
పాట్నా: బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌ను తేజస్వీ యాదవే ముందుండి నడిపిస్తారని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న ఎన్నికల్లో తేజస్వీ సీఎం అభ్యర్థి అని స్పష్టమైంది.
అయితే నితీశ్ వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 2025 దాకా వేచి చూడటం ఎందుకు తేజస్వీకి ఇప్పుడే సీఎంగా బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని నితీశ్‌కు సూచించారు.
తేజస్వీ యాదవ్‌ను ఇప్పుడే సీఎం చేస్తే ఆయన పాలనా సామర్థ్యం గురించి ప్రజలందరికీ తెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2025 ఎన్నికల్లో ప్రజలు తమకు ఎవరు కావాలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్‌జేడీనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినందున తేజస్వీని సీఎం చేయడంలో తప్పేం లేదన్నారు.
చదవండి: కాంగ్రెస్ కోమాలో ఉంది : పంజాబ్ సీఎం భగవంత్ మాన్