Tejashwi Yadav
-
సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’ అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘ అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్బంధన్లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.రెండుసార్లు సీఎంను చేశా.. అది మరిచిపోకండిమీ నాన్నను అడుగు.. నేనేం చేశానో? -
‘మీ నాన్నను అడుగు.. నేను ఏం చేశానో?
పాట్నా: బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న జేడీయూ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ హవా నడిస్తే.. ఇప్పుడు నితీష్ కుమార్ దే శాసనం. అటు ఇండియా కూటమిలో ఉండాలన్నా, అంతే త్వరగా దానికి ఎండ్ కార్డ్ వేసి ఎన్డీయే కూటమిలో చేరాలన్నా ఆయనకే చెల్లింది. ఆయన ఏ కూటమితో జట్టు కట్టినా తన సీఎం పదవికి ఢోకా లేకుండా చూసుకుంటూ రాజకీయాలు చేస్తూ ఉంటారు నితీష్ కుమార్. అయితే ఇదే అంశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన ఆర్జేడీ నాయకుడు, తేజస్వీ యాదవ్.. అసెంబ్లీ వేదికగా లేవనెత్తారు. బీహార్ లో నితీష్ పాలన ‘పొలిటికల్ షిప్ట్స్’ మాదిరిగా ఉంది అంటూ విమర్శించారు.ఈరోజు(మంగళవారం) బీహార్ అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం నితీష్ మాట్లాడే సమయంలో తేజస్వీ యాదవ్ అడ్డుకున్నారు. ఎన్డీఏ నేతృత్వంలోని మన ప్రభుత్వం బీహార్ ను అభివృద్ధి పధంలో తీసుకెళుతోందని నితీష్ వ్యాఖ్యానించగా, అందుకు తేజస్వీ యాదవ్ అడ్డుతగిలారు. అసలు బీహార్ కు ఏం చేశారో చెప్పండి అంటూ నిలదీశారు. అందుకు తీవ్రంగా స్పందించిన సీఎం నితీష్.. అంతకుముందు బీహార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే రీతిలో సమాధానమిచ్చారు. ‘ నేను ఏం చేశానో మీ తండ్రి లాలూను అడుగు. మీ తండ్రి రాజకీయంగా ఎదగడానికి నేనే కారణం. మీ నాన్న పొలిటికల్ కెరీర్ ఎదిగింది అంటే అందులో నాది ప్రధాన పాత్ర. మీ నాన్నకు సపోర్ట్ చేయడాన్ని మీ కులంలోని వాళ్లే వ్యతిరేకించే వారు. ఎందుకు అలా చేస్తున్నావ్ అంటూ నన్ను అడిగే వారు. కానీ మీ నాన్నను తయారు చేసింది నేనే. ఇప్పటికీ మీ నాన్నకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను’ అని రిప్లై ఇచ్చారు నితీష్.దీనికి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ప్రస్తుత బీహార్ పరిస్థితి గురించి అడిగితే.. 2005 కు ముందు బీహార్ చరిత్ర చెబుతారు నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. నితీష్ చెప్పేదానిని బట్టి.. 2005కు ముందు బీహార్ ఉనికే లేదంటారా? అంటూ ప్రశ్నించారు తేజస్వీ. ఈ ప్రభుత్వం ప్రస్తుతం కన్ ఫ్యూజన్ లో ఉందని, రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత హామీలనే మళ్లీ రిపీట్ చేస్తున్నారు అంటూ తేజస్వీ విమర్శించారు. -
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్‌ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్‌లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
‘పాక్‌కు మోదీ వెళ్లొచ్చు.. టీమిండియా వెళ్లకూడదా?’
పాట్నా : వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది. ఈ నిర్ణయంపై రాజకీయం వివాదం రాజుకుంది. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్, రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ తప్పుబట్టారు. బిర్యానీ తినేందుకు ప్రధాని మోదీ పాకిస్థాన్‌కు వెళ్లొచ్చు. కానీ భారత క్రికెర్లు అక్కడకు వెళ్లి క్రికెట్ ఆడకూడదా? అని ప్రశ్నించారు. క్రీడలకు రాజకీయాలను ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ‘క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదు.. వాళ్లు (పాకిస్తాన్) మన దేశానికి రావాలి. మన ఆటగాళ్లు పాకిస్థాన్‌కి వెళ్లాలి. క్రీడలతో సమస్య ఏంటి? దాయాది దేశాల మధ్య క్రీడలు జరుగుతుంటే యుద్ధం జరుగుతున్నట్లు కాదుగా అని అన్నారు. మోదీ బిర్యానీ తినేందుకు పాక్‌కు వెళితే మంచి విషయం. కానీ భారత క్రికెట్ టీమ్ వెళితే తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించిన తేజస్వి ప్రధాని హోదాలో ప్రధాని మోదీ 2015లో పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధానితో కలిసి మోడీ విందు చేశారు. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ తేజస్వీ యాదవ్ పై విధంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. ఇక అప్పటి నుండి టీమిండియా మళ్లీ పాక్‌కు వెళ్లలేదు. చిరకాల ప్రత్యర్థులు చివరిసారిగా 2012-13లో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ ఆడారు. -
ఒకే విమానంలో నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్
-
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
ప్రతిపక్ష ఇండియా కూటమి బయపడుతోందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలపై బీహార్ రాష్ట్రీయ జనతాదళ నేత, రాష్ట్ర మాజీ సీఎం తేజస్వీ యాదవ్ స్పందించారు.‘లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు షాకింగ్ ఫలితాలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాము. స్వాగతిస్తున్నాము. ప్రధానమంత్రి బీహార్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏదీ అమలు చేయలేదు’అని తేజస్వీ యాదవ్ అన్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక్కో సంవత్సరం ప్రాతిపదికన ప్రధాన మంత్రులను ఎన్నోవాలని చూస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలపై అమిత్ షా స్పందించారు.దేశం నడపాల్సిన మార్గం ఇది కాదని, మూడు దశాబ్దాలకు పైగా అస్థిర ప్రభుత్వాలు అధికారంతో దేశం ఇప్పటికే చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించిందని అన్నారు. ‘ఈ దేశం మూడు దశాబ్దాలుగా అస్థిరతకు మూల్యం చెల్లించింది. అస్థిర ప్రభుత్వాలు మూడు దశాబ్దాలు నడిచాయి. అయితే గత 10 ఏళ్లలో దేశానికి బలమైన నాయకత్వం వచ్చింది. రాజకీయ సుస్థిరత మాత్రమే కాదు, విధానాల్లోనూ స్థిరంగా ఉంది’ అని స్పష్టం చేశారు.ఇండియా కూటమి అలా కాదు.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఒక ఏడాది శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం ప్రధానులు బాధ్యతలు చేపడతారు. అప్పటికి ఇంకా సమయం ఉంటే రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ఎద్దేవా చేశారు. దేశాన్ని నడిపించే విధానం ఇది కాదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
సీఎం నితీష్ కుమార్ జీ మీరెక్కడా? బీజేపీ ప్రచారంపై తేజస్వీ ప్రశ్నల వర్షం
బీహార్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ గయా, పూర్ణియాలో చేపట్టిన ర్యాలీలకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. సీఎం నితీష్ కుమార్జీ మీరెక్కడా? ఎన్నికల ర్యాలీలకు బీజేపీ ఆయనను ఎందుకు ఆహ్వానించడం లేదు? మంగళవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కూడా ఆయన ఎందుకు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని చేసిన ఆరోపణలపై తేజస్వీ యాదవ్ స్పందించారు. మోదీ మూడవసారి అధికారంలోకి రాగానే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కమలం నేతలే చెబుతున్నారు. వారిపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, యువతకు ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, నల్లధనాన్ని భారతదేశానికి వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నొక్కాణించారు. -
‘కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. మహిళలకు లక్ష రూపాయలు’
పాట్నా: బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్ (RJD) మేనిఫెస్టోను ప్రకటించింది. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శనివారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆర్జేడీ సీనియర్ నేతల సమక్షంలో 'పరివర్తన్ పత్ర' (మేనిఫెస్టో) విడుదల చేసిన తేజస్వీ యాదవ్, తమ పార్టీ దేశంతోపాటు బిహార్ ప్రజలకు 24 వాగ్దానాలు చేస్తోందని చెప్పారు. ‘2024 కోసం 24 'జన్ వచన్' (ప్రజా వాగ్దానాలు) తెచ్చాం. ఈ 24 'జన్ వచన్'లు నెరవేరుస్తాం’ అన్నారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, మెరుగైన కనెక్టివిటీ కోసం బిహార్‌లో ఐదు కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని తేజస్వి యాదవ్ చెప్పారు. పూర్నియా, భాగల్పూర్, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, రక్సాల్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓపీఎస్ (పాత పెన్షన్ స్కీం)ను అమలు చేస్తామని, బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. ఏటా రక్షా బంధన్ నాడు పేదింటి మహిళలకు రూ.1 లక్ష అందిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ అధినేత హామీ ఇచ్చారు. ‘మా భారత కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం.. ప్రస్తుతం నిరుద్యోగం మనకు పెద్ద శత్రువు. బీజేపీ వాళ్లు దీని గురించి మాట్లాడరు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ మాత్రమే ఇచ్చారు. కానీ మేము చెప్పింది చేస్తాం” అన్నారాయన. -
‘హలో ఫ్రెండ్స్.. హెలికాప్టర్లో ఆరంజ్ పార్టీ’ ఇప్పుడేమంటారో..
పాట్నా: హెలికాప్టర్లో ‘ఫిష్ పార్టీ’ వీడియో వివాదం తర్వాత మరో వీడియోను షేర్ చేశారు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్. హెలికాప్టర్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సాహ్నితో కలిసి ఫిష్ పార్టీ వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా తేజస్వి యాదవ్ గురువారం మరో వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వీరిద్దరూ బత్తాయి పండ్లను ఆస్వాదించడాన్ని చూడవచ్చు. "హలో ఫ్రెండ్స్, ఈ రోజు హెలికాప్టర్లో ఆరెంజ్ పార్టీ జరుగుతోంది. వారు (బీజేపీ నేతలు) ఆరెంజ్ రంగుపై వివాదం చేయరు కదా?" అంటూ బీజేపీకి చురకలు అంటిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో రాసుకొచ్చారు. ఇంతకు ముందు షేర్ చేసిన వీడియోలో తేజస్వి యాదవ్ చేపలు తింటూ కనిపించడంపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. నవరాత్రుల వేళ మాంసాహార భోజనమా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. హెలికాప్టర్ లోపల చిత్రీకరించిన ఈ వీడియోలో వీఐపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి తేజస్వి యాదవ్ భోజనం చేస్తూ కనిపించారు. బీజేపీ విమర్శలపై తేజస్వి యాదవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ వీడియో నవరాత్రి ఉత్సవాలకు ముందు రికార్డ్ చేసిందని, తనను విమర్శించేవారికి "తక్కువ ఐక్యూ" ఉందని ఆరోపించారు. हैलो फ्रैंड्स, आज हेलीकॉप्टर में नारंगी पार्टी हुई। Orange के रंग से तो वो नहीं ना चिढ़ेंगे? #TejashwiYadav #Trending #Viral pic.twitter.com/FlhuyMhM6f — Tejashwi Yadav (@yadavtejashwi) April 10, 2024 -
26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ: తేజస్వి యాదవ్
సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ పార్టీ బీహార్‌లో 26 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తుందని.. మా కోటా నుంచి ముఖేష్ సాహ్నీకి 3 సీట్లు (గోపాల్‌గంజ్, ఝంఝర్పూర్ & మోతిహారి) ఇవ్వాలని నిర్ణయించినట్లు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వికాశీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముఖేష్ సాహ్ని మాట్లాడుతూ.. మేము లాలూ ప్రసాద్ యాదవ్ సిద్ధాంతాలను విశ్వసించే వ్యక్తులం. బీజేపీ మా నాయకులను వేటాడేందుకు ప్రయత్నించింది. మా పార్టీని అంతం చేయడానికి ప్రయత్నించిందని అన్నారు. బీహార్ మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని శుక్రవారం రాష్ట్రంలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘటబంధన్‌లో చేరారు. వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి సారథ్యం వహిస్తున్న బాలీవుడ్ సెట్ డిజైనర్, రాజకీయ నాయకురాలు సాహ్నితో పాటు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది. #WATCH | Vikassheel Insaan Party's Mukesh Sahni says, "...We are people who believe in the ideology of Lalu Prasad Yadav...BJP tried to poach our leaders & tried to finish our party..." pic.twitter.com/TN3kc6Rt8L — ANI (@ANI) April 5, 2024 -
మోదీ హామీలు చైనా వస్తువులు లాంటివి: తేజస్వి యాదవ్
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశ రాజధాని నగరంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో RJD నాయకుడు తేజస్వి యాదవ్.. ప్రధాని 'నరేంద్ర మోదీ'పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హామీలు చైనా వస్తువుల లాంటివని, అవన్నీ కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఉద్దేశించినవని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అలాంటి హామీల మాయలో ప్రజలు పడవద్దని కోరారు. దేశంలో ఇప్పుడు 'ప్రకటించని ఎమర్జెన్సీ' నెలకొందని ఆరోపించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి ప్రతిపక్షాలు అనుమతించవని నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆరోపించారు. హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విధానాన్ని అందరూ చూసారు. బీజేపీ బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఒక సింహాన్ని మాత్రమే అరెస్ట్ చేశారు. మేము కూడా సింహలమే.. పోరాటానికి సిద్ధంగా ఉన్నామని యాదవ్ అన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెబితే మోదీ అధికారంలోకి రారు. ఈ ఉదయం బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రదానం చేసే కార్యక్రమంలో.. రాష్ట్రపతి అద్వానీకి భారతరత్న ప్రదానం చేస్తున్నప్పుడు, మోడీ జీ అద్వానీ జీ పక్కన కూర్చున్నారు కానీ రాష్ట్రపతి గౌరవార్థం కూడా నిలబడలేదని అన్నారు. దేశం నలుమూలల ఉన్న ఇండియా కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సోదరభావాన్ని కాపాడేందుకు కూటమి ఐక్యంగా ఉందని యాదవ్ అన్నారు. ప్రజలే నిజమైన గురువులు.. దేశాన్ని ఎవరు పాలించాలో మీరే నిర్ణయించుకోవాలని యాదవ్ అన్నారు. -
బీహార్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి: తేజస్వీ యాదవ్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి 'తేజస్వి యాదవ్' విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఆర్జేడీ మంచి ఫలితాన్ని సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని అన్నారు. మా పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు. గత 10 సంవత్సరాల్లో బీహార్ కోసం ప్రధాని మోదీ ఏమి చేశారు? బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఏమీ రాలేదు. ద్రవ్యోల్బణం, రైతుల సమస్య ఇప్పటికీ అలాగే ఉందని తేజస్వి యాదవ్ అన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ, జూన్1న ఏడో దశ పోలింగ్ ఉంటుందని సీఈసీ తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందని విషయం తెలుస్తుంది. -
నితీష్ కుమార్‌కు తేజస్వి యాదవ్ సలహా - ఈ సారైనా..
పాట్నాలో జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతని మిత్రపక్షం బీజేపీపై ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ స్కీమ్ చేయించుకోండని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్‌ను ఉద్దేశించి.. ఇప్పుడు ఉన్న కూటమిలోని శాశ్వతంగా ఉంటామన్న మీ మాటలకు ఈ సారైనా కట్టుబడి ఉండమని వ్యగ్యంగా స్పందిస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో మోదీతో పాటు నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇందులో తాను ఇకపైన కూటమి మారబోయేది లేదని శాశ్వతంగా పార్టీలో ఉంటానని ప్రధాని సాక్షిగా వాగ్ధానం చేశారు. ర్యాలీలో పాల్గొన్న నితీష్ కుమార్ ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు కురిపించారు. గతంలో ఎన్డీయే కూటమిలో ఉన్న నీతీశ్ కుమార్.. ఆ తర్వాత ఆర్జెడీతో పొత్తు కుదుర్చుకుని సీఎం పీఠమెక్కారు. ఇటీవల ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ సొంత గూటికే చేరారు. ఈ సందర్భంగా నితీష్ మీద తేజస్వి మండిపడుతూ ఎప్పుడూ కూటములు మారుస్తూ వాగ్దానాలు చేసే ఈయన ఈ సరైన మాట మీద నిలబడి ఉండటానికి కట్టుబడి ఉండాలని సలహా ఇచ్చారు. -
ఈడీ విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్
-
తేజస్వీకి ఈడీ తాజా సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేమంత్రిగా ఉన్నకాలంలో కొందరి భూములు రాయించుకుని వారికి రైల్వేలో గ్రూప్–డీ ఉద్యోగాలు ఇచ్చారన్న కేసులో ఆయన కుమారుడు, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు పాత్ర ఉందంటూ ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. జనవరి ఐదో తేదీన తమ ఆఫీస్‌కు రావాలని తేజస్వీకి సూచించింది. డిసెంబర్ 22వ తేదీనే రావాలని గతంలో సమన్లు జారీచేయగా ఆయన రాలేదు. దీంతో మళ్లీ సమన్లు ఇచ్చారు. ఇదే కేసులో డిసెంబర్ 27వ తేదీన హాజరుకావాలని లాలూకు సైతం ఈడీ సమన్లు పంపడం తెల్సిందే. ‘ సమన్లలో కొత్తదనం ఏదీలేదు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈడీ ఆఫీస్కెళ్లాను. ఇదో రోటీన్ పనిలా తయారైంది’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. యూపీఏ–1 హయాంలో 2004– 2009 కాలంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ కాలంలో కొందరికి వేర్వేరు రైల్వేజోన్లలో గ్రూప్–డీ ఉద్యోగాలిచ్చి, లాలూ కుటుంబసభ్యుల, వారికి చెందిన ఏకే ఇన్ఫోసిస్టమ్స్ సంస్థ పేరు మీదకు ఆ లబ్దిదారుల భూములను బదలాయించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ కాత్యాల్‌ను ఈడీ ఇటీవల అరెస్ట్‌చేసింది. ఈ సంస్థ రిజి్రస్టేషన్ అడ్రస్‌లో ఉన్న ఇల్లు లాలూదేనని ఈడీ పేర్కొంది. లబి్ధదారుల భూముల బదలాయింపు సంస్థలోకి జరిగాక ఆ వాటాలను 2014 ఏడాదిలో లాలూ కుటుంబసభ్యుల పేరు మీదకు బదిలీచేశారని ఈడీ చెబుతోంది. ఈ ఉదంతంపై గతంలో సీబీఐ నమోదుచేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ కొత్తగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తోంది. -
Land For Jobs Case: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు ఈడీ నోటీసులు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తేజస్వీ డిసెంబర్ 22న, లాలూ డిసెంబర్ 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా ఈ కేసులో 17 మంది నిందితులపై సీబీఐ జూలైలో రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లు ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. అక్టోబర్‌లో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లాలూ, అతని కుటుంబ సభ్యులపై ఇది రెండవ ఛార్జిషీట్. అంతేగాక తేజస్వి యాదవ్‌ను నిందితుడిగా పేర్కొన్న కేసులో మొదటి ఛార్జిషీట్. ఇక 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా తనకు అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థుల నుంచి లాలూ కుటుంబాం తక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్లు అభియోగాలు మోపాయి. ఈ క్రమంలో సీబీఐ గత ఏడాది మేలో లాలూ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ, భార్య రబ్రీ దేవి, అతని కుమారుడు తేజస్వి, కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్, లబ్ధిదారులతో సహా 17 మంది వ్యక్తుల పేర్లను నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా బెయిల్ మంజూరైన రెండు నెలల తర్వాత లాలూ, తేజస్వికి తాజాగా ఈడీ సమన్లు జారీ చేయడం గమనార్హం. చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్ హత్యకు కుట్ర.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం
సాక్షి, తిరుమల: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంటటేశర్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. आज सवेरे आंध्र प्रदेश के तिरुमाला पर्वत स्थित उत्कृष्ट शिल्प कौशल के अद्भुत उदाहरण एवं भक्ति, विश्वास और श्रद्धा के प्रतीक भगवान श्री तिरुपति बालाजी मंदिर में सपरिवार पूजा-अर्चना व दिव्य दर्शन कर सकारात्मक ऊर्जा एवं आशीर्वाद प्राप्त किया तथा गर्भगृह में विराजमान भगवान वेंकटेश्वर… pic.twitter.com/dtJhGlxe4s — Tejashwi Yadav (@yadavtejashwi) December 9, 2023 ఈ సందర్భంగా.. ‘అద్భుతమైన శిల్పకళ, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుపతి బాలాజీ ఆలయంలో నా కుటుంబంతో కలిసి పూజలు చేసి, దైవ దర్శనం చేసుకోన్నాం. వెంకటేశ్వర స్వామి నుంచి సానుకూల శక్తిని, ఆశీర్వాదాలను పొందాను’ అని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. ఈ రోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
తేజస్వీ యాదవ్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం
పాట్నా: సీఎం నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్ధించడాన్ని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తప్పుబట్టారు. తేజస్వీ యాదవ్ పాఠశాలకు ఎప్పుడూ వెళ్లలేదని, కనీసం తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సెక్స్ ఎడ్యూకేషన్ పట్ల తేజస్వీ యాదవ్‌కు ఎలాంటి అవగాహన లేదని దుయ్యబట్టారు. తేజస్వీ యాదవ్ ఏ పాఠశాలకు వెళ్లారో బయటకు వెళ్లడించాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఎక్కడ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్‌ను నేర్చుకున్నారో? బహిర్గతం చేయాలని కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినంత అసభ్యకరమైన భాషలో పాఠశాలల్లో లైంగిక విద్య బోధించరని చెప్పారు. సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించిన తీరు ఆయనకు జ్ఞానం లేనివాడనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. స్త్రీలు చదువుకుంటే.. భర్తలను కంట్రోల్లో పెట్టి జనాభాను తగ్గిస్తారని జనాభా నియంత్రణపై మాట్లాడిన నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారని, తద్వారా జనాభా తగ్గుతుందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. మహిళలు విద్యావంతులు అవుతున్నందువల్లే ఒకప్పుడు 4.3గా ఉన్న జననాల రేటు ప్రస్తుతం 2.9కు తగ్గిందని, త్వరలోనే 2కు చేరుతుందని నితీశ్ అసెంబ్లీలో అన్నారు. ఆ సమయంలో అసెంబ్లీలోనే ఉన్న తేజస్వీ యాదవ్.. నితీష్ వ్యాఖ్యలను సెక్స్ ఎడ్యుకేషన్‌గా పేర్కొంటూ.. పాఠశాలల్లో కూడా చర్చిస్తారని అన్నారు. అయితే.. బీజేపీ, మహిళా సంఘాల ఆందోళనలతో నితీష్ కుమార్ తన వ్యాఖ్యలపై ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. ఇదీ చదవండి: సీఎం రేసుపై సచిన్ పైలెట్ కీలక వ్యాఖ్యలు -
ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం: తేజస్వీ యాదవ్‌ని క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్..
పట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కాంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు చుక్కెదురయ్యేలా ఉంది. ఇప్పటికే ఈ కేసులో తేజస్వీతో పాటు ఆయన తల్లిదండ్రులపై కూడా సీబీఐ ఛార్జ్‌షీటు నమోదు చేసింది. దీంతో తేజస్వీ యాదవ్‌ను క్యాబినెట్ నుంచి తప్పించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సుషీల్ మోదీ డిమాండ్ చేశారు. 'బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పాలనలో అవినీతికి స్థానం లేదని చెబుతాడు. మరి ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై అవినీతి కేసు నమోదైంది. ఎలాంటి ఆలస్యం చేయకుండా తేజస్విని క్యాబినెట్ నుంచి తప్పించాలి' అని సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వెస్టర్న్ సెంట్రల్ జోన్లో గ్రూప్ డీ పోస్టుల భర్తీలో అవనీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీ దేవీ కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 14 మందిపై ఛార్జ్‌షీటు కూడా నమోదు చేసింది. ఇదీ చదవండి: ఇక బిహార్ వంతు...? మహారాష్ట్ర తరహాలో ఆపరేషన్ కమలం! -
విపక్షాల ఐక్యతే ముఖ్యం
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఐక్యం చేసే ప్రయత్నాలను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రతరం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్లను గురువారం వేర్వేరుగా కలుసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశ ప్రయోజనాల కోసం ఏమీ చేయడం లేదని ఆరోపించారు. అందుకే పార్టీ ప్రయోజనాలతో పాటుగా దేశ ప్రయోజనాలను కూడా కాపాడడానికి కృషి చెయ్యాలని ఇరువురు నేతలకు చెప్పినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు ముందు దేశ ప్రయోజనాలను కాపాడాలన్న ఏకైక లక్ష్యం ఉందని నితీశ్ అన్నారు. అందరూ కలసికట్టుగా పోరాడితే బీజేపీపై విజయం సాధించవచ్చునని చెప్పారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం త్వరలోనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. -
నితీష్‌తో భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం మమతా కీలక వ్యాఖ్యలు
లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేపనిలో పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన నేడు(సోమవారం) పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ పశ్చిమబెంగాల్ సచివాలయానికి చేరుకున్న ఆయన.. దీదీతో ప్రతిపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి ఇగో(అహం) లేదని స్పష్టం చేశారు. అందరం కలిసి సమష్టిగా ముందుకు వెళ్తామని తెలిపారు. అంతేగాక వచ్చే ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా జరగనున్నాయని, ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి రావడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘ఒవైసీ అంటూ ఎంతకాలం ఏడుస్తారు?’ నితిష్ కుమార్‌ను తను ఒక్కటే అభ్యర్థించినట్లు పేర్కొన్నారు. జయప్రకాశ్ నారాయణ ఉద్యమం ప్రారంభించిన బిహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మన తదుపరి కార్యచారణ ఏంటో నిర్ణయించుకోవచ్చని సూచించినట్లు తెలిపారు. అయితే ముందుగా మనం ఐక్యంగా ఉన్నామనే సందేశం ప్రజలకు చేరాలని ఇందులో తనకేం అభ్యంతరం లేదని చెప్పారు. ‘బీజేపీని జీరో చేయడమే నాకు కావాలి. మీడియా సపోర్టు, అబద్ధాలతో వారు హీరోలయ్యారు’ అని మమతా పేర్కొన్నారు. అయితే ఇటీవల లోక్‌సభ ఎంపీగా రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంతో ప్రతిపక్ష పార్టీల మధ్య అరుదైన ఐక్యత చోటు చేసుకుంది. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్‌ల భేటీతో బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా దాదాపు అన్ని పార్టీల నాయకులతో సమావేశమవుతూ వస్తున్నారు నితీష్. బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకు సాగేందుకు విపక్షాలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశయ్యారు. మమతాతో భేటీ అనంతరం సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ కుమార్‌తో కూడా చర్చలు జరపనున్నారు. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ కీలక నిర్ణయం.. సమైక్యంగా ఎన్నికలకు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ఏడాదే ఉన్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్బంధన్ భాగస్వామ్య పక్షాల అధినేతలు, ముఖ్య నేతల మధ్య బుధవారం కీలక సమావేశం జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీని కలసికట్టుగా ఎదుర్కోవడంతో పాటు పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. అనంతరం నేతలంతా సంయుక్తంగా మీడియా ముందుకొచ్చారు. విభేదాలను పక్కన పెట్టి కలసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న మీడియా ప్రశ్నలకు మాత్రం నేతలు సమాధానం దాటవేశారు.మోదీ మేజిక్‌ను ఎదర్కోవడానికి ఒక ఉమ్మడి నాయకున్ని ప్రకటించే ఎన్నికల బరిలో దిగడం మేలని విపక్ష నేతల్లో కొందరంటుండగా అది అంతిమంగా తమకే చేటు చేయవచ్చని మరికొందరు భావిస్తుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. కీలక ముందడుగు: రాహుల్ తమ భేటీని చరిత్రాత్మక సమావేశంగా రాహుల్ అభివర్ణించారు. ‘‘ఈ భేటీ విపక్షాల ఐక్యత దిశగా కీలక ముందడుగు. ఎన్నో అంశాలపై చర్చించుకున్నాం. అన్ని పార్టీలనూ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి లోక్‌సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పట్నుంచే అందరమూ ఆ దిశగా పని చేస్తాం. మాది సైద్ధాంతిక పోరాటం. విపక్షాల ఉమ్మడి విజన్‌ను త్వరలో ప్రజల ముందుంచనున్నాం’’ అని వెల్లడించారు. ఎన్ని విపక్షాలు కలిసి రానున్నాయని ప్రశ్నించగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలింకా కొనసాగుతున్నాయని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఒక్కటిగా నిలబడ్డాం. దేశం కోసం ఒక్కటిగా పోరాడతాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశానికి నూతన దిశానిర్దేశం చేసేందుకు కలసికట్టుగా సాగుతామని ఖర్గే ప్రకటించారు. నితీశ్, తేజస్వి తదితరులతో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇది తొలి సమావేశం. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్‌సింగ్, బిహార్పీసీసీ చీఫ్ అఖిలేశ్ ప్రసాద్‌సింగ్, ఆర్జేడీ నేత మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా మున్ముందు మరిన్ని విపక్షాలతో ఖర్గే భేటీ కానున్నారు. డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తదితరులతో ఇటీవలే ఆయన సమావేశమై చర్చించారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో 19 విపక్షాలు సమైక్యంగా నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనడం తెలిసిందే. పార్టీలన్నింటినీ కలుపుకుంటాం: నితీశ్ దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుని పోయేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తామని నితీశ్ ప్రకటించారు. ‘‘అంతా కలిసి పని చేయాలని భేటీలో నిర్ణయం తీసుకున్నాం. అందుకోసం అందరమూ కూర్చుని మాట్లాడుకుంటాం. భావి కార్యాచరణను నిర్ణయించుకుంటాం. అది త్వరలోనే జరుగుతుంది. ఆ దిశగా ముందుకు సాగనున్నాం’’ అని వెల్లడించారు. విపక్షాల ఐక్యతను సాధించే కీలక శక్తిగా నితీశ్ నిలవనున్నారంటూ జేడీ(యూ) ట్వీట్ చేసింది. నితీశ్‌కు పూర్తి మద్దతు: కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం నితీశ్, తేజస్వీ బుధవారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. తర్వాత కేజ్రీ మీడియాతో మాట్లాడారు. విపక్షాల సమీకరణకు నితీశ్ ప్రయత్నాలను ప్రశంసించారు. వాటికి తన పూర్తి మద్దతుంటుందని ప్రకటించారు. ‘‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో ప్రస్తుతమున్నది బహుశా దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వం! దాని దెబ్బకు సామాన్యుని బతుకు దుర్భరంగా మారింది. బీజేపీ సర్కారుపై విపక్షాలన్నీ సమైక్యంగా పోరాడి దాన్ని కూలదోయడం అత్యవసరం’’ అని అభిప్రాయపడ్డారు. నితీశ్‌ను ప్రధాని అభ్యరి్థగా భావిస్తున్నారా అని ప్రశ్నించగా, కేవలం ఒక్క భేటీతో ఇలాంటి వాటికి సమాధానం చెప్పలేమని కేజ్రీవాల్ అన్నారు. గురు, శుక్రవారాల్లో మరికొందరు విపక్ష నేతలతో కూడా నితీశ్ భేటీ అవుతారని సమాచారం. మంగళవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్‌తోనూ సమావేశమయ్యారు. బందిపోట్ల కూటమి: బీజేపీ కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ నేతల భేటీని రాజకీయ గిమ్మిక్కుగా బీజేపీ అభివర్ణించింది. ‘‘అదో బందిపోట్ల కూటమి. నిండా అవినీతిలో కూరుకుపోయిన వాళ్లంతా చట్టం బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలివి. ఇలాంటి విన్యాసాలతో వారి అవినీతి దాగబోదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. 2014, 2019 ఎన్నికల్లో వారిని ప్రజలు వరుసగా తిరస్కరించారన్నారు. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని, మోదీ సారథ్యంలో బీజేపీ ఘనవిజయం ఖాయమని జోస్యం చెప్పారు VIDEO | Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav meet Congress leader Rahul Gandhi at party president Mallikarjun Kharge's residence in Delhi pic.twitter.com/11bSWF2A5J — Press Trust of India (@PTI_News) April 12, 2023 -
ఈడీ ఎదుట విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్..
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఊదయం 10:45 గంటల సమయంలో తేజస్వీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కూడా తేజస్విని గత నెలలోనే ప్రశ్నించింది. తనను అరెస్టు చేయబోమని సీబీఐ ఢిల్లీ కోర్టుకు చెప్పడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ కుటుంబసభ్యులను కూడా ఈడీ విచారించింది. మార్చి 25న తేజస్వీ సోదరి, ఎంపీ మిసా భారతిని కూడా ప్రశ్నించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొందరి వద్ద భూములు తీసుకొని రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీన్నే జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంగా పిలుస్తున్నారు. ఈ స్కాం ద్వారా పొందిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.600 కోట్లకుపైనే ఉందని ఈడీ చెబుతోంది. మరోవైపు తేజస్వీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్.. -
తేజస్వీ యాదవ్‌కు పుత్రికోత్సాహం!
కేంద్ర మాజీ మంత్రి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తన నవజాత బిడ్డతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది తనకు దేవుడు పంపిన గిఫ్ట్ అని అన్నారు. కుమార్తె రూపంలో దేవుడి పంపించిన బహుమతిగా అభివర్ణించారు. తేజస్వీ యాదవ్ రాచెల్ గోడిన్హోను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇది తొలి సంతానం. ఈమేరకు తేజస్వీ యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడూ మా ఇల్లు ఆనందకరమైన కీచులాటతో ధ్వనిస్తుంది. దేవుడు అలాంటి ఆనందాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు అని రోహిణి ట్వీట్ చేశారు. (చదవండి: రాహుల్ గాంధీ అంశం: కాంగ్రెస్ వాయిదా తీర్మానం.. ఖర్గే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమన్న కోమటిరెడ్డి) -
'ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి'
పాట్నా: జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యుల ఇళ్లపై ఈడీ దాడులు చేసిన ముడు రోజలు తర్వాత తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సోదాల్లో రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు సీజ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ స్కాం ద్వారా పొందిన రూ.600 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించినట్లు ఈడీ చేసిన ప్రకటన పచ్చి అబద్దమన్నారు. ఈడీ అధికారులు తన ఢిల్లీ నివాసంలో అరగంటలోనే సోదాలు పూర్తి చేశారని తేజస్వీ చెప్పారు. ఈ సమయంలో తన సోదరీమణులు ధరించి ఉన్న నగలను తీసి పక్కకు పెట్టమని చెప్పారని, వాటినే ఫోటోలు తీసి సీజ్ చేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2017లో కూడా తమ పార్టీ రూ.8,000కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడిందని చెప్పి దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. ముందు వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీలా తమది ఫేక్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ కాదని తేజస్వీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమిత్ షా క్రోనాలజీ వ్యాఖ్యలకు కూడా కౌంటర్ ఇచ్చారు. తమది నిజమైన సోషలిస్టు కుటుంబం అని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీని అధికారానికి దూరం చేసినందుకే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలుసునని తేజస్వీ అన్నారు. కమలం పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల్లో ఏం సీజ్ చేశారో అధికారికంగా ప్రకటన విడదల చేయాలని, లేదంటే తానే నిజాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేయాలని బహుశా అమిత్‌షానే డైరెక్షన్ ఇచ్చి ఉంటారని తేజస్వీ ఆరోపించారు. ప్రతిసారి ఇలానే చేస్తే వర్కవుట్ కాదని.. వాళ్లు స్క్రిప్ట్ రైటర్లు, డైలాగ్ రైటర్లను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎద్దేవా చేశారు. చదవండి: ప్రియాంక గాంధీ పెయింటింగ్‌కు రూ.2 కోట్లా? -
రూ.150 కోట్ల ఇల్లు.. రూ.4 లక్షలకే కొన్నారు: ఈడీ
న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణానికి సంబంధించి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటంబసభ్యుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో అక్రమ నగదు, ఆభరణాలను భారీగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. లాలూ కుటుంబసభ్యుల నివాసాల్లో రూ.కోటి నగదు, విదేశీ కరెన్సీ, 540 గ్రాముల బంగారు కడ్డీలు, ఒకటిన్నర కిలోల బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు లభించినట్లు వెల్లడించారు. అలాగే ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని తేజస్వీ యాదవ్ బంగళా విలువ ప్రస్తుతం రూ.150 కోట్లని, దీన్ని గతంలో రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు అంతస్తుల భవనం ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై రిజిస్టర్ అయి ఉందని, కానీ తేజస్వీ యాదవ్ దిన్ని నివాసంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఆస్తిని కొనుగోలు చేసేందుకు జాబ్ ఫర్ స్కాం ద్వారా వచ్చిన నగదు లేదా రాబడిని ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన రత్నాలు, ఆభరణాల సంస్థలు అక్రమంగా సంపాదించిన డబ్బును వినియోగించినట్లు పేర్కొన్నారు. ఈ కుంభకోణం ద్వారా వచ్చిన రాబడి విలువ ప్రస్తుతం రూ.600కోట్లు అని ఈడీ అధికారులు చెప్పారు. వీటిలో రూ.350కోట్లు స్థిరాస్థులు కాగా.. బినామీల ద్వారా రూ.250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని వివరించారు. చదవండి: రబ్రీ..లాలూ అయిపోయారు.. ఇప్పుడు తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు -
లాలూ మీద ఎలాగూ కేసులు తిరగ తోడుతున్నాం కదా! ఆఫీసు అవసరమే సార్!
లాలూ మీద ఎలాగూ కేసులు తిరగ తోడుతున్నాం కదా! ఆఫీసు అవసరమే సార్! -
'2025 వరకు ఆగడం ఎందుకు.. ఆయనను ఇప్పుడే సీఎం చేయండి'
పాట్నా: బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ను తేజస్వీ యాదవే ముందుండి నడిపిస్తారని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో రానున్న ఎన్నికల్లో తేజస్వీ సీఎం అభ్యర్థి అని స్పష్టమైంది. అయితే నితీశ్ వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 2025 దాకా వేచి చూడటం ఎందుకు తేజస్వీకి ఇప్పుడే సీఎంగా బాధ్యతలు అప్పగించవచ్చు కదా అని నితీశ్‌కు సూచించారు. తేజస్వీ యాదవ్‌ను ఇప్పుడే సీఎం చేస్తే ఆయన పాలనా సామర్థ్యం గురించి ప్రజలందరికీ తెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2025 ఎన్నికల్లో ప్రజలు తమకు ఎవరు కావాలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బిహార్‌లో ఆర్జేడీనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినందున తేజస్వీని సీఎం చేయడంలో తప్పేం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్ కోమాలో ఉంది : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ -
నితీష్ కుమార్ రాజకీయ వారసుడు అతడే! హింట్ ఇచ్చిన బిహార్ సీఎం
పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ వారసుడు ఎవరో సూత్రప్రాయంగా తెలిపారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని ముందుండి నడిపిస్తారని స్పష్టం చేశారు. అధికార ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. నేను ప్రధాని అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినీ కాదు. బీజేపీని ఓడించడమే నా లక్ష్యం. అని నితీశ్ అన్నారు. తేజస్వీ యాదవ్‌ను ప్రోత్సహించాలని అధికార కూటమి ఎమ్మెల్యేలకు సూచించారు. సోమవారం కూడా నితీశ్ ఈ విషయంపై పలుమార్లు హింట్ ఇచ్చారు. తేజస్వీ యాదవ్‌తో కలిసి నలందలో డెంటల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ.. మా ప్రభుత్వం చాలా చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేయాల్సినవి ఉంటే వాటిని తేజస్వీ యాదవ్ పూర్తి చేస్తారు. మమ్మల్ని విడదీయాలనుకుంటున్న వారు ఆ ప్రయత్నాలు మానుకోండి. మేం కలిసే ఉంటాం. ఎలాంటి విభేదాలు ఉండవు. అని వ్యాఖ్యానించారు. దీంతో తేజస్వీ యాదవ్‌ను నితీశ్ తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని ప్రచారం ఊపందుకుంది. ఆ మరునాడే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో నితీశ్ మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది నితీశ్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే అని, ఆ తర్వాతే మిగతా విషయాల గురించి ఆలోచిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు.. మళ్లీ అతడే..! -
సీబీఐ తర్వాత.. ఇక ఈడీ వంతు: తేజస్వీ
న్యూఢిల్లీ/పట్నా: రైల్వే కుంభకోణంలో తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిల పేర్లను చేరుస్తూ సీబీఐ చార్జిషీటు వేయడంపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. ఇందులో కొత్తేమీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ దెబ్బతిన్నప్పుడల్లా ఇవి జరగడం మామూలేనని పేర్కొన్నారు. ‘బిహార్‌లో అధికారం కోల్పోవడంతో బీజేపీకి మాతో సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు, బీజేపీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి మహాఘఠ్ బంధన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిణామాలతోనే దర్యాప్తు సంస్థలను మాపైకి ఉసి గొలుపుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఈ డ్రామా 2024 ఎన్నికల దాకా సాగుతుందన్న విషయం పిల్లల్ని అడిగినా చెబుతారు’అని కేంద్రాన్ని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ తర్వాత ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలు తన నివాసంలో కార్యాలయాలు తెరవాలని కోరారు. చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్! -
శానిటరీ ప్యాడ్స్ ప్రశ్నవివాదం.. ఫ్రీగా ఇస్తానని ముందుకు వచ్చిన సంస్థ
పాట్నా: బిహార్‌లోని 20 ఏళ్ల విద్యార్థిని రియా కూమారి ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాని శానిటర్ప్యాడ్స్ గురించి ప్రశ్నించిన సంగతి తెలిసింది. ఐతే ఆమె ఇచ్చిన వివరణ వివాదాస్పదమవ్వడంతో ఆమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు కూడా. ఐతే ఆ విద్యార్థిని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఏడాది పాటు శానిటరీ ప్యాడ్లను అందించడానికి ముందుకు వచ్చింది ఢిల్లీకి చెందిన శానిటరీ తయారీ సంస్థ పాన్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మేరకు ఆ తయారీ సంస్థ సీఈవో చిరాగ్ మాట్లాడుతూ..ఈ విషయాల గురించి మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా అది మాట్లాడకూడని నిషిద్ధ అంశంగా చూస్తారు. అమ్మాయిలంతా ఆమెలా ధైర్యంగా ముందుకు వచ్చి బహిరంగా మాట్లాడాలి. నిజంగా రియా ధ్యైర్యానికి హ్యాట్సాప్. అని ఆమెని ప్రశంసించారు చిరాగ్. అంతేగాదు ఆమె గ్రాడ్యుయేషన్ చదువుకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు. ఐతే రియా మాత్రం... తన ప్రశ్న తప్పు కాదు కానీ మేడమ్ (ఐఏఎస్ ఆఫీసర్ హర్జోత్ కౌర్ భుమ్రా) మరోలా తీసుకున్నారని చెప్పింది. అంతేగాదు ఆమె ప్రతిదానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం ఆధారితంగా ఉండాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా బహుశా ఆమె అలా అన్నారేమో కాబోలు అని చెబుతోంది. ఇదిలా ఉండగా బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ....బిహార్ ప్రభుత్వం 'కన్యా ఉత్థాన్' కార్యక్రమం కింద ప్రతి అమ్మాయికి రూ.300/లు అందజేస్తుంది. అంటే ప్రతి అమ్మాయికి ప్రభుత్వం ప్రతి నెల రూ. 25లు చెల్లిస్తున్నట్లని, కానీ ఈ అమ్మాయి మాత్రం శానిటర్ ప్యాడ్స్ కోసం డిమాండ్ చేస్తోందన్నారు. బహుశా ఈ విషయం ఆ అమ్మాయికి, ఆ ఐఏఎస్ అధికారికి తెలియకపోయి ఉండొచ్చు అన్నారు. ఆ విద్యార్థిని సాశక్త్ బేటీ.. సమృద్ధి బీహార్ పేరుతో జరిగిన వర్క్‌షాప్‌లో ఐఎఏస్ అధికారిని హర్జోత్ కౌర్ భమ్రాని ఈ విషయమై ఆమె ప్రశ్నించింది. ప్రభుత్వం యూనిఫాంలు వంటివి ప్రతీది ఉచితంగా ఇస్తోంది కదా అలానే రూ. 20-30లు ఉండే ఈ శానిటరీ ప్యాడ్స్‌ని ఉచితంగా ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ఐతే కలెక్టర్ కాస్త కటువుగా ఆ విద్యార్థి ప్రశ్నకు బదులివ్వడంతో ఇంత పెద్ద చర్చకు దారితీసింది. (చదవండి: ‘కండోమ్’ వ్యాఖ్యలతో చిక్కుల్లో ఐఏఎస్.. చర్యలకు సీఎం ఆదేశం!) -
అత్యాచారం జరిగితే.. అది మీ సీఎం చేసినట్టా? బీజేపీపై తేజస్వీ ఫైర్
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇటీవల బెగూసరాయ్‌లో జరిగిన కాల్పుల ఘటనకు సీఎం నితీశ్ కుమారే బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా సీఎంనే నిదించడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రోజూ ఎన్నో నేరాలు జరుగుతున్నాయని వాటికి బాధ్యత ఆయా సీఎంలదేనా? అని తేజస్వీ ప్రశ్నించారు. ఒకవేళ అక్కడ రేప్ జరిగితే అది వాళ్ల సీఎం చేసినట్లా? అని అడిగారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రేదశ్‌లో ప్రతి రోజు నేరాలు జరుగుతూనే ఉన్నాయని, రామరాజ్యమంటే అదేనా అని తేజస్వీ ధ్వజమెత్తారు. 'బెగూసరాయ్ కాల్పుల ఘటనకు కొత్త కోణం ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. బీహార్‌లో ఉంది ప్రజా ప్రభుత్వం. బీజేపీ అంటేనే అతిపెద్ద అబద్దాల పార్టీ. వారు ఎప్పుడూ చెప్పింది చేయరు. ప్రజలను విభజించి సమాజంలో విషం నింపాలని చూస్తారు' అని తేజస్వీ తీవ్ర విమర్శలు చేశారు. బెగూసరాయ్‌లో మంగళవారం కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు నిందుతులు బైక్‌పై ప్రయాణించి పలు చోట్లు అరగంటపాటు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. దీనిపై స్పందిస్తూ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్.. నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బిహార్‌లో మహాఘట్బంధన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన ప్రతిసారి ఆటవిక రాజ్యమే వస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ తేజస్వీ బీజేపీపై మండిపడ్డారు. చదవండి: ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ -
ఆరోగ్యమంత్రి ఆకస్మిక తనిఖీ... కంగుతిన్న ఆస్పత్రి సిబ్బంది
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ మెడికల్ కాలేజ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయానికి ఆస్పత్రి సీనియర్ అధికారి నిద్రకు ఉపక్రమించబోతున్నారు. ఇంతలో ఆరోగ్యమంత్రి తేజస్వీయాదవ్ ఆస్పత్రికి అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో.. దెబ్బకు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆస్పత్రిలో అపరిశుభ్రత, రోగులకు సరైన మందులు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు తదితర అంశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కరు కూడా ఈ ఆస్పత్రిలే నిలబడలేనంతగా వైద్య వ్యర్థాలు, చెత్తా పేరుకుపోయి ఉన్నాయన్నారు. ఆ ఆస్పత్రి పై మహిళలు, పలు రోగులు మంత్రికి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు ఆస్పత్రిలో నర్సులే హెల్త్ మేనేజర్లుగా విధులు నిర్వర్తించడంపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో హెల్త్ మేనేజర్లు ఎందుకు విధులు నిర్వర్తించడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్యాధికారుతో సమావేశమై ఆస్పత్రిలోని పలు సమస్యలపై విచారించారు. అంతేకాదు ఈ ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని, అధికారులంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోందన్నారు. తక్షణమై ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటామని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామి ఇచ్చారు ఆరోగ్య మంత్రి తేజస్వీయాదవ్. (చదవండి: కచ్చితంగా ఆరోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం) -
మీరేం చెప్పారో.. వాళ్లేం అర్థం చేసుకున్నారో తెలియడం లేద్సార్!
మీరేం చెప్పారో.. వాళ్లేం అర్థం చేసుకున్నారో తెలియడం లేద్సార్! -
కొత్త కార్లు వద్దు! అందర్నీ నమస్తే! అదాబ్ అని పలకరించండి!
పట్నా: బిహార్‌లో మహాఘట్ బంధన్ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడీ నుంచే అధిక సంఖ్యలో 31 మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తన పార్టీలోని మంత్రులకు కొన్ని సూచనలు జారీ చేశారు. కొత్త కారులను కొనుగోలు చేయవద్దని, అందరిని నమస్తే, అదాబ్ వంటి పదాలతో పలకరించే సంప్రదాయాన్ని పాటించాలని చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, పేద ప్రజలతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కులానికి ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు. అలాగే బోకేలు లేదా పువ్వులను బహుమతులుగా ఇచ్చే బదులు పెన్లు లేదా పుస్తకాలు ఇచ్చుకోవాలని సూచించారు. మంత్రులెవరూ కూడా తమ శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, కార్మికులను తమ పాదాలను తాకేందుకు అనుమతించకూడదని గట్టిగా నొక్కి చెప్పారు. పైగా మంత్రులు ఆయా శాఖలను బాధ్యతయుతంగా నిర్వర్తిస్తూ, పారదర్శకంగా వ్యవహరిచాలని కోరారు. అంతేగాక మంత్రులు తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో తెలస్తుందని చెప్పారు. మరోవైపు బీజేపీ జంగిల్ రాజా మళ్లీ వచ్చాడు, ఆ పార్టీ మంత్రులంతా నేరచరిత్ర కలిగినవాళ్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ తరుణంలో తేజస్వీ యాదవ్ తన మంత్రులంతా సత్ప్రవర్తనతో, పారదర్శకంగా పరిపాలన సాగించాలంటూ కొత్త మార్గదర్శకాలను సూచించారు. (చదవండి: లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి) -
బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం
పాట్నా: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్(యునైటెడ్)కు చెందిన నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. బుధవారం మధ్యాహ్నాం రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన బీహార్‌కు సీఎంగా ఎనిమిదో సారి బాధ్యతలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు మంగళశారం సాయంత్రం సమర్పించారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. #WATCH Bihar CM Nitish Kumar and Deputy CM Tejashwi Yadav greet each other after the oath-taking ceremony, in Patna pic.twitter.com/fUlTz9nGHS — ANI (@ANI) August 10, 2022 ఈ ప్రమాణ కార్యక్రమానికి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ భార్య రాజశ్రీ తదితర ప్రముఖులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. బుధవారం ఈ ఇద్దరు మాత్రమే ప్రమాణం చేయడం విశేషం. మిగతా కేబినెట్ కూర్పు తర్వాత ఉండే ఛాన్స్ ఉంది. Patna | RJD leader Tejashwi Yadav takes oath as Deputy CM of Bihar pic.twitter.com/mvhweGd1zt — ANI (@ANI) August 10, 2022 #WATCH | Bihar: CM-designate Nitish Kumar, RJD's Tejashwi Yadav and his wife Rajshri, former CM Rabri Devi and RJD leader Tej Pratap Yadav at the swearing-in ceremony at Raj Bhavan in Patna. pic.twitter.com/bdxHBNSiyh — ANI (@ANI) August 10, 2022 ఇదీ చదవండి: ఎన్డీయే నుంచి జేడీయూ నిష్క్రమణపై బీజేపీ స్పందన -
Lalu Prasad Yadav: నిలకడగానే లాలూ ఆరోగ్యం!
పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(74) ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ మేరకు ఆయన తనయుడు తేజస్వి యాదవ్ బుధవారం మీడియాకు తెలిపారు. బుధవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన ఎయిర్ ఆంబులెన్స్‌లో తరలించడంతో ఆయన పరిస్థితి విషమించిందంటూ పుకార్లు మొదలయ్యాయి. వీటిని తేజస్వి యాదవ్ ఖండించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని తనయుడు తేజస్వి యాదవ్ ప్రకటించారు. కిడ్నీ, గుండె సంబంధిత సమస్యల కోసం ఢిల్లీకి షిఫ్ట్ చేసినట్లు వెల్లడించాడాయన. లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోయారు. ఆయన కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. పాట్నాలోని పరాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. భార్య రబ్రీదేవితో పాటు లాలూ ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, సూర్యప్రతాప్ యాదవ్ ఆయనతో పాటే ఉన్నారు. కుడి భుజం గాయంతో పాటు లాలూ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష అనుభవిస్తూ రెండు నెలల క్రితమే బెయిల్‌పై విడుదల అయ్యారు. అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన.. చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో అనుకోకుండా ప్రమాదానికి గురై కాలుజారిపడ్డారు. Bihar | His condition is stable. Everyone knows about his kidney & heart issues for which treatment was going on in Delhi. Those doctors have his medical history& that's the reason we are taking him there: RJD leader & Lalu Prasad Yadav's son Tejashwi Yadav outside the hospital pic.twitter.com/R9Hiys9PRO — ANI (@ANI) July 6, 2022 -
జట్టు కట్టి.. బీజేపీ కట్టడి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిలువరించేందుకు లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా పావులు కదుపుతున్న సీఎం, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదిశగా మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ నేతృత్వం లోని బృందంతో మంగళవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సం క్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, రైతులు సహా వివిధ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన ఓ మంత్రి ఆ పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. యూపీ రాజకీయాల్లో తాజా పరిణామాలపై కేసీఆర్, తేజస్వి చర్చించి నట్టు సమాచారం. యూపీలో బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం ఆ పార్టీ పతనానికి ప్రారంభమని వారు విశ్లేషించుకున్నట్టు తెలిసింది. యూపీ ఎన్నికల్లో ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్‌కు శరద్‌పవార్ మద్దతు ప్రకటించడం కూడా బీజేపీని ఎదుర్కొనే విషయంలో సానుకూల పరిణామని వారు చర్చించుకున్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ బృందం హామీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటి రంగ అభివృద్ధి కార్యక్రమాలపై తేజస్వీ ఆరా తీసినట్టు సమాచారం. జాతీయ స్థాయిలో పాత్ర పోషించండి: లాలూ తేజస్వీ యాదవ్‌తో భేటీ సందర్భంగా ఆయన తండ్రి, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. లాలూ ఆరోగ్యం, క్షేమ సమాచారాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతిచ్చిన విషయాన్ని లాలూ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. తెలంగాణ కోసం త్యాగాలు, పోరాటాలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. అన్ని మతాలు, కులాలు, సబ్బండ వర్గాలకు అనుకూలంగా సాగుతున్న మీ పాలనానుభవం దేశానికి అవసరం. దేశ లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అరాచక పాలననుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందుకు రావాలి’’ అని సీఎం కేసీఆర్‌ను లాలూ కోరినట్టు సమాచారం. కాగా.. తెలంగాణ భవన్‌కు వచ్చిన తేజస్వీ యాదవ్ బృందానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. తేజస్వీ బృందంలో బిహార్ మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వ్యతిరేకశక్తుల విశ్వాసం కోసమే? ‘బీజేపీ ముక్త్ భారత్’ నినాదంలో భాగంగా లౌకకవాద, ప్రజాస్వామిక శక్తులను ఏకం చేసేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్న కేసీఆర్.. మరింత వేగంగా ముందుకు అడుగు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. గతేడాది డిసెంబర్లో చెన్నై వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 8న ఒకేరోజు సీపీఎం, సీపీఐ పార్టీల జాతీయ అగ్రనేతలతో ప్రగతిభవన్‌లో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల సందర్భంగా బీజేపీ వ్యతిరేక శక్తుల విశ్వాసం చూరగొనే ప్రయత్నంతోపాటు జాతీయ స్థాయిలో ఐక్యత అవసరాన్ని కేసీఆర్ నొక్కి చెప్తున్నట్లు సమాచారం. గతంలో జనతా, జనతాదళ్, యూపీఏ భాగస్వామ్య పార్టీల వైఫల్యానికి కారణాలపైనా ఈ భేటీల్లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోందనే అభిప్రాయాన్ని విశదీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతను చాటేందుకు జాతీయ స్థాయిలో ఒక సదస్సునుగానీ, సమావేశాన్ని నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుకు తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. యూపీతో మొదలుపెడదాం.. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో గట్టిగా గొంతు వినిపిస్తున్న టీఆర్ఎస్.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో జరుగనున్న యూపీ ఎన్నికల ప్రచారానికి.. టీఆర్ఎస్ బృందాన్ని పంపేందుకు చురుకైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జాబితాను కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అవసరమైతే తాను కూడా యూపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లాలనే అభిప్రాయాన్ని కూడా కేసీఆర్ వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. యూపీ ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేక శక్తుల సదస్సును నిర్వహించాలనే ప్రతిపాదనను మంగళవారం నాటి భేటీలో తేజస్వీ ముందు పెట్టినట్లు తెలిసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్–ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ భేటీలో అభిప్రాయాలివి.. ►బీజేపీ దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక శక్తులు గణనీయ ప్రభావాన్ని కలిగి ఉన్నా.. జాతీయ స్థాయిలో వాటి మధ్య సూత్రప్రాయంగా ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసివస్తోంది. అందువల్ల ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ తక్షణమే ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీని గద్దె దించేంత వరకు జరగాల్సిన పోరాటంపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలి. ►యూపీ ఎన్నికల సమయంలోనే దీనికి బీజం పడాలి. బీజేపీ వ్యతిరేక ప్రచారం కోసం మంత్రులు, సీనియర్లతో కూడిన ప్రచార బృందాన్ని పంపేందుకు సిద్ధం. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా వెళ్లాలనే అభిప్రాయం. ►బీజేపీని ఎదుర్కొనేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు. ‘జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు మీరు ముందుకు రావాలి. దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నారు. మీ పాలనానుభవం దేశానికి అవసరం. బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకిక శక్తులన్నీ ఒక్కటి కావాలి. అందుకు మీరు ముందు నడవాలి’ – సీఎం కేసీఆర్‌తో ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ చదవండి: (ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ) -
Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్ వివాహం
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వివాహం గురువారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు రాజ్శ్రీతో దక్షిణ ఢిల్లీలోని తేజస్వి సోదరి మిసా భారతి ఫామ్‌హౌస్‌లో ఈ వేడుక జరిగింది. వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, రాజ్యసభ ఎంపీ మీసా భారతి, ఇతర రాజకీయ నాయకులు హాజరయ్యారు. మంగళవారం రాత్రి తేజస్వీ, రాజ్శ్రీల నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. కాగా, కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు కుటుంబానికి సన్నిహితులు, బంధువులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. చదవండి: (మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
లాలూ కుటుంబంలో శుభకార్యం.. సంబరాల్లో ఆర్జేడీ
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో శుభకార్యం జరగనున్నట్టు వార్తలు రావడంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తేజస్వి యాదవ్ గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. అయితే పెళ్లి కూతురు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. 'సగాయ్' (నిశ్చితార్థం) కోసం లాలూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. లాలూ-రబ్రీల తొమ్మిది మంది సంతానంలో 32 ఏళ్ల తేజస్వి యాదవ్ ఆఖరివాడు. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ పెళ్లైన కొన్నిరోజులకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. తేజస్వి యాదవ్ పెళ్లి వార్తపై ఆర్జేడీ ఎమ్మెల్యే, ముఖ్య అధికార ప్రతినిధి భాయ్ వీరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. లాలూ కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి తేజస్వి ఒక్కరే మిగిలారని ఆయన చెప్పారు. పెళ్లి తేదీ, వధువు ఎవరనే దాని గురించి ఆయన పెదవి విప్పలేదు. ‘నిశ్చితార్థం తర్వాత, గ్రాండ్ వెడ్డింగ్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. బిహార్ మొత్తం తన ప్రియమైన నాయకుడు సంతోషకరమైన క్షణంలో చేరాలని కోరుకుంటోంద’ని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయం నేపథ్యంలో నిరాడంబరంగా వివాహ వేడుకలు నిర్వహించాలని తేజస్వి కోరినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి) -
పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: స్విమ్మింగ్‌పూల్‌లో రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఎస్పీ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్‌కుమార్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్‌లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్‌గంజ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్‌పుర్ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి कोई जानता नहीं-पहचानता नहीं कौन है ये राजकुमार जिसने आंचल में रुपया गिराया है घमंड का खुमार इस कुमार पर इतना छाया, अमीरी-गरीबी का फ़र्क़ बताया कोई पीछे से लालू का लाल है बताता भूत के वर्तमान का हाल दिखाता जाओ बबुआ अपनी पहचान बनाओ आर्थिक लुटेरे होने का दाग़ मिटाओ pic.twitter.com/lUgV3Hxl11 — Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021 -
'మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి వారంతా ఏకంకావాలి'
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ ఇరుసు కావాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉనికి కలిగిన జాతీయ పార్టీగా సహజంగానే కాంగ్రెస్ ప్రత్యామ్నాయ కూటమికి మూలస్తంభం కావాలన్నారు. తేజస్వి ఆదివారం పీటీఐతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 200 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు నేరుగా బీజేపీతోనే పోటీ నెలకొందని, హస్తం పార్టీ వాటిపై దృష్టి కేంద్రీకరించి... మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఢిల్లీ నివాసంలో ఇటీవల జరిగిన విపక్ష పార్టీల, వివిధ రంగాల ప్రముఖుల భేటీ గురించి అడగ్గా... అక్కడేం చర్చించారో తనకు తెలియదని తేజస్వి బదులిచ్చారు. నియంతృత్వ పోకడలతో విభజన రాజకీయాలు, అణిచివేతకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపిచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్‌ను కలుపుకొని వెళ్లడం తప్పనిసరని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో తేజస్వి కూడా అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయడం గమనార్హం. -
దీదీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
కోల్‌కతా: సెక్యులర్ పార్టీల మధ్య ఐక్యతకోసం ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కి ఓటు వేయాలని, పశ్చిమబెంగాల్లోని బీహార్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సెక్రటేరియట్లో దీదీని కలిసిన తరువాత, బెంగాల్లో బీజేపీని అడ్డుకోవ డమే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటిం చారు. రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువ లను కాపాడుకునేందుకే’’నని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏఐసీసీ పరిశీలకులు.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) 28 మంది పరిశీలకులను నియమించినట్టు ఓ సీనియర్ నాయకులు తెలిపారు. 8 విడతలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి.. పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, న్యాయవాది ఎంఎల్.శర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కి వ్యతిరేకమని, 8 దఫాల ఎన్నికల నిర్వహణను నిలిపేవేయాని కోరారు. -
వైరల్‌గా మారిన తేజస్వి కాల్ రికార్డ్
పాట్నా: బీహార్‌లో ప్రస్తుతం ఓ ఫోన్ కాల్ రికార్డు వైరల్‌గా మారింది. ఆర్జేడీ చీఫ్, లాలుప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్, పట్నా జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మధ్య జరిగిన ఆ సంభాషణ నెట్టింట చక్కర్లు కొడుతూ, తేజస్వి ఇమేజ్ను అమాంతం పెంచేసింది. వివరాల్లోకి వెళితే.. పాట్నాలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు తేజస్వి వెళ్లారు. అయితే ధర్నా వేదిక వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. తేజస్వి కల్పించుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పట్నా జిల్లా మెజిస్ట్రేట్లతో ఫోన్లో మాట్లాడి ధర్నా వేదిక వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతులు ఇప్పించారు. ఈ క్రమంలో తేజస్వీ, జిల్లా మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్‌ల మధ్య స్పీకర్ ఫోన్లో జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఇందులో తేజస్వి మాట్లాడుతూ.. సింగ్ గారు, ఉపాధ్యాయులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఎందుకు అనుమతి నిరారిస్తున్నారని ప్రశ్నించారు. వారు ముందస్తు అనుమతితోనే ధర్నావేదిక వద్ద నిరసన తెలిపుతున్నారన్నారు. అలాంటప్పుడు లాఠీ ఛార్జి చేయడం, ఆహార పదార్థాలను నేలపాలు చేయడం ఎంత వరకు సమంజమని నిలదీశారు. వారి అనుమతి దరఖాస్తులను వాట్సాప్ చేస్తున్నాను, దయచేసి వారు నిరసన తెలిపేందుకు అనుమతించండని విజ్ఞప్తి చేశారు. ఆపై మెజిస్ట్రేట్ బదులిస్తూ.. పరిశీలిస్తానని చెప్పడంతో, ఎంత సమయం కావాలని తేజస్వి గట్టిగా నిలదీశారు. దీంతో ఆయన గంభీర స్వరంతో.. ఎంత సమయం కావాలని నన్నే ప్రశ్నిస్తావా అంటూ అరిచాడు. దీనికి తేజస్వి యాదవ్ స్పందిస్తూ.. "డీఎం సాబ్ హమ్ తేజస్వి యాదవ్ బోల్ రహే హై" అనడంతో ఆ అధికారి కాసేపు నీళ్లు నములుతూ, స్వరం మార్చి, ఓకే సార్ ఓకే సార్ అనటంతో ధర్నా వేదిక వద్ద కరతాళ ధ్వనులు మోగాయి. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో క్లిప్‌ను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహాయకుడు సుధీంద్ర కులకర్ణి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తేజస్వికి దేశవ్యాప్తంగా ఎందుకింత మాస్ ఫాలోయింగ్ ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తోందని కామెంట్ చేశాడు. కాగా, గతేడాది జరగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోని మహాఘట్ బంధన్ స్వల్ప తేడాతో మేజిక్ ఫిగర్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. -
రైతుల కోసం ఉరికి కూడా సిద్ధం: తేజస్వీ యాదవ్
పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ నితీశ్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ నితీశ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాగా.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) శనివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించారనే కారణంతో తేజస్వీ యాదవ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన 18 మంది ముఖ్య నాయకులు, మరో 500 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి: (భారత్ బంద్ : కేసీఆర్ కీలక నిర్ణయం) దీనిపై స్పందించిన తేజస్వీ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ని పిరికివాడుగా సంభోదించాడు. పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం.. రైతులకు మద్దతుగా మేము గొంతు పెంచినందుకు మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మీకు నిజంగా దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను. రైతుల కోసం నేను ఉరికి కూడా సిద్ధంగా ఉన్నాను అని బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ ప్రకటించారు. ప్రభుత్వ చర్యలపై ఆర్జేడీ స్పందిస్తూ.. 10 రోజుల నుంచి కఠినమైన చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపితే మాపై తప్పడు కేసులు నమోదు చేస్తారా అంటూ నితీశ్ ప్రభుత్వంపై మండిపడింది. చదవండి: (బిహార్‌లో సరికొత్త అడుగులు!) -
బీజేపీకి చెక్: చిరాగ్ చెంతకు తేజస్వీ
పట్నా : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మృతితో బిహార్‌లో రాజకీయం మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ సీటు దీనికి కేంద్రంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన జోరుమీదుకున్న ఎన్డీయే కూటమికి చెక్ పెట్టాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎత్తులు వేస్తున్నారు. దీనికి లోక్‌జనశక్తి (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌ను పావుగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాం విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి తమ కుటుంబానికే కేటాయిస్తుందని చిరాగ్ భావించారు. అయితే ఊహించని విధంగా ఆ స్థానానికి బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ పేరును నామినేట్ చేయడం యవనేతకు షాకింగ్ కలిగించింది. తన తండ్రి స్థానంలో జరుగుతున్న ఎన్నికకు కనీసం తమకు సంప్రదించకుండా సుశీల్ పేరును ఖరారు చేయడం ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. (ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు) ఈ క్రమంలో చిరాగ్‌తో దోస్తీకి ప్రయత్నం చేస్తున్న తేజస్వీ వ్యూహత్మకంగా ఆలోచన చేశారు. పాశ్వాన్ మృతితో జరుగుతున్న ఎన్నికలో ఆయన భార్య, చిరాగ్ తల్లి రీనాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో చిరాగ్‌కు దగ్గర కావడంతో పాటు ఎన్డీయే విజయానికి చెక్ పెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. రీనాకు ఆర్జేడీ మద్దతు ఇస్తామని తేజస్వీ ఇదివరకే వర్తమానం పంపినట్లు బిహార్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఆర్జేడీ సీనియర్ నేత శక్తీ యాదవ్ మాట్లాడుతూ.. రినా పాశ్వాన్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే దానికి ఆర్జేడీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి నిర్ణయం చిరాగ్‌కే వదిలేస్తామని తెలిపారు. ఒకవేళ చిరాగ్ ముందుకు రాకపోతే మహాకూటమి తరుఫున సుశీల్ మోదీకి వ్యతిరేకంగా తామూ అభ్యర్థిని బరిలో నిలుపుతామని వెల్లడించారు. బిహార్ అసెంబ్లీలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిగిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ సహకారంతో రాజ్యసభ స్థానాన్ని కైవలం చేసుకునే విధంగా ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. (ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?) మరోవైపు తేజస్వీ ఎత్తుగడ బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ చిరాగ్‌ను తనవైపుకు తిప్పుకుంటే ఎల్జేపీ సానుభూతిపరులు దాదాపు తేజస్వీ వైపు మళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల విశ్లేషణ. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌తో విభేదించిన చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జేడీయూపై తీవ్ర ప్రభావం చూపగా.. బీజేపీకి పెద్ద ఎత్తున లాభం చేకూర్చిపెట్టింది. అయితే తాము ఎన్డీయే భాగస్వామ్యం పక్షంగానే కొనసాగుతామని ప్రకటించిన ఎల్జేపీ.. ఆ తరువాత బీజేపీ-జేడీయూ ప్రభుత్వంలో మాత్రం చేరలేదు. దీంతో తండ్రి మరణం అనంతరం చిరాగ్ ఒంటరి వాడు అయ్యాడనే భావన కలుగుతోంది. దీనిని తేజస్వీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు. ఆర్జేడీ ఆఫర్‌పై చిరాగ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. -
నితీష్ కొత్త సర్కారుకు రెండు రోజులే.. అప్పుడే వివాదం
పట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజుల్లోనే వివాదం చెలరేగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెవాలాల్ చౌదరిని మంత్రివర్గంలోకి తీసుకోవడమే ఈ వివాదానికి కారణం. గతంలో మెవాలాల్ భాగల్పూర్ వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్సలర్‌గా పని చేశారు. ఆయన హయాంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వినిపించాయి. దీంతో పాటు 2017లో లంచం తీసుకుని అర్హతలేని వారిని యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే బిహార్‌లో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే సర్కార్ ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. అవినీతికి పాల్పడిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదల్) మండిపడింది. ఈ మేరకు తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా మంత్రి అయ్యే అవకాశం ఇవ్వలేదని.. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసమే అవినీతిపరులకు నితీష్ పదవులు కట్టబెడుతున్నారని తేజస్వీ ఆరోపించారు. పది లక్షల ఉద్యోగాలు ఇస్తానని తాను చెప్తే అందుకు విరుద్ధంగా నితీష్ ప్రభుత్వం మెవాలాల్‌ను మంత్రిని చేసి అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ఆరోపణలను మెవాలాల్ తోసిపుచ్చారు. ఈ అంశాలపై విచారణ కొనసాగుతోందని, దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోర్టులో తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవన్నారు. తనపై ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని.. తనపై కేసులున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదని ఆయన వివరణ ఇచ్చారు. అవినీతి పరుడైన తేజస్వీ యాదవ్‌కు ఇతరులను విమర్శించే అర్హత లేదన్నారు. చాలా మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలపై అవినీతి కేసులున్న విషయాన్ని ఈ సందర్భంగా మెవాలాల్ గుర్తుచేశారు. ఈ కేసుకు సంబంధించి 2017లో తన మేనల్లుడు అరెస్టయ్యాడన్న తేజస్వి ఆరోపణలను ఆయన ఖండించారు. అప్పటి రాష్ట్ర గవర్నర్ రామ్‌నాథ్ కోవింద్ ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించారని, తమపై ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మెవాలాల్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెవాలాల్ చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017లో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన మెవాలాల్ తర్వాతి కాలంలో మళ్లీ పార్టీలోకి వచ్చారు. (చదవండి: బిహార్ అసెంబ్లీలో నేర చరితులెక్కువ!) -
ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆర్జేడీ ఛీప్ తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు. బిహార్ ఓటర్లు మహా ఘట్‌బందన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మకై ఫలితాలను తారుమారు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం పట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేకు ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. పోల్ ప్యానల్‌పై సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్ ఫలితాలను రీకౌంటింగ్ జరపించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు ఫలితాలపై ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమి గెలిచిన స్థానాల్లో చాలావరకు వెయ్యిలోపు మెజార్టీ ఉండటంతో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. (బిహార్ ఎన్నికల ఎఫెక్ట్; కాంగ్రెస్ సీట్లకు కోత!) కాగా మంగళవారం విడదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఎన్డీయే కూటమి విజయ సాధించింది. ఆర్జేడీకి 76, బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి 74 స్థానాను సొంతం చేసుకుంది. అయితే ఆర్జేడీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపకపోవడంతో ఆ ప్రభావం తేజస్వీపై పడింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక మరోసారి బిహార్ సీఎం పగ్గాలను అందుకునేందుకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. మంత్రివర్గ సంప్రదింపుల అనంతరం దిపావళి తరువాత సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేబినెట్లో కీలక శాఖలు తమకే దక్కాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సరైన సంఖ్యా బలం లేకపోవడంతో తేజస్వీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. -
తేజస్వీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రశంసలు
భోపాల్ : బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన ఆమె ప్రతిపక్షాలపై తరుచూ విరుచుకుపడుతుంటారు. ప్రత్యర్థులను పొగడటం చాలా అరుదు. బుధవారం భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమాభారతి మాట్లాడుతూ.. తేజస్వీ యాదవ్ మంచి కుర్రాడని, అతడికి మంచి భవిష్యత్ ఉందని ఆమె ప్రశంసించారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదని.. కానీ ఎప్పటికైనా బిహార్‌ను పాలించేది అతనేనని జోస్యం చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలపైనా ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా కృషి చేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంచి పరిపాలన అందించిఉంటే ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదని పేర్కొన్నారు. ఆయన తన పెద్దన్నయ్య లాంటి వాడని, ఈ ఎన్నికల కోసం ఎంతో నేర్పుగా పనిచేశారని ప్రశంసించారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ19 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ 9 సీట్లకే పరిమితమైన విషయం విదితమే. (బిహార్‌లో సరికొత్త అడుగులు!) -
బిహార్‌లో సరికొత్త అడుగులు!
భారత రాజకీయాల్లో ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భావానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజíస్వీ యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపదికన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వీ యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వీ.. యాదవ రాజకీయాల బరువునుంచి పూర్తిగా తప్పుకుని కొత్త పంథాలో నడిచి అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. తన వంటి అతి పిన్నవయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలను ప్రతిబింబిస్తున్న సరికొత్త హీరో తేజస్వీ యాదవ్. చిట్టచివరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించింది.. 243 మంది సభ్యులు కల రాష్ట్ర అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాలు గెల్చుకుని సరిగ్గా ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి సరిపోయేటన్ని సీట్లను సాధించి బతుకుజీవుడా అని బయటపడింది. బీజేపీ నాయకత్వం దేన్నయితే ఆశించిందో సరిగ్గా అలాగే పోలింగ్ సరళి సాగిపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ స్వయంగా 74 స్థానాలు గెల్చుకుని 70 శాతం విజయశాతాన్ని సాధించింది. బిహార్ ఎన్నికల్లో అది సాధించిన ఉత్తమ ఫలితాలు ఇవే మరి. నితీశ్ కుమార్‌ని ఆయన జేడీయూని ఈ ఎన్నికల్లో ఒక జూనియర్ భాగస్వామి పాత్రకు కుదించాలని బీజేపీ పన్నిన పథకం బ్రహ్మాండంగా ఫలించింది. ప్రతిపక్ష శ్రేణులను ఎంతగా దెబ్బకొట్టాలో అంతగా దెబ్బకొట్టడమే కాదు.. విజయానికి దాదాపు దగ్గరగా వచ్చేలా ప్రతిపక్షాల ఓట్లను కూడా శాసించి బ్రాండ్ మోడీ ప్రభావం వల్లే ఈ గెలుపు సాధ్యం చేశానని బీజేపీ ఇరుపక్షాల శ్రేణుల ముందు ఘనంగా ప్రదర్శించింది. అయితే అదే సమయంలో భారత రాజకీయాల్లోకి ఒక సరికొత్త యువ హీరో ఆవిర్భవానికి బిహార్ ఎన్నికలు నాందిపలికాయి. ఆ ఉదయ తార పేరు తేజస్వి యాదవ్. విభజన రాజకీయాల ప్రాతిపది కన రెచ్చగొట్టాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా సరే.. దారిద్య్రం, నిరుద్యోగం వంటి తన సొంత రాజకీయ అజెండాకు గట్టిగా నిబద్ధత ప్రకటించడంలో తేజస్వి యాదవ్ బ్రహ్మాండంగా విజయవంతమయ్యారు. గెలిచిన స్థానాలను పరిశీలిస్తే తేజస్వి నాయకత్వంలోని ఆర్జేడీ 75 స్థానాలు సాధించి బిహార్‌లో అతిపెద్ద పార్టీగా కొనసాగింది. దాదాపు 30 లక్షల ఓట్లను లేదా 40 శాతాన్ని దక్కించుకున్న ఆర్జేడీకి, 2015 నాటి ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. ముస్లింలు, యాదవుల ఓటు పునాది కలిగిన పరిమితిని దాటి ఆర్జేడీ తన పలుకుబడిని విస్తృతస్థాయిలో విస్తరించిందని తేటతెల్లమైంది. గుర్తించదగిన విషయం ఏమిటంటే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తన ఓటు షేరును 18.3 శాతం నుంచి 23.1 శాతానికి పెంచుకునే క్రమంలో జేడీయూ పార్టీకి చెందిన ఓట్ల కంటే బీజేపీ కోటాను కొల్లగొట్టడమే. ఈ దెబ్బకు బీజేపీ ఓటు షేర్ గతంలోని 24.4 శాతం నుంచి 19.5 శాతానికి పడిపోయింది. 2015తో పోలిస్తే బీజేపీకి ప్రస్తుతం 10 లక్షల పదివేల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. అయితే కూట మిలో భాగంగా తక్కువ స్థానాలకు కట్టుబడినందువల్ల కూడా బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా వచ్చి ఉండవచ్చు. జేడీయు ఓటు షేర్‌ను దెబ్బకొట్టడంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించింది. బీజేపీ ఇలా దెబ్బ కొట్టినా ఈదఫా ఎన్నికల్లో జేడీయూకు ఓటు శాతం 16.8 నుంచి 15.8 శాతం మాత్రమే తగ్గింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థులు జేడీయూ ఓటర్లను పొందగలిగారు తప్పితే బీజేపీకి చెందిన అగ్రకులాల ఓటర్లు జేడీయూ పోటీ చేసిన స్థానాల్లో తమ ఓటు వేయకుండా జాగ్రత్తపడ్డారు. జేడీయూకు బదులుగా వీరు అటు ఎల్జేపీనుంచి లేదా ఆర్జేడీనుంచి పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులకు, తమ ఓటు గుద్దేశారు. కొన్ని సందర్భాల్లో వీరి ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు, ప్లూరల్స్ పార్టీ వంటి అతి చిన్న పార్టీల ఖాతాలోకి కూడా వెళ్లిపోయాయి. ముందుండి నడిపించిన సమర యోధుడు గతంలో 2015లో జరిగిన ఎన్నికల్లో మహాగట్ బంధన్ ప్రధాన వ్యూహకర్తగా తలపండిన రాజకీయనేత లాలూ ప్రసాద్ యాదవ్ సర్వం తానై ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు. ఈ ప్రచార ముఖ చిత్రంగా నితీశ్ కుమార్ నిలిచి తన పార్టీనీ, పొత్తు పార్టీలను ఒంటిచేత్తో విజయం వైపు తీసుకుపోయారు. పైగా ఆనాడు బిహార్‌లో ప్రతిపక్షం ఎన్నికలకు కొద్ది నెలల ముందువరకు చెల్లాచెదురై ఉండేది. అందుకనే 2015లో సాధించిన 80 సీట్లతో పోలిస్తే ఇప్పుడు 75 స్థానాలు చేజిక్కించుకుని గణనీయమైన విజయం సాధించిన ఘనత పూర్తిగా యువ తేజస్వీ యాదవ్‌కే దక్కుతుంది. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయ నుంచి పూర్తిగా బయటపడిన 31 సంవత్సరాల తరుణ వయస్కుడు తేజస్వి యాదవ్ అతి తక్కువ సమయంలో సాధించిన విజయం సాధారణమైనది కాదు. యాదవ రాజకీయాల బరువునుంచి తప్పుకుని కొత్త పంథాలోసాగిన తేజస్వి బిహార్‌లోని అస్తిత్వ రాజకీయాల పట్టునుంచి యువతను బయటకు లాగగలిగారు. అంతకంటే ముఖ్యంగా ఇటీవలి కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బిహార్‌లో సాగిన ఎన్నికల ప్రచారం సాపేక్షికంగా శాంతియుతంగా, విద్వేష రహితంగా సాగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ గొప్ప మార్పునకు పూర్తి ఘనత ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌కే దక్కాల్సి ఉంటుంది. జాతీయ మీడియా కూడా ఈ విషయంలో తేజస్వి విశిష్టతను స్పష్టంగా గుర్తించి ప్రశంసించింది. 2020లో సాగిన ఎన్నికల్లో కూడా బీజేపీ య«థాప్రకారంగా కశ్మీర్, సీఏఏ, రామ్ మందిర్ వంటి అంశాలను పదేపదే ప్రస్తావించి విభజన రాజకీయాలను ప్రేరేపించా లని ప్రయత్నించింది. కానీ దానివల్ల అది సాధించింది పెద్దగా ఏమీలేదు. చివరకు బాలీవుడ్లో కొనసాగుతున్న సాంస్కృతిక తప్పిదాల వల్లే యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని కన్నుమూశాడంటూ చెలరేగిన తీవ్రవివాదాస్పద అంశాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిం చింది. ఇక నితీశ్ తనవంతుగా జంగిల్ రాజ్ అనే పాత ముద్రను ఆర్జేడీపై పదేపదే సంధిస్తూ తేజస్విపై, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నించినా, అవేవీ పెద్దగా ఫలవంతం కాలేదు. ఈ మొత్తం వ్యతిరేక ప్రచారంలో కూడా తేజస్వి అత్యంత పరిణతిని ప్రదర్శించారు. తన వంటి అతి పిన్న వయసు యువకుల్లో చాలా అరుదుగా కనిపించే పరిణతి అది. తనపై సాగుతున్న దాడిలో పొరపాటున కూడా ప్రవేశించకుండా తేజస్వి యాదవ్ మొదటినుంచి చివరివరకూ తాను విశ్వసించినటువంటి.. బిహార్ యువతకు విద్య, ఉద్యోగాలు అనే అంశాలపైన మాత్రమే దృష్టి సారించి ప్రచారం సాగిం చాడు. మహాగట్ బంధన్ బలమైన అధికార కూటమిని ఈ స్థాయిలో ముప్పు తిప్పలు పెట్టిందంటే తేజస్వి అత్యంత ప్రతిభావంతంగా అల్లిన ప్రచార ఎజెండానే కారణమని చెప్పక తప్పదు. ఈ ప్రయాణ క్రమంలో తేజస్వి ఈ దఫా ఎన్నికలకు మాత్రమే కాకుండా, దేశంలో కోవిడ్–19 అనంతర రాజకీయాలకు కూడా అజెండాను నిర్దేశించడంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బిహార్ యువతీయువకులకు పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తానని తేజస్వి ఇచ్చిన ఎన్నికల హామీ బీజేపీని ఎంతగా భీతిల్లజేసిందంటే తమ కూటమిని గెలిపిస్తే 19 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని ఎదురు హామీ ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా కోవిడ్–19 వ్యాక్సిన్‌ని ఉచితంగా అందిస్తానని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మధ్యేవాద వామపక్ష రాజకీయ ఆర్థిక విధానాన్ని ఒక మితవాద పార్టీ ప్రకటించవలసి రావడంగా తప్ప మరోలా దీన్ని చూడలేం. మరోవిధంగా బిహార్‌లో వామపక్షాలు సాగించిన గొప్ప విజ యంలో కూడా ఇది ప్రతిఫలించింది. పోటీ చేసింది 29 స్థానాల్లోనే అయినప్పటికీ ఈ దఫా ఎన్నికల్లో వామపక్షాలు 16 సీట్లు కొల్లగొట్టి షాక్ తెప్పించాయి. గతంతో పోలిస్తే 50 శాతం విజయాల రేటును పెంచుకున్న వామపక్షాలు ఆర్జేడీతో సమానంగా విజయాలు సాధించడమే కాకుండా కాంగ్రెస్ (30 శాతం), జేడీయూ (40శాతం) కంటే మంచి స్థానంలో నిలబడటం చెప్పుకోదగిన విషయం. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ–జేడీయు కూటమి అత్తెసరి మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ భారతదేశంలో మధ్యేవాద–వామపక్ష రాజకీయాలకు ఏకకాలలో బిహార్ పైకెత్తి నిలిపింది. వచ్చే సంవత్సరం పశ్చిమబెంగాల్, అస్సామ్, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలు కూడా బిహార్ అనుభవాన్ని ప్రతిబింబించినట్లయితే, అప్పడు బిహార్ ప్రజలు అలాంటి మార్గాన్ని చూపించింది మేమే కదా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కోవిడ్ అనంతర రాజకీయాలకు సంబంధించిన సరికొత్త హీరో తేజస్వి యాదవ్. వ్యాసకర్త రాజేష్ మహాపాత్ర స్వతంత్ర జర్నలిస్టు -
ఆర్జేడీని కాంగ్రెస్సే ముంచిందా?
పట్నా : అతి చిన్న వయసులోనే బిహార్ పీఠం ఎక్కాలన్న ఆర్జేడీ యువ నేత తేజస్వి యాదవ్ కల చెదిరింది. కాంగ్రెస్‌తో జత కట్టడం వల్లే ఆయన కథ మారిపోయిందన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పటికీ, కీలకమైన నేతలందరూ పార్టీని వీడినప్పటికీ తేజస్వి యాదవ్ ఈ సారి ఎన్నికల్లో ఒక శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. 31 ఏళ్ల వయసున్న తేజస్వి పార్టీ బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకొని ఒంటరి పోరాటం చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో తూటాల్లాంటి మాటలతో తేజస్వి చేసిన ప్రసంగాలు, నిరుద్యోగం, వలసవాదుల సమస్యలు, ఆర్థిక సంక్షోభం వంటి విధానపరమైన అంశాలనే ప్రస్తావిస్తూ ఎన్నికల్లో ముందుకు వెళ్లడంతో అధికార ఎన్డీయేకి ఎదురు దెబ్బ తగులుతుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఈ సారి యువతరం తేజస్వికి జై కొడుతుందని అంచనా వేసింది. మహాకూటమిలో భాగస్వామి కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం ఆర్జేడీ విజయావకాశాలను దెబ్బ తీసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకులో ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐఎం చీల్చడం ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్‌కి అత్యధిక సీట్లు కేటాయించారా ? ఈ సారి ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేస్తే, కాంగ్రెస్‌కి 70 స్థానాలు, లెఫ్ట్ పార్టీలకు 23 స్థానాలను కేటాయించారు. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కనీసం 20 స్థానాల్లో గెలవకపోవడం కూటమి కొంప ముంచిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల కంటే తక్కువ సీట్లను సాధించి కూటమి విజయావకాశాలను దెబ్బ తీసింది. ఎన్డీయేకున్న అధికార వ్యతిరేకతను తమకి అనుకూలంగా మలుచుకోవడంలోనూ, అగ్రకులాల ఓట్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆ ఓట్లన్నీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ దక్కించుకోవడంతో కాంగ్రెస్ కుదేలైంది. కాంగ్రెస్‌ని నమ్మి ఎక్కువ సీట్లు కేటాయించడంతో తేజస్వి ఇరకాటంలో పడిపోయారు. చీలిపోయిన ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిసి గ్రాండ్ డెమొక్రాటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎల్‌ఎఫ్)గా ఏర్పడ్డాయి. ఎంఐఎం 5స్థానాలను గెలుచుకుంది. ఆర్జేడీకి మద్దతుగా నిలిచే ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చిందనే చెప్పాలి. మహాఘట్బంధన్ ఓటమి పాలు కావడంలో జీడీఎల్‌ఎఫ్ పాత్ర కూడా ఉంది. -
ఎన్డీఏ ముందంజ
-
బిహార్ ఓటరు తీర్పు నేడే
-
బిహార్ పీఠం ఎన్డీయేదే.. మరోసారి సీఎంగా నితీష్!
ఉత్కంఠభరితంగా సాగిన బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ అవసరమైన సీట్ల కంటే ఎక్కువ దక్కించుకుంది. మెజారిటీ మార్క్ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. 243 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 123 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బిహార్ పగ్గాలను మరోసారి సీఎం నితీష్ కుమార్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ కూటమి 108 స్థానాలో విజయం సాధించింది. మరో మూడు స్థానాల్లో ముందంజలో ఉంది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది. మెజారిటీ మార్క్ 122 దాటి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. ఇక ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కి కాస్త దూరంలో ఆగిపోయింది. ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. ఇక ఎల్జేపీ ఒక్కస్థానంలో గెలిచింది. మళ్లీ పుంజుకున్న ఆర్జేడీ బిహార్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇంతవరకు వెనుకంజలో ఉన్న ఆర్జేడీ మళ్లీ పుంజుకుంది. ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్‌పుర్ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గెలుపొందారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోనుంది. ఇక అధికార జేడీయూ మూడోస్థానంతో సరిపెట్టుకుంది. మహా కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మేమే గెలుస్తాం : ఆర్జేడీ బిహార్ ఓట్ల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోంది. దర్బాంగలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బెనిపూర్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి వినయ్ చౌదరి జయకేతనం ఎగరవేశారు. జాలే, కెవాటిలో బీజేపీ గెలుపొందగా, మోకామాలో ఆర్జేడీ అభ్యర్థి అనంత్ సింగ్ విజయం సాధించారు. ఇక సుపాల్ నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి బిజేంద్ర ప్రసాద్ గెలుపొందాడు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో ఉంది. మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్‌లో, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ హసన్‌పూర్‌లో ముందంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ ఇమాజీ గంజ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బాంకీపూర్‌లో శతృష్ను సిన్హా తనయుడు లవ్ సిన్హా, బిహారిగంజ్లో శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి వెనుకంజలో ఉంది మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : ఆర్జేడీ బిహార్‌లో ప్రభుత్వాన్ని తమే ఏర్పాటే చేస్తామని ఆర్జేడీ ధీమా వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ముందజలో కొనసాగుతున్నప్పటికీ.. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి గెలుపు ధీమాను వ్యక్తం చేసింది. ప్రతి జిల్లా నుంచి తమకు సానుకూల స్పందన వస్తుందని, రాష్ట్రంలో కచ్చితంగా మార్పు జరుగుతుందని ఆర్జేడీ ట్వీట్ చేసింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ బిహార్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇక ఎగ్జిట్ ఫలితాలను తారుమారు చేస్తూ బిహార్‌లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక మధ్యాహ్నం 3.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 25స్థానాల్లో విజయం సాధించింది. మరో 101 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 15 చోట్ల విజయం సాధించగా.. 91స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 9చోట్ల, ఎల్జేపీ 2చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం ఈవీఎం ట్యాంపంరింగ్ జరిగిందనడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా.. ఈవీఎంలను తప్పపట్టరాదు. ఈవీఎం చాలా కచ్చితత్వమైన ఫలితాలను అందిస్తుందన్నారు. అలాగే ఈవీఎం ట్యాపంరింగ్ చేశారన్న ఆర్జేడీ నేతల ఆరోపణలను డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్ కొట్టిపాడేశారు. ఈవీఎంలను ట్యాపరింగ్ చేయడం అసాధ్యమని, గతంలో సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తుది ఫలితం చీకటిపడ్డాకే కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా పెద్ద సంఖ్యలో ఈవీఎం మెషీన్లు వాడటంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితం ఆలస్యం కానుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. రాత్రి పొద్దుపోయిన తర్వాతగానీ ఫలితాలన్నీ వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదని వెల్లడించింది. ఇక మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెల్లడైన వివరాల ప్రకారం.. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 8 స్థానాల్లో విజయం సాధించింది. మరో 118 చోట్ల ఆదిక్యంలో ఉంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 3 చోట్ల విజయం సాధించగా.. 102 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 10 చోట్ల, ఎల్జేపీ 2 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. కాక పెంచుతున్న ఓట్ల తేడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల పదుల సంఖ్యలో ఓట్ల తేడా ఉండటం ఆయా అభ్యర్థుల్లో, పార్టీల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. కాస్బా స్థానంలో ఎల్జేపీ 5 ఓట్ల ఆదిక్యంలో ఉండగా.. రాజ్‌గిర్‌లో జేడీయూ 26 ఓట్ల లీడింగ్ ఉంది. అలాగే, షేక్‌పురాలో జేడీయూ 48 ఓట్ల ఆదిక్యంలో ఉంది. నోఖా నియోజకవర్గంలో 73 ఓట్లు, ఎక్మాలో 104 ఓట్లు, బెలాగంజ్‌లో 113 ఓట్ల ఆదిక్యంలో ఆర్జేడీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. ఇప్పటివరకు 21.4 శాతం కౌంటింగ్ పూర్తి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన బిహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 5 గంటలపాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 1 గంట వరకు 87 లక్షల, 88 వేల, 780 ఓట్లు (21.4 శాతం) లెక్కించామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఓట్లున్నాయి. 170కి పైగా స్థానాల్లో స్వల్ప తేడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. తొలుత కాంగ్రెస్-ఆర్జేడీ మహాఘట్ బంధన్ వైపు మొగ్గిన ఫలితాలు.. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపునకు మళ్లాయి. 170కి పైగా స్థానాల్లో అభ్యర్థుల మధ్య తేడా 2000 వేల ఓట్ల కంటే తక్కువగా ఉందని ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం 12 గంటలకు తెలిపింది. మొత్తం 243 స్థానాల్లో 99 చోట్ల 2000 ఓట్ల తేడా, మరో 54 చోట్ల 1000 ఓట్లలోపు వ్యత్యాసం మాత్రమే ఉందని వెల్లడించింది. 28 స్థానాల్లో 500 ఓట్ల కంటే తక్కువ తేడా ఉందని తెలిపింది. దాంతో ఓట్ల తేడా తక్కువగా ఉన్న స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించేది అంచనా వేయడం కష్టమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారు! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆదిక్యం కనబరుస్తుండటంతో బీజేపీ, జేడీయూ కార్యకర్తలు, మద్దతుదారులు రాజధాని పట్నాలో ముందస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తొలుత ఆదిక్యం కనబరిచిన కాంగ్రెస్-ఆర్జేడీ మహాఘట్ బంధన్ వెనకంజలో కొనసాగుతుండటంతో అభిమానులు ఒకింత నిరాశకు లోనౌతున్నారు. కౌంటింగ్ సరళిని బట్టి ఎన్డీఏ కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 120 కి పైగా స్థానాల్లో ఎన్డీఏ, 100 కు పైగా స్థానాల్లో మహాఘట్ బంధన్ ఆదిక్యంలో కొనసాగుతున్నాయి. కాగా, బిహార్‌లో మహాఘట్ బంధన్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన విషయం తెలిసిందే. అధిక స్థానాల్లో ఎన్డీఏ దూకుడు కౌటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటలు వెనుకంజలో ఉన్న ఎన్డీఏ కూటమి అనూహ్యంగా పుంజుకుని మెజారిటీ స్థానాల్లో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 11.40 గంటలకు ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం. ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో ముందంజలో ఉంది. అందులో బీజేపీ 70 స్థానాల్లో, జేడీయూ 48 స్థానాల్లో, వీఐపీ 6, హెచ్ఏఎం ఒక చోట ఆదిక్యంలో ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్‌లో మేజిక్ ఫిగర్ 122 సీట్లు. ఇక గంట క్రితం వరకు ఎన్డీఏను వెనక్కినెట్టి ఎక్కువ స్థానంలో ఆదిక్యంలో కొనసాగిన మహాఘట్ బంధన్ క్రమక్రమంగా నెమ్మదించింది. ప్రస్తుతం 101 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. వాటిలో ఆర్జేడీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ 20, లెఫ్ట్ పార్టీలు 19 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ ఒక స్థానంలో, ఎంఐఎం రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎల్జేపీ ఐదు స్థానాల్లో, స్వతంత్రులు 4 చోట్ల ఆదిక్యంలో ఉన్నారు. బీజేపీ, ఆర్జేడీ పోటాపోటీ! బిహార్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడానికి బీజేపీ, ఆర్జేడీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. రాష్ట్రంలోని 243 స్థానాల్లో 230 సీట్లకు సంబంధించి ఎన్నికల ఫలితాల గణాంకాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. ఎన్డీఏ కూటమి 120 సీట్లలో ఆదిక్యంలో ఉండగా.. అందులో బీజేపీ 62 స్థానాల్లో, జేడీయూ 51 స్థానాల్లో లీడింగ్ ఉన్నాయి. వివాస్ షీల్ ఇన్సాన్ పార్టీ 6 చోట్ల, హెచ్ఏఎం పార్టీ ఒక స్థానంలో ఆదిక్యంలో ఉంది. మహా ఘట్బంధన్ 114 సీట్లలో ఆదిక్యంలో కొనసాగుతోంది. అందులో ఆర్జేడీ 62, కాంగ్రెస్ 24, లెఫ్ట్ పార్టీలు 18 చోట్ల ఆదిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ, ఎంఐఎం కూటమి ఒక స్థానంలో, ఎల్జేపీ 5 చోట్ల, స్వతంత్రులు 4 చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. అనూహ్యంగా ఎన్డీఏ ముందంజ కౌటింగ్ మొదలైనప్పటి నుంచి వెనుకంజలో ఉన్న జేడీయూ-ఎన్డీయే కూటమి అనూహ్యంగా పుంజుకుంది. ప్రస్తుతం 121 సీట్ల ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక తొలి నుంచి ఆదిక్యంలో కొనసాగుతున్న ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 112 సీట్లలో లీడింగ్‌లో ఉంది. సెక్యులర్ ఫ్రంట్ 3, ఎల్జేపీ 6 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఆదిక్యంలో తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్న మహాఘటన్ బంధన్ (ఎంజీబీ) సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ 700 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా ఆదిక్యంలో ఉన్నారు. జాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జీవేశ్ కుమార్ 2538 ఓట్ల ఆదిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాఘట్ బంధన్ వందకుపైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతూ.. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. లీడింగ్‌లో ఉన్న ప్రముఖులు: మాజీ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ, మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నేత తేజ్‌ప్రతాప్ యాదవ్, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, బీజేపీ సీనియర్ నేత ప్రేమ్‌కుమార్, కాంగ్రెస్ నేతలు లవ్ సిన్హా, సుభాషిని బుందేలా ఆదిక్యంలో ఉన్నారు. వెనుకంజలో ఉన్న ప్రముఖులు బిహార్ బిజేపీ సీనియర్ నేత నంద కిశోర్ యాదవ్, జేడీయూ నేత జైకుమార్ సింగ్, బీజేపీ నేత శ్రేయాసి సింగ్, జడీయూ సీనియర్ నేత విజయ్ చౌదరి, జేఏపీ నేత పప్పు యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ! దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ-ఎన్డీఏ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మహాఘట్ బంధన్ 93 సీట్లలో ఆదిక్యం కొనసాగుతుండగా.. జేడీయూ-ఎన్డీఏ కూటమి 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాఘోపూర్‌లో ముందంజలో కొనసాగుతున్నారు. హసన్పూర్ నుంచి పోటీ చేస్తున్న లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆదిక్యంలో ఉన్నారు. ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే బిహార్‌లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బీజేపీ, జేడీయూ ఉండనున్నాయి. 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిహార్‌లోని మొత్తం అసెంబ్లీ సీట్లు 243. మేజిక్ ఫిగర్ 122. పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఓటరు తీర్పు నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బిహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేత తేజస్వీ యాదవ్‌కు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే ఉత్కంఠకు నేడు తెరపడనుంది. నితీశ్ వయసులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయజతాదళ్(ఆర్జేడీ) యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్‌లోని వాల్మీకినగర్ లోక్‌సభ స్థానంతోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్‌పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్‌ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లేనా?!
సాక్షి, న్యూఢిల్లీ : సుదీర్ఘ కాలం పాటు దేశంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారికి గత కొన్ని సంవత్సరాలుగా కలసి రావడం లేదు. 24 సంవత్సరాల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగిన పవన్ కుమార్ చామ్లింగ్ 2019 అధికారం నుంచి దిగిపోయారు. అంతకంటే ఏడాది ముందు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ గద్దె దిగారు. 2018, డిసెంబర్లో కూడా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులయిన రామన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 2020 సంవత్సరంలో చౌహాన్ మళ్లీ పదవిలోకి వచ్చారు. అది వేరే విషయం. (డబుల్ యువరాజులు x డబుల్ ఇంజిన్ అభివృద్ధి) 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత 2005 నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (2014లో కొన్ని నెలలు మినహా) ఎదురు లేకుండా అధికారంలో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నారు. నవీన్ పట్నాయక్ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్న బిహార్‌లో ఏ పార్టీ గెలుస్తుంది ? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ? అన్న విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. (నితీష్ స్కాం 30 వేలకోట్లు : మోదీ) ఈ ఏడాది మొదట్లో కూడా ఎన్నికల సందడి కనిపించలేదు. బీజేపీ మద్దతుతో జేడీయూ గెలుస్తుందని, మళ్లీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారులే అన్న మాటలే చప్పగా వినిపించాయి. నితీష్ కుమార్ పార్టీని విమర్శిస్తూ వచ్చిన లోక్‌జనశక్తి పార్టీ, బీజేపీతో చేతులు కలపడంతో ముఖ్యమంత్రిగా నితీష్ ఈసారి తప్పుకోవడం తప్పనిసరని అందరూ భావించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకొని నితీష్ కుమార్‌కు మద్దతు ప్రకటించడంతో రాజీ కుదిరిందనుకున్నారు. కానీ నితీష్ ఫొటోలు లేకుండా బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుండడం, ప్రధాని మోదీ పోస్టర్లతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ నాయకులు ఇప్పటికీ ప్రశంసించడం చూస్తుంటే నితీష్ కుమార్ అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తోంది. (తొలి దశ ఓటింగ్ 54.26%!) మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తోన్న ఆర్జేడీ కూడా నితీష్ కుమార్ లక్ష్యంగాన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్, మోదీకి బదులు నితీష్‌నే ఎక్కువగా విమర్శిస్తున్నారు. ఆయన విస్తృత ఎన్నికల ప్రచారానికి ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడం కూడా నితీష్ భవితవ్యాన్ని ప్రశ్నిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ సారి బిహార్ ఎన్నికలు నితీష్ పనితీరుకు రిఫరెండమ్ అని చెబుతున్నారు. (నితీష్‌ని ఇరకాటంలో పడేసిన మోదీ) -
‘ఎన్నికల కమిషన్ బీజేపీలో ఓ శాఖ’
ముంబై: శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీ బీజేపీలో ఓ శాఖ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు రాదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. ‘భారత ఎన్నికల కమిషన్ బీజేపీకి చెందిన ఓ శాఖ. దాని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం’ అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి దశ పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఆర్జేడీ చీఫ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓ యువకుడు.. ఎవరి మద్దతు లేదు.. తండ్రి జైలులో ఉన్నాడు. సీబీఐ, ఐటీ డిపార్ట్మెంట్లు అతడి వెంట పడుతున్నాయి. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికి రేపు అతడు ముఖ్యమంత్రి అయినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఓట్లు సంపాదించుకుంటాడు అనిపిస్తుంది’ అన్నారు. (చదవండి: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఎన్నికల కమిషన్) అంతేకాక ఎన్నికల వేళ బిహార్‌లో ఏం జరుగుతుందో అందరికి తెలుసన్నారు సంజయ్ రౌత్. ఎన్నికల కమిషన్ బీజేపీకి కొమ్ము కాస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకురాలు పంకజా ముండే శివసేనలో చేరారనే పుకార్లపై సంజయ్ రౌత్ తనకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. బిహార్ మొదటి దవ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 30 న 71 స్థానాలకు ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 55.69 శాతం ఓటర్లు నమోదయ్యాయి. రెండవ దశ నవంబర్ 3న, మూడవ దశ నవంబర్ 7న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 10 న జరగనుంది. -
సీఎం అభ్యర్థిపై చెప్పులు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్ని జోరుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సభలు, సమావేశాలతో నాయకులు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆగంతకులు ఆయన మీదకు చెప్పులు విసిరారు. వివరాలు.. ఔరంగాబాద్ జిల్లా కుటుంబ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం వచ్చారు తేజస్వీ. సభా వేదికపై కూర్చుని ఉండగా.. ఆకస్మాత్తుగా ఆయన వైపు రెండు చెప్పులు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి ఆయన తల పక్క నుంచి వెళ్లి పోగా.. మరోకటి మాత్రం తేజస్వీకి తగిలి ఆయన ఒడిలో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. అయితే తేజస్వీపైకి చెప్పులు ఎవరు విసిరారో.. ఎందుకు వేశారో మాత్రం తెలియలేదు. (చదవండి: హవ్వా! మస్కా కొట్టకు మంత్రీజీ) ఈ ఘటన అనంతరం తన ప్రసంగం మొదలు పెట్టిన తేజస్వీ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అయితే ఈ ఘటనను ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ ఖండించారు. ఎన్నికల ప్రచార సమయంలో నేతలకు సరైన భద్రత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ కూటమి తలపడుతుంది. మొత్తం 243 స్థానాలకు గాను 144 చోట్ల ఆర్జేడీ తన అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
నితీష్‌కు డబుల్ ట్రబుల్..!
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీలన్ని దూకుడు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో నితీష్ కుమార్ ప్రతిపక్షాలతో పాటు విపక్షంగా మారిన మిత్రపక్షం లోక్ జన్‌శక్తి పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఒంటరిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన ఆయన బీజేపీ మిత్ర పక్షంగా కొనసాగుతానని తెలిపారు. ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సమస్యను రెట్టింపు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్‌కి మద్దతు తెలిపారు. రామ్ విలాస్ పాశ్వాన్ లేని సమయంలో నితీష్ కుమార్ వారికి అండగా ఉండాల్సింది పోయి చిరాగ్ పాశ్వాన్‌ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ‘చిరాగ్ పాశ్వాన్ విషయంలో నితీష్ కుమార్ వైఖరి సరైంది కాదు. ఈ సమయంలో చిరాగ్ పాశ్వాన్‌కి ఆయన తండ్రి అవసరం ఎంతో ఉంది. కానీ ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ మన మధ్యలో లేరు. నిజంగా ఇది శోచనీయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిరాగ్ పాశ్వాన్ పట్ల నితీష్ కుమార్ వైఖరి పూర్తిగా అన్యాయంగా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నేను మోదీ హనుమాన్‌ని!) అయితే తేజస్వీ ఇలా చిరాగ్ పాశ్వాన్‌కు మద్దతివ్వడం వెనక గల కారణాలను విశ్లేషిస్తే.. ఇద్దరి తండ్రులు మధ్య గల స్నేహం ఒక కారణమైతే సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా ఇరు యువ నాయకులు తండ్రులు నితీష్ కుమారతో కలిసి పని చేశారు. ఇక రామ్ విలాస్ పాశ్వాన్ మరణించినప్పుడు తేజస్వీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు నితీష్ కుమార్ ఇద్దరీకి ఉమ్మడి శత్రువుగా మారడంతో తేజస్వీ, చిరాగ్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిలో భాగంగానే రాఘోపూర్ నియోజకవర్గంలో తేజస్వీకి సహాకరించేందుకుగాను చిరాగ్ రాజ్‌పుత్ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇచ్చారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల బీజేపీ ఉన్నత కుల ఓటు బ్యాంకు చీలిపోయి తేజస్వీకి ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నాయి. -
10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్
సాక్షి, పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత, బిహార్ ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్రం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను గుప్పించారు. ముఖ్యంగా తమ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన డీఎన్ఏ స్వచ్ఛమైందని తేజస్వీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గ్రాండ్ అలయన్స్ మ్యానిఫెస్టోను తేజస్వీ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ ప్రభుత్వంపై తన దాడిని ఎక్కుపెట్టారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్‌మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 స్కాంలు జరిగాయని, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశం నిరుద్యోగమని పేర్కొన్న తేజస్వి ఉపాధి,ఉద్యోగాలు కోల్పోయిలన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వ్యాపారాలు నాశనమై పోయినా, వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతింటే, ఇప్పటి వరకూ కేంద్రం పర్యటించిన పాపాన పోలేదని తేజస్వీ మండి పడ్డారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మాధ్యమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ప్రకటించారు. దీంతోపాటు, ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్, దీంతోపాటు ప్రాన్ హమారా, సంకల్ప్ బద్లావ్ కా లాంటి పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సురేజ్వాలా, శక్తిసింహ్ గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా 243 సీట్ల రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నిలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
‘నీ తండ్రి ఏం ఉద్యోగం ఇచ్చాడు’
పట్నా: బిహార్ షెయిక్‌పూర్ నియోజకవర్గ జేడీయూ ఎమ్మెల్యే రంధీర్ కుమార్ సోనికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 22న తీసిన ఈ వీడియోలో రంధీర్ కుమార్ షెయిక్‌పూర్‌లోని చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడ్డాయి అంటూ వలస కూలీలు రంధీర్ కుమార్‌ను ప్రశ్నించారు. (‘ఆ బస్సులను ఆపకండి’) దానికి సదరు ఎమ్మెల్యే ‘మీ తండ్రి నీకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా’ అంటూ వలస కూలీని ప్రశ్నించారు. దాంతో వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసస్థితి చేయి దాటడంతో రంధీర్ అక్కడి నుంచి మరో క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని..) -
థాంక్యూ సోమచ్ కమిషనర్: తేజశ్వి యాదవ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని వివిధ హోటల్స్‌లో చిక్కుకున్న బిహార్‌కి చెందిన ఇంటర్ విద్యార్థులను సురక్షితంగా కళాశాల హాస్టల్స్‌కి పంపించినందుకు జీవీఎంసీ కమిషనర్ జి.సృజనకు బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఓ ప్రైవేట్ కళాశాలలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు లాక్డౌన్ నేపథ్యంలో కాలేజీ హాస్టల్ నుంచి బయలుదేరి బిహార్ రాలేక నగరంలోని పలు హోటల్స్‌లో తలదాచుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. Thank you so much https://t.co/1om5Z2twCL — Tejashwi Yadav (@yadavtejashwi) March 28, 2020 దీంతో బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా కమిషనర్ సృజనకి విషయాన్ని తెలియజేశారు. కమిషనర్ వెంటనే స్పందించి నగరంలోని హోటల్స్‌లో జల్లెడపట్టగా 17 మంది విద్యార్థుల ఆచూకీ గుర్తించి వైద్య పరీక్షల అనంతరం కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి తిరిగి హాస్టల్‌కి పంపించారు. ఈ విషయాన్ని తేజశ్వికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో కమిషనర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. -
నాకు మద్దతివ్వండి : తేజస్వీ యాదవ్
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం ఆర్జేడీ నేతృత్వంలో బీహార్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. అంతకు కొన్ని గంటల ముందు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ‘నేను హిందువుని, భారతీయుడిని, రాజ్యాంగం పట్ల విధేయత కలవాడిని, దేశలోని పేదలు, రైతుల పక్షాన ఉంటాను. వారి కోసం సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నా’నంటూ రాసి ఉన్న పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. అనంతరం పాట్నా వీధుల్లో జాతీయ జెండా పట్టుకొని తనతో ఏకీభవించేవారు బంద్‌కు సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కాగా, దాణా కుంభకోణంలో శిక్షపడి జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతవారం సీఏఏకు వ్యతిరేకంగా తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. -
నెల తర్వాత ప్రత్యక్షమైన తేజస్వి.. !
న్యూఢిల్లీ : దాదాపు నెల రోజులుగా ‘కనిపించకుండాపోయిన’ ఆర్జేడీ సీనియర్ నేత, పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ఎట్టకేలకు మళ్లీ ప్రత్యక్షమయ్యారు. అదీ ట్విటర్లో దర్శనమిచ్చారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, బిహార్‌లోనే ఉన్నానని, చాలాకాలంగా వేధిస్తున్న మోకాలి నొప్పికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల బయటకు రాలేకపోయానని శనివారం వరుస ట్వీట్లో ఆయన వివరించారు. ‘మిత్రులారా! గతకొన్ని వారాలుగా ఏసీఎల్ గాయానికి సంబంధించి చికిత్స పొందుతూ ఉన్నాను. నా గురించి ప్రత్యర్థులే కాకుండా మీడియాలోని ఓ వర్గం కూడా మసాలా స్టోరీలు ప్రచారం చేయడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది’ అని తేజస్వి ట్వీట్ చేశారు. మెదడు వ్యాపు వ్యాధి వల్ల పెద్ద ఎత్తున సంభవించిన పిల్లల మరణాల పట్ల తేజస్వి సంతాపం వ్యక్తం చేశారు. పిల్లల ఆకాల మృతి నేపథ్యంలో వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని పార్టీ కార్యకర్తలకు సూచించానని, ఈ విషయంలో ఫొటో షోకుటప్పులు లేకుండా వారిని ఆదుకోవాలని సూచించానని, అంతేకాకుండా ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని తమ పార్టీ ఎంపీలకు సూచించానని, అందువల్లే ప్రధాని ఈ అంశంపై స్పందించారని పేర్కొన్నారు. ప్రతిరోజూ మెదడు వ్యాపు వ్యాధి కారణంగా పెద్ద ఎత్తున చిన్నారులు చనిపోతున్నా.. తేజస్వి మీడియా ముందుకు రాకపోవడం, రాజకీయంగా కనిపించకపోవడం దుమారం రేపింది. మెదడు వ్యాపు వ్యాధికి కేంద్రంగా ఉన్న ముజఫర్‌పూర్‌లో తేజస్వి అదృశ్యమయ్యారని పోస్టర్లు వెలిశాయి. ఆయన ఆచూకీ చెప్పినవారికి రూ. 5,100 నజరానా ఇస్తానని ఆ పోస్టర్లలో ప్రకటించారు కూడా. మాజీ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి ముజఫర్‌పూర్‌ను ఇప్పటివరకు సందర్శించలేదు. ఇక, గతంలో తేజస్వి ఎక్కడ అని ఆ పార్టీ సీనియర్ నేత రఘువంశ ప్రసాద్ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఏమో ఆయన వరల్డ్‌కప్ మ్యాచ్‌లను చూసేందుకు వెళ్లారేమోనంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. -
ప్రతిపక్షనేత ఆచూకీ చెపితే.. బహుమతి
పట్నా: బిహార్ ప్రతిపక్ష నేత, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, తేజస్వీ యాదవ్ ఆచూకీ చెప్పినవారికి బహుమతి ఇస్తామని సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. తేజస్వీ యాదవ్ ఫొటోతోపాటు తన ఫొటోను కూడా హష్మీ ఫోటీను కూడా పొస్టర్‌లో ముద్రించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలనప్పటి నుంచి తేజస్వీ యాదవ్ కనిపించడం లేదని హష్మీ ఈ పోస్టర్లో పేర్కొన్నారు. తేజస్వీని చూసినవారు, లేదా, ఆయన ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ విధంగా సమాచారం ఇచ్చినవారికి రూ.5,100 బహుమతి ఇస్తామని పోస్టర్లో పేర్కొన్నారు. ఆయన ప్రపంచకప్ చూస్తూ బిజీగా ఉండొచ్చు.. కాగా బిహార్‌లోని ముజఫర్‌పూర్, దాని పరిసర జిల్లాల్లో మెదడువాపు వ్యాధి బారినపడి సుమారు 150 మంది చిన్నారులు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. సమస్య తీవ్రంగా ఉండటంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించి, బాధితులను ఓదార్చుతున్నారు. కానీ ఇప్పటి వరకు తేజస్వీ మాత్రం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఇటీవల ఆర్జేడీ ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. తేజస్వీ ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తూ.. బిజీగా గడుపుతూ ఉండొచ్చంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పొందడంతో తేజస్వీ యాదవ్ సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. -
ఆయన ప్రపంచకప్ చూస్తూ బిజీగా ఉండొచ్చు..
పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధితో 100 మందికి పైగా పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన బిహార్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్‌పై కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకుండా, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పకుండా తేజస్వీ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్లపై ఆ పార్టీ సీనియర్ నేత రఘవిశ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘మా నాయకుడు (తేజస్వీ యాదవ్) ఎక్కడికి వెళ్లారో మాకు కూడా తెలీదు. నాకు తెలిసి లండన్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూస్తూ.. బిజీగా గడుపుతూ ఉండొచ్చు’’అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుంచి తేజస్వీ పెద్దగా బయట కనిపించట్లేదు. కాగా ముజఫర్‌పూర్ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్ ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. -
‘రాహుల్‌ని వ్యతిరేకిస్తున్నారు.. ఓటు వేయలేదు’
పట్నా : ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీద బీజేపీ, జేడీయూ పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. కారణం ఏంటంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం బిహార్‌లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వీ ఓటు వేయలేదు. దీనిపై బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. ‘తేజస్వీ కుటుంబం నుంచి ప్రధాని బరిలో ఎవరూ లేరు. అందుకే ఆయన ఓటు వేయలేదు. దీన్ని బట్టి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది’ అంటూ ఆరోపణలు చేసింది. ఆయన తల్లి, సోదరి, ఆఖరికి తేజ్ ప్రతాప్ కూడా తాను బలపరుస్తున్న అభ్యర్థి కోసం ఓటు వేశారని.. కానీ తేజస్వీ మాత్రం ఓటు వేయలేదని బీజేపీ విమర్శించింది. జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘తేజస్వీ జైల్లో ఉన్న తన తండ్రి గురించి ఆలోచించి అయిన ఓటు వేయాల్సిందిగా జనాలను అభ్యర్థించాడు. కానీ చివరకు ఆయనే ఓటు వేయలేదు. ఎంత ఆశ్చర్యం’ అన్నారు. ఈ విమర్శలపై ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారీ స్పందిస్తూ.. ‘నాకు తెలిసిన దాని ప్రకారం ఓటరు లిస్ట్‌లో తేజస్వీ పేరు పక్కన వేరే వ్యక్తి ఫోటో పడింది. దాంతో ఆయన ఓటు వేయలేకపోయార’ని తెలిపారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని.. ఒక వేళ తేజస్వీ ఓటర్ ఐడీ తీసుకుని పోలీంగ్ కేంద్రానికి వస్తే.. అక్కడికక్కడే ఈ సమస్యను పరిష్కరించేవాళ్లమని ఈసీ తెలిపింది. మరో సమాచారం ఏంటంటే.. శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత తేజస్వీ ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాడని... పోలింగ్ నాటికి తిరిగి బిహార్ చేరుకోలేకపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సమోసామే ఆలు, బిహార్‌మే లాలూ కా బేటా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ’ గత బిహార్ ఎన్నికల సందర్బంగా ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చిన నినాదం ఇది. ఈ నినాదం ప్రభావం ఏమేరకు ఉందో చెప్పలేంగానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు ‘మహా కూటమి’గా ఏర్పాటై విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లను, మిత్రపక్షాలతో కలుపుకొని 40కి 31 సీట్లను గెలుచుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఏడాదిలోనే జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషమే. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి రాంరాం పలికిన జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తన ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు 29 ఏళ్ల తేజశ్వి యాదవ్ జోక్యం పెరిగిన కారణంగా తాను బీజేపీతో చేతులు కలపాల్సి వచ్చిందని నితీష్ కుమార్ చెబుతూ వచ్చారు. కానీ ఒకప్పుడు విలువల ప్రాతిపదిక బీజేపీతో తెగతెంపులు చేసుకొని, ప్రధాని అభ్యర్థిగా అన్ని విధాల తగిన వ్యక్తంటూ పేరుతెచ్చుకున్న వ్యక్తి, బీజేపీతో చేతులు కలపడం ద్వారా పేరును కాస్త చెడగొట్టుకున్నారు. ఒకప్పటిలాగా రాజకీయ చక్రం తిప్పేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేరు. ఆయన పశుదాణా కేసులో శిక్షపడి జైల్లో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారు. అఫ్కోర్స్, శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల ప్రచారం చేయరాదు.. అదే వేరే విషయం. ‘అంతబాగా మాట్లాడేవారు ఎవరూ లేరు. అంత శక్తి సామర్థ్యాలు కూడా ఎవరికి లేవు. ఆయన్ని మిస్సవుతున్నాం. ఆయనకు కావాలనే బెయిల్ ఇవ్వడం లేదు. ఆయన, నేను ఎన్నికల పనులను పంచుకొని ప్రచారం చేసినట్లయితే పూర్తిగా ఊడ్చేసేవాళ్లం’ అని తేజశ్వి యాదవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి స్టార్ ప్రచారకార్త తేజశ్వియే. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభ సీట్లు ఉండడం వల్ల మీడియా తన దృష్టిని అంతా అక్కడనే కేంద్రీకరిస్తోంది. కానీ 40 సీట్లు కలిగిన బిహార్‌పైన కూడా దృష్టిని పెట్టాల్సి ఉంది. లాలూ లేకపోయినా తేజశ్వి నాయకత్వంలో 30 సీట్లను సాధిస్తామని కూటమి వర్గాలు ఆశిస్తున్నాయి. ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు, తబ్ తక్ రహేగా బిహార్‌పై లాలూ కా బేఠా’ అని వారు సరికొత్తగా నినదిస్తున్నారు. -
నాన్నను కలువకుండా కుట్ర చేస్తున్నారు!
సాక్షి, పట్నా: గుండెజబ్బుతో రాంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలుసుకోనివ్వకుండా ‘నియంతృత్వ’ బీజేపీ కిరాతకంగా వ్యవహరిస్తోందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ హృద్రోగ సమస్యతో బాధపడుతుండటంతో ఆయనను రాంచీలోని ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి వార్డులో ఉన్న లాలూను కలిసేందుకు ప్రతి శనివారం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తాజాగా తన తండ్రిని కలిసేందుకు తనను అనుమతించలేదని, దీని వెనుక బీజేపీ కుట్ర ఉందని తేజస్వి ట్విటర్లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రెండు వారాల కిందట లాలూకు ఈసీజీ, ఎక్స్‌రే తీయాలని డాక్టర్లు చెప్పారు. కానీ, ఇంతవరకు ఆ పరీక్షలు చేయించలేదు. ఇందుకోసం మరో బిల్డింగ్‌కు లాలూను మార్చాల్సి ఉంటుందని, అందుకు కావాల్సిన అనుమతులు లేకపోవడంతో ఆ పరీక్షలు చేయించడం లేదని జైలు అధికారులు చెప్తున్నారు’ అని తేజస్వి ట్వీట్ చేశారు. ‘నిన్న (శనివారం) మా నాన్నను కలిసేందుకు రాంచీ ఆస్పత్రికి వెళ్లాను. కానీ ఆయనను చూసేందుకు అనుమతించలేదు. ఇది నియంతృత్వ బీజేపీ పథకమే. తన తండ్రిని కొడుకు కలుసుకోనివ్వకుండా బీజేపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. లాలూకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. ఆయన గదిలో ప్రతి రోజు తనిఖీలు జరుపుతున్నారు’ అని తేజస్వి మరో ట్వీట్లో పేర్కొన్నారు. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో దోషిగా తేలిన లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అనారోగ్యం రీత్యా గత ఏడాది మేలో ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించినప్పటికీ.. హైకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఆగస్టులో మళ్లీ జైలుకు వెళ్లారు. -
నితీశ్‌పై లాలూ పుస్తకంలో వ్యాఖ్యలు.. దుమారం!
సాక్షి, పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి మహాగట్బంధన్ (మహాకూటమి)లో చేరడానికి ప్రయత్నించారని ప్రతిపక్ష ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తన పుస్తకంలో రాసుకోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ‘మహాకూటమిని వీడి, ఎన్డీయేలో చేరిన ఆరు నెలలకే, తిరిగి మా దగ్గరికి రావడానికి నితీష్ కుమార్ చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆయన మా నమ్మకాన్ని కోల్పోయార’ని ‘గోపాల్‌గంజ్ టూ రైజినా: మై పొలిటికల్ జర్నీ’ పేరిట రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది. జేడీ (యూ) జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా పార్టీని మళ్లీ కూటమిలో చేర్చే అంశానికి సంబంధించి తనను పలుమార్లు సంప్రదించారని లాలూ పుస్తకంలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించిన లాలూ తనయుడు తేజస్వీ కూడా.. ఆర్జేడీ కూటమిలో తిరిగి చేరే విషయంపై తమతో మాట్లాడినట్టు తెలిపారు. గతేడాది ఈ విషయంపై తేజస్వీ మాట్లాడేతూ.. ‘ఎన్డీయేలో జేడీ (యూ) చాలా ఇబ్బంది పడుతోంది. కానీ ఆ పార్టీకి మహాకూటమిలో చోటు లేదు. వారికి కూటమిలోకి వచ్చే తలుపులను మూసేశామ’ని చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యల్ని ప్రశాంత్ కిషోర్ ఖండించారు. లాలూ మాటల్ని బోగస్‌గా కొట్టేసిన ఆయన.. ‘మా అధినేత (నితీష్ కుమార్) ఔచిత్యాన్ని దెబ్బతీయడానికి ఆర్జేడీ చేసిన పేలవ ప్రయత్నమిది. నేను జేడీయూలో చేరడానికి ముందు లాలూను కలిశాను. అప్పుడు మా మధ్య జరిగిన సంభాషణా వివరాలను వెల్లడిస్తే, ఆయన చిన్నబుచ్చుకోవడం ఖాయమ’ని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల సీంకీర్ణ కూటమిలో దాదాపు 20 నెలలున్న తర్వాత 2017లో నితీష్‌కుమార్.. అందులోంచి బయటకు వచ్చి మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరారు. -
‘బట్టతల ఉన్న వారికి మోదీ దువ్వెన అమ్మారు’
పట్నా: బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పట్నాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన్ ఆక్రోశ్ ర్యాలీకి తేజస్వీ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బట్టతల ఉన్నవారికి 2014లో మోదీ దువ్వెనలు అమ్మారు. జుట్టు లేకున్నా మాకు దువ్వెలు ఎందుకని వారు అడిగితే.. నేను అధికారంలోకి రాగానే మీకు జుట్టు తెప్పిస్తా అని మోదీ చెప్పారు. మోదీ మంచి సేల్స్‌మెన్’’ అని తేజస్వీ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి దేశంలో లేదని, మోదీని ఎవరు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైన ఈ సభలో తేజస్వీ ఆయనతో పాటు వేదికను పంచుకున్నారు. మోదీ అసలు రంగును బిహార్ నిరుద్యోగులకు వివరించడానికి రాహుల్ ఇక్కడి రావడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీ ఒడించేందుకు కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోరాడుతామని తేజస్వీ వెల్లడించారు. -
‘ఆ రెండు పార్టీలే బీజేపీని ఓడిస్తాయి’
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ కూటమి ఒక్కటే సరిపోతుందని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. సోమవారం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో తేజస్వీ లక్నోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ, బీఎస్పీ కూటమిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కూటమిలో కాంగ్రెస్ లేకపోవడంపై ఆయన స్పందిస్తూ.. బీజేపీని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ పార్టీలే చాలని, వారి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కూటమిలో ఎవురున్నారన్నది ముఖ్యం కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి మాత్రం తప్పదని జోస్యం చెప్పారు. మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు చేతులు కలపడంతోనే బీజేపీ ఓటమి ఖాయమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతలో ఎస్పీ, బీఎస్పీ కూటమి అవసరం ఎంతో ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో మహాకూటమి 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ భేటీ అయిన విషయం తెలిసిందే. మాయా, అఖిలేష్‌తో విడివిడిగా సమావేశమైన ఆయన లోక్‌సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. -
‘నాగ్‌పూర్ చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు’
లక్నో: బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని ఆదివారం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఎదుర్కొవడానికి ఎస్పీ, బీఎస్పీలు ఒకటిగా పోటీ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే తేజస్వీ, మాయావతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం తేజస్వీ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో, బిహార్‌లో బీజేపీకి ఘోర ఓటమి తప్పదని అన్నారు. యూపీలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా వెళ్లడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కకుపెట్టి.. నాగ్‌పూర్ చట్టాలను అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అఖిలేశ్, మాయావతి కలయికను ప్రజలు కూడా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. యూపీలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. కాగా, ఎస్పీ, బీఎస్పీ కూటమిలోకి కాంగ్రెస్‌ను చేర్చుకోకపోయినప్పటికీ.. ఆ పార్టీ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో తమ కూటమి తరఫున అభ్యర్థులను నిలుపరాదనే నిర్ణయానికి వచ్చాయి. మరోవైపు ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ లేకుండా ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ముందుకెళ్లడంపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ఈ పరిణామం మంచిది కాదన్నారు. -
అక్కడ సీసీటీవీ కెమెరా ఎందుకోసం పెట్టారు?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. తన ఇంటి సరిహద్దుల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడంపై ట్విటర్లో స్పందించిన తేజస్వీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్లతో నితీశ్‌పై విరుచుకుపడ్డారు. నితీశ్ ప్రతిపక్ష పార్టీ నేతలపై నిఘా పెట్టడం మానుకోవాలని సూచించారు. ఆయన తన భద్రత కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. పట్నాలో తన ఇంటి పక్కనే నితీశ్ ఉంటుందని తేజస్వి తెలిపారు. తమ ఇళ్ల మధ్య ఉన్న సరిహద్దు గోడపై చాలా ఎత్తులో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం వెనుక అర్థమెంటని తేజస్వీ ప్రశ్నించారు. దీని ద్వారా అవతలి వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతోందని వాపోయారు. ఇలాంటి పనులు చేయవద్దని నితీశ్‌కు ఎవరైనా సూచించడని వ్యంగ్యంగా స్పందిచారు. పట్నాలో నేరాలు సంఖ్య పెరిగిపోతున్న పట్టించుకోని సీఎం.. ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ఎద్దేవా చేశారు. పౌరులకు భద్రత కల్పించాల్సింది పోయి.. వారి గోపత్యకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. Bihar CM’s residence is surrounded by main roads from 3 sides & Leader of Opposition's residence from the fourth side. But CM felt the need for CCTV only on the wall bordering his political adversary's residence? Someone should tell him that these petty tricks will prove futile! pic.twitter.com/HISzUEW1Gr — Tejashwi Yadav (@yadavtejashwi) 15 November 2018 అలాగే నితీశ్ విలాసవంతమైన జీవితం గుడుపుతున్నాడని ఆరోపించారు. నితీశ్‌కు మూడు సీఎం నివాసాలు ఉంటే.. అందులో 2 పట్నాలో, ఒకటి ఢిల్లీలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటితో పాటు బిహార్ భవన్లో మరో విలాసంతమైన సూట్ ఉందని తెలిపారు. ఒక పేద రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత విలాసవంతమైన జీవితం అవసరమా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నైతికత నితీశ్‌కు ఉందా అని ప్రశ్నించారు. -
‘సీఎం అయినా.. పీఎం అయినా వదిలేది లేదు’
పాట్నా : కుటుంబ విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే సీఎం అయినా పీఎం అయినా క్షమించేది లేదంటున్నారు ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తేజస్వీ తొలిసారి మీడియా ముందు ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితం బిహార్‌లో ట్రైనీ మహిళా కానిస్టేబుల్ మృతికి నిరసనగా మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు ఉన్నతాధికారుల మీద, కమాండెంట్ మీద దాడి చేసిన సంగతిని రిపోర్టర్ల దగ్గర ఉటంకిస్తూ ‘నిన్న ఉదయం అంతా ఇంత ముఖ్యమైన విషయాన్ని టెలికాస్ట్ చేసిన మీడియా సాయంత్రం అయ్యే సరికి హెడ్డింగ్స్ మార్చేసింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అరే.. వీళ్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఒకవేళ ఎవరైనా మా వ్యక్తిగత విషయాల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఆఖరికి అది సీఎం అయినా సరే.. పీఎం అయినా సరే’ అంటూ హెచ్చరించారు. -
రావణుడిగా సీఎం.. రాముడిగా ప్రతిపక్షనేత
పట్నా : దసరా పండుగ సందర్భంగా బిహార్‌లో ఆర్జేడీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ రాజకీయంగా దుమారం రేపుతోంది. జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను రావణుడిగా, ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఆర్జేడీ పోస్టర్‌ను ఆవిష్కరించింది. తేజస్వీ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసిన ఈ పోస్టర్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. నితీష్ కుమార్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారని, ప్రజలకు ఆయనపై ఉన్న కోపంతోనే ఈ పోస్టర్‌ను తయారు చేశారని తేజస్వీ పేర్కొన్నారు. ఆర్జేడీ తీరుపై అధికార పక్షం తీవ్రంగా మండిపడుతోంది. సీఎం స్థాయిని దిగజార్చే విధంగా పోస్టర్ ఉందని మండిపడుతోంది. ఈ నెల 21 నుంచి తేజస్వీ నాలుగో విడత ‘‘సంవిధాన్ బచావో న్యాయ్ యాత్ర’ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే ఆర్జేడీ మద్దతుదారులు ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా దీనిపై జేడీయూ మిత్రపక్షం బీజేపీ ఇప్పటి వరకూ ఏలాంటి ప్రకటన చేయకపోగా.. కాంగ్రెస్ మాత్రం ఈ పోస్టర్‌పై భిన్నంగా స్పందించింది. రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తిని రావణుడిగా చిత్రీకరించడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. -
‘మా సోదరుల మధ్య విబేధాలున్నది నిజమే’
పాట్నా : చేతికి ఉన్న ఐదు వేళ్లు మాదిరిగానే.. కుటుంబంలోని వారంతా కూడా ఒకేలా ఉండరు. అందరి ఇళ్లలో మాదిరే తమ ఇంట్లో కూడా సోదరుల మధ్య విబేధాలు ఉన్నాయన్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి. పాట్నాలో పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మిసా ఈ సందర్భంగా తమ సోదరుల గురించి మాట్లాడారు. ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు ఉన్నట్లే తమ సోదరుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చలున్నాయన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వ సాధరణమని తెలిపారు. కానీ ఆ విబేధాలు అన్ని ఇంటికే పరిమితమని.. పార్టీ కోసం మాత్రం అందరూ కలసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో అన్నదమ్ములిద్దరు గొడవపడటం వల్ల కార్యకర్తల మీద కూడా ఆ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీలోని ప్రతి ఒక్కరు అందరిని కలుపుకుపోతూ పార్టీకోసం పని చేయాలని మిసా భారతి కోరారు. ప్రస్తుతం లాలూ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్విల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లాలూ తన కుమారులిద్దరిని గొడవలు మాని.. కలిసిమేలసి ఉండలాని, పార్టీకి కోసం పని చేయాలని సూచించినట్లు సమాచారం. -
తేజస్వీ, రబ్రీ దేవీలకు బెయిల్
న్యూఢిల్లీ : ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శనివారం రబ్రీదేవి, తేజశ్వి యాదవ్‌లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు హాజరైన నిందితులందరికీ పాటియాలా కోర్టు మధ్యంతర బెయిలిచ్చింది. నిందితులందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున ఇవాళ కోర్టు విచారణకు హాజరుకాలేదు. లాలూ ప్రస్తుతం రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ప్రయాణాలు చేయడానికి వీల్లేదని వైద్యులు స్పష్టం చేశారు. అందువల్ల లాలూను కోర్టులో హాజరుపరచలేమని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. అందుకు సమ్మతించిన కోర్టు, నవంబర్ 19న జరిగే విచారణకు లాలూ తప్పకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్సీటీసీ కుంభకోణంపై గతేడాది జూలై 5న సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రాంచి, పూరీలోని ఐఆర్సీటీసీ హోటళ్లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
‘నాకు మా నాన్న అంత విశాల హృదయం లేదు’
పాట్నా : మోదీజీ 2 కోట్ల మంది పకోడాలు వేస్తారు సరే.. మరి వాటన్నింటిని ఎవరూ తింటారు..? మీరు ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తామన్నారు. అందులో నుంచి ఓ రెండు లక్షలు ఇస్తే పకోడా బండి ప్రారంభిస్తాం.. అంటూ రాష్ట్రీయా జనతా దళ్ నేత తేజస్వీ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడిన తేజస్వీ యాదవ్ పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘ ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని వాగ్ధానం చేశారు. 2 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ఇప్పుడేమో యువతను స్వయం ఉపాధి పేరుతో పకోడాలు వేసుకోమంటున్నారు. సరే అదే చేస్తాం.. కానీ పకోడా బండి పెట్టుకోవడానికి కూడా 1 - 2 లక్షలు ఖర్చు అవుతోంది. జనాలకు ఇస్తానన్న 15లక్షల రూపాయల్లో నుంచి ఓ రెండు లక్షలు ఇస్తే పకోడా బండి పెట్టుకుంటారు’ అంటూ ఎద్దేవా చేశారు. తేజస్వీ కొనసాగిస్తూ అమిత్ షా ఇంకో 50 ఏళ్ల పాటు బీజేపీనే అధికారంలో ఉంటుంది అంటున్నారు. నాలుగేళ్లకే దేశంలో నిరంకుశత్వం పెరిగిపోయింది.. అలాంటిది బీజేపీ ఇంకోసారి గెలిస్తే రిజర్వేషన్లను కూడా తొలగిస్తుంది అంటూ ఆరోపించారు. బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న నితీష్ కుమార్‌ని ఎంతో నమ్మి ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం మా నాన్నను జైలు పాలు చేశారు. నాలుగేళ్లలో ఆయన వేర్వేరు పార్టీలను ఆశ్రయించారు. ఇప్పుడు తిరిగి ఆర్జేడీ వైపు చూస్తున్నారు. కానీ నాకు మా నాన్న అంత విశాలమైన హృదయం లేదు’ అని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ జేడీ(యూ) లో చేరడం గురించి స్పందిస్తూ అది చాలా మంచి పరిణామం అంటూ చెప్పుకోచ్చారు. -
‘నన్నెవరూ పార్టీ నుంచి తప్పించలేరు’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ కుటుంబంలో విభేదాలు చోటుచేసుకున్నాయనే వార్తలను ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఖండించారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై చర్చించడానికి మంగళవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి తేజ్ ప్రతాప్ హాజరు కాలేదు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విభేదాల కారణంగానే ఆయన సమావేశంలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ.. తేజస్వీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. తన తండ్రి ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని పేర్కొన్నారు. తమ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు తమ పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ విమర్శించారు. పార్టీలో అధికారం కోసం తేజస్వీతో పోటీ లేదని వెల్లడించారు. తన తమ్ముడు తేజస్వీని బిహార్ సీఎంగా చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఇద్దరు అన్నదమ్ములం కలిసి పనిచేస్తామని.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామని పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా తేజస్వీ, తేజ్ ప్రతాప్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు తరచు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
సూపర్ 30కి మద్దతుగా తేజస్వీ యాదవ్
పట్నా : విద్యార్థుల ఫలితాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురుకొంటున్న ప్రముఖ మ్యాథ్స్ నిపుణుడు ఆనంద్ కుమార్‌కు పలువురు ప్రముఖులు బాసటగా నిలిచారు. తొలుత బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, కుమార్‌కు మద్దతుగా నిలిచారు. ‘మూక దాడులు మరో రూపం దాల్చాయి. ఈ సారి బాధితుడు మన ‘సూపర్ 30’ హిరో కుమార్. నిజమైన మ్యాథ్స్ నిపుణుడైన కుమార్ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. అతని సేవలు బిహార్‌కు, భారత్‌కు గర్వకారణమ’ని శత్రుఘ్న సిన్హా కొనియాడారు. తాజాగా బిహార్ ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. కుమార్‌ని సోమవారం అతని ఇంట్లో కలిసిన తేజస్వీ ట్విటర్లో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘కుమార్ సమాజంలోని వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి అండగా నిలిచారు. వారి మెరుగైన భవిష్యత్ కోసం పాటుపడుతూ.. తాను కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ నియంతృత భావాలు కలిగిన ఓ వర్గం అతని పేరును చెడగొట్టేలా అసత్యాలను ప్రచారం చేస్తోంది. కుమార్‌కు గౌరవ సూచికగా.. బాలీవుడ్లో అతని బయోపిక్ తెరకెక్కుతోంద’ని పేర్కొన్నారు. పట్నా కేంద్రంగా కుమార్ ‘సూపర్ 30’ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఎటువంటి లాభం ఆశించకుండా విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. 14 ఏళ్ల కిందట కుమార్ స్థాపించిన సూపర్ 30 2010లో తొలిసారిగా వార్తలో నిలిచింది. ఆ ఏడాది ఐఐటీ-జేఈఈలో కుమార్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మొత్తం 30 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇది అంతర్జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. ఇటీవల కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సూపర్ 30కి చెందిన 26 మంది ఐఐటీ-జేఈఈకి అర్హత సాధించినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన సూపర్ 30కి చెందిన ఓ విద్యార్థి కుమార్ తప్పడు ప్రచారం చేసుకున్నట్టు ఆరోపించాడు. సూపర్ 30కి చెందిన ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఎగ్జామ్‌లో అర్హత సాధించారని, ఇతర ఇనిస్టిట్యూట్లకు చెందిన వారిని కూడా కుమార్ ఆ జాబితాలో చేర్చాడని తెలిపాడు. కాగా కుమార్ జీవితం ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. -
IRCTC కుంభకోణంలో లాలూకు షాక్
-
భారీ కుంభకోణంలో నితీశ్ కుమార్ హస్తం
పాట్నా : శ్రీజన్ కుంభకోణంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీల హస్తం ఉందంటూ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు రుజువులుగా ఆయన శ్రీజన్ బ్యాంక్ స్టేట్మెంట్లను ఆయన ట్వీట్‌కు జత చేశారు. సుశీల్ మోదీ సోదరి రేఖ, మేనకోడలు ఊర్వశి శ్రీజన్ కుంభకోణంలో కోట్ల రూపాయలను లబ్దిపొందినట్లు వెల్లడించారు. దాదాపు 2,500 కోట్ల రూపాయల కుంభకోణంలో సీబీఐ నితీశ్, సుశీల్‌లను ఎందుకు విచారించదని ప్రశ్నించారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో సుశీల్ మోదీ, తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు గుప్పించారు. దేశంలోనే ప్రముఖ స్టీల్ కంపెనీ స్టోరేజీ ఏజెంట్‌గా ఉంటూ.. ఈ విషయాన్ని 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తేజస్వీ పేర్కొనలేదన్నారు. ఆదాయాన్ని చూపకుండా పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన తేజస్వీ అసత్యాలను ప్రచారం చేయడంలో డిప్యూటీ సీఎం మాస్టర్ అని అన్నారు. సుశీల్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించి, నిరూపించాలని సవాలు విసిరారు. ఏంటీ శ్రీజన్ కుంభకోణం..? ‘శ్రీజన్’ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చే ఓకేషనల్ సంస్థ. 2004 నుంచి 2013 మధ్య కాలంలో మహిళా నైపుణ్యాభివృద్ధి కోసం కేటాయింపబడిన ప్రభుత్వ నిధులను వివిధ అకౌంట్లలోకి తరలించారు. ఇందుకు పలు బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ బీహార్‌కు చెందిన శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. -
‘ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా..?’
పట్నా : వచ్చే లోకసభ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో బీజేపీ-జేడీయూల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఫోన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బీజేపీతో పొత్తు కుదరని పక్షంలో పాత స్నేహితుడిని మచ్చిక చేసుకునేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన తండ్రికి నితీశ్ కుమార్ ఫోన్ చేయడంపై లాలూ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి నితీశ్ ఫోన్ చేశారన్నారు. ఆ అధికారం వారికి లేదు.. ‘ఇది కేవలం ఒక కర్టెసీ కాల్ మాత్రమే.. అయినా ఆయనకు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్డీయే కూటమిలో నితీశ్ ఇమడలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మహా కూటమిలోకి తిరిగి వచ్చేందుకు ద్వారాలు తెరచిలేవంటూ’ తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. ఒకవేళ నితీశ్ బీజేపీతో బంధం తెంచుకున్నట్లయితే ఆయనను మహాకూటమిలో చేర్చుకునేందుకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తేజస్వీ కొట్టిపారేశారు. కూటమిలో ఎవరిని చేర్చుకోవాలన్న విషయంపై నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం వారికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్‌లో ఉన్నానన్న తేజస్వీ.. కాంగ్రెస్- ఆర్జేడీ పొత్తు దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్ ప్రణాళికలపై తమకు అవగాహన ఉందని పేర్కొన్నారు. కాగా విలేకరులతో మాట్లాడిన అనంతరం.. ‘నాన్న ఆస్పత్రిలో చేరిన నాలుగు నెలల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరాతీయడం కోసం నితీశ్ జీ ఇప్పుడు ఫోన్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. బీజేపీ, ఎన్డీయే మంత్రుల తర్వాత నాన్నను పరామర్శించిన చివరి రాజకీయ నాయకుడు ఆయనేనని తెలుసుకున్నారేమో అందుకే ఇప్పుడు ఇలా..’ అంటూ తేజస్వీ ట్వీట్ చేశారు. Nothing but a late courtesy call to enquire abt his health as he underwent fistula operation on Sunday.Surprisingly NitishJi got to knw abt his ill health after 4months of hospitalisation.I hope he realises he is last politician to enquire following BJP/NDA Ministers visiting him https://t.co/lw7cNmXhDL — Tejashwi Yadav (@yadavtejashwi) June 26, 2018 -
రాష్ట్రంలో ఆటవికపాలన: తేజస్వీ యాదవ్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షిణించిపోయాయని, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా సీఎం మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. గయా జిల్లాలో తల్లికూతుళ్ళుపై గురువారం కొంతమంది యువకులు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని, పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్రానికిది సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో ఆటవికపాలన సాగుతోందని, ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకుని శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నా సీఎం నితీష్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా గయాలో జరిగిన ఘటన నేపథ్యంలో 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సీ రాజీవ్ మిశ్రా తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ పోలీస్ అధికారిని విధుల్లో నుంచి తొలగించినట్లు ఎస్పీ ప్రకటించారు. -
మా నాయకుడు ఓడిపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా
పాట్నా: యువనాయకుడు తేజస్వీ యాదవ్‌తో చర్చకు రావాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. తమ నాయకుడు చదువుకోలేదని విమర్శించడం కాదు.. చర్చల్లో పాల్గొని మా నాయకుడిపై మాటల్లో గెలవాలని చాలెంజ్ చేశారు. ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల్లో జోకిహాట్ అసెంబ్లీ స్థానాన్ని ఆర్జేడీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నితీశ్ కుమార్‌ను విమర్శిస్తూ తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు బదులిస్తూ జేడియూ నేత... ‘తేజస్వీ పెద్దగా చదువుకోలేదు. అందుకే సరైన భాషను ఉపయోగించలేదు. ఆయన పాఠశాల విద్యను కూడా పూర్తి చేయలేదు. కావున ఆయన నుంచి ఇంత కంటే మంచి భాషను అశించవద్దని ఎద్దేవా చేశారు’. దీనిపై స్పందించిన ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర జేడీయూ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ‘మా నాయకుడుతో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడానికి మీరు, మీ నాయకుడు నితీశ్ కుమార్ సిద్దమా. చర్చల్లో మా నాయకుడు ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాలను నుంచి తప్పుకుంటా’ అని చాలెంజ్ చేశారు. చదువు ఒక్కటే ప్రామాణికం కాదన్నారు. ప్రముఖ కవులు కాళీదాసు, తులసీదాసు కూడా పెద్దగా చదువుకోలేదని గుర్తు చేశారు. తన చాలెంజ్‌ను స్వీకరించి చర్చ వేదికను ఏర్పాటు చేయాలని జేడీయూ నేతలను కోరారు. -
మోదీకి ఛాలెంజ్ విసిరిన తేజస్వి యాదవ్
-
తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన
సాక్షి, పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కుదటపడక ముందే, ఆయన ఇష్టం లేకున్నా న్యూఢిల్లీ ఎయిమ్స్ నుంచి జార్ఖండ్ ఆస్పత్రికి ఎందుకు తరలించాలని నిర్ణయించుకున్నారని తేజస్వీ ప్రశ్నించారు. పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ వైద్యులు తీసుకున్న తొందరపాటు నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఎయిమ్స్ నుంచి లాలూను ఎందుకు డిశ్ఛార్జ్ చేయాలనుకున్నారో సంబంధిత అధికారులు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్ హాస్పిటల్‌తో పోల్చితే ఎయిమ్స్ బెస్ట్ హాస్పిటల్ అని తన తండ్రి లాలూను అక్కడే ఉంచి చికిత్స అందించాలని తేజస్వీ కోరారు. ఎయిమ్స్‌కు లాలూ లేఖ తన ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని, ఎయిమ్స్‌లోనే చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. రాంచీ హాస్పిటల్‌కు నన్ను ఇప్పుడే షిఫ్ట్ చేయవద్దు. రాంచీలో పూర్తి సౌకర్యాలు లేవు. నాకు ఎదైనా జరిగితే ఎయిమ్స్ బృందం బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ లాలూ ప్రసాద్ యాదవ్ లేఖ రాశారు. కాగా, లాలూ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాంచీ జైలు అధికారులతో చర్చించి వైద్యులు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు లాలూకు మద్దతుగా ఎయిమ్స్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు ధర్నాకు దిగి నిరసన చేపట్టారు. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. -
రైల్వే టెండర్ కేసు: లాలూకు మరో షాక్
సాక్షి, పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మరిన్ని కష్టాల్లో చిక్కుకుంది. ఇప్పటికే గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలుకు రైల్వూ టెండర్ కేసులో మరో షాక్ తగిలింది. మాజీ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పట్నాలోని ఆమె నివాసంలో మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించింది. దీంతోపాటు లాలు కుమారుడు తేజ్విని దాదాపు నాలుగు గంటలపాటు ప్రశ్నించినట్టు సమాచారం. నగరంలో దాదాపు 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వమించిన సీబీఐ కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రైల్వే హోటల్స్(ఐఆర్సీటీసీ) టెండర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ ఈ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ అనే రెండు ఐఆర్సీటీసీ హోటళ్ళను సుజాత హోటల్‌కు చట్ట విరుద్ధంగా కట్టబెట్టినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ యాజమాన్యంలో సుజాత హోటల్ నడుస్తోంది. లాలూ రైల్వేమంత్రిగా ఉన్న 2004-09 మధ్య కాలంలో ఈ హోటళ్ళను కొచ్చర్లకు కట్టబెట్టడానికి తన పదవిని దుర్వినియోగపరచినట్లు సీబీఐ ఆరోపించింది. దీంతో వినయ్ కొచ్చర్, విజయ్ కొచ్చర్ పేర్లతో పాటు ఐఆర్సీటీసీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, పీకే గోయల్, లాలు సన్నిహితులైన ప్రేమ్ చంద్ గుప్తా భార్య సరళ గుప్తా , డిలైట్మార్కెటింగ్ అధిపతి పేర్లను కూడా సీబీఐ కేసులో చేర్చింది. లాలూపై సీబీఐ ఛార్జిషీటు 2017 జూలై 7న నమోదైంది. ఈ హోటళ్ళను కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా అత్యంత విలువైన భూమిని లాలూ స్వీకరించారని తెలిపింది. డిలైట్ మార్కెటింగ్ (లారా ప్రాజెక్ట్స్) కంపెనీ అనే బినామీ కంపెనీ పేరుతో ఈ భూమిని స్వీకరించినట్లు ఆరోపించింది. కాగా దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ జైల్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
‘ఆర్ఎస్ఎస్ వల్లే అల్లర్లు’
పట్నా : బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణమని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బీహార్‌లో 14 రోజులు పర్యటించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎలా అల్లర్లు సృష్టించాలో వారి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ అల్లర్లతో భగవత్ పర్యటన ఉద్దేశం ఏమిటో ప్రజలుకు అర్థమైపోయింది’ అని పేర్కొన్నారు. కాగా, ఇక గతవారం భగల్పూర్ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్లు ఇతర నగరాలకు పాకాయి. ఈ రోజు నవడా పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు హనుమంతుడి విగ్రహం ధ్వంసం చేయడంతో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. -
మా నాన్నకు ప్రాణహాని ఉంది!
రాంచీ: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ను దాణా కుంభకోణం వెంటాడుతోంది. దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులోనూ ఆయనను దోషిగా తేల్చిన రాంచీ కోర్టు.. శనివారం లాలూకు 14 ఏళ్ల జైలుశిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధించింది. దాణా స్కాంలో లాలూకు వరుసగా జైలుశిక్షలు పడుతున్న నేపథ్యంలో ఆయన తనయుడు తేజస్వి యాదవ్ స్పందించారు. ‘మా నాన్నకు ప్రాణహాని ఉంది. ఆయన ప్రాణాలకు ముప్పుందని భయం కలుగుతోంది’ అని ఆయన శనివారం విలేకరులతో పేర్కొన్నారు. తన తండ్రికి వ్యతిరేకంగా ఎవరో కుట్ర చేసినట్టు కనిపిస్తోందని తెలిపారు. ‘బీజేపీ, (బిహార్) సీఎం నితీశ్‌కుమార్ లాలూను చూసి భయపడుతున్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావొద్దని కోరుకుంటున్నారు. లాలూ జైలు నుంచి వస్తే.. రెండోసారి ప్రధానమంత్రి కావాలన్న నరేంద్రమోదీ కల నెరవేరదన్న విషయం వారికి తెలుసు. అందుకే ఇలా చేస్తున్నారు’ అని తేజస్వి పేర్కొన్నారు. తేజస్వి వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ కొట్టిపారేశారు. జైలులో లాలూను ఎవరు కలువలేరు. అలాంటప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. -
44వేల ప్రపోజల్స్.. ఆ అమ్మాయినే చేసుకుంటా!
పట్నా: లాలూప్రసాద్ యాదవ్ రాజకీయ వారసుడు, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా రాజకీయాల్లో రాణిస్తున్న ఈ 28 ఏళ్ల యువ బ్రహ్మచారికి ఇప్పటికే 44వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయి. అయినా ఇప్పుడే పెళ్లికి తొందరేమీ లేదంటున్నారు తేజస్వి. తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని, తనది అరెంజ్డ్ మ్యారేజ్ కానుందని తెలిపారు. లాలుప్రసాద్ యాదవ్ జైలుపాలైన తర్వాత ఆర్జేడీ నడిపిస్తున్న తేజస్వి.. ఇటీవలి బిహార్ ఉప ఎన్నికల్లో ఘనవిజయాలు దక్కడంతో జోరుమీద ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవద్దని ఆయన భావిస్తున్నారు. ‘ రాజకీయాల్లో నా పెద్దన్నలైన చిరాగ్ పాశ్వాన్, నిషాంత్‌కుమార్ పెళ్లి చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను’ అని ఆయన అంటున్నారు. చిరాగ్ ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వన్ తనయుడు కాగా, నిశాంత్ జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ కొడుకు. తేజస్వి లాలు చిన్న కొడుకు అయినప్పటికీ.. లాలూ రాజకీయ వారుసుడిగా తెరపైకి వచ్చారు. లాలూ కొడుకు తేజ్ ప్రతాప్, కూతురు మిసా భారతి రాజకీయాల్లో ఉన్నప్పటికీ వారికి రాని రాజకీయ గుర్తింపు తేజస్వి సంపాదించారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా, రోడ్డు నిర్మాణ శాఖ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు వాట్సాప్‌లో 44వేల పెళ్లి ప్రతిపాదనలు రావడం అప్పట్లో హల్చల్ చేసింది. రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా.. తేజస్వి ఇంకా పెళ్లి చేసుకోకపోవడం చర్చనీయాంశం కాగా.. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘భారతీయ కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లిళ్లు నిశ్చయం చేస్తారు. నా పెళ్లి కూడా మా అమ్మనాన్నల ఇష్టప్రకారం జరుగుతుంది’ అని తేజస్వి చెప్పాడు. -
28 ఏళ్ల బచ్చాను.. నితీశ్ దుమ్ము దులిపా!
సాక్షి, పట్నా: ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ సొంతం చేసుకుంది. ఓ స్థానంలో మాత్రం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు తాను ఏం చెప్పానో గుర్తుచేసుకోవాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆర్జేడీ నేత, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల విజయాన్ని ఆస్వాదించే సమయం తన వద్ద లేదని రైతులు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడాల్సి ఉందన్నారు తేజస్వీ. తాను 28 ఏళ్ల బచ్చానని, చాచా(నితీశ్) మీరు 67 ఏళ్ల వ్యక్తి అయినా ఎన్నికల్లో సత్తా చాటి చూపిస్తానని సీఎం నితీశ్‌కు వారం రోజుల ముందే చెప్పానన్నారు తేజస్వీ. బిహార్ మాజీ సీఎం, తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన తర్వాత జరిగే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధీమాగా ఉన్నారు. కానీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నితీశ్ వెనుకంజ వేస్తున్నారని ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో బీజేపీ బిహార్ రైతులకిచ్చిన ఇచ్చిన హామీల అమలుపై పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ఎన్డీయేతర పార్టీల సీనియర్ నేతలు చర్చించుకుని 2019 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలని లాలు తనయుడు ఆకాంక్షించారు. 'ఎన్డీఏ కూటమి నుంచి నేడు టీడీపీ వైదొలగింది. నితీశ్ ఇంకా ఏం విషయం తేల్చుకోలేక పోతున్నారు. మహా కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీశ్ తప్పిదం చేశారు. టీడీపీ బాటలో పయనించి మీరు ఎన్డీఏ నుంచి ఎప్పుడు బయటకొస్తారో చెప్పాలంటూ' నితీశ్‌ను తేజస్వీ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు ఎన్డీఏ నుంచి వైదొలగే అంశంపై కామెంట్ చేసేంతే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు. -
‘అతను పప్పు కాదు’
పట్నా: బిహార్‌లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం వెనుక కనిపించని శక్తి తేజస్వీ యాదవ్‌పై ప్రశంసలుకురుస్తున్నాయి. తండ్రి లాలూ ప్రసాద్ జైలుకెళ్లిన తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లోనే ఆర్జేడీ ఘనవిజయం సాధించిన దరిమిలా.. ‘మా నాయకుడు పప్పు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడు’అంటూ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. అరారీయా , జహనాబాద్ ఉప ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్ కుమార్ సింగ్‌పై 61 వేల పైచిలుకు ఓట్ల భారీ ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం గెలుపొందారు. సర్ఫరాజ్‌కు 5,09,334 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రదీప్ కుమార్‌కు 4,47,346 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతితో ఈ అరారియాకకు ఉప ఎన్నిక జరుగగా.. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. తండ్రి తర్వాత ఆయన తనయుడే అరారియాలో (ఆర్జేడీ) ఘనవిజయం సాధించింది. ఇక జహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఆర్జేడీ గెలుచుకుంది. ఆర్జేడీ అభ్యర్థి కృష్ణమోహన్ యాదవ్ ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి, జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లో ఆర్జేడీ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు తేజస్వీపై ప్రశంసలు కురిపిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.మహాకూటమి నుంచి జేడీయూ వైదొలిగిన తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నిక ఆ పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్‌కు పరీక్షగా నిలిచాయన్న సంగతి విదితమే. -
లాలు కొడుకుపై విష ప్రయోగం?
పట్నా: నితీష్‌కుమార్ ప్రభుత్వంపై ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, బీహార్ అసెంబ్లీ విపక్ష నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేస్తున్న యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక రాష్ట్ర ప్రభుత్వం తనను చంపాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే తాను తినే ఆహారంలో విషం కలపాలని ప్రయత్నించిందన్నారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ, ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్క్యూట్ హౌస్ లలో బస చేస్తుంటానని, అక్కడ విషం కలిపే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఈ విషయం ప్రభుత్వంలో తనకున్న విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిందని తేజస్వీ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "ఫోన్ ట్యాపింగ్ తరువాత నాపై హత్యా ప్రయత్నాలు జరిగాయి. నా ర్యాలీలకు వస్తున్న ప్రజలను చూసిన ప్రభుత్వానికి భయం వేసి ఈ పని చేయాలని ప్రయత్నించింది" అని ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితమే తన ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించిన ఆయన, తన యాత్రకు వస్తున్న ప్రజా స్పందనను ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని కూడా వ్యాఖ్యానించారు. ఇక వచ్చె నెలలో బీహార్‌లో ఒక లోక్ సభ, రెండు అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వీయాదవ్ యాత్ర చేపట్టారు. ఈ ఆరోపణలపై నితీష్ ప్రభుత్వం స్పందించింది. తేజస్వీ హద్దులు దాటి మాట్లాడుతున్నారని మండిపడింది. ఉపఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. ఆర్జేడీ,జేడియూ,కాంగ్రెస్‌ల కూటమితో ఏర్పడిన ప్రభుత్వం చీలిపోయిన విషయం తెలిసిందే. ఉపముఖ్యమంత్రిగా తేజస్వీయాదవ్పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాదే సీఎం నితీష్ కుమార్ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జతకట్టారు. -
వాళ్లతో ఉంటే.. మా నాన్న సత్య హరిశ్చంద్రుడే!
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం.. సీబీఐ కోర్టు తీర్పుపై బీహాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలుకు పంపించి.. లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజకీయంగా సమాధి చేశామని అనుకుంటే.. అది వారి మూర్ఖత్వమేనని తేజస్వి యాదవ్ అన్నారు. తప్పుడు ఆలోచనలు చేస్తున్న బీజేపీ, ఇతర పార్టీలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని ఆయన అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరికొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సీబీఐ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల అనంతరం.. తేజస్వి యాదవ్ స్పందించడం గమనార్హం. లాలూ ప్రసాద్ యాదవ్‌ను జైలుకు పంపిస్తే.. ఆయన పని అయిపోతుందని బీజేపీ, ఇతర పార్టీలు అనుకోవడం మూర్ఖత్వానికి నిదర్శనం అని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ లాలూప్రసాద్ యాదవ్ బీజేపీతో కలిసుంటే.. వారికి మా నాన్న రాజా హరిశ్చంద్రుడిలా కనిపించేవారని అన్నారు. సీబీఐ కోర్టు తీర్పులో కుట్ర దాగుందని అయన అనుమానాం వ్యక్తం చేశారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో తగిన న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని తేజస్వి యాదవ్ వ్యక్తం చేశారు. -
రాహుల్ విందు రాజకీయాలు
-
తేజస్వీ విజ్ఞప్తికి మళ్లీ నో చెప్పిన నితీష్
సాక్షి, పట్నా : రెండు వారాల్లో రెండుసార్లు తిరస్కరణలు.. సావధానంగా విన్నప్పటికీ చివరకు మాత్రం కుదరదు అనే సమాధానం. కాస్త సానుభూతిగా చూస్తూనే తప్పదంటూ స్పష్టీకరణ.. ఇది రెండు వారాలుగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎదుర్కొన్న అనుభవం. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నితీష్‌కు పక్కనే ఉన్న ప్రభుత్వ భవనాన్ని(పలాటియల్ బంగళా) కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తేజస్వీకి అధికారం దూరంకావడం బీజేపీ సహాయంతో నితీష్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం వంటి కారణాలతో ఆ భవనాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ మోదీకి అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను ఆ భవనం నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ తేజస్వీకి ప్రభుత్వం నోటీసులు పంపించింది. అయితే, ఆ భవనాన్ని తాను ఎంతో ఇష్టపడ్డానని, ప్రేమతో అలంకరించుకొని పునరుద్ధరణ కూడా చేయించుకున్నానని చెప్పారు. రెండుసార్లు ఆయన తనకు ఆ భవనాన్ని ఉంచాలని ప్రాధేయపడినప్పటికీ ఇచ్చేందుకు మాత్రం నితీష్ నిరాకరించారు. వీలయినంత త్వరలోనే దానిని ఖాళీ చేసి వెళ్లాలని చెప్పారు. 'ప్రభుత్వ భవనాలపై ఎవరూ వ్యక్తిగతంగా మోజును పెంచుకోవద్దు. ఈ రోజు నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాను. అది నాకు శాశ్వతం కాదు' అని ఆయన తేజస్వీని ఉద్దేశించి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
కేబినెట్ విస్తరణపై తేజస్వీ విసుర్లు
పట్నా: కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. కేబినెట్ పునర్వ్యస్థీకరణ వృధాప్రయాస అని వ్యాఖ్యానించారు. డ్రైవర్ అసమర్ధుడైనప్పుడు వాహనానికి ఎన్ని హంగులున్నా సరిగా నడపలేరంటూ ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శించారు. ‘బండి ఇంజిన్, టైర్లు, క్లచ్, బ్రేకు మార్చినా లేదా కొత్త వాహనం సరిగా నడపాలన్నా డ్రైవర్ సమర్థుడై ఉండాలి. చోదకుడిగా సరైన వ్యక్తి లేకుంటే ఎన్ని హంగులున్నా వాహనం నడవద’ని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీలకు ప్రధాని ఝలక్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ వ్యతిరేకించే బిహార్ ఎంపీలు రాజ్‌కుమార్ సింగ్, అశ్వినీ చౌబేలకు మంత్రి పదవులిచ్చి నితీశ్-సుశీల్ వర్గానికి ప్రధాని మోదీ గట్టి సందేశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ఇచ్చిన షాకు నుంచి నితీశ్ త్వరగా తేరుకోవాలని తేజస్వీ యాదవ్ అన్నారు. -
బిహార్‌లో బాహుబలి హల్చల్
- తేజస్వీకి మద్దతుగా అభిమానుల పోస్టర్లు - శ్రీజన్ స్కాంలో సీబీఐ తీరుపై లాలూ గుస్సా పట్నా: బిహార్ రాజధాని నగరంలో బాహుబలి పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను బాహుబలిగా అభివర్ణిస్తూ ఆయన అభిమానులు పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారు. సీఎం నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి తప్పుకుని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎపిసొడ్ తర్వాత నుంచి తేజస్వీ తన కార్యక్రమాలను ఉధృతం చేశారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న శ్రీజన్ స్కాం విషయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతోన్న ఉద్యమాలకు ఆయనే నేతృత్వ వహిస్తున్నారు. శ్రీజన్పై సీబీఐ డ్రామాలు: పూర్తిగా జేడీయూ, బీజేపీ నాయకులే నిందితులుగా ఉన్న రూ.900 కోట్ల విలువైన శ్రీజన్ స్కాం దర్యాప్తులో కేంద్ర సంస్థ సీబీఐ తీరును ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుపట్టారు. బుధవారం పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ కేసులో ఇప్పటిదాకా సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టనేలేదు. దీనివెనుక పెద్ద కుట్రనాటకం దాగుందని నా అనుమానం’’ అని లాలూ అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడి అరెస్ట్: భగల్పూర్లో వెలుగుచూసిన శ్రీజన్ స్కాంను దర్యాప్తు చేస్తోన్న సిట్.. మంగళవారం బీజేపీ కిసాన్ మోర్ఛా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిపిన్ శర్మ, ఆర్ఎల్ఎస్పీ జిల్లా అధ్యక్షుడు దీపక్ వర్మాలను అదుపులోకి తీసుకుంది. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. ఏమిటీ శ్రీజన్ కుంభకోణం?: ముఖ్యమంత్రి నగర్ వికాస్ యోజన పథకం కింద వివిధ జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ అయిఉన్న ప్రభుత్వ సొమ్మును.. భగల్పూర్ జిల్లాలోని శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి అనే ఎన్జీవోకు తరలించారు. ఈ ఎన్జీవో మహిళలకు ఉపాధి, వృత్తి కోర్సుల ట్రైనింగ్ ఇచ్చేంది. ఇటీవలే సొంత బ్యాంకు ఏర్పాటుచేసుకునేందుకుగానూ ఆర్బీఐకి దరఖాస్తూ కూడా చేసింది. మొత్తం రూ.900 కోట్ల ప్రభుత్వ నిధులు ప్రైవేటు సంస్థకు వెళ్లిన వ్యవహారంలో జేడీయూ, బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణఅయింది. సిట్.. ఈ కేసును పరిశీలిస్తుండగా, ఇటీవలే దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. -
రాహుల్‌కు తేజస్వి సలహా!
పట్నా: బలపరీక్షలో సునాయసంగా విజయం సాధించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. నితీశ్ తమను మోసం చేశారని, ఆయన ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. అదేసమయంలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తేజస్వి ఓ సలహా ఇచ్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి.. ఒక వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు. 'రాహుల్‌గాంధీ బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయన ఈ సవాలును స్వీకరించాలి. గతంలో ఢిల్లీలో ఆయనను కలిసినప్పుడు నేను ఈ మాట చెప్పాను. ఆయన చేయగలరు. ఆయనకు ఆ సమర్థత ఉంది. ఆయన ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాలి'అని తేజస్వి అన్నారు. గతంలో నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన మహాఘట్బంధన్ కూటమిలో జేడీయూ, ఆర్జేడీతోపాటు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితీశ్‌కుమార్ ఈ కూటమిని వీడి బీజేపీతో దోస్తీ చేయడంతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి సాగాలని భావిస్తున్నాయి. -
నితీశ్ ఆ విషయం మరిచారు: తేజస్వీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించారు. అనంతరం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నిర్ణయాన్ని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే గౌరవించకపోవడం వారిని కించపరచడమేనని, ప్రజాస్వామ్యానికి నితీశ్ తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన మహాకూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) నే గెలిపించారు తప్ప.. నితీశ్‌ను కాదని అభిప్రాయపడ్డారు. సీఎం నితీశ్‌కు రానున్న రోజుల్లో బిహార్ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తన ప్రశ్నలకే సమాధానం చెప్పిన నితీశ్ ప్రభుత్వం ఇక ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని బదులిస్తారని తేజస్వీ ప్రశ్నించారు. నితీశ్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా 1995లో ఏడు సీట్లు, 2014లో రెండు సీట్లు వచ్చాయని, 2015 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను మాత్రం మహాకూటమి బలంతోనే ఎదురించిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. అయితే నితీశ్ మాత్రం ప్రజలు తననే సీఎం చేశారని భ్రమ పడుతున్నారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. 243 సీట్లున్న బిహార్‌లో సాధారణ మేజార్టీ 122 సీట్లు కాగా, అసెంబ్లీలో నేడు జరిగిన విశ్వాసపరీక్షలో నితీశ్ ప్రభుత్వానికి అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 108 ఓట్లు పోలయ్యాయి. దీంతో జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తేలిపోయింది. -
‘ఇప్పటికీ అంకులే.. కానీ చాలా దెబ్బకొట్టారు’
పట్నా: తనను రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అస్సలే అడగలేదని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. తాను లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నానని, ఆ విషయమే నితీశ్‌తో చెప్పానని అన్నారు. తనకు ఇప్పుడు 22 ఏళ్లేనని కానీ, తనకు ఎలాంటి భయం లేదని చెప్పారు. శుక్రవారం బిహార్ అసెంబ్లీలో నితీశ్ కుమార్ బలపరీక్ష సందర్భంగా ఆయన తేజస్వీ మీడియాతో మాట్లాడారు. సుశీల్‌కుమార్ మోదీ కూడా పలు కేసులు ఎదుర్కొంటున్నారని, ఆయనను ఎలా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనిచ్చారని మండిపడ్డారు. నరేంద్రమోదీ అంత వేగంగా ట్వీట్ ఎలా చేయగలిగారని నిలదీశారు. నితీశ్ ఇప్పటికీ తనకు అంకుల్‌ల్లాంటివారేనని కానీ దెబ్బకొట్టారని మండిపడ్డారు. నిజంగా ఆయన తనను రాజీనామా చేయాలని అడిగి ఉంటే ఆలోచించేవాడినని తెలిపారు. తమకే ఎక్కువ మెజార్టీ ఉన్నా నితీశ్‌నే ముఖ్యమంత్రిని చేశామని, త్యాగం చేశామని చెప్పారు. ’మహాత్మాగాంధీని హత్య చేసిన వారితో చేతులు కలుపుతున్నారని నితీశ్‌పై బిహార్ అసెంబ్లీలో పలువురు అనుకుంటున్నారు. ఆయన హేరామ్ నుంచి జైశ్రీరామ్‌కు మారిపోయారు. నేను దళితులకు, మైనారిటీలకోసం పనిచేశాను. ఇంకా నేనేం చేయాలి. ప్రతి రాష్ట్రాన్ని బీజేపీ పరిపాలిస్తుందని అమిత్‌షా అంటే నితిష్ మాత్రం సంఘ్ విముక్తి భారత్ అని అన్నారు. ఆయన చేసే పోరాటంలో నేను కూడా నితీశ్‌తో ఉన్నాను.. కానీ, ఆ విషయం మరిచిపోయారు. బిహార్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ మాకు సహాయం చేయలేదు. లాలూపై కేసులు పెడుతున్న విషయం నితీశ్‌కు తెలియదని చెప్పడం అబద్ధం. ముందే నితీశ్ ప్రణాళిక రచించుకొని బీజేపీలోకి వెళ్లారు. నన్ను ఒక పావులాగా వాడుకున్నారు. బిహార్ అసెంబ్లీలో ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్న నితీశ్, సుశీల్ ఇప్పుడు కలిసిపోయారు. ఇది చూసి వారు సిగ్గు పడాలి. నితీశ్‌కు నన్ను తొలగించే దమ్ము లేదు. బీజేపీ పేరాశగల పార్టీ. నితీశ్ ఒంటరిగా పోరాడిన 1995లో ఏడు సీట్లు వచ్చాయి. 2014లో రెండు సీట్లు వచ్చాయి. అప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడికి వెళ్లింది. నాలుగేళ్లలో నాలుగు ప్రభుత్వాలు మారాయి. ఎవరు దీనికి బాధ్యత? ప్రజలకు సమాధానం చెప్పాలి. 2015లో బీజేపీకి వ్యతిరేకంగా ఐదేళ్లకోసం చేసుకున్న నిర్ణయానికి నితీశ్ దెబ్బకొట్టారు’ అని తేజస్వీ నిప్పులు చెరిగారు. -
‘ఆయనను ముఖ్యమంత్రి చేసింది మేమే’
పట్నా: తన కుమారుడిని రాజీనామా చేయాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అడలేదని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌పై వేటు వేసేందుకు నితీశ్ సిద్ధమవుతున్నారని వచ్చిన వార్తలపై లాలూ స్పందించారు. తాము మహాకూటమిగా ఏర్పడి నితీశ్ కుమార్‌ను ముఖ్యమంత్రిని చేశామని, తామే కూటమిని ముక్కలు చేస్తామా అని లాలూ ప్రశ్నించారు. నితీశ్ కుమార్ మహాకూటమి నాయకుడని, ఆయనను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదవ్ తెలిపారు. మహాకూటమిని విడగొట్టాలని ఆర్ఎస్ఎస్-బీజేపీ కోరుకుంటున్నాయని, వీరి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారని, ఇందులో భాగంగానే మహాకూటమిని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ బిహారి కాదని, బయటి నాయకుడని విమర్శించారు. బిహార్ ప్రజలు, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తేజశ్వి యాదవ్‌ను పదవి నుంచి తప్పించాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీ(యూ) కీలక నిర్ణయం తీసుకోనుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. -
'నితీష్ ఇంత ఇబ్బంది జీవితంలో చూడలేదు'
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూటమి రెండుగా చీలే సమయం దగ్గరపడిందా? బిహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయా? అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది కాస్త తారాస్థాయికి వెళ్లింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌పై సమావేశాలకు ప్రారంభం ముందే ఆయన వేటు వేస్తారా.. లేక సర్దుబాటు చర్యలకు దిగుతారా అని తీవ్ర స్థాయిలో రాజకీయ చర్చ జరుగుతోంది. మీడియాలో మాత్రం ఆయన సమావేశాలకు ముందే తేజస్వీపై చర్యలు తీసుకుంటారని చర్చ నడుస్తోంది. ఎందుకంటే బుధవారం నితీశ్, లాలూ పార్టీలు వేర్వేరుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలకు పిలుపునిచ్చాయి. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఆందోళన మొదలుపెడితే తేజస్వీని రక్షించే విషయంలో నితీష్ సంకోచిస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటి వరకు అవినీతి విషయంలో ఏ మాత్రం రాజీ పడరని పేరున్న నితీష్ తాజా విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారని చెబుతున్నారు. అయితే, ఏదీ ఏమైనా తన మొత్తం రాజకీయ జీవితంలోనే ఇలాంటి పరిస్థితిని నితీష్ ఎప్పుడూ ఎదుర్కోలేదని జేడీయూ సెక్రటరీ జనరల్ కేసీ త్యాగి చెప్పారు. -
రగులుతున్న జ్వాల.. డిప్యూటీ సీఎం డుమ్మా!
పట్నా: బిహార్‌లోని మహాకూటమి సంకీర్ణ సర్కారులో అసమ్మతిజ్వాల ఎగిసిపడుతోంది. అధికార కూటమి మిత్రపక్షాలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజస్వి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీఎం నితీశ్ కోరుతుండగా.. అందుకు లాలూ ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో పట్నాలో సీఎం నితీశ్‌కుమార్ పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం తేజస్వి పాల్గొనాల్సి ఉండగా.. ఆయన డుమ్మా కొట్టారు. నితీశ్‌తోపాటు తేజస్వి కూడా ఈ కార్యక్రమంలో వేదిక పంచుకోవాల్సి ఉంది. ఆయన రాకపోవడంతో ఆయన నేమ్‌ప్లేట్‌ను మొదట కనపడకుండా కవర్ చేసిన అధికారులు.. ఆ తర్వాత తొలగించారు. ఇక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో లాలూ కుటుంబం తమ ఆస్తుల వివరాలు, ఆదాయమార్గాలను వెల్లడించాలని సీఎం నితీశ్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రంలోగా ఈ వివరాలు వెల్లడించాలని జేడీయూ డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో ఈ విషయంలో లాలూ కుటుంబంపై ఒత్తిడి పెరుగుతోంది. జేడీయూ డిమాండ్‌పై సాయంత్రంలోగా లాలూ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. -
తేజస్విపై వేటు:.. లాలూ గేమ్‌ప్లాన్ ఇదే!
ఆర్జేడీ మంత్రుల మూకుమ్మడి రాజీనామాలు నితీశ్ సర్కారు పడిపోకుండా బయటినుంచి సపోర్ట్ పట్నా: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తేజస్వి పదవి నుంచి దిగిపోవాల్సిందేనని సీఎం నితీశ్‌కుమార్ ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తనకు తానుగా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని, సీఎం నితీశ్‌కుమార్ వేటు వేసేవరకు వేచి చూడాలని తేజస్వి భావిస్తున్నారని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. తేజస్విపై వేటు వేసిన మరుక్షణమే నితీశ్ కేబినెట్లోని ఆర్జేడీ మంత్రులు సైతం మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని, అయినా, సంకీర్ణ ప్రభుత్వానికి బయటనుంచి తమ మద్దతును కొనసాగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ కేసు నేపథ్యంలో తేజస్వి రాజీనామా చేస్తే.. లాలూ కుటుంబం ఏదో తప్పుచేసిందన్న భావన పార్టీ శ్రేణుల్లోకి వెళుతుందని, ఇది పార్టీ కేడర్‌ను నైతికంగా దెబ్బతీసే అవకాశముందని, అందుకే తేజస్వి రాజీనామా చేయొద్దని లాలూ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే, పార్టీ గేమ్ ప్లాన్ ప్రకారం.. తేజస్వి నితీశ్ కేబినెట్ నుంచి తొలగించిన మరుక్షణమే.. 11మంది ఆర్జేడీ మంత్రులు సైతం కేబినెట్ నుంచి తప్పుకుంటారని, అయినా, మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వం పడిపోకుండా ఆర్జేడీ బయటి నుంచి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. -
డిప్యూటీ సీఎం ముందే మీడియా సిబ్బందిపై..
పట్నా: ఉప ముఖ్యమంత్రి సాక్షిగా మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఆయన వ్యక్తిగత సిబ్బంది ముక్కుమొహం చూడకుండా మీడియా ప్రతినిధులపై పిడిగుద్దులు కుప్పించారు. ఈ ఘటన పట్నాలోని బిహార్ సెక్రటేరియట్ వద్ద చోటు చేసుకుంది. బిహార్‌లో అధికార జేడీయూకు మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల మీద సీబీఐ అవినీతి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. లాలూ కొడుకు అయిన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రజలకు నిజాలు చెప్పాలనీ, కేసులపై వివరణ ఇవ్వాలని జేడీయూ మంగళవారం డిమాండ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో బిహార్‌లో రోజురోజుకు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. తేజస్వి నుంచి రాజీనామాను కోరకపోయినా, దాదాపు అదే స్థాయిలో జేడీయూ స్పందించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం తేజస్వీ యాదవ్ కోసం సెక్రటేరియట్ వద్ద మీడియా ప్రతినిధులు ఎదురుచూస్తూ ఆయన బయటకు వచ్చే సమయంలో ప్రశ్నించేందుకు యత్నించగా ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులపట్ల దురుసుగా ప్రవర్తించింది. వారిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లి దాడులు చేసింది. దీనిపై పలు మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ముందే ఇది జరుగుతున్నా ఆయన పట్టించుకోకుండా ఉండటంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
14 ఏళ్లకే క్రిమినల్‌ను చేశారు: డిప్యూటీ సీఎం
న్యూఢిల్లీ: తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, నమోదైన సీబీఐ కేసులపై ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తొలిసారిగా స్పందించారు. 14 ఏళ్లకే తాను క్రిమినల్‌గా మారినట్లు బీజేపీ ఎలా భావించిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మూతిపై మీసం కూడా రాని వయసులో క్రిమినల్‌గా మారినట్లు కేసుల ద్వారా తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై నమోదైన సీబీఐ కేసు గురించి మాట్లాడుతూ.. 2004-2009 సమయంలో తండ్రి లాలు ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు హోటల్ టెండర్లను దౌర్జన్యంగా సొంతం చేసుకున్నట్లు చిత్రీకరించారని మండిపడ్డారు. 2004లో సరిగ్గా 15 ఏళ్లు కూడా లేవని, 14 ఏళ్లకే టెండర్లు వేసి అవినీతికి పాల్పడటం సాధ్యమవుతుందా అని తేజస్వి ప్రశ్నించారు. బాలుడిగా ఉన్నప్పుడే లాలు తనయుడు అవినీతికి పాల్పడ్డాడని తనపై దుష్ప్రచారం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని కేసులు నమోదవుతున్న తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని లాలు తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే బీజేపీ అధిష్టానం కుట్ర పన్నిందని.. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసు జారీచేసింది. -
సీఎం నితీశ్‌కు లాలూ షాక్!
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మిత్రపక్ష నేత లాలూప్రసాద్ యాదవ్ షాక్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్ నాలుగురోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న నితీశ్ అల్టిమేటంను లాలూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ల్యాండ్ ఫర్ హోటల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నాలుగురోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్ అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. లాలూ, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లాలూ తొలిసారి 'ఇండియా టుడే'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. ' హోటల్ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్. క్రికెట్ ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు. -
తేజస్వి యాదవ్‌కు జేడీయూ డెడ్‌లైన్
పట్నా: బిహార్ సంకీర్ణ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతోంది. ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వియాదవ్‌కు జేడీయూ మరో నాలుగురోజులు డెడ్‌లైన్ విధించింది. కాగా నీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామాకు ససేమిరా అనడంతో... నితీష్ సర్కార్ ఇరుకుపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజస్వి రాజీనామా అంశంతో పాటు, భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు జేడీయూ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఈ కీలక సమావేశంలో ఆర్జేడీతో తెగదెంపులు విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవినీతిని సహించేది లేదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తేజస్వి యాదవ్ రాజీనామాపై మరికొద్ది రోజులు వేచి చూడాలని జేడీయూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భేటీ అనంతరం ఆ పార్టీ నేత రామై రామ్ మాట్లాడుతూ... ఈ అంశంపై మరో నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా బిహార్‌లోని మహాకూటమి ప్రభుత్వంలో ఆర్జేడీ కీలక భాగస్వామి. జేడీయూ కంటే ఎక్కువ సీట్లు ఆర్జేడీకే ఉన్నాయి. నితీష్ సర్కార్‌కు అవసరం అయితే బయటినుంచి మద్దతిచ్చేందుకు సిద్ధమని బీజేపీ నిన్న సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో జేడీయూ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
డిప్యూటీ సీఎం రాజీనామా చేయరు: ఆర్జేడీ
పట్నా: బిహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాజీనామా వార్తలపై ఆర్జేడీ ఎట్టకేలకు స్పందించింది. డిప్యూటీ సీఎం పదవికి ఆయన రాజీనామా చేసేది లేదని ఆ పార్టీ సోమవారమిక్కడ స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్ మంచి నేత అని, ఆయన తీరు భేషుగ్గా ఉందని పేర్కొంది. సీబీఐ దాడులు రాజకీయ కుట్ర అని, అయితే రాష్ట్రంలో తమ కూటమి బలంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ తన నివాసంలో ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సీబీఐ కేసులు తదితర అంశాలపై ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరిపారు. ఈ కీలక సమావేశం అనంతరం తేజస్వీ యాదవ్ పదవికి రాజీనామా చేయరని ఆ పార్టీ వెల్లడించింది. మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా తేజస్వి యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. తేజస్వి తప్పు చేయలేదని, ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. కాగా అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి తేజస్వి యాదవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌తో సీఎం నితీశ్ కుమార్ కూడా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో తేజస్వి యాదవ్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి ఎలా తప్పించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ తాజా ప్రకటనపై నితీశ్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేడీయూ నేతలు మంగళవారం సమావేశం కానున్నారు. ఈ భేటీలో తేజస్వి యాదవ్ భవితవ్యం తేలనుంది. ఇక లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో శుక్రవారం లాలూ ప్రసాద్ ఇంటిపై సీబీఐ కొరడా ఝళిపించింది. ఆయన నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులు బీజేపీ కుట్ర అని లాలూ ప్రసాద్ ఆరోపణలు చేశారు. -
'వారి జీవితమంతా కూల్చివేతలే'
పట్నా: బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ మండిపడ్డారు. జితన్ రామ్ మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్ రాజకీయ జీవితమంతా ప్రభుత్వాల కూల్చివేతలకే కేటాయించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా వీరిద్దరూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తమ రాజకీయ జీవితం పునరుద్ధరణకు ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని, బిహార్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో బలవంతంగా రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జేడీ(యూ)-ఆర్జేడీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, బిహార్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాంఝీ, పాశ్వాన్ అంతకుముందు డిమాండ్ చేశారు. -
క్రికెటర్ గా విఫలమైనా..
పట్నా: తేజస్వి యాదవ్.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ , రబ్రీదేవిల చిన్న కుమారుడు. అతనికి క్రికెట్ ఆటగాడిగా ఎదగాలని కోరిక. ఆ రకంగా ప్రయత్నాలు కూడా చేశాడు. కాగా, తేజస్వినీ యాదవ్ క్రికెటర్ గా సక్సెస్ కాలేదు. జార్ఖండ్ తరపున ఒకే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన తేజస్వీ, నాలుగు ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడాడు. అయితే అటు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లోనూ, ఇటు ట్వంటీ 20 ల్లో కూడా తేజస్వి పూర్తిగా విఫలమయ్యాడు. 2008, 2009, 2011, 2012 సంవత్సరాల్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో తేజస్వికి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో స్థానం దక్కినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఐపీఎల్లో తేజస్వి ప్రాతినిథ్యం వహించకపోయినా.. కనీసం తన కొడుక్కి ఆటగాళ్లకు వాటర్ అందించే అవకాశం అయినా వచ్చిందని లాలూ సంతోష పడేవాడు. కుడి చేత వాటం బ్యాట్స్ మెన్ అయిన తేజస్వి క్రికెట్ కెరీర్ లో అత్యధిక స్కోరు 19. కాగా బౌలింగ్ లో అతని బెస్ట్ 1/10. తన క్రికెట్ కెరీర్ పెద్దగా ఆకట్టుకోవడంతో తేజస్వి క్రికెట్ ఆటకు దూరం కాక తప్పలేదు. ఇదే సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేయాలని భావించాడు. అందుకు తండ్రికి అనుమతినివ్వడంతో క్రికెట్ ను వదలి రాజకీయ ప్రస్తానానికి నాంది పలికాడు. ఈ క్రమంలోనే ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటి చేసి గెలుపొందాడు. తాజాగా మంత్రి పదవిని కూడా చేజిక్కించుకున్నాడు. ఇంకా మూడు పదుల వయసు కూడా దాటని తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ చలవతో రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యాడు. క్రికెటర్ గా తండ్రి అంచనాలను అందుకోని తేజస్వి.. రాజకీయంగా వేసిన తొలి అడుగులోనే ఘన విజయాన్ని అందుకున్నాడు.