బీహార్ సీఎం నితిష్ కుమార్ మౌనం వీడారు. ఎన్డీయే కూటమి వెంటే నడుస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో క్రితం బీజేపీ కూటమిలో చేరడం కంటే చావే మేలంటూ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విడుదలైన 542 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే (బీజేపీ) కూటమి 240 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా (కాంగ్రెస్) కూటమి 243 స్థానాల్లో విజయం సాధించింది. అయితే తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ఇరు పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అందుకే ఎన్డీయే,ఇండియా కూటమిలు ఇరు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పావులు కదిపాయి.
ఎన్డీయే కూటమికి కటిఫ్ అంటూ
ఈ తరుణంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి నితీష్ కుమార్.. ఇండియా కూటమికి మద్దతు పలికే తేజస్వీతో కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ ప్రయాణంతో నితీష్ కుమార్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారని, ఎన్డీయే కూటమికి గుడ్‌బాయ్ చెప్పనున్నారంటూ జాతీయ మీడియా సంస్థలు కథనాలను వండి వార్చాయి.
మీ వెంటే నేనుంటా
అయితే నితీష్ కుమార్ మాత్రం తాజా ఎన్డీఏ సమావేశంలో మీ వెంటే నేనుంటా నంటూ మోదీకి మద్దతు పలికారు. ప్రతిపక్షాలు ఏ అభివృద్ధి పని చేయదు అంటూనే, తాను అన్ని వేళలా ప్రధానమంత్రి మోదీతోనే ఉంటానని అని అన్నారు.
బీజేపీతో పొత్తంటే.. చావే శరణ్యం
అంతవరకు బాగానే కూటముల్ని మార్చడంలో పేరున్న నితిష్ కుమార్ గతంలో బీజేపీ కూటమికి కటిఫ్ చెప్పి.. కాంగ్రెస్ చెంతన చేరారు. ఆ సమయంలో నితిష్ మాట్లాడుతూ.. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకోను. అలా పెట్టుకోవడం కంటే చావే శరణ్యం. 2017లో కమలంతో పొత్తు పెట్టుకునే పెద్ద తప్పే చేశాను అని వ్యాఖ్యానించారు. తాజా బీజేపీ కూటమికి మద్దతు పలకడంతో నాడు నితిష్ చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment