బీహార్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గైర్హాజరవుతున్నారు. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాని మోడీ గయా, పూర్ణియాలో చేపట్టిన ర్యాలీలకు జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ హాజరుకాకపోవడాన్ని తేజస్వీ యాదవ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. సీఎం నితీష్ కుమార్‌జీ మీరెక్కడా? ఎన్నికల ర్యాలీలకు బీజేపీ ఆయనను ఎందుకు ఆహ్వానించడం లేదు? మంగళవారం జరిగిన ప్రధాని మోదీ ర్యాలీలో కూడా ఆయన ఎందుకు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగానికి సంబంధించి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని చేసిన ఆరోపణలపై తేజస్వీ యాదవ్ స్పందించారు. మోదీ మూడవసారి అధికారంలోకి రాగానే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కమలం నేతలే చెబుతున్నారు. వారిపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు.
ధరల పెరుగుదల, యువతకు ఉపాధి కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, నల్లధనాన్ని భారతదేశానికి వెనక్కి తీసుకురావడం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు? అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నొక్కాణించారు.
Comments
Please login to add a commentAdd a comment