సాక్షి, చెన్నై: సోదరుడు దివాకరన్ చర్యలపై చిన్నమ్మ శశికళ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆమెతో ములాఖత్ అయిన న్యాయవాదులు, ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందరూ దినకరన్‌కు అండగా ఉండాలని ఆమె సూచించినట్టు, త్వరలో కేడర్‌కు ఓ లేఖాస్త్రం సంధించపోతున్నట్టుగా సమాచారం. చిన్నమ్మ శశికళ కుటుంబ విభేదాలు రచ్చకెక్కి ఉన్నవిషయం తెలిసిందే. ఆమె సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ల మధ్య సాగుతున్న ఈ సమరంలో కుటుంబ పరువు గంగలో కలిసే రీతిలో ఉన్నట్టుగా చిన్నమ్మ పరిగణించారు. అలాగే, రాజకీయంగా మున్ముందు పెనుముప్పు తప్పదన్న విషయాన్ని గ్రహించి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో దివాకరన్‌ను పక్కన పెట్టి, దినకరన్‌కు అండగా నిలబడేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గతంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, దినకరన్‌కు మద్దతుగానే శశికళ వ్యవహరించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో అనేక సమస్యలు ఉన్నా, తాను జైలుకు వెళ్తూ దినకరన్ భుజం మీద బాధ్యతల్ని ఉంచి వెళ్లారని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా, కుటుంబం పరువు మరింత రచ్చకెక్కకుండా ఉండే రీతిలో, దివాకరన్‌కు చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా చిన్నమ్మ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆమెతో ములాఖత్ అయిన ముఖ్యులు, న్యాయవాదుల వద్ద దివాకరన్ చర్యల్ని తీవ్రంగా ఖండించినట్టు చర్చ ఊపందుకుంది.
అమ్మ శిబిరం పేరిట దివాకరన్ ముందుకు సాగుతుండడంతో, ఆయన వెంట కేడర్ గానీ, మద్దతు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలుగానీ వెళ్లకుండా జాగ్రత్లకు సిద్ధం అవుతున్నారు. అందరూ దినకరన్‌కు అండగానే ఉండాలని సూచించడంతోపాటు, త్వరలో కేడర్‌ను ఉద్దేశించి జైలు నుంచి శశికళ ఓ లేఖ విడుదలచేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దివాకరన్ రూపంలో ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉండే విధంగా, దినకరన్‌కు మద్దతుగా ఆమె స్పందించేందుకు సిద్ధం అవుతున్న సమాచారంతో మద్దతుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెప్పవచ్చు. అందుకే కాబోలు దివాకరన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అమ్మ శిబిరం ఆవిర్భావ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనించి దగ్గ విషయం. తంగతమిళ్ సెల్వన్ దివాకరన్‌కు అత్యంత సన్నిహితుడైనా, చిన్నమ్మ గతంలో అప్పగించిన బాధ్యత మేరకు తాను మాత్రం దినకరన్ వెన్నంటే ఉంటానని ప్రకటిం చడం విశేషం.తనతో పాటు అనర్హత వేటు పడ్డ వాళ్లు, ముఖ్యులు, కేడర్ దినకరన్‌కు అండగా ఉంటారని వ్యాఖ్యానించే పనిలో తంగతమిళ్ సెల్వన్ ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దర్శకత్వంలోనే దివాకరన్ అడుగుల వేగా న్ని పెంచనున్నట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆ వేగానికి కళ్లె్లం వేయడం లక్ష్యంగా చిన్న మ్మ స్పందన కోసం కేడర్ ఎ దురుచూపుల్లో ఉంది. దివాకరన్ తీరుపై దినకరన్ తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డా రు.ఆయన మానసిక రోగి అని నిన్నటి రో జున వ్యాఖ్యానించారు.తాజాగా దివాకర న్‌కు పిచ్చి పట్టినట్టుందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment