shameful
-
ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది
దేశ రాజధాని ఢిల్లీలో మహిళ స్కూటీని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఫైర్ అయ్యారు. నిందితుల భయానక చర్యను చూసి షాక్‌కి గురయ్యానని అన్నారు. ఈ అమానవీయ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఈ క్రూరమైన చర్యకు దిగ్బ్రాంతికి గురయ్యానని అన్నారు. బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర మద్దతు, భరోసా అందిస్తాం. కానీ ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్క్షప్తి చేశారు. అందరం మంచి సమాజం కోసం కలిసి పనిచేద్దాం అని సక్సేనా అన్నారు. కాగా, ఆదివారం న్యూ ఇయర్ రోజున ఢిల్లీలోని 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐతే ఆమె చక్రాల్లో ఇరుక్కుపోవడంతో చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఈడ్చుకెళ్లడంతోనే ఆమె బట్టలు, శరీరం వెనుకభాగం వైపు ఉన్న బట్టలు చిరిగిపోయాయని వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేశారు. ఈ ఘటన చాలా దారుణమైనదని, సాధ్యమైనంత త్వరగా అసలు విషయాలు వెలుగులోకి రావాలని ట్విట్టర్లో ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. అంతేగాదు సదరు బాధిత మహిళకు మీరు ఏవిధంగా న్యాయం చేయగలరంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనలో ఆ కారులోని వ్యక్తుల తాగి ఉన్నారు, పైగా ఏ చెక్ పోస్ట్ వారి కారుని అడ్డుకోలేకపోయందంటూ ట్విట్టర్ వేదికగా పోలీసులపై మండిపడ్డారు. దీంతో సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. ఈ ఘటన గురించి ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పిసిఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో పోలీసులు పికెట్ల వద్ద మోహరించి అధికారులను అప్రమత్తం చేసి వాహానాలను సోదా చేయడం ప్రారంభించారని చెప్పారు. ఆ ఘటనకు కారణమైన కారుని స్వాధీనం చేసుకోవడంగాక ఆ ఐదుగురు నిందితులను వారి నివాసాల నుంచే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా అధికారులు నిందితులను అదుపులోకి తీసకున్నారని, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: 10 రోజుల్లో రూ.1,262 కోట్ల మద్యం..ఏకంగా 20 లక్షల లీటర్లు తాగేశారు) -
పబ్లిక్‌గా పరువు పోగొట్టుకున్న ఫుట్‌బాల్ టీం
వైరల్: ఓవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమిపాలు అయ్యింది. అదే సమయంలో ఓ ఫుట్‌బాల్ టీం చేసిన పని.. సోషల్ మీడియాలో వాళ్ల పరువును తీసేస్తోంది. అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ టీగ్లోని ఓ జట్టు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం మిన్నెసోటా వైకింగ్స్, డల్లాస్ కౌబాయ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సాకర్ అభిమానుల్ని ఓ కోరిక కోరింది మిన్నెసోటా వైకింగ్స్. మీ కుటుంబంలోగానీ, స్నేహితుల్లోగానీ ఎవరైనా ఆర్మీలో పని చేస్తే.. ఆ రియల్ హీరోల గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేయాలని కోరింది. అలా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన అభిమానికి రెండు టికెట్లు పంపడంతో పాటు.. అతని పోస్ట్‌ను వీడియో బోర్డుపై ప్రదర్శిస్తామని తెలిపింది. అది చూసి చాలామంది #SkolSalute హ్యాష్‌ట్యాగ్‌తో వైకింగ్స్‌కు పోస్ట్‌లు చేశారు. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు.. కైలే అనే ట్విటర్ హ్యాండిల్ పేరుతో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. తన కజిన్ జోయెల్ ఆర్మీలో పని చేశాడంటూ అతని ఫొటోతో సహా పోస్ట్ ఉంచాడు ఆ యూజర్. అంతేకాదు.. ఇతను నా కజిన్. ఆర్మీలో పని చేసేవాడు. అతని హీరోయిజం నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. అంతేకాదు.. వైకింగ్స్‌కు అతను పెద్ద అభిమాని కూడా అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే.. అందులో ఉంది కట్టుకథే అని కనిపెట్టడానికి అక్కడున్న ప్రేక్షకులకు ఎంతో టైం పట్టలేదు. అందులో ఉంది పో*స్టార్ జానీ సిన్స్. వెంటనే గ్రౌండ్లో విజిల్స్, అరుపులు వినిపించాయి. అది గమనించిన టీం నిర్వాహకులు వెంటనే దానిని తొలగించారు. అసలు ఆ కథను ఆ ఫుట్‌బాల్ ఎలా నమ్మిందో అర్థం కావడం లేదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. జరిగిన ఘటనపై వైకింగ్స్ మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పగా.. సంబంధిత విభాగ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది కూడా. -
తిరంగాకు అవమానం.. తీవ్ర విచారకరం
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి దేశం యావత్తూ తీవ్ర విచారంలో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోట వద్ద మత జెండాను ఎగురవేయడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. వ్యవసాయ రంగం ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. మన వ్యాక్సినేషన్.. ప్రపంచానికి ఆదర్శం ‘‘మనం గత ఏడాది అంతులేని సహనం, ధైర్యం ప్రదర్శించాం. అదే కొనసాగించాలి. లక్ష్యాలు, తీర్మానాలను సాధించడానికి కష్టపడి పనిచేయాలి. మన దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో అమలవుతోంది. ఇతర దేశాల కంటే మిన్నగా మన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందజేస్తున్నాం. 15 రోజుల్లో 30 లక్షల మంది కరోనా యోధులకు వ్యాక్సిన్ ఇచ్చాం. 30 లక్షల మందికి ఈ టీకా ఇవ్వడానికి అమెరికాకు 18 రోజులు, యూకేకు 36 రోజులు పట్టింది. కరోనా మహమ్మారిపై మన పోరాటం ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కరోనా టీకాలను చాలా దేశాలకు సరఫరా చేస్తున్నాం. ప్రాణాధార ఔషధాలు, టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను అమృత్ మహోత్సవ్‌గా దేశం జరుపుకోనుంది. మీ ప్రాంతంలో జరిగిన పోరాట ఘట్టాలను వెలుగులోకి తీసుకురండి. పుస్తకాలు రాయండి. మీ రచనలే మన స్వాతంత్య్ర పోరాట యోధులకు గొప్ప నివాళి. అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో పుస్తకాలు రావాలి. ఈ దిశగా యువతను ప్రోత్సహిస్తాం’’అని ప్రధాని తెలిపారు. ‘‘రోడ్డు ప్రమాదాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘లేట్ మిస్టర్’గా కాకుండా ‘మిస్టర్ లేట్’గా ఉండడమే ఉత్తమం అంటూ రహదారులపై కనిపిస్తున్న నినాదాలు చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. రహదారి భద్రతపై ఇలాంటి నినాదాలను ప్రభుత్వానికి పంపించండి. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. చిలీ దేశ రాజధాని శాంటియాగోలో 30కి పైగా యోగా స్కూళ్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. చిలీ సెనేట్‌లోని ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటేరోస్. మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితోనే ఆయనకు ఆ పేరు పెట్టారు’’ అని తెలిపారు. బోయిన్పల్లి మార్కెట్ భేష్ హైదరాబాద్‌లోని బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ బాధ్యతలు నెరవేర్చే విధానం చాలా సంతృప్తినిచ్చింది. మార్కెట్లలో చాలా కారణాల వల్ల కూరగాయలు చెడిపోవడం మనం చూశాం. వీటితో మార్కెట్లలో అపరిశుభ్రత నెలకొంటోంది. కానీ, బోయిన్పల్లి మార్కెట్లో ఇలా రోజువారీ పాడైన కూరగాయలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేయడం వినే ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయిన్పల్లి మార్కెట్లో వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా సాగుతున్న ప్రయాణం. అక్కడ రోజుకు 10 టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని సేకరించి, ప్లాంట్‌లో రోజూ 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది మార్కెట్‌కు వెలుగులు పంచుతోంది. దాదాపు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతోంది. దీంతో మార్కెట్ క్యాంటీన్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. -
శరద్ యాదవ్ మాటలు సిగ్గుచేటు
జైపూర్: ఎన్నికల ప్రచారంలో తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోక్తాంత్రిక్ జనతాదళ్ అధినేత శరద్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే ఎన్నికల సంఘాన్ని కోరారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన బుధవారం శరద్‌యాదవ్ మాట్లాడుతూ ‘రాజే చాలా లావై పోయారు, ప్రజలు ఆమెకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఇది నాకు అవమానంగా అనిపించింది. నిజానికి ఇది మహిళా జాతికే అవమానం, ఆయన మాటలతో నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఒక అనుభవమున్న సీనియర్ నేత నుంచి ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం ఊహించలేదు’ అని ఆమె ఝలావర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిసారించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె కోరారు. శరద్ యాదవ్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రసారం కావడంతో ప్రజల నుంచి కూడా ఆయన మాటలపట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ‘మొదట్లో ఆమె నాజూకుగా ఉంది. ఇప్పుడు విపరీతంగా లావైపోయింది. ప్రజలు ఆమెకు విశ్రాంతినిస్తే బావుంటుంది’’ అని అన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో ఓటింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. డిసెంబర్ 11న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ ప్రభావం ఎంతన్నది తేలనుంది. -
రాష్ట్రంలో ఆటవికపాలన: తేజస్వీ యాదవ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. గయా జిల్లాలో తల్లికూతుళ్ళుపై గురువారం కొంతమంది యువకులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్రానికిది సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా సీఎం నితీష్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా గయాలో జరిగిన ఘటన నేపథ్యంలో 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సీ రాజీవ్ మిశ్రా తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ పోలీస్ అధికారిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎస్పీ ప్రకటించారు. -
అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకుందాం
సాక్షి, మక్తల్ : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర పన్నిందని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.వై రత్నం, కేఎన్పీఎస్ రాష్ట్ర నాయకుడు డి.చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ఎస్ఎస్ పంక్షన్హాల్లో కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మొదటి మహసభలో వారు అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అంటరానితనం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను చేయాలని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు దాటుతున్నా ఇంకా ప్రజలు తమ హక్కులను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత పీడిత కులాల మహిళలను అవమానించే రీతిలో జోగిని, బస్వినీలుగా మార్చే సంస్కృతి నుంచి బయట పడాలని సూచించారు. తెలంగాణ వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, మైనార్టీలపై దాడులు చేస్తుంటే పట్టించుకోవడంలేదన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం, స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం విలువలను కాపాడాటానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కెఎన్పీఎస్ రాష్ట్ర నాయకులు భూరం అభినవ్, రాములు, బండారి నర్సప్ప, రమేష్, లింగన్న, కృష్ణ, శ్రీదేవి, రాంచందర్, మద్దిలేటి, వామన్, మున్వర్‌అలీ, బండారి లక్ష్మణ్, వెంకటేస్ తదితరులు పాల్గొన్నారు. -
మన బిడ్డలకు న్యాయం జరుగుతుంది
న్యూఢిల్లీ: కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు శుక్రవారం పెదవి విప్పారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటన్న ఆయన.. నేరస్తులనెవ్వరినీ వదిలిపెట్టబోమనీ, బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీనిచ్చారు. ఈ రెండు ఘటనలు దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిపై మోదీ మాట్లాడుతూ ‘గత రెండు రోజులుగా దేశం మొత్తాన్నీ కుదిపేస్తున్న ఘటనలు అసలు ఓ నాగరిక సమాజంలో జరగాల్సినవే కావు. ఇంతటి ఘోరం జరిగినందుకు ఈ దేశంలో, ఈ సమాజంలో భాగమైన మనమంతా సిగ్గుపడాలి. తమ జీవితాలను ధారపోసి మన స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులకు ఇది అవమానం. దోషులు ఎవ్వరూ తప్పించుకోలేరని నేను దేశానికి భరోసా ఇవ్వదలచుకున్నా. బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుంది. మన బిడ్డలకు తప్పక న్యాయం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ 127వ జయంతి సందర్భంగా శుక్రవారం మోదీ ఢిల్లీలో అంబేడ్కర్ స్మారకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘మహిళలపై లైంగిక హింస, అత్యాచారం తదితర దురాగతాలు జరగకుండా చూసేందుకు ప్రజలంతా కలసి పనిచేయాలి. అందుకోసం కుటుంబ సభ్యులే పిల్లలకు సామాజిక విలువలను అలవర్చాలి. మన కుటుంబ వ్యవస్థను, సామాజిక విలువలను మనం పటిష్టపరచుకోవాలి’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారనివ్వం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారిపోనివ్వబోమని మోదీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేసింది తమ ప్రభుత్వమేనని మోదీ పేర్కొన్నారు. ఈ చట్టం కింద జాబితాలో ఉన్న నేరాల సంఖ్యను 22 నుంచి తమ ప్రభుత్వం 47కు పెంచిందన్నారు. అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఆయన బతికున్నప్పుడు, చనిపోయాక కూడా అవమానించిం దనీ, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటోందని మోదీ ఆరోపించారు. -
'దిగ్భ్రాంతి.. మొత్తం సమాజానికే సిగ్గు చేటు'
న్యూఢిల్లీ: బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని, అందరూ సిగ్గుపడాల్సిన విషయం అని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీఎల్ పునియా అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలంటూ పునియా, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ ప్రశ్నించారు. 'బులంద్ షహర్ లో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికరమైనది. మొత్తం సమాజానికి సిగ్గు చేటు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఘటనకు కొందరు పోలీసు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. అంతకుమించి ఏమీ జరగలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఏదో ఒక కొత్త పరిష్కార మార్గం తీసుకురావాలి. పోలీసులు అవినీతికి పాల్పడి లంఛాలు తీసుకుంటున్నారు కానీ విధులు నిర్వర్తించడం లేదు. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నాయి. అఖిలేశ్ ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాల్సిందే' అని పునియా అన్నారు. ఇక అనుప్రియ మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలి. ఒక మహిళగా ఒక సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తాను. అయితే, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది ప్రధాన ఆందోళన. రాష్ట్ర ప్రభుత్వం మహిళ రక్షణ తప్పకుండా చూడాలి. 2017 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు' అని అన్నారు.