protest rally
-
నమ్మకం కోల్పోయాం.. దీదీపై బాధిత కుటుంబం ఆగ్రహం
కోల్‌కతా: అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. తమ కుమార్తె హత్య పట్ల మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.మమతవైఖరిని బాధితురాలి తల్లి సైతం తప్పుపట్టారు. వైద్యుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కాగా, హత్యకు గురైన వైద్యురాలి పేరు, గుర్తింపును బయటపెట్టడంతోపాటు ఈ ఘటనపై ప్రజల్లో వదంతులు వ్యాప్తి చేసినందుకు బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతోపాటు మరో ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. -
మణిపూర్‌లో ‘కుకీ’ల కొత్త డిమాండ్.. బీజేపీ నిర్ణయమేంటి?
ఇంఫాల్: మణిపూర్‌లో కొండ ప్రాంతాలతో కూడిన పలు జిల్లాల్లో సోమావారం కుకీ జో తెగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన రాల్యీలు చేపట్టాయి. మణిపూర్‌లో తెగల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ముగింపు పలికి.. తామను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కుకీ తెగ ప్రజలు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో తరచూ చెలరేగుతున్న జాతుల మధ్య ఘర్షణలకు పరిష్కారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏ ప్రకారం తమకు అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కుకీ తెగ ప్రజలు పెద్దఎత్తున చురచంద్‌పూర్, కాంగ్పోక్పి, చందేల్, ఫెర్జాల్-జిరిబామ్, తెంగ్నౌపాల్ పర్వత జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన మంత్రి మణిపూర్ సందర్శించి.. తాము ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను చూసి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్‌ను వేగవంతం చేయాలని కోరుతూ.. కుకీ జో తెగ సంఘాలు జిల్లా అధికారుల ద్వారా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మెమోరాండం సమరర్పించినట్లు తెలిపారు. చురచంద్‌పూర్ జిల్లా బీజేపీ ఎమ్యెల్యే పౌలియన్‌లాల్ హాకిప్ మీడియాతో మాట్లాడారు. ‘ కుకీ జో ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలవాలని ఏడాది క్రితం విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటికీ మాకు అనుమతి లభించలేదు. ఇక.. ఇప్పడు ప్రధాని మోదీ మా తెగల ఘర్షణకు పరిష్కారం చూపాలనుకుంటే ఇక్కడికే( మణిపూర్) రావాలి’అని అన్నారు. వీరికి వ్యతిరేకంగా ఇంఫాల్ వ్యాలీలో మైతేయి తెగకు సంబంధించిన మహిళా సంఘాలు మార్చ్ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం కుకీ మిలిటెంట్లకు మద్దతుగా ఉండొద్దని.. ‘ప్రత్యేక పరిపాలన వద్దు. గ్రామ వాలంటీర్ల అరెస్టు చేయొద్దు’ అనే నినాదాలతో భారీ సంఖ్యలో మహిళలు డిమాండ్ చేశారు. ఇక.. మే 3, 2023 నుంచి మణిపూర్‌లోని వ్యాలీ ప్రాంతాల్లో నివసించే మైతేయి తెగ, పర్వత ప్రాంతాల్లో ఉండే కుకీ జో తెగల మధ్య అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అల్లర్లతో ఇరు తెగల మధ్య తీవ్రమైన హింస చెలరేగటంతో 220 మంది మృతి చెందారు. ఈ ఘర్షణల్లో వేలమంది గాయపడ్డారు. ఘర్షణలు తట్టుకోలేక వేలమంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. -
మహా వికాస్ అఘాడీ భారీ నిరసన ర్యాలీ
ముంబై: ఏక్నాథ్ షిండే– బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రపాలనను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ (మహా వికాస్ అఘాడీ–ఎంవీఏ) కూటమి ఆధ్వర్యంలో ముంబైలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహరాజ్, మహా త్మా ఫూలే వంటి మహనీయులను మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ అవమానించడాన్ని ఎంవీఏ కూటమి తీవ్రంగా తప్పబట్టింది. కోష్యారీని గవర్నర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని కూటమి అగ్రనేతలు డిమాండ్చే శారు. ముంబైలోని బైకుల్లాలో ప్రారంభమైన ‘హల్లా బోల్’ నిరసన ర్యాలీ.. నాలుగు కిలో మీటర్లు కొనసాగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ వద్దకు చేరుకున్నాక ఉద్ధవ్ ఠాక్రేసహా కూటమి నేతలు ర్యాలీ వేదికపై ప్రసంగించారు. ‘ గవర్నర్‌ను పదవి నుంచి వెంటనే తప్పించాలి. లేదంటే మీకు గుణపాఠం నేర్పిస్తాం’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ హెచ్చరించారు. -
జనగామలో తీవ్ర ఉద్రిక్తత.. కర్రలతో కొట్టుకున్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు
సాక్షి, జనగామ: ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. జనగామలో టీఆర్ఎస్ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నిరసన ఆందోళనకు దిగి ఘర్షణపడ్డారు. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. తోపులాట, ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అటు హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చదవండి: కోడిపుంజుకు టికెట్.. స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
-
విశాఖ స్టీల్ ప్లాంట్: కొనసాగుతున్న భారీ నిరసన ర్యాలీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరాయి. వేలాదిమంది కార్మికులు నిరసన ర్యాలీలో భాగంగా కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరాయి. కార్మికుల దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పలువురి అభిప్రాయాలు అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి: సీపీఎం నర్సింగరావు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సొంతంగా గనులు కేటాయించాలని , సీపీఎం నర్సింగరావు డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు: గఫూర్ స్టీల్‌ప్లాంట్ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీఐటీయూ నేత గఫూర్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ మూర్ఖంగా పాలిస్తున్నారని, ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోంది: అయోధ్యరామ్ స్టీల్‌ప్లాంట్ రూ.వేలకోట్ల పన్నులు కడుతుంటే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటని స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. సీఎం జగన్ లేఖలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని, అసలు హోదా లేదు, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోందన్నారు. ►ప్రజల ఆకంక్ష మేరకు ప్రధాని మోదీ నడుచుకోవాలని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప కోరారు -
ట్రంప్ మద్దతుదారుల హింసాకాండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేలాది మంది ఆయన మద్దతుదారులు, అభిమానులు వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ శివార్లలో మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) మార్చ్ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు. మరో నాలుగేళ్లు ట్రంప్, ఎన్నికల దొంగతనం ఆపండి అంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. జో బైడెన్ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించడం లేదు. శనివారం ట్రంప్ మద్దతుదారులు ఫ్రీడం ప్లాజా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించారు. రాత్రి దాకా శాంతియుతంగానే ఉన్నప్పటికీ తర్వాత సహనం కోల్పోయారు. బైడెన్ మద్దతుదారులతో ఘర్షణకు దిగారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ట్రంప్ అభిమానుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన అతడిని వెనుకనుంచి కత్తితో పొడిచారు. అధికారులు యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ అభిమానుల దాడిలో మరో ఇద్దరు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. ట్రంప్, బైడెన్ మద్దతుదారులు కొన్ని నిమిషాలపాటు ఒకరినొకరు కొట్టుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైడెన్ అభిమానులు సైతం ట్రంప్ మద్దతుదారులపై కోడిగుడ్లు విసిరినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారు దహనం చేసినట్లు తెలిపింది. ట్రంప్, బైడెన్ వర్గీయుల ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీసు విభాగం వెల్లడించింది. తనకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలను మీడియా తొక్కిపెడుతోందని, ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓటమిని ఒప్పుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచారని చెప్పారు. తద్వారా తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ విజయం సాధించారని ట్రంప్ ఆక్షేపించారు. ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో మాత్రమే బైడెన్ అధ్యక్షుడిగా నెగ్గాడని ఎద్దేవా చేశారు. చెడ్డ పేరున్న రాడికల్ లెఫ్ట్ కంపెనీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి పరిశీలకులను అనుమతించలేదని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను డెమొక్రాట్లు చోరీ చేశారని మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. బైడెన్ 306.. ట్రంప్ 232 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు కూడా వచ్చాయి. జార్జియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలస్కాలో విజయంతో ఇప్పటికే ట్రంప్ 217 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ కరోలినాలో గెలుపుతో తన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను 232కి పెంచుకున్నారు. ఇప్పటికే మేజిక్ మార్క్ 270ని సునాయాసంగా దాటేసిన బైడెన్.. తాజాగా జార్జియాలో గెలుపుతో 306 ఎలక్టోరల్ ఓట్లతో వైట్‌హౌజ్‌లోకి వెళ్లనున్నారు. జార్జియాలో బైడెన్, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందారని అమెరికాలో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జార్జియాలో గెలుపుతో బైడెన్ మరో రికార్డు సాధించారు. గత 28 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జార్జియాను డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో వేశారు. గత 28 ఏళ్లుగా అక్కడ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపొందలేదు. -
ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం!
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ అధికారులను బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియ బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. బీజేపీ శుక్రవారం నిర్వహిస్తున ర్యాలీ సందర్భంగా కైలాశ్ అధికారులను ఉద్దేశించి.. ‘మా సంఘ్(ఆరెస్సెస్) నేతలు ఉన్నారు కాబట్టి ఊరుకున్నాం. లేదంటే ఈ రోజు ఇండోర్‌ను తగలబెట్టేవాళ్లం’ అని బెదిరిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. సంస్థ అంతర్గత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఇతర నేతలు ఇండోర్‌కు వచ్చారు. పార్టీ కార్యకర్తలపై అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులను ఆహ్వానిస్తే.. జూనియర్ అధికారు లు రావడంపై కైలాశ్ ఆగ్రహం చెందారు. -
‘మోదీ సర్కారు లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుంది’
సాక్షి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. శుక్రవారం విజయవాడలో జింఖానా గ్రౌండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. అధికార అండతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. బీజేపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 8వ తేదీన బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన కోరారు. -
రండి.. బీజేపీని ఏకాకి చేద్దాం
న్యూఢిల్లీ/చెన్నై/పురులియా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు తెలుపుతున్న వారు జాతి వ్యతిరేకులంటూ ముద్ర వేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బెంగాల్ సీఎం మమత ఆరోపించారు. కాషాయ పార్టీని ఏకాకిని చేసేందుకు కలిసి రావాలని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలకు ఆమె పిలుపునిచ్చారు. సీఏఏకి వ్యతిరేకంగా సోమవారం పురులియాలో చేపట్టిన 5 కిలోమీటర్ల నిరసన ర్యాలీలో మమత ప్రసంగించారు. సీఏఏతోపాటు జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను కూడా రాష్ట్రంలో అమలు కానివ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. సీఏఏపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఓటరు జాబితాలో మీరంతా పేర్లు నమోదు చేయించుకోండి. ఆ తర్వాత వ్యవహారం నేను చూసుకుంటా’అని మమత అభయమిచ్చారు. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేసి, అరెస్టయిన వారికి సంఘీభావం తెలుపుతూ డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇల్లు, దివంగత కరుణానిధి ఇంటి వద్ద సంప్రదాయ ముగ్గులు వేశారు. సీఏఏ వద్దంటూ శనివారం చెన్నైలోని బీసెంట్ నగర్లో ముగ్గులు వేసినందుకు గాను ఐదుగురు మహిళలు సహా 8 మందిని పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ డీఎంకే నేతల నివాసాల వద్ద సోమవారం సీఏఏ వ్యతిరేక నినాదాలతో ముగ్గులు వేశారు. బాధిత కుటుంబాలకు సాయపడండి సీఏఏ వ్యతిరేక అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని పరామర్శించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులను కోరారు. శనివారం అస్సాం పర్యటన సందర్భంగా ఇద్దరు మృతుల కుటుంబాలను పరామర్శించినట్లు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో బాధిత కుటుంబాలను కలిసి, పరామర్శించిన విషయం తెలిసిందే. -
నాకు మద్దతివ్వండి : తేజస్వీ యాదవ్
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం ఆర్జేడీ నేతృత్వంలో బీహార్ బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. అంతకు కొన్ని గంటల ముందు ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ‘నేను హిందువుని, భారతీయుడిని, రాజ్యాంగం పట్ల విధేయత కలవాడిని, దేశలోని పేదలు, రైతుల పక్షాన ఉంటాను. వారి కోసం సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తున్నా’నంటూ రాసి ఉన్న పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. అనంతరం పాట్నా వీధుల్లో జాతీయ జెండా పట్టుకొని తనతో ఏకీభవించేవారు బంద్‌కు సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. కాగా, దాణా కుంభకోణంలో శిక్షపడి జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గతవారం సీఏఏకు వ్యతిరేకంగా తన సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. -
టీఆర్ఎస్ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు
సాక్షి, భీమ్‌గల్(నిజామాబాద్): భీమ్‌గల్ మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాల నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మాజీ వార్డు సభ్యుడు కలీం హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం, మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. భూ తగాదాలతో హత్యకు గురైన భీమ్‌గల్‌కు చెందిన కలీం సోమవారం మండలంలోని బాబాపూర్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా మంగళవారం రోజంతా భీమ్‌గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలీం మృతదేహానికి సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతని వర్గం వారు హంతకులను కఠినంగా శిక్షించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని నిర్ణయించారు. మంగళవారం భీమ్‌గల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో యువకులు పెద్ద సంఖ్యలో బైకులపై ర్యాలీ చేపట్టారు. మృతదేహంతో ఆందోళన.. ఉదయం 10 గంటల సమయంలో కలీం మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. మృతదేహాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొందరు యువకులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లగా, పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు పంపించారు. హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్, మంత్రి రావాలని, అప్పటిదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మైనారిటీ నాయకులతో అధికారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆందోళన విరమించి అంతిమ యాత్ర నిర్వహించారు. తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన ముస్లిం మహిళలు ప్రశాంతంగా బంద్ కలీం హత్యకు నిరసనగా చేపట్టిన భీమ్‌గల్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బస్సులు, ఆటోలు నడువలేదు. భారీ బందోబస్తు.. సోమవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అడిషనల్ ఎస్పీ భాస్కర్, ఆర్మూర్, నిజామాబాద్ ఏసీపీలు రఘు, శ్రీనివాస్‌కుమార్, ఎస్బీ ఏసీపీ శ్రీనివాస్‌రావ్, స్థానిక సీఐ సైదయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తుకు తరలి వచ్చారు. ప్రత్యేక బలగాలను దింపి పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు. పరామర్శించిన మాజీ మంత్రి కలీం హత్య వార్త తెలిసి మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి భీమ్‌గల్‌కు వచ్చారు. కలీం మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌గౌడ్ తదితరులు కలీం కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి -
ఇమ్రాన్‌ను వెంటాడుతున్న భారీ ర్యాలీ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనపై వ్యతిరేకత రోజురోజుకూ తీవ్ర తరమవుతోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణలతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌కు.. స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి నిరసనగా ఇమ్రాన్ ప్రధాని పదవికి వెంటనే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇమ్రాన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జమైత్ ఉలేమా ఇస్లామ్ చీఫ్ ఫజలర్ రెహ్మాన్ ‘ఆజాద్ మార్చ్’ పేరుతో భారీ నిరసన ర్యాలీని ప్రారంభించారు. అక్టోబర్ 27న కరాచీలో ప్రారంభమైన ఈ ర్యాలీ శనివారం నాటికి దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరింది. పాక్‌లోని ప్రధాన పార్టీలైన పాకిస్తాన్ ముస్లింలీగ్, పాక్ పీపుల్స్ పార్టీ, అవామీ నేషనల్ పార్టీతో పాటు పలు సంఘాలూ ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించాయి. అయితే రెండు రోజుల క్రితమే ఇస్లామాబాద్‌కు చేరాల్సిన ఈ ర్యాలీ.. ప్రజల నుంచి అనుకోని మద్దతు రావడంతో కొంత ఆలస్యమైనట్లు నిర్వహకులు తెలిపారు. ఇమ్రాన్ పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఈ సందర్భంగా నేతలు విమర్శించారు. తక్షణమే ఇమ్రాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఫజలర్ రెహ్మాన్ డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న ఇమ్రాన్.. తాజాగా విపక్షాల ర్యాలీతో మరన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదులకు నిధులు మంజూరు చేస్తున్నారని పలు అంతర్జాతీయ సంస్థలు సైతం పాక్‌ను నిధుల విడుదలను ఆపాయి. దీంతో సరిపడ నిధులు లేక ఇమ్రాన్ ప్రభుత్వం అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్ రోజురోజుకూ మరింత బలపడుతోంది. తాజాగా చేపట్టిన ఆజాద్ మార్చ్ ఇమ్రాన్‌కు ముచ్చమటలు పటిస్తోంది. -
ఉద్యోగాల కోసం యువత భారీ ర్యాలీ..
-
జాబ్స్ కోసం యువత భారీ ర్యాలీ..
హౌరా : పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న ఉపాధి సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వామపక్ష, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో యువత హౌరా వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ హౌరా జిల్లాలోని బెంగాల్ సచివాలయం వరకూ ఈ ప్రదర్శనను 12 వామపక్ష, విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్నాయి. హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో గురువారం ప్రారంభమైన ర్యాలీ తాజాగా హౌరాలో అడుగుపెట్టింది. నిరసనకారులు నబన్న (బెంగాల్ సెక్రటేరియట్)వైపు దారితీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లతోవారిని అడ్డుకుంటున్నారు. నియంత్రణలను ఉల్లంఘించి దూసుకొస్తున్న యువతపై ఖాకీలు లాఠీచార్జి చేస్తూ ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. -
కొనసాగుతున్న శబరిమల నిరసనలు
తిరువనంతపురం/ముంబై: అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కోచిలో భారీ ర్యాలీ తీశారు. మహారాష్ట్రలోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిళల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమా, కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోచిలోని శివాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన భక్తులు..అయ్యప్ప స్వామి ఫొటోల ప్లకార్డులను పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. ముంబై, థానే, నవీ ముంబైలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆజాద్ మైదాన్‌లో నిరసన ర్యాలీ తెలిపారు. శబరిమల ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ‘లాంగ్‌మార్చ్’ శనివారం కొల్లామ్ జిల్లాలోకి ప్రవేశించింది. ‘తృప్తి సవాల్ విసరడానికే శబరిమల వస్తున్నారు తప్ప భక్తురాలిగా కాదు. ఉద్రిక్తతలను సృష్టించ వద్దని ఆమెను కోరుతున్నా’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై అన్నారు. -
‘భారత్ బంద్’ పాక్షికం
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. కార్యాల యాలు, విద్యాసంస్థలు మూతపడటం, వాహనాలు తిరగకపోవడంతో కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడగా.. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో బంద్ ప్రభావం అసలు కనిపించ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టగా.. రాంలీలా మైదాన్ వద్ద నిరసన ర్యాలీలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ నిప్పులు చెరిగారు. బంద్ విజయవంతమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకోగా.. విఫలమైందని బీజేపీ పేర్కొంది. చెదురుమదురు ఘటనలు బిహార్ రాజధాని పట్నాలో కొన్ని చోట్ల ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టైర్లు మండించి రైలు సర్వీసులకు అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకో వడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతా ల్లో బస్సుల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటులో జాప్యం వల్ల జెహనా బాద్ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మరణించిందని బీజేపీ ఆరోపించింది. ఒడిశాలో రైల్వే ట్రాక్‌లపై కాంగ్రెస్ కార్యకర్తల బైఠాయింపుతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించ డంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కేరళలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బస్సులతో పాటు ఆటోరిక్షాలు కూడా తిరగకపోవడంతో రోడ్లనీ ఖాళీగా దర్శనమి చ్చాయి. కర్ణాటకలో బంద్ ప్రభావం పూర్తిగా కనిపించింది. బెంగళూరులో వ్యాపార సంస్థ లు, దుకాణాలు, మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంగళూరులో తెరచి ఉంచిన దుకాణాలు, హోటల్స్‌పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్, ఎస్పీ కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను అడ్డుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు రోజువారీ కార్యక లాపాల్ని యథావిధిగా కొనసాగిం చాయి. ప్రయాణికుల నిరసనతో జాదవ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు ధర్నాను ఉపసం హరించుకున్నారు. తమిళనాడులో బంద్ ప్రభా వం నామమాత్రంగా కనిపించింది. ఢిల్లీలో కార్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు యథావిధిగా తెరచుకున్నాయి. అయితే ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో పాటు పలువురు లెఫ్ట్ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ కారణాలతోనే : కేంద్రం అంతర్జాతీయ అంశాల ప్రభావంతోనే పెట్రో ధరలు పెరిగాయని, భారత్ బంద్ పేరిట ప్రతిపక్షాలు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించాయని బీజేపీ ఆరోపించింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజల తాత్కాలిక ఇబ్బంది తమకు తెలుసని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా మని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్ల బంద్ పిలుపును తిప్పికొట్టారని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలు ధర రూ. 39 నుంచి రూ. 71కి పెరిగిందని ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాల్సిన తరుణమిది: మన్మోహన్ న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ వ్యవస్థను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి కలిసి సాగాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఉద్ఘాటించారు. పెట్రో ధరల పెంపునకు నిరనసగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్‌లో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానం వద్ద నిర్వహించిన ర్యాలీలో కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు దేశ ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సమాజంలోని యువత, రైతులు, సామాన్య ప్రజలు ఇలా అందరూ మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. పార్టీలు చిన్నచిన్న విభేదాల్ని పక్కనపెట్టి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధమైనప్పుడే అది సాధ్యం’ అని పేర్కొన్నారు. మోదీజీ.. ధరలపై మౌనం వీడండి: రాహుల్ ప్రధాని మోదీ పాలనలో దేశంలో విభేదాలు పెచ్చరిల్లుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రతిపక్షాల ఐక్య కూటమి ఓడించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ర్యాలీలో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెరుగుదల, రాఫెల్ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్ ప్రశ్నించారు. ‘70 ఏళ్లలో జరగనిది ఈ నాలుగేళ్లలో చేశామని మోదీ చెబుతున్నారు. అది నిజమే. ఎక్కడ చూసినా ఒకరితో మరొకరు గొడవలు పడుతున్నారు. ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించారు. అదే వారు సాధించింది’ అని తప్పుపట్టారు. ఈ ర్యాలీలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పట్నాలో బస్సు అద్దాల ధ్వంసం; ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు -
యాదవుల నిరసన ర్యాలీ
ఏలూరు (వన్‌టౌన్) : టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడం దారుణమని, అది పూర్తిగా అసత్యమని యాదవ సంఘం నేతలు స్పష్టం చేశారు. సుధాకర్‌యాదవ్‌పై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు యాదవులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నగర యాదవ సంఘం కన్వీనర్ మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు ఊక్కుసూరి గోపాలకృష్ణ, మల్లిపూడి రాజు, కీలరపు జగదీష్, కీలారు బుజ్జి, తలారి గోపి యాదవ, పిలకల ప్రకాశరావు పాల్గొన్నారు. -
29న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిస్థితులు, సమాజంలో అసహనం, ఆందోళనలపై ఢిల్లీలో ఈ నెల 29న నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ఎన్డీఏ నాలుగేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. వీటికి నిరసనగా రామ్‌లీలా మైదాన్ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని దెబ్బతీసిందని పార్టీ అధ్యక్షుడు రాహుల్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. -
జేఎన్‌యూలో అధ్యాపకుడి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్న అతుల్ జోహ్రి అనే అధ్యాపకుడిని పోలీసులు రక్షిస్తున్నారంటూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ వరకు సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. జోహ్రి తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఎనిమిది మంది విద్యార్థినులు ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల అనంతరం కూడా పోలీసులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారనీ, కనీసం ఆయనను విచారించలేదని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థినుల ఫిర్యాదులపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని 54 మంది అధ్యాపకులు కూడా పోలీసులను డిమాండ్ చేశారు. -
నేరెళ్ల బాధితులు నిమ్స్‌కు తరలింపు
బాధితులకు అండగా ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్: నేరెళ్లలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితులను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్స్‌కు తరలించారు. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్జెల కాతం ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బుధవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆరుగురు బాధితులను మాజీ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ నాయకులు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లు నిమ్స్ అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీగా నేరెళ్ల ఘటనలో బాధితులకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వేతనాలు పెరగలేదు..తగ్గాయి
► కొత్త విధానంతో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని నష్టం ► తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకున్నప్పటికీ, వాస్తవానికి వారి వేతనాలు తగ్గాయని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీకి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు బలయ్యారని యూనియన్ అధ్యక్షులు వి.కుమారస్వామి, ప్రధాన కార్య దర్శి ఎస్.వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కె.సత్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైస్కిల్డ్ కార్మికుడికి రూ.23 వేలు, స్కిల్డ్ కార్మికుడికి రూ.19 వేలు, సెమీస్కిల్డ్ కార్మికుడికి రూ.16 వేలు, అన్‌స్కిల్డ్ కార్మికుడికి రూ.14 వేల వేతనం ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారని, అయితే, ఈ నాలుగు కేటగిరీల కార్మికులకు వాస్తవానికి వచ్చేది వరుసగా రూ.16,676, రూ.13,774, రూ.11,705, రూ.10,241ల వేతనం మాత్ర మేనన్నారు. విద్యుత్ సంస్థల యాజమాన్యా లు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్‌ఐల వాటాలనూ కార్మికుల వేతనాల నుంచి కోతపెట్టి చెల్లించే విధంగా కొత్త విధానాన్ని రూపొందిం చడంతో కార్మికుల చేతికి వచ్చే వేతనాలు భారీగా తగ్గిపోయాయన్నారు. గతంలో చేసే పనిని బట్టి స్కిల్డ్ వేతనం పొందిన అనేక మంది తక్కువ చదువుకున్న కార్మికులు, చదువులేని కార్మికులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్టిజన్–4 కేటగిరీలోకి వెళ్లారన్నా రు. దీంతో రూ.15,870 వేతనం పొందు తున్న సీబీడీ గ్యాంగ్ వర్కర్లు, రూ.12,722 వేతనం పొందుతున్న చదువులేని స్కిల్డ్ వర్కర్ల వేతనం రూ.10,241కు తగ్గిపోయిం దన్నారు. పే రివిజన్ సందర్భంగా సంపాదిం చుకున్న 12 శాతం స్పెషల్ అలవెన్స్, జెన్కో లో డక్ట్ అలవెన్స్, షిఫ్టు అలవెన్స్‌లూ పోయా యన్నారు. విద్యుత్ కార్మికులకు వేతనాల చెల్లింపుల్లో జరుగుతున్న అన్యాయానికి నిర సనగా సెప్టెంబర్ 6న డిమాండ్ బ్యాడ్జీలు ధరించాలని, 12న టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని, 19న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. -
మరాఠాలను కదిలించిన రేప్..
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని సమయాల్లో మౌనం, ప్రపంచాన్ని వణికించే ప్రళయ ఘోష కన్నా భీకరంగా ఉంటుంది. అలాంటిదే మరాఠాలు బుధవారం నిర్వహించిన మహా మౌన యాత్ర. మూడు లక్షల మంది మరాఠాలు పశ్చిమ మహారాష్ట్రలోని రహదారుల్లో కదం తొక్కినా ముప్పై వేల మంది నిర్వహించే యాత్ర సందర్భంగా ఉండే అరుపులు, కేకలు లేవు. రణ నినాదాలు అంతకన్నా లేవు. ఈ ర్యాలీకి మరో విశేషణమూ ఉంది. దీన్ని ఏ రాజకీయ పార్టీ ముందస్తు ఏర్పాట్లతో నిర్వహించలేదు. ఏ రాజకీయ పార్టీ మరాఠీలను సమీకరించలేదు. ఎవరికి వారు అక్కడి స్థానిక నేతల పిలుపు మేరకు మరాఠాలంతా స్వచ్ఛందంగా ర్యాలీకి తరలివచ్చారు. అందుకే ర్యాలీలో పాల్గొన్నవారెవరూ తాము ఫలానా పార్టీకి చెందిన వారమని చెప్పడానికీ లేదా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పాలకపక్ష బీజేపీ మినహా అన్ని ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు ఈ ర్యాలీలో విశేషంగా పాల్గొన్నారు. మహారాష్ట్ర బీజేపీ నాయకుడు ఆశిష్ శెల్వార్ తన కార్యకర్తలతో కలసి ర్యాలీలో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నాన్ని మరాఠాలు అడ్డుకున్నారు. మరాఠాల ర్యాలీకి మద్దతుగా ఒక్కరోజు ముందు, అంటే మంగళవారం శివసేన వేసిన పోస్టర్లను తొలగించారు. ప్రత్యక్షంగా ఏ పార్టీ నాయకత్వం లేనందునే మహార్యాలీలో మూడు లక్షల మంది మరాఠాలు పాల్గొన్నట్లు ఉన్నారు. గత ఏదాది కాలంలో రాష్ట్రంలో మరాఠాలు 58 ర్యాలీలు నిర్వహించినా రాని జనం ఈసారి కదలి వచ్చారు. మరాఠాల డిమాండ్లపై గతంలో ఎన్నడూ దిగిరాని బీజేపీ ప్రభుత్వం ‘ఏక్ మరాఠా లాక్ మరాఠా, ఏక్ మరాఠా కోటి మరాఠా’ అంటూ సాగిన ఈ ర్యాలీకి కొంత మేరకైనా దిగిరాక తప్పలేదు. గత సెప్టెంబర్‌లో మరాఠా క్రాంతి మోర్చా, ఈ ఏడాది జూలై నెలలో కిసాన్ క్రాంతి మోర్చా పేరిట నిర్వహించిన ర్యాలీలకన్నా ఈనాటి ర్యాలీకి స్పందన ఎక్కువొచ్చింది. ఉద్యోగాలు, విద్యావకాశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించడం, వ్యవసాయ సంస్కరణలు తీసుకరావడమే మరాఠాలు నిర్వహించిన అనేక ర్యాలీల వెనకనున్న అసలు అంశం. సమాజంలో పాలకులు, రణరంగ యోధులు, భూస్వాములుగా చెలామణి అవుతూవచ్చి జీవన చిత్రంలో కొంత చితికిపోయిన మరాఠీలు గతేడాది హఠాత్తుగా ఒకే వేదికపైకి వచ్చి ఏకం కావడానికి ఓ దురదృష్టకరమైన సంఘటన దారితీసింది. అదే సంచలనం సష్టించిన ‘కోపర్డి రేప్’ కేసు. అహ్మదనగర్ జిల్లాలోని కోపర్డి గ్రామంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల మరాఠా బాలికపై దారుణంగా అత్యాచారం జరిగింది. ఆమె ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ సంఘటనలో కాళ్లూ చేతులపై పలు చోట్ల ఎముకలు విరగడమే కాకుండా రెండు భుజాల గూడలు కిందకు జారిపోయాయి. ఈ కేసులో ముగ్గురు దళిత యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మరాఠీలు ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే మొదటిసారిగా పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. నిందితులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నడూ లేని విధంగా వేలాది మంది మహిళలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముగ్గురు దళిత యువకులు చేసిన దారుణానికి మొత్తం దళితుల రిజర్వేషన్లనే ప్రశ్నించాలన్న ఉద్దేశంతో తమకూ ఉద్యోగాల్లో, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ నినాదం అప్పుడే అందుకున్నారు. ఆ తర్వాత ఈ డిమాండ్ల సాధన దిశగా పలు ఆందోళనలు నిర్వహించారు. ఆ తర్వాత వ్యవసాయ సంస్కరణల తీసుకరావాలనే డిమాండ్‌ను తీసుకొచ్చారు. మహారాష్ట్రలో మరాఠాలు తీవ్ర అసంతప్తి, అసహనానంతో ఉండడానికి వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడమే కారణమని కొంతకాలంగా సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. వ్యవసాయ రుణాలను ఎత్తివేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గత జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కిసాన్ క్రాంతి మోర్చా ర్యాలీలో మరాఠీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుధవారం జరిగిన ర్యాలీలో కూడా ప్రజలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీని విమర్శించడానికి కారణం కూడా వ్యవసాయం పట్ల ఆ ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్యమే కారణం. వ్యవసాయోత్పత్తులకయ్యే ఖర్చుకన్నా యాభై శాతం ఆదాయాన్ని గిట్టుబాటుగా ఇప్పిస్తానని ప్రధాని మోదీ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ర్యాలీలో పాల్గొన్న పలువురు రైతులు ఆరోపించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదని విదర్భ ప్రాంత రైతులు విమర్శించారు. రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉందంటూ సాకులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లుగా ఎందుకు రిజాయిండర్ దాఖలు చేయలేదని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. రేప్ కేసును త్వరగా విచారించి దోషులను ఉరితీయాలంటూ అహ్మద్ ప్రాంతానికి చెందిన ఆందోళనకారులు కోరారు. ...ఇలా మరాఠాలు తమకూ సామాజిక న్యాయం కావాలంటూ ఏకమయ్యారు. -
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబయి: డిమాండ్ల సాధన కోసం ముంబయిలో మహాప్రదర్శన చేపట్టిన మరాఠాలను సంతృప్తి పరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వారికి వరాల జల్లు కురిపించింది. ఓబీసీలకు కల్పించే విద్యా రాయితీలను మరాఠాలకూ వర్తింపచేయనున్నట్టు మహా సర్కార్ స్పష్టం చేసింది. మరాఠా విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణం కోసం ప్రతి జిల్లాలో స్థలం కేటాయించడంతో పాటు రూ 5 కోట్ల నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఉద్యోగాల్లో కోటా అంశాన్ని పరిశీలించేందుకు బీసీ కమిషన్‌కు నివేదిస్తామని తెలిపింది. మరాఠా మోర్చా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు. ఉద్యోగ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు, రైతు రుణ మాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కోరుతూ మరాఠాలు కొంత కాలంగా ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ర్యాలీలు నిర్వహించిన మరాఠా మోర్చా ముంబయిలో బుధవారం నిర్వహించిన ప్రదర్శనకు 10 లక్షల మందికి పైగా మరాఠాలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి హామీలతో మరాఠాలు తమ ఆందోళన విరమించారు. -
ముంబయిలో స్తంభించిన జనజీవనం
ముంబయి: ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు నిర్వహించిన మౌన ప్రదర్శనతో ముంబయి మహానగరంలో జనజీవనం స్తంభించింది. రెండు లక్షల మందికి పైగా నిరసనకారులు ప్రదర్శనలో పాల్గొనడంతో సిటీలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కాషాయ జెండాలు చేతబూనిన యువత, సీనియర్ సిటిజన్లు పెద్దసంఖ్యలో శాంతియుత నిరసనలో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. ప్రదర్శన నేపథ్యంలో పదివేల మందికి పైగా పోలీసులు మోహరించారు. మరాఠా సంఘాలు గత ఏడాది నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 57 ప్రదర్శనలకు ముగింపుగా ముంబయిలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉద్యోగులకు, విద్యార్థులకు నిత్యం లంచ్ బాక్స్‌లు అందించే డబ్బావాలాలు సైతం విధులకు గైర్హాజరు కావడంతో ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటాతో పాటు, రైతుల రుణమాఫీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను డిమాండ్ చేస్తూ మరాఠాలు నిరసనబాట పట్టారు.