న్యూఢిల్లీ: ఢిల్లీలో గత కొన్ని నెలలుగా ఆప్ ప్రభుత్వంపై వరుస సీబీఐ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. విద్యుత్ సబ్సిడిలో అక్రమాలు జరిగాయంటూ మరో వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడిలో పలు అక్రమాలు జరిగాయని, అందువల్ల ఏడు రోజుల్లో ఆ విషయమై పూర్తి రిపోర్ట్ సమర్పించాలంటూ తన సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా సక్సేనా తీరుపై మండిపడ్డారు. రాజకీయ దాడులకు తెగబడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే సిసోడియా లెఫ్టనెంట్ గవర్నర్‌కి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో... "ఇంతవరకు జరిపిన సీబీఐ దాడులన్ని అక్రమమైనవి, రాజ్యంగ విరుద్ధమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మీరు మమ్మల్ని సక్రమంగా పాలన కొనసాగించనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు.
అయినా మీకు భూమి సంబంధించిన వ్యవహారాలు, పోలీసు వ్యవహరాలు, ప్రజా హక్కుల్ని కాపాడే ఆదేశాలు, సేవా ఆదేశాలు తప్పించి మిగతా ఏ విషయాల్లోనూ ఆదేశాలు జారీ చేసే హక్కు లేదని నొక్కిచెప్పారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఏది యాక్ట్ చేయాలో ఏది యాక్ట్ చేయకూడదో అనే విషయంలో తమకే సర్వహక్కులు ఉంటాయన్నారు. ఒక నాలుగు అంశాల్లో ఆర్డర్లు తప్పితే మిగతా విషయాల్లో ప్రజలు ఎన్నుకున్న తమకే అధికారాలు ఉంటాయనేది గ్రహించాలన్నారు. ఏది ఏమైనా మీ పరిధిలో మీరు ఉండకుంటా మిగతా విషయాల్లో తలదూర్చడం మంచిది కాదన్నారు. రాజకీయ నేపథ్యంలో సాగిస్తున్న దాడులు కాబట్టే దర్యాప్తులో ఏం బయటపడటం లేదన్నారు. ఐనా దయచేసి రాజ్యంగబద్ధంగా నడుచకునేందుకు యత్నించండి" అని లేఖలో కోరారు.
ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ... నరేంద్రమోదీ సొంత గడ్డ గుజరాత్ ఉచిత ఎలక్ట్రిసిటీ సబ్సిడీని ఇష్టపడుతుంది కాబోలు అందుకే ఈ సీబీఐ దాడులు కాబోలు అని ఎద్దేవా చేశారు. గత రెండు దశాబ్దాలుగా బీజేపీనే గుజరాత్‌లో అధికారాన్ని చేజిక్కించుకుంది. అదీగాక ఇప్పుడు ఆప్ కూడా గుజరాత్‌లో అధికారం దక్కించుకోవడంసౌ దృష్టి కేంద్రీకరిస్తోందని, అందువల్ల ఈ దాడులు చేస్తోందంటూ ఆరోపణలు చేశారు.
(చదవండి: ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే!)
Comments
Please login to add a commentAdd a comment