ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణ
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు.
కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్‌కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’.
Comments
Please login to add a commentAdd a comment