నిరసన ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్టు
వరంగల్: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మద్దతుగా నిరసన ర్యాలీకి తరలి రావాలని పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గాంధీభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీని అక్కడే అడ్డుకున్న పోలీసులు నాయకులను అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, శాసన మండలి నేత షబ్బీర్‌అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఇ¯Œæచార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు ఉన్నారు.