parents agitation
-
బలవంతంగా దహనం చేశారు
కోల్‌కతా: కూతురు మృతదేహాన్ని భద్రపరచాలని భావించినప్పటికీ పోలీసుల బలవంతంకారణంగానే దహనం చేయాల్సి వచి్చందని కోల్‌కతాలో హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ కర్ వైద్యకళాశాల బయట ఆందోళన చేస్తున్న వైద్యులకు బుధవారం బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు, బంధువులు మద్దతు తెలిపారు. ‘న్యాయం జరిగేదాకా నిద్రించేది లేదు’’అని బాధితురాలి తల్లి అన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడారు. డబ్బులు ఇవ్వజూపారు కుమార్తె మృతదేహం తమ ముందు ఉండగానే నార్త్ డెప్యూటీ కమిషనర్ తమకు డబ్బు ఆఫర్ చేశారన్నారు. ‘‘మేము మృతదేహాన్ని భద్రపరచాలని అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్లి చూడగా బయట 300 మంది పోలీసులు నిల్చుని ఉన్నారు. ఆమెను దహనం చేయాల్సిందేనని మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడిచేశారు. దహన సంస్కారాలకు హడావుడి చేసి, దహనసంస్కారాల ఖర్చు కూడా మా వద్ద ఎవరూ వసూలుచేయలేదు. కనీసం దహనసంస్కారాలకు కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవని నా కూతురికికూడా తెలుసనుకుంటా. అందుకే ఇలా వెళ్లిపోయింది’’అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కొందరు పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై సంతకాన్ని పెట్టాలని నన్ను బలవంతపెట్టారు. కోపంతో నేను ఆ పేపర్‌ను చింపేసి విసిరేశా. అసలు మృతదేహాన్ని పరీక్షించకముందే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు ఎందుకు చెప్పారు?. మా అమ్మాయి ముఖం చూసేందుకు మూడున్నర గంటలు వేచి చూడాల్సి వచి్చంది. చూడనివ్వాలని తల్లి కాళ్ల మీద పడినా ఎవరూ పట్టించుకోలేదు. పోస్ట్‌మార్టమ్ ఎందుకంత ఆలస్యం చేశారు? పోలీసులు అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారు? తాలా పోలీస్ స్టేషన్లో రాత్రి 7 గంటలకే ఫిర్యాదుచేస్తే 11.45 గంటల దాకా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’అని తండ్రి ప్రశ్నించారు. అన్నీ అనుమానాలే.. తల్లిదండ్రులు ఆస్పత్రి వచి్చన 10 నిమిషాలకే వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లామని సుప్రీంకోర్టుకు సమరి్పంచిన అఫిడవిట్లో కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే మూడు గంటలకుపైగా వేచి చూశామని, తమ కుమార్తెను కడసారి చూసేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం తెల్సిందే. -
నమ్మకం కోల్పోయాం.. దీదీపై బాధిత కుటుంబం ఆగ్రహం
కోల్‌కతా: అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారని మండిపడ్డారు. తమ కుమార్తె హత్య పట్ల మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.మమతవైఖరిని బాధితురాలి తల్లి సైతం తప్పుపట్టారు. వైద్యుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ హాస్పిటల్ చుట్టూ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. కాగా, హత్యకు గురైన వైద్యురాలి పేరు, గుర్తింపును బయటపెట్టడంతోపాటు ఈ ఘటనపై ప్రజల్లో వదంతులు వ్యాప్తి చేసినందుకు బీజేపీ మాజీ ఎంపీ లాకెట్ చటర్జీతోపాటు మరో ఇద్దరు డాక్టర్లు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామికి కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. -
చర్చలు సఫలం.. వారంలో డీఏవీ స్కూల్ రీఓపెన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్‌తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్‌తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే.. ‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్‌తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్‌లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్. ఇదీ సమస్య.. హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
ఢిల్లీలో మరో దారుణం : చిన్నారిపై అఘాయిత్యం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను చదువుకుంటున్న స్కూల్లోనే మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఓ వైపు వైద్య పరీక్షలు లైంగిక దాడి జరిగినట్టు ధృవీకరించినప్పటికీ, స్కూల్ యాజమాన్యం మాత్రం అసలేం జరగలేదంటూ వాదిస్తోంది. పాపపై జరిగిన అఘాయిత్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు సైతం బెదిరింపులకు దిగారు. దీంతో తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా పోరాటం చేస్తున్నారు. గత వారం స్కూల్లో తన కూతురిపై అత్యాచారం జరిగిందని, ఎవరూ తమకు న్యాయం చేయడం లేదని ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో ‘ప్లీజ్ మాకు సాయం చేయండి’ అని పాప తల్లి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటోంది. స్కూల్ నుంచి వచ్చిన తన కూతురి పాంటీస్లో రక్తపు మరకలు కనిపించాయని, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్తే, ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసిందని తల్లి చెప్పారు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. స్నానానికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్‌ల్లో నొప్పి వస్తుందని ఏడుస్తుందన్నారు. ఈ విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయద్దంటూ పోలీసులు తమల్ని బెదిరించారని తెలిపారు. తాము ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అంతేకాక స్కూల్‌కు పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారని, స్కూల్ ముగిసే సమయం వరకు అలాంటి సంఘటనలేమీ జరుగలేదని తేల్చారు. ఏం జరిగినా అది ఇంటి వద్దనే జరిగిందంటూ తమపైనే నిందలేసినట్టు ఈ వీడియోలో తండ్రి తెలిపారు. స్కూల్లో ఉన్న అన్ని సీసీటీవీలను తాము పరిశీలించామని, అలాంటి సంఘటనలేమీ వాటిలో నమోదు కాలేదని పోలీసులు చెప్పినట్టు పేర్కొన్నారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంపై పాప తల్లిదండ్రులు, వారి బంధువులు, చుట్టుపక్కల వారు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సంఘటనపై న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ సైతం తమ పాఠశాలలో అలాంటి సంఘటనేమీ జరుగలేదంటూ వాదిస్తున్నారు. అంతకముందు ఈ స్కూల్లో ఇలాంటివే రెండు సంఘటనలు జరిగాయి.‘ప్లీజ్ మాకు సాయం చేయండి. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. మాకు ఏమొద్దు కానీ న్యాయం చేయండి. మాపై బెదిరింపులకు కూడా దిగుతున్నారు’ అని వీడియోలో తల్లిదండ్రులు చెప్పారు. ‘ఈ రోజు మా కూతురికి జరిగింది, రేపు మీకు ఇదే జరగవచ్చు’ అంటూ పాప తల్లి కన్నీరుమున్నీరైంది. -
అన్నం అడిగారని దండన
సిద్దిపేటరూరల్ : మధ్యాహ్న భోజనంలో మరోసారి అన్నం పెట్టమన్నందుకు ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిన్నగుండవెళ్లి శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగింది. ఘటన తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. చిన్నగుండవెళ్లి శివారులో గల ఎల్లంకి కళాశాలలో మహాత్మా జ్యోతిబాపూలే(నారాయణరావుపేట) బాలుర గురుకుల విద్యాలయం కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం సమయంలో మరోసారి అన్నం పెట్టాలని అడిగిన 6, 8 తరగతులకు చెందిన విద్యార్థులు రాజేశ్, సుగీర్తి, మంజునాథ్‌ను ప్రిన్సిపాల్ రాజమణి ముందే పీఈటీ వెంకటేశ్ వితకబాదాడు. పైపుతో కొట్టడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లితండ్రులు, సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ రాజమణి, పీఈటీ వెంకటేశ్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జిల్లా అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి ఇందిర పాఠశాలకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, తల్లితండ్రులు తమ పిల్లలను చూడడానికి వచ్చిన ప్రతిసారి ప్రిన్సిపాల్ రాజమణి దూషించేదని తెలిసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్, పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి ఇందిరకు వినతిపత్రం ఇచ్చారు. కమిలిపోయేలా కొట్టారు.. పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా. నా ఇద్దరు కుమారులు ఇదే పాఠశాలలో చదువుతున్నారు. గతంలో పిల్లలను చూడటానికి వచ్చినప్పుడు కూడా మేడం మాతో అమర్యాదగా మాట్లాడేది. స్వాతంత్ర దినోత్సవం కావడంతో పిల్లలకు వస్తువులు ఇవ్వడానికి వచ్చా. కొద్ది సేపటికే రాజశ్, సుగీర్తి ఏడుచుకుంటూ నా దగ్గరకు వచ్చారు. కారణం లేకుండా పీఈటీ కొట్టారని చెప్పారు. – అంజయ్య, బైరాన్‌పల్లి రావాలని చెప్పి.. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పేరెంట్స్ కమిటీని రావాలని ప్రిన్సిపాల్ రాజమణి చెప్పారు. నేను పేరెంట్స్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నా. నా కొడుకు మంజునాథ్ ఏడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి.. తనకు తగిలిన దెబ్బలు చూపించాడు. దీనిపై ప్రిన్సిపాల్‌ను అడగగా.. తాను మహిళా ప్రిన్సిపాల్‌ని అని, అనవసరంగా రాద్దాంతం చేస్తే కేసులు పెడతానని బెదిరించింది. – బాల్‌రాజు, నందారం చర్యలు తీసుకుంటాం.. పాఠశాలలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ముందుగా నివేదికలు ఉన్నతాధికారులకు పంపిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – ఇందిరా, అసిస్టెంట్, బీసీ సంక్షేమాధికారి -
టీసీలు, మెమోలు ఇవ్వరట!
జనగామ అర్బన్: జిల్లాలోని కొన్ని మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల కు అధికారులు టీసీలు, మెమోలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజలు అవుతోంది. ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 9 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 8 స్కూళ్లలో ఇంటర్ కోర్సు ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో దాదాపు 500 మం ది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. అయి తే మోడల్ స్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులను ఇంటర్ సైతం ఇక్కడే చదవాలని కొందరు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కళాశాలల్లో చేరే అంశం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థి తి, విద్యార్థుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, వేరే కళాశాలల్లో చేరేందుకు టీసీ, మెమోలు ఇచ్చేది మాత్రం లేదని అధికారులు పేర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లోని కార్పొరేట్ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం టీసీ, మెమోలు ఇస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల అధికారులు పదో తరగతి పాసై న విద్యార్థి టీసీ అడిగితే అందులో విద్యను అభ్యసిస్తున్న వారి తమ్ముడు, చెల్లి టీసీలు కూడా ఇస్తామని ఒకింత కఠినంగా చెబుతున్నారని తెలుస్తోంది. మోడల్ స్కూల్లో బో«ధించే కొందరు ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యను అభ్యసిస్తున్నార ని, వారేందుకు మోడల్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఇష్టంలేని చోట విద్య కొనసాగదని, భవిష్యత్ భరోసా ఎవరిస్తారని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఇష్టంతో చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని, ఇష్టంలేకున్నా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు. ఇప్పటికైనా మోడల్ స్కూల్లో ఇంటర్ చదవడం ఇష్టంలేని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని టీసీ, మెమోలు జారీ చేయాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, నాణ్యమైన వి ద్య అందుతుందనే దృష్టితోనే విద్యార్థులను మోడల్ స్కూల్లో ఇంటర్లో చేరే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. -
తల్లిదండ్రులు మందలించారని బాలుడు అదృశ్యం
మైలార్‌దేవ్‌పల్లి: బుద్దిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన మహేష్‌కుమార్ కొడుకు ఎం.మధుకుమార్ (12) స్థానికంగా ఉన్న సెయింట్ మేరీస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు సమీపిస్తుండటంతో మధుకుమార్ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలతో సమయం వృథా చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు మంచిగా చదువుకోవాలని మందలించడంతో ఈ నెల 3న రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి పారిపోయాడు. విషయం గ్రహించిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆచూకీ తెలియకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గురుకుల విద్యార్థి అదృశ్యంపై ఆందోళన
► ఏన్కూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో ► పోలీసుల హామీతో విరమణ ఏన్కూర్: కనిపించకుండా పోయిన స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థి అచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఏన్కూర్ ప్రధాన సెంటర్లో ఆందోళన చేశారు. గత నెల 27న 8 వతరగతి చదువుతున్న గార్లపాటి ఉదయ్‌కిరణ్ అనుమతి లేకుండా గురకులం నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ క్రమంలో బాలుడి సమాచారం లేదని తండ్రి రామకృష్ణ, పాఠశాల యాజమాన్యం ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. అప్పటి నుంచి పోలీసులు, విద్యార్థి బంధువులు విద్యార్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. దాదాపు 20 రోజులు కావస్తున్నా తమ పిల్లాడి ఆచూకీ తెలియలేదని, గురుకులంలో అడిగితే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆగ్రహించిన విద్యార్ధి బంధువులు ఏన్కూర్ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో ఏన్కూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంటన్నర సేపు రోడ్డు పై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులతో మాట్లాడారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.