
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జేడీయూ ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ‘నేను గొప్ప అంటే నేను గొప్పు’ అనే రీతిలో వీరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. అటు అసెంబ్లీ మొదలుకొని ఇటు మీడియా ముందు కూడా వీరి ఎక్కడా తగ్గడం లేదు.
ఈ రోజు(ఆదివారం) జరిగిన ప్రెస్ మీట్ లో సైతం ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తనదైన శైలిలో రెచ్చిపోయారు. ‘ మీరు నితీష్ ను మీ పాలిటికల్ క్యాంప్ లోకి తీసుకునేందుకు ఏదో ఆఫర్ చేశారంట కదా’ అంటూ తేజస్వీ యాదవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అంతే స్ట్రాంగ్ బదులిచ్చిన తేజస్వీ యాదవ్.. ‘ అదంతా నాన్సెస్. అయినా మీకు ఇటువంటి ఐడియాలు ఎవరిస్తారు. మేముందుకు ఆయన్ను ఆహ్వానిస్తాం. ఆఫర్, గీఫర్ ఏం లేదు. అటువంటి నాన్సెస్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ నుంచి ఎవరికైనా ఆఫర్ చేస్తే.. అది నేను కానీ, మా తండ్రి(లాలూ ప్రసాద్ యాదవ్) లు మాత్రమే చేస్తాం. మేం ఎవరికీ ఎటువంటి ఆఫర్ చేయలేదు’ అని బదులిచ్చారు తేజస్వీ యాదవ్.
2015 ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీశ్ సారథ్యంలో జేడీ(యూ) 71 సీట్లు మాత్రమే గెల్చుకుంది. అయితే మహాఘట్‌బంధన్ కూటమిలో భాగంగా.. ముఖ్యమంత్రి పదవిని ఆర్జేడీ త్యాగం చేసింది. 2022లో బీజేపీకి కటీఫ్ చెప్పి మళ్లీ మహాఘట్‌బంధన్‌లో చేరి.. సీఎం పదవిని చేపట్టారు. ఈ రెండు సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. అయితే ఈ బంధం ఏడాదిపాటే కొనసాగింది. 2024లో తిరిగి బీజేపీతో నితీశ్ జట్టు కట్టారు.
Comments
Please login to add a commentAdd a comment