తేజస్వీ యాదవ్ (పాత ఫోటో)
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. గయా జిల్లాలో తల్లికూతుళ్ళుపై గురువారం కొంతమంది యువకులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్రానికిది సిగ్గుచేటని విమర్శించారు.
రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా సీఎం నితీష్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా గయాలో జరిగిన ఘటన నేపథ్యంలో 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సీ రాజీవ్ మిశ్రా తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ పోలీస్ అధికారిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎస్పీ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment