దృవీకరించకుండానే ఆత్మహత్య అని ఎందుకు చెప్పారు?
పోలీసుల తీరు ఘోరం
కోల్‌కతా బాధిత వైద్యురాలి తల్లిదండ్రుల ఆవేదన
కోల్‌కతా: కూతురు మృతదేహాన్ని భద్రపరచాలని భావించినప్పటికీ పోలీసుల బలవంతంకారణంగానే దహనం చేయాల్సి వచి్చందని కోల్‌కతాలో హత్యకు గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్‌జీ కర్ వైద్యకళాశాల బయట ఆందోళన చేస్తున్న వైద్యులకు బుధవారం బాధిత వైద్యురాలి తల్లిదండ్రులు, బంధువులు మద్దతు తెలిపారు. ‘న్యాయం జరిగేదాకా నిద్రించేది లేదు’’అని బాధితురాలి తల్లి అన్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడారు.
డబ్బులు ఇవ్వజూపారు
కుమార్తె మృతదేహం తమ ముందు ఉండగానే నార్త్ డెప్యూటీ కమిషనర్ తమకు డబ్బు ఆఫర్ చేశారన్నారు. ‘‘మేము మృతదేహాన్ని భద్రపరచాలని అనుకున్నాం. కానీ ఇంటికి వెళ్లి చూడగా బయట 300 మంది పోలీసులు నిల్చుని ఉన్నారు. ఆమెను దహనం చేయాల్సిందేనని మమ్మల్ని తీవ్రంగా ఒత్తిడిచేశారు. దహన సంస్కారాలకు హడావుడి చేసి, దహనసంస్కారాల ఖర్చు కూడా మా వద్ద ఎవరూ వసూలుచేయలేదు. కనీసం దహనసంస్కారాలకు కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవని నా కూతురికికూడా తెలుసనుకుంటా. అందుకే ఇలా వెళ్లిపోయింది’’అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కొందరు పోలీసు అధికారులు ఖాళీ కాగితంపై సంతకాన్ని పెట్టాలని నన్ను బలవంతపెట్టారు.
కోపంతో నేను ఆ పేపర్‌ను చింపేసి విసిరేశా. అసలు మృతదేహాన్ని పరీక్షించకముందే నా కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆసుపత్రి అధికారులు ఎందుకు చెప్పారు?. మా అమ్మాయి ముఖం చూసేందుకు మూడున్నర గంటలు వేచి చూడాల్సి వచి్చంది. చూడనివ్వాలని తల్లి కాళ్ల మీద పడినా ఎవరూ పట్టించుకోలేదు. పోస్ట్‌మార్టమ్ ఎందుకంత ఆలస్యం చేశారు? పోలీసులు అసహజ మరణం కేసు ఎందుకు నమోదు చేశారు? తాలా పోలీస్ స్టేషన్‌లో రాత్రి 7 గంటలకే ఫిర్యాదుచేస్తే 11.45 గంటల దాకా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు?’అని తండ్రి ప్రశ్నించారు.
అన్నీ అనుమానాలే..
తల్లిదండ్రులు ఆస్పత్రి వచి్చన 10 నిమిషాలకే వారిని ఘటనాస్థలికి తీసుకెళ్లామని సుప్రీంకోర్టుకు సమరి్పంచిన అఫిడవిట్‌లో కోల్‌కతా పోలీసులు పేర్కొన్నారు. అయితే మూడు గంటలకుపైగా వేచి చూశామని, తమ కుమార్తెను కడసారి చూసేందుకు అనుమతించాలని పోలీసులను వేడుకున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు అసహజ మరణం కేసు నమోదు చేశారని, అయినా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కలకత్తా హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment