పాట్నా : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం ఆర్జేడీ నేతృత్వంలో బీహార్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. అంతకు కొన్ని గంటల ముందు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ‘నేను హిందువుని, భారతీయుడిని, రాజ్యాంగం పట్ల విధేయత కలవాడిని, దేశలోని పేదలు, రైతుల పక్షాన ఉంటాను. వారి కోసం సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నా’నంటూ రాసి ఉన్న పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. అనంతరం పాట్నా వీధుల్లో జాతీయ జెండా పట్టుకొని తనతో ఏకీభవించేవారు బంద్‌కు సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కాగా, దాణా కుంభకోణంలో శిక్షపడి జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతవారం సీఏఏకు వ్యతిరేకంగా తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment