పరిశీలనలో ఉందని ఢిల్లీ నుంచి బుధవారం అర్ధరాత్రి 12.45 గంటలకు చెన్నైకి చేరుకున్న సీఎం ఎడపాడి మీడియాతో చెప్పారు.వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. దినకరన్‌కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. ఆ ఇద్దర్నీ బయటకు సాగనంపినప్పుడే విలీన చర్చలు అంటూ గతంలో పురట్చి తలైవి శిబిరం సైతం స్పష్టం చేసింది. రెండాకుల చిహ్నానికి లంచం కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన అనంతరం దినకరన్ పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు వేయడానికి సిద్ధపడ్డా, మంత్రుల వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. దీంతో అమ్మ శిబిరంలోనే ఎమ్మెల్యేలు రెండుగా చిలీనట్టుగా పరిస్థితి మారింది. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దినకరన్‌తో టచ్‌లో ఉండటమే కాదు, కొత్త సలహాలు, సూచనలు ఇచ్చే పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఇక, దినకరన్ ప్రధాని నరేంద్ర మోదీతో పురట్చి తలైవి శిబిరం నేత పన్నీరు సెల్వం, అమ్మ శిబిరం సీఎం పళని స్వామి వేర్వేరుగా భేటీ సాగించిన విషయం తెలిసిందే. ఈమేరకు వెలువడ్డ సంకేతాల మేరకు ఆ రెండు శిబిరాల మధ్య రాజీ కుదిరినట్టుగా ప్రచారం ఊపందుకుంది. ఆ రెండు శిబిరాలు ఏకం అయ్యేందుకు తగ్గ మార్గం సుగమం అవుతున్న సమయంలో దినకరన్ కొత్త అడుగులతో రంగంలోకి దిగబోతుండటం అన్నాడీఎంకేలో చర్చకు దారితీసింది. దినకరన్ ఇంటి వైపుగా పళని వ్యతిరేక ఎమ్మెల్యేలు కదులుతుండటంతో, వీరి కార్యాచరణ మున్ముందు ఎలా ఉండబోతుందోనన్న ప్రశ్న బయలుదేరింది. ఇప్పటికే దినకరన్‌కు మద్దతుగా ముఫ్పై ఐదు మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండటం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించబోమని, పార్టీ పరంగా దినకరన్ పట్టు సాధించాలన్నదే తమ అభిమతంగా ఆ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తుండాన్ని బట్టి చూస్తే, పళనిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, ఇదివరకు దినకరన్ మంత్రులకు 60 రోజుల గడువు హెచ్చరిక చేసి ఉన్నారు. ఈ గడువు ఆగస్టు ఐదో తేదీన ముగియనుందని, ఆ రోజున దినకరన్ పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టడం ఖాయం అని ఆయన మద్దతు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తుండటం ఆలోచించాల్సిందే. -
ఆ కుటుంబంలో కొనసాగుతున్న వార్
► నేడు చిన్నమ్మ కేసు విచారణ ► శశికళను కలిసిన దినకరన్ కేకేనగర్: అన్నాడీఎంకే పార్టీకి దూరంగా ఉన్న దినకరన్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం చెన్నై బీసెంట్ నగర్‌లోగల తన ఇంట్లో ప్రతి రోజూ మద్దతుదారులతో కలిసి సమావేశాలు జరుపుతున్నారు. తరచూ పరప్పన అగ్రహారినికి వెళ్లి శశికళతో కలిసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు శశికళను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను కలిసినప్పుడు పార్టీలో జరుగుతున్న గందరగోళం, సమస్యల గురించి మాట్లాడేవారని తెలుస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఆరోసారిగా దినకరన్ బెంగళూరు జైలుకు వెళ్లి శశికళను కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో శశికళ దినకరన్‌తో పార్టీ పాలన విషయాల్లో తలదూర్చవద్దని, రాజకీయ విషయమై పర్యటనలు చేయవద్దని హితవు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకనూ మద్దతుదారులతో బహిరంగ సభలు, పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం వంటివి చేయవద్దని శశికళ ఆదేశించినట్లు సమాచారం. 7వ తేదీ విచారణ : తనపై విధించిన శిక్షను రద్దు చేయాలని గత మే నెల 17వ తేదీ శశికళ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణను జూలై 7వ తేదీ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తమ చిన్నమ్మ విడుదల కావాలని ఆమె మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ముంబైలో కూడా ఆమె పేరుతో యాగాలు చేస్తున్నట్లు సమాచారం. శశికళ కుటుంబంతో కొనసాగుతున్న వార్ : టీటీవీ దినకరన్ మాటలను వినకపోవడం ఇంకనూ తన పలుకు బడిని అందరికీ తెలిపే విధంగా మన్నార్‌కుడిలో జూలై 18వ తేదీ ఎంజీఆర్ శతదినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఢిల్లీ జైలు నుంచి విడుదలైన టీటీవీ దినకరన్ పార్టీకి రాకూడదని సీనియర్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా శశికళ తమ్ముడు దినకరన్ మేనమామ అయిన దివాకరన్, దినకరన్ పార్టీలోనికి రాకూడదని తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాడు. ఈనేపథ్యంలో మేనమామను మంచి చేసుకోడానికి దినకరన్ తన మద్దతుదారులను రాయబారానికి పంపినా ఎలాంటి పొత్తు కుదరకపోవడంతో శశికళ కుటుంబంలో వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. -
పళని తంత్రం, దినకరన్ గప్‌చుప్!
► పన్నీరు సందిగ్ధం ► ఇక, ఆ ముగ్గురే తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి నోళ్లకు తాళం వేయడం లక్ష్యంగా సీఎం పళని స్వామి రాజకీయ తంత్రాన్ని ప్రయోగించే పనిలో పడ్డారు. దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు గప్‌చుప్‌మని శనివారం సీఎం ఎదుట కూర్చోవడం ఇందుకు నిదర్శనం. ఇక, వివాదం రాజుకుంటుందని ఎదురుచూసిన పన్నీరు శిబిరం చివరకు సందిగ్ధంలో పడక తప్పలేదు. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విష యం తెలిసిందే. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కదిలారు. చిన్నమ్మ, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదేశాలతో మిగిలిన వాళ్లు సీఎం పళని స్వామి వెన్నంటే ఉన్నా, తదుపరి పరిణామాలతో అక్కడినుంచి జారుకున్న వాళ్లు పెరిగారు. వీరంతా ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పక్షాన చేరారు. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచి మరీ విరుచుకుపడే పనిలో పడ్డారు. ఈ పరిణామాలు కాస్త సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టాయని చెప్పవచ్చు. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో కేంద్రం మెప్పుపొందే రీతిలో పళని స్వామి అడుగులు వేశారు. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. మాజీ సీఎం పన్నీరు కూడా కోవింద్‌కే మద్దతు అన్నారు. అయిష్టంగా దినకరన్ వర్గం కూడా మద్దతు ప్రకటించింది. పళని మార్క్ పాలనపరంగా తన మార్క్ పడే రీతిలో ముందుకు సాగుతున్న పళని స్వామి, పార్టీలోనూ పట్టు సా«ధించే పనిలో ఉన్నారు. అయితే, తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు 34 మంది గళం విప్పడంతో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు రాజకీయ తంత్రాన్ని ప్రయోగించినట్టున్నారు. దినకరన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు అడపాదడపా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా..? అన్నట్టుగా స్పందిస్తుండటంతో రాత్రికి రాత్రే వారి నోళ్లకు తాళం వేయడం గమనించాల్సిన విషయం. చెన్నైలో మద్దతు సేకరణకు వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు తమ గళాన్ని విప్పే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, గప్‌చుప్‌మని కూర్చొని సీఎం పళని స్వామి ప్రసంగాలకు చప్పుట్లు కొట్టి ఆహ్వానించడం విశేషం. అంతా పళని దారికొస్తారా..? దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలను అణచివేసే రీతిలో సీఎం తన తంత్రాన్ని ప్రయోగించడంతోనే వారంతా గప్‌చుప్ అయ్యారని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటుండటం ఆలోచించాల్సిందే. కాగా, కోవింద్ సమక్షంలో దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పతే దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కేంద్రం వద్ద మార్కులు కొట్టే వ్యూహంతో ఉన్న పన్నీరు శిబిరాన్ని ఈ గప్‌చుప్ సందిగ్ధంలో పడేసినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ సీఎం వద్ద శరణు కోరే పరిస్థితులు మున్ముందు వస్తాయని, పన్నీరు శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమ వైపునకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందంటూ ఓ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఆ ముగ్గురు .. తమకు మిత్రపక్షంగా ఉన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు పళని ప్రయత్నాల్లో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనియరసు, తమీమున్ అన్సారీ, కరుణాస్ అన్నాడీ చిహ్నం మీద గెలిచారు. ఈ ముగ్గురు డీఎంకే వైపు తమ చూపును మరల్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వీరు కోవింద్ మద్దతు కార్యక్రమానికి కూడా దూరంగా ఉండటంతో, ఇక, వారిని దారిలో తెచ్చుకునేందుకు పళని తంత్రాన్ని ప్రయోగించబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, తలా ఓ చిన్న పార్టీకి చెందిన ఈ ముగ్గురు తలొగ్గేనా అన్నది వేచి చూడాల్సిందే. -
అన్నాడీఎంకేలో ఇక ఆ రెండు వర్గాలేనా?
చెన్నై: జయలలిత మరణం తరువాత మూడు ముక్కలైన అన్నాడీఎంకే రెండుగా మారనుందా? ఇక ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు మాత్రమే మిగలనున్నాయా? అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిన్నమదురైలో ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాండికోయిల్ సమీపంలోని అమ్మ మైదానంలో భారీ వేదికను నిర్మించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం మదురైకు వచ్చారు. అయితే పార్టీపరంగా జరపాల్సిన ఈ కార్యక్రమాలకు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను ఎడపాడి దూరంగా పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి డబ్బును ఎరవేసి దినకరన్ జైలు పాలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. అయితే బెయిల్‌పై బైటకు వచ్చిన తరువాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం కాగా దినకరన్‌ను దూరం పెట్టారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించారు. అంతేగాక మదురైలోనే పోటీగా మరో భారీ ఎత్తున ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎంజీఆర్ శత జయంతికి హాజరు కాకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, బోస్ సభకు హాజరయ్యారు. దినకరన్ వర్గం ఎడపాడికి దాసోహమైందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ కార్యక్రయం కావడంతో వచ్చామని వారు సమర్థించుకున్నారు. దినకరన్ పేరుతో పేరవై మరోవైపు దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించారు. 54 జిల్లాల నిర్వాహకులను నియమించి వారిని ఆయన స్వయంగా కలిశారు. 50 లక్షల మందిని పేరవైలో చేర్పించాలనేదే తమ లక్ష్యంగా భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లే ముందు దినకరన్, వెంకటేశ్‌లను పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే. దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. అయితే దినకరన్‌కు, ఎడపాడి వర్గాలకు ఘర్షణ ఏర్పడడంతో ఆయన పార్టీ నుంచి కొంత దూరమయ్యారు. హఠాత్తుగా దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించడం దానికి ఒకే రోజు 54 మంది జిల్లా నిర్వాహక కార్యదర్శులను నియమించిన సంఘటన అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది. -
రామ్‌నాథ్‌కే దినకరన్ మద్దతు
చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే ఓటు వేయాలని అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గం నిర్ణయించింది. అన్నా డీఎంకేలో రెండు చీలిక వర్గాలైన సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు రామ్‌నాథ్ కోవింద్‌కే తమ మద్దతను ఇప్పటికే ప్రకటించాయి. వారిద్దరితో విభేదించే దినకరన్ ఆలోచనలో పడ్డారు. అంతేగాక ఓటు కోసం బీజేపీ నుంచి తనను ఎవరైనా కలుస్తారేమోనని ఎదురుచూసి నిరాశ చెంది చివరకు తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్లనే అన్నాడీఎంకేలోని అన్ని వర్గాలు ఎన్డీఏ అభ్యర్థివైపు నిలిచాయని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించారు. -
దినకరన్ దారెటు!
► 34 మంది ఎమ్మెల్యేలతో మంతనాలు ► రాష్ట్రపతి ఎన్నికలపై తర్జనభర్జన ► అన్నాడీఎంకేలో మూడో వర్గం చెన్నై: అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికే ఓటు వేయాలని తీర్మానించిన విషయం తెలిసిందే. మూడో వర్గం నేత దినకరన్ ఎవరికి తన మద్దతును ఇస్తాడనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది. దినకరన్ వైపున్న 34 మంది ఎమ్మెల్యేలు ఎడపాడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండడం ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది. బీజేపీ పట్ల మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతను ప్రకటించారు. కొన్నినెలలు దూరంగా మెలిగి అనేక రాజకీయ పరిణామాల తరువాత కేంద్రం వద్ద సాగిలపడిన సీఎం ఎడపాడి సైతం ఎన్డీఏ అభ్యర్థికి జై కొట్టారు. అన్నాడీఎంకేలో ఇక మిగిలింది టీటీవీ దినకరన్ మాత్రమే. అయితే ఎడపాడి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దినకరన్ వర్గీయులైన 34 మంది ఎమ్మెల్యేలు బలపరిచారా అనేది స్పష్టం కాలేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలో శశికళ నిర్ణయిస్తారని ఈ 34 మంది ప్రచారం చేస్తున్నారు. సీఎం ఎడపాడి తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు శశికళ అనుమతి తీసుకున్నారా అని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తంగతమిళ్‌సెల్వన్, వెట్రివేల్ వ్యాఖ్యానించి తమ అసంతృప్తిని ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో శశికళ ఆదేశాలను శిరసావహిస్తానని ఎమ్మెల్యే, నటుడు కరుణాస్ గురువారం వ్యాఖ్యానించడంతోపాటు దినకరన్‌ను కలుసుకున్నారు. దినకరన్‌కు పిలుపులేకపోవడంతో సీఎం ఎడపాడి ఇచ్చిన ఇఫ్తార్ విందును ఈ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను రెండు రోజుల క్రితం కలిసిన పార్లమెంటు ఉప సభాపతి తంబిదురైతో సీనియర్ మంత్రులు తంగమణి, వేలుమణి గురువారం ఉదయం సమావేశమయ్యారు. పార్టీకి తనను దూరం చేసిన ఎడపాడి అంటే ఏ మాత్రం గిట్టని దినకరన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని విబేధించాలని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీని నిర్ణయాన్ని దిక్కరించి ఎమ్మెల్యేలు ఓటు వేసే పరిస్థితి లేదని వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ వ్యాఖ్యానించినట్లుగా దినకరన్ ఆ సాహసం చేయకపోవచ్చు. అలాగని ఎడపాడి, పన్నీర్ సెల్వం బాటలోనే పయనిస్తే విబేధాలకు అర్థమేలేదని అలోచిస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థికే ఓపీఎస్ మద్దతు: ఎన్డీఎ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కే తమ మద్దతని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటువేయాలనే ఏకైక అజెండాతో అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ వర్గం నేతలతో పన్నీర్‌సెల్వం గురువారం సమావేశమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు ప్రకటించారు. ప్రధానిని కలిసి ఈ నిర్ణయాన్ని తెలియజేసేందుకు పన్నీర్‌సెల్వం గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి సీఎం: అన్నాడీఎంకే (అమ్మ) బలపరుస్తున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను అభినందించేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రత్యేక విమానంలో గురువారం ఢిల్లీ వెళ్లారు. సీఎంతోపాటూ కొందరు మంత్రులు, పార్టీ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. రామ్‌నాథ్‌ను కలవగానే గురువారం రాత్రే సీఎం తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది. -
ఆర్కేనగర్ ఉచ్చు
► ‘కేసు’ మోత మోగేనా? ► సీఈసీ సిఫారస్సు ► ఇరకాటంలో సీఎం సహా ఆరుగురు ► నేడు కోర్టుకు విచారణ ఆర్కేనగర్లో నగదు బట్వాడా వ్యవహారం సీఎం పళని స్వామితో పాటు పలువురు మంత్రులు, అభ్యర్థి దినకరన్ మెడకు ఉచ్చుగా మారేనా.. అన్న ప్రశ్న బయలుదేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో పరిణామాలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల మోత మోగేనా అన్న ఉత్కంఠ బయలుదేరింది. ఇందుకు తగ్గ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సాక్షి, చెన్నై : అమ్మ జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఖాళీ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ స్థానం భర్తీకి ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం హోరెత్తింది. గెలుపు లక్ష్యంగా అన్నాడీఎంకే అమ్మ శిబిరం దినకరన్, పురట్చి తలైవి శిబిరం మధుసూదనన్, ఎంజీయార్, అమ్మ దీప పేరవై దీప, డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్..ఇలా 63 మంది తీవ్రంగానే కుస్తీ పట్టారు. అయితే, దినకరన్ తన అధికార, ధన బలాన్ని ప్రయోగించడం కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఆగ్రహాన్ని రేపింది. ఐటీ దాడుల్లో లభించిన ఆధారాలు సీఈసీ టేబుల్‌కు చేరాయి. నియోజకవర్గంలో ఓటుకు నోటు తాండవం చేసినట్టుగా ఆధారాలతో నిరూపితం కావడంతో రాత్రికి రాత్రే ఉప ఎన్నిక రద్దయ్యింది. ఇంతవరకు అన్నీ బాగానే సాగినా, తదుపరి పరిణామాలతో దినకరన్ ఓ జట్టుగా, సీఎం పళనిస్వామి మరో జట్టుగా అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో కొనసాగే పరిస్థితి నెలకొంది. అలాగే, రెండాకుల చిహ్నం కోసం లంచం ఇవ్వడానికి ప్రయత్నించి కటకటాల్లోకి సైతం దినకరన్ వెళ్లి రాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్కేనగర్ నగదు బట్వాడా ఉచ్చు ప్రస్తుతం అందరి మెడకు ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న తప్పడం లేదు. ఇందుకు తగ్గ పరిణామాలు చక చకా సాగుతున్నాయి. కేసు మోత మోగేనా చెన్నైకు చెందిన న్యాయవాది వైరకన్ను సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్ నగదు బట్వాడాలో ఎలాంటి చర్యలు తీసుకున్నారోనని సీఈసీని వివరాలు రాబట్టే యత్నం చేశారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో నగదు బట్వాడాపై పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. సమాచార హక్కు చట్టం మేరకు ఆయన కోరిన సమాచారాన్ని సీఈసీ అందజేసింది. ఇందులో పేర్కొన్న వివరాల మేరకు సీఎం పళనిస్వామి, మంత్రులు సెంగోట్టయన్, విజయభాస్కర్, సెల్లూరు రాజు, తంగమణి, వేలుమణి, అభ్యర్థి దినకరన్ మీద కేసు నమోదుకు సిఫారసు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఇందుకు తగ్గ అధికారిక సమాచారం ఏ అధికారికి సీఈసీ నుంచి రానట్టు తెలిసింది. ఒకవేళ సీఈసీ సిఫారసు చేసి ఉన్నా, దానిని తుంగలో తొక్కినట్టు స్పష్టం అవుతోంది. న్యాయవాది వైరకన్నుకు మాత్రం తమ సమాచారంలో పూర్తి వివరాలను అందజేసి ఉండడం గమనార్హం. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానున్న దృష్ట్యా, సమగ్ర వివరాలను బెంచ్ ముందు ఉంచే అవకాశాలున్నాయి. సీఈసీ సిఫారసు సమాచారంతో సీఎంతో పాటు మంత్రులు, దినకరన్‌పై కేసుల్ని నమోదు చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టే పనిలో ఉండడం గమనార్హం. ఈ విషయంగా డీఎంకే కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సిఫారసు మేరకు కేసుల్ని నమోదు చేయాల్సిందేని, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పురట్చి తలైవి శిబిరం ఎమ్మెల్యే పాండిరాజన్ పేర్కొంటూ, సీఈసీ కేసు నమోదుకు సిఫారసు చేయడం ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, హైకోర్టులో సాగే విచారణ మేరకు కేసుల మోత మోగేనా లేదా, వాయిదాల పర్వం సాగేనా..అన్నది వేచి చూడాల్సి ఉంది. -
చిన్నమ్మ ఉపదేశం
► ఐక్యత కోసం బంధువులకు లేఖాస్త్రం ► ఒకే వేదికగా దినకరన్, దివాకరన్ ► ఆధిపత్యానికి పళని పావులు ► దినకరన్‌కు చెక్ పెట్టే యోచన సాక్షి, చెన్నై: మనం.. మనం తన్నుకుంటే.. లాభం కమలం పెద్దలకు, సీఎం పళనికి మాత్రమేనన్న విషయాన్ని గ్రహించాలని బంధు జనానికి, కుటుంబీకులకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఐక్యతతో ముందుకు సాగాలన్న శశికళ పిలుపునకు ఆమె సోదరుడు దివాకరన్ స్పందించినట్టున్నారు. దినకరన్‌తో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక.. దినకరన్‌కు చెక్ పెట్టడం లక్ష్యంగా సీఎం పళనిస్వామి పావులు వేగంగానే కదుపుతున్నారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాల ఎపిసోడ్ రాజకీయ ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు ఇంటిపోరు, మరోవైపు ముడుపుల వ్యవహారం వెరసి సీఎం పళని స్వామి ఇరకాటంలో పడే పరిస్థితి. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి మద్దతిచ్చే యోచనతో పళని దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని తనకు ఆదేశాలు పంపిన ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌కు చెక్‌పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఈనెల 21న పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరగాల్సిన ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మైనారిటీ విభాగం నేత, ఎంపీ అన్వర్ రాజకు పళనిస్వామి అప్పగించడం గమనించాల్సిన విషయం. పార్టీ వ్యవహారాల్లో దినకరన్ తలదూర్చేందుకు వీలు లేని రీతిలో పళని తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే మద్దతు బీజేపీకి అన్న విషయాన్ని స్పష్టంచేస్తూ, పార్టీ తరపున ఒకటి రెండు రోజుల్లో ముందుగానే అధికారిక ప్రకటన చేయించేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ విప్ ముందుగా జారీ అయిన పక్షంలో, తలా ఓ దిక్కుగా ఉన్న ఎమ్మెల్యేలు ధిక్కరించరని పళనిస్వామి ధీమాగా ఉన్నారని చెప్పవచ్చు. లేఖాస్త్రం సీఎం పళని స్వామి దూకుడు పెంచడంతో బంధు జనాన్ని ఒకే వేదిక మీదకు తెచ్చే బాధ్యతను పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ శశికళ తన భుజాన వేసుకున్నట్టున్నారు. అక్కడి నుంచి బంధు జనానికి లేఖాస్త్రం సంధించి ఉన్నారు. ఇందులో మనం.. మనం తన్నుకుంటే, లాభం ఢిల్లీలోని కమలం పెద్దలకు, రాష్ట్రంలోని సీఎం పళని స్వామికి మాత్రమేనన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందుకే కాబోలు ఇన్నాళ్లు శశికళ సోదరుడు దివాకరన్ చెప్పినట్టుగా ఆడుతున్న ఎమ్మెల్యేలు పలువురు దినకరన్‌కు మద్దతుగా శనివారం పెదవి విప్పారు. ఈ ఇద్దరు ఇక ఏమైనట్టేనని, పళనిని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగడం తథ్యమన్న ధీమాను దివాకరన్, దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇక, దినకరన్‌కు మద్దతుగా మరో ఎమ్మెల్యే కదలడంతో సంఖ్య 35కు చేరింది. మద్దతుదారులతో శనివారం కూడా సుదీర్ఘ చర్చలో దినకరన్ మునిగినా, సాయంత్రం బ్రేక్ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వాన్ని కూల్చే విధంగా తమ ప్రయత్నాలు ఉండబోదని, దినకరన్‌కు పార్టీ వ్యవహారాల అప్పగింత లక్ష్యంగా ఒత్తిడి పెంచనున్నామని ఆయన మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు. -
‘దినకరన్ బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు’
చెన్నై: తనను టీటీవీ దినకరన్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ముందునుంచి పార్టీ కోసం పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యవర్గమంతా జయవారసురాలిగా పార్టీని తన చేతుల మీదుగా నడపాలని కోరుకుంటున్నారని, పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు తనకే రావాలని భావిస్తున్నారని చెప్పారు. శనివారం ఉదయం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆమె ‘ముందు నుంచే పార్టీకి మూలంగా ఉన్న నాయకత్వమంతా కూడా నాతోనే ఉంది. అమ్మ వారసత్వాన్ని నేనే కొనసాగించాలనే మద్దతు నానాటికీ పెరుగుతోంది. జనరల్ సెక్రటరీగా నాకు మద్దతు భారీగా ఉంది. అయినప్పటికీ తనకే మద్దతు ఉన్నట్లు దినకరన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. నన్ను బెదిరిస్తున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ దీపా జయకుమార్ చెప్పారు. -
దక్కని అనుగ్రహం
► కమలం పెద్దల అనుమతి నిరాకరణ ► చెన్నైకు దినకరన్ ► మద్దతు దారులతో భేటీ ► 33కు చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ► పన్నీరుపై పళని వ్యంగ్యాస్త్రం ► నేడు మద్దతుదారులతో పన్నీరు భేటీ ► పది మంది ఎమ్మెల్యేల కొత్త నినాదం ► ఎయిమ్స్ మంజూరు చేయకుంటే రాజీనామా ► కేంద్రానికి మదురైలో హెచ్చరికలు సాక్షి, చెన్నై: బీజేపీ పెద్దల అనుగ్రహం టీటీవీ దినకరన్‌కు దక్కలేదు. నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్న ఆయన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు సంఖ్య తాజాగా 33కు చేరింది. ఇక, విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంపై సీఎం పళనిస్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విలీనంపై నిర్ణయం తీసుకునేందుకు పన్నీరు సెల్వం ఆదివారం మద్దతుదారుల భేటీకి పిలుపునివ్వడం గమనార్హం. కాగా మదురైకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. మదురైకు ఏయిమ్స్ మంజూరు చేయని పక్షంలో రాజీనామా చేస్తామని కేంద్రానికి హెచ్చరికలు పంపించారు. అన్నాడీఎంకే ఎపిసోడ్లో సాగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కంటూ ఓ గ్రూపు సిద్ధం చేసుకున్న ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఢిల్లీ పెద్దల అనుగ్రహం కోసం ప్రయత్నించి ఢీలా పడ్డారు. రెండు రోజులు ఢిల్లీలో తిష్ట వేసినా కమలం పెద్ద అనుమతి దక్కని దృష్ట్యా, నిరుత్సాహంతో శనివారం చెన్నైకు చేరుకున్నారు. వచ్చి రాగానే, తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు సెంథిల్ బాలా జి, పళనియప్పన్ ఈ భేటీకి హాజరయ్యారు. నిన్నటి వరకు 32గా ఉన్న మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య తాజాగా 33కు చేరింది. ఒట్ట పిడారం ఎమ్మెల్యే సుందరరాజన్ దినకరన్‌కు జై కొట్టారు. ఇక, ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అమ్మ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్‌ను ఉద్దేశించి జయలలిత మేన కోడలు, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవై నేత దీప ఆరోపించారు. దినకరన్‌కు మున్ముందు సంకట పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. శశికళ కుటుంబానికి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. విలీనంలో నాన్చుడు : విలీనం విషయంలో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్న మాజీ సీఎం పన్నీరు సెల్వంను ఉద్దేశించి సీఎం పళనిస్వామి పెదవి విప్పారు. సింహం, పులి, నక్క, తోడేలు అంటూ...మాతృగూటికి రావడానికి ఎందుకింత నాన్చుడు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక, సీఎంపై ఎదురు దాడి చేస్తూ పన్నీరు శిబిరం నేత మధుసూదనన్ స్పందించారు. ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ఇంటి మెట్లు ఎక్కుతుంటే, వారించకుండా మౌనం వహించడం ఎందుకో అని ప్రశ్నించారు. నిజంగా దినకరన్‌ను బహిష్కరించి ఉంటే, ఆయన్ను కలిసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. అలాగే, మంత్రి జయకుమార్ నోటికి కల్లెం వేస్తే శ్రేయస్కరం అని హితవు పలికారు. ఇదిలా ఉండగా, విలీనం విషయంగా నిర్ణయాన్ని తీసుకునేందుకు పన్నీరు సిద్ధమైనట్టున్నారు. ఇందు కోసం ఆదివారం వేలప్పన్ చావడిలోని ఓ హాల్ వేదికగా మద్దతు నేతల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా నినాదం : బలం పెంపునకు దినకరన్, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు పళని, కుర్చీ కైవసానికి పన్నీరు ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో మదురై జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కొత్త నినాదం అందుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అటు కేంద్రానికి, ఇటు తమ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా కొత్త నినాదంతో రాజీనామా హెచ్చరికలు చేయడం గమనార్హం. తంజావూరు చెంగి పట్టిలో ఎయిమ్స్ ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే, మదురైలో ఏర్పాటుకు తొలుత నిర్ణయించిన ఎయిమ్స్ ఆసుపత్రి తంజావూరుకు తరలుతున్నట్టుగా వచ్చిన సమాచారంతో ఎయిమ్స్ సాధన లక్ష్యంగా రాజీనామా నినాదాన్ని పది మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందుకోవడం, ఈ ప్రకటనను స్వయంగా రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ చేయడం గమనించాల్సిన విషయం. -
కోర్టుకు దినకరన్
► చార్జ్‌షీట్ దాఖలు ► ఇక, సాక్షుల వద్ద విచారణ ► సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారు ► టీటీవీ వ్యాఖ్య సాక్షి, చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనపై అభియోగం మోపుతూ ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల్ని విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించినట్టుగా కోర్టు ముందు దినకరన్ వాదన వినిపించారు. టీటీవీ దినకరన్‌పై విదేశీ మారక ద్రవ్యం కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టులో సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో తాజాగా, కేసు విచారణ వేగాన్ని న్యాయమూర్తి మలర్మతి పెంచారు. విచారణకు దినకరన్ తొలుత హాజరైనా తదుపరి గైర్హాజరయ్యారు. ఇందుకు కారణం రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పరిమితం చేయడమే. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడంతో గురువారం విచారణ నిమిత్తం ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు దినకరన్.. ఉదయం న్యాయమూర్తి మలర్మతి ఎదుట విచారణకు దినకరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ వర్గాలు ఆయన మీద అభియోగం మోపుతూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారని, తనపై అభియోగాలు మోపుతున్నారని పేర్కొంటూ దినకరన్ న్యాయమూర్తి ఎదుట తన వాదన వినిపించారు. ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి ప్రశ్నించారు. సాక్షులను ప్రవేశ పెట్టాలని సూచించారు. అయితే, ప్రస్తుతం సాక్షులు రాలేదని, సమయం కేటాయించాలని కోరారు. దీంతో ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల వద్ద విచారణ సాగుతుందంటూ తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. కోవైకు సుఖేష్: టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులకు అడ్డంగా బుక్ చేసిన బ్రోకర్ సుఖేష్ చంద్ర శేఖర్‌ను గురువారం కోయంబత్తూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోయంబత్తూరు గణపతి శివశక్తి కాలనికి చెందిన బాలకృష్ణ కుమారుడు రాజవేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుఖేష్ చంద్ర శేఖర్, అతడి తండ్రి చంద్రశేఖర్‌ల మీద మోసం కేసు నమోదై ఉంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన ఈ ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చారు. చంద్ర శేఖర్ విచారణకు హాజరవుతుండగా, సుఖేష్ పత్తా లేకుండా పోయాడు. ఢిల్లీ పోలీసులు రెండాకుల చిహ్నం కేసులో అతడ్ని అరెస్టు చేయడంతో కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి రాజ్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. సుఖేష్‌ను ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో గట్టి భద్రత నడుమ సుకేష్‌ను ఢిల్లీకి రైల్లో తరలించారు. -
అన్నాడీఏంకేలోకి విజయశాంతి?
- జైలులో శశికళతో ములాఖత్ రహస్యమిదే! - దినకరన్ సూచనతో వడివడిగా అడుగులు - రజనీకాంత్ కంటే ముందే లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఇదిగో వస్తా.. అదిగో వస్తా..’ అంటూ పొలికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రజనీకాంత్ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ఒకప్పుడు తెలంగాణలో తనకంటూ ప్రత్యేక ఉనికిని చాటుకున్న ఆమె.. తాజాగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న శశికళతో ఇటీవలే ములాఖాత్ అయిన విజయశాంతి.. మరికొద్దిరోజుల్లో అన్నాడీఎంకేలో చేరబోతున్నట్లు తెలిసింది. జయలలిత మరణానంతరం చెన్నైలో ప్రత్యక్షమైన విజయశాంతి.. ఆర్కేనగర్ ఉపఎన్నికలో టీటీవీ దినకరన్ తరఫున ప్రచారం చేశారు. సినీనటిగా విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. రజనీకాంత్ పొలికట్ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్ వ్యూహంగా కనిపిస్తోంది. శశికళతో ములాఖత్ ఈనెల 5న దినకరన్ బెంగళూరుకు వెళ్లి శశికళను కలుసుకున్నారు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లోనే విజయశాంతి సైతం చిన్నమ్మతో ములాఖత్ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఇద్దరూ పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దినకరన్ సూచన మేరకు శశికళ.. విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. నటిగా జనాకర్షణ, మహిళా నేత ఉంటే పార్టీని కట్టడి చేయడం సులభం అవుతుందని చిన్నమ్మ, దినకరన్ అంచనా వేసినట్లు పార్టీ వర్గాల కథనం. బీజేపీతో మొదలై.. నటిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి ‘లేడీ అమితాబ్ బచ్చన్’ అనే బిరుదును పొందిన విజయశాంతి.. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. నేటి సీఎం కేసీఆర్ అప్పట్లో విజయశాంతికి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చి గౌరవించారు. అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం (2014 ఎన్నికల సమయంలో) విజయశాంతి అనూహ్యంగా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలోచేరి ఓటమిపాలై రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ జయలలిత మరణానంతరం చెన్నైలో సందడిచేశారు. -
ఆ పార్టీలో మూడు స్తంభాలాట!
♦ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు ♦ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఎడపాడి పాట్లు ♦ ఎడపాడి, దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గాల పోరు సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ కనుసైగకు కట్టుబడి క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన అన్నాడీఎంకే మూడు స్తంభాలాటలా మారింది. సీఎం ఎడపాడి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, టీటీవీ దినకరన్‌ల ఆధిపత్యపోరుతో పార్టీ అట్టుడికిపోతోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా ముఖ్యమంత్రి కావాలన్న దినకరన్ కలలు ఫలించలేదు. పైగా తీహార్ జైలు జీవితం గడిపి బెయిల్‌పై వచ్చిన దినకరన్ అధికార పార్టీ నేతలపై తన రాజకీయకసిని ప్రదర్శిస్తున్నారు. ఎడపాడి ప్రభుత్వాన్ని కూల్చివేయడమే ప్రధాన లక్ష్యంగా పావులుకదుపుతున్న దినకరన్ బుధవారం నాటికి 31 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగారు. శశికళే తమ ప్రధాన కార్యదర్శి అని మంత్రి రాజేంద్రబాలాజీ బుధవారం వ్యాఖ్యానించారు. కొందరు మంత్రులు దినకరన్‌కు మద్దతుగా సీఎంపై బహిరంగ విమర్శలు చేశారు. దినకరన్‌ను బహిష్కరించినట్లు ప్రకటించడం ద్వారా అన్నాడీఎంకేలో కల్లోలానికి మంత్రి జయకుమార్ ప్రధాన కారకుడని పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ ఆరోపించారు. ప్రజలకు, పార్టీకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరుగాక పుదుచ్చేరీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు జై కొడుతున్నారు. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడిన సీఎం ఎడపాడి తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దినకరన్‌ను తీవ్రంగా విభేదించే శశికళ తమ్ముడు దివాకరన్ను చేరదీయడం ద్వారా అతనివైపున్న మంత్రుల మద్దతు కూడగట్టగలిగారు. అంతేగాక ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసే వరకు తన ప్రభుత్వానికి ఎటువంటి డోకా ఉండదని ఎడపాడి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే తనవంతు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పన్నీర్‌సెల్వంతో చేతులు కలపడం ద్వారా దినకరన్ ఢీకొట్టాలని సీఎం భావిస్తున్నారు. విలీనం చర్చలను మరోసారి ముందుకు తెచ్చారు. శశికళకు ఉద్వాసన పలికి సాధారణ సభ్యత్వం, దినకరన్ బహిష్కరణ, శశికళ తీసుకున్న నిర్ణయాలు రద్దు, వేటుపడిన నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, పన్నీర్‌సెల్వంకు పార్టీ పగ్గాలు, సీఎంగా ఎడపాడి కొనసాగడం వంటి కొత్త ఒప్పందాలకు ఇరువర్గాలు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశించాలన్న పన్నీర్‌వర్గం డిమాండ్‌పై ఇంకా స్పష్టత లేదు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం, దినకరన్‌ల మధ్య మూడు స్తంభాలాటలా సాగుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ జోక్యం వల్లనే అన్నాడీఎంకే మూడు ముక్కలైందని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ విమర్శించగా, మెజార్టీ ఎమ్మెల్యేల బలం కోల్పోయిన సీఎం ఎడపాడి రాజీనామా చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ అన్నారు. దినకరన్‌ను కలుసుకున్న నటి విజయశాంతి: ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపుకోసం ప్రచారం చేసిన నటి విజయశాంతి బుధవారం చెన్నైకి వచ్చి ఆయన్ను కలుసుకున్నారు. దినకరన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని అన్నారు. -
ములాఖత్
► చిన్నమ్మతో టీటీవీ మంతనాలు ► వెన్నంటి పది మంది ఎమ్మెల్యేలు ► ముగ్గురు ఎంపీలు ► మంత్రుల అత్యవసర భేటీ ► సీఎంతో సంప్రదింపులు ► టీటీవీని ఎప్పుడో బహిష్కరించామని ప్రకటన అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో సోమవారం రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. పది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో కలసి బెంగళూరుకు దినకరన్ పయనం కావడం ఉత్కంఠను రేపింది. అదే సమయంలో మంత్రులు సచివాలయంలో ఏకం కావడం చర్చకు దారి తీసింది. చివరకు విలీనం నినాదాన్ని చిన్నమ్మ శశికళ అందుకోవడం, 60 రోజుల గడువు నిర్ణయించడంతో.. ఇది సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది. సాక్షి, చెన్నై: జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలుకు పరిమితం అయ్యారు. రెండాకుల గుర్తు కోసం లంచం కేసులో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ చిన్నమ్మ బాటలో కారాగారం అనుభవించక తప్పలేదు. ఈ సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి అన్నీ తానై సీఎం పళని స్వామి ముందుకు సాగారు. మాజీ సీఎం పన్నీరు నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరాన్ని అమ్మ శిబిరంలోకి విలీనం చేయడం లక్ష్యంగా ప్రయత్నాలు చేసి, చివరకు కేంద్రం మన్ననలతో తన మార్కు పాలన మీద దృష్టి పెట్టారు. తాజాగా జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన దినకరన్ మళ్లీ పార్టీలో తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధం కావడం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మంత్రులు జీర్ణించుకోలేకున్నారు. అన్ని సజావుగా సాగుతున్న వేళ దినకరన్ అవసరమా అన్న నిర్ణయానికి వచ్చారు. తనకు వ్యతిరేకంగా మంత్రులు గళం విప్పడంతో దినకరన్ స్వరం పెంచే పనిలో పడ్డారు. చిన్నమ్మ శశికళతో ములాఖత్ అయ్యేందుకు సిద్ధం అయ్యారు. చిన్నమ్మతో ములాఖత్: చిన్నమ్మతో ములాఖత్‌కు దినకరన్ సిద్ధం కావడంతో ఆయన వెన్నంటి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు బెంగళూరుకు కదలడం ఉత్కంఠకు దారి తీసింది. ఇందులో వెట్రివేల్(పెరంబూరు), ఇన్భదురై(రాధాపురం), తంగతమిళ్ సెల్వన్(ఆండిపట్టి), ఎస్టీకే జగ్గయ్యన్, కదిర్ గామం, సుబ్రమణ్యన్, జయంతి షణ్ముగనాథన్, పార్తీబన్, సెల్వ మోహన్ దాసు, పళనియప్పన్ ఉన్నారు. మరో ముగ్గురు ఎంపీలు సైతం వెన్నంటి సాగారు. అక్కడక్కడ దినకరన్‌ను ఆహ్వానించే రీతిలో మద్దతుదారులు హోరెత్తడంతో అమ్మ శిబిరంలో ఉత్కంఠను మరింతగా రేపింది. అక్కడక్కడా మీడియాతో మాట్లాడిన దినకరన్ తనను తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని, మంత్రులు కొందరు తనను చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. ఓ మంత్రి(జయకుమార్) అయితే ఆయనే ప్రధాన కార్యదర్శి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా విమర్శిస్తూ ముందుకు సాగారు. మంత్రుల మంతనాలు: తమను గురి పెట్టి దినకరన్ మాటల తూటాలను పేల్చడంతో 20 మంది మంత్రులు ఏకం అయ్యారు. ఆర్థిక మంత్రి జయకుమార్ ఛాంబర్లో గంటకు పైగా మంతనాల్లో మునిగారు. సచివాలయం మంత్రి ఛాంబర్ పార్టీ కార్యాలయంగా మారిందా అన్నట్టుగా చర్చ సాగింది. తదుపరి సీఎం వద్దకు మంత్రులు ఉరకలు తీశారు. సిఎంతో భేటీ అనంతరం జయకుమార్ నేతృత్వంలో మంత్రులందరూ మీడియా ముందుకు వచ్చారు. జయకుమార్ ఒక్కరే మాట్లాడగా, మిగిలినవారు మౌనంగా తల ఊపుతూ కనిపించడం గమనార్హం. ఏప్రిల్ 17వ తేదీ టీటీవీ దినకరన్‌ను, ఆయనకు సంబంధించిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయానికి కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు ఆ రోజు తాను వైదొలగుతున్నట్టు ప్రకటించిన దినకరన్, ఇప్పుడు మళ్లీ పార్టీ పరంగా జోక్యం చేసుకోవడానికి సిద్ధం కావడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాన్నారు. పళని స్వామి నేతృత్వంలో ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలు చక్కగా సాగుతున్నాయని, అమ్మ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం లక్ష్యంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. టీటీవీ దినకరన్‌తో పార్టీ పరంగా ఎలాంటి సంబంధాలు వద్దంటూ ఆయన వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు హితవు పలకడం గమనార్హం. చిన్నమ్మ గడువు : మంత్రులు ఓ వైపు తనకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచిన నేపథ్యంలో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో చిన్నమ్మ శశికళతో దినకరన్ ములాఖత్ అయ్యారు. అక్కడ చిన్నమ్మ ఇచ్చిన సందేశం ఏమిటో గానీ, ములాఖత్ అనంతరం తన మద్దతు ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఈ భేటీ అనంతరం అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం లక్ష్యంగా చిన్నమ్మ 60 రోజుల పాటు గడువు నిర్ణయించారని దినకరన్ ప్రకటించారు. అప్పటికీ వీలీనం అన్నది సాగని పక్షంలో చిన్నమ్మ కీలక నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించడంతో విలీనం సాధ్యమేనా అన్న ప్రశ్న బయల్దేరింది. ఇది వరకు సాగిన విలీనం ప్రయత్నాలు వివాదాలు, చర్చలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి, అన్నాడీఎంకేకు నేతృత్వం అన్నది ఎవరు వహించాలో అన్న నినాదంతో కేడర్ మద్దతు లక్ష్యంగా పన్నీరు సెల్వం రాష్ట్ర పర్యటనలో ఉండడం ఆలోచించ దగ్గ విషయం. గడువులోపు విలీనం సాగని పక్షంలో చిన్నమ్మ నిర్ణయం ఎలా ఉంటుందో, దినకరన్ తదుపరి కర్తవ్యం ఏమిటో అన్నది వేచి చూడాల్సిందే. దినకరన్ మద్దతు నాయకులు నాంజిల్ సంపత్ అయితే మంత్రుల తీరుపై తీవ్రంగా విరుచుకు పడడం గమనార్హం. -
టీటీవీ దూకుడు
► మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు ► నలుగురు మంత్రులపై వేటుకు పట్టు ► నేను ఎవ్వరికీ శత్రువుని కాను: దినకరన్ వ్యాఖ్య సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో టీటీవీ స్వరం పెరుగుతోంది. ఉప ప్రధాన కార్యదర్శికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు కదిలారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఏకంగా పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలన్న నినాదంతో టీటీవీకి మద్దతుగా స్పందించారు. అలాగే, టీటీవీకి వ్యతిరేకంగా స్పందిస్తున్న నలుగురు మంత్రుల్ని పదవుల నుంచి తక్షణం తొలగించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ జైలు జీవితం అనంతరం స్వరాన్ని పెంచారు. బెయిల్ మీద శనివారం చెన్నైలో అడుగుపెడుతూ, వచ్చేస్తున్నా... పార్టీ వ్యవహారాల మీదే ఇక దృష్టి అని ప్రకటించారు. బహిష్కృత నేతకు పార్టీలో ఇక, పని ఏమిటంటూ స్పందించే వాళ్లూ ఆ శిబిరంలో పెరిగారు. అదే సమయంలో తనను ఎవరు తొలగించారు... తొలగించే అధికారం చిన్నమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు తప్ప,..మరెవ్వరికీ లేదంటూ దినకరన్ స్పందించడం ఆ శిబిరంలో ఉత్కంఠను రేపింది. తన స్వరాన్ని పెంచుతూ టీటీవీ దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారు. దీంతో ఆయనకు మద్దతుగా అమ్మ శిబిరంలో కదిలే వాళ్లు పెరుగుతున్నారు. ఇన్నాళ్లు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు టీటీవీ గొడుగు నీడకు చేరే పనిలో పడ్డారు. ఆదివారం 20 మంది ఎమ్మెల్యేలు టీటీవీతో భేటీ సంకేతాలు చర్చకు దారి తీశాయి. ఇందులో ఎమ్మెల్యేలు బోసు, తంగ తమిళ్ సెల్వన్, సుబ్రమణియన్, ఎంపీ నాగరాజ్ అయితే, మరింత దూకుడు పెంచారు. పళనికి వ్యతిరేకంగా, టీటీవీకి మద్దతుగా బహిరంగంగానే స్పందించడం గమనార్హం. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలని వ్యాఖ్యానిస్తూ, ఇందుకు సమర్థుడు దినకరన్ అన్న నినాదాన్ని అందుకోవడం గమనించాల్సిన విషయం. అలాగే, దినకరన్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి స్పందిస్తున్న నలుగురు మం త్రుల్ని పదవి నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మరి కొందరు మద్దతుదారులు నినాదాన్ని అందుకున్నారు. ఈ మంత్రుల్లో జయకుమార్, సెంగోట్టయన్, తంగమణి, ఎస్పీ వేలుమణి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. ఇక, టీటీవీ మద్దతుదారుల నోళ్లకు తాళం వేస్తూ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబిదురై పేర్కొంటూ, పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో అన్నది గతం అని, ఇక, అందుకు ఆస్కారం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అమ్మ జయలలిత చేతిలో ఉన్నప్పుడు ఆనందించామని, చిన్నమ్మ వస్తారని ఎదురు చూశామని, అయితే, ఇక, ఆ చాన్స్ మరెవ్వరికీ ఉండబోదని స్పష్టం చేశారు. సీఎం పళనిస్వామి పాలన తీరు అభినందనీయమని కొనియాడడం గమనించాల్సిన విషయం. నేను ఎవరికీ శత్రువుని కాను : మద్దతుదారుల నినాదం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వూ్యలో టీటీవీ దినకరన్ స్పందించారు. తాను ఎవ్వరికీ శత్రువును కాను అని, శత్రువుల్ని కూడా మిత్రులుగానే తాను చూస్తానని వ్యాఖ్యానించారు. రెండాకుల చిహ్నం పరిరక్షణ, పార్టీ బలోపేతం లక్ష్యంగా విలీనం నినాదం తెర మీదకు వచ్చిన సమయంలో ఓ మూలన ఒదిగి ఉంటాననే అర్థంతో తాను ఇది వరకు స్పందించడం జరిగిందన్నారు. అంతే గానీ, పార్టీ నుంచి తాను తప్పుకున్నట్టు కాదు అని, తనను తప్పించే అధికారం ఎవ్వరికీ లేదని, తనను తప్పించాలంటే, ఆ అధికారం ఒక్క ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కొందరు మిత్రులు విలీన నినాదంతో చేసిన వ్యాఖ్యలను నిశితంగానే పరిశీలించానని, అయితే, వాళ్లు ఒరగబెట్టిందెమిటోనని నలుగురు మంత్రుల్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ పరిరక్షణ, బలోపేతం లక్ష్యంగా తాను మళ్లీ రంగంలోకి దిగుతున్నానని, కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నట్టు తెలిపారు. పార్టీలో ఉన్న వారందరూ దివంగత నేతల ఆశయ సాధన లక్ష్యంగా శ్రమిస్తున్న వాళ్లేనని, అందరూ పార్టీ సేవకులేనని పేర్కొన్నారు. పార్టీలో తనను ఎవరూ ఏమి చేయలేరని, అనలేరని, ఎవరినీ ఎదురు చూడడం లేదని, చిన్నమ్మ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, ముందుకు సాగబోతున్నట్టు తెలిపారు. ఇక, అమ్మ శిబిరంలో సాగుతున్న పరిణామాలపై అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ, శశికళ నియామకమే చెల్లనప్పుడు, ఇక, దినకరన్ నియామకం ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఎవరు పార్టీని నడిపించాలోనన్నది కేడర్ తేలుస్తారని వ్యాఖ్యానించారు. -
సీడీ ఇస్తే ఆలోచిస్తా: దినకరన్
న్యూఢిల్లీ: రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆడియో రికార్డింగ్స్ సీడీ కాపీ ఇవ్వాలని ప్రత్యేక కోర్టుకు అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మొర పెట్టుకున్నారు. దినకరన్ స్వర నమూనా సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్, ఇతరులతో దినకరన్ టెలిఫోన్లో జరిపిన సంభాషణలకు సంబంధించిన సీడీ నకలును ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు జడ్జి పూనమ్ ఛౌదరిని కోరారు. స్వర నమూనా ఇవ్వాలా లేదా అనేది సీడీ పరిశీలించిన తర్వాత చెబుతామని దినకరన్ నిర్ణయం తీసుకుంటారని కోర్టుకు ఆయన తరపు లాయర్ తెలిపారు. స్వర నమూనా తిరస్కరించే హక్కు నిందితులకు ఉందని సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఉన్నాయి. దినకరన్, చంద్రశేఖర్ స్వర నామూనాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న కోర్టు విచారించనుంది. మల్లికార్జున బెయిల్ పిటిషన్ కూడా అదే రోజు విచారణకు రానుంది. కాగా, దినకరన్, ఆయన సన్నిహితుడు మల్లికార్జున, హవాలా ఆపరేటర్ నాథూ సింగ్‌లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు హాజరు పరిచారు. వీరికి విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 29 వరకు పొడిగించింది. -
అన్నీతానై..
► సీఎం భుజస్కంధాలపై పార్టీ ► చిన్నచూపు చూస్తున్నారని చిన్నమ్మ కినుక అమ్మ మరణం, చిన్నమ్మ జైలు జీవనం, దినకరన్ కటకటాల పాలుతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అన్నీతానై వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. కుడి ఎడమలగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తూ నెట్టుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్రమ ఆస్తుల కేసులో పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలుపాలయ్యారు. చిన్నమ్మ లేని లోటును తీర్చేం దుకు ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టీటీవీ దినకరన్ పార్టీ సారధిగా కొన్ని నెలలపాటు హడావుడి చేశారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటర్లకు నోట్లు పంచి, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల సంఘానికి లంచం ఎరవేసి అప్రతిష్టపాలైన దినకరన్ సైతం ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కి జైలుపక్షిగా మారి పోయారు. అన్నాడీఎంకే నుంచి చీలిపోయిన మాజీ ముఖ్య మంత్రి పన్నీర్‌సెల్వంతో సంధి కుదుర్చుకోవడం ద్వారా పార్టీ పగ్గాలు అప్పగించాలని ఎడపాడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పార్టీ బాధ్యతలు ఎడపాడి భరించక తప్పలేదు. అన్నాడీఎంకే అమ్మ వర్గం ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ తరఫున సంతాపం, ఇతర ప్రకటనలను ఎడపాడే విడుదల చేస్తున్నారు. చిన్నమ్మ ఆవేదన: జెలుకెళ్లిన కొత్తల్లో వరుసపెట్టి వచ్చేవారంతా చాలించేశారు. అధికారం అనుభవిస్తున్న వారంతా తనను చిన్నచూపు చూస్తున్నారని బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే తల్లడిల్లిపోయిన మంత్రులు, పార్టీ నేతలు జైలు వద్ద క్యూకట్టారు. మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి బెంగళూరు జైలు సిబ్బంది చేత తరిమివేయబడ్డారు. ములాఖత్ నిబంధనలను ధిక్కరించి జైలు వద్దకు వస్తే ఊరుకోమని బెంగళూరు జైలు అధికారులు నేతలను హెచ్చరించా ల్సివచ్చింది. శశికళ, ఇళవరసి, సుధాకరన్ రక్త సంబంధీకులను మాత్రమే అనుమతిస్తామని జైలు అధికారులు తేల్చిచెప్పారు. చిన్నమ్మ దర్శనం కోసం జైలు అధికారులను అంతగా విసిగించిన పార్టీ నేతల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. నేతలెవరూ తనవైపు రాకపోవడంతో చిన్నమ్మ చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం తన చేతుల నుంచి జారి పోయినట్లుగా భావిస్తూ విరక్తి చెందుతోంది. ఇళవరసి కుమారుడు వివేక్ ఇటీవల శశికళను కలుసుకోగా ఒంటరి దాన్నై పోయాను అని వాపోయినట్లు సమాచారం. జయలలిత ధరించే ఆకుపచ్చ చీరను తెచ్చిస్తే కొంత ఊరటగా ఉంటుందని వివేక్‌ను కోరడంతో చెన్నై నుంచి తీసుకెళ్లి అప్పగించాడు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: దీప రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినందున ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన హయాంలో తమిళనాడును దేశంలోనే శాంతిధామంగా పరిపాలించగా, ఆమె మరణం తరువాత బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎడపాడి పళనిస్వామి అరాచకపాలనకు తావిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రశాంత జీవనం కోసం ఆర్టికల్ 356 ప్రయోగించి శశికళ బినామీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. -
చిన్నమ్మ టీం!
► నాంజిల్ నేతృత్వం ► అన్నాడీఎంకే–3కి చర్యలు ► కార్యక్రమాల విస్తృతం ► దినకరన్‌కు మద్దతుగా ముందుకు సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు మద్దతుగా అన్నాడీఎంకేలో కొత్త జట్టు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ ఈ జట్టుకు నేతృత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. దినకరన్ నిర్ధోషి అని చాటుతూ కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే చిన్నాభిన్నమైంది. అమ్మ నెచ్చెలి శశికళ ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినా, సీఎం కూర్చీలో కూర్చోవాలని ఆశ పడ్డా, చివరకు కేసులు వెంటాడడంతో పరప్పన అగ్రహార చెరలో కాలం నెట్టుకు రావాల్సిన పరిస్థితి. చిన్నమ్మను ధిక్కరించి అన్నాడీఎంకే నుంచి మాజీ సీఎం పన్నీరు సెల్వం బయటకు రావడం, ఆయన వెంట తాజా, మాజీలు అనేక మంది నడవడం చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో అన్నాడీఎంకేకు తానే వారసురాలినంటూ జయలలిత మేన కోడలు దీపా తెర మీదకు వచ్చినా, ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైతో కేడర్ హంగామా సృష్టించినా, చివరకు మున్నాళ్ల ముచ్చటగా మారింది. ఇక, ఎన్ని జట్లు పుట్టుకొచ్చినా ప్రభుత్వం పతనం కాకుండా చిన్న మ్మ కనుసనల్లో సీఎం పళని స్వామి పాలన కొన్నాళ్లు చెప్పవచ్చు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి చిన్నమ్మ ప్రతినిధి, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ సైతం కేసుల్లో ఇరుక్కుని జైలు బాట పట్టడం పళనిస్వామికి కలిసి వేచ్చే అంశంగా మారింది. పాలనా పరంగా పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతూ, పార్టీని గుప్పెట్లో ఉంచుకునేందుకు తీవ్రంగానే కసరత్తుల్లో ఉన్నారు. అలాగే, పన్నీరు శిబిరాన్ని కలుపుకునే రీతిలో చర్చల ప్రయత్నాలు సాగినా, అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. చిన్నమ్మకు వ్యతిరేకంగా ఏదో ఒక రోజు పళనిస్వామి నిర్ణయం తీసుకోవడం, పన్నీరుతో చేతులు కలపడం ఖాయం అన్న విషయాల్ని, తాజా పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన నాంజిల్ సంపత్, ఇక, చిన్నమ్మటీంను సిద్ధం చేయడానికి రెడీ అయ్యారు. చిన్నమ్మ టీం: సీఎం పళని నేతృత్వంలో అన్నాడీఎంకే అమ్మ, మాజీ సీఎం పన్నీరు నేతృత్వంలో అన్నాడీఎంకే పురట్చి తలైవి పేరిట ప్రస్తుతం శిబిరాలు సాగుతున్నా, మున్ముందు రోజుల్లో అన్నాడీఎంకే (చిన్నమ్మ) శిబిరం తెర మీదకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మదురై మేలూరు వేదికగా కేవలం చిన్నమ్మ, దినకరన్‌లకు మద్దతుగా సాగిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కేడర్ తరలిరావడంతో చిన్నమ్మ టీంకు పునాదులు వేయడానికి నాంజిల్ సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే భవిష్యత్తు చిన్నమ్మ శశికళ, దినకరన్‌ల ద్వారా మాత్రమే సాధ్యం అని, ఆ ఇద్దరికి మద్దతుగా ముందుకు సాగుదామన్న నినాదంతో కార్యక్రమాల విస్తృతానికి రెడీ అయ్యారు. కేంద్ర కుట్రలో భాగంగా దినకరన్ తీహార్ జైల్లో బందీ కావాల్సి వచ్చిందని, ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించే విధంగా పోరాటాలు సాగిద్దామని నాంజిల్ పిలుపు నివ్వడం గమనార్హం. చిన్నమ్మకు మద్దతుగా ఏకం అవుదామన్న పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తన గళం , వాక్ చాతుర్యంతో చిన్నమ్మ టీం బలోపేతానికి అన్నాడీఎంకే సిద్ధాంతాల డిప్యూటీ ప్రచార కార్యదర్శి, అ«ధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ కార్యచరణ సిద్ధం చేసుకోవడ గమనించాల్సిన విషయం. -
బంగ్లాలోకి పోలీసులు
► చిన్నమ్మ వద్ద విచారణకు కసరత్తు కొడనాడు బంగ్లాలో నీలగిరి జిల్లా పోలీసులు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. దర్యాప్తును మరింత ముమ్మరం చేయడం లక్ష్యంగా చిన్నమ్మ శశికళ, టీటీవీ దినకరన్‌లను విచారించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో చుట్టూ సాగుతున్న పరిణామాలు, అనుమానాలు క్రైం సినిమాను తలపిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో ఘటన చోటు చేసుకుంటుండడంతో మిస్టరీని నిగ్గుతేల్చడం నీలగిరి జిల్లా పోలీసులకు శిరోభారంగా మారింది. కోయంబత్తూరు, నీలగిరి, సేలం, కేరళ తిరుచ్చూరు జిల్లాల పోలీసులు జరుగుతున్న ఘటనలపై దృష్టి పెట్టారు. సమష్టిగా చిక్కుముడిని విప్పేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. విచారణలో పట్టుబడ్డ వారు ఇస్తున్న వాంగ్మూలం పొంతన లేని రీతిలో ఉండడంతో, దర్యాప్తు వేగం పెంపునకు సిద్ధమయ్యా రు. శనివారం నీలగిరి జిల్లా పోలీసులు కొడనాడు ఎస్టేట్‌లో తనిఖీల్లో నిమగ్నమయ్యారు. బంగ్లా పరిసరాల్లో తొలిరోజు తనిఖీ సాగినా, పూర్తిగా ఎస్టేట్ పరిశీలన అనంతరం చివరగా బంగ్లాలోకి అడుగు పెట్టి సోదాలకు నిర్ణయించారు. అయితే, కొడనాడు బంగ్లాలో ఏమి ఉందో అన్న వివరాలు అమ్మ జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళకు తెలిసి ఉండే అవకాశాలు ఎక్కువ. ఆమె తదుపరి అన్నాడీఎంకే బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు తెలిసి ఉండొచ్చు. ఈ ఇద్దర్ని విచారించడం ద్వారానే ఆ బంగ్లాలో ఏమి ఉన్నదని, దోపిడీ, జరుగుతున్న పరిణామాలు, ఘటనలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పోలీసు యంత్రాంగం భావిస్తున్నది. అయితే, ఆ ఇద్దరు కేంద్ర కారా గారాల్లో ఉండడంతో విచారణ అంత సులభం కాదని చెప్పవచ్చు. ఆ ఇద్దర్ని విచారించేందుకు ఇటు కర్ణాటక, అటు ఢిల్లీ కోర్టుల్ని ఆశ్రయించేందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. కొడనాడులో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సెక్యూరిటీ కృష్ణ బహూదూర్ కోలుకున్నాడు. శనివారం విధులకు హాజరైనట్టు సమాచారం. -
నేడు కోర్టుకు దినకరన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. సోమవారం ఆయన్ను ఢిల్లీలో కోర్టుకు హాజరు పరచనున్నారు. ఆయన్ను మళ్లీ తమ కస్టడీకి తీసుకునేందుకు తగ్గ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఉచ్చులో దినకరన్ చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ మూడు రోజుల పాటు చెన్నైలో సాగింది. కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ కాలం ఆదివారంతో ముగియడంతో సోమవారం ఆయన్ను కోర్టులో హాజరు పరిచేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. కేసు విచారణ మరింత ముందుకు సాగాల్సి ఉండడం, ఆధారాల అన్వేషణ కోసం మరింతగా శ్రమించాల్సి ఉండడంతో మరికొద్ది రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయించే కసరత్తుల్లో ఉన్నారు. ఈ సారి కోర్టు కస్టడీకి అప్పగించేనా లేదా, రిమాండ్‌కు తరలించేనా అన్నది వేచిచూడాల్సిందే. సోమవారం కోర్టులో హాజరు పరిచినానంతరం ఢిల్లీ పోలీసులు మరింత దూకుడు పెంచే అవకాశాలు ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు తమకు లభించిన ఆధారాలు, వివరాల మేరకు తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు అధికారుల్ని విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలిపిస్తూ సమన్లు జారీ చేయొచ్చన్న సంకేతాలతో ఉత్కంఠ బయలు దేరింది. ఇప్పటికే ఐదుగురికి సమన్లు జారీ చేసి ఉండడం, వారు సోమవారం లేదా మంగళవారం విచారణకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వీరి వద్ద జరిపిన విచారణ మేరకు మంత్రులు, అధికారుల భరతం పట్టే విధంగా దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఓ బ్రోకర్ వద్ద పోలీసులు రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
-
విలీనం అనుమానమే!
⇔ మద్దతుదారులతో పన్నీరు మంతనాలు ⇔ ఆ రెండు డిమాండ్ల మీద పట్టు ⇔ నాన్చుడు వద్దు అని మంత్రి జయకుమార్ ఆగ్రహం ⇔ సేలంలో సీఎం సమాలోచన సీఎం పళని, మాజీ సీఎం పన్నీరు శిబిరాల విలీనం అనుమానంగా మారింది. మద్దతుదారులతో పన్నీరు సెల్వం శనివారం సుదీర్ఘ మంతనాల్లో మునిగారు. శశికళ, దినకరన్‌లకు శాస్వత ఉద్వాసన, అమ్మ మరణం మిస్టరీ ఛేదింపునకు న్యాయ విచారణకు పట్టుబడుతూ, అవి నెరవేరే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయానికి వచ్చారు. పన్నీరు శిబిరం నాన్చుడు ధోరణి సాగించడాన్ని మంత్రి జయకుమార్ తీవ్రంగా ఖండించారు. వస్తే, వస్తాం...లేదంటే ...అంటూ ఏదో ఒక విషయాన్ని తెల్చాలని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే(అమ్మ) శిబిరంలో మమేకం అయ్యేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరం నిర్ణయించిన విషయం తెలిసిందే. తమ షరతులకు తలొగ్గినప్పుడే చర్చలు అన్న అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఇందుకు తగ్గట్టుగా అమ్మ శిబిరానికి ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న సీఎం పళనిస్వామి అడుగులు సాగుతూ వస్తున్నాయి. చర్చలు నిమిత్తం ఒకే వేదిక మీదకు వచ్చే సమయంలో ఏదో ఒక అడ్డంకితో వాయిదాల పర్వం సాగింది. గత వారం ఇరు వర్గాల మధ్య బయలు దేరిన మాటల తూటాలతో ఇక చర్చలకు స్వస్తి పలికినట్టే అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే ఎవరో ఒక్కరు తగ్గడం, తదుపరి రహస్యంగా మంతనాలు సాగడం చోటు చేసుకున్నాయి. రహస్యమంతనాల్లో పన్నీరు శిబిరానికి పళని శిబిరం ఆఫర్లు ఇచ్చినా వాటిని ఖాతరు చేయలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో అమ్మ శిబిరంతో విలీనం వద్దే వద్దన్న నినాదం సేలం వేదికగా బయలు దేరడంతో పన్నీరు డైలమాలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరిస్థితులు తమకు అనుకూలంగానే మున్ముందు ఉంటాయన్న భావనతో పన్నీరు మద్దతు దారులు ఆ వ్యాఖ్యలు అందుకున్నా, అందరి అభిప్రాయ సేకరణలో మాజీ సీఎం నిమగ్నమయ్యారు. మంతనాలు : విలీనం వద్దే వద్దంటూ బయలు దేరిన నినాదాన్ని పరిగణించి మద్దతుదారులతో పన్నీరు శనివారం మంతనాల్లో మునిగారు. చర్చలకు వెళ్దామా? వద్దా అన్నది తేల్చే రీతిలో ఈ మంతనాలు సాగాయి. ఆ శిబిరానికి చెందిన కేపీ మునుస్వామి, మధుసూదనన్, నత్తం విశ్వనాథన్, పాండియరాజన్, పొన్నయ్యన్, సెమ్మలై, మనోజ్ పాండియన్, మైత్రేయన్ నేతలతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, తదుపరి సాయంత్రం పన్నీరు సమావేశం కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నీరు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక విషయాన్ని తేల్చుతారని భావించినా, చివరకు ఆ శిబిరం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, మైత్రేయన్ మీడియాతో మాట్లాడుతూ ఆ రెండు డిమాండ్లే తమకు ముఖ్యం అని, వాటిని నెరవేర్చని తదుపరి చర్చల గురించి ఆలోచిద్దామని స్పందించడం గమనార్హం. ఇక, పొన్నయ్యన్ మాట్లాడుతూ తమను చర్చలకు పిలిపించి, లోపల శశికళ, దినకరన్‌లకు మద్దతుగా ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు చేయించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పాండియరాజన్ పేర్కొంటూ, తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే, ప్రమాణ పత్రంలో సంతకాలు ఎందుకు తీసుకున్నారో బయట పెట్టాలని పళని శిబిరాన్ని ప్రశ్నించడంతో, విలీనం ఇక డౌటేనన్నది స్పష్టం అవుతోంది. అయితే, తాజాగా పన్నీరు శిబిరం స్పందన మేరకు ఆదివారం పళని శిబిరం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో, ఇక ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ఉదయాన్నే మీడియా కదిలించగా, నాన్చుడు ధోరణి మంచి పద్ధతి కాదని విమర్శించారు. విలీనం చర్చలువద్దే వద్దంటూ సేలంలో బయలు దేరిన నినాదం, పన్నీరు గళమా...? లేదా అక్కడి నేతల నినాదమా అన్నది స్పష్టం చేయాలన్నారు. ఎవరు వచ్చినా రాకున్నా, తమ ప్రభుత్వం మరో నాలుగేళ్లు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం పళనిస్వామి సేలంలో పార్టీ వర్గాలతో విలీన చర్చల విషయంగా సమావేశం కావడం గమనార్హం. ఇక, ఈ విలీనం ఓ హైడ్రామా అని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆరోపించారు. కమలం పెద్దల కనుసనల్లో ఈ డ్రామా సాగుతోందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టడం, విలీనం అంటూ, చర్చలు అంటూ కాలాన్ని నెట్టుకు రావడం వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఐటీ దాడులు, ఈడీ విచారణలు, రంగంలోకి ఢిల్లీ పోలీసులు, సీబీఐ ఇలా, అన్నీ కేంద్రం బెదిరింపుల వ్యవహారాల్లో భాగమేనని పేర్కొన్నారు. అయితే, స్టాలిన్ వ్యాఖ్యలను కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ ఖండించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని అధికారం చేజిక్కంచుకోవడం లక్ష్యంగా స్టాలిన్ కుట్రలు చేస్తూ, నిందల్ని తమ మీద నెడుతున్నారని మండిపడ్డారు. -
తదుపరి ఎవరో?
రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారంలో తదుపరి ఢిల్లీ పోలీసుల ఉచ్చులో పడేది ఎవరో అన్న ప్రశ్న అధికార పక్షాన్ని వెంటాడుతోంది. చెన్నై చుట్టూ మూడు రోజులు సాగిన విచారణలో పలువురు మంత్రుల ప్రమేయం వెలుగులోకి వచ్చిన సమాచారంతో సీఎం పళనిస్వామి కేబినెట్లో ఆందోళన నెలకొంది. చెన్నైలో విచారణ ముగించి ఢిల్లీకి దినకరన్‌ను తరలించినా, మళ్లీ కస్టడీకి తీసుకుని ఇక్కడికే తీసుకొస్తారేమోనన్న చర్చ సాగుతోంది. సాక్షి, చెన్నై : రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వద్ద చెన్నైలో మూడు రోజులుగా ఢిల్లీ పోలీసులు విచారించారు. శుక్రవారం అర్ధరాత్రి విచారణ ప్యారిస్, పెరంబూరు చుట్టు›సాగి ఉండడంతో, అక్కడ దినకరన్‌కు సన్నిహితులు ఎవరు ఉన్నారో అని ఆరా తీయాల్సిన పరిస్థితి. విచారణలో వెలుగు చూసిన చిరునామాల్లో తాము ఎవరి కోసం వచ్చామో ఆ వ్యక్తులు లేకపోవడం ఢిల్లీ పోలీసుల్లో అనుమానాలు బయలు దేరాయి. ఆదంబాక్కం మోహన్, కొలపాక్కం ఫిలిప్స్ డేనియల్, తిరువేర్కాడు గోపినాథ్‌లను విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలుస్తూ సమన్లు జారీ చేశారు. 16 మందిలో ఐదుగుర్ని గురిపెట్టి చెన్నైలో విచారణ జరిగి ఉండగా, మిగిలిన వారిలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు అదనపు డీజీపీ, ఒకరు ఐజీ స్థాయి అధికారి ఉండడంతో వాళ్లెవరోనని ఆరా తీసే వాళ్లు పెరిగారు. మంత్రుల పేర్లు ఢిల్లీ పోలీసుల జాబితాలో ఉన్న సమాచారం సీఎం పళనిస్వామి కేబినెట్లో గుబులు రేపింది. శనివారం పలువురు మంత్రులు ఎక్కడ తమను ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిపిస్తారోనన్న భయంతో సొంత జిల్లాల బాట పట్టడం గమనించాల్సిన విషయం. ఈ మూడు రోజుల విచారణలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కాయో, అందులో ఏ మంత్రి పేరు ఉందో అన్న చర్చ అన్నాడీఎంకేలో ఊపందుకుంది. మంత్రుల్ని, ఐపీఎస్‌లను విచారించ దలచిన పక్షంలో కేసు సీబీఐకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడడంతో రెండాకుల వ్యవహారంలో తదుపరి టార్గెట్ ఎవరో అన్న ఆందోళన బయలు దేరింది. ఇద్దరు మంత్రులు నగదు సమకూర్చడంలో సహకరించినట్టు, ముగ్గురు ఐపీఎస్‌లు ఢిల్లీకి చేరవేయడం ముఖ్య పాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతుండడంతో, దినకరన్‌కు తోడుగా ఢిల్లీ వెళ్లబోయేదెవ్వరోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఢిల్లీలో లంచం పుచ్చుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారులు ఎవరోనన్న విషయాన్ని బయటకు లాగే రీతిలో విచారణ సాగుతున్నట్టు సమాచారం. ఢిల్లీకి దినకరన్: మూడు రోజుల విచారణతో ఢిల్లీకి దినకరన్‌ను తరలించారు. నిన్నటి వరకు ఖద్దరు డ్రెస్‌తో తిరిగిన దినకరన్, తాజాగా టీ షర్టు, సాధారణ ప్యాంట్ ధరించి ఢిల్లీ పోలీసుల వెంట నడిచారు. చేతిలో ఓ బ్యాగ్‌లో తనకు కావాల్సిన వస్తువుల్ని తీసుకుని పోలీసు భద్రత నడుమ రాజాజీ భవన్ నుంచి విమానాశ్రయంకు చేరుకున్నారు. మొన్నటి వరకు సాధారణంగానే కనిపించిన దినకరన్, తాజాగా ఢిల్లీ వెళ్తూ బాధను దిగమింగుతున్నట్టుగా కనిపిస్తూ, మీడియాకు, తన కోసం వచ్చిన మద్దతుదారులకు చేతులు ఊపుతూ సెలవు తీసుకున్నారు. ఆదివారంతో కస్టడీ ముగియనుండడంతో, సోమవారం కోర్టులో హాజరు పరిచి మళ్లీ దినకరన్‌ను కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ కస్టడీకి తీసుకున్న పక్షంలో విచారణ చెన్నై చుట్టూ మళ్లీ సాగేనా, కొచ్చి, బెంగళూరు వైపుగా సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. రూ. 200 కోట్లు లక్ష్యంగా: కొడనాడులో రూ.200 కోట్లు కొత్త నోట్లు ఉన్నట్టు, వాటి దోపిడీ లక్ష్యంగా వ్యూహ రచన జరిగినట్టు కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. తిరుచ్చూర్‌లో తొలుత ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని చేపట్టిన విచారణలో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ పథకంలో కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే ప్రముఖుడి హస్తం ఉన్నట్టు తెలిసింది. కనకరాజ్‌కు పూర్తిగా ఎస్టేట్ గురించి తెలిసి ఉండడంతో అతడి సహకారంతో దోపిడీకి ప్రయత్నించిన సమయంలో సెక్యూరిటీ అడ్డుకోవడం, వారి మీద దాడి చేయక తప్పలేదని పట్టుబడ్డ వారు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో వరుసగా ఘటనలో సాగుతుండడంతో అమ్మ ఆత్మ కొడనాడులో సంచరిస్తున్నట్టు, బలి తీసుకుంటున్నట్టు అక్కడి గ్రామాల్లో కొత్త ప్రచారం ఊపందుకోవడం గమనార్హం. -
దినకరన్(శశికళ అక్కకొడుకు) రాయని డైరీ
నాలుగు రోజులైంది నేను పోలీస్ కస్టడీలోకి వచ్చి ! మొదట నన్ను చెన్నై నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. తర్వాత ఢిల్లీ నుంచి చెన్నై తీసుకొచ్చారు. బీసెంట్ నగర్‌లోని రాజాజీ భవన్లో ఇంటరాగేషన్. చుట్టూ నలుగురైదుగురు పోలీసులు. ‘‘కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను’’ అన్నాను. ‘‘అరెస్ట్ అయినవాళ్లకు రెస్ట్ ఉండదు’’ అన్నారు! ‘‘రెస్ట్ అంటే పెద్దగా ఏం కాదు, బీసెంట్ నగర్లోనే మా ఇల్లు. వాష్‌రూమ్‌లో కాసేపు రిలాక్స్ అయి వచ్చేస్తాను’’ అన్నాను. ‘‘ఇక్కడ ఉన్నవి వాష్‌రూమ్‌లు కాదా?’’ అన్నారు. ‘‘మా ఇంట్లో ఉన్నది నాకు అలవాటైన వాష్‌రూమ్. కంఫర్ట్‌గా ఉంటుంది’’ అన్నాను. ‘‘కస్టడీని ఇంకో ఐదు రోజులు పొడిగిస్తే ఇక్కడి వాష్‌రూమ్‌లు కూడా కంఫర్ట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘కావాలంటే మీరు కూడా నాతో వచ్చేయండి. పెద్ద బిల్డింగ్. కేరళ స్టయిల్లో కట్టించాను. మా వాళ్లు టీ పెట్టి ఇస్తారు. టీవీ పెట్టి రిమోట్ చేతికిస్తారు’’ అని చెప్పాను. వాళ్లేమీ ఎగై్జట్ కాలేదు. ‘‘ఇంకొక్క రోజు మీరు క్వొశ్చన్లు అడిగితే నా కస్టడీ కంప్లీట్ అవుతుంది కదా’’ అని అడిగాను. ‘‘మేము క్వొశ్చన్లు అడిగితే కస్టడీ కంప్లీట్ కాదు. నువ్వు ఆన్సర్లు చెబితే కస్టడీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు కూడా కంప్లీట్‌గా కంప్లీట్ కాదు. నువ్వు చెప్పే ఆన్సర్లకు మళ్లీ మేము నీకు క్వొశ్చన్లు వేయకుండా ఉండాలి. అప్పుడు కంప్లీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘మీరు మళ్లీ మళ్లీ క్వొశ్చన్లు వేయకుండా, ఒకేసారి నేను ఆన్సర్లన్నీ చెప్పేస్తే.. అప్పుడు కస్టడీ కంప్లీట్ అవుతుందా?’’ అని అడిగాను. ‘‘అప్పుడు కూడా కంప్లీట్ కాదు’’ అన్నారు. ‘‘అదేంటీ’’ అన్నాను ‘‘క్వొశ్చన్ వేసినప్పుడు చెప్పిందే ఆన్సర్. క్వొశ్చన్ అడక్కుండా చెప్పింది ఆన్సర్ కిందికి రాదు’’ అన్నారు. ‘‘మరి దేని కిందికి వస్తుంది?’’ అన్నాను. ‘‘క్వొశ్చన్లెస్ ఆన్సర్ కిందికి వస్తుంది. క్వొశ్చన్‌కి ఆన్సర్ లేకపోయినా డిపార్ట్మెంట్ సహిస్తుంది కానీ, క్వొశ్చన్ లేని ఆన్సర్ని అస్సలు టాలరేట్ చెయ్యదు’’ అన్నారు. ‘‘మీ డిపార్ట్మెంట్ ఇంకా.. ఏమేం టాలరేట్ చెయ్యదు?’’ అని అడిగాను. కోపంగా చూశారు! ‘కస్టడీలోకి మేము నిన్ను తీసుకున్నామా? నువ్వు మమ్మల్ని తీసుకున్నావా?’ అన్నట్లుంది ఆ చూపు. ఆ చూపు నాకు నచ్చలేదు. శశీ ఆంటీ జైలుకు వెళ్లకుండా ఉంటే, పార్టీ సింబల్‌ని ఎలక్షన్ కమిషన్ ఎత్తుకెళ్లకుండా ఉంటే, పళనిస్వామికి, పన్నీర్‌సెల్వంకి కొంచెమైనా బుద్ధీజ్ఞానం ఉండి ఉంటే.. నేను ఇవాళ పోలీసు కస్టడీలో ఉండడం కాదు, మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే నా పొలిటికల్ కస్టడీలోకి తీసుకుని ఉండేవాడిని! -మాధవ్ శింగరాజు -
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
చెన్నై: రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు. తమ కస్టడీలో ఉన్న దినకరన్‌ను గురువారం చెన్నైకి తీసుకొచ్చిన పోలీసులు అడయార్‌లోని నివాసంలో గత రెండు రోజులుగా విచారణ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆయన స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. వీరి వద్ద నుంచి కొన్ని కీలక సాక్ష్యాలు సేకరించారు. చెన్నైలో దినకరన్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను రాజాజీ భవన్‌నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని దినకరన్‌ను, మల్లికార్జున్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీలోనూ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్ వెనక ఉన్నది మన్నార్గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. ఐదు రోజుల కస్డడీలో ఉన్న దినకరన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి కేసుకు సంబంధించిన నివేదికను తయారు చేయనున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందస్తుగా ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఏపీలో చెత్త పాలన !
