దేశ రాజధాని ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫైర్ అయ్యారు. నిందితుల భయానక చర్యను చూసి షాక్‌కి గురయ్యానని అన్నారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ‍్క్షప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు.
కాగా, ఆదివారం న్యూ ఇయర్ రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చక్రాల్లో ఇరుక్కుపోవడంతో చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈడ్చుకెళ్లడంతోనే ఆమె బట్టలు, శరీరం వెనుకభాగం వైపు ఉన్న బట్టలు చిరిగిపోయాయని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన చాలా దారుణమైనదని, సాధ్యమైనంత త్వరగా అసలు విషయాలు వెలుగులోకి రావాలని ట్విట్టర్‌లో ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
అంతేగాదు సదరు బాధిత మహిళకు మీరు ఏవిధంగా న్యాయం చేయగలరంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కారులోని వ్యక్తుల తాగి ఉన్నారు, పైగా ఏ చెక్ పోస్ట్ వారి కారుని అడ్డుకోలేకపోయందంటూ ట్విట్టర్ వేదికగా పోలీసులపై మండిపడ్డారు. దీంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటన గురించి ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులు పికెట్ల వద్ద మోహరించి అధికారులను అప్రమత్తం చేసి వాహానాలను సోదా చేయడం ప్రారంభించారని చెప్పారు.
ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: 10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు)
Comments
Please login to add a commentAdd a comment