కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేంద్రం తాజాగా మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. రాష్ట్ర పరిధిలో ఎలాంటి బోర్డు, కమిషన్, అథారిటీ తదితర చట్టబద్ధమైన సంస్థలనైనా ఏర్పాటు చేసే అధికారాలు కల్పించింది. అంతేగాక ఆయా సంస్థల్లో అధికారులను కూడా ఇకపై ఎల్జీయే నియమించవచ్చు. ఈ మేరకు ఆర్టికల్ 239, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత చట్టం–1991 ప్రకారం కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇప్పటిదాకా ఈ అధికారాలన్నీ రాష్ట్రపతి వద్ద ఉండేవి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో ప్రతిష్టాత్మకమైన అంతర్గత ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మోదీ సర్కారు ఈ చర్యకు దిగడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి పదేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండటం తెలిసిందే. ఢిల్లీపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాల కుమ్ములాటలు తరచూ కోర్టుల దాకా వెళ్తున్నాయి. పలు కేసుల్లో తీర్పులు ఆప్‌కు అనుకూలంగా వచ్చినా చట్ట సవరణల ద్వారా కేంద్రం వాటిని పూర్వపక్షం చేస్తూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment