నిరుద్యోగ నిరసన ర్యాలీ నుంచి ప్రభుత్వ వికృతరూపం క్ర మంగా బయటపడుతోందని టీజేఏసీ గురువారం విమర్శించింది.
తెలంగాణ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ నిరసన ర్యాలీ నుంచి ప్రభుత్వ వికృతరూపం క్రమంగా బయటపడుతోందని టీజేఏసీ గురువారం విమర్శించింది. ర్యాలీని అడ్డు కోవాలని చేసిన ప్రయత్నంలో ప్రభుత్వం దెబ్బతిన్నదని, దాంతో జేఏసీలోని కొందరు కార్యకర్తలకు మంత్రులే ఫోన్లు చేసి ప్రలోభపెట్టారంది. ప్రజాస్వామిక విలువలపట్ల గౌరవం లేకుండా, పార్టీలు, ఉద్యమ నాయకులను కొనుక్కోవడం ద్వారా బలోపేతం కావాలని ప్రయత్నించే పాలకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విమర్శించింది.