mulakhat
-
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్‌కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
ములాఖత్‌కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..
రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్‌లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు లేఖ రాశారు కూడా. జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్‌గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట. ఈ ములాఖత్ తర్వాత యనమల పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే సూచించారని పార్టీ వర్గాల కథనం. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్ ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్‌కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు సమాచారం. -కుర్చీ కింద కృష్ణయ్య -
Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Case Live Updates 6:52PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు ►ఇది వాళ్లకు కొత్తేం కాదు ►డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ ►ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 5:50 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్ ► అమరావతి రాజధాని ప్లాన్‌పై కాగ్ సంచలన నివేదిక ► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం ► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే ► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు ► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు ► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు ► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు 5:35 PM, సెప్టెంబర్ 25, 2023 అమవాస్య చీకటిలో తెలుగుదేశం : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ► చంద్రబాబు అరెస్ట్‌తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది ► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి ► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు ► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్‌ను తెచ్చుకున్నట్టున్నాడు ► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి ► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది 5:15 PM, సెప్టెంబర్ 25, 2023 లోకేష్‌కు అరెస్ట్ భయం లేదు ► లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు ► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు ► నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు ► లోకేష్‌కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు ► నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు ► నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు 5:00 PM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ ముగిసింది ► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్ ► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం ► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం ► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం 4:00 PM, సెప్టెంబర్ 25, 2023 కేసులు ఇవి, స్టేటస్ ఇది ► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు ► రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు ► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 భువనేశ్వరీ వ్యాఖ్యలను తప్పుబట్టిన YSRCP ► చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిందే మీ నాన్న ఎన్టీఆర్ ► మీ నాన్న స్వయంగా చెప్పినా.. ఇంకా చంద్రబాబుకే మద్ధతిస్తారా? నక్కను తెచ్చి మీరు సింహం అని లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకండి మేడం. ముసలి నక్క గర్జించినా ఏమీ కాదు. ఆయనేమీ చేసేది ఉండదు. ఆయన్ను గొడ్డుకన్నా హీనం.. పశువుకన్నా ఘోరం అని మీ నాన్న ఎన్టీఆర్ గారే స్వయంగా చెబితే మీరేమో ఆయన్ను సింహం అంటుంటే ప్రజలకు నవ్వొస్తోంది.. మీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో మీ… https://t.co/bJHolk6EM3 — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్‌కు అచ్చెన్నాయుడు ► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి ► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి ► పార్టీ సీనియర్ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం ► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్ అయిన చంద్రబాబు ► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి 3:45 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు ► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం ► అరెస్ట్ సమయంలో CID అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ ► తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్ ► కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి ► కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా ► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు ► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు ► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు 3:30 PM, సెప్టెంబర్ 25, 2023 రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా? ► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు ► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు ► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు ► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందంటున్న లాయర్లు 3:15 PM. సెప్టెంబర్ 25, 2023 షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID ► బాబు సృష్టించిన షెల్ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే ► షెల్ కంపెనీ డైరెక్టర్లుగా సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్ ► షెల్ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్ ► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు ► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు ► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి ► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు 2:45PM. సెప్టెంబర్ 25, 2023 ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి? ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం ► నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు ► 2014-18 మధ్య స్కిల్ కుంభకోణం ► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు ► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే ► పార్టీకి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, హైదరాబాద్ జోన్ ఖాతాలో భారీగా డిపాజిట్లు ► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ ► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు ► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు ► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను ► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ పట్టుదల ఉంది ► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు ► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను ► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్ ► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్ ► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP ► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ ► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు ► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు ► ఈ లెక్కన కేవలం హెరిటేజ్‌లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.! ► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత? ► హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్ విలువ ఎంత? ► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు? మా కుటుంబం అంతా ఒకటే నమ్ముతాం... మా కుటుంబానికి ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ముకు ఆశపడితే ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది. #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SqVhXhFpte — Telugu Desam Party (@JaiTDP) September 25, 2023 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి ► లోకేష్ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.? ► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్ ► లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ ► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్ ► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు ► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్ ► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక ► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి ► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు ► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ ► భవిష్యత్ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ ► చంద్రబాబు ఔట్ సోర్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు “చంద్రబాబు అవుట్ సోర్సింగ్ రాజకీయాలు” చంద్రబాబు రాజకీయాలు మొత్తం పక్కరాష్ట్రం నుంచి అవుట్ సోర్సింగ్ మీదనే నడిపిస్తున్నారు. అయన ఏపీ నివాసి కాదు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి సైతం హైదరాబాదీలే.. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో… — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 1:25 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్ ► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు ► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు ► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము ► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది ► కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై మా వాదనలు వినాలి : CID ► పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం ► ముందు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తవగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు 1:22 PM, సెప్టెంబర్ 25, 2023 మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే కోర్టు మీద నిందలేస్తారా? ► రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు ► కొందరు సొంత లబ్ది కోసం జర్నలిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు ► కోర్టు మీద విమర్శలు చేసి జర్నలిజాన్ని చంపేశారు ► ఓ వర్గం మీడియా సమాంతర వ్యవస్థను నడుపుతోంది, అన్నీ తాను చెప్పినట్టుగా జరగాలంటోంది ► న్యాయ వ్యవస్థను కొన్ని ఛానెల్స్ కించపరుస్తున్నాయి 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసా? : భువనేశ్వరీ ► మా కుటుంబానికి వ్యాపారాలున్నాయి ► నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నా ► నా సంస్థలో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి ► ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు ► ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏటా రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? : అంబటి ► చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారికి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి ► ఈ కేసులో సమగ్ర ఆధారాలు బయటపడుతుండడంతో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయి ► గతంలోలా సమాజమంతా ఎల్లో మీడియా మీద ఆధారపడనవసరం లేదు ► ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు ► ఒకాయిన ఢిల్లీలో ఉన్నాడు, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ► స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగింది 12:55 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది చట్టం చేస్తున్న పని, దీనికి రాజకీయాలతో సంబంధమేంటీ? ► చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సినీ నటుడు సుమన్ ► మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సుమన్ ► జైల్‌కు వెళ్లాడంటే సీఎం జగన్ చేశారంటున్నారు కానీ అది సరికాదు ► ఒకరు జైలుకు వెళ్లారంటే దాని వెనక చాలా కారణాలుండొచ్చు ► ఆ అరెస్ట్ గురించి నిర్ణయించే బాధ్యత కోర్టులపై ఉంటుంది ► మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు అన్ని ఆలోచించే వుంటారు ► టైం బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా వస్తుంది ► టైం బాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ► చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తాడో జ్యోతిష్యులు చెప్పగలరేమో.! 12:48 PM, సెప్టెంబర్ 25, 2023 మరిన్ని రోజులు కస్టడీ కోరిన సీఐడీ ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు ►ముందు కస్టడీ పిటిషన్ వాదనలు వినాలని కోరిన సీఐడీ ►కస్టడీలో చంద్రబాబు సహకరించలేదంటున్న సీఐడీ ►కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఆదేశించిన జడ్జి 12:22 PM, సెప్టెంబర్ 25, 2023 దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు: అంబటి స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మంత్రి అంబటి అసెంబ్లీలో మాట్లాడారు ►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు ►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది ►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు ►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు ►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం ►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు ► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు 12:00 PM, సెప్టెంబర్ 25, 2023 మరో 3 రోజులు కస్టడీ కావాలి : CID ► ACB కోర్టులో మరోసారి కస్టడీ పిటీషన్ దాఖలు చేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపిన CID ► మరో మూడు రోజులు విచారణ జరుపుతామని విజ్ఞప్తి 11:45AM, సెప్టెంబర్ 25, 2023 తాజా పరిణామాలపై పక్కాగా ప్రిపేరయిన CID ► ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతున్నారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది ►చంద్రబాబు బెయిల్ విషయంలో పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోన్న CID 11:32AM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో మధ్యాహ్నం తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ ► బెయిల్‌పై ఇరుపక్షాల వాదనలు వింటామన్న ACB కోర్టు ► ACB కోర్టుకి చేరుకున్న కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ ఆధ్వర్యంలోని సిట్ బృందం 11:30AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ► 284 పేజీలతో SLP దాఖలు చేసిన బాబు లాయర్ల బృందం ► చంద్రబాబుకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి ► ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 11:25AM, సెప్టెంబర్ 25, 2023 అరెస్ట్‌పై చర్చించేందుకు అసెంబ్లీకి రారా? ► చర్చిస్తామని చెప్పిన టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బాయ్‌కాట్ చేశారు? : YSRCP ► ఈ కేసుపై సమగ్రంగా చర్చిద్దాం, రండి సభకు వచ్చి మాట్లాడండి : YSRCP స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 11:15AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో తెలుగుదేశం వరుస పిటిషన్లు ► క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం నేతలు ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు ► ఈ FIRను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో FIRను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు 11:00AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు వరుస పిటిషన్లు ► పిటిషన్లతో కోర్టును ఇరకాటంలో పెడుతోన్న చంద్రబాబు లాయర్లు ► సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు ► ప్రతీ పిటిషన్ అర్జంటుగా స్వీకరించి వాదనలు వినాలంటూ విజ్ఞప్తులు ► సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే ► పిటిషన్ ఎప్పుడు విచారించాలన్నది కోర్టు చూసుకుంటుందన్న న్యాయమూర్తి 10:55AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీం ముందుకు రేపు చంద్రబాబు పిటిషన్ ► రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు ► త్వరంగా తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను విజ్ఞప్తి చేసిన లూథ్రా ► చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని అడిగిన సీజే ► ఈ నెల 8న అరెస్ట్ చేశారన్న లుత్రా ► కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్ న్యాయవాది లూథ్రా ► సరే, ఇప్పుడెందుకు అన్ని వివరాలు రేపే మెన్షన్ చేయమన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ► పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని చెప్పిన చీఫ్ జస్టిస్ 10:45AM, సెప్టెంబర్ 25, 2023 మధ్యాహ్నం తర్వాత ములాఖత్‌లు ► రాజమండ్రి : మధ్యాహ్నం తర్వాత సెంట్రల్ జైల్లో చంద్రబాబు ములాఖత్ ► చంద్రబాబును కలవనునున్న భువనేశ్వరీ, బ్రహ్మణి, టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ► మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న నారా భువనేశ్వరి ► అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారి దర్శనం చేసుకోనున్న భువేనేశ్వరి ► అక్కడినుంచి జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి ► మధ్యాహ్నం తర్వాత రాజమండ్రికి వచ్చి ములాఖత్‌లో చంద్రబాబును కలవాలని ప్రోగ్రామ్ 10:35AM, సెప్టెంబర్ 25, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► ఇవ్వాళ బెంచ్ కేటాయిస్తేనే 28లోపు వాదనలు జరిగే అవకాశం ► ఇదే విషయాన్ని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని సిద్ధార్ధ్ లూథ్రా నిర్ణయం ► తన పిటిషన్‌పై వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని కోరనున్న సిద్ధార్ధ్ లూథ్రా 10:30AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► ఇవాళ హైకోర్టు ముందుకు మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ పిటిషన్ ► తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నారాయణ పిటిషన్ ► నాలుగు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ 10:26AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో స్టేటస్ ఏంటీ? ► సుప్రీంకోర్టుకు మరోసారి నేడు చంద్రబాబు లాయర్లు ► చంద్రబాబు పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరనున్న న్యాయవాదులు ► ఈ నెల 23న (శనివారం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ► చంద్రబాబు పిటిషన్‌ను ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ► ఇవ్వాళ ఏ బెంచ్ అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ► రేపు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని బాబు లాయర్ల విజ్ఞప్తి 10:16AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు ముఖ్యమైన అంశాలు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ప్రమోద్ దూబే ►చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న CID ►ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా కోరిన సీఐడీ 09:48AM, సెప్టెంబర్ 25, 2023 ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే ►తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? ►అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు ►ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే :::ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 09:25AM, సెప్టెంబర్ 25, 2023 అవినీతి బయటపడుతుందనే.. అసెంబ్లీ బాయ్‌కాట్ ►స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. ►చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. ►వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 09:20AM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి: మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి 08:59AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంలో పెండింగ్ కేసుగా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరేందుకు బాబు తరపు న్యాయవాదుల ప్రయత్నాలు ►ఓరల్ మెన్షన్ జాబితాలో కనిపించని బాబు కేసు ►ఈనెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు ►బాబు పిటీషన్ ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►పెండింగ్ కేసు గా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 08:40AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు: సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ►మరో మూడు రోజులపాటు చంద్రబాబు కస్టడీ పొడిగించాలని.. ఏసీబీ కోర్టును సీఐడీ కోరే అవకాశం ►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న సీఐడీ ►ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ ►మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు ►బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్లో పేర్కొన్న సీఐడీ 08:03AM, సెప్టెంబర్ 25, 2023 నేడు వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసులపై విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాంలో సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు క్వాష్ పిటిషన కొట్టివేతపై సుప్రీం కోర్టులో సవాల్ 07:16AM, సెప్టెంబర్ 25, 2023 స్కిల్ కేసుల్లో కస్టడీ పిటిషన్ ఛాన్స్ ►చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసే ఛాన్స్ ► రెండు రోజుల విచారణలో కాలయాపన చేసినట్లు చెబుతున్న సీఐడీ వర్గాల/ ► ఇంతకు ముందు ఐదు రోజులు కోరితే.. 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు ► శని, ఆదివారాల్లో మొత్తం కలిపి 12 గంటలపాటు ఇంటరాగేష్ చేసిన సీఐడీ బృందం ►కీలక డాక్యుమెంట్లు ముందు ఉంచి ప్రశ్నించినా.. దాటవేత ప్రదర్శించిన చంద్రబాబు ► మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసే అవకాశాలు 06:52AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్! ►16వ రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు రిమాండ్ ►నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ►ఉదయం ఎనిమిది గంటలకు ములాఖత్ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్న నారా భువనేశ్వరి 06:48AM, సెప్టెంబర్ 25, 2023 రిమాండ్ పొడిగింపుతో మరికొన్ని రోజులు జైల్లోనే చంద్రబాబు ►స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ దాకా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు ►ఆదివారంతో ముగిసిన సీఐడీ కస్టడీ ►ఆదివారంతోనే ముగిసిన రిమాండ్ కూడా ►కస్టడీ ముగిశాక వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చిన అధికారులు ►కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని చంద్రబాబుతో వ్యాఖ్యానించిన జడ్జి ► బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపడతామని వ్యాఖ్య ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ► వరుస పిటిషన్ల నేపథ్యంతో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్ -
చిన్నమ్మ ఫైర్
సాక్షి, చెన్నై: సోదరుడు దివాకరన్ చర్యలపై చిన్నమ్మ శశికళ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు తెలిసింది. ఆమెతో ములాఖత్ అయిన న్యాయవాదులు, ముఖ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అందరూ దినకరన్‌కు అండగా ఉండాలని ఆమె సూచించినట్టు, త్వరలో కేడర్‌కు ఓ లేఖాస్త్రం సంధించపోతున్నట్టుగా సమాచారం. చిన్నమ్మ శశికళ కుటుంబ విభేదాలు రచ్చకెక్కి ఉన్నవిషయం తెలిసిందే. ఆమె సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ల మధ్య సాగుతున్న ఈ సమరంలో కుటుంబ పరువు గంగలో కలిసే రీతిలో ఉన్నట్టుగా చిన్నమ్మ పరిగణించారు. అలాగే, రాజకీయంగా మున్ముందు పెనుముప్పు తప్పదన్న విషయాన్ని గ్రహించి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో దివాకరన్ను పక్కన పెట్టి, దినకరన్‌కు అండగా నిలబడేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. గతంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా, దినకరన్‌కు మద్దతుగానే శశికళ వ్యవహరించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలో అనేక సమస్యలు ఉన్నా, తాను జైలుకు వెళ్తూ దినకరన్ భుజం మీద బాధ్యతల్ని ఉంచి వెళ్లారని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా, కుటుంబం పరువు మరింత రచ్చకెక్కకుండా ఉండే రీతిలో, దివాకరన్‌కు చెక్ పెట్టేందుకు తగ్గట్టుగా చిన్నమ్మ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఆమెతో ములాఖత్ అయిన ముఖ్యులు, న్యాయవాదుల వద్ద దివాకరన్ చర్యల్ని తీవ్రంగా ఖండించినట్టు చర్చ ఊపందుకుంది. అమ్మ శిబిరం పేరిట దివాకరన్ ముందుకు సాగుతుండడంతో, ఆయన వెంట కేడర్ గానీ, మద్దతు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలుగానీ వెళ్లకుండా జాగ్రత్లకు సిద్ధం అవుతున్నారు. అందరూ దినకరన్‌కు అండగానే ఉండాలని సూచించడంతోపాటు, త్వరలో కేడర్‌ను ఉద్దేశించి జైలు నుంచి శశికళ ఓ లేఖ విడుదలచేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. దివాకరన్ రూపంలో ఎలాంటి నష్టం వాటిళ్లకుండా ఉండే విధంగా, దినకరన్‌కు మద్దతుగా ఆమె స్పందించేందుకు సిద్ధం అవుతున్న సమాచారంతో మద్దతుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు చెప్పవచ్చు. అందుకే కాబోలు దివాకరన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అమ్మ శిబిరం ఆవిర్భావ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనించి దగ్గ విషయం. తంగతమిళ్ సెల్వన్ దివాకరన్‌కు అత్యంత సన్నిహితుడైనా, చిన్నమ్మ గతంలో అప్పగించిన బాధ్యత మేరకు తాను మాత్రం దినకరన్ వెన్నంటే ఉంటానని ప్రకటిం చడం విశేషం.తనతో పాటు అనర్హత వేటు పడ్డ వాళ్లు, ముఖ్యులు, కేడర్ దినకరన్‌కు అండగా ఉంటారని వ్యాఖ్యానించే పనిలో తంగతమిళ్ సెల్వన్ ఉన్నారు. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దర్శకత్వంలోనే దివాకరన్ అడుగుల వేగా న్ని పెంచనున్నట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆ వేగానికి కళ్లె్లం వేయడం లక్ష్యంగా చిన్న మ్మ స్పందన కోసం కేడర్ ఎ దురుచూపుల్లో ఉంది. దివాకరన్ తీరుపై దినకరన్ తీవ్రంగానే విరుచుకుపడే పనిలో పడ్డా రు.ఆయన మానసిక రోగి అని నిన్నటి రో జున వ్యాఖ్యానించారు.తాజాగా దివాకర న్కు పిచ్చి పట్టినట్టుందని మండిపడ్డారు. -
జైలు సిబ్బందిపై సూపరింటెండెంట్ సీరియస్
కర్నూలు: కర్నూలు శివారులో పంచలింగాల సమీపంలోని జిల్లా జైలు సిబ్బంది తీరుపై సూపరింటెండెంట్ వరుణారెడ్డి సీరియస్ అయ్యారు. ‘వసూళ్ల జైలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనానికి స్పందించి కిందిస్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘జిల్లా అంతటా పరువు తీశారు... ఇకపై మీ ఆటలు చెల్లవు.. పద్ధతి మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందంటూ’ హెచ్చరించినట్లు సమాచారం. ‘ఖైదీలను కలుసుకునేందుకు వచ్చే బంధువులు, స్నేహితు లు.. జైలు సిబ్బందికి ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ములాఖత్ కోసం ఎవరైనా డబ్బు అడిగితే తగిన చర్యల కోసం 08518–247227, 94946 33400కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి’ అంటూ జైలు బారీకేడ్స్పై బోర్డులు రాయించారు. ‘అవినీతి రహిత జైలుగా ఉంచేందుకు మీ అందరి సహకారం అవసరం’ అంటూ సూపరింటెండెంట్ పేరుతో బోర్డులు రాయించి పరోక్షంగా అవినీతి సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవు.. జైలుకు వచ్చే సందర్శకుల నుంచి వార్డర్, హెడ్ వార్డర్లు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వరుణారెడ్డి సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మామూళ్ల విషయంపై ఖైదీల బంధువులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏసీబీ కేసులో పట్టుబడిన ముద్దాయిలైనా.. ఇతర కేసుల్లో రిమాండ్‌కు వచ్చిన నిందితులైనా.. జైలులో అందరినీ సమానంగా చూస్తున్నామని, ఎవరికీ అదనపు సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన తెలిపారు. -
వసూళ్ల జైలు!
తిరుపతి పట్టణానికి చెందిన ఓ డీఈ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కర్నూలు సబ్ జైలుకు తరలించారు. ఆయనను కలుసుకోవడానికి వారం రోజుల తరువాత భార్య జిల్లా జైలుకు వెళ్లారు. రిమాండ్ పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. ములాఖత్‌కొచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులకు ఎలాంటి అడ్డంకి లేకుండా ఏర్పాటు చేస్తామంటూ రూ.80 వేలు మామూళ్లు వసూలు చేశారు. ఒక డీఈ భార్యనే కాదు జిల్లా జైలుకు వెళ్లిన చాలా మంది సందర్శకుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన జైళ్లు.. వసూళ్ల కేంద్రాలుగా మారాయి. ఖైదీలను కలుసుకునేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు బలవంతపువసూళ్లు చేస్తున్నారు. మామూళ్లతో వేధిస్తుండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. కర్నూలు:ఖైదీల పరివర్తన కేంద్రాలుగా జైళ్లను తయారు చేస్తామని కర్నూలు జిల్లా జైలు ప్రారంభోత్సవంలో హోంమంత్రి చినరాజప్ప ప్రకటన చేశారు. ఖైదీల పరివర్తన దేవుడెరుగు వారిని కలుసుకునేందుకెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ పని చేస్తున్న వార్డర్లు, హెడ్ వార్డర్లు ములాఖత్దారులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న శిక్షలు పడిన వారిని సైతం వదలకుండా మామూళ్లతో వేధిస్తోండడంతో ఖైదీల బంధువులు లబో దిబోమంటున్నారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన ఖైదీలంటే పండగే... కర్నూలుతో పాటు కడప, అనంతపురం జిల్లాల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులను కర్నూలు జైలుకు తరలిస్తారు. వారు రిమాండ్ ఖైదీలుగా వచ్చారంటే అక్కడ పని చేసే వార్డర్, హెడ్ వార్డర్లకు పండగే. లంచాలకు మరిగిన మీరు ములాఖత్‌కు మామూళ్లు ఇవ్వలేరా అంటూ వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నాన్‌బెయిలబుల్ కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కలుసుకునేందుకు వచ్చిన సందర్శకుల నుంచి కూడా భారీగా దండుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు ఇచ్చి న వారికి ఒక రకంగా ఇవ్వని వారికి మరో రకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ములాఖత్ నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీలను కటుంబ సభ్యులు, బంధువులు వారానికి రెండుసార్లు కలుసుకోవచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు ఏఏ ఖైదీని ఎంతమంది కలిశారన్నది ‘విజిటర్స్ బుక్కు’లో నమోదు చేయాలి. అయితే మామూళ్లు ముట్టజెప్పినవారికి విజిటర్స్ బుక్కులో నమోదు చేయకుండానే ఎక్కువసార్లు ములాఖత్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో కర్నూలు శివారులో ఒక వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ1 నిందితుడు కొంతకాలంగా ఈ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు ప్రతి రోజు ములాఖత్‌కు అవకాశం కల్పించి మామూళ్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం ఆ ఖైదీని పోలీసులు కస్టడికి తీసుకున్నారు. అతడిని కలుసుకునేందుకు జైలు దగ్గరకెళ్లి అల్లర్లకు పాల్పడిన కొంతమంది యువకులపై తాలూకా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ ఖైదీని కలుసుకునేందుకు ప్రతి రోజు ఎలా అనుమతిస్తున్నారంటూ అక్కడ జరుగుతున్న వసూళ్ల వ్యవహారాన్ని పోలీసు అధికారులు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీలకు కోర్టు నుంచి బెయిల్ మంజూరైనా సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిని బయటకు పంపరాదన్న నిబంధన చూపి ఒక్కొక్కరినుంచి రూ.1000 దాకా లంచం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రిజినర్ ఫోన్ క్యాష్ (పీపీసీ) పేరుతో చేసిన వసూళ్లలో కూడా కొంత మంది హెడ్ వార్డర్లు సగం మెత్తాన్ని కాజేస్తున్నట్లు ఖైదీల బంధువులు వాపోతున్నారు. సందర్శకులు, ములాఖత్దారుల నుంచి రోజుకు కనీసం రూ.10 వేలకు పైగా మామూళ్ల రూపంలో వసూలు చేసి అక్కడ పని చేస్తున్న కింది స్థాయి అధికారులు వాటాలు వేసి పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వసూళ్ల తతంగంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టి న్యాయం చేయాలని సందర్శకులు కోరుకుంటున్నారు. నగరానికి దూరం..సిబ్బంది ఇష్టారాజ్యం జిల్లా జైలు గతంలో నగరంలోని ఆర్డీఓ ఆఫీసు పక్కన ఉండేది. తరచూ ఉన్నతాధికారులు సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకునే వారు. ఏడాది క్రితం నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పంచలింగాల గ్రామ సమీపంలో జిల్లా జైలును నూతనంగా నిర్మించి అక్కడికి షిఫ్ట్ చేశారు. జైలు దూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ కొరవడి వసూలు రాజాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఖైదీల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ 8 మంది వార్డర్లు, నలుగురు హెడ్ వార్డర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో సగం మంది వసూళ్లే దిన చర్యగా వ్యవహరిస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఆధార్‌కార్డు లేకుంటే రూ.1000 ముట్టజెప్పాల్సిందే హత్యలు, అత్యాచారాలు, చోరీలు, కొట్లాటలు, దోపిడీలు మొదలుకుని జేబుదొంగలు, సారా కేసుల్లో పట్టుబడినవారు, మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ కేసుల్లో ఇరుక్కున్నవారు ఈ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తుంగ భద్ర బ్యారెక్స్‌లో రిమాండ్ ఖైదీలు, కృష్ణా బారెక్స్‌లో శిక్షలు పడినవారు ఉంటున్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్లిన బంధువులు లేదా సందర్శకులు కచ్చితంగా ఆధార్‌కార్డు చూపించాలన్న నిబంధన ఉంది. అది లేకుండా వెళ్లిన వారికి కింది స్థాయి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనను సాకుగా చూపి రూ.500 నుంచి రూ.1000 దాకా మామూళ్లు వసూలు చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఏసీబీకి పట్టుబడి ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చూసేందుకు వచ్చిన కన్న కూతురికి నిబంధనలను సాకుగా చూపి అధికారులు భారీ మొత్తంలో దండుకున్నారు. ఫోన్లో ప్రతి రోజు మాట్లాడిస్తాం... ఆయనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంటి వాతావరణంలో గడిపినట్టుగా చూసుకుంటామని ఇద్దరు హెడ్ వార్డర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఖైదీలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రాయలసీమ యూనివర్సిటీకి చెందిన ఓ ఉద్యోగి చీటింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయనను కలుసుకునేందుకు వెళ్లిన తల్లి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమీప బంధువులు ఆరోపిస్తున్నారు. జైల్లోకి రిమాండ్ ఖైదీలను అనుమతించేటప్పుడు తనిఖీ పేరుతో వారి జేబుల్లో ఉన్న మొత్తాలను కూడా స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
చిన్నమ్మా.. చాలమ్మా!
► ములాఖత్‌కు ముక్కుతాడు ► మంత్రులకు సైతం నో ► అధికారుల ఆంక్షలు సాక్షి ప్రతినిధి, చెన్నై: కుప్పలు తెప్పలుగా వస్తున్న సందర్శకులతో పరప్పన ఆగ్రహార జైలును పార్టీ కార్యాలయంగా మార్చవద్దు చిన్నమ్మా...ఇక చాలు అంటూ ఆంక్షలు విధించారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సరిగ్గా సీఎం పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె కటకటాల పాలయ్యారు. ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్లపాటు శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కేసులో శశికళతోపాటూ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు అదే జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోని ఖైదీలు ములాఖత్ పేరున తమ వారిని కలుసుకునేందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కర్నాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చనేది అత్యంత ముఖ్యమైనది అయితే, శశికళ జైలు నిబంధనలను అతిక్రమంచి అత్యధికుల సందర్శకులతో సంభాషించినట్లు తేలింది. ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు (31 రోజుల్లో) 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. సంభాషణ సైతం 15 నిమిషాలకు పరిమితం కాకుండా 40 నిమిషాలపాటూ సాగించారు. అంతేగాక ములాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయాల్సిన తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నా రాష్ట్రంలో ఆమె కన్నుసన్నులోని ప్రభుత్వమే నడుస్తోంది. జైలు నుండే పరోక్షంగా పార్టీ, ప్రభుత్వంపై ఆమె పెత్తనం సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తరచూ తమ పార్టీ వారిని కలుసుకోవడం ఆమెకు అనివార్యంగా మారింది. ములాఖత్‌కు ముక్కుతాడు ములాఖత్ కింద ఇప్పటికే లెక్కకు మించి సందర్శకులు వచ్చినందున ఇకపై జోరు తగ్గించాలని శశికళను జైలు అధికారులు ఆదేశించారు. సాధారణ సందర్శకులే కాదు మంత్రులను సైతం అనుమతించేది లేదని నొక్కిచెప్పారు. ప్రత్యేక అనుమతి పొంది వచ్చినా అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఎన్నికలను అడ్డుపెట్టుకుని ఆమెను కలిసేందుకు ప్రయత్నించినవారిని జైలు అధికారులు తిప్పిపంపేశారు. ములాఖత్ కింద శశికళ ఇప్పటికే సంఖ్య గీతను దాటారు, ఇకపై ఆ లెక్కను తగ్గించే ప్రయత్నంలో ఉన్నామ్ని బెంగళూరు జైలు అధికారి తెలిపారు. -
అమానుషంగా వ్యవహరించారు...
ములాఖత్‌కు వెళ్లిన నేతలతో హెచ్‌సీయూ విద్యార్థుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో తాము శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుండగా పోలీసులు అమానుషంగా వ్యవహరించి అక్రమంగా అరెస్టు చేశారని చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం ములాఖత్ కోసం వెళ్లిన నేతలతో వాపోయారు. పోలీసులు పథకం ప్రకారమే తమను అరెస్టు చేశారని, ముందుస్తు వ్యూహం అమలు చేశారని పేర్కొన్నట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన నేతలు వెల్లడించారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు, ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య విడివిడిగా జైలులో ఉన్న విద్యార్థులు ప్రశాంత్, వెంకటేశ్ చౌహాన్, ప్రొఫెసర్ రత్నం, కృశాంక్, లింగస్వామి, అమృతరావు, దుంగ హరీష్‌లతో ములాఖత్ అయ్యారు. హెచ్‌సీయూ ఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. తమను పోలీసులు పలు పోలీస్స్టేషన్లలో ఉంచి అమానుషంగా వ్యవహరించారని విద్యార్థులు చెప్పారు. పోలీసుల చర్యల కారణంగా తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురయ్యారని, కొందరు ఆస్పత్రి పాలయ్యారని జైలులో ఉన్న అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ములాఖత్‌కు వెళ్లివచ్చిన మౌలానా ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థిని అరుణ తెలిపారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఖండన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసుల దాడిని, అరెస్టులను అంతర్జాతీయ మానవహక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విశ్వవిద్యాలయంలో పోలీసుల మోహరింపుపై, జరిగిన ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వీసీ అప్పారావు రాకను తిరస్కరిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై తెలంగాణ పోలీసులు దాడులు చేయడం అన్యాయమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయవిచారణ లేకుండా ఎవరినీ శిక్షించే అధికారం లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సయ్యద్ ఆకార్ పటేల్ ఆ ప్రకటనలో వ్యాఖ్యానించారు. -
తీర్మానం ఉండాల్సిందే...
రాష్ర్ట విభజన అంశంలో చర్చకు మద్దతిస్తూ సమైక్య తీర్మానం అంశాన్ని మరచిపోతున్న వారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన సమైక్యవాదులు తీర్మానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదం వినిపిస్తూ విభజనకు సహకరిస్తున్న నాయకులకు కొందరు ఉద్యోగ నేతలు వత్తాసు పలుకుతుండడాన్ని ఖండిం చారు. సమైక్యవాదానికి అనుకూలంగా తీర్మానం చేయాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుమ్మక్కయ్యారు.. సమైకాంధ్ర ముసుగులో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షంతో ఎన్జీఓ సంఘ నాయకుడు ములాఖత్ అయినట్లు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోటి వెంట ఏ మాటలు వస్తున్నాయో అశోక్‌బాబు కూడా అవే మాట్లాడుతుండడం దీనికి నిదర్శనం. రెండు నెలలుగా ఉద్యోగాలు వదిలి ఉద్యమాలు చేస్తే వచ్చిన ఫలితం ఏమిటో అర్థం కావడం లేదు. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అవ్వలేదు. - చందాన మహందాతనాయుడు, చైర్మన్, ఎన్జీఒ సంఘం, బొబ్బిలి తీర్మానం ఉండాలి... అసెంబ్లీలో విభజన బిల్లుపై ఓటింగ్ జరగకుండా చర్చ జరిపితే పరోక్షంగా రాష్ట్ర విభజనను ఆమోదించినట్లే. సమైక్య తీర్మానం తప్పకుండా చేయాల్సిందే. వైఎస్ఆర్ సీపీని అడ్డుకోవడం అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగదు. - ఎ. అశోక్, ఎస్ఎఫ్ఐ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు... ఎన్జీఓ సంఘ నాయకుడు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. ఉద్యమం చేయడం ద్వారా సొంత లాభం చూసుకొని రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడిచి సీమాంధ్ర ప్రజలను మోసగించారు. ఇది క్షమించరానిది. సమైక్యాంధ్ర సాధన చేతకానప్పడు మొదట్లోనే వదిలేయాల్సింది. ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలకు అమ్మేశారు. - డి.రఘు, విద్యార్థి సంఘ నాయకుడు, బొబ్బిలి తీర్మానం, చర్చ రెండూ జరగాలి బిల్లును తిప్పికొట్టేందుకు పనికొచ్చే చట్టబద్ధత గల తీర్మానం, చర్చ రెండూ అవసరమే. ఇందులో ఏ ఒక్కటి చేపట్టకపోయినా సమైక్యానికి అన్యాయం జరుగుతుం ది. ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యా య, ఉద్యోగ సంఘాలు ఆ దిశగా శాసన సభ, మండలి సభ్యులపై డిమాండ్ చేయకపోవడం అన్యాయం. - కొన్నాన శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు, వీఆర్ఓ సంఘం. టీడీపీ వైఖరి మారింది విభజన బిల్లుపై టీడీపీ వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. సీమాంధ్ర టీ డీపీ నేతలంతా చర్చకు వ్యతిరేకమని ముందు చెప్పి చర్చలో పాల్గొనడం ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. వారంతా డ్రామాలు ఆడుతున్నారు. వారికి కొందరు వత్తాలు పలుకుతుండడం సరికాదు. - బూతాల వెంకటరమణ, ప్రైవేట్ టీచర్ తీర్మానం చేయకపోతే విభజనను అడ్డుకోలేం సమైక్య తీర్మానం చేసి పార్లమెంటుకు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టుకు పంపకపోతే విభజన బిల్లును అడ్డుకోలేం. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రాజకీయాలను పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆ దిశగా చట్టసభల్లో వ్యవహరిం చేలా ఒత్తిడి చేయాలి. దీనికి ఉద్యోగ సంఘాల నేతలు వక్రభాష్యం చెబుతుండడం దురదృష్టకరం.- సామల సింహాచలం, రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ టీచర్ల సంఘం మోసం చేయవద్దు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చట్టసభల్లో తీర్మానం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు డిమాండ్ చేయాలి. ఈ విషయంలో రాష్ట్రస్థాయి సంఘం నాయకులు తమ సొంత నిర్ణయాలు రుద్దడం శోచనీయం. చట్టబద్ధమైన ప్రక్రియను అమలు చే యాలని ఒత్తిడి తేవడంలో బేషజానికి పోవడం సమైక్యవాదులను మోసం చేయడమే. - బంకపల్లి శివప్రసాద్, ప్రచారకార్యదర్శి, సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి. కిరణ్ కోవర్టుగా అశోక్‌బాబు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు చర్చకు డిమాండ్ చేయడంతో ఆయన వైఖరి తేటతెల్లమయ్యింది. చర్చలో పాల్గొనడం విభజనను ఆమోదించినట్లే. ఈ విషయంలో అశోక్‌బాబు కిరణ్‌కుమార్‌రెడ్డికి కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. - ఎస్. శ్రీనివాసరావు, యువజన సంఘం నాయకుడు -
ములాఖత్‌లను అడ్డుకోలేరు: న్యాయనిపుణులు
హైదరాబాద్: ములాఖత్‌లను అడ్డుకునే అధికారం జైలు అధికారులకు లేదని మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్.రామచంద్రరావు అన్నారు. ములాఖత్లనేవి విచారణలో ఉన్న వ్యక్తికి చట్టంద్వారా సంక్రమించిన హక్కులని, ఇది జైలు అధికారుల న్యాయపరిధిలో ఉండదని స్పష్టం చేశారు. నిరవధిక నిరాహారదీక్షకు, విచారణలో ఉన్న వ్యక్తి ప్రత్యేక హోదాకు సంబంధం లేదని తెలిపారు. నిరవధిక నిరాహారదీక్ష అనేది వ్యక్తి ఇష్టమన్నారు. నిరాహారదీక్ష వల్ల జైల్లో ఉన్న వ్యక్తి హక్కులు కోల్పోయే అవకాశం లేదని సీనియర్ న్యాయవాది రవిచందర్ అన్నారు. ములాఖత్‌లను ఎవరూ రద్దుచేయలేరని చెప్పారు. ములాఖత్‌లను రద్దుచేసే అధికారం జైలు అధికారులకు లేదన్నారు. రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆదివారం నుంచి జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని వైఎస్ జగన్ నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఎల్ల్లో మీడియా అసత్య ప్రచారం మొదలు పెట్టింది.