జూనియర్ డాక్టర్ తల్లిదండ్రుల ఆగ్రహం
కోల్‌కతా: అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. తమ కుమార్తె హత్య పట్ల మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మమతవైఖరిని బాధితురాలి తల్లి సైతం తప్పుపట్టారు. వైద్యుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కాగా, హత్యకు గురైన వైద్యురాలి పేరు, గుర్తింపును బయటపెట్టడంతోపాటు ఈ ఘటనపై ప్రజల్లో వదంతులు వ్యాప్తి చేసినందుకు బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతోపాటు మరో ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment