
రాహుల్‌కు తేజస్వి సలహా!
పట్నా: బలపరీక్షలో సునాయసంగా విజయం సాధించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. నితీశ్ తమను మోసం చేశారని, ఆయన ఇప్పటికిప్పుడు ఎన్నికలకు ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. అదేసమయంలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తేజస్వి ఓ సలహా ఇచ్చారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి.. ఒక వేదికను ఏర్పాటు చేయాలని సూచించారు.
'రాహుల్‌గాంధీ బాధ్యతాయుతమైన వ్యక్తి. ఆయన ఈ సవాలును స్వీకరించాలి. గతంలో ఢిల్లీలో ఆయనను కలిసినప్పుడు నేను ఈ మాట చెప్పాను. ఆయన చేయగలరు. ఆయనకు ఆ సమర్థత ఉంది. ఆయన ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాలి'అని తేజస్వి అన్నారు. గతంలో నితీశ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన మహాఘట్బంధన్ కూటమిలో జేడీయూ, ఆర్జేడీతోపాటు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితీశ్‌కుమార్ ఈ కూటమిని వీడి బీజేపీతో దోస్తీ చేయడంతో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి సాగాలని భావిస్తున్నాయి.