
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.
2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది.