Delhi Lt Governor
-
ఢిల్లీ ఎల్జీకి ఫుల్ పవర్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్‌కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది. -
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
కేజ్రీవాల్ నివాసానికి మరమ్మతులపై నివేదిక కోరిన ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికార నివాసానికి రూ.49 కోట్లతో చేయించిన మరమ్మతుల్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. దీనిపై సవివర నివేదిక ఇవ్వాలని, మరమ్మతులకు సంబంధించిన అన్ని రికార్డులను 15 రోజుల్లోగా తన ముందుంచాలని శనివారం చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. 2020–22 సంవత్సరాల్లో అధికార నివాసంలో అదనపు పనులు, మరమ్మతుల కోసం కేటాయింపులు రూ43.70 కోట్లు కాగా, రూ.44.78 కోట్లు వెచ్చించినట్లు రికార్డులు చెబుతున్నాయి. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోందని ఆప్ అంటోంది. -
ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది
దేశ రాజధాని ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫైర్ అయ్యారు. నిందితుల భయానక చర్యను చూసి షాక్‌కి గురయ్యానని అన్నారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్క్షప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు. కాగా, ఆదివారం న్యూ ఇయర్ రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చక్రాల్లో ఇరుక్కుపోవడంతో చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈడ్చుకెళ్లడంతోనే ఆమె బట్టలు, శరీరం వెనుకభాగం వైపు ఉన్న బట్టలు చిరిగిపోయాయని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన చాలా దారుణమైనదని, సాధ్యమైనంత త్వరగా అసలు విషయాలు వెలుగులోకి రావాలని ట్విట్టర్లో ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అంతేగాదు సదరు బాధిత మహిళకు మీరు ఏవిధంగా న్యాయం చేయగలరంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కారులోని వ్యక్తుల తాగి ఉన్నారు, పైగా ఏ చెక్ పోస్ట్ వారి కారుని అడ్డుకోలేకపోయందంటూ ట్విట్టర్ వేదికగా పోలీసులపై మండిపడ్డారు. దీంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటన గురించి ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులు పికెట్ల వద్ద మోహరించి అధికారులను అప్రమత్తం చేసి వాహానాలను సోదా చేయడం ప్రారంభించారని చెప్పారు. ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: 10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు) -
మీ పరిధిలో మీరు ఉండండి.. మాకు తెలుసు ఏం చేయాలో?
న్యూఢిల్లీ: ఢిల్లీలో గత కొన్ని నెలలుగా ఆప్ ప్రభుత్వంపై వరుస సీబీఐ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యుత్ సబ్సిడిలో అక్రమాలు జరిగాయంటూ మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడిలో పలు అక్రమాలు జరిగాయని, అందువల్ల ఏడు రోజుల్లో ఆ విషయమై పూర్తి రిపోర్ట్ సమర్పించాలంటూ తన సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా సక్సేనా తీరుపై మండిపడ్డారు. రాజకీయ దాడులకు తెగబడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సిసోడియా లెఫ్టనెంట్ గవర్నర్‌కి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో... "ఇంతవరకు జరిపిన సీబీఐ దాడులన్ని అక్రమమైనవి, రాజ్యంగ విరుద్ధమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మీరు మమ్మల్ని సక్రమంగా పాలన కొనసాగించనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. అయినా మీకు భూమి సంబంధించిన వ్యవహారాలు, పోలీసు వ్యవహరాలు, ప్రజా హక్కుల్ని కాపాడే ఆదేశాలు, సేవా ఆదేశాలు తప్పించి మిగతా ఏ విషయాల్లోనూ ఆదేశాలు జారీ చేసే హక్కు లేదని నొక్కిచెప్పారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఏది యాక్ట్ చేయాలో ఏది యాక్ట్ చేయకూడదో అనే విషయంలో తమకే సర్వహక్కులు ఉంటాయన్నారు. ఒక నాలుగు అంశాల్లో ఆర్డర్లు తప్పితే మిగతా విషయాల్లో ప్రజలు ఎన్నుకున్న తమకే అధికారాలు ఉంటాయనేది గ్రహించాలన్నారు. ఏది ఏమైనా మీ పరిధిలో మీరు ఉండకుంటా మిగతా విషయాల్లో తలదూర్చడం మంచిది కాదన్నారు. రాజకీయ నేపథ్యంలో సాగిస్తున్న దాడులు కాబట్టే దర్యాప్తులో ఏం బయటపడటం లేదన్నారు. ఐనా దయచేసి రాజ్యంగబద్ధంగా నడుచకునేందుకు యత్నించండి" అని లేఖలో కోరారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... నరేంద్రమోదీ సొంత గడ్డ గుజరాత్ ఉచిత ఎలక్ట్రిసిటీ సబ్సిడీని ఇష్టపడుతుంది కాబోలు అందుకే ఈ సీబీఐ దాడులు కాబోలు అని ఎద్దేవా చేశారు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీనే గుజరాత్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అదీగాక ఇప్పుడు ఆప్ కూడా గుజరాత్లో అధికారం దక్కించుకోవడంసౌ దృష్టి కేంద్రీకరిస్తోందని, అందువల్ల ఈ దాడులు చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే!) -
అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ, ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాశ్ చంద్ర ఠాకూర్, డివిజన్ మేజిస్ట్రేట్లు వసంత్ విహార్ హర్షిత్ జైన్, వివేక్ విహార్ దేవేందర్ శర్మలపై వేటు విధించడమే కాకుండా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. అలాగే ఆయన ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ల నిర్మాణంలో లోపాలను గుర్తించి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)కి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేశారు. ఆయన దేశ రాజధానిలో శాంతి భద్రతలు, క్రైమడేటా విశ్లేషణ నివారణ చర్యల్లో ఢిల్లీ పోలీసు విభాగం పనితీరుని సమీక్షించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ స్థాయిలో పిసిఆర్ దర్యాప్తు , శాంతిభద్రతల రక్షణలోనూ, మహిళల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు, యువా ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తదితర విషయాల్లో ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కేసులను సకాలంలో దర్యాప్తు చేయాలని సాక్ష్యాధారాలను సాద్యమైనంత తొందరగా సేకరించాలని నొక్కిచెప్పారు. (చదవండి: ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా) -
10 వేల పడకల కోవిడ్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్ బైజాల్ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్ కరోనా వారియర్స్’ పేరిట ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. 1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్లో 200 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు. -
మమత, అహ్మద్ పటేల్ భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌లు ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. చాణక్యపురిలోని బంగ్లా భవన్‌కు చేరుకున్న పటేల్.. మమతతో విపక్ష పార్టీల ఏకీకరణపై చర్చించారని తృణమూల్ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సోనియా గాంధీ సూచనల మేరకే పటేల్, మమత భేటీ అయ్యారు. బీజేపీ వ్యతిరేక కూటములను ఏకం చేయడంలో మమత కీలకపాత్ర వహిస్తున్నారు. ఇందులో భాగం కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై అనుసరించాల్సిన వ్యూహంపైనే ఈ భేటీలో చర్చించారు’ అని తృణమూల్ ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరు, కేజ్రీవాల్‌కు మద్దతు తదితర అంశాలపై కాంగ్రెస్, ఇతర విపక్షాల మధ్య భిన్నమైన అభిప్రాయాలున్నప్పటికీ.. వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీశ్ వస్తే మళ్లీ చేర్చుకుంటాం: కాంగ్రెస్ బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వస్తే ఆయనను మళ్లీ మహాకూటమిలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ అన్నారు. 2013లో నరేంద్రమోదీని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక జేడీయూ తన 17 ఏళ్ల బంధాన్ని తెంచుకుని ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. 2015 బిహార్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో మహాకూటమి ఏర్పాటు చేసి గెలిచి, మళ్లీ 2017లో కూటమి నుంచి బయటకు వచ్చి ఎన్డీయేతో చేతులు కలిపింది. 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ, జేడీయూల మధ్య సయోధ్య లేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గోహిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాల్ డేటా మొత్తం డిలీట్ చేశాడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో బెల్జియన్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓలా క్యాబ్ డ్రైవర్ కేసు ఘటన గురించి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వాకబు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరి, ఆమె ముందు కూర్చున్న తర్వాత లైంగికంగా, అసభ్యకరంగా తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. కాగా, అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ డ్రైవర్ కాల్ డేటా ఫోన్ లో నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఫోన్ కాల్స్ తోపాటు.. ఇతర ఫోన్ కాల్స్ వివరాలు, సందేశాలు డిలేట్ చేసినట్లు తెలిసింది. అరెస్టు నుంచి బయటపడొచ్చన్న ఉద్దేశంతోనే అతడు ఆ పనిచేసినట్లు తెలిసింది. -
ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఇవ్వండి : కేజ్రీవాల్
తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, తీసుకోబోమని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం పునరుద్ఘాటించారు. తాను ముఖ్యమంత్రి కావడానికో లేక అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అరవింద్ శనివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఏర్పాటుపై 10 రోజుల గడువు కావాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను గడువు కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇస్తామని ప్రకటించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎందుకు మద్దుతు ఇస్తానంటున్నాయో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీకి బేషరత్తుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌కు లేఖ ఇచ్చిందని తెలిపారు. తమకు ఎందుకు మద్దతు ఇస్తామన్నారో కాంగ్రెస్, బీజేపీలు వెంటనే స్సష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తమకు మద్దతు ఇస్తే 15 ఏళ్ల పాటు షీలా ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయిస్తామని, అందుకు సిద్ధమేనా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. దేశ రాజధాని ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించేందు తమతో కలసి నడుస్తాయా అంటూ కాంగ్రెస్,బీజేపీలకు అరవింద్ కేజ్రీవాల్ చురకులు అంటించారు.