-
పులిని చూసి ఎలుక ఎగతాళి
రాందాస్ వ్యాఖ్యలపై దీప గరం టీనగర్: అన్నాడీఎంకేపై రాందాస్ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుంద ని ఎంజీఆర్ అమ్మ దీప పేరవై ప్రధాన కార్యదర్శి జె. దీప విమర్శించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. అవినీతి రాబందులు ఊరిని మోసగించే విధంగా రెండు వర్గాల విలీనం పేరుతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దినకరన్ అరెస్టు వ్యవహారాన్ని దారి మళ్లించేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ బ్యానర్ల తొలగింపుతో పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి జయలలిత వర్గాల అసలైన కార్యకర్తలు మోసపోరని అన్నారు. అన్నాడీఎంకే పార్టీని, రెండాకులను రక్షించే వరకు ఎంజీఆర్ అమ్మా దీప పేరవై నిద్రపోదన్నారు. ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ గందరగోళంలో పాట్టాలి మక్కల్ కట్చి నేత రాందాస్ రెండాకుల చిహ్నాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని ప్రకటన విడుదల చేయడం గర్హనీయమన్నారు. కోటిన్నర కార్యకర్తలు ఉన్న పార్టీపై ఈ వ్యాఖ్యలు చేయడం పులిని చూసి ఎలుక ఎగతాళి చేసినట్లుగా ఉందన్నారు. త్వరలో అసలైన అన్నాడీఎంకే కార్యకర్తలు తన నాయకత్వం కిందికి వస్తారన్నారు. అమ్మా– 2023 విజన్ పథకం స్వప్న సాకారం చేసేందుకు అహర్నిశలూ కృషిచేస్తామని పేర్కొన్నారు. -
రాజాజీ భవన్ వద్ద పోలీసుల హడావుడి
చెన్నై: కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీ పోలీసులు రెండో రోజు కూడా చెన్నైలో విచారణ నిర్వహించారు. చెన్నైలోని మూడు ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న ఆయన్ను గురువారం చెన్నైకు తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు అడయార్‌లోని నివాసంలో ఆయన వద్ద విచారణ సాగింది. ఇదే కేసులో అరెస్టు అయిన దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. శుక్రవారం ఈ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్ లేదా, కేరళకు తీసుకెళ్లవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, రాజాజీభవన్లోని సీబీఐ కార్యాలయానికి ఆ ఇద్దర్నీ పరిమితం చేశారు. ఓ బృందం వీరి వద్ద విచారణ సాగించగా, మరో బృందం ఆదంబాక్కం వల్లలార్ వీధిలోని రిటైర్డ్ అధికారి మోహనరంగన్ ఇంటి వద్ద గంట పాటు విచారణ సాగింది. అలాగే పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని ఆ ఇద్దరిని విచారణ చేపట్టారు. కాగా ఈ కేసుతో సంబంధం ఉన్న హవాల ఏజెంట్ నరేష్‌ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. -
అరెస్ట్‌తో హర్షం
► నిన్న నేత...నేడు ముద్దాయి ► అన్నీ అర్ధరాత్రి ప్రకంపనలే ► కస్టడీకి అప్పగింతతో ఉత్కంఠ ► చెన్నైకు తీసుకొచ్చే అవకాశం ► దినకరన్‌కు మద్దతు శూన్యం సాక్షి, చెన్నై: అదృష్టం కలిసి రావడంతో ఇక, అన్నాడీఎంకేకు సర్వం తానే అన్నట్టు రెండున్నర నెలలు ఓ నాయకుడిగా చక్రం తిప్పిన టీటీవీ దినకరన్ రాతను మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు మార్చేశారు. నిన్న మొన్నటి వరకు నేతగా ఉన్న దినకరన్ తాజా గా ముద్దాయి అయ్యారు. తమకు అడ్డంగా దొరికిన దినకరన్‌ను బుధవారం కటకటాల్లోకి నెట్టారు. కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్నారు. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తదుపరి అరెస్టు ఎవరో అన్న ఉత్కంఠ బయలు దేరింది. 2011 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అన్నాడీఎంకేలోని నాయకుల్లో దినకరన్ కూడా ఒకరే. ఎంపీగా, పార్టీలో చిన్న పాటి పదవిలో ఉన్నా, జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశకళ కావడంతో చాప కింద నీరులా తన పనితనాన్ని ప్రదర్శించాడు. శశికళ అక్క వనితామణి కుమారుడైన టీటీవీ దినకరన్‌తో పాటు, ఆ కుటుంబం సాగిస్తున్న బండారాలు వెలుగులోకి రావడంతో అమ్మ జయలలితతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందర్నీ మూకుమ్మడిగా బహిష్కరించారు. తదుపరి ఆరేళ్లు శశికళ కుటుంబీకులు ఏ ఒక్కరి పేర్లు తెర మీదకు రాలేదు. అమ్మ మరణంతో హఠాత్తుగా మళ్లీ తెరమీదకు ఆ కుటుంబం రావడం వివాదానికి దారి తీసింది. అయినా, వాటన్నింటినీ తన కనుసనల్లో అణగదొక్కేందుకు చిన్నమ్మ ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. ఈ సమయంలో చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో దినకరన్‌ను అదృష్టం కలిసి వచ్చింది. ఇక, పార్టీకి సర్వం తానే అన్నంత భావనతో చక్రం తిప్పే యత్నం చేశారు. రెండున్నర నెలలు ఆయన సాగించిన రాజకీయం చివరకు క్రిమినల్ అన్న ముద్ర పడేలా చేసింది. రెండాకుల చిహ్నం కోసం వేసిన ఎర, తన మెడకు చుట్టుకోవడంతో మంగళవారం రాత్రి దినకరన్ రాతను ఢిల్లీ పోలీసులు మార్చేశారు. అర్ధరాత్రి అరెస్టు : తమిళనాడులో ఇటీవల కాలంగా అన్ని పరిణామాలు అర్ధరాత్రి వేళ సాగుతున్నాయి. అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరడం మొదలు మరణ సమాచారం బయటకు రావడం కూడా అర్ధరాత్రే చోటు చేసుకుంది. చిన్నమ్మ శిబిరానికి వ్యతిరేకంగా మాజీ సీఎం పన్నీరుసెల్వం తిరుగుబాటు అర్ధరాత్రే సాగగా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు అదే బాటలో సాగింది. నాలుగు రోజుల్లో 37 గంటల పాటు సాగిన విచారణలో 50 ప్రశ్నల్ని దినకరన్‌కు ఢిల్లీ పోలీసులు సంధించారు. రెండాకుల కోసం హవాల ఏజెంట్ల ద్వారా నగదు మార్పిడి సాగించడం, ఇందుకు స్నేహితుడు మల్లికార్జున్ సహకారం తోడు కావడం వెరసి ప్రస్తుతం క్రిమినల్ అన్న ముద్రను వేసుకోక తప్పలేదు. దినకరన్ అరెస్టుతో తమిళనాట ఉత్కంఠ రేగ వచ్చని సర్వత్రా భావించారు. అయితే, పట్టించుకున్న వారుంటే ఒట్టు. ఒకరిద్దరు హడావుడి సృష్టించినా, తదుపరి హర్షం వ్యక్తం చేసిన వాళ్లే అధికం. ఇక, పరప్పన అగ్రహార చెరలో ఉన్న చిన్నమ్మ మాత్రం షాక్‌కు గురి కావడం గమనార్హం. అలాగే, దినకరన్ మద్దతుదారుడు అన్నాడీఎంకే నాయకుడు నాంజిల్ సంపత్ మాత్రమే ఇదో కుట్ర అని, అన్యాయంగా ఇరికించారని ధ్వజమెత్తారు. ఇక, ఐదు రోజుల కస్టడీకి దినకరన్‌ను అప్పగించిన దృష్ట్యా, ఆయన్ను విచారణ నిమిత్తం చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే, పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం 1.3 కావడంతో మిగిలిన మొత్తం ఏమైనట్టో అని పెదవి విప్పే వారు పెరిగారు. ఇక, ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుకు మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అన్న చర్చ హోరెత్తుతోంది. సమగ్ర విచారణకు డిమాండ్ : దినకరన్ అరెస్టును తమిళనాట అన్ని పార్టీలు ఆహ్వానించాయి. అయితే, ఈ విచారణను ఇంతటితో వదలి పెట్టకుండా, వెనుక మరెవ్వరైనా ఉన్నారా..? అన్న కోణంలో దర్యాప్తు వేగం పెంచాలని రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నాడు. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, వీసీకే నేత తిరుమావళవన్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఇదే డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. ఓ పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవు అని, ఆ పార్టీకి చెందిన వారికి ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం అయితే, దినకరన్‌తో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం పన్నీరు శిబిరానికి చెందిన నేత పొన్నయ్యన్ పేర్కొంటూ ఆహ్వానిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. అవినీతికి చరమ గీతం పాడే విధంగా ఈ అరెస్టు సాగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ అయితే, ఏ ఒక్క అవినీతి పరుడ్ని వదలి పెట్టే ప్రసక్తే లేదని, అందరూ శిక్షించబడతారని, ఇందుకు దినకరన్ అరెస్టు స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నారు. -
బిగిసిన ఉచ్చు
► అరెస్టుకు చాన్స్ ► నేడు నిర్ణయం సాక్షి, చెన్నై :రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం టీటీవీ దినకరన్‌ను చుట్టుముట్టింది. ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆదివారం ఢిల్లీలో పరిణామాలు సాగాయి. చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ. 50 కోట్లు ఎరగా వేసినట్టు అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత ఉపప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శనివారం ఏడెనిమిది గంటల పాటు టీటీవీని ఢిల్లీ పోలీసులు విచారించారు. ఆదివారం కూడా ఆయన వద్ద విచారణ సాగడంతో ఇక, ఉచ్చు మరింతగా బిగిసినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పలు కోణాల్లో టీటీవీని ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. సెల్‌ఫోన్ నంబర్లు, సంభాషణల ఆధారంగా పలు రకాల ప్రశ్నలతో టీటీవీని ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పట్టుబడ్డ బ్రోకర్ ఇచ్చిన వివరాల ఆధారంగా మరి కొందరి పేర్లను వివరిస్తూ టీటీవీకి ప్రశ్నల్ని పోలీసులు సం««ధించారు. అనేక ప్రశ్నలకు తెలియదు, సంబంధం లేదు, చూడలేదు అన్న సమాధానాల్నే టీటీవీ ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాగే తుది విచారణ మేరకు టీటీవీని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారాలు టీటీవీ మద్దతుదారుల్ని ఆందోళనలో పడేస్తున్నది. అయితే, ఆయన నిర్ధోషిగా చెన్నైకు వస్తారన్న నమ్మకాన్ని ఆయన మద్దతు ఎమ్మెల్యే ఒకరు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. టీటీవీని ఇరకాటంలో పెట్టి, కేసు బలపడే విధంగా మరో పది మంది పేర్లను జాబితాలోకి ఢిల్లీ పోలీసులు ఎక్కించినట్టు తెలిసింది. ఇందులో టీటీవీ సన్నిహితులు ఇద్దరుతో పాటు, ఎన్నికల కార్యాలయంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం ఉన్న కింది స్థాయి సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. -
చెన్నైకా..జైలుకా?
⇔ డిల్లీ పోలీసుల ముందు దినకరన్ ⇔ ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల ఎరపై విచారణ ⇔ అరెస్ట్ ఖాయమంటున్న రాజకీయ వర్గాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకవైపు చేతుల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన అన్నాడీఎంకే, మరోవైపు తన కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం..ఇలా వెలుగులీనుతుండిన దినకరన్ జీవితంలో అకస్మాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయి. పోలీసుల కనుసన్నలను దాటి పోకూడని దుస్థితిని తెచ్చుకున్న దినకరన్ చెన్నైకి తిరిగి వచ్చేనా డిల్లీలో అరెస్టయి జైలుకెళ్లేనా అని అన్నిపార్టీలూ ఆలోచనలో పడ్డాయి. రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు ఎరవేశారనే ఆరోపణలపై డిల్లీ పోలీస్ సహాయ కమిషనర్ సంజయ్ షెరావత్, ఇన్స్పెక్టర్ నరేంద్ర షాకల్ నుండి ఈనెల 19వ తేదీన దినకరన్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. అప్పటికే బ్రోకర్ సుకేష్ చంద్రశేఖర్‌ను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి వాంగ్మూలం సేకరించినందున దినకరన్‌ను సైతం అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అయితే సమన్లలో ఈనెల 22వ తేదీన డిల్లీలో పోలీసుల ముందు దినకరన్ హాజరుకావాలని ఉంది. దినకరన్‌పై తగిన ఆధారాలు ఉన్నందునే సమన్లు జారీచేశామని చెన్నైకి వచ్చిన డిల్లీ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ను లోబరుచుకునేందుకు దినకరన్ ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ నుండి అనేక వివరాలు రాబట్టామని తెలిపారు. ఈనెల 22వ తేదీన డిల్లీలో జరిపే విచారణలో దినకరన్‌పై ఆరోపణలు రుజువైన పక్షంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దినకరన్ అరెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్న తరువాతనే డిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి సమన్లు అందజేసినట్లు తెలుస్తోంది. డిల్లీ పోలీసులు ముందు హాజరయ్యేందుకు కొంత గడువుకావాలన్న దినకరన్ కోర్కెను పోలీసులు నిరాకరించారు. పైగా హాజరును దాటవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం డిల్లీకి బయలుదేరి వెళ్లిన దినకరన్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో క్రైంబ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యారు. దినకరన్ నియమించి బ్రోకర్‌గా అరెస్ట్ కాబడిన సుకేష్ చంద్రశేఖర్‌ను కూడా తీసుకువచ్చి ఇరువురినీ ముఖాముఖిగా విచారించారు. డిల్లీ పోలీసులు గుక్కతిప్పుకోకుండా దినకరన్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రాత్రి 9 గంటల వరకు దినకరన్‌ను విచారిస్తూనే ఉన్నారని సమాచారం. అవసరమైతే ఆదివారం సైతం విచారిస్తారని, అరెస్ట్ చేసే అవకాశాలను కొట్టిపారవేయలేమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇదిలా ఉండగా సీఎం ఎడపాడి సైతం అధికార పర్యటన నిమిత్తం శనివారం డిల్లీకి చేరుకోవడం దినకరన్‌కు కలిసొచ్చే అవకాశంగా భావించవచ్చు. శశికళ వర్గానికి చెందిన ఇరువురు ప్రముఖ నేతలు డిల్లీలో రహస్య మంతనాలు జరిపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. -
దినకరన్‌కు చుక్కెదురు
-
ఓటుకు నోటుపై పిల్
► ఆర్కేనగర్ ఓటర్లపై నోటు పోటు ► నోట్లు పంచిన దినకరన్‌పై పోలీసులకు ఫిర్యాదు ► ఆర్కేనగర్ ఉప ఎన్నికల అవకతవకలపై మద్రాసు హైకోర్టులో వ్యాజం ► వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌కు కోర్టు ఆదేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ నియోజకవర్గ ఓటర్లు దినకరన్ నుంచి రూ.89 కోట్ల మేర లబ్ధిపొందినట్లుగా లభించిన ఆధారాలు ఆ ప్రాంత ప్రజలను చిక్కుల్లో పడవేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు ఇచ్చిన అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి దినకరన్, పుచ్చుకున్న ప్రజలపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజం (పిల్)పై వివరణ ఇవ్వాలని జాతీయ ఎన్నికల కమిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపు అవకాశాలు లేవని తెలుసుకున్న దినకరన్ ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలు చేశారు. ఓటుకు రూ.4వేలు లెక్కన పంచినట్లు సమాచారం. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు చిక్కకుండా ‘స్వామి దర్శనం అయిందా(డబ్బు అందిందా)’ అంటూ కోడ్ భాషను ప్రయోగించారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇవిగాక టోకన్ల పంపిణీ చేసి నేరుగా షోరూంల దగ్గరే విలువైన బహుమతులు పంచే పథకాన్ని పన్నారు. ఎంతగోప్యంగా సాగినా ఎన్నికల కమిషన్ కన్ను పడడంతో అధికార పార్టీ నేతలు ఆదాయపు పన్ను దాడులకు గురైనారు. వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 35 చోట్ల చేసిన దాడుల్లో ఓటర్లకు పంచినట్లుగా రూ.89 కోట్ల విలువైన ఆధారాలు లభించాయి. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దయ్యాయి. ఇచ్చిపుచ్చుకున్న వారి మాటేమిటి: న్యాయవాది ఎన్ఆర్ఆర్ అరుణ్ నటరాజన్ నగదు బట్వాడా జరిగినట్లు రుజువుకావడంతో ఎన్నికలను రద్దు చేసి సరిపెట్టిన ఎన్నికల కమిషన్ ఓటుకు నోటు ఇచ్చిన , పుచ్చుకున్నవారిని వదిలేసిందని పిల్ వేసిన అరుణ్ నటరాజన్ తరపు న్యాయవాది నళినీ చిదరంబం శుక్రవారం నాటి విచారణలో న్యాయమూర్తుల దృష్టికి తెచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఓటుకు నోటు పంచడం మాత్రమే కాదు, స్వీకరించడం కూడా చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. అయితే ఎన్నికల రద్దుకు అన్నాడీఎంకే అమ్మ అభ్యర్ది దినకరన్, నగదు పంపిణీకి సారధ్యం వహించిన ఐదు మంది మంత్రులు ఇతర అనుచరులపై కేసులు నమోదు చేయాలని భారత ఎన్నికల కమిషన్ చెన్నై పోలీసులను అదేశించలేదని ఆమె తప్పుపట్టారు. ఓటుకు నోటు పంచిన వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ న్యాయమూర్తులకు తెలిపారు. ఫిర్యాదు చేసిన పత్రాల నకలును సైతం కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంలో పిల్ తరపు న్యాయవాది నళినీ చిదంబరం మధ్యలో కలుగజేసుకుని...నోటు చెల్లించినవారిపై మాత్రమే ఫిర్యాదు చేశారు, పుచ్చుకున్న ఓటరుపై చేయలేదని, ఓటర్లపై కేసు నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని వాదించారు. పైగా ఓటర్లు నగదు పొందినట్లుగా ఆధారాలు ఫ్లయింగ్ స్వా్కడ్ అధికారుల వద్ద ఉన్నాయని చెప్పారు. ఆర్కేనగర్ పరిధిలోని రెండు లక్షల ఓటర్లలో నగదు పుచ్చుకున్న వారిని గుర్తించడం ఆచరణలో సాద్యం కాదని, అలా చేస్తే ఓటు వేసేందుకు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు ఎలా వస్తారని నిరంజన్ వాదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి ఎమ్ సుందర్‌లు స్పందించారు. ఈ పిల్‌పై భారత ఎన్నికల కమిషన్, తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి, చెన్నై పోలీస్ కమిషనర్ తదితరులు సవివరమైన నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. -
విలీనమా..వ్యూహమా!
► స్పందించని చిన్నమ్మ ► వేటుపై దినకరన్ సానుకూల ధోరణి ► అన్నాడీఎంకేలో పరిణామాలపై అనుమానాలు ► విలీనం ఒక డ్రామా అంటున్న కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అమ్మ మరణం తరువాత చీలికలు పేలికలై అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే తాజాగా వైరివర్గాల విలీనం దశకు చేరుకుంది. పార్టీలో ముసలానికి ప్రధాన కారణమైన శశికళ కుటుంబంపై వేటువేయడం ద్వారా అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెస్తామని చాటుకుంటూ సాగుతున్నది చిత్తశుద్ధితో కూడిన విలీనమా మరేదైనా వ్యూహమా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే శకం ఇక ముగిసిపోయిందని అందరూ తీర్మానించుకోగా, తాజాగా చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల వల్ల పార్టీతోపాటూ రెండాకుల చిహ్నం కూడా చేరువకాగలదని ఇరువర్గాలు నమ్ముతున్నాయి. అయితే విలీనం వెనుక కేవలం పార్టీ ప్రయోజనాలేనా..ఇరువర్గాల విలీనం విశ్వసనీయమైనదేనా అనే చర్చ మొదలైంది. అమ్మ మరణం తరువాత అనా«థగా మారిన అన్నాడీఎంకేకు అండగా నిలవ డం ద్వారా తమిళనాడుల వేళ్లూనుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదిపింది. సీఎం పన్నీర్‌సెల్వంకు బాసటగా నిలుస్తూ రాజకీయంగా రాజబాట వేసుకోవాలని భావించింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారుకాగా శశికళ వర్గం అధికారంలోకి వచ్చింది. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లినా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారకపోగా రాజకీయంగా పన్నీర్‌సెల్వం మరింత బలహీనపడిపోయారు. ఇక పూర్తిగా కార్యాచరణలోకి దిగిన కేంద్రం అదనుకోసం వేచిచూడటం ప్రారంభించింది. సరిగ్గా ఈసమయంలో దినకరన్ పలు కేసుల్లో ఇరుక్కోవడం కేంద్రానికి అయాచిత వరాలుగా మారాయి. అవినీతి ఆరోపణల్లో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందనే భయం శశికళ వర్గంలో నెలకొంది. ఈ భయానికి ఊతమిస్తూ ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు నాలుగురోజుల క్రితం అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గానికి తెలుసు. చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటువేయడం ద్వారా పన్నీర్ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని ఎడపాడి పన్నాగంగా ఉంది. కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్ వేటుకు వంతపాడటం, శశికళ నోరుమెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ వ్యూహం మరోలా ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరుమీద నడకకాగలదు. కాంగ్రెస్ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికితెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలుకోణాల్లో వత్తిడిపెంచినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని భావించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టేక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ..విలీనానికి వ్యూహకర్తలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనం ఒక నాటకం: కేంద్ర మంత్రి పొన్ కాగా, అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్ వేస్తానని పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటన విలీనం తరువాత నీరుగారిపోవడమో లేదా కంటితుడుపు కమిషన్‌గా మారడమో జరుగుతుందని ఆయన అన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు తేవడం ద్వారా లబ్ది పొందాల్సిన అగత్యం బీజేపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
విలీనంపై నేటి నుంచి చర్చలు
-
అన్నీ సుడిగుండాలే!
♦ నిన్నటి వరకు పొగడ్తలు ♦ నేడు తిట్ల పురాణం ♦ టీటీవీకి అన్నీ కష్టాలే ♦ ఇక కోర్టుల చుట్టూ ప్రదక్షణలే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ఏ క్షణాన పగ్గాలు చేపట్టాడో ఏమోగానీ, అడుగడుగునా సుడిగుండాల్ని దాటాల్సిన పరిస్థితి దినకరన్‌కు తప్పలేదు. నిన్నమొన్నటి వరకు పొగడ్తల పన్నీరులో ముంచిన వాళ్లు, నేడు తిట్ల పురాణం అందుకోవడం టీటీవీకి పెద్ద షాక్కే. రెండు నెలల వ్యవధిలో అన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో కోర్టుల చుట్టూ తిరగక తప్పదేమో..! సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే వర్గాలు అమ్మ జయలలిత బతికే ఉన్నప్పుడు నెచ్చెలి శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే విదేశీ మారక ద్రవ్యంతో పాటు మరికొన్ని కేసులు దినకరన్ మెడకు వేలాడుతున్నా, విచారణల వేగం మాత్రం వాయిదాల పర్వంతో సాఫీగా సాగుతూ వచ్చాయి. అమ్మ ఉన్నంత కాలం పోయెస్ గార్డెన్ వైపుగానీ, పార్టీ కార్యాలయం వైపుగానీ కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితి. ఆ అమ్మ మరణంతో పోయెస్‌గార్డెన్‌లో తిష్ట వేయడమే కాదు, చిన్నమ్మ శశికళ ఆశీస్సులతో అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకున్నారు. చిన్నమ్మ ప్రతినిధిగా పార్టీని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకునేందుకు తగ్గ అస్త్రాలతో దినకరన్ ముందుకు సాగారని చెప్పవచ్చు. పార్టీ పదవికి చేతికి చిక్కిన వారం రోజుల అనంతరం ఫిబ్రవరి 23వ తేదీ అధికారికంగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో టీటీవీ జై...అంటూ పొగడ్తల పన్నీరు చల్లేందుకు ఆ కార్యాలయం వైపుగా పోటేత్తిన సేనలు కోకొల్లలు. కాళ్ల మీద ఆశ్వీరచనాలు తీసుకున్న వాళ్లూ ఉన్నారు. ఇక, అమ్మ తరహాలో కార్యాలయం మీద నుంచి విక్టరీ చిహ్నం చూపించడం ఏమిటో, తానే ఇక అన్నాడీఎంకేకు భవిష్యత్తు అన్నట్టుగా ఠీవీని ప్రదర్శించారని చెప్పవచ్చు. అన్నీ సుడిగుండాలే : ఏ ముహూర్తాన ఆ పదవిలో దినకరన్ కూర్చున్నారో ఏమోగానీ వరుస గండాలు, సుడిగుండాల్ని దాటక తప్పలేదు. జయలలిత మేనల్లుడు దీపక్ ఆయనకు వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్నా, మాజీ సీఎం పన్నీరు రూపంలో చిక్కులు ఎదురైనా అన్నింటినీ అడ్డుకునేందుకు వీరోచితంగా శ్రమించక తప్పలేదు. ఓ వైపు తన పట్టు పార్టీలో బిగిసే రీతిలో నేతలతో మంతనాలు, అసంతృప్తి వాదులకు బుజ్జగింపులు ఇలా నిత్యం రాయపేట కార్యాలయంలో ఉంటూ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఆర్కేనగర్లో గెలుపుతో సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయం అన్నంతగా ఎదిగిన దినకరన్‌ను ఒక్కసారిగా పాత, కొత్త సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఇరకాటంలో పడ్డారని చెప్పవచ్చు. ఇక కోర్టు చుట్టూ ప్రదక్షిణలేనా: ఆర్కేనగర్ రూపంలో కష్టాలు మరింతగా చుట్టుముట్టడంతో సాగిన పరిణామాలు ప్రస్తుతం టీటీవీకి కష్టాలను కొని తెచ్చిపెట్టారు. ఓ వైపు విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ వేగవంతం కావడం, కోర్టుమెట్లు ఎక్కాల్సిన పరిస్థితుల నేపథ్యంలో రెండాకుల చిహ్నం కోసం సాగిన లంచం వ్యవహారం మెడకు బిగుసుకోవడంతో ఇక కేసుల ఊబిలో కూరుకు పోయినట్టు పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిన్న మొన్నటి వరకు పొగడ్తల పన్నీరు చల్లిన వాళ్లు, ప్రస్తుతం తిట్ల పురాణంతో తప్పుకో...అంటూనే, తప్పించేశాం...ఇక కార్యాలయం వైపుగా అడుగులు కూడా పెట్టొదంటూ హెచ్చరికలు చేసే పనిలో పడడం గమనార్హం. ఇప్పటికే పాస్‌పోర్టు సీజ్ చేయబడి ఉన్నా, తాజా పరిణామాల నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా వాంటెడ్ లిస్టులో ఆయన పేరు ఎక్కడం, ఎగ్మూర్ కోర్టు మెట్లు ఎక్కడం అన్నీ ఒకే రోజు జరిగి పోవడంతో గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మున్ముందు దినకరన్ పరిస్థితి ముందు గొయ్యి...వెనక నొయ్యి అన్నట్టుగా ఉంటుందేమోనని ఎద్దేవా చేసే వాళ్లూ పెరుగుతున్నారు. మొన్నటి వరకు కేడర్ మధ్యలో ఠీవీగా నడిచిన దినకరన్ ఇక, న్యాయవాదులు, పోలీసులు నడుమ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదేమో..!. ఇందుకు అద్దం పట్టే రీతిలో బుధవారం ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎగ్మూర్ కోర్టు విచారణకు తన న్యాయవాదులతో కలిసి అడుగు పెట్టారు. ఇక, తన బలాన్ని చాటుకునే విధంగా పార్టీ కార్యాలయంలో సమావేశానికి సిద్ధ పడ్డా, అడుగు పెట్ట వద్దంటూ వచ్చిన హెచ్చరికతో గౌరవంగానే తప్పుకుంటున్నా..అన్నట్టు మీడియా ముందుకు వ్యాఖ్యలు వళ్లించడం బట్టి చూస్తే, కొన్ని సామెతులు గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుందేమో..! -
మంతనాల్లో బిజీ
♦ చర్చలు షురూ.. ♦ భద్రత పెంపు ♦ తొలి గెలుపుతో పన్నీరు జోష్ ♦ టీటీవీకి భంగపాటు ♦ దూకుడు పెంచిన పళని ♦ ఏకం అయ్యేదెన్నడో ♦ పదవుల చర్చ..ప్రచార హోరు టీటీవీ దినకరన్‌ను సాగనంపుతూ మంత్రులు చేసిన ప్రకటనతో అన్నాడీఎంకేలో రాజకీయ చర్చ తారాస్థాయికి చేరింది. బుధవారం పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ సాగింది. ఓ వైపు పన్నీరు శిబిరం, మరో వైపు సీఎంతో మంత్రులు, ఇంకో వైపు టీటీవీ దినకరన్ ఎవరికి వారు వేర్వేరుగా మంతనాల్లో బిజిబిజీ అయ్యారు. సీఎంకు చెక్ పెట్టే రీతిలో టీటీవీ నిర్ణయం తీసుకునేనా అన్న చర్చ ఊపందుకుంది. దీంతో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఊహాగానా లు, ప్రచారాలకు చెక్ పడినా, ఇక, పన్నీరుతో చర్చలు షురూ అని సీఎం టీం ప్రకటించడంతో రాజకీయ ఆసక్తి సాఫీగా సాగింది. అయితే, చర్చల్లో పదవుల పందేరాల వ్యవహారం చర్చ హోరెత్తే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణం తదుపరి నిత్యం అన్నాడీఎంకేలో ఏదో ఒక వివాదం, చర్చ సాగుతూనే వస్తున్నది. చిన్నమ్మ శశికళ జైలు జీవితంతో పార్టీకి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని మంగళవారం మంత్రులు తీసుకోవడం మరో పెద్ద చర్చకు, ఉత్కంఠకు దారి తీసింది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నాయో అన్న ఉత్కంఠ రాష్ట్రంలో బయలు దేరింది. సీఎంకు చెక్ పెట్టే రీతిలో దినకరన్ దూకుడు పెంచవచ్చన్న సంకేతాలతో అందరి దృష్టి అన్నాడీఎంకే పరిణామాల మీద పడింది. దీంతో శాంతి భద్రతలకు విఘాతం కల్గేనా అన్నంత ఉత్కంఠ బయలు దేరడంతో ఆగమేఘాలపై చెన్నైతో పాటు పలు నగరాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, సీఎం, మాజీ సీఎం, దినకరన్ ఇంటి పరిసరాల్ని అయితే, భద్రతా వలయంలోకి తెచ్చారు. మంతనాల్లో బిజీ బిజీ... ఈ ఉత్కంఠకర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికి వారు మంతనాల్లో బిజీ కావడంతో మీడియా దృష్టి అంతా అన్నాడీఎంకే వైపుగా మరలింది. రాష్ట్రంలో ఎక్కడచూసినా అన్నాడీఎంకే అంతర్గత సమరం చర్చే. ఈ పరిస్థితుల్లో తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు తగ్గట్టు ఉదయాన్నే దినకరన్ ప్రయత్నాల్లో పడ్డారని చెప్పవచ్చు. తనకు మద్దతుగా కనీసం యాభై మంది వరకు ఎమ్మెల్యేలు కదిలి వస్తారని ఆశించినా, భంగపాటు తప్పలేదు. ఆరేడుగురు ఎమ్మెల్యేలు మాత్రం ప్రత్యక్షం కావడంతో వారితో మంతనాల్లో దినకరన్ మునిగారు. చివరకు మీడియా ముందుకు వచ్చి ఉత్కంఠకు తెర పడేలా చేశారు. పోలీసులకు కాస్త పని తగ్గినట్టు చేశారు. మీడియాతో మాట్లాడే సమయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడుతున్నానని, దూరం నిర్ణయం తనకు ఎలాంటి బాధను కల్గించలేదంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. అందరూ ఐక్యంగా ఉండాలన్నదే తన అభిమతం అని, పదవికి రాజీనామా అన్నది మాత్రం చిన్నమ్మ శశికళ నిర్ణయం మేరకే నంటూ ముందుకు సాగారు. పన్నీరు జోష్ : దినకరన్‌కు వ్యతిరేకంగా మంత్రుల ప్రకటనతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసిందని చెప్పవచ్చు. ఇక, చిన్నమ్మ శశికళకు చెక్ పెట్టినట్టేనన్నంత ధీమాలో మునిగారు. ఉదయాన్నే గ్రీమ్స్ రోడ్డులోని ఆయన నివాసం వద్దకు మద్దతు నేతలు, కేడర్ తరలి రావడంతో ఆ పరిసరాలు చాలా రోజు అనంతరం మళ్లీ కిక్కిరిశాయి. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. ధర్మయుద్ధంలో ఇది తొలి గెలుపుగా అభివర్ణించారు. పళని దూకుడు : దినకరన్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదేని వ్యూహాలకు పదును పెట్టిన పక్షంలో తిప్పికొట్టేందుకు తగ్గ అస్త్రాల్ని సిద్ధం చేసుకునే రీతిలో ఉదయాన్నే సీఎం ఎడపాడి పళనిస్వామి సైతం మంతనాల్లో బిజీ అయ్యారు. ఇరవై మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో హడావుడి పెరిగింది. దూకుడు పెంచే రీతిలో తరచూ ఎవరో ఒక మంత్రి బయటకు వచ్చి మీడియా ముందు దినకరన్‌కు హెచ్చరికలు చేసి వెళ్లడం గమనార్హం. పార్టీ కార్యాలయం వైపుగా అడుగులు పెడితే తీవ్ర పరిణామాలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు సైతం అందులో ఉండడం గమనార్హం. ఈ మంతనాల జోరుసాగుతున్న సమయంలో దినకరన్ మీడియాతో స్పందించి తీరును పరిగణించి ఇక విలీనం విషయంగా దూకుడు పెంచేందుకు పళని సిద్ధమయ్యారు. చర్చలు షురూ : ఇక, అన్నాడీఎంకే ఒకే వేదిక అన్నట్టుగా నేతలు ముందుకు సాగే సమయం ఆసన్నం అవుతోన్నట్టు స్పష్టమైంది. గతంలో శశి అండ్ కోను అమ్మ జయలలిత సాగనంపితే, ప్రస్తుతం దినకరన్ అండ్ కోను సాగనంపుతూ తీసుకున్న నిర్ణయం పళనిస్వామి మీద ప్రజల్లో కాస్త క్రేజ్ పెంచినట్టు అయింది. పన్నీరు పంతనం నెగ్గడం, పళని దూకుడు పెంచడం వెరసి ఇక, అన్నాడీఎంకేకు మంచి రోజులు మళ్లీ వస్తాయా అన్న ఆశలు కేడర్‌లో మొలకెత్తుతున్నాయి. ఇక, శశికళ, దినకర్ అండ్ కోకు చెక్ పెట్టడాన్ని ఆహ్వానించే రీతిలో ప్రజల మధ్య చర్చలు సాగడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో విలీనం విషయంగా చర్చలు సాగించేందుకు పన్నీరు, పళని శిబిరాలు సిద్ధం అయ్యాయి. గురువారం నుంచి సాగే చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు, షరతులు తెర మీదకు రానున్నాయో అన్న కొత్త ఉత్కంఠ బయలు దేరింది. ముందుగా ఇరు పక్షాల ప్రత్యేక కమిటీలో సమావేశాలు సాగించి, చివరగా పళని, పన్నీరు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు తగ్గట్టు కార్యచరణ సాగనుంది. అయితే, ఈ చర్చల్లో తెర మీదకు రానున్న అంశాలపై రక రకాల ప్రచారాలు, పుకార్లు అప్పుడే ఊపందుకున్నాయి. పన్నీరు సీఎం అన్నట్టుగా, కాదు..కాదు ప్రధాన కార్యదర్శి అంటూ ఓ వైపు, మరో వైపు పళనికి ఇక రెండు(పార్టీ, ప్రభుత్వం) చోట్లా డిప్యూటీ పదువులే అన్నంతగా చర్చలు సాగుతుండడం గమనార్హం. తమిళ మీడియా ఇదే అంశాలను తెర మీదకు తెచ్చే కథనాలు మొదలెట్టే పనిలో పడ్డాయి. అయితే, చర్చల్లో పై అంశాలు సాధ్యమేనా..? ఏకం అయ్యేదెన్నడో..?, విలీనం మూహూర్తం ఎప్పుడో అన్నది వేచి చూడాల్సిందే. -
విలీనంపై నేటి నుంచి చర్చలు
- అన్నాడీఎంకేలో ఆసక్తికర పరిణామాలు - పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని దినకరన్ ప్రకటన సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్‌పై వేటుపడిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దినకరన్, ఆయన కుటుం బ సభ్యులను పార్టీ, ప్రభుత్వ కార్యకలా పాల కు దూరంగా పెట్టాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి జయకుమార్ మంగళవారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో అన్నాడీఎంకే లోని వైరి వర్గాల విలీనంపై నేటి నుంచి చర్చలు ప్రారంభం కానున్నాయి. అధికార వర్గానికి సీఎం ఎడపాడి పళనిస్వామి, మరో వర్గానికి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సారథ్యం వహిస్తూ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఇరువురు నేతలు ముఖాముఖిగా చర్చలు జరపకుండా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. చర్చలు ఫలప్రదమైన తరు వాత ఎడపాడి, పన్నీర్ కలుసుకునేలా నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, ఉప ముఖ్యమంత్రిగా ఎడపాడి పళని స్వామి అనే కోణంలో చర్చలు ఆరంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి అనే అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. వాంటెడ్ దినకరన్ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్ల లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ విదేశాలకు పారిపోకుండా ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. దినకరన్ పేరును ‘వాంటెడ్’ (పోలీసులు గాలిస్తున్న వ్య క్తుల జాబితా) జాబితాలో చేర్చారు. ఢిల్లీ పోలీసులు టీటీవీ దినకరన్‌కు బుధ వారం రాత్రి 10.45 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లి సమన్లు జారీ చేశారు. ఆ సమయంలో అక్కడున్న మైలాపూర్‌కు చెందిన దినకరన్ మద్దతుదారుడు రవిచంద్రన్ ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నిం చగా అక్కడున్న వారు అతన్ని అడ్డుకున్నారు. పార్టీకి దూరంపై బాధలేదు: దినకరన్, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండా లని ఆదేశిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై నాకు బాధలేదు. పార్టీ చీలిపోకూడదన్నదే నా అభిమతం. నేను దూరంగా ఉండడం పార్టీకి మేలని భావిస్తే అందుకు కట్టుబడి ఉంటా. కోమాలో తమిళ సర్కార్: స్టాలిన్, ప్రతిపక్ష నేత సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కోమాలో ఉంది. తమిళనాట రైతు సమస్యలు, నీటి ఎద్దడి తాండవం చేస్తుంటే, పాలకులు వారి స్వలాభాన్ని చూసుకునే పనిలో పడ్డారు. అందుకే ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర చాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించాం. ధర్మయుద్ధంలో తొలి విజయం ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎం కేను జయలలిత 29 ఏళ్లపాటు జయప్ర దంగా ముందుకు తీసుకెళ్లి ప్రజల పార్టీగా తీర్చిదిద్దారు. అమ్మ మరణం తరువాత పార్టీని శశికళ కుటుంబ సభ్యుల కబంధహస్తాల నుంచి పార్టీని కాపాడుకునేందుకే ధర్మయుద్ధం సాగిం చాను. రెండువర్గాలూ ఏకమయ్యే దిశగా సాగుతున్న ఈ పయనం మా ధర్మయు ద్ధానికి లభించిన తొలి విజయం. – పన్నీర్‌సెల్వం, మాజీ ముఖ్యమంత్రి -
రెండాకులు ఒకటయ్యేనా?
♦ శశికళ ప్రమేయం లేకుండా రాజీబాట ♦ దినకరన్ వర్గం కస్సుబుస్సు ♦ మంత్రుల్లో సంతోషం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎంతో చరిత్ర కలిగిన అఖిలభారత అన్నాడీఎంకే అంతర్థ్దానం కావడం, రెండాకుల చిహ్నం రాలిపోవడం జీర్ణించుకోలేక ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రాజీ ప్రయత్నాలు ఫలించేనా, రెండాకులు మళ్లీ చిగురుతొడిగేనా అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. అమ్మ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వాలను చేజిక్కించుకోవడం ద్వారా శశికళ వర్గమే పైచేయిగా నిలిచింది. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో శశికళ వర్గాన్ని అన్నాడీఎంకే నేతలుగా, రెండాకుల చిహ్నంపై పోటీ చేసేందుకు అర్హులుగా ఎన్నికల కమిషన్ భావించలేదు. ‘అన్నాడీఎంకే అమ్మ’ పేరున కొత్త పార్టీని స్థాపించి టోపీ గుర్తుపై పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంజీ రామచంద్రన్ స్థాపించి, జయలలిత హయాంలో ఒక బలమైన రాజకీయపార్టీగా ఎదిగిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం లేకుండా చేసిన అపప్రథను శశికళ వర్గం మూటకట్టుకుంది. తాత్కాలికంగా అధికారంలో ఉన్నా భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉండదనే సత్యాన్ని గ్రహించిన సీఎం ఎడపాడి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. శశికళ, దినకరన్ వల్ల ఏర్పడిన అప్రతిష్టను తొలగించుకోవడం, పార్టీ, చిహ్నాలను దక్కించుకోవడం ప్రధాన కర్తవ్యంగా భావించారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని, శాశ్వత ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత చేత నియమింపబడిన తామే పార్టీకి అసలైన వారసులమని ఎన్నికల కమిషన్ వద్ద వాదిస్తున్న పన్నీర్‌సెల్వం వర్గాన్ని చేరదీయక తప్పదని సీఎం తీర్మానించుకున్నారు. దినకరనే ప్రతిబంధకం: అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కోల్పోవడం ఇరువర్గాలకు నష్టమేనని తెలుసుకున్నారు. సామరస్యపూర్వక వాతావరణంలో ఏకం అయ్యేందుకు సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సిద్దమైనారు. అయితే శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలన్న పన్నీర్‌సెల్వం షరతులు విలీనానికి ప్రతిభందకంగా మారుతోంది. శశికళ జైలు కెళ్లేపుడు పార్టీ బాధ్యతలను తన అక్క కుమారుడు దినకరన్‌ను ఉప ప్రధానకార్యదర్శిగా నియమించారు. అయితే దినకరన్ వైఖరితో ప్రభుత్వం అసంతృప్తి రగిలిపోతోంది. దినకరన్‌ను దూరం పెట్టడం వల్ల ప్రజల్లో ప్రతిష్టపెరగడం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకం కావడం, రెండాకుల చిహ్నం దక్కడం వంటి లాభాలు ఉన్నాయని సీఎం ఆశతో ఉన్నారు. పన్నీర్‌సెల్వం డిమాండ్లకు అనుకూలంగా దినకరన్‌ను ఒప్పించాలని లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై నాయకత్వంలో 9 మందితో కూడిన మంత్రుల బృందాన్ని సీఎం సిద్దం చేశారు. అయితే పార్టీ బాధ్యతల నుండి తప్పుకునేందుకు దినకరన్ ససేమిరా అంటున్నారు. మాట వినకుంటే డిస్మిస్ చేయాల్సి వస్తుందని సీఎం వర్గ మంత్రులు చేసిన హెచ్చరికలకు జవాబుగా ప్రభుత్వాన్ని కూల్చివేయగల సత్తా తనకు ఉందని దినకరన్ వ్యాఖ్యానించారు. రెండువర్గాల విలీన ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని పలువురు మంత్రులు మంగళవారం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా పార్టీ పరంగా ఇంతటి కీలక పరిణామాల్లో శశికళ పేరు నామమాత్రం కూడా చోటుచేసుకోక పోవడం విశేషం. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజీబాటలో ప్రయాణంలో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఒకటిగా నిలుస్తుండగా, దినకరన్ వైరి వర్గంగా మారిపోవడం విచిత్రకరమైన పరిణామం. మరి ఈ పరిస్థితిలో అన్నాడీఎంకే విలీనం సాధ్యమా అనే ప్రశ్నకు మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. -
చిన్నమ్మ శశికళపై వేటు
-
శశికళపై వేటు
దినకరన్, కుటుంబం వెలి - తమిళనాడు కేబినెట్ కీలక నిర్ణయం.. శశికళ పేరు ప్రస్తావించకుండా ప్రకటన - రోజువారీ కార్యకలాపాల కోసం త్వరలో కమిటీ: ఆర్థికమంత్రి వెల్లడి - పంతం నెగ్గించుకున్న పన్నీర్‌సెల్వం.. విలీనం చర్చలకు ‘వెలి’ షరతు - రెండాకుల చిహ్నం కోసం ఒక్కటైన అన్నాడీఎంకే వర్గాలు సాక్షి ప్రతినిధి, చెన్నై/ఢిల్లీ: తమిళనాడులో ఊహించని పరిణామం. చిన్నమ్మ శశికళ కుటుంబంపై రాష్ట్ర కేబినెట్ మూకుమ్మడిగా తిరుగుబాటు ప్రకటించింది. అన్నా డీఎంకే (అమ్మ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని (శశికళ పేరు ప్రస్తావించకుండా) పార్టీ నుంచి, ప్రభు త్వం నుంచి వెలివేశారు. దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంచాలని ముఖ్యమంత్రి ఈ. కె.పళనిస్వామి మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ ‘సంప్రదింపుల’ భేటీలో ప్రజలు, పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆర్దిక మంత్రి డి.జయ కుమార్ ప్రకటించారు. పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి దినకరన్‌ను, ఆయన కుటుంబాన్ని దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారని మంగళవారం రాత్రి ఇక్కడ విలేకరులకు తెలి పారు. అది పార్టీ శ్రేణులతో పాటు అత్యున్నత స్థాయి నాయకులు, జిల్లా కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకున్న నిర్ణయమని జయకుమార్ పేర్కొన్నారు. పార్టీ రోజువారీ కార్యకలాపాలను నడిపించడానికి త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. దినకరన్‌ను అన్నాడీఎంకే నుంచి జయలలిత బహిష్కరించగా శశికళ పునర్నియమించడం తెలిసిందే. బెంగళూరు జైలుకు వెళ్లడానికి ముందు దినకరన్‌ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా శశికళ నియమించారు. అన్నా డీఎంకేలోని రెండు గ్రూపులూ విలీనం కావడానికి చర్చలు జరపాలంటే... పార్టీ జనరల్ సెక్రటరీ శశికళను, ఆమె మేనల్లు డు దినకరన్‌ను దూరంగా ఉంచాలని తిరుగు బాటు నాయకుడు పన్నీర్‌సెల్వం విధించిన ముందస్తు షరతుకు, కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదని జయకుమార్ పేర్కొన్నారు. పన్నీర్ సెల్వంతో చర్చలు జరప డానికి మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని ఆయ న తెలిపారు. ఈ భేటీలో దిండిగల్ సి. శ్రీనివా సన్, ఎస్పి వేలుమణి, ఆర్బి ఉదయకుమార్, తంగమణి, సి వేషన్ముగమ్, రాజ్యసభ ఎంపీ వి.వైతలింగం తదితరులు పాల్గొన్నారు. రెండాకుల చిహ్నం చుట్టూ.. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని, రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న దినకరన్‌తో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని సీఎం సహా కొందరు సీనియర్ మంత్రుల్లో ఆందోళన నెలకొంది. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నుంచి పార్టీ విలీనంపై చర్చకు సిద్ధమని ఆహ్వానం అందింది. అయితే, పార్టీ, ప్రభుత్వంపై శశికళ, దినకరన్ కుటుంబ పెత్తనం లేకుండా చేయాలని పన్నీర్‌సెల్వం ముందస్తు షరతు విధించారు. ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునేందుకు దినకరన్‌తో తెగతెంపులు చేసుకోవాలనే సంకల్పంతో మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లో 20 మంది మంత్రులు సమావేశమయ్యారు. సుమారు గంటపాటు అనేక అంశాలపై చర్చించిన అనంతరం మంత్రి జయకుమార్ మీడియాతో సమావేశం నిర్ణయాలు ప్రకటించారు. శశికళ పేరు ప్రస్తావించకుండా... దినకరన్, ఆయన కుటుంబీకులతో ఎటువంటి సంబంధం పెట్టుకోరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జయకుమార్ చెప్పారు. ఎలాంటి కారణం చేతనూ ఇకపై వారిని చేరదీసే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తల, ప్రజల మనోభీష్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పా రు. అయితే శశికళ పేరును ప్రస్తావించకుండా దినకరన్ కుటుంబీకులు అని మాత్రమే పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా, దినకరన్ తొలగింపు లేదా మరేదైనా చర్యపై పార్టీ సర్వసభ్య సమావేశంలో మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, పార్టీ పరంగా నిర్ణయం తీసుకునే అధికారం మంత్రులకు లేదని ఉత్తర చెన్నై అన్నాడీఎంకే అధ్యక్షుడు, పెరంబూరు ఎమ్మెల్యే వెట్రివేల్ మంగళవారం వ్యాఖ్యానించారు. దినకరన్ కోసం చెన్నైకి ఢిల్లీ బృందం అన్నా డీఎంకే (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్ కోసం ఢిల్లీ పోలీసులు త్వరలో చెన్నైకి ఓ బృందాన్ని పంపించనున్నారు. తమ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించేలా చూడడం కోసం ఎన్నికల కమిషన్ అధికారికి దినకరన్ లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. బ్రోకర్ సుకేష్ చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన వెంటనే దినకరన్‌పై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా చంద్రశేఖర్‌ను వరుసగా మూడో రోజైన మంగళవారం కూడా క్రైమ్‌బ్రాంచ్ అధికారులు విచారించారు. శశికళపై తిరుగుబాటు.. వేటుకు రంగం సిద్ధం? బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం -
టెన్షన్.. టెన్షన్
♦ ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు ♦ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాక ♦ ప్రభుత్వ తీరుపై రహస్య చర్చలు ♦ మంత్రులకు పన్నీర్‌సెల్వం గాలం ♦ శశికళ వద్దకు దినకరన్ పరుగు అధికార పార్టీ, ప్రభుత్వం రెండూ టెన్షన్లో పడిపోయాయి. ఐటీ దాడులు, అసంతృప్తి సెగలు, దినకరన్‌కు సమన్లు ఒకటి తరువాత ఒకటిగా పడుతున్న దెబ్బలతో కుదేలైపోతున్నాయి. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆకస్మిక ఆగమనం వారిని మరింత ఆందోళనకు గురిచేయగా, ఎటువంటి సమాచారం వినాల్సి వస్తుందోనని వణికిపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార పార్టీని పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ నుంచి సమన్లు ఎదుర్కొంటున్న విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని కొందరు మంత్రులే డిమాండ్ చేస్తున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు, రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ ఆహ్వానం... మంత్రులు ఓకే అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, రెండాకుల చిహ్నం ఎవరికి అనే అంశంపై ఢిల్లీలో విచారణ జరుగుతున్నదని తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే ఇరువురూ రాజీనామా చేయాలని శశికళ, దినకరన్‌లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుండి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
‘రెండాకుల’ కోసం 50 కోట్లు!
-
‘రెండాకుల’ కోసం 50 కోట్లు!
► ఎన్నికల అధికారికి శశికళ మేనల్లుడు దినకరన్ లంచం ► 1.30 కోట్లతో బ్రోకర్ అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం రెండాకులను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) అధికా రికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారు. ఈ వ్యవహా రానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమ వారం దినకరన్‌పై కేసు నమోదు చేసి.. మధ్య వర్తిని అరెస్టు చేశారు. ఎన్నికల అధికారి ఒకరికి దినకరన్ రూ. 50 కోట్ల లంచం ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఢిల్లీ పోలీ సులు చెప్పారు. దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది శశికళ వర్గానికి దెబ్బగా భావిస్తున్నారు. మధ్యవర్తి వద్ద రూ. 1.30 కోట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిషేధం విధించింది. దీనిపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, రెండాకుల చిహ్నం కోసం ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్లో దినకరన్ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకోగా కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద లంచంలో అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.1.30 కోట్లు పట్టుబడింది. అతని నుంచి బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సుఖేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం ఢిల్లీలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి తనతో మాట్లాడారని, ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని తన బంధువు చంద్రశేఖర్ ద్వారా పనులు చక్కబెడుతుంటానని సుఖేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సుఖేష్‌పై దేశవ్యాప్తంగా పలు మోసం కేసులుండగా, రెండుసార్లు పట్టుబడ్డాడు. తాజా కేసులో సుఖేష్ ప్రేయసి, నటి లీనాను సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
మళ్లీ సమన్లు
► బెదిరించిన ముగ్గురు మంత్రులపై కేసు నమోదు ►అన్నాడీఎంకే (అమ్మ)లో విబేధాలు ► సీఎం ఎడపాడి వర్సెస్ దినకరన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికల పుణ్యమాని రాష్ట్ర రాజకీయాలు మరోసారి అల్లకల్లోలంగా మారిపోయాయి. రాష్ట్ర మంత్రులను ఐటీ వెంటాడుతూనే ఉంది. వైద్య మంత్రి విజయభాస్కర్‌కు శుక్రవారం మరోసారి ఐటీ సమన్లు జారీకాగా, ఐటీ అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరణైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి దినకరన్ తరఫున విచ్చలవిడిగా ధన ప్రవాహానికి పాల్పడ్డారనే సమాచారంతో వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్నుశాఖ దాడులు నిర్వహించి రూ.5.5 కోట్ల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.అలాగే విజయభాస్కర్ నగదు పంపిణీలో భాగస్వాములుగా భావిస్తూ మాజీ ఎంపీ రాజేంద్రన్, సమక పార్టీ అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్, ఎంజీఆర్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గీతాలక్ష్మి ఇళ్లు,తదితర 35 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించి ఆర్కేనగర్ ఎన్నికలకు రూ.89 కోట్లు ఖర్చు చేసినట్లు తేల్చారు. దాడులు పూర్తికాగానే మంత్రిని ఐటీ కార్యాలయానికి పిలిపించుకుని 5గంటలపాటు విచారించగా, ఈనెల 17వ తేదీన మరోసారి హాజరుకావాలని మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ శుక్రవారం సమన్లు పంపింది. మంత్రిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రికి సన్నిహితురాలైన ఎంజీఆర్ వైద్య వర్సిటీ వైస్‌చాన్సలర్ గీతాలక్షి సైతం 17వ తేదీన ఐటీ ముందు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా, ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రులు కామరాజ్, రా«ధాకృష్ణన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రచ్చకెక్కిన ఇంటిపోరు: ఇన్నాళ్లూ చాపకింది నీరులా ఉన్న అన్నాడీఎంకే (అమ్మ)లోని ఇంటిపోరు రచ్చకెక్కింది. ఆదాయపు పన్నుశాఖ (ఐటీ)చే విచారణను ఎదుర్కొంటున్న వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌ను పదవి నుండి తప్పించాలనే అంశంలో సీఎం ఎడపాడి, దినకరన్‌ల మధ్య విభేధాలు భగ్గుమాన్నాయి. జయలలిత మరణానికి శశికళ, అమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తున్న తరుణంలో వారిని దూరం పెట్టాలని ఎడపాడి భావించారు. అయితే ఎడపాడి మాటను కాదని ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ పోటీ సిద్దం కావడంతో విభేధాలు పొడచూపాయి. మంత్రులు సైతం రెండు బృందాలుగా మారి ఎడపాడి, దినకరన్ పక్షాన నిలిచాయి. ఐటీ దాడులకు గురై విచారణను ఎదుర్కొంటున్న మంత్రి విజయభాస్కర్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 17వ తేదీన ఐటీ కార్యాలయానికి హజరుకావాలని సమన్లలో ఆదేశించి ఉన్నారు. మంత్రిని పదే పదే విచారిస్తుండగా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందరూ అంచనావేస్తున్నారు. అయితే మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. తమిళనాడు ప్రభుత్వానికి మచ్చగా మారిన ఉదంతం నుండి బైటపడేందుకు విజయభాస్కర్‌కు ఉద్వాసన పలకాలని సీఎం నిర్ణయించుకోగా సీనియర్ మంత్రులు జయకుమార్, సీవీ షణ్ముగం, వేలుమణి, తంగమణి సైతం ఎడపాడికి మద్దతు పలికారు. అయితే దినకరన్ గట్టిగా అడ్డుకున్నారు. సీనియర్ మంత్రులే దినకరన్‌పై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం పార్టీ, ప్రభుత్వంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విజయభాస్కర్‌ను మంత్రి వర్గం నుండి తొలగించాలని కోరుతూ సదరు సీనియర్ మంత్రులు గురువారం రాత్రి దినకరన్‌ను కలుసుకున్నారు. కాగా, లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై, మంత్రులు దిండుగల్లు శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి తదితరులు శుక్రవారం దినకరన్‌తో సమావేశమైనారు. అయితే మంత్రి విజయభాస్కర్‌ను క్యాబినెట్ నుండి తప్పించే ప్రసక్తే లేదని దినకరన్ స్పష్టం చేయగా, విజయభాస్కర్‌పై తగిన చర్య తీసుకుంటామని గవర్నర్ విద్యాసాగర్‌రావు హామీ ఇచ్చినట్లు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం మీడియాతో చెప్పారు. అంతేగాక ప్రభుత్వంలో మార్పులకు దినకరన్ ఇంటిలో మంతనాలు సాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇద్దరు మంత్రులపై కేసు ?
► విచారణాధికారిగా ఏఎస్పీ శంకర్ ► మంత్రి విజయభాస్కర్‌కు సమన్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదనపు పోలీస్ కమిషనర్ శంకర్‌ను విచారణాధికారిగా కమిషనర్ కరణ్ సిన్హా నియమించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచే నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన రాష్ట్రం నలుమూలలా ఐటీ దాడులు సాగాయి. ఈ సమయంలో మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించినట్లుగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఐటీ ఉన్నతాధికారులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ మంత్రులపై కేసు నమోదుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నేతృత్వంలో సంఘటనపై విచారణ జరిపేందుకు కమిషనర్ నిర్ణయించారు. ఇదిలా ఉండగా, దాడుల తరువాత కార్యాలయానికి ఐటీ కార్యాలయంలో హాజరైన మంత్రి విజయభాస్కర్‌కు మరలా సమన్లు పంపారు. ఈ సమన్ల ప్రకారం శుక్రవారం ఉదయం అధికారుల విచారణకు మంత్రి మరోసారి హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలను చూపి మంత్రి హాజరుకాలేదు. మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్‌కుమార్ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు మంత్రికి దినకరన్ బాసట మంత్రి విజయభాస్కర్‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆయనకు బాసటగా నిలిచారు. మంత్రి విజయభాస్కర్‌ను పదివి నుంచి తప్పించడమో లేక రాజీనామా కోరడమో అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దినకరన్ గెలుపు కోసమే మంత్రి నగదు పంపిణీ చేసిన సంగతి పాఠకులకు విదితమే. తన గెలుపుకోసం ఐటీ ఉచ్చులో పడి అవస్థలు పడుతున్న మంత్రికి ఆయన భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేశారు. -
విచారణకు రావాల్సిందే!
దినకరన్‌కు కోర్టు ఆదేశం చెన్నై : విదేశీ మారక ద్రవ్య కేసు విచారణ నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఏర్పడింది. ఎగ్మూర్ కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా. ఈనెల 19,20 తేదీల్లో కోర్టుమెట్లు ఎక్కాల్సిందేనని గురువారం ఆదేశాలు జారీ చేసింది. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ విదేశీ మారక ద్రవ్య కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఎగ్మూర్ కోర్టులో జరుగుతోంది. ఈ విచారణకు డుమ్మా కొట్టే విధంగా దినకరన్ వ్యవహరిస్తూ రావడంతో కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గురువారం పిటిషన్ విచారణకు రాగా, టీటీవీ , ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. టీటీవీ తరఫు న్యాయవాది ఈ పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కోరారు. హైకోర్టులో ఈ కేసుకు తగ్గ పిటిషన్ వేసి ఉన్నామని సూచించారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ విచారణను నిలుపుదల చేయాలని హైకోర్టు సూచించ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అక్షింతలు వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం 19,20 తేదీల్లో కోర్టుకు టీటీవీ దినకరన్ హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. గడువు : కేసులన్నింట్నీ వాయిదాల మీద వాయిదాలతో నెట్టుకొచ్చే విధంగా ముందుకు సాగుతున్న అన్నాడీఎంకే పెద్దలు, రెండాకుల చిహ్నం విషయంలోనూ అదే బాట అనుసరించే పనిలో పడ్డారు. రెండాకుల చిహ్నం విషయంగా వివరణ ఇవ్వాలని మాజీ సీఎం పన్నీరు శిబిరానికి, చిన్నమ్మ శశికళ నేతృత్వంలో టీటీవీ శిబిరానికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16లోపు వివరణ ఇవ్వాల్సి ఉండగా, తమకు ఎనిమిది వారాలు సమయం కావాలని చిన్నమ్మ శిబిరం తరఫున టీటీవీ ప్రతినిధులు ఢిల్లీలో సీఈసీకి విజ్ఞప్తి చేశారు. -
ఆర్కేనగరం విచిత్రం
► నిన్నటి వరకు జాతర ► నేడు నిర్మానుష్యం ► సమస్యల పునరావృతం ► ప్రజలకు తప్పని పాట్లు సాక్షి, చెన్నై : ఆదివారం వరకు ఆ నియోజకవర్గంలో పండుగ సందడి. అక్కడి ప్రజలకు నిత్యం విందే. చిన్న సమస్యకు చిటికెలో పరిష్కారం. ఇళ్ల వద్దకే వాటార్ ట్యాంకర్లు. సంపూర్ణంగా విద్యుత్ సరఫరా. ఓటుకు నోటు, తాయిలాల పంపిణీ, నేతల ప్రచారంతో నెల రోజులుగా హడావుడిలో మునిగిన ఆర్కేనగర్ ఇప్పుడు నిర్మానుష్యమైంది. జనం ఆనందం ఆవిరి అయింది. మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి.. ఎన్నికలు వస్తే చాలు నియోజకవర్గాల్లో నేతల హడావుడి, వాగ్దానాలు హోరెత్తుతాయి. ఎన్నికలు అయ్యాక అదే నేతలు ముఖం చాటేస్తారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రజలకు దరి చేరుతాయి. ఆ తర్వాత అధికారుల చుట్టు ప్రదక్షణలు తప్పదు. అయితే, అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఎన్నికల సమయంలో పండుగే. గత రెండున్నరేళ్లలో మూడు సార్లు ఇక్కడి ప్రజల ముందుకు ఎన్నికలు వచ్చాయి. జైలు జీవితానంతరం అమ్మ కోసం ఓ మారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు, తాజాగా అమ్మ మరణంతో ఎన్నికలు తప్పలేదు. అయితే, ఈ నియోజకవర్గాన్ని కైవశం చేసుకునేందుకు తీవ్ర సమరమే సాగింది. అన్నాడిఎంకేను దక్కించుకునే రీతిలో సాగిన ఈ సమరంలో నోట్ల కట్టలు తాండవం చేశాయి. అధికార పక్షం, అన్నాడిఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ రేసులో దిగడంతో అనేక ప్రాంతాల్లోని ఓటర్లకు నిత్యం పండుగే. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే ఇక్కడ ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ దరి చేరాయి. ఇదీ విచిత్రం: అమ్మ అభ్యర్థి అడుగు పెట్టిన చోటంతా అధికారుల హడావుడి తప్పలేదు. ఇందుకు కారణం వెన్నంటి సీఎం, మంత్రులు ఉండటమే. ప్రజలు చిన్న సమస్యను ప్రస్తావించినా క్షణాల్లో పరిష్కరించేంతగా చర్యలు సాగాయి. నియోజకవర్గం పరిధిల్లోని వార్డుల్లో తమ నేతల కంటే తమ నేతలకు ఆహ్వానం పలుకుతూ తోరణాలు, అరటి గెలలు అబ్బో చెప్పాలంటే, అక్కడ పండుగ వాతావరణం మిన్నంటì నట్టుగా పరిస్థితి కనిపించాయి. అయితే, ఒక్క ఉత్తర్వుతో అన్నీ తలకిందులు అయ్యాయి. ఓటుకు నోటు తాండవం ధృవీకరణతో ఎన్నికల్ని సీఈసీ రద్దు చేసిందో ఏమోగానీ, ఆ నియోజకవర్గం వైపుగా ప్రస్తుతం తొంగి చూసే వారు లేదని చెప్పవచ్చు. ఎన్నికల రద్దు విషయంగా పోస్టర్లు వెలిసినా, ప్రజా సమస్యలు మాత్రం మళ్లీ పునరావృతమే. ఈ నియోజకవర్గం పరిధిలో సాధారణంగా వంద వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.ఇందుకు కారణం ఇక్కడ నీటి ఎద్దడి అధికమే. ఎన్నికల ప్రచార సమయాల్లో ఆ సంఖ్య 500 వందలకు చేరిందని చెప్పవచ్చు. నీళ్లు సంవృద్ధిగా దక్కాయి.ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా సాగింది. ఇదంతా ఆదివారం అర్థరాత్రితో కనుమరుగు అయ్యాయి. సోమవారం కాలం నెట్టుకు వచ్చినా, మంగళవారం , బుధవారం నుంచి సమస్యలు మళ్లీ పునరావృతం కాక తప్పలేదు. నియోజకవర్గంలో గతంలో వచ్చే ట్యాంకర్లు మాత్రమే బుధవారం రావడంతో నీటి కోసం క్యూ కట్టక తప్పలేదు. తాగు నీటి కోసం అన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద జనం క్యూ కట్టి నీటిని పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పవర్ కట్ సమస్య మళ్లీ మొదలు కావడంతో ఉక్క పోత అనుభవించక తప్పడం లేదు. ఆదివారం వరకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న రోడ్లు, కాలువల్లో మళ్లీ చెత్తా చెదారం చేరుతున్నాయి. ఏ అధికారి, ఏ నాయకుడు అటు వైపుగా తొంగి చూడని దృష్ట్యా, ఇక తమకు ఎన్నికలు వచ్చే వరకు పాత కష్టాలు తప్పదన్నట్టుగా మనస్సు ఓదార్చుకుంటూ ఆర్కేనగర్ వాసులు ముందుకు సాగుతున్నారు. -
ఆర్కేనగర్లో విజయశాంతి
► దినకరన్ కు మద్దతు ► కొనసాగుతున్న ఘర్షణలు ► వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దినకరన్ తాజాగా ప్రముఖ సినీ నటి విజయశాంతిని ప్రచారంలోకి దించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేతలతో శుక్రవారం ప్రచారం నిర్వహించగా, దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల్లో సహజంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అయితే జయలలిత మరణం, అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో సహజస్థితి మాయమై కొత్త పోటీలు పొద్దుపొడిచాయి. ఆర్కేనగర్లో డీఎంకే అభ్యర్థి పోటీచేస్తున్నా అన్నాడీఎంకే నుంచి రెండు వైరి వర్గాలే ఒకరిపై ఒకరు పట్టుదలతో ఉన్నారు. ఆర్కేనగర్లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న దినకరన్ తమిళ సినీ రంగానికి చెందిన ఎందరో తారలను ప్రచారంలోకి దించారు. తాజాగా దినకరన్ తరఫున విజయశాంతి రంగ ప్రవేశం చేశారు. ఆర్కేనగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొరుక్కుపేట, శాస్త్రినగర్, కామరాజనగర్, తదితర ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తిరువళ్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీవీ.రమణ, అన్నాడీఎంకే కార్యదర్శి బలరామన్, గుమ్మిడిపూండి జిల్లా కార్యదర్శి విజయకుమార్, పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉన్నారు. ప్రచార సమయంలో తెలుగు ప్రజలు తమ అభిమాన నటి విజయశాంతికి ఘన స్వాగతం పలకడంతో పాటూ ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఘర్షణల నగర్:ఆర్కేనగర్లో ఎన్నికల ప్రచారం రానురాను ఘర్షణలకు దారితీస్తోంది. ధన వర్షం కురిపించైనా గెలుపొందాలని ఒక అభ్యర్థి, ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రత్యర్థుల ప్రయత్నాలతో పలువురు గాయపడుతున్నారు. ఓ వర్గం వ్యక్తులు రెండు రోజుల కిందట నగదు పంచుతుండగా అడ్డుకున్న ఇద్దరు డీఎంకే కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. కొరుక్కుపేట 41వ వార్డులో డీఎంకే కార్యకర్తలు తమ అభ్యర్థి మరుదు గణేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే ఆర్కేనగర్ కార్యదర్శి సంతానం, వార్డు కార్యదర్శి రవి నేతృత్వంలో 50 మంది యువకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తంగరాజ్(29), బాబు(31) గాయపడ్డారు. అలాగే, నేతాజీ నగర్లో గురువారం రాత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్యే కరుప్పయ్యా తదితర 8మందితో పాటు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పన్నీర్ వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తమది ధర్మయుద్ధం, గెలిచే తీరుతామని ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును దినకరన్ పంచుతున్నారని దీప ఎద్దేవా చేశారు. డీఎంకే అభ్యర్థి తరఫున స్టాలిన్ వీధి వీధిన తిరుగుతూ ప్రచారం చేశారు. పన్నీర్ వర్గీయులు జయలలిత భౌతిక కాయాన్ని పోలిన నమూనా శవపేటికతో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ సైతం ఈ తరహా ప్రచారాన్ని ఆక్షేపించింది. దినకరన్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మధుసూధనన్ తరఫున పన్నీర్‌సెల్వం ప్రచారం చేయగా, ఆర్కేనగర్లో పోటీచేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పన్నీర్‌సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూధనన్ గెలుపునకు పాటుపడతామని వారు చెప్పారు. వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్: ఆర్కేనగర్ ప్రజలను మభ్యపెట్టేందకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మురం చేశారు. శుక్రవారం ఉదయం పుదువన్నార్పేట్టై, దేశీయనగర్, ఇందిరానగర్, శివన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఓటర్లకు నోట్లు పంచుతున్న తిరుపూరుకు చెందిన తంగరాజ్, బాబు, ముసిరి సెంథిల్, జయశీలన్, పుదూర్ రామచంద్రన్ తదితర 9మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తండయార్‌పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి డీఎంకేకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.27వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, తనిఖీ అధికారులను ఇంట్లోకి రాకుండా నిలువరించేందుకు ఒక మహిళ బహిరంగంగా వివస్త్రగా మారగా అందరూ కంగారుపడ్డారు. ఆ మహిళ నోటిమాటల ధాటికి అధికారులు వెళ్లిపోయారు. ఆర్కేనగర్లో అక్రమమార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ను ఎన్నికల్లో పోటీచేయకండా అనర్హత వేటు వేయాల్సిందిగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. -
ఐటీ హడల్
► ఆర్కేనగర్ ఎన్నికలే నేపథ్యం ► వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే లక్ష్యం ► అధికార పార్టీలో కలవరం ► సుమారు రూ.50 కోట్లు స్వాధీనం? అధికార అన్నాడీఎంకే మంత్రులు, నేతలంతా ఆర్కేనగర్ ఉప ఎన్నికల ప్రచా రంలో బిజీ బిజీ. ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తు వేయడం ఎలా, చిత్తు చేయడం ఎలా అనే ఏకైక అజెండాతో రేయింబ వళ్లు తలమునకలు. ఈనెల 12వ తేదీన పోలింగ్, ప్రచారానానికి ఇక నాలుగు రోజులే (10వ తేదీ) గడువు. తెల్లారగానే ప్రచారానికి మళ్లీ పరుగులు పెట్టేందుకు అందరూ సన్నద్ధం. అయితే అధికార పార్టీ నేతలకు శుక్రవారం ప్రశాంతంగా తెల్లారలేదు. నిద్ర నుంచి కళ్లు తెరిచేలోగా ఆదాయ పన్నుశాఖ అధికారులు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటి తలుపు తెరిచారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి అధికార పార్టీ నేతలను హడలెత్తించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు, ఉప ఎన్నికలు సహజం. అయితే చెన్నై ఆర్కేనగర్లో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు సైతం సహజంగా ప్రారంభమై సంచలనానికి దారితీశాయి. అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలే ప్రధాన ప్రత్యర్థులుగా రంగంలో నిలవడంతో అన్నాడీఎంకే అమ్మ పార్టీ (స్వతంత్ర) అభ్యర్థి దినకరన్ (అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి) ధన ప్రవాహానికి పాల్పడుతున్నట్లు కొన్నిరోజులుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు రూ.4 వేల నుంచి రూ.10వేల వరకు పంచుతున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో తరచూ నగదు పట్టుబడుతూనే ఉంది. దినకరన్ మనుషులు నగదు పంచుతున్నట్లు ఒక వాట్సాప్ వీడియో కూడా సెల్‌ఫోన్ లలో హల్చల్ చేసింది. ఓటుకు నోటు చలామణి జరుగుతున్నట్లు ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఐటీ అధికారులను ఆర్కేనగర్కు నియమించారు. ఈ సమయంలోనే ఆర్కేనగర్లో నగదు పంపిణీ బాధ్యతను దినకరన్ వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్‌కు అప్పగించినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. అంతే ఇక ఎంతమాత్రం ఆలస్యం తగదని శుక్రవారం ఉదయం సుమారు వంద మంది అధికారులు ఒక్కసారిగా విరుచుకుబడ్డారు. రాష్ట్రం నలుమూలలా 35 చోట్ల ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ఉదయం 6 గంటల సమయంలో మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల ఇళ్లు, కార్యాలయాలే ప్రధాన లక్ష్యంగా దాడులు ప్రారంభించారు. మంత్రికి చెందిన చెన్నై, తిరుచ్చిరాపల్లి, పుదుక్కోట్టై తదితర ప్రాంతాల్లోని ఇళ్లు, విద్యాసంస్థలు, క్వారీ కార్యాలయాల్లో దాడులు చేశారు. చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులో నివసించే ప్రభుత్వ బంగ్లాపై ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. సాయుధ పారామిలటరీ దళాలను బందోబస్తుగా పెట్టుకుని సుమారు పది మంది అధికారులు మంత్రి నివాసంలోకి ప్రవేశించినపుడుఆయన నిద్రపోతున్నారు. ఐటీ అధికారులు ఆయనను నిద్రలేపి తనిఖీలకు వచ్చాం, సహకరించండి అంటూ ఇంటి ద్వారాలు, కిటికీలు మూసివేసి టెలిఫోన్ కనెక్షన్ తొలగించారు. సెల్ఫోన్లను స్విచ్ఆఫ్ చేయాల్సిందిగా ఆదేశించారు. చెన్నై చేపాక్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మంత్రి విజయభాస్కర్ నివాసం నుంచి రూ.1.80 కోట్లు, ఎగ్మూరులోని ఒక లాడీ్జలో మంత్రి విజయభాస్కర్ అనుచరులు అద్దెకు దిగిన మూడు గదుల నుంచి అర్కేనగర్‌లో ఓటర్లకు రూ.120 కోట్లు పంచినట్లుగా ఉన్న ఆధారాలు అధికారులకు చిక్కినట్లు తెలుస్తోంది. నైనార్ అనే మంత్రి సహచరుడు ఇంటి నుంచి రూ.1.20 కోట్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. కీల్పాక్కంలోని మంత్రి సోదరి ఇంటిపై కూడా దాడుల జరిపారు. కేవలం మంత్రికి సంబంధించే 21 చోట్ల దాడులు నిర్వహించారు. తమిళనాడు చరిత్రలో ఒక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు జరగడం ఇదే ప్రప్రథమమని వ్యాఖ్యానిస్తున్నారు. చెన్నై కొట్టవాక్కంలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ ఇల్లు, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయంపై కూడా దాడులు చేశారు. ఆర్కేనగర్ అభ్యర్థి దినకరన్ కు గురువారమే శరత్‌కుమార్ మద్దతు ప్రకటించగా శుక్రవారం దాడులు జరగడం గమనార్హం. తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గీతాలక్ష్మి నివసించే చెన్నై విరుగంబాక్కంలోని ఆమె నివాసం, గిండీలోని వర్సిటీలో వీసీ చాంబర్లోనూ తనిఖీలు చేశారు, మాజీ ఎంపీ రాజేంద్రన్ కి చెందిన చెన్నైలోని ఇళ్లు, కార్యాలయాలపై కూడా దాడులు నిర్వహించారు. రాష్ట్రం మొత్తం మీద వంద మంది అధికారులు బృందాలుగా ఏర్పడిత 35 చోట్ల ఐటీ దాడుల సందర్భంగా చెన్నైలో 21, పుదుక్కోట్టైలో 11, తిరుచ్చిలో 2, నామక్కల్‌లో ఒక చోట తనిఖీలు నిర్వహించారు. ఉప ఎన్నికల్లో నగదు బట్వాడా జరిగినట్లు ఐటీ దాడుల్లో తేలడంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు రద్దు కాగలవని కొందరు అంచనా వేస్తున్నారు. హద్దుమీరిన ఐటీ అధికారులు: మంత్రి విజయభాస్కర్ ఐటీ దాడులు సమయంలో అధికారులు హద్దుమీరి ప్రవర్తించారు. కనీసం నా కుమార్తెను స్కూలుకు కూడా పంపకుండా చేశారు. ఐటీ దాడుల్లో మా ఇంటి నుంచి ఏమీ స్వాధీనం చేసుకోలేదు. ఐటీ దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉంది. పథకం ప్రకారం దాడులు: దినకరన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకం ప్రకారం దాడులు జరిపారు. ఈ దాడుల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై హస్తం ఉంది. ఐటీ దాడుల వల్ల ఎన్నికల్లో మెజార్టీ మరింత పెరుగుతుంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: డీఎంకే స్టాలిన్ మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ దాడులు రాష్ట్ర రాజకీయాలకే అవమానం. సీఎం వెంటనే అతన్ని మంత్రి వర్గం నుంచి తొలగించాలి. ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం ఉందని తమిళ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించగా, ఐటీ దాడులు హర్షణీయమని, అయితే దాడులకు కేంద్రానికి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై అన్నారు -
ఎమీకి రాజకీయ రంగు!
నటి ఎమీజాక్సన్‌కు రాజకీయరంగుపులమనున్నారా? అలాంటి పరిస్థితి కనిపిస్తోందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.రాజకీయ వర్గాలు సినీ గ్లామర్‌ను వాడుకోవడం ఇవాళ కొత్తేమీ కాదు. అలాగే సినిమా వాళ్లకు రాజకీయ రంగు అనాధిగా పడుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ రాజకీయాలు ఇటీవల కన్ను మూసిన జయలలిత వరకూ సినిమా వారి చుట్టూనే తిరిగాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నియోజక స్థానాన్ని భర్తీ చేయడానికి సినీ గ్లామర్ అవసరంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. అన్నాడీఎంకే రెండు పార్టీలుగా చీలిపోయి ఆర్కే.నగర్లో పోటీ చేస్తూ గెలుపు కోసం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో అమ్మ అన్నాడీఎంకే తరఫున టీటీవీ.దినకరన్ బరిలో ఉన్నారు.ఈ స్థానాన్ని ఎలాగైనా సాధించాలన్నదే ధ్యేయంగా పోటీలో ఉన్న అన్ని పార్టీలు పరితపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో అమ్మ అన్నాడీఎంకే పార్టీ తరఫున ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్‌ను ప్రచారానికి వాడుకోవాలని ఆ పార్టీ వర్గాలు భావించినట్లు, అందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు టాక్. ఎందరో సినీ ప్రముఖులుండగా నటి ఎమీపైనే వీరి కన్ను పడడానికి కారణం లేకపోలేదు. ఈ అమ్మడు మదరాసు పట్టణం చిత్రం ద్వారా నటిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విషయం తెలిసిందే. అందులో ఆమె చాలా వరకూ టోపీ పెట్టుకునే అందంగా కనిపించింది. ఇక అమ్మ అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు టోపీ అన్నది తెలిసిందే. దీంతో అలాంటి గోపీని పెట్టుకుని నటి ఎమీజాక్సన్‌ను తమ పార్టీ తరుఫున ప్రచారం చేయవలసిందిగా ఎమీజాక్సన్‌ను కోరినట్లు, అందుకు ఈ బ్యూటీ పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత అన్నది ఎమీ ప్రచారానికి బయలుదేరే వరకూ వేచి ఉండాల్సిందే. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా 2.ఓ చిత్రంలో మెరవనున్న ఈ జాణ ప్రస్తుతం కాళీగానే ఉందన్నది గమనార్హం. -
వామ్మో..రూ.50 కోట్లా!
♦ ఆర్కేనగర్లో ధన ప్రవాహం ♦ 70 వేల ఓటర్లే లక్ష్యం ♦ ఎన్నికల కమిషన్ విస్మయం ఎన్నికల్లో నోట్లు లేనిదే ఓట్ల వర్షం పడదని గట్టిగా విశ్వసిస్తున్న నేతలు పెరిగిపోతున్నారనేందుకు ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలని రూ.50 కోట్లు వెదజల్లేందుకు రాజకీయపార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారంతో ఈసీ నోరెళ్లబెట్టింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఎదిగి జాతీ యస్థాయిలో చక్రం తిప్పిన జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్లో విజ యం అన్ని పార్టీల అభ్యర్థులకు ప్రతిష్టాత్మకమే. అందునా అన్నాడీఎంకేలోని చీలికవర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్లకు జీవన్మరణ సమస్యగా మారిం ది. అమ్మను ఆదరించిన ఆర్కేనగర్ ప్రజలు ఎవరికి పట్టం కడితే వారే అన్నాడీఎంకేకు అసలైన వారసులమని ప్రచారం చేసుకోవచ్చు. ఈ ఒక్క వాక్కును నిజం చేసుకునేందుకు దినకరన్, మధుసూదనన్ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అమ్మ వారసురాలిగా దీప రంగంలో ఉన్నారు. రాష్ట్రానికి ఇక తమ పార్టీనే దిక్కు అని చాటుకునేలా గెలుపొందేందుకు డీఎంకే కూడా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించిన బీజేపీ తమిళనాడులోకూడా తమ సత్తా చాటుకోవాలని ఆర్కేనగర్లో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక డీఎండీకే, వామపక్షాల అభ్యుర్థులు యథాశక్తి గా పాటుపడుతున్నారు. ఆర్కేనగర్లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండగా గెలుపు బావుటా ఎగురవేసేందుకు రాజకీయ పార్టీలు రూ.50 కోట్లను సిద్ధం చేసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఒక్కో ఓటుకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పంచేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఆర్కేనగర్లో మొత్తం 2.62 లక్షల ఓటర్లుండగా వీరిలో కనీసం 75 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. కనీసం 70 వేల ఓటర్లను నోటుతో మభ్యపెట్టవచ్చని కొందరు అభ్యర్థులు నమ్మకంతో ఉన్నారు. ఒక ఇంటిలో ఐదు ఓట్లు ఉన్నట్లయితే రూ.25వేలు దక్కుతుంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఇస్తున్నప్పుడు ఎవరు వద్దంటారని కొందరు విశ్లేషిస్తున్నారు. సీఎం కుర్చీపై దినకరన్ కన్ను: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఆ పార్టీలోని ప్రముఖులందరికీ సీఎం కుర్చీపై కన్నుపడింది. జయ మరణించగానే గత అనుభవాలరీత్యా పన్నీర్‌సెల్వం సీఎం అయ్యారు. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే సీఎం కాకుండానే ఆమె జైలుపాలు కావడంతో ఎడపాడి పళనిస్వామి ఆ చాన్స్ కొట్టేశారు. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వానికి శశికళ అన్నీతానై నడిపిస్తుండగా ఆమె అక్క కుమారుడు దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే సీఎం పీఠంపై ఆశ పెంచుకున్నారు. ఇందుకు ఆర్కేనగర్ ఉప ఎన్నికలు దినకరన్‌కు అవకాశంగా మారాయి. అయితే ఆర్కే నగర్‌లోని అన్నాడీఎంకే ఓటు బ్యాంకును మధుసూదనన్, దీప కూడా పంచుకోవడం వల్ల దినకరన్ గెలుపు అంత సులువు కాదు. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సీఎం కావాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. శశికళ ఆదేశాల మేరకు 30 మంది మంత్రులు, 30 మంది ఎంపీలు, వందకు పైగా ఎమ్మెల్యేలు, అనేక జిల్లాల కార్యదర్శులు, సినీనటీనటులు ఆర్కేనగర్లో తిష్టవేసి మరీ ప్రచారం చేస్తున్నారు. దినకరన్ ఎన్నికల చిహ్నం టోపీని ఇంటింటా పంచుతూ ఓటు కోరుతున్నారు. దినకరన్‌పై పన్నీర్ ఫిర్యాదు: అధికారుల అండదండలతో ఆర్కేనగర్లోని ఓటర్లను నోట్లతో మభ్యపెడుతున్నాడని అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్‌పై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను మంగళవారం ఢిల్లీలో స్వయంగా కలుసుకుని ఫిర్యాదు చేశారు. దినకరన్ తన ఎన్నికల చిహ్నమైన టోపీ లోపల రహస్యంగా నగదును ఉంచి ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పుదుచ్చేరీ నుంచి ఆర్కేనగర్కు వెళుతున్న లారీని తనిఖీ చేయగా పుచ్చకాయల లోడు కింద వంద అట్టపెట్టెల్లో 2400 బీరు బాటిళ్లు బైటపడ్డాయి. ఈ కేసులో శివలింగం, రామ్‌జీ అనే యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సమస్యాత్మక నియోజకవర్గంగా ఆర్కేనగర్: ఆర్కేనగర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టీ మొత్తం నియోజవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా పరిగణించే అవకాశాలను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్కేనగర్లో మొత్తం 50 ప్రాంతాల్లో 256 పోలింగ్ కేంద్రాలుండగా 29 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అభ్యర్థుల ప్రచారం వేడెక్కేకొద్దీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, నగదు బట్వాడా ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆర్కేనగర్ పరిధినంతా సమస్యాత్మక నియోజకవర్గంగా గుర్తించేందుకు అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అదే పేరు...అభ్యర్థుల బేజారు: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గెలుపొందాలంటే పేరు, పార్టీ, ఎన్నికల చిహ్నం...వీటిలో కనీసం ఏదో ఒకటైనా బహుళ ప్రాచుర్యం పొంది ఉండాలి. అన్నాడీఎంకే నుంచి విడిపోయి ప్రత్యర్థులుగా రంగంలో నిలిచిన దినకరన్, మధుసూదనన్ ఆర్కేనగర్ ఎన్నికల్లో వేర్వేరు కొత్త పార్టీలు, సరికొత్త గుర్తులపై పోటీచేస్తున్నారు. ఇక ఆ మూడింటిలో వారికి మిగిలింది పేరు ప్రఖ్యాతులు మాత్రమే అనే సంతోషం లేకుండా పోయింది. దినకరన్ పేరున మొత్తం ముగ్గురు, మధుసూదనన్ పేరున ఇద్దరూ ఆర్కేనగర్ అభ్యర్థులుగా ఉన్నారు. ఒకరి గెలుపును మరొకరు దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా అదే పేరుతో కూడిన అభ్యర్థులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ, కొత్త గుర్తులేగాక తమ పేరుతో మరికొందరు అభ్యర్థులు ఉండడం వల్ల ఓటర్లు ఆయోమయానికి గురయ్యే ప్రమాదం ఉందని దినకరన్, మధుసూధనన్ బేజారెత్తిపోతున్నారు. -
చివరి అవకాశం
► పన్నీర్ ఫిర్యాదుపై శశికళకు సీఈసీ నోటీసు ► నేటి సాయంత్రం వరకు తుది గడువు ► రెండాకుల కోసం కొనసాగుతున్న పోరు అన్నాడీఎంకే కోసం నువ్వా నేనా అంటూ పన్నీర్ సెల్వం, శశికళ మధ్యసాగుతున్న పోరుకు బుధవారం తెరపడనుంది. పన్నీర్‌సెల్వం వర్గం ఇచ్చిన ఫిర్యాదుల పరంపరపై మంగళవారం సాయంత్రంలోగా బదులివ్వాలని ప్రధాన ఎన్నికల కమిషన్ (సీఈసీ) శశికళకు చివరిసారిగా గడువిచ్చింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడుతున్నా యి. ఐదేళ్ల సభ్యత్వం లేనందున ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ పన్నీర్ వర్గం ఎంపీలు సుమారు నెలరోజుల క్రితం ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేశారు. పన్నీర్ వర్గం ఎంపీలు చేసిన ఫిర్యాదుపై బదులివ్వాల్సిందిగా శశికళకు సీఈసీ నోటీసు జారీ చేయగా ఆమె అక్క కుమారుడు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బదులిచ్చి, ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురయ్యాడు. దీం తో శశికళ బదులివ్వాల్సి వచ్చింది. ఇలా సీఈసీ ఆదేశాల మే రకు శశికళ, పన్నీర్‌సెల్వం వరుసగా తమ తరఫు వాదనలను వినిపించారు. ఇదిలా ఉండగా, ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు ముంచుకు రావడంతో శశికళ వర్గం తరఫున దినకరన్, పన్నీర్ అభ్యర్థిగా మధుసూదనన్ రంగంలోకి దిగారు. ఈ నెల 24వ తేదీలోగా తమ అభ్యర్థులకు బీఫారం జారీ చేయాల్సి ఉంది. బీఫారం ఆధారంతో అభ్యర్థులకు సీఈసీ ఎన్నికల చిహ్నం కేటాయిస్తుంది. అయితే అన్నాడీఎంకే అభ్యర్థులమంటూ ఇద్దరు వ్యక్తులు పోటీపడుతుం డగా రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో అనే సంశయం నెలకొంది. ప్రధా న కార్యదర్శిగా శశికళ ఎంపికపై సీఈసీ తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల చిహ్నం కేటాయింపు ఆధారపడి ఉంది. ఈ నెల 22వ తేదీ సీఈసీ తన తీర్పును వెల్లడిస్తుందని నమ్మకంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం దినకరన్ నేతృత్వంలో సీఎం ఎడపాడి తదితరులు అత్యవసరంగా సమావేశమయ్యారు. శశికళ తరఫు వాదనను మరోసారి వినిపించుకునేందుకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా సీఈసీని కోరారు. ఇందుకు అంగీకరించిన సీఈసీ మంగళవారం సాయంత్రం లోగా తమకు అందజేయాలని శశికళకు తుది గడువు విధించింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తున్న పరిస్థితిలో 22వ తేదీన సీఈసీ తన తీర్పు వెల్లడించనున్నట్లు ఖాయంగా తెలుస్తోంది. శశికళ తాజా వివరణతో చివరి ప్రయత్నం చేసిన తరుణంలో పన్నీర్ సైతం తన చివరి అస్త్రాన్ని సంధించారు. తమ వాదనను మరోసారి సమర్థించుకుంటూ సిద్ధం చేసుకున్న పత్రాలను సోమవారం పన్నీర్ వర్గంవారు సీఈసీకి సమర్పించారు. అంతేగాక ఆరువేల మంది పన్నీర్ మద్దతుదారులు ప్రమాణ పత్రాలను సైతం సీఈసీకి అందజేయడంతోపాటూ మరో 60 లక్షల మంది ప్రమాణపత్రాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని విన్నవించుకున్నారు. రేపు ఇరువర్గాలతో ప్రత్యక్ష విచారణ ఇరువర్గాల నుంచి లిఖితపూర్వక వివరణలు పూర్తికావడంతో ఈ నెల 22వ తేదీన ప్రత్యక్ష విచారణకు సీఈసీ సిద్ధమైంది. 22వ తేదీ ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలి్సందిగా పన్నీర్, శశికళ వర్గాలకు ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం నంచి ఆదేశాలు అందాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ, కమిషనర్లు జ్యోతి, రావత్‌లతో ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ ఇరువర్గాల ప్రతినిధులతో విచారణ చేపడుతుంది. అదేరోజు సాయంత్రం సీఈసీ తన తీర్పును ప్రకటిస్తుంది. క్షేత్రస్థాయి కార్యకర్తలు పన్నీర్ వైపే ఉండడంతో శశికళ వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది. -
దినకరన్ కలవరం
► కేడర్‌తో రహస్య మంతనాలు ► గెలుపు కోసం తీవ్ర కుస్తీ ► దూసుకెళ్తోన్న మధుసూదనన్ ఆర్కేనగర్ రేసులో దిగిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లో అప్పుడే కలవరం బయల్దేరింది. ఇందుకు కారణం, తన కోసం రంగంలోకి దిగి పనిచేసే ఆర్కేనగర్కు చెందిన స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరం వైపుగా జంప్ అవుతోండడమే. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఓ వైపు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నాలు, వ్యూహ రచనల్లో నిమగ్నమైంది. అన్నాడీఎంకేలో సాగుతున్న కుమ్ములాటల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానం మళ్లీ ఖాతాలో పడేనా అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో బయల్దేరింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరానికి చెందిన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్వయంగా రేసులో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు మాజీ సీఎం పన్నీరు శిబిరంలో బలమైన వ్యక్తిగా మధుసూదనన్ బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే ఓట్లను చీల్చేందుకు జయలలిత మేన కోడలు దీప సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలు తమకు కలిసి వచ్చే అంశంగా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఓట్లు చీలకుండా, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని తన గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు టీటీవీ వ్యూహ రచనల్లో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా దీప కుటుంబంలో చిచ్చు రగిల్చారని చెప్పవచ్చు. అయితే అసలు చిక్కు అంతా మధుసూదనన్ రూపంలో దినకరన్ కు ముచ్చెమటలు పట్టే అవకాశాలు ఎక్కువే. దినకరన్ లో కలవరం: మధుసూదనన్ దివంగత ఎంజీయార్ కాలం నుంచి ఆర్కేనగర్ ఓటర్లకు సుపరిచితుడే. గతంలో ఓ మారు ఇక్కడి నుంచే ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కారు. నియోజకవర్గంలో ప్రతి వీధి, ప్రతి నాయకుడితో సంబంధాలు ఉండడం మధుసూదనన్ కు కలిసి వచ్చే అంశం. ముందుగా ఆయన ఆ నియోజకవర్గంలోని నాయకుల్ని గురి పెట్టి వారి ఇంటి గడప తొక్కి వస్తున్నారు. దీంతో స్థానికంగా ఎన్నికల బరిలో దిగి పనిచేసే ముఖ్య నాయకులు అనేక మంది మధుసూదనన్ కు మద్దతుగా పన్నీరు శిబిరం వైపుగా కదులుతుండడం టీటీవీ దినకరన్ ను కలవరంలో పడేసింది. స్థానికంగా ఉన్న రాజేష్, జనార్దన్, అంజులక్ష్మి, లలిత, శశి వంటి నాయకులు పన్నీరు వైపుగా వెళ్లినా, కార్యకర్తలు మాత్రం తనకు అండగా ఉంటారన్న ఎదురు చూపుల్లో దినకరన్ ఉన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి నాయకుల్ని పక్కన పెట్టి కార్యకర్తల్ని పార్టీ కార్యాలయానికి పిలిపించి దినకరన్ రహస్య మంతనాలు సాగిస్తుండడం గమనించాల్సిన విషయం. కార్యకర్తల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు హ్యాండిచ్చినా, కార్యకర్త తనకు అండగా ఉంటే, వారి ద్వారా ఎన్నికల పనుల్ని వేగవంతం చేయించవచ్చన్న ఆశాభావంతో దినకరన్ అడుగులు ముందుకు కదులుతున్నట్టు ఆర్కేనగర్లోని అన్నాడీఎంకే కార్యకర్తలు పేర్కొంటున్నారు. -
రేసులో దినకరన్
► 50 వేల మెజారిటీతో గెలుపు తథ్యం ► ఉప ప్రధాన కార్యదర్శి ధీమా ► సీఎం పదవి మీద ఆశ లేదని స్పష్టీకరణ ► కేపీఎస్ సీఎంగా కొనసాగుతారని ప్రకటన సాక్షి, చెన్నై: అందరూ ఊహించినట్టే అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల రేసులో దిగారు. దినకరన్ పేరును అన్నాడీఎంకే పరిపాలనా కమిటీ «ఖరారు చేయడంతో ఆ పార్టీ వర్గాలు ఆనంద తాండవం చేశాయి. ఇక, 50 వేల మెజారిటీతో గెలిచి తీరుతానన్న ధీమాను దినకరన్ వ్యక్తం చేశారు. తనకు సీఎం పదవి మీద ఆశ లేదని, ఎడపాడి పళని స్వామి సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆర్కేనగర్ నుం చి వరుసగా రెండుసార్లు అమ్మ జయలలిత అసెంబ్లీ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. అమ్మ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో తానే పోటీ చేయడానికి ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సిద్ధం అయ్యారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, పార్టీ పరిపాలనా కమిటీ నిర్ణయం మేరకే అభ్యర్థి ప్రకటన ఉంటుందని టీటీవీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయం ఆవరణలో పది నిమిషాల పాటు జరిగిన ఆ కమిటీ సమావేశంలో దినకరన్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఇందుకు తగ్గ ప్రకటనను ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ , మంత్రి సెంగోట్టయన్ చేశారు. దీంతో అక్కడున్న అన్నాడీఎంకే వర్గాలు ఆనంద తాండవం చేస్తూ, దినకరన్ దృష్టిలో పడేందుకు తీవ్ర ప్రయత్నాలే చేశారు. పుష్పగుచ్ఛాలు, పూల మాలలు, శాలువలతో ముంచెత్తారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆ కమిటీకి, చిన్నమ్మ శశికళకు దినకరన్ కృతజ్ఞత తెలుపుకున్నారు. సీఎం కావాలన్న ఆశ లేదు: మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, అమ్మ జయలలిత నియోజకవర్గంలో పోటీకి తనకు అవకాశం కల్పించడం ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. ఆర్కేనగర్లో అమ్మ వదలి వెళ్లిన పనులు, ఆశయాల సాధనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈ ఎన్నికల ద్వారా తనకు కల్పించడం మహద్భాగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాదరణతో 50వేల ఓట్ల మెజారిటీతో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. తమకు ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఒక్కరేనని, ఇతర అభ్యర్థులను తాను లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. 21వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు, రెండాకుల చిహ్నం మీదే అన్నాడీఎంకే పోటీ ఉందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల అనంతరం మాజీ సీఎం పన్నీరుసెల్వం అడ్రస్సు గల్లంతు కావడం తథ్యమన్నారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచినా, సీఎం పదవిని మాత్రం చేపట్టనని స్పష్టం చేశారు. ఆ ఆశ తనకు లేదని, అన్న ఎడపాడి పళనిస్వామి బ్రహ్మాండ పాలనను అందిస్తున్నారని, ఆయనే సీఎంగా కొనసాగుతారన్నారు. అన్నాడీఎంకే అధికారం, ప్రభుత్వ అధికారం ఒకరి చేతిలోనే ఉండాలన్నదే గతంలో సీనియర్ల అభిప్రాయం అని, అయితే, ఇక, ఆ పద్ధతి కొనసాగదని స్పష్టం చేశారు. సీఎంను మార్చే ప్రసక్తే లేదని ముగించారు. ఇప్పటికీ సీఎం ఆశ తనకు లేదని దినకరన్ పైకి చెప్పుకున్నా, అన్నాడీఎంకే వర్గాల, అందరి అభిప్రాయం మేరకు ఆ బాధ్యతలు చేపడుతానని ఎన్నికల అనంతరం కొత్త పల్లవిని ఆయన అందుకున్న అందుకోవచ్చేమో. ఇందుకు ఉదాహరణ చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా పలికిన పలుకులే. ఇక, తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలకు దినకరన్ వేడుకోలు పంపించగా, ఆ రెండు పార్టీలు తిరస్కరించాయి. దినకరన్ రాజకీయ పయనం: జయలలిత నెచ్చెలి శశికళ సోదరి వణితామణి కుమారుడు దినకరన్. ఇతడి సోదరుడే జయలలిత దత్తపుత్రుడిగా మెలిగిన సుధాకరన్. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెరియకుళం నుంచి ఎంపీగా గెలిచారు. 2004లో ఆ పదవి కాలం ముగియడంతో రాజ్యసభ సభ్యుడు అయ్యారు. పార్టీ కోశాధికారిగా కూడా వ్యవహరించారు. 2011లో అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై పార్టీ నుంచి బహిష్కరణకు గుయ్యారు. అమ్మ మరణంతో గత నెల ఫిబ్రవరి 15న దినకరన్ మళ్లీ తెర మీదకు వచ్చారు. వచ్చి రాగానే, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం గమనార్హం. ఈ పదవి చేపట్టి నెల రోజుల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా ప్రకటించ బడ్డారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే, ఆయన సీఎం కావడం తథ్యం అన్న ప్రచారం అన్నాడీఎంకేలో ఊపందుకోవడం ఆలోచించ దగ్గ విషయం. ఇక, దినకరన్ మీద విదేశీ మారక ద్రవ్యంతో పాటు, సింగపూర్ సిటిజన్ వ్యవహారం వంటి పలు కేసులు కూడా ఉన్నాయి. -
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
-
దీపా వర్సెస్ దినకరన్: టైట్ ఫైట్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక టైట్ ఫైట్ గా మారబోతుంది. అన్నాడీఎంకే నుంచి ఆర్కే నగర్ కు పోటీచేయబోయే అధికారిక అభ్యర్థి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరనే అని తెలిసింది. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. దినకరన్ సైతం ఆర్కే నగర్ నుంచి పోటీకి అవకాశమొస్తే ఏ మాత్రం వెనుకాడబోనని అంతకముందే ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న జయలలిత రెండు సార్లు ఇక్కడి నుంచే పోటికి దిగి గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు జయలలిత అసలు వారసురాలిగా నిరూపించుకోవడానికి ఆమె మేనకోడలు దీపా జయకుమార్ కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగుతున్నారు. తనకు ఆర్కే నగర్ వాసుల మద్దతున్నట్టు తెలిపిన దీపా జయకుమార్, గత ఫిబ్రవరిలోనే ఎంజీఆర్ అమ్మ దీపా ఫెడరేషన్ పేరుతో పొలిటికల్ పార్టీని ఆవిష్కరించారు. అన్నాడీఎంకే రెబల్ ఓ పన్నీర్ సెల్వం క్యాంపు సైతం దీపా జయకుమార్ కే మద్దతివ్వాలని లేదా సొంతంగా బరిలోకి దిగాలని యోచిస్తోంది. ఒకవేళ పన్నీర్ సెల్వం, దీపా జయకుమార్ కు మద్దతు పలికితే ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతిపక్షం డీఎంకే సైతం ఈ నియోజకవర్గానికి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించబోతుంది. అయితే జయలలిత పార్టీ నుంచి గెంటివేయబడ్డ దినకరన్ నే అన్నాడీఎంకే పోటీకి దింపడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
'అమ్మ'కోటలో పాగా వేసేదెవరో?
► ఆందరి చూపు ఆర్కేనగర్ వైపు.. జయ మృతితో అనివార్యమైన ఎన్నిక ► రసవత్తరంగా రాజకీయాలు ► బహుముఖ పోటీ ఖాయం ► పన్నీర్, స్టాలిన్, దినకరన్ కు తొలి పరీక్ష సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో మూడు నెలలుగా ఖాళీగా ఉన్న చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గంలో వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. జయలలిత రెండుసార్లు పోటీచేసి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో ఈ అసెంబ్లీ స్థానంపై వీవీఐపీ ముద్రపడింది. జయ మరణం తరువాత ఖాళీ అయిన స్థానం కావడంతో ప్రధానాకర్షణగా మారింది. దీంతో ఆర్కేనగర్లో గెలుపొందడం ఒక ప్రతిష్టగా అన్నిపార్టీలూ భావిస్తున్నాయి. ప్రధానపోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుందనేది నిర్వివాదాంశం. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చీలు ప్రకటించాయి. ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ డీఎంకేలో శుక్రవారం నుంచే ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జయపై పోటీచేసి ఓడిన సిమ్లా ముత్తుచోళన్ తన దరఖాస్తును సమర్పించారు. ఇక బీజేపీ, ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకే పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధం అవుతున్నాయి. తమ నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామని ప్రజా సంక్షేమకూటమి శుక్రవారం తెలిపింది. అన్నాడీఎంకే అనుచరులను శశికళ, పన్నీర్‌సెల్వం, దీప పంచుకుని ఉన్నారు. అభ్యర్థుల పేర్లపై ఊహాగానాలు అనేక పార్టీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నందున ఆర్కేనగర్ ఉప ఎన్నికలో బహుముఖ పోటీ ఖాయమని తేలిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకేలతోపాటు ఇతర ద్రవిడ పార్టీలు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులపై రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి దినకరన్, పన్నీర్‌సెల్వం వర్గం నుంచి ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, ఎంజీఆర్ అమ్మ దీప పేరవై నుంచి దీప, డీఎంకే తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన సిమ్లా ముత్తుచోళన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ పేర్లు వినిపిస్తున్నాయి. తాము పోటీకి దిగుతున్నట్లు నామ్‌తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్ శుక్రవారం ప్రకటించారు. తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే పోటీచేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగో ఓటమి ఖాయం ఎందుకు అనవసరమైన ఖర్చని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో ఆలోచనలో పడినట్లు సమాచారం. త్వరలో పార్టీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పోటీకి వెనుకాడను: దినకరన్ ఇదిలా ఉండగా, ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు అవకాశం వస్తే ఎంతమాత్రం వెనుకాడబోనని అన్నాడీంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థిఎవరైనా అన్నాడీఎంకే ఘనవిజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికీ తొలి సవాల్: ఆర్కేనగర్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ప్రధాన నేతలు ముగ్గురూ తొలిసారిగా సవాల్‌ను ఎదుర్కొంటున్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడుగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వచ్చిన తొలి ఎన్నిక. ఎంతో బలమైన క్యాడర్ గలిగిన అన్నాడీఎంకే కలహాల కాపురంగా మారిన దశలో డీఎంకే అభ్యర్థిగెలుపు నల్లేరుపై నడకలా సాగాల్సి ఉంది. ఇంతటి సానుకూలమైన పరిస్థితులను స్టాలిన్ సద్వినియోగం చేసుకుంటారో లేదో వేచి చూడాలి. అలాగే కొంతకాలంగా చిన్నమ్మ చాటున ఉండి తెరవెనుక రాజకీయాలు నడిపిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దినకరన్ కు సైతం ఇది తొలి సవాలే. ఎంజీఆర్ స్థాపించి, జయలలితచే బలమైన పార్టీగా నిలవడం అనే అంశం మినహా దినకరన్ చుట్టూ ఇతరత్రా అన్నీ ప్రతికూల అంశాలే. పైగా అన్నాడీఎంకే అభ్యర్థిగా తానే నిలిచేందుకు దినకరన్ సిద్ధం అవుతున్నారు. అన్నాడీఎంకేతో విభేదించి తిరుగుబాటు నేతగా మారిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సైతం ప్రజాకోర్టులో తొలిసారిగా తన సత్తా చాటుకోవాల్సి ఉంది. ఆన్నాడీఎంకేకు ఆర్కేనగర్ పెట్టని కోట: ఆర్కేనగర్ నియోజకవర్గంలో 1977లో తొలిసారిగా అన్నాడీఎంకే తన అభ్యర్దిని ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి విజయం సాధించింది. ఆ తరువాత 1991, 2001, 2006, 2011, 2015, 2016 ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే గెలుపొందింది. 1957, 1962, 1980చ 1984లో కాంగ్రెస్ గెలిచింది. 1967, 1971,1989,1996 ఎన్నికల్లో డీఎంకేను విజయం వరించింది. డీఎంకే 7 సార్లు, అన్నాడీఎంకే 3 సార్లు మాత్రమే ఓటమిపాలైంది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం: గత ఏడాది జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఆర్కేనగర్లో అన్నాడీఎంకే అభ్యర్ది జయలలిత 97,218 (55.87 శాతం) ఓట్లతో గెలుపొందారు డీఎంకే అభ్యర్ది సిమ్లా ముత్తుచోళన్ కు 57,673 (33.14 శాతం) ఓట్లు, వీసీకే అభ్యర్ది వసంతీదేవికి 4,195 , (2.41 శాతం), పీఎంకే అభ్యర్ది ఆగ్నస్కు 3,011 (1.73 శాతం), బీజేపీ అభ్యర్ది ఎమ్ఎన్ రాజాకు 2,873 (1.68 శాతం) ఓట్లు లభించాయి. అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు డీఎంకేకు లాభించేనా లేక శశికళ, పన్నీర్, దీప వర్గాల్లో ఏవరో ఒకరిని విజయ కిరీటం వరించేనా అని చర్చించుకుంటున్నారు. -
పన్నీర్ జీరో, ఆయనతో మాకు పోటీ ఏంటీ?
చెన్నై : తమ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీయేనని అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఆర్కేనగర్ ఉప ఎన్నికకు పన్నీర్ సెల్వం తమకు పోటీ కాదని, ఆయన సున్నఅని దినకరన్ అభివర్ణించారు. కాగా జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు ఖాళీ ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు ఆర్కేనగర్ స్థానం నుంచే పోటీకి దిగుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అలాగే అధికార అన్నాడీఎంకేతో పాటు పన్నీర్ సెల్వం, డీఎంకేలు ఈ స్థానంపై కన్నేయడంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. -
మంతనాల్లో దినకరన్
► జిల్లాల వారీగా సమాలోచన ► కేడర్ చేజారకుండా జాగ్రత్తలు పార్టీ మీద పట్టు బిగించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నిమగ్నమయ్యారు. జిల్లాల వారీగా నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాల్లో మునిగారు. శనివారం వేలూరు, విల్లుపురం జిల్లాల్లో పార్టీపరిస్థితిపై సమాలోచించారు. కేడర్ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ జైల్లో ఉండడంతో పార్టీ మీద పట్టు సాధించే పనిలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వేగం పెంచారు. చిన్నమ్మ ఆదేశాలను ఆచరణలో పెట్టే రీతిలో ముఖ్య నేతలు చేజారకుండా, నిత్యం ఏదో ఒక సమావేశంతో ముందుకు సాగే పనిలోపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమాలోచనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం విల్లుపురం, వేలూరు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఆ జిల్లాల్లోని మాజీ మంత్రులను సైతం పిలిపించి పార్టీ పరిస్థితిపై సమావేశం కావడం గమనార్హం. వచ్చిన నేతలు, మంత్రులు టీటీవీ దినకరన్ ముందు వినయాన్ని ప్రదర్శించడం ఆలోచించాలి్సందే. ఇందులో మంత్రులు కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా పార్టీ కేడర్ చేజారకుండా, ఆయా జిల్లాల్లో మాజీ సీఎం పన్నీరు శిబిరం వైపుగా ఉన్న స్థానిక నాయకులు వివరాలను ఈసందర్భంగా టీటీవీ సేకరించినట్టు సమాచారం. జిల్లాల వారీగా సమీక్ష కేవలం తమకు ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకే టీటీవీ సాగిస్తున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పన్నీరు శిబిరంతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడడంతోనే, ఆయా జిల్లాల్లోని నేతల్ని ముందస్తుగా పిలిపించి మాట్లాడే పనిలో దినకరన్ ఉన్నారని చెబుతున్నారు. తన దృష్టికి వచ్చిన జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల మీద నిఘా పెంచేందుకు స్థానికంగా ఉన్న నాయకులకు టీటీవి ఆదేశాలు సైతం ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎన్నికల కమిషన్ కు చిన్నమ్మ శశికళ వివరణ ఇవ్వాల్సి ఉండడంతో, ఈ విషయంగా పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఆమెతో భేటికి టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు అన్నాడిఎంకే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా ఆయా జిల్లాల్లోని పార్టీ వివరాలను చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లి, ఆమె సలహాల్ని పాటించేందుకు టీటీవీ కసరత్తుల్లో ఉన్నట్టు చెబుతున్నారు. -
నా ఎన్నిక సక్రమమే: శశికళ
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ నియమ నిబంధనలకు లోబడే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తన నియామకం జరిగిందని ప్రధాన ఎన్నికల సంఘాని(ఈసీ)కి శశికళ లేఖ రాశారు. దీనిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ద్వారా ఆమె ఈసీకి అందజేశారు. పార్టీలో ఐదేళ్లపాటు నిరంతర సభ్యత్వం లేకుండా ఎన్నికైనందున, శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో శశికళకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఈనేపథ్యంలో దినకరన్ ద్వారా శశికళ ఈసీకి వివరణ ఇచ్చారు. మరోవైపు, జయలలిత మరణంపై పలు అనుమానాలున్నందున సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర మాజీ సీఎం పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌కి వినతిపత్రం సమర్పించారు. -
అండగా నిలవండి
► ఆర్థిక సాయం చేయండి ► ప్రధానికి సీఎం ఎడపాడి వినతి ► నేడు రాష్ట్రపతిని కలవనున్న పన్నీర్‌సెల్వం, ఎంపీలు ► జయ మరణంపై సీబీఐ దర్యాప్తుకు వినతి ► న్యాయనిపుణులతో దినకరన్ చర్చలు ప్రకృతి ప్రకోపానికి గురై కొట్టుమిట్టాడుతున్న తమిళనాడుకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎడపాడి పళని స్వామి సోమవారం తొలిసారిగా ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పని లోపనిగా రాష్ట్ర సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కరువుకాటకాలు, వర్ద తుపాను దెబ్బతో రా ష్ట్రం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటు న్న సంగతిని వివరించానని ఆయన అన్నారు. తమిళ ప్రజల జల్లికట్టు కోర్కె సాధనకై రాష్ట్రం జారీచేసిన ఆర్డినెన్స్ ఆమోదంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో కరువు నెలకొని, పచ్చనిపొలాలు ఎండిపోతున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. కరువు సహాయకంగా గతం లో కోరిన రూ.39,565 కోట్లు, వర్ద తుపాను సహాయం కింద రూ.22,573 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వా రా రాష్ట్రానికి చెందాల్సిన రూ.17,333 కోట్లు వెంటనే విడుదల చేయాల్సిం దిగా సీఎం కోరారు. నీట్ ప్రవేశపరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని, కావేరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తమిళనాడులో సాగు, తాగునీటి కొరతలను తీర్చేందుకు మహానది, గోదావరి, కృష్ణా, పెన్న, పాలారు, కావేరి, వైగై తదితర నదులను అనుసంధానం చేయాల్సిందిగా కోరారు. జాలర్ల సంక్షేమం కోసం 1,650 కోట్లు కేటాయించాలని, శ్రీలంక చెరలో ఉన్న 35 మంది తమిళ జాలర్లను, 120 మరపడవలను విడిపించాలని, శ్రీలంక కారణంగా చేపల వేటకు ఏర్పడుతున్న అడ్డంకులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కూడంకుళంలో ఉత్పత్తయ్యే రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను పూర్తిగా తమిళనాడుకు కేటాయించాలని కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద తమిళనాడుకు అదనంగా నెలకు 85వేల మెట్రిక్ టను్నల బియా్యన్ని రాయితీపై సరఫరా చేయాలని కోరారు. సముద్ర జలాలను తాగునీటిగా మార్చే నిర్లవీకరణ పథకం అమలుకు వెంటనే అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పలువురు మంత్రులు సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు. రాజధానిలో రాష్ట్ర పంచాయితీ ఒకే ఒరలో రెండు కతు్తల్లా అన్నాడీఎంకేపై రెండు గ్రూపుల ఆధిపత్య పోరుపై పంచాయితీ రాజధానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని, హోం మంత్రిలను కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బృందం సోమవారం ఢిల్లీకి చేరుకుంది. చిన్నమ్మ పదవిని కాపాడేందుకు ఆమె సోదరి కుమారుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయనిపుణులతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ రెండుగా చీలిపోగా ఒకరినొకరు బహిష్కరించుకున్నారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. శాశ్వత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జయలలిత చేత ప్రిసీడియం చైర్మన్ గా నియమితులైన మధుసూదన్ పన్నీర్‌సెల్వం వైపున్న కారణంగా పార్టీ తమదేనని వాదిస్తున్నారు. పది మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు పన్నీర్ పక్షాన నిలవగా, మెజార్టీ ఎమ్మెల్యేలతో విశ్వాస పరీక్షను నెగ్గిన శశికళ వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం, పదవుల్లో ఉండేవారంతా శశికళ వైపు ఉండగా, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త వరకు పన్నీర్‌సెల్వంను ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని మరొకరు తమవైపు లాకు్కనేందుకు తీవ్రస్థాయి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఐదేళ్లు వరుసగా ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎను్నకోవడం చెల్లదనే ఫిర్యాదు ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉంది. శశికళ నియామకంపై అడ్డంకులు తలెత్తకుండా పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. శశికళ ఎంపిక చెల్లదని ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లయితే పన్నీర్‌సెల్వం తదితరులను పార్టీ నుంచి బహిష్కరించిన ఆదేశాలు చెల్లకుండా పోతాయి. అంతేగాక టీటీవీ దినకరన్ నియాకం కూడా చెల్లదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాల్సి ఉండగా రెండాకుల చిహ్నం ఎవరిదనే చికు్కముడి ఉంది. చట్టపరవైున చికు్కల్లో ఉన్న శశికళ వర్గీయులను మరిన్ని చికు్కలో్లకి నెట్టేందుకు పన్నీర్‌సెల్వం ఢిల్లీ పయనం అయా్యరు. అంతకు ముందు సేలం జిల్లా నేతలో పన్నీర్‌సెల్వం సమావేశమై శశికళ ఆధిపత్యాన్ని తిప్పికొట్టడం ఎలా అంశంపై అభిప్రాయాలు సేకరించారు. జయలలిత అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ కోరుతూ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అలాగే ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తున్నారు. పన్నీర్‌వెంట 12 మంది ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. -
ఘన నివాళి
► వేడుకగా జయలలిత 69వ జయంతి ► సచివాలయంలో మొక్కలు నాటిన సీఎం సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పరిమళింపజేయడమే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అసలైన నివాళి అని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 69వ జయం తి వేడుకలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరి గాయి. రూ.13.42 కోట్ల ఖర్చుతో రూపొం దించిన ఈ మొక్కలు నాటే పథకాన్ని అన్నాశాలైలోని ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం ద్వారా సీఎం ప్రారంభించారు. ఎడపాడి కేబినెట్లోని 30 మంది మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉచిత ప్రత్యేక వైద్యశిబిరాలను మంత్రులు జయకుమార్, విజయభాస్కర్ప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా ఈనెలలో ప్రారంభవైున ఈ పథకం కింద 69 లక్షల మొక్కలు నాటేపనులను డిసెంబరు ఆఖరులోగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. వనాల్లో, విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాలను కుదిపేసిన వర్దా తుపాన్ వల్ల కోల్పయిన పచ్చదనాన్ని ఈ పథకం ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 2,20 లక్షల మొక్కలను ప్రజలకు రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో రెండు నౌకలు ఢీకొని సముద్ర జలాల కలుషితం వల్ల బాధిత 30వేల జాలర్ల కుటుంబాలకు రూ.5వేలు చొప్పున నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయంలో: అలాగే చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జయ జయంతి వేడుకలను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రారంభించగా ముఖ్యమంత్రి ఎడపాడి, ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయ్యన్ మంత్రులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన అమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం పది నిమిషాల్లో కార్యక్రమాలను ముగించారు. పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన, ఎడపాడికి సీఎం పట్టం, శశికళ జైలుపాలు, ఉప ప్రధాన కార్యదర్శిగా ఆమె అక్క కుమారుడు దినకరన్ నియామకం వంటి పరిణామాలు తమను బాధించినట్లుగా కార్యకర్తలు వ్యవహరించారు. అన్నాడీఎంకే నిర్వాహక కార్యదర్శి గోకుల ఇందిర కీల్పాక్లోని బాలవిహార్ శిశు సంరక్షణా కేంద్రంలో అన్నదానం చేశారు. చెన్నై నంగనల్లూరు సహకార సంఘ కార్యాలయంలో జయ జయంతి వేడుకలు జరిపారు. జయ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడాన్ని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ రాందాస్ ఆక్షేపించారు -
చిన్నమ్మ వారసుడొచ్చాడు
చెన్నై: జయలలితకు తామే అసలైన వారసులమని శశికళ, పన్నీరు సెల్వం, దీపా జయకుమార్ పోటీపడుతున్నారు. ఓ వైపు అమ్మ వారసత్వ పోరు కొనసాగుతుండగా.. పార్టీని ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన చిన్నమ్మ తన వారసుడిని తెరపైకి తెచ్చారు. అన్నా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన శశికళ సోదరి కుమారుడు దినకరన్ ఈ రోజు (గురువారం) బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ప్రధాన కార్యదర్శి శశికళ తర్వాతి స్థానం, హోదా దినకరన్‌దే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో దినకరన్ ఆమె తరఫున పార్టీలో చక్రం తిప్పనున్నారు. జైలుకు వెళ్లేముందు శశికళ.. దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. జయలలిత తనను పార్టీలోకి ఆహ్వానించారని, కీలక పదవులు కట్టబెట్టారని, అమ్మ వల్ల తాను గతంలో ఎంపీ కూడా అయ్యానని చెప్పారు. ఇటీవల పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి తిరిగి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అమ్మ ఆశయాలను, పాలనను కొనసాగిస్తామని చెప్పారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. -
ఆపరేషన్ పన్నీర్ అండ్ టీంపై దినకరన్ దృష్టి
-
చిన్నమ్మ ఆనందం
► చప్పట్లతో హర్షం ► చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ కసరత్తు ► కోర్టులో పిటిషన్ కు నిర్ణయం అధికారం తమ గుప్పెట్లోకి రావడంతో చిన్నమ్మ శశికళ ఆనందానికి అవధులు లేవు. పరప్పన అగ్రహార చెరలో చప్పట్లు మార్మోగించి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విధేయుడి చేతికి అధికారం చిక్కడంతో, జైలు నుంచే వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్టుంది. ఇక, చిన్నమ్మ చెన్నై చెరకు మార్చకుండా అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించింది. సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెరలో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శనివారం మధ్యాహ్నం భోజ నాన్ని సైతం మరిచారు. ఇందుకు కారణం టీవీ ముందుకు అతుక్కు పోవడమే. అసెంబ్లీ వ్యవహారాలను టీవీలో వీక్షించిన శశికళ మధ్యాహ్న భోజన సమయాన్ని సైతం పట్టించుకోలేదని సమాచారం. తన విధేయుడు పళనిస్వామి చేతికి అధికార పగ్గాలు చిక్కడం, తన శపథాన్ని నెరవేర్చానని ఉప ప్రధానకార్యదర్శి దినకరన్ వ్యాఖ్యానించిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవని తెలి సింది. టీవీ ముందు నుంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టి మరీ ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక, జైలు నుంచి తమిళ ప్రభుత్వ చక్రం తిప్పేందుకు తగ్గ వ్యూహాన్ని రచించేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. అలాగే, పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడుకు తనను మార్చే విధంగా త్వరితగతిన చర్యల్ని వేగవంతం చేయాలని న్యాయవాదులకు ఆమె సూచించి నట్టు తెలిసింది. ఈ విషయంగా న్యాయవాదులతో టీటీ వీ దినకరన్ సంప్రదింపులు జరుపుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేయించేందుకు తగ్గ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, చెర మార్పును అడ్డుకునేందుకు తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం నిర్ణయించడంతో వ్యతిరేకత బయలు దేరినట్టు అయింది. చెర మార్పునకు వ్యతిరేకత: తిరుప్పూర్ జిల్లా ఆమ్ ఆద్మీ విభాగం కార్యవర్గం ఆదివారం జరిగింది. ఇందులో అవి నీతికి వ్యతిరేకంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా శశికళకు వ్యతిరేకంగా ఇందులో నిర్ణయాలు తీసుకున్నారు. శశికళను చెన్నై జైలుకు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని అడ్డుకునేందుకు తీర్మానించారు. కర్ణాటక కోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేయడానికి తిరుప్పూర్ జిల్లా విభాగం కన్వీనర్ సుందర పాండియన్ నిర్ణయించారు. ఆమెను ఇక్కడకు మార్చిన పక్షంలో, రాష్ట్రంలో మరింత అవినీతి, దోపిడీ పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, సీఎంతో పాటు మంత్రులు జైలు ముందు ప్రతి రోజూ బారులు తీరే అవకాశం ఉంద న్న విషయాన్ని ఎత్తి చూపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన వివరించారు. -
చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్
సాక్షి, చెన్నై: ‘‘శాసనసభలో బల పరీక్షలో గెలుపుతో అమ్మ జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మ శశికళ చేసిన వీర శపథం నేరవేర్చాం’’ అని అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి పళనిస్వామితో కలిసి మెరీనా బీచ్ తీరంలో ఉన్న జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం పోయెస్ గార్డెన్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడారు. పన్నీర్ సెల్వం చేత చిన్నమ్మ ఎందుకు రాజీనామా చేయించారన్న ప్రశ్నకు అసెంబ్లీలో జరిగిన తాజా పరిణామాలే సమాధానమని పేర్కొన్నారు. ప్రతిపక్ష డీఎంకేతో కలిసి అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పన్నీర్‌సెల్వం కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పన్నీర్‌కు డీఎంకేతో రహస్య సంబంధాలున్నాయన్న విషయాన్ని గుర్తించి పదవి నుంచి తప్పించారేగానీ, చిన్నమ్మ సీఎం కావాలన్న ఆశతో మాత్రం కాదన్నారు. పార్టీ వర్గాల ఒత్తిడి, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొనేందుకే ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలంతా ఐక్యతతో ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తామని, అమ్మ చూపిన మార్గంలో సుపరిపాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని దినకరన్ వెల్లడించారు. బల పరీక్షలో పళనిస్వామి నెగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా శశికళ మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. -
‘గ్యాస్’ దుమారం
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో వంటగ్యాస్ ప్రమాదాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని డీఎండీకే సభ్యుడు దినకరన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దినకరన్ ఈ విమర్శలు చేశారు. ఆయన విమర్శలకు పౌరసరఫరాల శాఖ మంత్రి కామరాజ్ బదులిస్తూ, తాము చేపడుతున్న చర్యల కారణంగా మూడేళ్లలో ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. వినియోగదారులకు సరఫరా చేసే ముందు వాల్వ్‌ను తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను పారిశ్రామిక వాడల్లోనూ, ఆటోషాపుల్లోనూ వినియోగిస్తుండగా పట్టుకుని 11,140 మందిపై కేసులు పెట్టామని మంత్రి వివరించారు. అంతేగాక దుర్వినియోగానికి పాల్పడిన వారిలో 27 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపామని, వారి నుంచి రూ.1.43 కోట్లు అపరాధం వసూలు చేశామని తెలిపారు. వంటగ్యాస్ బాధితులకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు చెల్లించామన్నారు. గృహవినియోగదారులు రాత్రి వేళల్లో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవడం వల్లనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వంట గ్యాస్ లీకయినట్లు అనుమానించగానే తలుపులన్నీ తెరవాలని, విద్యుత్ లైట్లను ఎంతమాత్రం వెలిగించరాదన్న సూచనలు ప్రజలకు చేశామని తెలిపారు. ప్రమాదంపై సహాయానికి 24 గంటలపాటూ పనిచేసే 155233 టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారం ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ పాఠ్యాంశాల సొసైటీ పేరు మారుస్తూ ముసాయిదాను ప్రవేశపెట్టారు. తమిళనాడు పాఠ్యాంశాల సొసైటీ పేరును తమిళనాడు పాఠ్యాంశాలు, విద్యావ్యవహారాల సొసైటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. యువత ఘనత మాదే రాజకీయాల్లో యువతకు పెద్దపీట వేసిన ఘనత మాది అంటే మాదని అధికార, ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో వాదులాడుకోవడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత డీఎండీకే సభ్యులు దినకరన్ మాట్లాడుతూ, తన వంటి యువకులను ఎమ్మెల్యేలుగా చేసిన విజయకాంత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇందుకు మంత్రి వలర్మతి అడ్డుతగులుతూ, అన్నాడీఎంకేలో 35 లక్షల మంది యువతీ యువకులు సభ్యులుగా ఉన్నారని, వీరిలో కొందరు మంత్రులుగానూ, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగారని చెప్పారు. మరో డీఎండీకే సభ్యుడు చంద్రశేఖర్ మంత్రికి అడ్డుతగులుతూ 2005లో విజయకాంత్ పార్టీ పెట్టిన తరువాతనే అన్నాడీఎంకేకు యువత గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. మళ్లీ మంత్రి వలర్మతి మాట్లాడుతూ, నిన్నటి వర్షం కారణంగా మొలచిన మొక్కలు మీరు, పార్టీని అడ్డంపెట్టుకుని బతకాలను చూస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇలా వాదోపవాదాలు వాగ్యుద్ధాల నడుమ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ముగిశాయి. -
భయపెట్టే మాయ
చిరుసాయి, హేమంత్, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలుగా దినకరన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అందమైన మాయ’. పాటల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానుసారం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేశాం. మరో పది రోజులు జరిపే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెల చివరి వారంలో పాటలు విడుదల చేయనున్నాం. ఈ పాటల్లో ఉన్న ఓ ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక...’ స్థాయిలో హిట్టవుతుంది’’ అని చెప్పారు. ‘‘దాదాపు ఏడు నెలలు కథాంశాన్ని డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లాం’’ అని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మణీంద్రన్ తెలిపారు.