Delhi CM Kejriwal
-
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్‌కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
Aam Aadmi Party: అతి త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఆప్ తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీలో భయం మొదలైందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేసేందుకే తమ నేత కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చిన విషయం తెలియగానే ఈడీ గురువారం కేజ్రీవాల్‌కు ఏడో విడత నోటీసులిచ్చిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా కేజ్రీవాల్‌కు నోటీసులు అందజేస్తుందని, రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు. -
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
దురాక్రమణదారు చైనా నుంచి దిగుమతులా?
న్యూఢిల్లీ: భారత్‌పై దురాక్రమణలకు పాల్పడుతున్న చైనా నుంచి దిగుమతులకు కేంద్రం ఎందుకు అనుమతిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ధైర్యంగా చైనా దిగుమతులను నిలిపివేసి మత సత్తా చాటాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌకగా దొరికేవే అయినా చైనా వస్తువులను మానేసి, ఖరీదైనా దేశీయంగా తయారైన వాటినే కొనాలని కోరారు. ఎద్దు నుంచి పాలు పితికాం గుజరాత్ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకోవడంపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఆవు నుంచి పాలు ఎవరైనా పితుకుతారు. కానీ, గుజరాత్లో మేం ఎద్దు నుంచి పాలు పితికాం. అతికష్టమ్మీద 5 సీట్లు గెలుచుకున్నాం’ అని అన్నారు. -
బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు కీలక సూచన చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధికార బీజేపీ పార్టీలోనే ఉంటూ ఆప్ కోసం పనిచేయాలని కోరారు. ‘బీజేపీ నుంచి నిధులు అందుకోండి. కానీ అక్కడి నుంచి ఆప్ కోసం పని చేయండి’ అని పేర్కొన్నారు. గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌కోట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్. ‘మాకు బీజేపీ నాయకులు అవసరం లేదు. వారి నేతలను బీజేపీనే అట్టిపెట్టుకోని. బీజేపీకి చెందిన పన్నా ప్రముఖ్స్, గ్రామాలు, బూత్, తాలుక స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున మా పార్టీలో చేరుతున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి సేవలందిస్తున్న పార్టీ కార్యకర్తలకు కాషాయ పార్టీ ఏమించ్చిందని వారిని ఆడగాలనుకుంటున్నా? మీరు (బీజేపీ కార్యకర్తలు) ఆ పార్టీలోనే ఉండండి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేయండి. చాలా మంది బీజేపీ నుంచి డబ్బులు అందుకుంటున్నారు. ఆ నగదు తీసుకుంటూనే మా కోసం పని చేయండి. ఎందుకంటే మా వద్ద డబ్బులు లేవు.’ అని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉచిత విద్యుత్తు అందిస్తామని, అది బీజేపీ కార్యకర్తల ఇళ్లకు సైతం వర్తిస్తుందన్నారు కేజ్రీవాల్. ‘మీకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మీ పిల్లలకు మంచి స్కూల్స్‌లో ఉచిత విద్య అందిస్తాం. మీ కుటుంబ సభ్యులకు ఉచితంగా నాణ్యమైన వైద్యంతో పాటు మీ కుటుంబంలోని మహిళలకు రూ.1,000 సాయం చేస్తాం.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: ఆప్‌కు ఫేవర్‌గా గుజరాతీలు!.. సర్వేలపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి... రూ.6,300 కోట్లు వెచ్చించింది
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఏకంగా రూ.6,300 కోట్లు వెచ్చించిందని శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ ఆ పని చేయకపోతే ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించే అవసరమే ఉండేది కాదు. ప్రజలకు ధరాఘాతం తప్పేది’’ అని ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ‘‘పెట్రోల్, డీజిల్‌పై పన్నులు, జీఎస్టీ సొమ్ములను ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ వెచ్చిస్తోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి పడుతుంటే ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోయడంలో బిజీగా ఉంది’’ అన్నారు. బీజేపీలో చేరాలంటూ రూ.20 కోట్లు చొప్పున ఆశ చూపారని ఆప్ ఎమ్మెల్యేలు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అస్సాం సీఎం, కేజ్రీవాల్ ట్విట్టర్ వార్ కేజ్రీవాల్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అస్సాంలో సర్కారీ స్కూళ్ల పరిశీలనకు ఎప్పుడు రమ్మంటారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌తోనూ కేజ్రీవాల్‌కు విభేదాలు ముదురుతున్నాయి. కేజ్రీవాల్ సంతకాలు లేవంటూ 47 ఫైళ్లను ఎల్జీ తిప్పిపంపారు. -
విద్య, వైద్యంపై ఖర్చు ‘ఉచితాలు’ కావు.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
చెన్నై: ఆరోగ్యం, విద్యారంగాలపై ప్రభుత్వాలు చేసే వ్యయం ఉచితాలు కిందికి రాదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఈ రెండింటిపై చేసే పథకాలు పేదలకు ఎంతో మేలు చేసేవేనన్నారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రతిబంధకాలంటూ ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రివాల్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. శనివారం కొలత్తూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్టాలిన్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు వేర్వేరని అంటూ ఆయన..ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుందని పేర్కొన్నారు. ‘విద్య, వైద్యంపై చేసే వ్యయం ఉచితాల కిందికి రాదు. ఎందుకంటే విద్య జ్ఞానసముపార్జనకు, వైద్యం ఆరోగ్యానికి సంబంధించినది. మా ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయాలనుకుంటోంది. ఇవి ఉచితాలు కావు. సంక్షేమ పథకాలు. ఉచితాలు ఉండకూడదంటూ ఇటీవల కొందరు కొత్తగా సలహాలిస్తున్నారు. దాన్ని మేం పట్టించుకోం. కానీ, ఎక్కువ మాట్లాడితే రాజకీయం అవుతుంది. కాబట్టి, దీనిపై మరింతగా మాట్లాడదలుచుకోలేదు’అంటూ ముగించారు. -
సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ టిట్ ఫర్ టాట్ రాజకీయాలకు దిగారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట దేశా రాజధానిలో నిరసన చేస్తున్న టీచర్లతో కలిసి ఆయన కూడా తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ టీచర్లు తమని రెగ్యులర్ చేయాలన్న డిమాండ్‌తో చేస్తున్న నిరసన ప్రదర్శనల్లో ఆదివారం సిద్ధూ కూడా పాల్గొన్నారు. గత నెలలో పంజాబ్‌లోని మొహాలిలో కాంట్రాక్ట్ టీచర్లు రెగ్యులరైజేషన్ కోరుతూ నిరసన చేస్తుంటే కేజ్రీవాల్ వారికి మద్దతుగా ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పుడు సిద్ధూ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా అదే డిమాండ్ చేస్తున్న ఢిల్లీ టీచర్లతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ టీచర్లని పర్మనెంట్ చేస్తామని, విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేజ్రీవాల్ హామీలు ఇచ్చారు. ఢిల్లీలో కూడా కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థని పెట్టుకొని పంజాబ్‌లో ఏం చేస్తారని సిద్ధూ ప్రశ్నించారు. ఖాళీలన్నీ గెస్ట్ టీచర్లతోనే కేజ్రీవాల్ భర్తీ చేస్తున్నారన్నారు. -
ఆప్ ఎంపీపై సిరా దాడి
హాథ్రస్/లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్‌పై హాథ్రస్లో సోమవారం ఒక వ్యక్తి సిరా పోసి నిరసన తెలిపాడు. హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న సంజయ్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి సిరా పోశాడు. ‘పీఎఫ్ఐ దళారి.. వెనక్కు వెళ్లిపో’ అని అతడు గట్టిగా అరిచాడు. అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. యూపీ ప్రభుత్వ తీరుకు ఇది అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిధులిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. దేశద్రోహం కేసు: కుల ఘర్షణలకు ప్రయత్నిస్తున్నారని, కులం ప్రాతిపదికన విద్వేషం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్పా పోలీస్‌స్టేషన్‌లో వారిపై దేశద్రోహం సహా పలు తీవ్ర అభియోగాలు మోపారు. హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇలా ఉండగా, బాధిత దళిత యువతి ఇంటి వద్ద సెక్యూరిటీ పెట్టామని, ఆమె ఇద్దరు సోదరులకు ఇద్దరు గన్మెన్లను ఏర్పాటు చేశామని ఓ అధికారి చెప్పారు. -
ఆప్, కేంద్రం మధ్య ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: తమ డిమాండ్లపై కేంద్రం మౌనం వీడకుంటే ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఐదు రోజులుగా నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఐఏఎస్‌లు విధుల్లో పాల్గొనేలా చేసే విషయమై శుక్రవారం హోం మంత్రితో చర్చలు విఫలం కావటంతో ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆదివారం నాటికి కేంద్రం నుంచి ఏ సమాధానం రాకుంటే ఇంటింటికీ వెళ్లి పదిలక్షల కుటుంబాల సంతకాలు సేకరించి ప్రధానికి పంపుతామన్నారు. ఆదివారం తాము ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలుపుతామని ఆప్ ప్రకటించింది. ఈ పరిణామాలపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీని కలిసి చర్చించారు. -
రాష్ట్ర హోదా ఇస్తే బీజేపీకి ప్రచారం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే కేంద్రం ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తే ఆ ఎన్నికల్లో తాము బీజేపీ తరఫున ప్రచారం చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఢిల్లీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనే ప్రధాని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. ఇచ్చిన మాటను మోదీ నిలబెట్టుకుంటారా లేక అది కేవలం ఓ అబద్ధపు, మోసపూరిత హామీగా మిగిలిపోనుందా అని ప్రశ్నించారు. దేశమంతటికీ 1947లో స్వాతంత్య్రం వచ్చినా ఢిల్లీకి మాత్రం రాలేదనీ, బ్రిటిష్ వారికన్నా ఘోరమైన రీతిలో కేంద్రం ఢిల్లీ ప్రజలను హింసిస్తోందంటూ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సస్పెండ్‌కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌లకు తప్పుడు ప్రకటనలు చేయడం, ఎదుటివారికి మచ్చతెచ్చేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారిందని ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) హైకోర్టుకు వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ ఏకే సిసోడియా ముందు కొన్ని పత్రాలను కూడా బుధవారం సమర్పించింది. తమ వ్యవహారాల్లో తలదూర్చి పనితీరును, ఆర్థిక వ్యవహారాలను తప్పుబడుతూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ ప్రకటనలు చేశారని డీడీసీఏ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలు ఖండించకపోగా తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు అంటూ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఆజాద్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ కోరగా మీడియా ముందుకు ఎప్పుడు వెళ్లినా పక్కవారి గౌరవానికి భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ మాట్లాడతారని అది వారిద్దరికి అలవాటుగా మారిందని డీడీసీఏ బుధవారం ఆరోపించింది. -
‘పెన్షన్’ టెన్షన్!
ఒకే ర్యాంక్.. ఒకే పింఛన్‌పై ఆవేదనతో మాజీ జవాన్ ఆత్మహత్య ఢిల్లీలో పురుగుల మందు తాగి రాంకిషన్ బలవన్మరణం - రాంమనోహర్ లోహియా ఆసుపత్రి వద్ద హైడ్రామా - బాధిత కుటుంబాన్ని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించిన రాహుల్ - అడ్డుకున్న పోలీసులు..రెండుసార్లు అరెస్టు - ఓఆర్ఓపీని సరిగా అమలు చేయాలంటూ రాహుల్ డిమాండ్ - కేజ్రీవాల్ అరెస్టు.. మోదీ జవాన్లను మోసం చేస్తున్నారని విమర్శ - ఎస్బీఐ బ్రాంచ్ పొరపాటుతోనే రాంకిషన్‌కు తక్కువ పింఛన్: పరీకర్ దేశ రాజధాని హస్తినలో బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్’ రాజకీయ కాక పుట్టించింది. ఈ పథకం అమలులో తనకు అన్యాయం జరుగుతోందంటూ రాంకిషన్ అనే మాజీ జవాను బలవన్మరణానికి పాల్పడడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కేంద్రాన్ని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్ నేతలు ఉదయమే రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. రాంకిషన్ మృతదేహాన్ని ఉంచిన రాంమనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లేందుకు యత్నించిన రాహుల్‌గాంధీ, కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) పథకం అమల్లో లోటుపాట్లపై ఆవేదనతో రాంకిషన్ గ్రెవాల్(70) అనే మాజీ జవాను ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ ఏరియాలోని జన్‌పథ్ ప్రభుత్వ భవనాల వెనుక భాగంలో పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓఆర్ఓపీ అమలుపై జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో రాంకిషన్ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమల్లో లోపాలను సత్వరమే సరిచేయాలని రక్షణ మంత్రిని కలసి వివరించేందుకు ముగ్గురు మాజీ సైనికులతో వచ్చిన రాంకిషన్ ఆత్మహత్యకు పాల్పడటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయాన్నే కాంగ్రెస్ నేతలు రోడ్లెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో రాంకిషన్ మృతదేహం ఉన్న రాం మనోహర్ లోహియా ఆస్పత్రి బయట కాంగ్రెస్, ఆప్ కార్యకర్తల ఆందోళనతో హైడ్రామాకు తెరలేచింది. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంకిషన్ కుమారుడితోసహా అతని బంధువులు 12 మందినీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రి వద్ద ఆందోళన రాంకిషన్ మృతదేహాన్ని లోహియా ఆస్పత్రికి తరలించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు రాహుల్ రావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్‌ను ఆస్పత్రి లోపలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. భద్రతా కారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. రాహుల్ ససేమిరా అనటంతో.. అరెస్టు చేసి మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆయన మండిపడుతూ.. ‘ఈ విధంగా ప్రజాస్వామ్య దేశాన్ని పాలిస్తామా? మృతుడి కుటుంబ సభ్యులనూ అరెస్టు చేస్తారా? ఇదేనా మోదీ ఇండియా?’ అని విమర్శించారు. ‘దేశంకోసం పోరాడిన జవాన్లు వారికి న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం కూడా పోరాడే పరిస్థితి తీసుకురాకండి. ఓఆర్ఓపీని అర్థవంతంగా అమలుచేయండి’ అని కోరారు. జవాన్లపై గౌరవాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. 70 నిమిషాల తర్వాత విడుదలైన రాహుల్.. కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్‌లతో కలసి మళ్లీ ఆసుపత్రికి బయలుదేరారు. దీంతో పోలీసులు మళ్లీ అరెస్టుచేసి.. తుగ్లక్ రోడ్స్టేషన్కు అక్కడి నుంచి తిలక్మార్క్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆప్ నేతల అరెస్టు.. మృతుని బంధువులను పరామర్శించేందుకు బయలుదేరిన కేజ్రీవాల్‌నూ మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. ‘మోదీ దేశానికి అబద్ధం చెప్పారు. ఓఆర్ఓపీ సరిగా అమలయితే.. రాంకిషన్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు?’ అని కేజ్రీ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను కూడా ఆర్ఎంఎల్ ఆస్పత్రి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. 5 గంటలకు పైగా పోలీసుల నిర్భంధంలో ఉన్న సీఎం క్రేజీవాల్‌ను బుధవారం అర్థరాత్రి విడుదల చేశారు. (చదవండి : పోలీసుల అదుపులోకి ముఖ్యమంత్రి...విడుదల) రాంకిషన్ మానసికస్థితి ఏంటో: వీకే సింగ్ ‘రాంకిషన్ ఆత్మహత్య కారణమేంటో తెలియదు. కానీ ఓఆర్ఓపీని తెరపైకి తెస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితేంటో తెలుసుకోవాలి’ అని కేంద్ర మంత్రి, జనరల్ వీకే సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చితగ్గొట్టారు: రాంకిషన్ కుమారుడు పోలీసులు తనతోపాటు కుటుంబసభ్యులు 12 మందిని అరెస్టు చేసి చితగ్గొట్టారని ఆత్మహత్య చేసుకున్న రాంకిషన్ కుమారుడు జస్వంత్ తెలిపారు. ‘జైల్లో నన్ను, నా తమ్ముడిని చితగ్గొట్టారు. బూతులు తిట్టారు. మాకు న్యాయం చేయండి’ అని ఓ వీడియోలో వెల్లడించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత.. మృతుడు రాంకిషన్.. జవానుగానే కాదు రిటైరయ్యాకా పోరాడాడు. 28 ఏళ్లు ఆర్మీలో సుబేదార్‌గా పనిచేసి 2004లో రిటైరయ్యాక సొంతగ్రామమైన హరియాణా భివానీ జిల్లా బామ్లాలో సర్పంచుగా ఎన్నికయ్యారు. గ్రామ పారిశుధ్యంలో గణనీయ ఫలితాలు సాధించినందుకు 2008లో అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా ‘నిర్మల్ గ్రామ్ పురస్కార్’ అందుకున్నారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఓఆర్ఓపీ ఆందోళనల్లోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. పథకం అమలు సమస్యలపై ఇటీవలే ప్రధానికి లేఖ రాసినట్లు తెలిసింది. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో బరిలో దిగనున్న ఫౌజ్జనతా పార్టీకి రాంకిషన్ సలహాదారు. ఎస్బీఐ తప్పిదంతోనే: పరీకర్ ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రాంకిషన్ ఈ పథకం కింద పింఛను పొందుతున్నారని రక్షణ మంత్రి పరీకర్ వెల్లడించారు. అయితే.. హరియాణాలోని భివానీ ఎస్బీఐ బ్రాంచ్ లెక్కల్లో పొరపాటు వల్ల ఆరో వేతన కమిషన్ ప్రకారం కాస్త తక్కువ మొత్తాన్ని అందుకుంటున్నట్లు తేలిందన్నారు. ఓఆర్ఓపీ ప్రకారం రూ.28 వేల పింఛను రావాల్సి ఉండగా, రాంకిషన్‌కు రూ.23 వేలే అందుతోందని తేలింది. విచారణ జరుపుతామన్న పరీకర్.. ఓఆర్ఓపీ అమల్లో కేంద్రానికున్న చిత్తశుద్ధి కారణంగానే.. రూ.5,507.47 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, రాహుల్, ఆప్ నేతలపై పోలీసు చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమర్థించారు. సమస్య మరింత తీవ్రం కాకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారన్నారు. ఎడతెగని వివాదం ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం అంటే.. ఒకే ర్యాంకులో పదవీవిరమణ చేసిన, ఒకే సర్వీసు కాలం గల సైనిక సిబ్బందికి.. వారు రిటైరైన తేదీతో నిమిత్తం లేకుండా సమాన పెన్షన్ ఇవ్వడం. ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చిందంటే.. గతంలో రిటైరైన సైనికులకు, ఆ తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి.. వారి ర్యాంకులు(హోదాలు), సర్వీసు కాలం ఒకటే అయినాపెన్షన్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. గతంలో రిటైరైన వారికి.. కొత్తగా రిటైరైన వారికంటే తక్కువ పెన్షన్ లభిస్తుంది. అయితే.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ ఇలానే ఉందని.. సైనికోద్యోగులకు మాత్రం ఈ డిమాండ్ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. కానీ.. ఇందుకు చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యమైనది తప్పనిసరి పదవీ విరమణ! సైన్యాన్ని ఎల్లవేళలా యువశక్తితో బలంగా ఉంచడానికి సైనిక సిబ్బందిని.. ముఖ్యంగా సాధారణ సిపాయిలకు 15 నుంచి 17 ఏళ్ల సర్వీసుతర్వాత తప్పనిసరి పదవీ విరమణ వర్తింపజేస్తారు. అంటే వారు 35-37 ఏళ్ల వయసుకే మాజీ ఉద్యోగులవుతారు. ఆ తర్వాతి ర్యాంకులకు కూడా నిర్ణీత వయో పరిమితి రాగానే తప్పనిసరి పదవీవిరమణ అమలవుతుంది. దీంతో కొద్దిమందికే పదోన్నతులు లభిస్తాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల లాగా 58 లేదా 60 ఏళ్ల వరకూ పనిచేసి మెరుగైన ర్యాంకుతో పదవీ విరమణ చేసే అవకాశం అత్యధికులైన సైనికులకు లభించదు. మరో కీలక అంశం.. వేతన సంఘం సిఫారసుల అమలు. 1986లో రిటైరైన సైనిక సిబ్బందికి నాలుగో వేతన సంఘం నిర్ణయించిన వేతనంపై పెన్షన్ లభిస్తుంది. 2012 తర్వాత రిటైరైన సైనిక సిబ్బందికి ఆరో వేతన సంఘం నిర్ణయించిన వేతనం ఆధారంగా పెన్షన్ లభిస్తుంది. ఉదాహరణకు చూస్తే.. 2012కు ముందు రిటైరైన మేజర్ జనరల్ ర్యాంకు మాజీ సైనికోద్యోగి పెన్షన్ రూ. 26,700 ఉంటే.. 2012 తర్వాత రిటైరైన కల్నల్ ర్యాంకు అధికారి పెన్షన్ రూ. 35,841 గా ఉంటుందని సైనికుల చెబుతున్నారు. 1973కు ముందు అమలులో... 1973 ముందు వరకూ సైనిక సిబ్బందికి ఓఆర్ఓపీ అమలులో ఉండేది. ఆ ఏడాది అమలు చేసిన మూడో వేతన సంఘం సిఫారసుల్లో భాగంగా ఈ పద్ధతిని మార్చివేశారు. అమలు.. ఆందోళనలు! 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మాజీ సైనికోద్యోగులు తమ ఆందోళనను తీవ్రం చేయడంతో 2015 సెప్టెంబర్ 6న ఓఆర్ఓపీని అమలు చేస్తున్నట్లుమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు వల్ల ప్రభుత్వానికి రూ. 8,000 కోట్ల నుండి రూ. 10,000 కోట్ల వరకూ అదనపు వ్యయం అవుతుందని, ఇది భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని అంచనా. ఓఆర్ఓపీ అమల్లో భాగంగా తొలి వాయిదాలో రూ. 5,500 కోట్లు విడుదల చేసినట్లు మోదీ చెప్పారు. రెండో వాయిదా చెల్లించాల్సి ఉంది. కానీ.. తమ ఆందోళనలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ జవాన్లు అంటున్నారు. ఇవీ మాజీ జవాన్ల డిమాండ్లు... ► ఓఆర్ఓపీ పథకం 2013 ఆధార సంవత్సరంగా 2014 జూలై 1 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే.. 2014 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని, ఆధార సంవత్సరంగా 2015ను నిర్ణయించాలని మాజీ జవాన్లు డిమాండ్ చేస్తున్నారు. పథకాన్ని ఐదేళ్లకు ఒకసారి సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, ఏటా సమీక్షించాలన్న ది జవాన్ల డిమాండ్. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న జవాన్లకు పథకం వర్తించదని ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే సైనికుల్లో కనీసం 40 % మంది ముందుగా పదవీ విరమణ చేస్తారు. దీంతో సర్కారు ప్రతిపాదన సైనికులను ఆగ్రహానికి గురిచేసింది.ఈ పథకం అమలు కావడానికి ముందు రిటైరన వారికి మాత్రమే ఓఆర్ఓపీ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. ► ఈ నేపథ్యంలో ఓఆర్ఓపీలోని పలు కోణాలపై అధ్యయనం చేయడానికి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గత నెల 27వ తేదీన ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. -
మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా
న్యూఢిల్లీ : మాజీ ఆర్మీ జవాన్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాన్ కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు ఈ రోజు సాయంత్రం రామ్ మనోహర్ లోహియ ఆస్పత్రికి వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీ టూరిజం శాఖ మంత్రి కపిల్ మిశ్రా ట్విట్ చేశారు. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయలేదంటూ మనస్తాపంతో మాజీ ఆర్మీ ఉద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ మంగళవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్‌ను పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపు అనంతరం రాహుల్‌ను విడుదల చేయగా, ఆయన మరోసారి బాధిత కుటుంబానికి కలవడంతో మళ్లీ అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రాహుల్ తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. న్యాయం చేయాల్సింది పోయి, మృతుడి కుమారుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. ఒక యోధుడి కుమారుడి పట్ల అలా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది సిగ్గుచేటు చర్య అని ఆయన అభివర్ణించారు. రెండోసారి అదుపులోకి తీసుకున్న రాహుల్ ను పోలీసులు తిలక్ మార్గ్ పీఎస్‌కు తరలించారు. అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(వోఆర్వోపీ) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆ పథకం సక్రమంగా అమలైతే ఈ ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. బాధిత కుటుంబాన్ని తాము కలుస్తామని, అది తమ బాధ్యత అని ఆయన అన్నారు. -
ప్రత్యేక హోదాకోసం ‘ఆప్’ పోరాటం
13 జిల్లాల ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం విజయవాడ (చిట్టినగర్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం, కేజీ బేసిన్ గ్యాస్ దోపిడీపై ఉద్యమాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రీకారం చుట్టనుందని, ఈ నిరసన కార్యక్రమాలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ర్ట కో-కన్వీనర్ పోతిన వెంకట రామారావు చెప్పారు. ఆప్ 13 జిల్లాల ప్రతినిధుల సమావేశం ఆదివారం విజయవాడ చిట్టినగర్‌లోని శ్రీ నగరాల సీతారామస్వామి కల్యాణమండపంలో నిర్వహించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలనేదానిపై చర్చించారు. అనంతరం పార్టీ పలు తీర్మానాలను ప్రవేశపెట్టింది. కేజీ బేసిన్లో గ్యాస్ దోపిడీకి పాల్పడుతున్న కంపెనీలకు కేంద్రం కొమ్ము కాస్తున్న తీరుపై పోరాటం చేయాలని నిర్ణయించింది. విజయవాడ కేంద్రంగా చేపట్టే నిరసనలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వస్తారని పేర్కొన్నారు. రాష్ర్ట విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయిం చింది. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఆప్ దృష్టి సారిస్తుందన్నారు. భూసేకరణ, నిరుద్యోగ సమస్య, ధరల నియంత్రణ అంశాలలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యంపై 13 జిల్లాల యాత్ర నిర్వహించాలని తీర్మానించింది. నవ్యాంధ్రలో పోలీసులకు పనిభారం పెరిగిందని, సిబ్బంది పెంపుతో పాటు వారికి వేతనాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆప్ గుర్తించిందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు హర్మహేందర్ సింగ్ సహాని, విజయవాడ నగర కన్వీనర్ కొప్పోలు విజయ్‌కుమార్, జిల్లా కన్వీనర్ కె.వి.ఎ.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
జైట్లీ ‘పరువు’ కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ బోర్డు వివాదానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు, మరో ఐదుగురు ఆప్ నేతలకు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 7న కోర్టు ముందు హాజరు కావాలని కేజ్రీవాల్, ఆశుతోష్, సంజయ్, కుమార్ విశ్వాస్, రాఘవ్, దీపక్‌లను ఆదేశించింది. -
రాహుల్, ఏచూరిపై కేసు
124 (ఏ), 156 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజాలతోపాటు జేఎన్టీయూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్లపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. అఫ్జల్‌గురుకు మద్దతుగా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా జేఎన్టీయూ విద్యార్థి కన్హయ్య కుమార్ ప్రవర్తించాడని, ఇతనికి మద్దతుగా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, సీతారాం ఏచూరి, డి.రాజాలు నిలిచారని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన న్యాయవాది జనార్ధన్‌గౌడ్ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో రాహుల్ గాంధీతో సహా పలువురిపై కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆదేశించింది. పిటీషన్లో పేర్కొన్న వారందరిపై ఐపీసీ 124ఏ, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పూర్తి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. -
లాయర్ల వీరంగంపై సుప్రీం విచారణ
పటియాలా హౌస్ కోర్టులో హింసపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ♦ కన్హయ్య కేసు విచారణ ప్రశాంతంగా సాగేలా చూడాలని పిటిషన్ ♦ దాడికి నిరసనగా మీడియా ప్రతినిధుల ర్యాలీ; సుప్రీంకు వినతిపత్రం న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌పై నమోదైన రాజద్రోహం కేసు విచారణ సందర్భంగా సోమవారం పటియాలా హౌస్ కోర్టులో చోటు చేసుకున్న హింసపై సుప్రీంకోర్టు స్పందించింది. కోర్టులో జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్‌లపై దాడులకు పాల్పడిన లాయర్లు, తదితరులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కన్హయ్యకు కోర్టు విధించిన పోలీస్ కస్టడీ నేటి(బుధవారం)తో ముగియనుందని, అందువల్ల మరోసారి పటియాలా కోర్టులో ఆయనను హాజరుపర్చనున్న నేపథ్యంలో మరోసారి హింసకు అవకాశముందని, అందువల్ల తక్షణమే తమ పిటిషన్ విచారణను ప్రారంభించాలని సీనియర్ న్యాయవాది ఇందిర జైసింగ్ చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం.. బుధవారమే విచారణ ప్రారంభించాలని నిర్ణయించింది. పటియాలా కోర్టులో సోమవారం నాడు జరిగిన హింసలో గాయపడిన జేఎన్‌యూ పూర్వ విద్యార్థి ఎన్డీ జయప్రకాశ్ ఈ పిటిషన్ వేశారు. విచారణ నిష్పాక్షికంగా, ప్రశాంత వాతారణంలో జరిగేలా చూడాలన్నారు. జర్నలిస్ట్‌ల భారీ ర్యాలీ.. పటియాల హౌజ్ కోర్టులో పాత్రికేయులపై లాయర్ల దాడిని నిరసిస్తూ మంగళవారం జర్నలిస్ట్‌లు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్‌లతో పాటు వందలాదిమంది పాత్రికేయులు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా సాగారు. మోదీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను సుప్రీంకోర్టు పరిరక్షించాలని కోరుతూ రిజిష్ట్రార్‌కు వినతిపత్రం అందించారు. మరో బృందం వేరుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి, కోర్టు ఆవరణలో దాడులను నిలువరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ వర్సిటీల మద్దతు జేఎన్‌యూలో విద్యార్థుల ఆందోళనలకు ప్రపంచస్థాయి వర్సిటీల్లోని అధ్యాపకుల మద్దతు లభించింది. కేంబ్రిడ్జ్, హార్వర్డ్, కొలంబియా, యేల్ తదితర వర్సిటీల్లోని 455 మంది విద్యావేత్తలు జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధ భిన్నాభిప్రాయం, విమర్శనాత్మక ఆలోచనకు జేఎన్‌యూ వేదికగా నిలుస్తోంది. ఆందోళనలకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్ అరెస్ట్‌కు నిరసనగా వర్సిటీలో విద్యార్థులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఉపాధ్యాయ వర్గం కూడా మంగళవారం స్ట్రైక్‌లో పాల్గొంది. జేఎన్‌యూలోకి పోలీసులను తాను పిలవలేదన్న వీసీ వాదనకు విరుద్ధంగా.. జేఎన్‌యూలోకి ప్రవేశించేందుకు వర్సిటీ అధికారుల నుంచి పోలీసులకు అందిన లేఖ వెలుగులోకి వచ్చింది. కాగా, దేశంలో అప్రకటిత అత్యవసర స్థితి నెలకొని ఉందని కాంగ్రెస్ ఆరోపించగా, భారత రాజకీయాల్లో తప్పుదారి పట్టించే నేతల్లో ప్రథముడు రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శించింది. అస్సాంలో ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నోల్లో విద్యార్థుల నోరు నొక్కేస్తోందంటూ మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. జేఎన్‌యూ పరిణామాలపైఆందోళన వ్యక్తం చేశారు. మాజీ లెక్చరర్ గిలాని అరెస్టు.. ఢిల్లీ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో భారత వ్యతిరేక నినాదాలకు సంబంధించిన రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీని సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళ వారం ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, కన్హయ్యపై నమోదైన రాజద్రోహం కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ‘మేం రాజకీయ నాయకులం కాదు. మొదట ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని చేయనివ్వండి’ అని పేర్కొంది. -
మా ఆరోపణలకు ఆధారాలున్నాయి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ)లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తాను చేసిన ఆరోపణలు వాస్తవాలని, వాటికి కచ్చితమైన ఆధారాలున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత రాఘవ్ చద్దాలు స్పష్టం చేశారు. తనపై, మరో ఐదుగురు ఆప్ నేతలపై జైట్లీ వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు మంగళవారం కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. డీడీసీఏ అక్రమాలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌ను ఈ దావాలో భాగస్వామిని చేయకపోవడాన్ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. తమ వాదనకు మద్దతుగా డీడీసీఏ వార్షిక భేటీ వివరాలను, ఫోన్ రికార్డులను వారు కోర్టుకు సమర్పించారు. -
డీడీసీఏలో కామాంధులు!
♦ జైట్లీ హయాంలో చాలా దారుణాలు జరిగాయి ♦ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు ♦ సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ విభాగాల్లోని సమర్ధులు కావాలి ♦ ఎన్ఎస్ఏకు విచారణ కమిషన్ చైర్మన్ గోపాల సుబ్రమణ్యం లేఖ న్యూఢిల్లీ: కేంద్రం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘డీడీసీఏ’ వివాదం తీవ్రమవుతోంది. ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ)లో దారుణ అక్రమాలు, అవినీతి జరిగాయని మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంగ్ల న్యూస్ చానల్ ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో నాటి అక్రమాలకు సంబంధించి ఒక ఉదంతాన్ని వివరించారు. ‘ఒకరోజు ఓ సీనియర్ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశారు. క్రికెట్ ఆడే తన కుమారుడు సెలక్ట్ అయ్యాడంటూ ఆయన చెప్పారు. కానీ, డీడీసీఏ విడుదల చేసిన జాబితాలో ఆ అబ్బాయి పేరు లేదు. మర్నాడు, డీడీసీఏలోని ఒక ఉన్నతాధికారి నుంచి ఆ జర్నలిస్ట్ భార్య మొబైల్ ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఈ రోజు నా ఇంటికి వస్తే.. నీ కుమారుడి పేరు లిస్ట్‌లో చేరుతుంది అని ఆ మెసేజ్‌లో ఉంది’ అని కేజ్రీవాల్ వివరించారు. ఇంతకుమించిన దారుణాలు అనేకం జరిగాయన్నారు. డీడీసీఏ అక్రమాలపై తన ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ పని ప్రారంభించిన తరువాత.. కమిషన్ ముందు హాజరయ్యేందుకు ఆ జర్నలిస్ట్ అంగీకరించాడని తెలిపారు. కాగా, డీడీసీఏ అక్రమాలపై ఢిల్లీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్, మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యం.. దర్యాప్తులో పాలు పంచుకునేందుకు సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్ విభాగాల నుంచి ఐదుగురి చొప్పున సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులను అందుబాటులో ఉంచాలంటూ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌కు లేఖ రాశారు. డీడీసీఏ దర్యాప్తులోని కొన్ని అంశాలు జాతీయ భద్రతకు సంబంధించినవై ఉండొచ్చని ఆ లేఖలో వివరించారు. కాగా, ఈ చర్యను చిల్లర రాజకీయ ప్రచార జిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. మరోవైపు, గోపాల సుబ్రమణ్యం కమిషన్‌ను చట్ట వ్యతిరేకమంటూ కేంద్రం కొట్టేసినా డీడీసీఏ అక్రమాలపై ఆ కమిషన్ విచారణ కొనసాగుతుందని మంగళవారం కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఏ విభాగం నుంచైనా అధికారులను కోరే అధికారం, హక్కు కమిషన్ చైర్మన్‌గా గోపాల సుబ్రమణ్యంకు ఉందన్నారు. అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఐదుగురు అత్యుత్తమ అధికారుల పేర్లను సూచించాలంటూ కేజ్రీవాల్‌కు కూడా గోపాల సుబ్రమణ్యం లేఖ రాశారు. డీడీసీఏ అక్రమాలపై విచారణ జరిపించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రమే కోరింది కనుక, దర్యాప్తునకు అవసరమైన సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గోపాల సుబ్రమణ్యం స్పష్టం చేశారు. ద్విచక్రవాహనాలకూ ‘సరిబేసి’! సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 1 నుంచి ఢిల్లీలో అమలు చేయనున్న ‘సరిబేసి’ విధానాన్ని త్వరలో ద్విచక్రవాహనాలకు వర్తింపజేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ద్విచక్రవాహనాలే ఎక్కువ కాలుష్య కారకాలని తేలినప్పటికీ.. సరిబేసి ఫార్ములా నుంచి వీటికి మినహాయించడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. రోడ్లపై గందరగోళా నివారణకే కొన్నాళ్ల పాటు ద్విచక్రవాహనాలకు మినహాయింపునిచ్చినట్లు తెలిపారు. కేజ్రీ.. ముందు రాజ్యాంగం చదవండి! కేజ్రీవాల్ తరఫున పని చేస్తూ ఈ డ్రామాకు తెరదీశారని గోపాల సుబ్రమణ్యంపై బీజేపీ ధ్వజమెత్తింది. కేజ్రీవాల్ గతంలో పలు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని, నిర్ణయాలు తీసుకునేముందు రాజ్యాంగాన్ని చదివితే.. ఢిల్లీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన పారిశుద్ధ్యం, డెంగ్యూని నియంత్రించడం వంటి అంశాల గురించి తెలుస్తుందని పేర్కొంది. డీడీసీఏ కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరైన సొసైటీ, దానిపై విచారణకు ఆదేశించే అధికారం ప్రభుత్వానికి లేదని పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా దేశాన్ని, దేశ ప్రజలను కేజ్రీవాల్ అవమానిస్తున్నారన్నారు. జైట్లీపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గానూ జైలుకెళ్లేందుకు కేజ్రీవాల్ సిద్ధంగా ఉండాలన్నారు. ‘కేజ్రీవాల్‌కు సీబీఐ అంటే భయంలేదు. నాకు వ్యతిరేకంగా సీబీఐ ఎలాంటి దర్యాప్తునైనా చేపట్టొచ్చు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కమిషన్ చట్టబద్ధతకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ఉందన్నారు. ‘కమిషన్‌ను వారు ఆమోదించినా, తిరస్కరించినా విచారణపై ఎలాంటి ప్రభావం చూపదు. విచారణ కొనసాగుతుంది’ అని తేల్చిచెప్పారు. -
విచారణలో కనిపించని జైట్లీ పేరు
కేంద్ర మంత్రి పాత్రను తేల్చని డీడీసీఏ విచారణ కమిటీ న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) పలు అక్రమాలకు పాల్పడినట్లు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికలో ఎక్కడా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రస్తావన కనిపించకపోవడం గమనార్హం. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు ఇతర విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఢిల్లీ విజిలెన్స్ విభాగం ముఖ్యకార్యదర్శి చేతన్ సంఘీ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ డీడీసీఏ వ్యవహారాలపై విచారణ జరిపి 237 పేజీల నివేదికను రూపొందించింది. ఇందులో జైట్లీపై వచ్చిన ఆరోపణలను ఎక్కడా నిర్ధారించలేదు. డీడీసీఏపై ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ వెంటనే స్పందించి సస్పెం డ్ చేసి ఉండాల్సిందని పేర్కొంది. ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా స్టేడియంలో కార్పొరేట్ బాక్స్‌లు నిర్మించారని, వయో నిర్ధారణ సరిఫికెట్ల జారీలో ఫోర్జరీ జరిగిందని వెల్లడించింది. డీడీసీఏ వ్యవహారాలను చక్కదిద్దడానికి జస్టిస్ లోధా కమిటీ సలహాలు కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలంది. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ జైట్లీకి వ్యతిరేకంగా ఆధారాలు చూపించలేకపోయిన నేపథ్యంలో కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. విచారణ కమిటీ నివేదిక ఎక్కడా జైట్లీ ప్రమేయం గురించి చెప్పలేదని, నిజమేంటో తెలిసిందని బీజేపీ ప్రతినిధి ఎంజే అక్బర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్.. జైట్లీకి బహిరంగ క్షమాపణ చెప్పి, కోర్టులో తప్పును ఒప్పుకోవాలన్నారు. మా ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తే దొరికేవి మఫ్లర్లే: కేజ్రీవాల్ డీడీసీఏ విచారణ నుంచి జైట్లీ పారిపోతున్నారని, కమిటీ నివేదికకు బీజేపీ తప్పుడు అన్వయాన్ని చేస్తోందని ఆప్ ఆరోపించింది. జైట్లీ అమాయకుడైతే విచారణకు సహకరించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ సెక్రటేరియట్లో సీబీఐ దాడులకు సంబంధించి ప్రధానిపై కేజ్రీ విమర్శలు చేశారు. సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేసినట్లయితే వారికి లెక్కల్లోలేని మఫ్లర్లే దొరుకుతాయన్నారు. మోదీజీ ఆదేశాలలో తన ఆఫీసులో సోదాలు చేశారని, అయితే ఏమీ దొరకలేదని చెప్పారు. తన ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తే నాలుగు మఫ్లర్లు తప్ప ఏమీ దొరకవని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మఫ్లర్ మ్యాన్ రిటర్న్స్ అనే ప్రచారాన్ని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ చీఫ్ సోనియా చెప్పిన మాటలు విని తాను లోక్‌సభలో డీడీసీఏ అంశాన్ని ప్రస్తావించలేదని.. అవినీతిపై తన పార్టీ చేస్తున్న పోరాటాన్ని సమర్థించానని బీజేపీ సస్పెండ్ ఎంపీ కీర్తీ ఆజాద్ వివరణ ఇచ్చారు.