
సంగారెడ్డిజోన్/హైదరాబాద్: తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోదని కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అధ్యయన సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగిం చారు. అనంతరం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయాంజాల్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అభిప్రాయపడ్డారు.
మంచి రాజకీయాల కోసం టీజేఏసీ బయట నుంచి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. పూర్తి వివరాలు ఫిబ్రవరిలో వెల్లడిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేలకుపైగా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్న లక్ష్యంతో రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి క్షేత్ర స్థాయిలో కమిటీలు వేశామని తెలిపారు. మొదటి దశలో నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున కమిటీ పర్యటి స్తుందని చెప్పారు.
రెండో దశలో అధ్యయన సమాచారాన్ని క్రోడీకరించి రైతు సమస్యలపై జిల్లా సదస్సులు నిర్వహి స్తామన్నారు. ఫిబ్రవరి 4న తుర్కయాంజాల్‌లో రాష్ట్రస్థాయి విస్తృతస్థాయి సమావేశ«ం నిర్వహించనున్నట్లు వెల్లడిం చారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన నివేదికలపై అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.