ఇబ్బందులొచ్చినా పోరు ఆగదు
- తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
- జేఏసీ వెబ్‌సైట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజల సమస్యలపై రాజ్యాంగబద్ధమైన పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం స్పష్టం చేశారు. జేఏసీ వెబ్‌సైట్‌ను హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో సోమవారం ప్రారంభిం చారు. నేతలు పిట్టల రవీందర్, నల్లపు ప్రహ్లాద్, భైరి రమేశ్ తదితరులతో కలసి కోదండరాం మాట్లాడుతూ, రాజ్యాంగ బద్ధమైన ఆందోళనలకు అవకాశం ఇవ్వ కుం టే ప్రభుత్వానికి నష్టమని హెచ్చరిం చారు. అవరోధాలు, అడ్డంకులు ఎన్నివచ్చి నా అంబేడ్కర్ మార్గంలో ప్రజా సమస్యలపై నిలబడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వా మిక ఆందోళనలకు అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వానికి సరికాదని, సామాజిక ఎదుగుదలకు ఇలాంటి నిర్బంధం నష్టమని పేర్కొన్నారు. ఏదేమైనా భూసేకరణపై తమ కార్యాచరణను కొనసాగి స్తామని స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్టు మైనిం గులను ఆపేయాలని, భూగర్భ మైనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పెద్దఎత్తున చెరువుల్లో, రిజర్వాయర్లలో చేప లు పెంచుతున్నందున ఫిషరీస్ పాలసీపై డాక్యుమెంటరీ రూపొందించామని, దానిపై చర్చ జరగాలని సూచించారు.
పోరాటం నిర్దిష్టంగా ఉండాలి..
సర్కారుపై ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం నిర్దిష్టంగా ఉండాలని కోదండరాం అన్నారు. ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసి, ప్రత్యామ్నాయాలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాధానం రాబట్టేలా ప్రతిపక్షాల వ్యూహం ఉండాలని చెప్పారు.