
2024 ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సంబరాలు నిర్వహించింది. ఈ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
మోదీ మాట్లాడుతూ దేశం గర్వించేలా ఎన్నికల్ని నిర్వహించిన ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. సబ్‌కా సాత్ సబ్ కా వికాస్ మంత్రం గెలిచింది. మూడసారి అధికారంలోకి రాబోతున్నామన్న మోదీ.. ఈ విజయం 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఎన్డీఏ కూటమిలోని కార్యకర్తలకు అభినందనలు. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమని ప్రశంసలు కురిపించారు.
అరుణాల్ ప్రదేశ్, సిక్కింలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. ఒడిశాలో కూడా అద్భుత ప్రదర్శన చేశాం. మూడో సారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. మధ్య ప్రదేశ్, గుజరాత్, ఛత్తీగడ్,ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో బీజేపీ క్లీన్ స్వీప్. కేరళలో తొలిసారి బీజేపీ ఒకసీటు గెలిచింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి గెలిచిందని మోదీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment