mallanna sagar project
-
కాళేశ్వరం తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్
దుబ్బాక: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలమని, మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలయ్యాయని చిల్లర రాజకీయా లు చేసిన కాంగ్రెస్..ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని మాజీమంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు చేరడంతో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి శుక్రవారం హరీశ్‌రావు సందర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు మల్లన్నసాగర్‌లోకి ఇంత నీరు ఎక్కడి నుంచి వచి్చందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్.. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాక గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండటం వల్లనే సాధ్యమైందని చెప్పారు. మల్లన్నసాగర్ వద్ద ఉద్రిక్తత మల్లన్నసాగర్‌ను సందర్శనకు హరీశ్‌రావు తదితరులు వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకుల ను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు పంపించారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్, వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులతో హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లన్నసాగర్ పరిసరాలు అంతా పోలీస్ నిఘా నీడలోనే కనిపించాయి. -
మల్లన్న సు‘జలం’ సిద్ధం.. 6.57 లక్షల గృహాలకు తాగునీరు
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను శుద్ధిచేసి ఆరు జిల్లాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలో 6.57లక్షల గృహాలకు తాగునీటిని అందించే బృహత్తర పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ వద్ద రూ.1,212 కోట్ల వ్యయంతో 540 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. 270 ఎంఎల్డీ చొప్పున రెండు ప్లాంట్లను నిర్మించగా, ఒక ప్లాంట్ పూర్తికావడంతో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. మరో 270ఎంఎల్డీ డబ్ల్యూటీపీ పనులు ఆగస్టులో పూర్తికానున్నాయి. మల్లన్నసాగర్ నుంచి 7.26టీఎంసీల నీరు.. కొమురవెల్లి మల్లన్నసాగర్‌ను 50టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా నిర్మించారు. ఏటా 7.26టీఎంసీల నీటిని తాగునీటిగా వినియోగించాలని నిర్ణయించారు. రా వాటర్‌ను శుద్ధి చేసేందుకు కుకునూరుపల్లి మండలం తిప్పారం వద్ద ఆరు మోటార్ల ద్వారా 5.6 కిలోమీటర్ల పైప్‌లైన్‌తో మంగోల్‌లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చేరుస్తారు. 540 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సామర్థ్యంతో రెండు నీటి శుదీ్ధకరణ ప్లాంట్లు ఒక్కోటి 270 ఎంఎల్డీ చొప్పున నిర్మించారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చిన నీళ్లు మంగోల్ వద్ద శుదిŠధ్ చేసి, 3 కిలోమీటర్ల దూరంలోని లకుడారంలో 6 ఎంఎల్(మిలియన్ లీటర్లు) సామర్థ్యం కలిగిన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (జీఎల్‌బీఆర్)లోకి పంపిస్తారు. ఇందుకు జీఎల్‌బీఆర్ వద్ద రెండు పాయింట్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కొమురవెల్లి కమాన్ వద్ద ఉన్న ట్యాంక్‌లోకి తరలిస్తారు. అక్కడి నుంచి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతుంది. అక్కారంలోని నాలుగు పాయింట్ల నుంచి.. కొమురవెల్లి కమాన్ నుంచి మరో పాయింట్ ద్వారా 29 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తారు. లకుడారం నుంచి 16 కిలోమీటర్ల దూరంలోని అక్కారం వద్ద 6ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన సంపులోకి పంపిస్తారు. అక్కారం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పాయింట్లలో.. ఒక పాయింట్ నుంచి 33.6 కిలోమీటర్ల దూరంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘనపురం గుట్టకు నీటిని పంపింగ్ చేస్తారు. ఈ గుట్ట నుంచి మేడ్చల్, ఆలేరు, భువనగిరికి ప్రస్తుతం ఉన్న పైప్‌లైన్‌తో నీటిని పంపిస్తారు. రెండో పాయింట్‌ను 5.4 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ కోమటిబండ లైన్‌కు కలుపుతారు. ఇక్కడి నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లాలోని కొన్ని మండలాలకు ఈ జలాలు వెళ్తాయి. మూడో పాయింట్ నుంచి సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు తరలిస్తారు. నాలుగో పాయింట్‌ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి పంపింగ్ చేయనున్నారు. 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మొత్తంగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు ఆరు జిల్లాలలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలలోని 6,57,203 గృహాలకు తాగునీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4,81,217 గృహాలకు నీటి సరఫరా కానున్నాయి. సిద్దిపేట, గజ్వేల్, చేర్యాల, మేడ్చల్, దుబ్బాక, ఆలేర్, జనగామ, భువనగిరి, యాదగిరిగుట్ట, తుప్రాన్, మోత్కూర్, పోచంపల్లి, ఘట్కేసర్, దిండిగల్, గుండ్ల పోచంపల్లి, తిరుమలగిరి పట్టణాల్లో 1,75,986 గృహాలకు నీటిని సరఫరా చేస్తారు. జూలై నాటికి సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 439 ఆవాసాలకు, గజ్వేల్, దుబ్బాక, తుప్రాన్ మున్సిపాలిటీలకు, ఆగస్టు నాటికి మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో 611 ఆవాసాలు, ఘట్కేసర్, మేడ్చల్, దుండిగల్, గుండ్లపోచంపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు, పోచంపల్లి మున్సిపాలిటీలకు తాగు నీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నెల రోజుల్లో సరఫరా డబ్ల్యూటీపీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ప్లాంట్ ద్వారా నెల రోజుల్లో పంపింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆగస్టు నాటికి 6 జిల్లాలు, 1,922 ఆవాసాలు, 16 మున్సిపాలిటీలకు మల్లన్న సాగర్ నుంచి శుద్ధిచేసిన గోదావరి జలాలను సరఫరా చేస్తాం. – రాజయ్య, మిషన్ భగీరథ గ్రీడ్ ఈఈ చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ!
Prakash Raj Meets Telangana CM KCR: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ శనివారం మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌ను కూడా ఆయన పరిశీలించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఒకేచోట అన్ని నిత్యావసరాలు దొరికేలా విశాలమైనమార్కెట్‌ను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించిన అంశాలను చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మహతి ఆడిటోరియం, ఆర్అండ్ఆర్ కాలనీలను సందర్శించారు. అంతకుముందు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ పంప్‌హౌస్, కట్టను పరిశీలించారు. ప్రకాశ్‌రాజ్ శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం వ్యవసాయ క్షేత్రంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం మల్లన్న సాగర్‌ను సందర్శించారు. శనివారం సాయంత్రం మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. -
పది జిల్లాలకు జల ప్రసాదం: మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక టౌన్: ‘దేశ చరిత్రలోనే లేనివిధంగా నదిలేని చోట నిర్మించిన పెద్ద ప్రాజెక్టు మల్లన్నసాగర్. నదికే నడక నేర్పి తానే స్వయంగా ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి డిజైన్ చేసి ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్..’అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సహజంగా ప్రాజెక్టులు నదికి అడ్డంగా కడతారని.. కానీ నదిలేని చోట సముద్ర మట్టానికి 667 మీటర్ల ఎత్తులో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ నిర్మించిన కారణ జన్ముడు అని కొనియాడారు. మల్లన్నగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 20 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మండుటెండల్లోనూ మత్తడులు దునికించారు మల్లన్నదేవుడు పుట్టినరోజునే ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ప్రాజెక్టు ఆపాలని కోర్టులో వేసిన కేసులు కొట్టివేయడం కూడా ఇదే తేదీన కావడం గమనార్హమని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ నడిగడ్డపై మల్లన్నసాగర్ నిర్మించడంతో సగం తెలంగాణలో శాశ్వతంగా కరువు అనేదే ఉండదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో వానాకాలం కూడా ఎండాకాలం లాగానే ఉండేదని, గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు బిందెలు రోడ్డుకు అడ్డంగా పెట్టేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఎండాకాలం కూడా వానా కాలమైందన్నారు. మండు టెండల్లో కూడా వాగులు, వంకలు, చెరువులు మత్తడిలు దునికించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రసమయి బాలకిషన్, సతీష్ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, చిట్టి దేవేందర్‌రెడ్డి, ఈఎన్సీ హరేరాం, కలెక్టర్ హనుమంతరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మల్లన్న సాగర్ ఘనత కేసీఆర్‌దే
-
మల్లన్నసాగర్లో చిక్కుకున్న పశువులు
మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో పశువులు చిక్కుకుపోయాయి. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామానికి చెందిన బర్రెంకల చిన చంద్రయ్యకు 40 వరకు ఎడ్లు, ఆవులు ఉన్నాయి. శనివారం ఉదయం ఆయన పశువులను మేతకోసం అడవిలోకి వదిలిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం మల్లన్నసాగర్ చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో చంద్రయ్య పశువుల వద్దకు వెళ్లలేకపోయాడు. ఆదివారం తెల్లవారు జామున మల్లన్నసాగర్‌లోకి గోదావరి జలాలను వదలడంతో పశువులు పక్కనే ఉన్న బ్రాహ్మణ బంజేరుపల్లి శివారులోని గుట్ట సమీపంలోకి వెళ్లాయి. మరొక పక్కన గతంలో కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలించిన కాల్వ ఉంది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా నీరు మల్లన్నసాగర్‌లోకి వెళుతోంది. కాగా తుక్కాపూర్‌కు చెందిన మరో రైతుకు చెందిన నాలుగు గేదెలు కూడా చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.– తొగుట (దుబ్బాక) అక్కడే నిరసన..అక్కడే నిద్ర వీరంతా జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలానికి చెందిన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు. రెవెన్యూ అధికారుల తప్పిదంతో తొమ్మిది గ్రామాలకు చెందిన వేలాది మంది రైతుల పట్టాభూములు అసైన్డ్ భూములుగా నమోదయ్యాయి. ఈ తప్పును సరిదిద్దాలంటూ బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో నిరసన దీక్షను ప్రారంభించి.. రాత్రంతా సమావేశపు గదిలోనే పడుకున్నారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. మరోపక్క వీరికి మద్దతుగా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి.. విధులకు హాజరయ్యేందుకు వచి్చన తహసీల్దార్ స్వప్న, రెవెన్యూ సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. 15 రోజుల్లో రికార్డులు సరిచేసి న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ప్రజాప్రతినిధులకు, రైతులకు హామీనివ్వడంతో ఆందోళనకు తెరపడింది.– జఫర్‌గఢ్ -
మల్లన్నసాగర్ నుంచే దేవాదులకు గోదావరి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం సిద్ధం చేసిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దేవాదుల ప్రాజెక్టులోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానించే తుది ప్రణాళిక ఖరారైంది. దేవాదుల ప్రాజెక్టులో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు పూర్తి భరోసా ఇచ్చేలా మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించే పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మొత్తంగా రూ.405 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా దేవాదులలోని సుమారు 1.30 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేలా కార్యాచరణను త్వరలోనే మొదలుపెట్టనుంది. నిజానికి దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గంగాపురం ఇంటేక్ పాయింట్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంది. నిర్ణీత ఆయకట్టుకు నీటిని తరలించాలంటే 200 కిలోమీటర్లకుపైగా నీటి తరలింపు చేయాల్సి ఉంది. తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించాలంటే కనీసంగా 460 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో తపాస్‌పల్లి కింది ఆయకట్టుకు కాళేశ్వరం జలాలను తరలించేలా ప్రణాళికలు రూపొందించాలని గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో మల్లన్నసాగర్ నుంచి 10.06 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని కనీసం 4 నెలలపాటు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఓపెన్కెనాల్తోపాటు 3.60 కిలోమీటర్ల మేర సొరంగం నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనతో కనీసం 13 నుంచి 14 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా తపాస్‌పల్లి కింద నిర్ణయించిన 74,955 ఎకరాలతోపాటు, కొన్నబోయినగూడెం, వెల్దండ, లద్దనూరుతోపాటే దారి పొడవునా ఉండే చెరువుల కింద మరో 55 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ సైతం ఆమోదించినట్లు తెలుస్తోంది. -
మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం
దుబ్బాకటౌన్/తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్రావు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ కొద్దిసేపట్లోనే మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం అవడంతో సంబురాలు జరుపుకొన్నారు. 10 టీఎంసీలు నింపేందుకు.. మల్లన్నసాగర్లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుక్కాపూర్ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను.. మూడు పంపుల (రెండో, ఆరో, ఏడో నంబర్ పంపుల) ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు (24 గంటల్లో) 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడింటిని పూర్తిస్థాయిలో నడిపితే.. రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. భారీగా బందోబస్తు మల్లన్నసాగర్లో నీళ్లు నింపుతున్న నేపథ్యంలో పోలీసులు శనివారం మధ్యాహ్నమే రిజర్వాయర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుక్కాపూర్, రాంపురం వాగుగడ్డ, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై పికెట్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ కట్ట వద్దకు వెళ్లనీయడం లేదు. గ్రామస్తులను కూడా పూర్తి వివరాలు అడిగి నిర్ధారించుకున్నాకే వెళ్లనిస్తున్నారు. అర్ధరాత్రి గ్రామాలు ఖాళీ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాలను రెవెన్యూ అధికారులు శనివారం అర్ధరాత్రి ఖాళీ చేయించారు. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బి.బంజేరుపల్లి గ్రామాల నుంచి అందరినీ బయటికి తరలించారు. నిజానికి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గతంలోనే ఆదేశించారు. కానీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొందరు ఖాళీ చేయలేదు. వారిని ఇప్పుడు బయటికి తరలించారు. గట్టు గుట్ట పూజారి అక్కడే..! వేములఘాట్ శివారు అటవీప్రాంతంలోని గట్టు గుట్టపై దీకొండ మైసమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ తండాకు చెందిన మంగీలాల్.. ఆలయంలోనే నివసిస్తూ పూజారిగా పనిచేస్తున్నారు. ముంపు గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో.. ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ఆయనతో మాట్లాడి బయటికి రావాలని కోరారు. కానీ మంగీలాల్ తిరస్కరించారు. అధికారులు ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం: మంత్రి హరీశ్ ‘కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం.. తెలంగాణకు అమృత జలాభిషేకం’ అని పేర్కొంటూ రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఫొటోలను ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు పోస్టు చేశారు. ‘సాకారమైన సాగరం.. అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి.కుట్రలు, కుహానా కేసులు, వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. పట్టుదలతో పనిచేస్తే కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది..’’ అని పేర్కొన్నారు. -
Mallanna Sagar: ముల్లె సర్దుకున్న.. ఎళ్లిపోతావున్న
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నర్సమ్మ. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ఇల్లు, వ్యవసాయ భూమి కోల్పోయింది. కోల్పోయిన ఇంటికి అధికారులు పరిహారం అందించారు కానీ, సాగు భూమి 1.7 ఎకరాలకు సంబంధించిన పరిహారం అందించలేదు. దీంతో రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలోనే నివాసం ఉంటోంది. మంగళవారం అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఖాళీ చేసింది. ఊరిని వదిలిపెట్టి పోతున్నా అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఆ భూమికి డబ్బులు ఇచ్చి మా కుటుంబాన్ని అదుకోవాలని అధికారులను వేడుకుంది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరడంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో 8 గ్రామ పంచాయతీలలో 16 గ్రామాలు ముంపు నకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో 5,618 కుటుంబాలు నివాస గృహాలు, భూమి కోల్పోతున్నట్లు గుర్తించారు. పరిహారం 90% వరకు అందించారు. ఒంటరి మహిళలు, పురు షులు, పలువురికి ఎలాంటి పరిహారం అందక పోవడంతో అక్కడే నివాసం ఉన్నారు. కొముర వెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లోకి త్వరలో నీటిని వదలనుండటంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజు లుగా అధికారులు డీసీఎంలను పంపించి నివాసితులను మరోచోటకు పంపిస్తున్నారు. మంగళవారం 25 మంది నిర్వాసితులకు త్వరలో డబ్బులు అందజేస్తాం అని చెప్పి ఖాళీ చేయించారు. ఒక పక్కన గృహాలు ఖాళీ చేయిస్తూనే, మరో పక్క జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. మళ్లీ కలుసుకుంటామో లేదో అని రోదించారు. ఇంట్లోనుంచి వస్తూ గుమ్మాలను, గోడలను అప్యాయంగా తడుముకుంటూ వెళ్లడం అందరినీ కంటతడి పెట్టించింది. -
కన్నీరు తుడవంగ.. సొంతింట్లోకి సగర్వంగా
సాక్షి, గజ్వేల్: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ (రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఉపాధిపై ఆందోళన మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్అండ్ఆర్ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్అండ్ఆర్ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో.. ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు. ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్ఎఫ్టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది. కొన్ని నెలలుగా నివాసం ఆర్అండ్ఆర్ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్అండ్ఆర్ కాలనీ పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్అండ్ఆర్ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్‌కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్అండ్ఆర్ కాలనీ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి. చదవండి: వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు -
ఊరితో బంధం తెంచుకుంటూ.. కన్నీళ్లు పెడుతూ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్వాసిత కటుంబాలు గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి బుధవారం తరలివెళ్లారు. ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం లక్ష్మాపూర్ ప్రజలు గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిన విషయం తెలిసిందే. రిజర్వాయర్ కట్ట మధ్యలో ఉన్న లక్ష్మాపూర్, రాంపూర్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా సంగాపూర్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లక్ష్మాపూర్ వాసులకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. కాగా ప్రస్తుతం వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి వారికి కేటాయించిన ఇళ్లలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో, వేములఘాట్ నుంచి 140 కుటుంబాలు, పల్లేపహడ్ నుంచి 103 కుటుంబాలు బుధవారం వెళ్లారు. నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో పలు కుటుంబాలు నేడు గజ్వేల్‌కు తరలివెళ్లాయి. గ్రామాన్ని వదిలి వెళ్తున్న క్రమంలో మహిళలు, పురుషులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లుగా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వెళ్తున్న క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడి బోరున విలపించారు. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలను వదిలివెళ్లి పోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఇన్నాళ్లుగా కష్టసుఖాల్లో అందరం అండగా ఉండేవారమని తలుచుకుంటూ విలపించారు. ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకున్న గ్రామస్తులు గజ్వేల్‌రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు వేములఘట్ గ్రామస్తులు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం వేములఘట్‌కు చెందిన బాధిత కుటుంబాలు డీసీఎం వాహనాల్లో తీసుకువచ్చిన సామగ్రిని ఆర్అండ్ఆర్ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లలోకి తరలించారు. -
కోర్టుధిక్కార కేసులో ఐఏఎస్‌లకు ఫైన్, ఆర్డీవోకు జైలు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జరిమానా, మరో అధికారికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణభాస్కర్ (ప్రస్తుతం సిరి సిల్ల జిల్లా కలెక్టర్)లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాలంది. కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్–3 భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (సిద్దిపేట ఆర్డీవో) జయచంద్రారెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించకుంటే నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పింది. ముగ్గురు అధికారులు రూ.2 వేలు చొప్పున పిటిషనర్లకు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు 2 వేర్వేరు కోర్టు ధిక్కార కేసుల్లో న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ నెల 24న తీర్పు చెప్పారు. అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును 4 వారాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి నోటిఫికేషన్.. ఈ తీర్పు ప్రతి అందిన 6 మాసాల్లోగా గతంలోని కోర్టు ఉత్తర్వుల మేరకు భూసేకరణకు తిరిగి డిక్లరేషన్, అవార్డు వంటి సెక్షన్ 11 (1) ప్రకారం చెల్లదని, వాటితో పాటు ఫాం–సీ ప్రొసీడింగ్, నోటిఫికేషన్లను తిరిగి జారీచేయాలని, భూసేకరణ చట్టం–2013 ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. కింది స్థాయిలో అధికారులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడానికి ఆ ముగ్గురు ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని, ఉద్దేశపూర్వకంగానే ఆదేశాల్ని ఉల్లంఘించారని తప్పుపట్టింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని గాండ్ల లక్ష్మి, రాం రెడ్డి ఇతరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కారం వ్యాజ్యాలపై న్యాయమూర్తి 16 పేజీల తీర్పు చెప్పారు. ‘సిద్దిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్‌కు చెందిన రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు, భూముల కోసం అవార్డు ప్రకటించాలి. పిటిషనర్ల అభ్యంతరాలు పరిష్కరించకుండా భూముల విషయంలో ముందుకు వెళ్లరాదు. ప్రాజెక్టుకు చెందిన పూర్తి వివరాలు, మ్యాప్, తెలుగు డీపీఆర్ ప్రతులు రైతులకివ్వాలి’అని గత ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హైకోర్టు తాజా తీర్పులో పేర్కొంది. భూముల స్వాధీనం చెల్లదు.. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించి రైతుల అభ్యంతరాలు వినకుండా డిక్లరేషన్‌ను ఇచ్చారనే పిటిషనర్ల వాదనను హైకోర్టు ఆమోదించింది. భూసేకరణ చట్టం– 2013కు వ్యతిరేకంగా అధికారులు వారి భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని తేల్చింది. హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయనప్పుడు వాటిని పొడిగించాలనీ అధికారులు హైకోర్టును కోరలేదని తప్పుపట్టింది. ఆ చట్టంలోని సెక్షన్ 13 నిబంధనకు వ్యతిరేకంగా అధికారుల చర్యలున్నాయని పేర్కొంది. అదే చట్టంలోని సెక్షన్ 19 (1) కింది భూమి కోసం డిక్లరేషన్, ఎంక్వయిరీ నోటీసు, భూసేకరణ నోటిఫికేషన్, ఆ తర్వాత భూసేకరణ చేయాలనే నిబంధనను అధికారులు అమలు చేయలేదని స్పష్టంచేసింది. తొలుత ఆర్డీవోగా ఉన్న ముత్యంరెడ్డి రైతుల అభ్యంతరాలు స్వీకరించారని, అయితే ఆయన తర్వాత ఆర్డీవోగా వచ్చిన జయచంద్రారెడ్డి నాలుగు వారాల్లో చేయాల్సిన పనులకు 8 వారాలు తీసుకున్నారని, అయినా అభ్యంతరాలపై విచారణ పూర్తి కాలేదని కోర్టు పేర్కొంది. రైతుల వినతిపత్రాలపై ఆర్డీవో ఏవిధమైన సమాచారం ఇవ్వలేదు కాబట్టి రైతుల వినతిని ఆమోదించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఈ కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా గతంలో హైకోర్టు విచారణకు కూడా హాజరయ్యారని, అయినా తామిచ్చిన ఉత్తర్వుల్ని అమలు చేయకుండానే ప్రాజెక్టు పనుల పేరుతో భూమిని స్వాధీనం చేసుకున్నారని పేర్కొంది. గతంలోని తీర్పును అమలు చేయకపోవడానికి చెప్పిన కారణాలు సహేతుకంగా కూడా లేవని, కావాలనే ఉత్తర్వుల్ని అమలు చేయలేదని తీర్పులో స్పష్టంచేసింది. భూసేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా భూనిర్వాసితులకు న్యాయపరంగా పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ చేయాలని కోర్టు ఆదేశించింది. -
‘నిర్వాసితులను భయపెడుతున్నారు’
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రాజెక్టులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వానిదేనన్నారు. కోర్టు తీర్పును ఒక చిల్లర పంచాయితీగా అభివర్ణించిన సీఎం కేసీఆర్.. నిందలన్నీ కాంగ్రెస్ పార్టీపై మోపుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా నర్సారెడ్డి పట్ల పోలీసుల తీరును ఎండగట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి, రైతుల భూములు సస్య శ్యామలం కావాలని.. వీటితో పాటు భూనిర్వాసితులకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. ‘ఇప్పటివరకు వరకు మేనిఫెస్టో గురించి గానీ, రైతుల సమస్యల గురించి గానీ పట్టించుకోకుండా.. ఎంతసేపు ఫెడరల్ ప్రంట్ పేరుతో తీర్థయాత్రలు తిరగుతూ మానసిక ఆనందం పొందుతున్నాడే తప్ప.. సీఎం కేసీఆర్ ఏ ఒక్క సమస్య గురించి మాట్లాడకపోవడం దారుణం. ప్రాజెక్ట్ పనులలో జాప్యం చేస్తూ ఆ నిందలు కాంగ్రెస్ పార్టీపై రుద్దుతున్నాడు. హైకోర్టు స్టేతో ఆగిపోయిన పనులను.. నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేసి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. కోర్టు ప్రత్యేక నివేదిక తెప్పించుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం దారుణం అని పొన్నం ప్రభాకర్ కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మూడో టీఎంసీ లెక్క కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక అంకానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేలా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. కొత్తగా మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించి అనుమతులిచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటుకు అయ్యే వ్యయం, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు అయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనుమతి కోసం నీటిపారుదల శాఖ పంపింది. దీనికి సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయనుంది. ఆమోదమే తరువాయి.. రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మూడో టీఎంసీ నీటిని తీసుకునేందుకు వీటికి అదనంగా మూడు పంప్‌హౌజ్‌లలో కలిపి మరో 15 మోటార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ అదనపు మోటార్ల ఏర్పాటుతో పాటు, వాటి ఏర్పాటుకు అనుగుణంగా పలు నిర్మాణాలు చేయాల్సి ఉండటంతో వ్యయం పెరుగుతోంది. పెరిగిన అంచనా వ్యయం.. గత అంచనా ప్రకారం మూడు పంప్‌హౌజ్‌లకు కలిపి రూ.7,998 కోట్లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,392 కోట్లకు చేరనుంది. ఈ పంప్‌హౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి వచ్చే నీటిని మిడ్‌మానేరు వరకు తరలించే ప్రక్రియ కోసం అప్రోచ్ చానల్, గ్రావిటీ కాల్వ, టన్నెళ్ల నిర్మాణాలకు రూ.10,500 కోట్లు అంచనా వేశారు. మిడ్‌మానేరు నుంచి ఒక టీఎంసీ నీటిని అనంతగిరి రిజర్వాయర్, అటునుంచి రంగనాయక్‌సాగర్ తిరిగి అటునుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్ వరకు తరలించేలా కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం అదనంగా 11,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కాల్వలు, అప్రోచ్ చానల్, టన్నెళ్లు, 3 పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు అవసరం ఉంటాయని లెక్కగట్టారు. దీనికై మొత్తంగా రూ.12,594కోట్లు ఖర్చవుతుందని ప్రణాళిక వేశారు. మొత్తం రూ.27,488 కోట్ల మేర అదనపు వ్యయం అవుతుందని అంచనా వేశారు. -
బృహత్తరంగా కాళేశ్వరం
తరలింపు ఇలా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు పంపుల బిగింపు ,ఎల్లంపల్లి దిగువన అదనపు టన్నెల్‌తో మిడ్‌మానేరుకు తరలింపు..మిడ్‌మానేరు నుంచి పైప్‌లైన్, గ్రావిటీ ద్వారా మల్లన్నసాగర్ వరకు. సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ద్వారా వచ్చే వర్షాకాలానికే గోదావరి నీటిని ఎత్తిపోసేలా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. దీనికి సమాంతరంగా మరో బృహత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడో మూడో టీఎంసీ నీటిని కూడా తరలించే ప్రక్రియపై దృష్టి పెట్టింది. అదనపు టీఎంసీ నీటి తరలింపుకు అవసరమైన నివేదికలు సిధ్దం చేస్తోంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటి తరలింపునకు ఇప్పటికే సివిల్ పనులు కొనసాగుతుండగా, అదనంగా పంపులు, మోటార్లు బిగించేందుకు అవసరమైన లెక్కలు వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు, అటునుంచి మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించే మార్గాలు, అయ్యే వ్యయం ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తోంది. ఇప్పటివరకు 2.. ఇకపై మూడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఆయకట్టుకు అవసరమయ్యే నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 225 టీఎంసీలు అవసరం కాగా, ఇందులో 180 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోతల ద్వారా మళ్లించారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు మళ్లించి, మిగిలిన నీటిని భూగర్భజలం ద్వారా వినియోగించుకునేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా మేడిగడ్డ పంప్‌హౌజ్ వద్ద 11, అన్నారం వద్ద 8, సుందిళ్ల వద్ద 9 మోటార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి, అటునుంచి వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు రెండు టీఎంసీలు తరలించేలా ప్రస్తుత ప్రణాళిక ఉంది. అయితే ప్రభుత్వం మిడ్‌మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ‘ఎస్సారెస్పీ పునరుజ్జీవన’పథకాన్ని చేపట్టింది. దీంతో మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ మొదలుకుని.. గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు ఒక టీఎంసీ నీరు మాత్రమే లభ్యతగా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఏడాది ఖరీఫ్ నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఒక టీఎంసీని ఎస్సారెస్పీ, పునరుజ్జీవ పథకానికి, మరో టీఎంసీని కొండపోచమ్మ సాగర్ వరకు తరలించేలా ప్రణాళిక వేసింది. రెండు టీఎంసీ తరలింపు ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలకు మూడో టీఎంసీ అవసరమున్న నేపథ్యంలో దానికి పనులు ఆరంభించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మూడో టీఎంసీ ప్రణాళిక సిద్ధమైంది. 25వేల కోట్లు దాటనున్న వ్యయం అదనపు టీఎంసీ నీటి తరలింపుపై అధికారులు వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నీటిపారుదల వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌజ్‌ల పరిధిలో 15 మోటార్లు అదనంగా అమర్చనున్నారు. ఇప్పడున్న వాటితో కలిపి అదనంగా మేడిగడ్డలో 6, అన్నారంలో 4, సుందిళ్లలో 5 మోటార్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా రూ.1600కోట్ల మేర వ్యయం కానుందని అంచనా వేస్తున్నారు. ఇక ఎల్లంపల్లి దిగువన తాళ్లకొత్తపేట నుంచి వరద కాల్వ 92 కి.మీ. పాయింట్ వద్ద కలిపే వరకు 32 కిలోమీటర్లలో 3 కిలోమీటర్ల మేర అప్రోచ్ చానల్, దాదాపు 17 కిలోమీటర్ల టన్నెల్, అండర్‌గ్రౌండ్ పంప్‌హౌజ్‌లు ఉండనున్నాయి. ఈ నిర్మాణానికి రూ.10,500 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. ఇక మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్ వరకు మొదట టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించినా, దీని నిర్మాణాలకు చాలారోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రెషర్ మెయిన్, పైప్లైన్లు, గ్రావిటీ కాల్వల ద్వారా నీటిని తరలించేలా తుది ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ నీటి తరలింపునకు 3 స్థాయిల్లో లిఫ్టులను ఏర్పాటు చేయాల్సి రావడం.. 40 నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఈ నిర్మాణానికి రూ.14,500 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రాధమిక అంచనా వేశారు. అదనపు టీఎంసీ నిర్మాణానికి మొత్తంగా రూ.25వేల కోట్లకు మించి అదనపు వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,500 కోట్లు కాగా, ఈ మొత్తం వ్యయం కలిపితే ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లను దాటనుంది. ఇప్పటికే ప్రాజెక్టులో భూసేకరణ, ఆర్–ఆర్ అవసరాలను పక్కన పెడితే కేవలం పనులకు సంబంధించి రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇప్పటికే రూ.40వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా నిధులకై రుణాలు తీసుకోగా, అదనంగా అయ్యే వ్యయానికి సైతం రుణాలు తీసుకునే అవకాశాలున్నాయి. -
‘మల్లన్నసాగర్’ వచ్చేనెల షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ రిజర్వాయర్‌కు సంబంధించి భూసేకరణ కొలిక్కి వచ్చింది. మొత్తం భూసేకరణలో మిగిలి ఉన్న 100 ఎకరాల సేకరణను రెండు, మూడ్రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెల నుంచి పనులు మొదలు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 13 లక్షల ఆయకట్టుకు నీరు..: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ నుంచే నీటిని తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్ నుంచే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 13 లక్షల ఆయకట్టుకు నీరందించనున్నారు. ఈ భారీ నిర్మాణానికి 13,970 ఎకరాల భూ సేకరణ అవసరమవుతోంది. మూడున్నరేళ్లుగా భూ సేకరణ పనులు జరుగుతున్నా, నిర్వాసితుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ఇందులో అత్యంత కీలకంగా వేములఘాట్, తొగిట, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల్లో భూ సేకరణ జరగక పనులు మొదలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ గ్రామాల పరిధిలోని నిర్వాసితులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వెయ్యి ఎకరాలకు గానూ 900 ఎకరాలను ఎకరం రూ.7.75 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కేవలం మరో 100 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ సేకరణ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే రిజర్వాయర్ పనులకు సంబంధించి రూ.6,805 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణంలో ఏకంగా 13 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి పని, 60 మీటర్ల ఎత్తుతో కట్ట నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనుల పూర్తికి రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. -
మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే
సిద్దిపేట జోన్: ‘ఈ మట్టిలో పుట్టి.. ఈ మట్టిలోనే కలసిపోయేవాళ్లం. మీ గురించి ఆలోచించే బాధ్యత మాపై ఉంది. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేవారు భవిష్యత్తులో మీ గురించి ఆలోచించరు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆస్తులు, భూములు ఇచ్చిన మీరంతా మా ఆత్మీయులే. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాదే. మీ మంచి మనసుకు శిరస్సు వంచి వందనం చేస్తున్నా’అని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవనంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులకు మంత్రి రూ.17.10 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ పరిధిలోని 8 గ్రామాల్లో 7 చోట్ల వందశాతం భూసేకరణ పూర్తయిందన్నారు. వేములఘాట్‌లో ఇప్పటి వరకు 80 శాతం భూసేకరణ జరిగిందని, మిగతా 20 శాతం కొద్ది మంది స్వార్థ రాజకీయాల వల్ల ఆగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని.. త్వరలోనే నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్కింద 13 వేల ఎకరాల భూసేకరణ జరిగిందని.. ఇంకా 700 ఎకరాలు చేయాల్సి ఉందని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఆస్తులు ఇచ్చినవారిని ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. ప్రతి ఇంటికి రూ.7.50 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ప్రాజెక్టులో చేపల ఆదాయంపై వాటా, హక్కులు కల్పిస్తామన్నారు. గజ్వేల్‌లో కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చిన తర్వాతే.. పాత ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని, పాత ఇంటికి కూడా డబ్బులు చెల్లిస్తామని హరీశ్ భరోసా ఇచ్చారు. ప్రాజెక్ట్‌పై జరుగుతున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని చూడాలన్నారు. భూసేకరణలో భాగంగా చివరి ప్రయత్నం చేస్తున్నామని, అవసరమైతే ఆ కొద్ది మంది కోసం కోర్టులో డబ్బు డిపాజిట్ చేస్తామని వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వల్ల నిజాంసాగర్, యాదాద్రిలోని గంధమల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు అందుతుందని వెల్లడించారు. పరిహారం డబ్బులను వృథా చేయవద్దని, వాటిని భూమిపై పెట్టుబడిగా పెట్టాలని హరీశ్‌రావు సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొమరవెల్లి మల్లన్నపై సినిమా
కొమురవెల్లి(సిద్దిపేట) : మల్లన్న జీవిత చరిత్ర ఆధారంగా గౌలికర్ శ్రీనివాస్ దర్శక, నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ నాలుగో షెడ్యూల్ ప్రారంభించారు. గురువారం కొమురవెల్లి మండలకేంద్రంలో పలువురు సినిమా నటులు, సీరియల్ నటులు షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకులు గౌలికర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మల్లన్న జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాను 7 షేడ్యూల్లలో 7 సెట్లలలో తీస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 60శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. మల్లన్న వేశాధరణ ప్రత్యేక పాత్రలో సినీనటుడు సుమన్, మిగతా మల్లన్న పాత్రను లాలాజీ ఘన్‌శ్యాం నటిస్తున్నట్లు తెలిపారు. సినిమాకు సహా నిర్మాతలుగా క్రాంతిక్రిష్ణా, మహేందర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కె.నవీన్మాధవ్, కోరియోగ్రాఫర్లుగా శ్యామిల్, జోజో, ఘన్‌శ్యాం, సంగీతం విజయ్ కూరకాల, విజువల్ ఎఫెక్టŠస్ శ్రీనివాస్, ముఖ్య తారాగణం ఆనంద్ భూపతి, శ్రీదేవి, కుమార్ మిట్టపల్లి, సహకారం మందాల బాబు, మందాల శేఖర్, సిద్దిపేట శ్రీనివాస్‌లతో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. -
వాటి ఫలితమే టీఆర్ఎస్ విజయం: కోదండరామ్
డల్లాస్: ఎన్నికలను మేనేజ్ చేయడం వల్లగానీ, మీడియాను మేనేజ్ చేయడంతోగానీ రాజకీయ పార్టీలు విజయాలు సాధించలేవని ప్రొఫెసర్ కోదండరామ్ అభిప్రాయపడ్డారు. డల్లాస్‌లో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న సందర్భంగా కోదండరామ్ పలు అంశాలను ప్రస్తావించారు. ‘సామాజిక ఉద్యమాలు, ఘర్షణలు, కదలికలు, అప్పటి పరిస్థితులు ఎన్నికలకు మూలమని విశ్వసిస్తున్నాను. రాజకీయమంటే మీడియాను మేనేజ్ చేయడం, డబ్బులు పంచడం, ఎన్నికలను మేనేజ్ చేయడం కాదు. తెలంగాణ ప్రాంతంలోని సామాజిక పరిస్థితులు, ఉద్యమం, ఇతరత్రా కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే కారణంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పడు అలాంటి పరిస్థితులు లేవు. ఎన్నికల్లో నెగ్గిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సైతం ప్రస్తుతం ఎన్నికల కోసం అభ్యర్థులను ఎలా కొనగలం, ఇతర పార్టీల నేతలను ఏ విధంగా మన పార్టీలోకి రప్పించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మన నిర్వహణ సామర్థ్యం ఎలా పెంచుకోగలమని ఆలోచిస్తున్నారు. తొలిదశ ఉద్యమకాలంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉద్యమపార్టీ టీపీఎస్ నుంచి సాధారణ అభ్యర్థులు బరిలోకి దిగి.. కాంగ్రెస్‌ను ఓడించారు. అయితే ఆ సమయంలో పేపర్ తప్పా ఇతర మీడియా లేకున్నా ఆనాటి పరిస్థితుల కారణంగా టీపీఎస్ గెలుపొందింది. అప్పుడు ఎవరూ ఎన్నికలను గానీ, మీడియాను గానీ మేనేజ్ చేయలేదు. ఉద్యమం ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది. డీపీఆర్ చెప్పండి, చూపించాలని మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలు అడిగితే ఏ విషయాలు చెప్పడం లేదు. సాధారణ రైతులకు జవాబు చెప్పడం లేదు, సిటీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ప్లాన్ వివరాలు అడిగితే అలాంటివేం లేవు సార్.. ఆ కనిపిస్తున్న చోటు నుంచి ఇక్కడివరకూ భూమి తీసుకోవాలని చెప్పారని అధికారులు చెప్పారని గుర్తుచేశారు. మీకు గుర్తింపు ఉంది కానీ మీకు రాజకీయాలు రావు. అందుకే మీరు ఉంటే మాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మీరు ముందుండండి మేం పనులు చూసుకుంటామని కొందరు అన్నారు. ఎన్నికలను ప్రధానం చేసి ఆలోచిస్తున్నారు. మోసం, దగా తెలియాలి, మాయమాటలు చెప్పడం రావాలి అంటున్నారు. మరికొందరు మాత్రం మీతో డబ్బులు లేవు, మీ వల్ల ఇలాంటివి సాధ్యం కావని చెప్పారు. ఈ ఇద్దరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాం. మేం ఉండాలంటారు.. కానీ పనులు మాత్రం మీరే చూసుకుంటాం అంటున్నారు. అలాంటప్పుడు మేం ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్‌లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తారని అడిగితే వాటికి సమాధానం కరువైందంటూ’ ప్రొఫెసర్ కోదండరాం తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. -
గజ వాహనంపై మల్లన్న గ్రామోత్సవం
-
ఆ పరిహారంపై విచారణ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ సమయంలో రైతుల అభ్యంత రాల్ని తెలుసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సిద్దిపేట జిల్లా వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూమి ని సేకరించే ముందు రైతులు, భూసేకరణ వల్ల ప్రభావితుల అభ్యంతరాల్ని తెలుసుకు న్న తర్వాతే పరిహారంపై విచారణ జరపాల ని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం తమ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను ఉల్లంఘించి పరిహార చెల్లింపు విచారణ చేయడం చెల్లదంటూ వేముల ఎల్లవ్వ మరో 22 మంది రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి శుక్రవారం విచారించారు. ‘‘భూసేకరణ చట్టంలోని 19(1) ప్రకారం రైతుల అభ్యంతరాలు తెలుసుకోకుండా పరిహార చెల్లింపు విచారణ చెల్లదు. రైతులతోపాటు భూసే కరణ వల్ల ప్రభావితమయ్యే వారి అభ్యంతరాల్ని కూడా స్వీకరించాలి’’ అని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయమూర్తి తేల్చి చెప్పారు. పిటిషనర్ల భూములే కాకుండా 600 మంది అభ్యంతరాల్ని అధికారులు పరిగణనలోకి తీసుకోకుండా పరిహార చెల్లింపుపై విచారణ జరుపుతున్నారని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కొండం, ముంచిప్ప చెరువులను కలుపుతున్న పనుల్లో ఆచితూచి వ్యవహరించాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అధికారులకు మరో కేసులో ఆదేశాలు జారీ చేశారు. చెరువుల్ని కలపడం వల్ల రైతుల భూములతోపాటు అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురవుతుందంటూ ముగుపాల్ మండలం ముంచిప్ప గ్రామస్తులు బానోతు ఈశ్వర్ సింగ్, మరో 60 మంది హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ 18కి వాయిదా పడింది. -
భూ విలువల సవరణ ఉత్తర్వుల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం సిద్దిపేట జిల్లా వేములఘాట్‌లో సేకరించనున్న భూములకు భూవిలువల సవరణ ఉత్తర్వులు అమలుకాకుండా హైకోర్టు నిలిపివేసింది. మార్కెట్ విలువలను సవరిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి ఎమ్మెస్ రామచందర్‌రావు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మార్కెట్ ధరకు అనుగుణంగా కలెక్టర్ జారీ చేసిన సవరణ ఉత్తర్వులు లేవని, భూసేకరణ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొంటూ నర్సింహారెడ్డి, మరో 23 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేసిన న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. -
గ్రామ సభ నిర్వహిస్తాం..
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ పరిధిలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించేందుకు చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే భూ సేకరణను కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లన్నసాగర్ కోసం చేస్తున్న భూ సేకరణకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయడం లేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదంటూ రైతు తిరుపతి, మరో 29 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ప్రాజెక్టుకు అనుమతులు రాక ముందే ప్రభుత్వం పనులు ప్రారంభించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. జీవో 123 కొట్టేసిన తరువాత పలు గ్రామాల్లో 1,600 ఎకరాలను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ విషయంలో పూర్తి వివరాలను తెలుగులో ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని వివరించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు జారీ చేశారన్నారు. అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. గ్రామ సభ నిర్వహించకుండానే భూ సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోందని వివరించారు. అందువల్ల భూ సేకరణపై స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ గ్రామ సభ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్లా?
మల్లన్నసాగర్‌పై హైకోర్టు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుండానే టెండర్లు పిలవడంపై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అనుమతులు రానప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేములఘాట్‌కు చెందిన గండ్ల లక్ష్మి, మరో ఐదుగురు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు. -
రంగంలోకి కేసీఆర్
♦ ‘మల్లన్నసాగర్’ పెండింగ్ భూసేకరణపై దృష్టి ♦ మిగిలిపోయిన 1,250 ఎకరాల కోసం నిర్వాసితులతో సీఎం సమావేశం ♦ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో నాలుగు గంటల పాటు చర్చలు ♦ ఆదుకుంటాం.. సహకరించాలంటూ సీఎం విజ్ఞప్తి ♦ ఉపాధి అవకాశాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు ♦ రెండు పంటలు పండే భూములకు ప్రత్యేక పరిహారం ఇస్తామని హామీ గజ్వేల్ : జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘మల్లన్నసాగర్’వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగారు. పెం డింగ్‌లోని 1,250 ఎకరాల భూములను సేకరించి ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం చేసే యత్నం మొదలుపెట్టారు. అందులోభాగంగా శనివారం ‘మల్లన్నసాగర్’ముంపు గ్రామం వేములఘాట్ నిర్వాసితులను సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి చర్చించారు. ఏడాదిగా పెండింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, తొగుట, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం పంచాయతీల పరిధిలో 17,430 ఎకరాల భూమి అవసరం. ఇందులో 2,500 ఎకరాలు అటవీభూమి కాగా.. మిగతా భూమి అంతా రైతులదే. మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై 95 శాతానికిపైగా భూసేకరణను పూర్తి చేయించారు. ఇంకా వేములఘాట్ గ్రామంలో 1,150 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో 50, తొగుటలో మరో 50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ముఖ్యంగా వేములఘాట్ గ్రామస్తులు భూసేకరణను నిరసిస్తూ, పలు డిమాండ్లతో 410 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఆదుకుంటాం.. సహకరించండి! మల్లన్నసాగర్ నిర్వాసితులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వం తరఫున స్వయం ఉపాధి, కులవృత్తులకు ఉపాధి కల్పిస్తామని.. గేదెలు అందజేస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని గ్రామానికి పంపి రెండు పంటలు పండే భూముల వివరాలతోపాటు పూర్తి స్థాయిలో ఇతర సమాచారాన్ని సేకరిస్తామని.. 2 పంటలు పండే భూముల నిర్వాసితులను ప్రత్యే కంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసిం ది. దశాబ్దాలుగా నీటి గోసతో అల్లాడుతున్న తెలం గాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాజెక్టుల నిర్మాణ మే శరణ్యమని.. ‘మల్లన్నసాగర్’నిర్మాణానికి సహక రించాలని సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం. బాధితులను ఆదుకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని.. ఇక ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తా మని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. కాగా మల్లన్నసాగర్ భూనిర్వాసితులతో సీఎం భేటీ కావడంతో ఫామ్‌హౌస్ చుట్టూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భూనిర్వాసి తులను ఫామ్‌హౌస్ గేటు వద్ద క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. నేరుగా సీఎం చర్చలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న ‘కొండపోచమ్మ సాగర్’రిజర్వాయర్ భూసేకరణ విషయంగా కూడా నిర్వాసితులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని నిర్వాసితు లతో నేరుగా చర్చలు జరిపారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మల్లన్నసాగర్’ వ్యవహారంపై దృష్టి సారించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను శనివారం చర్చలకు ఆహ్వానిం చారు. దీంతో వేములఘాట్ గ్రామానికి చెందిన వంద మందికిపైగా రైతులు, ఏటిగడ్డ కిష్టాపూర్ నుంచి కొందరు రైతులు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన చర్చలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. సీఎంతోపాటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి తదితరులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్‌కు కాంగ్రెస్సే అడ్డు
♦ శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ♦ లిఫ్టులతో 3.88 లక్షల ఎకరాలు సాగు ♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని.. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాజెక్టును కట్టి తీరుతామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతి పదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు, దిండి, నెట్టెం పాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అంది స్తామన్నారు. సంగారెడ్డితోపాటు నారాయణ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బుధవా రం మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజర య్యారు. మంజీర నదిపై నిర్మించిన బోరంచ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి పారుదల సంస్థ ఐడీసీ పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా 3.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 1.23 లక్షల ఎకరాలకు మాత్రమే అందుతోందని, మిగతా పథకాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. 154 సాగునీటి ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు రూ.70 కోట్లు మంజూరు చేశామన్నారు. మరో 73 ఎత్తిపోతల పథకాలను రూ.893 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నూతనంగా నిర్మితమయ్యే ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 1,114 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్ అను సరిస్తున్న విధానాలను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియంలో గురు కులాల ఏర్పాటు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలు తీరుపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో 200 ఇంగ్లిష్ మీడియం గురుకులాల ఏర్పాటును ప్రస్తావి స్తూ పేదరిక నిర్మూలన, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల సాధన కోసం ఇంగ్లిషు మీడియంలో చదువుకోవాలన్నారు. ఉద్యమంలా హరితహారం హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టా లని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం చింతలపల్లిలో సమీకృత హాస్టల్ సముదాయంలో బుధ వారం మూడో విడత హరితహారాన్ని మొక్కలు నాటి ప్రారం భించారు. మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కింద గుంతలు తీయడంతోపాటు ఎరు వులను ఉచితంగా ఇస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా 3 వరుసల్లో ఒకే రోజు మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్‌ను ఆదేశించారు. -
వచ్చే ఏడాదికల్లా మల్లన్నసాగర్
నర్సాపూర్ రైతులతో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మల్లన్న సాగర్ వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా ప్రాజెక్టుల నిర్మాణం ఆగబోదని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి, గుండ్లపల్లి మధ్యలో ఉన్న దొంతివాగు మీద చెక్‌డ్యాం నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు సీఎం సూచించారు. అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. నర్సా పూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులు కేసీఆర్‌ను మంగళవారం ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా రైతులతో సీఎం మాట్లాడారు. ‘కొద్ది రోజుల్లో వర్షాలు కురుస్తా యని అంటున్నారు. వర్షాలు తగ్గగానే అధికా రులతో కలసి నియోజకవర్గానికి వస్తాను. అక్కడే కలుస్తాను. గ్రామాల్లో రైతుల బాధలు నాకు తెలుసు. అందుకే ఎకరాకు ఒక్కో పంటకు రూ.4 వేల చొప్పున పంపిణీ చేసే పథకం అమలు చేస్తాం. దీంతో రైతులు ఎరువులు, విత్తనాలు కొనేందుకు ఆర్థిక ఇబ్బంది తీరుతుంది. ఐదారేళ్లు కాలం మంచి గా ఉంటే రైతులు బాగుపడుతారు. ఈ లోపు ప్రాజెక్టుల నీళ్లు వచ్చి భూములు సస్యశ్యామ లం అవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులతో పాటు గొల్ల, కుర్మలకు గొర్రెలిస్తున్నామని, మూడేళ్లలో రూ.20 వేల కోట్ల సంపద సమకూరుతుందన్నారు. గొర్రెలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ వస్తుందని, చేపల పెంపకం కూడా చాలా లాభసాటి వ్యాపారమని, అందుకే చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రం అనుకున్నంత అభివృద్ధి కావాలంటే అందరూ కలిసి మెలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని పారదోలేందుకు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వినియోగిం చుకోవా లని సూచించారు. ప్రతి గ్రామం ఒక యూనిట్‌గా పనిచేయాలని, నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాల అభివృద్ధికి కావాల్సి నన్ని డబ్బులు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
మల్లన్న ఆర్జిత సేవలు రద్దు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో జరిగే కొన్ని ఆర్జిత సేవలను ఆలయ ప్రధానార్చకుల సూచనలతో ఈఓ నారాయణభరత్‌గుప్తా రద్దు చేశారు. ఈ ఆర్జిత సేవ టికెట్లు అతి తక్కువ సంఖ్యలో కొనుగోలు అవుతున్నందున మిగిలిన ఆర్జిత సేవా టికెట్లను సమర్థవంతంగా, శాస్త్రోక్తంగా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి ఈ కింది సేవా టికెట్లు రద్దయినట్లు ప్రకటించారు. రద్దయిన ఆర్జిత సేవా టికెట్లు... నవగ్రహ హోమం, చంద్రలింగాభిషేకం, బాలారిష్ట గ్రహపూజ, మహామృత్యుంజయ అభిషేకం, సహస్రలింగేశ్వర అభిషేకం, సూర్యలింగాభిషేకం, అన్నప్రాసన, నామకరణం, బాలారిష్ట దోష నివారణ పూజ, శివసహస్రనామం, పల్లకీసేవ, వెండి వాహనసేవ, అక్షరాభ్యాసం, లలితా సహస్రనామం, గౌరీవ్రతంను రద్దు చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.91 కోట్లు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల్లో భక్తులు హుండీలలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 1, 91, 45, 584 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. శుక్రవారం స్వామిఅమ్మవార్ల కల్యాణ మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నగదుతో పాటు 185 ›గ్రాముల బంగారు, 5.800 కిలో గ్రాముల వెండి, 43 యూఎస్ఏ డాలర్లు, 5 ఇంగ్లండ్ ఫౌండ్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లు, 10 ఎఎస్యూ రియాల్స్, 1 మలేషియా రింగిట్స్, 1/4 కువైట్ డాలర్ తదితర విదేశీ కరెన్సీ హుండీలలో లభించాయన్నారు.ఈ మొత్తం 30 రోజులకు గాను స్వామిఅమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
నేడు మల్లన్న హుండీల లెక్కింపు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల్లోని హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో చేపడుతున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త గురువారం తెలిపారు. అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, స్థానికులు, భక్తులంతా చొక్క, బనియన్లు తీసీవేసి హాజరుకావాలన్నారు. నగదు, ఉంగరాలు ధరించకుండా హుండీల లెక్కింపులో పాల్గొన్నాలని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తరువాత అత్యవసరంగా ఎవరైనా సిబ్బంది బయటకు వెళ్లినా, లోపలికి వచ్చినప్పుడు వారి రాకపోకల వివరాలను తెలియజేసేందుకు రిజిస్టర్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తిగా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నామని ఈఓ తెలిపారు. -
వైభవంగా మల్లన్న రథోత్సవం
-
మల్లయ్య..మమ్మాదుకోవయ్యా!
- వైభవంగా మల్లన్న రథోత్సవం - వేడుకల్లో 3లక్షలకు పైగా భక్తులు - రథోత్సవానికి ముందు కూష్మాండబలి - కీలక ఘట్టం ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు - రథోత్సవంలో భారీ బందోబస్తు శ్రీశైలం: శివభక్తులకు భూకైలాసంగా భూమండల నాభిస్థానంగా పిలువబడుతున్న జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది పర్వదినాన అశేష జనవాహిని మధ్య శ్రీశైలేశుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 26 నుంచి ఉగాది మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బు«ధవారం స్వస్తిశ్రీ హేవిలంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన సాయంత్రం 4గంటల నుంచి రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు. 4.45గంటలకు భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల రథోత్సవ వేడుక జరిగింది. సుమారు 3లక్షలకుపైగా భక్తులు రథోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఆలయాల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి, పూజలనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. పల్లకీలో వచ్చిన స్వామిఅమ్మవార్లను రథంలో ఆవహింపజేశారు. ర«థాంగబలిలో భాగంగా ఈఈ రామిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పీఆర్వో డాక్టర్ కడప అనిల్‌కుమార్, డీఈ నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు, పండితులు రథోత్సవ ప్రారంభ సూచనగా కూష్మాండబలిని సమర్పించారు. కన్నడ భక్తులు సిరిగిరి మల్లయ్యా, మహాత్మ మల్లయ్యా..మమ్మాదుకోవయ్యా.. నినాదాల మధ్య రథశాల నుంచి రథోత్సవం బయలుదేరింది. భక్తిపూర్వకంగా రథం మీదికి అరటి పండ్లు, ఎండు ఖర్జూరం, కలకండలను భక్తులు విసిరి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నంది మండపం నుంచి తిరిగి రథోత్సవం బయలుదేరి రథశాలకు చేరింది. జిల్లా ఎస్పీ రవికృష్ణ నేతృత్వంలో పోలీసులు రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు ఉగాది పర్వదినాల్లో కీలక ఘట్టమైన రథోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దేవస్థానం ఈఓ నారాయణభరత్‌గుప్త సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో పరిస్థితులను వీక్షిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వైర్లెస్ సెట్ ద్వారా సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. రథోత్సవంలో ఆకట్టుకున్న జానపద కళారూపాలు శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాల్లో కన్నడిగులను అలరించడానికి దేవస్థానం వారు సంప్రదాయ నృత్యప్రదర్శనలు, భక్తి సంగీత విభావరి తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గ్రామోత్సవంలో గొరవల నృత్యం, కోలాటం, చెక్కభజన, కన్నడడోలు విన్యాసాలు, కేరళ కథక్ కేళి నృత్యాలు, బుట్ట బొమ్మలు, పగటి వేషధారులు, జాంజ్, నందికోలు ఉత్సవం మొదలైన జానపద కళారూపాలు భక్తులను సమ్మోహితులను చేశాయి. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.28 కోట్లు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,28,53,611 ఆదాయం వచ్చినట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు. బుధవారం అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్థానికులు, భక్తులు హుండీల ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 135 గ్రాముల బంగారు, 4.4 కేజీల వెండి లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే 66 అమెరికా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు, 180 యూఎఈ దిర్హమ్స్ హుండీలలో వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం 22 రోజులకు సంబంధించినదని ఈఓ తెలిపారు. -
26 నుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు
- 28న వీరాచార విన్యాసాలు - 29న ఉగాది ప్రత్యేకపూజలు - కన్నడిగులందరికీ మల్లన్న స్పర్శదర్శనం శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో మార్చి 26న ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్‌గుప్త బుధవారం విలేకరులకు తెలిపారు. ఉత్సవాలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయన్నారు. వేడుకలను పురస్కరించుకొని ప్రతి రోజూ ప్రత్యేక అలంకారాలు, వాహన సేవలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 29న ఉగాది పర్వదినం సందర్భంగా దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరుగనుందని పేర్కొన్నారు. 26న యాగశాల ప్రవేశం.. ఉగాది ఉత్సవాలలో భాగంగా మార్చి 26న ఉదయం 8.30 యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, శివసంకల్పం, స్వస్తి పుణ్యహవచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణలతో ప్రత్యేకపూజలు ప్రారంభమవుతాయని ఈఓ భరత్ గుప్త పేర్కొన్నారు. అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమాలు జరుగుతాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం భ్రమరాంబాదేవిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి, స్వామిఅమ్మవార్లను భృంగి వాహనంపై అధిష్టంపజేసి గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం రాత్రి 8గంటల నుంచి శ్రీస్వామివార్లకు కల్యాణోత్సవం, శయనోత్సవపూజలు ఉంటాయని పేర్కొన్నారు. 27 నుంచి 30 వరకు ప్రత్యేక పూజలు ఉగాది ఉత్సవాల్లో భాగంగా 27 నుంచి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 7.30గంటలకు చండీశ్వరపూజ, మండపారాధనలు, జపానుష్ఠానములు, 9గంటలకు రుద్రహోమం, నిత్యహవనములు ఉంటాయని ఈఓ పేర్కొన్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం జరుగుతాయన్నారు. సాయంకాలం పూజలలో భాగంగా జపానుష్ఠానములు, హవన ములు, రాత్రి 8గంటలకు స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, శయనోత్సవకార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 28న సాయంత్రం 5.30 గంటలకు ప్రభోత్సవం, రాత్రి 10గంటలకు వీరశైవ భక్తుల వీరాచార విన్యాసాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం స్వస్తిశ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది మహోత్సవాల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలనుంచి దాదాపు 6 లక్షలమందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా వేశామని, వీరందరికీ వీలైనంత మేరకు స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. ఉద్యానవనాలు, ఖాళీ ప్రదేశాల్లో షామియానాలు, చలువ పందిళ్లు వేస్తున్నామని పేర్కొన్నారు. నిరంతరం మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనసేవలు.. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6.30గంటల నుంచి స్వామి, అమ్మవార్ల అలంకారాలు, వాహనసేవలు, ప్రత్యేక పూజలను ఉంటాయని ఈఓ పేర్కొన్నారు. 26వ తేదీ మహాలక్ష్మి అలంకారం భృంగివాహనసేవ 27వ తేదీ మహాదుర్గ అలంకారం కైలాసవాహనసేవ 28వ తేదీ మహాసరస్వతి అలంకారం నందివాహనసేవ 29వ తేదీ రమావాణీసేవిత రాజరాజేశ్వరి అలంకారం 30వ తేదీ శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ అశ్వవాహనసేవ -
రూ.10,876 కోట్లతో ‘కాళేశ్వరం’ రిజర్వాయర్లు
⇒ నిర్మాణానికి సర్కారు పరిపాలనా అనుమతులు ⇒ ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ⇒ వారంలో టెండర్లు పిలిచేలా అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ఐదు ప్రధాన రిజర్వాయర్లను రూ. 10,876 కోట్లతో నిర్మించేందుకు పరిపాలనా అనుమతిలిస్తూ నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరంలో చేపట్టిన రీ ఇంజనీరింగ్‌కు అనుగుణంగా ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యాలను పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం... మల్లన్నసాగర్ సహా మరో నాలుగు రిజర్వాయర్లకు గత కేబినెట్ సమావేశంలోనే ఆమోదించింది. వాటికి అనుగుణంగానే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఐదు రిజర్వాయర్లలో మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీలతో చేపట్టనుండగా దానికి రూ.7,249.52 కోట్లకు ఓకే చేశారు. రంగనాయక సాగర్ (3 టీఎంసీలు)కు రూ. 496.50 కోట్లు, కొండపోచమ్మ (ఏడు టీఎంసీలు)కు రూ.519.70 కోట్లు, గంధమల (9.86 టీఎంసీలు)కు రూ. 860.25 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికింద ఉన్న ఆయకట్టుకు కన్వేయర్ వ్యవస్థ నిర్మాణం కోసం అదనంగా మరో రూ. 870.12 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. బస్వాపూర్ (11.39 టీఎంసీలు)కు రూ.1,751 కోట్లు, కన్వేయర్ వ్యవస్థ కోసం మరో రూ. 1,132.2 కోట్లతో అంచనాలు వేశారు. మొత్తంగా ఐదు రిజర్వాయర్ల పరిధిలో రీ ఇంజనీరింగ్‌కు ముందు పనుల విలువ రూ. 1,971.38 కోట్లు ఉండగా ప్రస్తుతం ఆ వ్యయం రూ. 12,879.29 కోట్లకు చేరింది. ఇందులో కన్వేయర్ వ్యవస్థకు సంబంధించిన çరూ. 2,002.32 కోట్ల పనునులను ఇప్పటికే చేస్తున్న ఏజెన్సీలకు అప్పగించనున్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి హక్కుగా కలిగిన నీటి వాటాలను సంపూర్ణంగా విని యోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే. వారంలో టెండర్లు.. రిజర్వాయర్ల నిర్మాణానికి వారంలో టెండర్లు పిలిచేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే సిద్ధమైనప్పటికీ సాంకేతిక అనుమతుల వంటి అంశాలు మిగిలి ఉన్నందున ఈ ప్రక్రియను వారంలో పూర్తి చేసి టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. మరో 25 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మల్లన్నసాగర్ కీలకం కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజ్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. ఇక్క డి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమ ల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. అలాగే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7 రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ నుంచే నీటి తరలింపు ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాం సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్నసాగర్ నుంచి నీటిని సరఫరా చేయాలని నిర్ణయిం చారు. 13 లక్షల ఆయకట్టుకు నీరందిం చేందుకు ఈ రిజర్వాయరే గుండెకాయగా ఉండనుంది. దీని కింద మొత్తంగా 14,367 ఎకరాల ముంపు ఉంటుందని తేలగా ఎక్కువ శాతం భూసేకరణ పూర్తయింది. -
‘మల్లన్న’ ఎదురుచూపులు!
సీఎం సంతకాలు చేసినా వెలువడని అధికారిక ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపి, సీఎం సంతకాలు చేసినా.. ఇంతవరకు పరిపాలన అనుమతులు మాత్రం లభించలేదు. కాళేశ్వరం రిజర్వాయర్లతోపాటు ఓకే చేసిన దేవాదుల, ఎస్సారెస్పీ స్టేజ్–2, కంతనపల్లి పనులకు అధికారిక ఉత్తర్వులు వెలువడగా.. మల్లన్నసాగర్ సహా ప్రాజెక్టులోని ఇతర రిజర్వాయర్లు మాత్రం ఇంకా అనుమతులకోసం ఎదురుచూస్తున్నాయి. కాళేశ్వరంలో రీ ఇంజనీరింగ్‌కు అనుగుణంగా ప్రాజెక్టు రిజర్వాయర్ల సామర్థ్యాలను ప్రభుత్వం పెంచగా.. మల్లన్నసాగర్ సహా మరో 4 రిజర్వాయర్ల పరిధిలో సవరించిన అంచనాలకు గత నెలలో కేబినెట్ ఓకే చేసింది. మొత్తంగా రూ.10,876 కోట్లతో ఈ ఐదు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. మల్లన్నసాగర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనుండగా, దానికి రూ.7,249.52 కోట్ల కేబినెట్ అంచనా వేసింది. రంగనాయకసాగర్ రూ.496.50 కోట్లు, కొండపోచమ్మ రూ.519.70 కోట్లు, గంధమల రూ.860.25 కోట్లు, బస్వాపూర్ రూ.1,751 కోట్ల అంచనాలకు ఆమోదం తెలిపింది. తర్వాత సీఎం కూడా సంతకాలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు మాత్రం రాలేదు. ప్రాజెక్టు కార్పోరేషన్‌కు సంబంధించి రుణాల మంజూరు ప్రక్రియ జరుగుతుండటం, భూసేకరణ అంశాలు కొలిక్కిరాకపోవడం వల్లే పరిపాలన అనుమతుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. 13 లక్షల ఆయకట్టుకు కీలకం... కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజ్వాయర్ కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కింద మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. అలాగే ఇక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది. మరోవైపు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ నుంచే నీటి తరలించే ప్రణాళిక వేశారు. సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకూ ఈ రిజర్వాయర్ నుంచే నీరు సరఫరా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్నసాగరే ప్రధానంగా ఉంది. -
శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా
ఆత్మకూరు : ప్రకాశం జిల్లా చీరాల నుంచి మల్లన్నకు సమర్పించే పాగాను గురువారం పృథ్వీ వెంకటేశ్వర్లు..శ్రీశైలం తీసుకువచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వంశపరం పరంగా పాగాను కఠోర దీక్షతో ఈ వంశం వారు తయారు చేసి శ్రీశైల క్షేత్రానికి తీసుకొస్తున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఆలయ అధికారులు..పృథ్వీ వెంకటేశ్వర్లుకు స్వాగతం పలికారు. -
మయూర వాహనాధీశా.. నమో నమః
- నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శ దర్శనం - రేపటి నుంచి అందరికీ అలంకార దర్శనమే - రాష్ట్ర ప్రభుత్వం తరపున నేడు పట్టువస్త్రాల సమర్పణ - అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీశైలం: శ్రీశైలేశుడు భ్రామరీ సమేతంగా మయూర వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. స్వామి, అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు హరోంహర.. శంభోశంకర.. శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను మయూర వాహనంపై అధిష్టింపజేశారు. వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేద పండితులు వాహన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయల గోపురం మీదుగా రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నంది మండపం, బయలు వీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరుకుంది. గ్రామోత్సవంలో లక్షలాది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, ఈఈలు శ్రీనివాస్, రామిరెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా మంగళవారం రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. ఆ తర్వాత మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల ఆలంకార దర్శనాన్ని మాత్రమే కల్పిస్తామన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండదన్నారు. శివరాత్రి పర్వదినాన నిర్వహించే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు భవనాలు, రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మంగళవారం సాయంత్రం పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు. -
హంస వాహనధీశా.. హరోంహర
- శ్రీశైలంలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - పోటెత్తుతున్న భక్తులు - కళాకారుల ప్రదర్శనలు ఆమోఘం శ్రీశైలం: హంసవాహనంపై దేవేరి భ్రామరీతో మల్లన్న మందస్మితదరహాస వీచికలతో కనులపండువగా కనిపించడంతో భక్తులు ఆనందపరవశులయ్యారు. శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహనపూజలను అందుకున్నారు. అమ్మవారి ఆలయప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి7.30 గంటలకు హంసవాహనాధీశులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకారపూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరినామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన పురవీ«ధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఈ గ్రామోత్సవం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా స్వామిఅమ్మవార్ల ఆలయప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. కార్యక్రమంలో ఈఓ నారాయణ భరత్‌గుప్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గోదావరి ఘటన విచారణ కమిటీ చైర్మన్ జస్టీస్ సోమయాజులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. తప్పెట చిందులు, కోలాటం, బుట్టబొమ్మల నాట్యం, నందికోలు ఉత్సవం, డోలు కళాకారుల విన్యాసాలు, బంజరాల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 1.40 కోట్లు
శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయ ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.1,40,80,480లు వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, వ్యాపారస్తులు, భక్తులు హుండీల ఆదాయాన్ని(24 రోజులు) లెక్కించారు. నగదుతోపాటు 304.5 గ్రాముల బంగారం, 3.950 కేజీల వెండి వచ్చినట్లు ఈఓ తెలిపారు. అలాగే 345 యూఎస్ఎ డాలర్లు, 50 ఇంగ్లాండ్ ఫౌండ్లు, 5 కెనడా డాలర్లు, 5 యూఏఈ దిర్హమ్స్, 219 మలేషియా రింగిట్స్, 4 సింగపూర్ డాలర్లు లభించాయన్నారు. -
వైభవంగా మల్లన్న శ్రీగిరి ప్రదక్షిణ
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం.. గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీశైలానికి ముఖద్వారాలైన త్రిపురాంతకం, సిద్ధవటం, ఉమామహేశ్వరం, అలంపూర్ దేవాలయాలను దర్శించుకుని తిరిగి మల్లన్నను దర్శించుకుంటే శ్రీగిరి ప్రదక్షిణ చేసినట్లవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో తపసంపన్నులైన మునులు, రుషులు, యతులు వాయువేగంతో 24గంటల వ్యవధిలో గిరిప్రదక్షిణను చేసుకునే వారని అంటారు. అంతటి మహిమాన్వితమైనదే శనివారం శ్రీశైలంలో జరిగిన శ్రీగిరిప్రదక్షిణ. శ్రీశైలక్షేత్రానికి వలయకారంలో 6 కి.మీ రోడ్డుమార్గంగా నిర్మించిన రింగ్‌రోడ్డు ద్వారా శ్రీగిరి ప్రదక్షిణ చేస్తే నాలుగు ముఖద్వారాలను దర్శించుకున్నంత ఫలం దక్కుతుందని పీఠాధిపతులు, పండితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా శనివారం మహామంగళహారతిసేవల అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకీలో అధిష్టింపజేసి షోడశోపచార పూజలను ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు,వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయప్రదక్షిణ అనంతరం పల్లకీని ఊరేగింపుగా గంగాధర మండపం, అంకాలమ్మగుడి, నందిమండపం, గంగాసదన్ వద్ద ఉన్న వినాయక ఆలయం, యజ్ఞవాటిక, శ్రీగిరికాలనీ, మల్లమ్మకన్నీరు ఆలయం, పంచమఠాలు, రుద్రుని పార్కు, సిద్ధిరామప్పకొలను పై భాగం,క్షత్రియ రాజుల సత్రం నుంచి నందిమండపం చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజలను నిర్వహించక నేరుగా మల్లన్న ఆలయప్రాంగణం చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగిసింది. -
వెండి రథోత్సవ శోభ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో సోమవారం వెండి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రాత్రి వైభవంగా సహస్రదీపార్చనను నిర్వహించారు. సహస్రదీపార్చన కార్యక్రమం ముగిశాక స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిరథంపై ఆధిష్టింపజేసి విశేష పూజలను జరిపారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించారు. వందలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల సహస్రదీపార్చన సేవ, వెండిరథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. -
మల్లన్న సేవలో దివ్యదర్శనం భక్తులు
శ్రీశైలం: ఏపీ దేవాదాయశాఖ నిర్వహిస్తున్న ‘దివ్యదర్శనం’లో భాగంగా కర్నూలు కు చెందిన 100 మందితో కూడిన భక్త బృందం గురువారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద జేఈఓ హరినాథ్‌రెడ్డి వీరికి ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భక్త బృందానికి అమ్మవారి ఆలయప్రాంగణంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా, అధికారులు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, స్వామివార్ల ప్రసాదాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్ర పూజాకుంకుమ, కైలాస కంకణాలు, శ్రీశైల స్థలపురాణం పుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ పేద హిందూ భక్తులు ఆయా క్షేత్రాలను ఉచితంగా దర్శించుకునేందుకు వీలుగా రాష్ట్ర దేవాదాయశాఖ ఈ ధార్మికత యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. కర్నూలు నుంచి బయలు దేరిన ఈ భక్తబృందం ఒంటిమిట్ట, తిరుపతి, జొన్నవాడ, విజయవాడ, పెద్దకాకాని తదితర క్షేత్రాలను దర్శించుకుని గురువారం శ్రీశైల మహాక్షేత్రానికి చేరుకోవడంతో దివ్యదర్శన యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్ర 4,5 రోజుల పాటు దివ్యదర్శన యాత్ర దేవాదాయశాఖ ఏర్పాటు చేస్తుందన్నారు. యాత్ర బృందంలో 90శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. -
పుష్పపల్లకీలో విహారం.. మల్లన్న వైభోగం
-
పుష్పపల్లకీలో మల్లన్న విహారం..
- ·సంక్రాంతిన నందివాహనుడై మల్లన్న - వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం శ్రీశైలం: శ్రీశైల ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్న మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కనుమ పర్వదినాన మల్లన్న పుష్పపల్లకీలో విహరిస్తూ భక్తులకు కనులపండువగా దర్శనమిచ్చారు. శనివారం సంక్రాంతి పర్వదినం నాడు ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లను నందివాహనంపై ఆవహింపజేసి విశేష వాహనసేవలను నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించి తిరిగి ఆలయప్రాంగణానికి చేర్చారు. ఆ తరువాత స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో శ్రీపార్వతీ సమేతుడైన శ్రీ మల్లికార్జునస్వామి వారికి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి కనుమ పర్వదినాన శ్రీ పార్వతీసమేత మల్లికార్జునస్వామివార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలను నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవమూర్తులను ఆలయప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పుష్పపల్లకిలో స్వామిఅమ్మవార్లను ఉంచి అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు అదేరోజు రాత్రి సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా వేదపండితులచే వేదస్వస్తి జరిగింది. ఆగమశాస్త్ర సాంప్రదాయానుసారం కల్యాణోత్సం చేసుకున్న పార్వతిదేవీ నాగవల్లి కార్యక్రమంలో భాగంగా మెట్టెలు,నల్లపూసలను అలంకరించారు. పుష్ప పల్లకీ తయారీలో తెలుపు, పసుపు చేమంతి, బంతి, కనకాంబరం, నందివర్ధనం, కాగడా, జబ్ర, కార్నేషన్, ఆర్కిడ్స్, గ్లాడియోలస్, టైగర్రోజ్, స్టార్రోజ్, ఆస్టర్, అస్ప్రిడ్స్, పన్నీరుఆకు తదితర పుష్పాలను వినియోగించారు. -
దొంగ పట్టాలపై విచారణ జరపాలి
సీపీఐ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో దొంగ పట్టాల వ్యవహారంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. భూమి ఇచ్చేందుకు కొన్ని గ్రామా ల్లో రైతులు ఎదురు తిరగడంతో దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం చోటు చేసుకుందని అన్నారు.ప్రభుత్వ తొందరపాటు, దుందుడుకు ఆలోచనలే ఇటువంటి అక్రమాలకు ప్రధాన కారణమన్నారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు పెంచడమే ప్రధాన వివాదాం శమన్నారు. దాదాపు 23వేల ఎకరాలను ప్రభుత్వం తీసుకోవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉద్యమరూపు దాల్చిందన్నారు. అధికారపార్టీ ప్రజాప్రతి నిధులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై విభజించు–పాలించు విధానాన్ని అమలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
ఆర్ధ్ర నక్షత్రం.. మల్లన్న వైభోగం
-· శ్రీశైలేశుడికి శాస్త్రోక్తంగా జన్మ నక్షత్ర పూజలు - వైభవంగా గ్రామోత్సవం శ్రీశైలం: శ్రీ మల్లికార్జునస్వామి జన్మనక్షత్రం ఆర్ధ్ర. దీనినే ఆరుద్ర నక్షత్రంగా కూడా పిలుస్తుంటారు. పుష్యమాసంలో వచ్చే ఆర్ధ్ర నక్షత్రం రోజున వార్షిక ఆరుద్రోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 10.30గంటల నుంచి గురువారం అర్థరాత్రి ఒంటి గంట వరకు శాస్త్రోక్తరీతిలో ఫలరసాభిషేకం, పంచామృతాభిషేకం, అన్నాభిషేకాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. గురువారం వేకువజామున సుప్రభాత, కాలపూజ, మహామంగళహారతిసేవతో స్వామివార్లను మేల్కొల్పారు. ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా ఉత్సవమూర్తులను కొలువుంచి విశేషపూజలు చేశారు. అనంతరం నందివాహనంపై స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి వాహనపూజలను ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి అంకాలమ్మగుడి, నందిమండపం వరకు అత్యంతవైభవంగా గ్రామోత్సవం జరిగింది. భక్తులు నందివాహనాధీశులైన శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను ఉత్తరద్వారంలో దర్శించుకుని పునీతులయ్యారు. వైభవం -
నేడు మల్లన్న ఉత్తర ద్వార దర్శనం
- క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పూజలు - సుప్రభాత, మహామంగళహారతిసేవలు తాత్కాలికంగా రద్దు శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిఅమ్మవార్లకు జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం ప్రకటించారు. ఆదివారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు జరిగే విశేషపూజల అనంతరం 5గంటలకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉత్తరముఖంగా వేంచేయించి అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారన్నారు. ఉత్తర గోపుర పునఃనిర్మాణ పనుల కారణంగా ఈ ఏడాది ఆలయ మహాద్వారం శ్రీకృష్ణదేవరాయ గోపురం ద్వారా గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 నుంచి భక్తులకు మల్లన్న సర్వదర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఏకాదశిన ఆలయపూజావేళ్లలో మార్పులు.. ముక్కొటి ఏకాదశిని దృష్టిలో ఉంచుకుని ఆలయపూజావేళ్లలో మార్పులు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఆదివారం ఉదయం 3గంటలకు మంగళవాయిద్యాలు, 3.30గంటలకు సుప్రభాతం, 4.30గంటలకు మహామంగళహారతి, ఆ తర్వాత స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రావణవాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. -
నేడు మల్లన్న అలంకార దర్శనం
- ఆర్జిత సేవలు నిలుపుదల - సుప్రభాత, మహామంగళహారతిసేవలు రద్దు శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనభాగ్యం నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం తెలిపారు. ఆదివారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను కూడా రద్దు చేశామన్నారు. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ముందు జరిగే కుంకుమార్చన తదితర ఆర్జితసేవలన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి అలంకార దర్శనాన్ని కొనసాగిస్తామని అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతి సేవలు ఏకాంతంగా జరిపి 5.30గంటల నుంచి స్వామివార్ల అలంకార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. -
వారిది రాక్షసానందం : సీఎం కేసీఆర్
-
నావి వందల ఎకరాలు పోయాయి: కేసీఆర్
హైదరాబాద్: భూమి పోతే ఎలాంటి బాధ ఉంటుందో తనకు తెలుసని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే, ప్రాజెక్టులు కట్టే సమయంలో భూములు పోవడం సహజమని బహుళ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వాటిని అర్ధం చేసుకోవాలని కోరారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంపై మాట్లాడారు. మల్లన్న సాగర్‌పై ప్రతిపక్షాలు అనవరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కట్టడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు. అందుకే కుట్రలు చేసి పోలీసులు కాల్పులు జరిపేదాక తీసుకెళ్లారని అన్నారు. ముదిగొండలోలాగే మల్లన్న సాగర్ విషయంలో కూడా చేయాలని సీపీఎం ప్రయత్నించిందని ఆరోపించారు. భూమిపోతే ఆ బాధేంటో తనకు తెలుసని అప్పర్ మానేరులో తాను వందల ఎకరాలు కోల్పోయానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు ఇవ్వని పరిహారం తాము ఇస్తున్నామని రిజిస్ట్రేషన్ ధరకంటే తాము పది శాతం అదనంగా చెల్లిస్తున్నామని చెప్పారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ కట్టుకునేందుకు రూ.5.4లక్షలు ఇస్తున్నామని, రైతులకు మేలు చేయాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు. 2017 డిసెంబర్ నాటికి మల్లన్న సాగర్ పూర్తి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 జూన్ కల్లా గోదావరి జలాలను ఉత్తర తెలంగాణకు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.1.29 కోట్లు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయదేవాలయాల్లోని 15 రోజుల హుండీ ఆదాయం రూ.1,29,41,864 వచ్చినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. శనివారం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగదుతో పాటు 36.650 గ్రాముల బంగారు, 2.150 కిలో గ్రాముల వెండి వచ్చిందన్నారు. గత నెల 25 నుంచి శనివారం వరకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
ప్రతిపక్షాల కుట్రలను కడిగేస్తా..
పుల్కల్: ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతి పక్షాల కుట్రలను త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో కడిగి పారేస్తామని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద సిరారపు రాజ నర్సింహ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే.. దురుద్దేశంతో విపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేం దుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక కుట్రలు చేశారన్నారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన రైతులు ఇప్పుడు కోర్టులో కేసు ఎలా వేస్తారని మంత్రి ప్రశ్నించారు. చనిపోయిన రైతుల వేలిముద్రలను కాంగ్రెస్ నాయకులే నొక్కి తప్పుడు కేసులు వేశారని, ఇందుకు సంబం ధించిన ఆధారాలు సేకరించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం ఉమ్మడి ఏపీలో తెలంగాణకే కాకుండా మెదక్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని హరీశ్ పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి సింగూరును నింపుతా మని హరీశ్‌రావు తెలిపారు. -
మల్లన్న ఆలయానికి రూ. 2 లక్షలు విరాళం
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదానం, గో సంరక్షణ పథకానికి రూ. 2 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఇందులో అనంతపురానికి చెందిన కాంతం రాజేశ్వరి రూ. లక్ష అన్నదాన పథకానికి, ధర్మవరంకు చెందిన ఆదిములం సత్యవతిలు రూ. లక్ష గోసంరక్షణ నిధికి అందించారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం విరాళాల కేంద్రంలోని పర్యవేక్షకులు మధుసూదన్‌రెడ్డికి విరాళానికి సంబంధించిన నగదు మొత్తాన్ని అందజేశారు. ఆ తరువాత వారికి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను బహూకరించారు. మహానందిలో.. మహానంది: మహానంది క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన కె.సుబమ్మ, సత్యం దంపతులు రూ. 51000 చెక్కును అందించినట్లు సూపరింటెండెంట్ పరశురామశాస్త్రి మంగళవారం తెలిపారు. -
మల్లన్నకు నృత్యార్చన
శ్రీశైలం: స్థానిక నాగులకట్ట వద్ద మంగళవారం రాత్రి సినీ నృత్య దర్శకులు కేవీ సత్యనారాయణ బృందం చేసిన నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. ప్రత్యేక కళావేదికపై అ«ధునాతన సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. గిరిజాసుతనకు వందనం, సూర్యాష్టకం, ఇదిగో భద్రాది, మారుతమనిమయ తదితర కీర్తనలకు యం. సురేంద్రనాథ్, బివికెవిపి దీక్షితులు, ఐశ్వర్య, కౌస్య, నందితలక్ష్మి, సృష్టినిధి, అంజలి, దేవిశ్రీలు నృత్యప్రదర్శన ఇచ్చారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ. 76.88 లక్షలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 76,88,152 లభించినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శుక్రవారం అక్కమహాదేవి అలంకార మండపంలో జరిగిన ఈ లెక్కింపులో అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, శివసేవకులు, స్థానిక సత్రాలు, వ్యాపారస్తులు, భక్తులు పాల్గొన్నారని అన్నారు. నగదుతో పాటు 18 గ్రాముల బంగారు, 750 గ్రాముల వెండి లభించినట్లు పేర్కొన్నారు. అలాగే 68 యూఎస్ఏ డాలర్లు, 5 యూఏఈ దిర్హమ్స్,1 ఓమన్ రియాల్స్, 6 మలేషియా రింగిట్స్ వచ్చాయన్నారు. గత 18 నుంచి శుక్రవారం వరకు వారం రోజుల్లో స్వామిఅమ్మవార్లకు వచ్చిన ఆదాయంగా ఈఓ పేర్కొన్నారు. -
మల్లన్న భక్తులకు ఇబ్బందులు
శ్రీశైలం: మల్లన్న భక్తులు బుధవారంనానా అవస్థలు పడాల్సి వచ్చింది. క్షేత్రవ్యాప్తంగా పెద్ద నోట్లు ఎవరూ తీసుకోకపోవడంతో చిల్లర సమస్య ఎదురైది. అభిషేకాలు నిర్వహించుకునే సేవాకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. రూ. 1500లు టికెట్ కావడంతో రూ. వెయ్యి, రూ.500ల నోట్లను దేవస్థానం వారు తీసుకుని టికెట్లను అందజేశారు. ప్రత్యేక దర్శనం రూ. 100ల టికెట్ తీసుకునే భక్తులకుమాత్రం చుక్కలు కనిపించాయి. దేవస్థానం ప్రత్యేక దర్శన క్యూ కౌంటర్లో రూ. 100ల నోట్లు లేకపోవడంతో రూ. 500ల నోటు తీసుకుని ఇచ్చి రెండు లేక మూడు టికెట్లు అడిగిన భక్తులకు మిగిలిన సొమ్మును దర్శనానంతరం వచ్చి తీసుకుని వెళ్లవల్సిందిగా స్లిప్పై రాసి ఇవ్వడం కనిపించింది. శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చి ఏదో ఒక వస్తువు ఇంటికి తీసుకెళ్దామనుకున్న భక్తులకు వ్యాపారస్తుల నుంచి చుక్కెదురైంది. ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయకపోవడంతో హోటళ్లలో సైతం చిల్లర దొరకలేదు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డాం: కె శ్రీనివాస్, కాకినాడ కార్తీకమాసం సందర్భంగా మల్లన్న దర్శనం కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చాం. ఏటీఎం కార్డులు ఉన్నందున నగదు రూపంలో ఎక్కువ మొత్తాన్ని తీసుకురాలేదు. ఉదయం శ్రీశైలం వచ్చాక తెలిసింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఏటీఎంçలు పనిచేయవని, బ్యాంకులు కూడా ఉండవని చెప్పడంతో ఏం చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడ్డాం. సన్నిహిత మిత్రుల ద్వారా శ్రీశైలంలో స్థానికంగా నివాసమున్న వారి వద్ద నుంచి అప్పుగా నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రూ.7,500 కోట్లతో మల్లన్నసాగర్!
► వ్యయ అంచనాలకు నీటి పారుదల శాఖ కమిటీ ఆమోదం ► ఇసుక రీచ్‌ల పరిధి, ఉక్కు ధరలు తగ్గడంతో రూ.1,700 కోట్ల మేర తగ్గిన భారం ► ఈ నెలలోనే టెండర్లు చేపట్టాలని హరీశ్‌రావు ఆదేశాలు ► 10న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టనున్న కొమురవెల్లి మల్లన్నసాగర్(తడ్కపల్లి) రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7,500 కోట్లు వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ తేల్చింది. గతంలో దీనిని రూ.9,200 కోట్లుగా అంచనా వేసినా.. ఇసుక రీచ్‌ల పరిధిని కుదించడం, స్టీలు ధరలు తగ్గిన నేపథ్యంలో రూ.1,700 కోట్ల మేర భారం తగ్గినట్లు తెలుస్తోంది. ఈ వ్యయ అంచనాలకు నీటి పారుదల శాఖ ఐబీఎం కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలలోనే టెండర్లు పిలవాలని గురువారం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై 10వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తగ్గిన వ్యయం తొలుత ప్రతిపాదించిన 1.5 టీఎంసీల లెక్కన మల్లన్నసాగర్ అంచనా వ్యయం రూ.1,864కోట్లు కాగా.. దానికి 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో వ్యయం రూ.1,954.59 కోట్లుగా తేలింది. అయితే ఆ తర్వాత రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచి, కొత్త అంచనా వ్యయాన్ని రూ.9,200 కోట్లుగా లెక్కించారు. మల్లన్నసాగర్ ద్వారా సరఫరా అయ్యే నీటితో ఏకంగా 9 ప్యాకేజీల్లో 10.81 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతో పాటు మరో 7.37 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉంది. మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మ, బస్వాపూర్, గంధమల రిజర్వాయర్లకు నీరు వెళుతుంది. అయితే ఈ రిజర్వాయర్‌కు అవసరమయ్యే మట్టి, ఇసుకలను దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చేలా అధికారులు సిద్ధం చేసిన తొలి ప్రణాళికలను మార్చారు. ఇసుక తీసుకునే రీచ్‌ల పరిధిని కుదించడం, నేరుగా నీటి పారుదల శాఖే తీసుకునేలా నిర్ణయించడంతో ఏకంగా రూ.750 కోట్ల మేర భారం తగ్గింది. ఇక ఉక్కు ధర టన్నుకు రూ.1,100 మేర తగ్గడంతో సుమారు మరో రూ.900 కోట్ల భారం తగ్గింది. దీంతో తాజా అంచనా రూ.7,500 కోట్లకు చేరింది. ప్రస్తుత అంచనాలు కొలిక్కి రావడంతో ఈ నెలలోనే టెండర్లు పిలవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశించారు. సామర్థ్యం పెంపుతో.. ప్రాజెక్టులో ప్రతిపాదించిన 160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు.. సిద్దిపేట జిల్లా పరిధిలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. వీటితోపాటు ఇమాంబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1 టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచింది. కొత్తగా నల్లగొండ జిల్లాలో గంధమలను 9.86 టీఎంసీలతో, బస్వాపూర్‌ను 11.39 టీఎంసీలతో రిజర్వాయర్లు చేపట్టాలని నిర్ణయించింది. -
వెలిగిన ఆకాశదీపం
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో సాయం సంధ్యవేళ ఆకాశదీపాన్ని శాస్త్రోక్తరీతిలో ఈఓ భరత్ గుప్త దంపతులు, అర్చకులు వెలిగించారు. ఆవునేతిలో ముంచిన ఒత్తిని ప్రమిదలో వెలిగించి ఇత్తడితో చేసిన భరణిలో ఉంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఈ ఆకాశదీపాన్ని ఏర్పాటు చేశారు. కార్తీకమాసం ముగిసేంతవరకు ప్రతిరోజూ సాయంకాలం సంధ్యాసమయంలో ఈ ఆకాశదీపాన్ని వెలిగించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. అలాగే ఆకాశదీపాన్ని దర్శించడం వల్ల సర్వపాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, అకాల మరణం సైతం ఆకాశదీప దర్శనంతో దరిచేరదని వారు పేర్కొన్నారు. అనివార్యకారణాలతో ఆలయ ప్రవేశం చేయలేని వారు దూరం నుంచే ఈ ఆకాశదీపాన్ని దర్శించుకోవచ్చుననే సామాజిక అంశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు. -
మల్లన్న భక్తులకు వనభోజనాలు
- కార్తీక మాసంలో రోజుకు 1500 అభిషేకం టికెట్ల విక్రయం ·- ఆన్‌లైన్‌తోపాటు దేవస్థానం అన్ని అతిథిగృహాలలో టికెట్ల లభ్యం - క్యూలో ఉచితంగా పాలు, మజ్జిగ, పులిహోర ప్రసాదాలు - కార్తీక పౌర్ణమిన నదీహారతులు, జ్వాలాతోరణం శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే కార్తీకమాసాన్ని పురస్కరించుకుని భక్తులకు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ భరత్ గుప్త తెలిపారు. శనివారం దేవస్థానం పరిపాలనా భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్తీకమాసంలో క్షేత్రానికి వచ్చిన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగా క్యూ కాంప్లెక్స్, ఉచిత,ప్రత్యేక దర్శన క్యూలలో వేచి ఉండే భక్తులకు దేవస్థానం మంచినీరు, మజ్జిగ, పాలు, పులిహోర ప్రసాదాలను అందజేస్తామన్నారు. స్వామివార్లను అభిషేకం చేసుకోవడానికి ఆన్లైన్లో రూ. 1500 ముందస్తు టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అలాగే మల్లికార్జునసదన్, గంగా సదన్ తదితర అతిథిగృహాలలో కూడా భక్తుల కోసం టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు ఐదారు విడుతలుగా, సాయంత్రం మరో విడతలో అభిషేకాల నిర్వహణ ఉంటుందని, గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లను నియంత్రించి 20 నుంచి 25లోపు విక్రయించాలని భావిస్తున్నామని, రద్దీకనుగుణంగా ఈ టికెట్ల విక్రయం ఉంటుందని చెప్పారు. కార్తీక పౌర్ణమి ఈ ఏడాది సోమవారంతో కలిసి వచ్చిందన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణవేణీ నదీమాతల్లికి అదేరోజు సాయంత్రం నదీహారతులు, రాత్రి 7గంటలకు గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
శ్రీశైలంలో కార్తీక మాస భక్తులకు విస్తృత సౌకర్యాలు
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవ క్షేత్రంలో శ్రీశైలంలో ఈ నెల 31 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మల్లన్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఈఓ భరత్ గుప్త శనివారం తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు జేఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ అభిషేక సేవాకర్తలను దృష్టిలో ఉంచుకుని సామూహిక అభిషేకాలను ప్రతిరోజూ 1500 టికెట్లను విక్రయించాలని నిర్ణయించామన్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్, క్యూలలో వేచి ఉండే భక్తుల కోసం ఉచితంగా పాలు, మజ్జిగ, మంచినీరు, పులిహోర ప్రసాదాలను మొదలైన వాటిని అందజేస్తామన్నారు. కార్తీక మాసంలో వనభోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం ఫలహారంతో వనభోజనాలను కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5వేల గర్భాలయ అభిషేకం టికెట్లపై నియంత్రణ ఉంటుందని, రద్దీకి అనుగుణంగా ఈ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
మల్లన్న సేవలో మంజునాథ్ కమిటీ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లను మంజునాథ కమిటీ మంగళవారం దర్శించుకున్నారు. వీరిలో చైర్మన్ మంజునాథ్, సభ్యులు కృష్ణమోహన్, పూర్ణచంద్రరావు, సత్యనారాయణ, సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు. ప్రధానాలయ గోపురం వద్ద జేఈఓ హరినాథ్‌రెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, జేఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆర్డీఓ రఘుబాబు, ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, తహశీల్దార్ విజయుడు, సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్,టూటౌన్ ఎస్ఐలు వరప్రసాద్, ఓబులేష్, వీఆర్వో నాగచంద్రుడు తదితరులు ఉన్నారు. -
మల్లన్న వైభవం
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్లు వెండిరథంపై దర్శనమిచ్చారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో రాత్రి వెండిరథంపై ఉత్సవమూర్తులను ఆధిష్టింపజేసి విశేషపూజలను నిర్వహించి ఆలయప్రదక్షిణ చేయించారు. కార్యక్రమానికి ముందుగా ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మండపంలో ఽఉంచి ప్రత్యేకపూజలను వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తకంగా అర్చకులు నిర్వహించారు. కళారాధనలో భాగంగా అక్కమహదేవి అలంకార మండపంలో హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. - శ్రీశైలం -
13 వేల కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రూ.13 వేల కోట్లతో ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలకు వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన రిజర్వాయర్ల అంచనాల తుది పరిశీలన శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయితే ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. ఈ ప్రక్రియంతా వారం, పది రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఈ రిజర్వాయర్లలో మల్లన్నసాగర్(తడ్కపల్లి)కే గరిష్టంగా రూ.9,300 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు. -
మల్లన్న హుండీలో సాంబ్రాణి రవ్వలు
- రూ.1,060 దగ్ధం శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయంలో సోమవారం పొరపాటున సాంబ్రాణి నిప్పు రవ్వలు పడడంతో హుండీలోని రూ.1060 దగ్ధమైనట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. శ్రీస్వామివార్ల ఆలయంలోని హుండీని మంగళవారం దేవాదాయశాఖ అధికారి సమక్షంలో లెక్కింపు చేపట్టగా రూ.6,42,373 వచ్చిందని.. ఇందులో నిప్పు రవ్వల వల్ల రూ.1,060 వినియోగానికి అవకాశం లేకుండా పోయినట్లు వెల్లడించారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతం, మహామంగళహారతి సేవలు, సాయంత్రం జరిగే మహామంగళహారతి సేవలలో స్వామివార్లకు ప్రత్యేకంగా సాంబ్రాణితో ధూపం వేస్తారు. సోమవారం స్వామివార్ల హారతుల సమయంలో ధూపంవేసి గర్భాలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న హుండీలో నిప్పురవ్వ హుండీలో పడినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న ఆలయ సిబ్బంది కూడా ఇది గమనించకపోవడం.. కొద్దిసేపటికి హుండీల్లో పొగరావడంతో వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి
చేర్యాల : ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న తనకు ఇష్టదైవమని, ఏటా స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు చెప్పారు. కాగా, శివారెడ్డితో కలిసి సెల్ఫీ దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయాన్ని దర్శించుకున్న వారిలో శివారెడ్డి స్నేహితులు కిశోర్, రాజిరెడ్డి, రాజు, నవీన్, రమేశ్, రవి, సత్యనారాయణ ఉన్నారు. -
పంట కోతకు నేనూ వస్తా!
• ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్ • ఊరు ఊరంతా సైన్యంలా కదలాలి.. పంట కోతలు ఏకకాలంలో చేపట్టాలే • వచ్చే ఏడాదికి మూడు పంటలు తీయాలి.. 12 ఏళ్ల దాకా కరువుండదు • మల్లన్నసాగర్ పంచాయితీ తెగింది.. రిజర్వాయర్ రెండేళ్లలో పూర్తి చేస్తాం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ప్రభుత్వం మీ వెంట ఉంది. తెలంగాణలో తొలి ఫలాలను అందుకోబోతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలె. రాష్ట్రానికి మార్గం జూపాలె. ఊరు.. ఊరంతా సైన్యంలా కదిలి మొక్కజొన్న, సోయాబీన్ పంట కోత పనులు ఏకకాలంలో చేపట్టాలె. చేను కోతలో నేను కూడా పాల్గొని పంట కోస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో అన్నారు. ప్రజలంతా కలసి సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ‘‘పంట కోత పని పూర్తి కాగానే వెంటనే రబీ విత్తనాలు వేద్దాం. మల్లసారి ఏడాదికి మూడు పంటలు తీసే స్థితికి మనం రావాలి. అంతా కలిసి మెలిసి ఉందాం. కలిసి ఊరు, సాగు పనులు చేసుకుందాం’’ అని చెప్పారు. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో తన ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలసి వరికోత పనులు పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బుధవారం ఎరవ్రల్లిలో కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్లో తన దత్తత గ్రామాలైన ఎరవ్రల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలతో సీఎం సమావేశమయ్యారు. మల్లన్నసాగర్ పంచాయితీ ఇక తెగిపోరుుందని, మరో రెండేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు. 365 రోజుల పాటు ఇక్కడికి గోదావరి జలాలు తెచ్చి ఎప్పడూ పచ్చని కాంతులు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఈ ఏడాది వరదలొస్తయని నేను ముందే జెప్పిన. అన్నట్లే వచ్చినయ్. నీళ్లు నిలబడ్డయ్. ఇంతకుముందు చేబర్తి చెరువు మత్తడి దుంకి కూడవెళ్లిలో పడి గోదాట్లో కలిసేది. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ నీళ్లు నింపుకుంటున్నం. దేశానికి పట్టిన 20 ఏండ్ల ఎల్‌నినో పీడ విరగడైంది. వచ్చేదంతా లానినో హవానే. 12 ఏండ్ల పాటు కరువు ఉండదు’’ అని పేర్కొన్నారు. సాగు లేనివారికి గేదెలు, కోళ్లు వ్యవసాయం లేనివారికి పాడి గేదెలు, ఊరు కోళ్లు కొనుగోలు చేసి ఇప్పిస్తామని గ్రామస్తులకు సీఎం హామీనిచ్చారు. ‘‘నచ్చిన గేదెలను చూసుకుని బయానా ఇచ్చి వస్తే జేసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం. పశువుల గడ్డి కోసం విత్తనాలను అధికారులు సరఫరా చేస్తారు. ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. గ్రామాల్లో అప శబ్దాలు వద్దు. పంచాయితీలు, గొడవలకు ఇకపై స్వస్తి పలుకుదాం. మనల్ని జూసి ఇతర గ్రామాల ప్రజలు నేర్సుకోవాలె.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో ఉండే చిన్నరాజన్నకు వచ్చిన ఆలోచన నేడు ఆ గ్రామాన్ని ఒక్కతాటిపై నడిపిస్తంది. వారివి మనకంటే మంచి భూములేం కావు. వ్యవసాయం చేస్తూ దర్జాగా బతుకుతుండ్రు. బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లున్నారుు. అక్కడ ఇండ్లలో మహిళలదే ఆర్థిక పెత్తనం. అభివృద్ధికి ఇది కూడా ఓ కారణం. రష్యాలో 90 శాతం విమానాలను మహిళలే నడిపిస్తరు. వారికి అవకాశమిస్తే ఏదైనా చేయగలరు. ఇందిరాగాంధీ ప్రధానిగా మెప్పించారు’’ అని మహిళా శక్తిని సీఎం కొనియాడారు. అన్ని సౌకర్యాల తర్వాతే ఇళ్లలోకి వెళ్దాం ‘‘మన రెండు గ్రామాల చుట్టూ 4 చెరువులు, కుంటలున్నయ్. అవి పూర్తిగా నిండినయ్. ఇంకా రెండు గ్రామాల్లో 70కి పైగా బోర్లేసుకుందాం. ‘గడా’ నుంచి కానీ, ఎమ్మె ల్యే అభివృద్ధి నిధి నుంచి గానీ నిధులు మంజూరు జేస్తా. వెంటనే బోర్లు వేసి కనెక్షన్లు ఇప్పించండి’’ అని రెండు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా ఉన్న జేసీ వెంకట్రామిరెడ్డిని సీఎం ఆదేశించారు. ‘‘నీటిని బోర్ల ద్వారా నేరుగా వాడాలా? లేక సంపులు నిర్మించాలా? అనే విషయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు నిర్ణరుుస్తారు’’ అని చెప్పారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొంత ఆలస్యం జరిగింది. అరుునా సరే ఇండ్లపై ట్యాంకులు నిర్మించి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పూర్తిస్థారుు సౌకర్యాలు సమకూరిన తర్వాతే ఇండ్లలోకి వెళ్దాం. పెద్ద పండగ చేసుకుందాం. పండుగకు నేను కూడా వస్తా’’ అని చెప్పారు. ఎరవ్రల్లిలో మాదిరే నర్సన్నపేటలో కూడా ఫంక్షన్‌హాల్‌ను నిర్మించుకుందామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, గడా ఓఎస్డీ హనుమంతరావు పాల్గొన్నారు. -
మల్లన్న చెంతకు చెంచులు
– గిరిజన చెంచులకు పూర్వవైభవం తెచ్చేలా ఈఓ కృషి – సౌకర్యాలు, దర్శనంలో ప్రాధాన్యత – చెంచులక్ష్మీ కల్యాణపథకం కింద ఘనంగా వివాహం – అర్చకత్వంలో శిక్షణ, భజన బందాలకు చేయూత దట్టమైన నల్లమల అటవీ కీకారణ్యం మధ్య నెలకొన్న శ్రీభ్రమరాంబాసమేత మల్లికార్జునస్వామివార్లను చెంచులు తమ దైవంగా భావించేవారు. తమకు పుట్టిన పిల్లలకు చెంచు మల్లయ్య, చెంచు మల్లమ్మ అని పేర్లు పెట్టుకునే వారు. పూర్వం మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామిఅమ్మవార్లకు తమ గిరిజన పద్ధతిలో కల్యాణోత్సవాన్ని నిర్వహించే వారని, అలాగే శ్రీభ్రమరాంబాదేవికి జరిగే కుంభోత్సవం పూర్తిగా చెంచు గిరిజనులకే ఒకప్పుడు పరిమితమైంది. కాలానుగుణ పరిస్థితులలో భాగంగా నాగరికత అభివృద్ధి చెందడంతో చెంచులను మల్లన్నకు నాగరీకులు దూరం చేశారని చెప్పవచ్చు. అయినప్పటికీ నేటికి స్వామివార్ల కల్యాణోత్సవ పల్లకీని ప్రతి నిత్యం మోసేది చెంచులే. అలాంటి చెంచులకు ఈఓ నారాయణభరత్ గుప్త మల్లన్న ఆలయంలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. – శ్రీశైలం శ్రీశైల మల్లన్నకు చెంచుల మధ్య అనుబంధాన్ని తెలుసుకున్న ఈఓ నారాయణ భరత్ గుప్త వారికి దేవస్థానం తరుపున గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీడీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్. భాస్కరరావు, శివాజీస్ఫూర్తి కేంద్రం పర్యవేక్షకులు ఎ. వంశీకష్ణ, కర్నూలు జిల్లా సమరసత ఫౌండేషన్ కన్వీనర్ బాలిశెట్టి బాలసుబ్రమణ్యం, శ్రీశైల మండల ప్రతినిధి సంజీవరావులతో కలిసి వివిధ చెంచుగూడాలల చెంచు గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ చెంచులకు దేవస్థానం చేపట్టనున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు. అవగాహన సదస్సుకు హాజరైన ప్రతి చెంచుగిరిజనుడికి ఈఓ నారాయణభరత్ గుప్త స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు, శేషవస్త్రాలు, దివ్యపరిమళ విభూతి, శ్రీచక్రపూజ కుంకుమ, కైలాస కంకణాలను అందజేశారు. ఆ తరువాత స్వామివార్లకు అభిషేకం, స్పర్శదర్శనంతో పాటు అమ్మవారి దర్శనం, భోజన వసతి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థానం వివిధ విభాగాల సిబ్బంది, స్వామివార్ల ప్రధానార్చకులు, అర్చకులు , కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల చెంచుగూడాల నుంచి వచ్చిన చెంచులు, పాల్గొన్నారు. చెంచులకు వర్థించే పథకాల వివరాలు: చెంచుల వివాహ సమయంలో దేవస్థానం స్వామిఅమ్మవార్ల ఆశీర్వచనంగా చెంచులక్ష్మీ కల్యాణ పథకం ప్రవేశపెడుతున్నారు. ఈ పథకంలో వివాహానికి దేవస్థానం కల్యాణమండపంతో పాటు వ««దlూవరులకు నూతన వస్త్రాలు, తాళిబొట్లు, మెట్టెలు అందజేస్తుంది. – వధూవరులతో వచ్చిన బంధువర్గానికి దేవస్థానం ఉచిత వసతి సదుపాయం, వివాహ భోజనం ఏర్పాటు చేస్తారు. – వివాహం రోజున నూతన వధూవరులచే స్వామివార్లకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించే అవకాశం. – ఈ సౌకర్యాలకు చెంచులు ఐటీడీఏను సంప్రదించాల్సి ఉంది. – ఆయా చెంచుగూడాలలోని ఆలయాలలో అర్చకత్వాన్ని నిర్వహింపజేసేందుకు ఆసక్తిగల చెంచులకు దేవస్థానం తరుపున తగిన శిక్షణ ఇస్తుంది. – చెంచుగూడాలలో భక్తులు, భజన బందాలు ఏర్పడితే అలాంటి బందాలకు హార్మోనియం, తబలా, భజన తాళాలు తదితర వాటిని దేవస్థానం సమకూరుస్తుంది. – దేవస్థానం నిర్వహించే కళా పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. 10వేలు, రెరండవ బహుమతి రూ. 8వేలు, మూడవ బహుమతి రూ. 5వేలు పారితోషికంగా అందజేస్తారు. పోటీలో పాల్గొన ప్రతి బందానికి రూ. 2వేలు ఇవ్వనున్నారు. – చెంచులు ఎప్పుడు ఆలయాన్ని సందర్శించినప్పటికీ వారికి ఉచిత దర్శనం కల్పిస్తారు. ఇందుకు ఐటీడీఏ ద్వారా గుర్తింపు పొందిన చెంచులు ఆ సంస్థ ద్వారా గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. -
సొంతూరికి వెళ్లేందుకు గుర్తింపుకార్డులా?
పోలీసులపై హైకోర్టు మండిపాటు సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ఆందోళన నేపథ్యం లో మెదక్ జిల్లా వేములఘాట్ గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులు గుర్తింపు కార్డులు చూపాలని కోరుతుండటంపై హైకోర్టు మండిపడింది. తమ సొంత ఊర్లోకి వెళ్లడానికి గ్రామస్తులను గుర్తింపుకార్డులు కోరడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. వేములఘాట్‌లో 144 సెక్షన్ విధింపు వ్యవహారంలో నిర్ణయాన్ని 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేములఘాట్‌లో 144 సెక్షన్ విధించడాన్ని సవాలు చేస్తూ వై.సంతోశ్‌రెడ్డి, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయమూర్తి శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, గ్రామంలో శాంతి యుత వాతావరణం ఉన్నప్పటికీ 144 సెక్షన్ ఎత్తివేయడం లేదన్నారు. గ్రామస్తులను గుర్తింపు కార్డుల కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సొంత గ్రామంలోకి వెళ్లేందుకు కూడా గుర్తింపు కార్డులు చూపాలా? ఇదేం పద్ధతి..? అంటూ నిలదీశారు. అయితే గ్రామంలో శాంతి యుత వాతావరణం నెలకొనలేదని, అందువల్లే 144 సెక్షన్ కొనసాగిస్తున్నామని హోంశాఖ తరఫు న్యాయవాది తెలిపారు. -
మల్లన్నసాగర్ కట్టి తీరుతాం: హరీశ్
సిద్దిపేట జోన్ : తమది ప్రజా ప్రభుత్వమని, రైతుల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో మల్లన్నసాగర్‌ని కట్టితీరుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకు పది గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చేపట్టామని మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద కేవలం ఐదు గ్రామాల్లోనే ముంపు అవకాశం ఉందని చెప్పారు. తొమ్మిది గ్రామాల్లో జీఓ నెంబర్ 123 కింద రైతులు స్వచ్ఛందంగా భూసేకరణకు సమ్మతిస్తూ అంగీకర పత్రాలు అందించారని తెలిపారు. భూసేకరణలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకురాని వారికోసం 2013 చట్టం కింద నోటిఫై చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. -
గర్భాలయంలో మల్లన్న అభిషేకం రూ.5 వేలు
– నేటి నుంచి అమలు – కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు యథాతథం – స్పర్శదర్శనానికి రూ. 500 –సాధారణ భక్తులకు మల్లన్న అలంకార దర్శనం శ్రీశైలం: శ్రీమల్లికార్జునస్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకం టికెట్ ధరను నేటి నుంచి రూ. 5వేలకు పెంపుదల చేస్తూ ఈఓ నారాయణభరత్ గుప్త సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిర్ధారిత కమిటీ ఆదేశాల మేరకు గర్భాలయంలో అభిషేకాలు చేసుకునే సేవాకర్తలకు పూజాసామాగ్రిగా ఒక కొబ్బరికాయతో పాటు 250 గ్రాముల లడ్డూప్రసాదం, విభూధిపాకెట్, కైలాస కంకణ బాక్స్, శ్రీశైలప్రభను ఉచితంగా అందజేస్తున్నట్లు ఈఓ తెలిపారు. అభిషేక సేవాకర్తలతో పాటు వచ్చిన వారికి రూ. 500 టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్, కరెంట్ బుకింగ్ టికెట్ల సమయాలు ఉదయం 6.30 గంటల నుంచి 7.30గంటల వరకు , 8.30 నుంచి 9.30 గంటల వరకు, 10.30 నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు 6 టికెట్ల చొప్పున విడతల వారీగా నిర్వహిస్తారు. మొత్తం మీద గర్భాలయంలో అభిషేకాలకు 24 టికెట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించే సమయంలో గర్భాలయంలోని అభిషేకాలు కొనసాగుతాయి. రూ.500కే సుప్రభాత, మహామంగళహారతి సేవలు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లకు ఉదయం జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవలో నిర్ధారిత కమిటీ కొద్దిగా మినహాయింపు ఇచ్చింది. శని,ఆది,సోమవారాల్లో సుప్రభాత సేవకు రూ. 1,000 టికెట్ ఉండేది. మహామంగళహారతి టికెట్ రూ. 600 ఉండేది కాగా వీటన్నింటిని ఒకే గాటికి తెచ్చింది. సుప్రభాతం, మహామంగళహారతి, అభిషేకానంతరం దర్శనానికి రూ. 500 చొప్పున టికెట్లు, శీఘ్ర దర్శనానికి రూ. 100 టికెట్‌ను నిర్ధారిత కమిటీ పెట్టింది. -
'మల్లన్న' ను నిర్మించి తీరుతాం
మెదక్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తాము భయపడమని మంత్రి హరీష్ రావు తెలిపారు. రిజర్వాయర్ కోసం రైతులు స్వచ్ఛందంగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారని మంత్రి అన్నారు. 120 జీవో కింద 9 గ్రామాలు ముందుకు వచ్చాయన్నారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారని మండిపడ్డారు. భూములు లేని రైతుల కూలీలకు పరిహారం చెల్లిస్తామన్నారు. రైతలకు ఎలాంటి నష్టం జరిగినా కాంగ్రెస్, టీడీపీలదే పూర్తి బాధ్యత అన్నారు. ఎవరెన్ని ఆటంకాంలు కలిగించినా మల్లన్న సాగర్ ప్రాజెక్టును కచ్చింతంగా నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. -
ప్రజలను విభజించి పాలిస్తోంది
- అధిక పరిహారం పేరుతో ప్రలోభపెడుతోంది - మల్లన్నసాగర్ కేసులో హైకోర్టులో వాదనలు సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ వ్యవహారంలో ప్రజలను ప్రభుత్వం విభజించి పాలిస్తోందని సీనియర్ న్యాయవాది వేదుల వెం కటరమణ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూముల కొనుగోలును సవాలు చేస్తూ భూ యజమానులు, వాటిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావుల ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్లలో కొందరి తరఫున వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘‘ప్రజలను ప్రభుత్వం రెండు వర్గాలుగా విభజించి ఒక్కొక్కరి పట్ల ఒక్కోలా వ్యవహరిస్తోంది. భూములమ్మేందుకు ముందుకొచ్చిన వారిపట్ల ఒకలా, భూ సేకరణ చట్టం కింద పరిహారం తీసుకునే వారిపట్ల మరోలా వ్యవహరిస్తోంది. పైగా భూములమ్మేవారికి ఎక్కువ పరిహారం ఇస్తామంటూ ఆశ చూపుతోంది. ఇది ప్రలోభపెట్టడం కిందకు వస్తుంది. ఈ భూముల కొనుగోలు వల్ల భూ యజమానులకు నష్టమేమీ ఉండదు గానీ వాటిపై ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారు నష్టపోతారు. కానీ వారేమో భూములను అమ్మకుండా యజమానులను నిరోధించలేరు. ఈ ఒక్క కారణంతో మొత్తం ప్రక్రియను నిలుపుదల చేయవచ్చు’’ అని వాదించారు. 298 అధికరణ ప్రకారం ప్రభుత్వం వ్యాపారాలు, వర్తక అవసరాల కోసం భూములు కొనుగోలు చేయాలే తప్ప ప్రాజెక్టుల కోసం కాదని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ అన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలే తప్ప ప్రైవేటు వ్యక్తిలా వ్యవహరించడానికి వీల్లేదని వివరించారు. పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తవడంతో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. -
'మల్లన్న.. భారీ రిజర్వాయర్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ భారీ రిజర్వాయర్ అవసరం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు రైతుల నుంచి నిర్బంధంగా భూసేకరణ చేస్తున్నారంటూ రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. రైతులను భయపెట్టి, 144 సెక్షన్ విధించి భూములను లాక్కుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. -
చట్టం అమలు చేయమనడం తప్పా: జీవన్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరడం తప్పా అని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. మల్లన్నసాగర్లో రైతులకు జరుగుతున్న నష్టానికి ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నాయని, దీనికే టీడీపీతో కలసిపోయినట్టుగా టీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీతో టీఆర్ఎస్ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన ఆరోపించారు. -
హక్కులను హరిస్తుంటే సహించం
మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాటం: ఉత్తమ్ ఇందిరాపార్కు వద్ద పీసీసీ ధర్నా సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి పేద రైతులు, కూలీలు, ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వమే కాలరాస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసిత రైతులు వంద రోజులు దీక్ష చేసిన నేపథ్యంలో సంఘీభావంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాకు ఉత్తమ్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి డి.కె.అరుణ, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, నాయకులు సర్వే సత్యనారాయణ, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎం.కోదండ రెడ్డి హాజరయ్యారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్ కాంగ్రెస్ నేత నల్లా సూర్యప్రకాశ్ తదితరులు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ఉత్తమ్ మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వం పేద ప్రజలను గ్రామాల నుంచి పోలీసులతో, రెవెన్యూ అధికారులతో తరిమివేస్తున్నదని విమర్శించారు. భూ సేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు పోరాడుతున్నా.. ప్రభుత్వం నిర్బంధం విధించి, పోలీసులతో కేసులు పెట్టి, బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. భూ సేకరణ చేయకుండా, బెదిరించి కొనుగోలు చేస్తున్నదన్నారు. దీనివల్ల భూమి లేని పేదలకు, భూమిపై ఆధారపడిన వృత్తిదారులు, కూలీలకు పునరావాసం లేకుండా పోతుందని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయకుండా, బలవంతపు భూ సేకరణతో హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ప్రకటించారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ మాట్లాడుతూ, మల్లన్న సాగర్ పరిసర గ్రామాల్లో 144 సెక్షన్ విధించడం, రైతులపై కేసులు పెట్టి వేధించడంపై పోరాడుతున్న రైతులకు అండగా ఉంటామన్నారు. అప్రజాస్వామికంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రభుత్వాలపై తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రె స్ అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ కింద భూములు పోగొట్టుకున్న రైతులకు తిరిగి అప్పగిస్తామని జైపాల్‌రెడ్డి అన్నారు. ఇచ్చే పరిస్థితి లేకపోతే భూ సేకరణ చట్టం-2013 కింద పరిహారం అందచేస్తామన్నారు. వైఎస్సార్సీపీ రైతు సంఘం అధ్యక్షుడు కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ 27 నెలల కేసీఆర్ పాలన అబద్ధాలతోనే సాగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌ల సొంత జిల్లాలలోనే వంద రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామిక సంప్రదాయాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. వీటిపై ప్రజల పక్షాన జరిగే పోరాటాలకు అండగా ఉంటామని తెలిపారు. నేడు గవర్నర్‌ను కలవనున్న పీసీసీ మల్లన్న సాగర్‌లో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రాథమిక హక్కులను కాలరాయడంపై గవర్నర్‌కు పీసీసీ సోమవారం ఫిర్యాదు చేయనుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు గవర్నర్‌ను కలసి వినతి పత్రం అందజేయనున్నారు. అనంతరం గజ్వేల్‌లో జరిగే మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావ సభకు హాజరు కావడానికి బయలుదేరి వెళ్లనున్నారు. -
కాంగ్రెస్ రైతు సంఘీభావ సభ
హైదరాబాద్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు. ముంపు గ్రామాల పరిస్థితిపై గవర్నర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. అనంతరం గజ్వేల్‌లో కాంగ్రెస్ నేతలు రైతు సంఘీభావ సభ నిర్వహించనున్నారు. మల్లన్న సాగర్ భూ సేకరణను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గత 100 రోజులుగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సభ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ముంపు గ్రామాల్లో 50 రోజులుగా 144 సెక్షన్ అమలు చేస్తోంది. రైతు సంఘీభావ సభతో గజ్వేల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశముండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. -
‘మల్లన్నసాగర్’లో 144 సెక్షన్ ఎత్తివేయాలి
భూనిర్వాసితుల కమిటీ డిమాండ్ హన్మకొండ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో 144 సెక్షన్ ఎత్తివేయాలని భూనిర్వాసితుల కమిటీ జిల్లా కన్వీనర్ చింతమల్ల రంగయ్య, కోకన్వీనర్ పెద్దాపురం రమేష్ డిమాండ్ చేశారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలిలో గురువారం భూనిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో 144 సెక్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు పేరుతో నిర్వాసితులపై కక్షగట్టి వేధిస్తోందన్నారు. నాయకులు ఉడుత రవీందర్, బొట్ల చక్రపాణి, చొప్పరి రవికుమార్, వీరన్ననాయక్, చందునాయక్, భానునాయక్, వెంకట్ పాల్గొన్నారు. -
నేడు మల్లన్నకు సహస్ర ఘటాభిషేకం
– ఆర్జిత సేవలు నిలుపుదల – నదీ జలాలతో మల్లన్నకు అభిషేకం – మంగళవారం ఉదయం వరకు జలాధివాసంలో శ్రీశైలేశుడు శ్రీశైలం: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా అభివద్ధి చెందాలనే సంకల్పంతో శ్రీమల్లికార్జునస్వామి వారికి సోమవారం సహస్రఘటాభిషేకాన్ని నిర్వహించడానికి దేవస్థానం సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 5గంటల నుంచి వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానాలయం నుంచి పాతాళగంగ వద్దకు చేరుకుని కష్ణవేణి నదీమాతల్లికి విశేషపూజాధికాలను నిర్వహిస్తారు. కృష్ణాజలాలను కలశాలలో సేకరించి నందిమండపం, అంకాలమ్మగుడి, వీరభద్రస్వామివార్లకు కష్ణాజలాలతో అభిషేకం చేసి తిరిగి ప్రధానాలయం చేరుకుంటారు. యాగశాల వద్ద పాతాళగంగ నుంచి తెచ్చిన నదీ కలశాలకు సంప్రదాయబద్దంగా పూజలు చేసి ఆ కలశాలతో ఆలయప్రదక్షిణ చేస్తారు. అనంతరం స్వామివార్లకు పంచామతాభిషేకం, నదీజలాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7.30గంటల నుంచి స్వామివార్ల సహస్రఘటాభిషేకం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6గంటల తరువాత స్వామివార్ల ధర్మదర్శనం ఉంటుంది. ఆ మరుసటిరోజు మంగళవారం ఉదయంజరిగే ప్రాతఃకాలపూజల వరకు శ్రీ మల్లికార్జునస్వామి జలవాసమై ఉంటారని అర్చకులు పేర్కొన్నారు. ఆర్జితసేవలు తాత్కాలికంగా నిలుపుదల శ్రీమల్లికార్జునస్వామివార్లకు జరిగే సహస్ర ఘటాభిషేకాన్ని పురస్కరించుకుని సోమవారం స్వామివార్లకు జరిగే ఆర్జిత అభిషేకాలు, గణపతి అభిషేకం, లక్షబిల్వార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మొదలైన ఆర్జిత సేవలన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త ఆదివారం తెలిపారు. అదే విధంగా సోమవారం వేకువజామునే జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవాటికెట్లను కూడా నిలుపుదల చేశామని, సాయంత్రం జరిగే స్వామివార్ల కల్యాణోత్సవం, ఏకాంతసేవలు యథావిథిగా జరుగుతుందని పేర్కొన్నారు. మూడవ రోజు కొనసాగిన వరుణహోమ, జపాదులు వర్షాభావ పరిస్థితులు తొలగి వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని శ్రీశైలమహా„ó త్రంలో చేస్తున్న వరుణజపాలు, హోమాలు ఆదివారం నాటికి మూడో రోజు చేరుకున్నాయి. ప్రతిరోజూ 2పూటలా యజ్ఞాది క్రతువులను, వరుణమంత్రాలతో నిర్వహిస్తున్నారు. రుష్యశంగుడి బొమ్మను పిండితో చేసి ప్రత్యేకపూజలను చేయడంతో కుంభవష్టిగా వర్షాలు పడుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. నిష్ణాతులైన పండితులు వరుణ జపహోమాలను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ రుద్రపారాయణలు, వరుణసూక్తపారాయణ, చతుర్వేద పారాయణ, వరుణజపాలు, రుశ్యశంగజపం, విరాటపర్వ పారాయణ కార్యక్రమాలు ఆలయప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. -
సకల వరప్రదాయినీ.. వరలక్ష్మి
– సామూహిక వరలక్ష్మివ్రతాలతో మల్లన్న ఆలయప్రాంగణం కళకళ – 1100కు పైగా ముతై ్తదువల శాస్త్రోక్త వ్రతపూజలు – ముతైదువులందరికి అమ్మవారి శేషవస్త్రాలు, అన్న, ప్రసాద వితరణలు శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మల్లన్న ఆలయప్రాంగణం వరలక్ష్మి వ్రత మంత్రోచ్చరణతో ప్రతిధ్వనిస్తుండగా, వందల సంఖ్యలో ముౖలె వుదులు తమ ఐదవతనం వృద్ధిచెందాలని అషై ్టశ్వర్యాలు సిద్ధించాలని కోరుతూ వరలక్ష్మివ్రతాచరణకు పూనుకున్నారు. ఉదయం 10. ంటలకు వరలక్ష్మీవ్రత నోములు నిర్వహించుకోవడానికి ముందుగా నమోదు చేసుకున్న వారందరికీ వరుస క్రమంలో కలశాల ఎదుట కూర్చోబెట్టారు. ఆ తరువాత వచ్చిన వారందరికి కూడా వ్రతనోములను నిర్వహించుకోవడానికి వీలుగా సమీప స్థలంలోనే అప్పటికప్పుడు ఏర్పాట్లను చేశారు. సుమారు 1100 మందికి పైగా ముతై ్తదువలు ఈ వ్రతాల్లో పాల్గొని తమ జన్మధన్యమైందిగా భావించారు. వ్రత ఆరంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను చేసి శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణమూర్తులకు, అలంకారమండపంలోని ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం వ్రతాలకు హాజరైన ముతై ్తదువచేత కలశస్థాపన చేయించి ఆ కలశంలో వరలక్ష్మి దేవిని సమంత్రకంగా ఆవహింపజేశారు. శ్రీసూక్త విధానంతో వ్రతకల్పపూర్వకంగా ఆలయ అర్చకులు, వేదపండితులు పూజలు చేయించారు. వ్రత ముగింపుగా కర్పూర నీరాజనాలను అర్పించి కలశోద్వాసన చేశారు. అనంతరం ముతై ్తదువులను అందరికి రూ.500 ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచితంగా స్వామిఅమ్మవార్ల దర్శన అవకాశాన్ని కల్పించారు. శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల శేషవస్త్రాలను అందజేసి స్వామిఅమ్మవార్ల అన్నపూర్ణభవన్‌లో వ్రతంలో పాల్గొన్న వారందరికి ఉచిత భోజనసౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. 300 మందికిపైగా చెంచు గిరిజనులు ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన చెంచు గూడాల నుంచి వచ్చిన గిరిజనులు సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో చివరి శ్రావణ శుక్రవారం రోజున 300 మందికిపైగా చెంచుముతైదువులు వరలక్ష్మివ్రతంలో పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఆర్జిత సామూహిక అభిషేకాలు
· ప్రతిరోజూ 6 విడతలుగా అభిషేకాలు · ఒక్కొక్క విడత120 టికెట్లకు అనుమతి · అభిషేక మంత్ర జలం స్వామివార్ల మూర్తికి సమర్పణ శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలో భక్తుల ర ద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీ మల్లికార్జునస్వామివార్లకు ఆర్జిత సామూహిక అభిషేకాలను ఈ నెల 28 నుంచి ప్రారంభిస్తున్నారు. గతంలో సామూహిక అభిషేకాల నిర్వహణపై భక్తుల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఈసారి పకడ్బందీగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. దేవస్థానం వైదిక కమిటీతో చర్చించిన అనంతరం శ్రీశైల జగద్గురు పీఠాధిపతి సూచనలు,సలహాల కనుగుణంగా ఈ ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శుక్రవారం రాత్రి తెలిపారు. అభిషేక సేవాకర్తలకు స్వామివారి స్పర్శదర్శనం కూడా కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 6విడతలుగా సామూహిక అభిషేకాలు సామూహిక అభిషేకాలను ప్రతిరోజు ఉదయం స్వామి అమ్మవార్ల మహామంగళ హారతిసేవలు ముగిసిన తరువాత నుంచి స్వామివార్ల నిత్య కల్యాణ మండపంలో ప్రారంభమవుతాయి. అభిషేక నిర్వహణలో భాగాంగా ఉదయం 6.30గంటల నుంచి రాత్రి 7.30గంటల వరకు 6 విడతలుగా చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 5 విడతలు, సాయంత్రం 6.30గంటల నుంచి 7.30గంటల వరకు ఒక విడత మొత్తం మీద ప్రతి విడతలకు 120 టికెట్లు చొప్పున ఆరు విడతలలో సేవాకర్తలను అనుమతిస్తారు. ఇప్పటి వరకు గర్భాలయంలో జరిగే అభిషేకాలు తీరు 2,3 నిమిషాల వ్యవధిలోనే ముగస్తుండడంపై భక్తులలో అసంతప్తి నెలకొంది. అందుచేత శాస్త్ర, సంప్రదాయరీతిలో మల్లన్నకు అభిషేకం చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు ఈఓ తెలిపారు. ముందే చెప్పిన ‘సాక్షి’ స్వామివార్లకు సామూహిక అభిషేకాలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధం చేసిన విషయాన్ని సాక్షి ముందే చెప్పింది. ‘సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం’ అనే శీర్షికతో జూలై 26న సాక్షి కథనం ప్రచురించింది. -
ప్రాజెక్టుల రీడిజైన్‌తో ప్రజాధనం వృథా
బోధన్ : ప్రాజెక్టు రీడిజైన్లతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తోందని మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. రైతుల గోడు పట్టించుకోకుండా ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. బోధన్‌లోని తాలూకా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నామని సీఎం గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. ఆ ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికైనా అఖిల పక్ష సమావేశం నిర్వహించి, ఇంజినీర్లు, జల నిపుణుల సలహాలు, సూచలను తీసుకుని ఒప్పందాలపై సమీక్షించడం శ్రేయస్కరమని తెలిపారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని విమర్శిస్తున్నారన్నారు. దద్దమ్మలం మేం కాదని, మేరేనని విమర్శించారు. బోధన్ నియోజకవర్గంలోనే గోదావరి నది ప్రవహిస్తున్నా నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అలీసాగర్ ఎత్తిపోతల కింద సాగుచేసిన పంటలతో పాటు నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి కోసం అలీసాగర్ రిజర్వాయర్, బోధన్ బెల్లాల్ చెరువులను గోదావరి నదిలో నీళ్లున్న సమయంలోనే నింపాలన్నారు. బోధన్ మండలాన్ని రెండుగా విభజించాలి పాలన, ప్రజల సౌలభ్యం కోసం బోధన్ మండలాన్ని రెండుగా విభజించాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. బోధన్ అర్బన్‌లో 80 వేలు, రూరల్‌లో 70 వేలకు పైగా జనాభా ఉందన్నారు. అర్బన్, రూరల్ మండలాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీపీ గంగాశంకర్, మున్సిపల్కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ అబిద్ అలీ, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుణప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఫాషా మోహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పిటిషనర్ల భూములు కొనుగోలు చేయం
- ఏడాది పాటు వారిని నిర్వాసితులను చేయం - అవసరమైతే భూ సేకరణ కింద తీసుకుంటాం - మల్లన్నసాగర్‌పై హైకోర్టుకు ఏజీ నివేదన - విచారణ 31కి వాయిదా సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల నుంచి తాము భూములు కొనుగోలు చేయబోమని, కనీసం ఏడాది పాటు వారిని నిర్వాసితులను కూడా చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. దీంతో హైకోర్టు ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం జీవో 123 ద్వారా భూములు కొనుగోలు చేయడాన్ని సవాలు చేస్తూ అటు భూ యజమానులు, వాటిపై ఆధారపడి ఉన్న వ్యవసాయ కూలీలు, చేతివృత్తుల వారు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సోమవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వేదులు వెంకటరమణ, ఎ.సత్యప్రసా ద్ వాదనలు వినిపిస్తూ, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం భూములను కొనుగోలు చేస్తోందన్నారు. దీని వల్ల వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారన్నారు. మరో న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు. ముంపు అంశాన్నీ విచారిస్తాం.. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, కోర్టుకొచ్చిన పిటిషనర్ల నుంచి తాము భూములు కొనుగోలు చేయబోమన్నారు. పిటిషనర్ల భూములను అవసరమైతే భూ సేకరణ చట్టం ద్వారానే తీసుకుంటామన్నారు. వ్యవసాయ కార్మికుల పునరావాసం కోసం 190, 191 జీవోలు జారీ చేశామని, వాటి ద్వారా భూ సేకరణ చట్టం కన్నా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం భూముల కొనుగోలుతో పాటు ముంపునకు గురయ్యే అంశంపై కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 190, 191లు నిమ్జ్‌కు సంబంధించినవని, అవి సాగునీటి ప్రాజెక్టులకు వర్తించవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ముంపు అంశం ఉంటుం దని, ముంపు బాధితులకు భూ సేకరణ చట్టంలో షెడ్యూల్ 3 కింద ప్రయోజనాలు వర్తింప చేయాలని తెలిపింది. ఈ సమయం లో ఏజీ స్పందిస్తూ, గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ధర్మాసనం అందుకు అంగీకరించింది. -
నేడు మల్లన్నకు రుద్రాభిషేకం
– సాయంత్రం ఉత్సవమూర్తులతో పాతాళగంగవరకు ఊరేగింపు – నదీమాతల్లికి విశేషపూజలు, దశవిధ నదీహారతులు – 1,116 మంది దంపతుల కలశజలాభిషేకం – 10 కేజీల పూలతో వస్తేనే పుష్పాభిషేకానికి అర్హులు శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణాపుష్కరాల చివరి రోజు మంగళవారం శ్రీశైల మల్లికార్జునస్వామివార్లకు కృష్ణా జలాలతో రుద్రాభిషేకం, పుష్పార్చనను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహా పుణ్యకార్యంలో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా శ్రీశైల దేవస్థానంలో నమోదు చేసుకున్న 1,116 మంది దంపతులకు మొదటి ప్రాధాన్యతన్నిచి వారితో కలిసి పాతాళగంగ యాత్ర చేపడుతారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు వేదమంత్రోచ్చరణలతో మంగవాయిద్యాల నడుమ శ్రీభ్రమరాంబామల్లికార్జునేస్వామివార్ల ఉత్సవమూర్లును పల్లకీలో పాతాళగంగవ ద్దకు తీసుకెళ్తారు. అనంతరం పవిత్ర పాతాళగంగ నదీ తీరాన కృష్ణవేణీ నదీమాతల్లికి విశేషపూజలను నిర్వహించి, దశవిధ హారతులతో కృష్ణమ్మకు నదీహారతులను సమర్పిస్తారు. అనంతరం ప్రత్యేకపూజలలో పాల్గొనే దంపతులందరూ పుష్కర స్నానం చేసి కలశంలో కృష్ణా జలాలను నింపుకుని పాతాలగంగ మెట్ల మార్గం ద్వారా పైకిS చేరుకుని అక్కడినుంచ కలశాయత్రతో స్వామివార్ల ఆలయాన్ని చేరుకుంటారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తరీతిలో పుష్పోత్సవ సేవను నిర్వహిస్తారు. ఈ సేవలో పాల్గొనే దంపతులు కచ్చితంగా 10 కేజీల పూలను (బంతిపూలు మినహా) తీసుకురావాల్సి ఉంటుంది. అలా తీసుకువచ్చిన వారికి మాత్రమే దేవస్థానం అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే పాతాళగంగ కలశ జలాలతో వచ్చిన దంపతులు శ్రీమల్లికార్జునస్వామివార్ల మూలవిరాట్‌కు వేదగోష్టి మ«ధ్య రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు సేవాకర్తలకు మహాదాశీర్వచనాలు: మంగళవారం సాయం్రం శ్రీ మల్లికార్జునస్వామివారికి జరిగే కృష్ణాజలాల కలశాభిషేకం, పుష్పోత్సవ సేవలో పాల్గొనే సేవాకర్తలకు ఆలయ అర్చకులు, వేదపండితులు వేద మంత్రోచ్చరణలతో మహాదాశీర్వచనాలను 1,116 మంది జంటలకు అందజేస్తారు. శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల దేవస్థానం తరుపున ఈ క్రతువులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు (కండువా, చీర,రవికె, పసుపు,కుంకుమలు), లడ్డూప్రసాదాలను ఆలయ అధికారులు అందజేస్తారు. -
'మల్లన్న' రైతులకు కోర్టులో ఊరట
హైదరాబాద్: మల్లన్నసాగర్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వం 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని కోర్టు సూచించింది. కోర్టును ఆశ్రయించిన 70 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది. -
గంగను విడిచిన విభునికి... విడతల వారీగా అభిషేకం
– కృష్ణా పుష్కరాల సందర్భంగా అభిషేకాల నిలుపుదల – వారం తర్వాత నిర్ణయం మార్చుకున్న అధికారులు – ప్రతి మూడు గంటలకు ఒకసారి శాస్త్రోక్తంగా మల్లన్నకు అభిషేకం శ్రీశైలం: వారం రోజులుగా అభిషేకాలకు దూరంగా ఉన్న శ్రీశైల మహా చక్రవర్తికి విడతల వారీగా అభిషేకాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు చేసేందుకు నీళ్లు లేవని భక్తులు, అధికారులు ఆందోళన చెందుతున్న తరుణంలో శివుడు గంగను విడవటంతో కృష్ణమ్మ బిరబిరమంటూ పరుగులెత్తింది. భక్తులు పుష్కర స్నానం చేసి పునీతలయ్యారు. అయితే పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ మేరకు అభిషేకాలను నిలుపుదల చేశారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో కొందరు విమర్శలు చేశారు. కనీసం స్వామివార్ల రుద్రాక్ష మండపానికి ఉండే ఘంటాపాత్రోలో నైనా నీటిని పోసి నిరంతరం శ్రీశైలమహాలింగ చక్రవర్తి శిరస్సుపై నీరు పడేలా ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి అధికారుల ఆలోచనలలో మార్పు వచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మల్లికార్జునస్వామికి మహా నైవేద్యం ముగిశాక ఈఓ భరత్ గుప్త ద్వారా ఆలయప్రధానార్చకులు, అర్చకులతో వేదమంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా ప్రతి మూడు గంటలకు ఒకసారి మల్లన్నకు అభిషేకం నిర్వహించాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆలయప్రాంగణం అభిషేక సమయాన ఆధ్యాత్మిక వేదమంత్రోచ్చరణల తరంగాలతో ప్రభావితమైంది. అనంతరం తిరిగి 2.30 గంటల నుంచి 3.30గంటల వరకు అర్చకులు రుద్రాభిషేకంతో మల్లన్నకు పరమానందం కలిగిందనే చెప్పవచ్చు. అలాగే సాయంత్రం కూడా ఒకసారి, రాత్రి మరోసారి మల్లన్నకు రుద్రాభిషేకం నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుష్కరాలలో మిగిలిన అన్ని రోజులు ఈ అభిషేకం కొనసాగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏలా ఉన్నా అభిషేక ప్రియుడైన శ్రీశైల మల్లికార్జునస్వామికి ఏదో రూపేణా అభిషేకం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా భక్తులు పేర్కొంటున్నారు. -
మల్లన్న సేవలో జస్టిస్ సురేష్ ఖైత్
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ ఖైత్ గురువారం దర్శించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ నారాయణభరత్ గుప్త ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్ల దర్శనానంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, ఈఓ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. -
మల్లన్నపై లొల్లి
వాడివేడిగా జడ్పీ సమావేశం ‘వ్యవసాయం దండగ’ ధోరణిలో సర్కారు కాంగ్రెస్ జడ్పీటీసీల ఆరోపణ మండిపడిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లన్నసాగర్‌తో జిల్లాకు మేలన్న సోలిపేట ప్రాజెక్టులను అడ్డుకోవద్దని వినతి చర్చకు సిద్ధమా అని సవాల్ పాఠశాల సమస్యలపై పీఓ తీరు బాగా లేదు: ఎమ్మెల్యే ప్రభాకర్ సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన జిల్లా పరిషత్తు సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. కొల్చారం జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి.. ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగగా భావిస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు న్యాయం చేయటం లేదని అనడంతో వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యులు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, బాబూమోహన్ ఒక్కసారిగా మండిపడ్డారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పట్టుబట్టారు. ‘కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఒక్క ప్రాజెక్టయినా కట్టిందా?, 60 ఏళ్లలో ఒక్క ఎకరాకు అదనంగా సాగునీరిచ్చారా? సింగూరు ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వని ఘనత మీది’ అంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీలపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్‌ను కుట్రపూరితంగా కాంగ్రెస్ అడ్డుకుంటోందన్నారు. ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని.. మీరు వస్తారా అని ఆయన సవాల్ చేశారు. మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, రాములునాయక్, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, సీఈఓ వర్షిణి, జెడ్పీటీసీలు, ఎంపీపీ, అధికారులు పాల్గొన్నారు. బాధే.. అయినా పుష్కలంగా సాగునీరు ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో తన నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఇది బాధాకరమైనా జిల్లాలోని 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. గతంలో టీఆర్ఎస్ సభ్యులను జెడ్పీలో మాట్లాడనివ్వలేదని, కానీ తాము మాత్రం కాంగ్రెస్ సభ్యులకు ఎంతో స్వేచ్ఛ, గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు. పార్టీలకతీతంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అప్పుడు తెలంగాణను అడ్డుకున్న వారే ఇప్పుడు ప్రాజెక్టులు వద్దని ఆమరణదీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగూరు కాల్వల భూసేకరణలో భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.60 లక్షలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే బాబూమోహన్- సింగూరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించలేదని, ఒక్క ఎకరాకు కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదన్నారు. ఈ వ్యాఖ్యలపై జెడ్పీటీసీ ప్రభాకర్, నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి అభ్యంతరం తెలిపారు. వైస్‌చైర్మన్ సారయ్య, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ కాంగ్రెస్ సభ్యుల తీరుపై ధ్వజమెత్తారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని అయితే నిర్వాసితులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. చివరకు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో వివాదం సద్దుమణిగింది. సీఎం చదివిన స్కూల్ అభివృద్ధిపై నిర్లక్ష్యమా? దుబ్బాకలో సీఎం కేసీఆర్ చదువుకున్న స్కూల్ అభివృద్ధి పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని, ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. సీఎం చదివిన స్కూల్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా పాఠశాలల పరిస్థితేంటని ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ సీఈఓ వర్షిణి కలుగజేసుకుని పనులు సత్వరం ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైతం ఎస్ఎస్ఏ అధికారుల తీరు సరిగ్గా లేదన్నారు. పాఠశాలల్లో సమస్యలు చెబుతామంటే పీఓ ఫోన్ కూడా ఎత్తదని ఆరోపించారు. సీఈఓ వర్షిని.. తను గుడ్ ఆఫీసర్ అంటూ సర్ది చెప్పబోగా ‘మీరు ఆమె తరపున వకాల్తా పుచ్చుకోవద్ద’ని ప్రభాకర్ సూచించారు. మిషన్ భగరీథ పథకం అమలుపై సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అధికారులు సమాచారం చెప్పటం లేదని, ఇంతవరకు సమావేశం నిర్వహించలేదని ఆయన ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్ఈ విజయప్రకాశ్ తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్‌లో ఖాళీగా ఉన్న విద్యా వలంటీర్ల పోస్టులను, గురుకుల పాఠశాలలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నాన్ సీఆర్‌ఎఫ్‌లో ప్రతిపాదించిన పనులు ఇంకా చేపట్టడంలేదని, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి బిల్లులు మంజూరు చేయలేదన్నారు. దీనిపై కలెక్టర్ రోనాల్డ్‌రోస్ స్పందిస్తూ ట్రెజరీలో ప్రీజ్ ఉన్నందున జాప్యమైందని త్వరలో బిల్లులు అందుతాయన్నారు. అలాగే ఆర్ఓ ప్లాంట్ల బిల్లులు అంశాన్నీ పరిశీలిస్తానని చెప్పారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటుదాం హరితహారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటడంలో ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అన్నారు. హరితహారం అమలులో పలు మండలాలు ముందుండగా కొన్ని వెనకబడి ఉన్నట్లు చెప్పారు. లక్ష్యం మేరకు ప్రతి గ్రామంలో రూ.40వేల మొక్కలు నాటాలని సూచించారు. పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ గుంతులు తీసినందుకు బిల్లులు చెల్లించటంలేదన్నారు. మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్ ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ బిల్లులును చెల్లించేలా చూస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. -
నాలుగేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు
మల్లన్నసాగర్ సాధన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం, సీతారాంపల్లి, రామచంద్రబోస్, కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణాల ద్వారా కోటి ఎకరాలను సాగులోకి తెస్తామన్నారు. కాళేళ్వరం ఎత్తిపోతలు, మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి గోదావరి నీటితో రైతుల పాదాలు కడుగుతామని మంత్రి చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంవత్సరానికి రూ. 25 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగదన్నారు. గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలుస్తుందని, వాటిని మళ్లించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్, టీడీపీలు రైతులను రెచ్చ0గొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫెదారు రాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు హన్మంత్ సిందే, షకీల్ అహ్మద్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్న సేవలో తమిళనాడు గవర్నర్ రోశయ్య
శ్రీశైలం: శ్రావణమాసం సందర్భంగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ప్రధానాలయ గోపురం వద్ద ఈఓ నారాయణ భరత్ గుప్త, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, ఈఓ స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు. గవర్నర్ వెంట డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికష్ణ తదితరులు ఉన్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.73.44 లక్షలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జుర స్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని ఉభయ దేవాలయాల హుండీల లెక్కింపు మంగళవారం లెక్కించగా రూ.73,44,451 వచ్చినట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్త తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. నగదుతో పాటు 107 యూఎస్ఏ డాలర్లు, 50 న్యూజిలాండ్ డాలర్లు, 40 యూకే పౌండ్లు, ఐదు మాల్దీవి విదేశీ కరెన్సీ లభించిందన్నారు. ఈ మొత్తం 15 రోజుల్లో స్వామి అమ్మవార్లకు వచ్చిన ఆదాయమని వెల్లడించారు. -
మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: మల్లన్నసాగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసు రాజ్యం నడుస్తోం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసిత ప్రాంతాల్లో పోలీసుల బలగాలతో బాధిత రైతులను అష్ట దిగ్బంధం చేశారని, నాయకులెవరినీ అటువైపు వెళ్లకుండా చూస్తున్నారన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత కనిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం, పెండింగ్ అం శాలను వివరించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరామని పొన్నాల తెలిపారు. అయితే ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నా రు. అపాయింట్మెంట్ లభిస్తే ప్రధానితో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు అంశాన్ని అడుగుతామన్నారు. -
అలీసాగర్, గుత్ప వైఎస్ చలువే
మల్లన్నసాగర్ నిర్మాణం ఆచరణలో అసాధ్యం ప్రభుత్వం భేషజాలకు పోవద్దు భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బోధన్ : వైఎస్ హయాంలోనే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పనులు చేపట్టడం జరిగిందని, నా ఆలోచనతోనే అలీసాగర్ బ్యాక్‌వాటర్ పథకాన్ని రూపకల్పన చేశానని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బోధన్ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలని గోదావరి జలాలను బెల్లాల్ చెరువుకు మళ్లించే పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. శనివారం మండలంలోని అమ్దాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు డి–40, చింతకుంట వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు మెయిన్ కాలువ వద్ద డి–40 కాలువ నీటి మళ్లింపు పాయింట్లను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితి వల్ల గోదావరి నదిలో నీళ్ల లేక ఈ పథకం ద్వారా నీటి సరఫరా జరగలేదన్నారు. ప్రసుత్తం వర్షాలు కురిసి గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించడంతో ఎత్తిపోసిన నీటిని అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా బెల్లాల్ చెరువుకు తొలిసారిగా నీటి సరఫరా ఐదు రోజులుగా కొనసాగుతోందన్నారు. అలీసాగర్బ్యాక్వాటర్ ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా అవుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగిందని, అలీసాగర్ కింద 53 వేల ఎకరాలు, గుత్ప పథకం కింద 38 వేల ఎకరాలకు సాగునీరందుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దు బోధన్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ అంశంలో ప్రభుత్వం భేషజాలకు, ఒంటెద్దు పోకడలకు వెళ్లొదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ప్రాజెక్టు పనుల్లో రాజకీయాలొద్దన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో జిల్లా రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. గోదావరి జలాల వినియోగంలో నీటి నిపుణులు, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతామనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 112 కిలో మీటర్ల దూరంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కడెం ప్రాజెక్టుకు సుమారు 40 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయని, కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని మళ్లిస్తే అతి తక్కువ ఖర్చుతో సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. -
ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగింపు
తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ముంపు గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్ గ్రామాల శివారుల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోంది. జులై 24న వేములఘాట్ గ్రామస్తులపై లాఠీచార్జీ జరిగిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామాల్లోకి కొత్తవారిని అనుమతించడంలేదు. కొత్త వ్యక్తులకు గుర్తింపు కార్డు ఉంటేనే గ్రామాల్లోకి అనుమతిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను, ప్రజా సంఘాల నేతలను గ్రామాల్లోకి అనుమతించడంలేదు. కాలిబాటలో వెళ్లే వారిని కూడా తనిఖీ చేసి వదిలిపెడుతున్నారు. కాగా వేములఘాట్ గ్రామస్తులు చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 63వ రోజుకు చేరాయి. -
బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్నట్లు..
మెదక్ : మల్లన్నసాగర్ విషయంలో విపక్షాల తీరు బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్న తీరులా ఉందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, ఆ స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని సూచించారు. మిషన్ భగీరథ పాత పథకం కాదని హరీశ్ రావు అన్నారు. ఒక్క మెదక్ జిల్లాలో ఆ పథకం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని సభకు వచ్చేవాళ్లు మధ్యాహ్నం ఒంటిగంటలోపే చేరుకోవాలన్నారు. ప్రధాని సభకు లక్షా 50వేలమంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులందరికీ ఆహ్వానాలు పంపినట్లు హరీశ్ తెలిపారు. -
మల్లన్నసాగర్ బాధితులతో రేపు ముఖాముఖి
హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో శనివారం ముఖాముఖి జరుగనుంది. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు. -
మల్లన్నసాగర్ పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు నిర్మాణం ఆగదు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముత్తారం : మల్లన్నసాగర్ నిర్మాణం సాఫీగా జరిగితే తమకు రాజకీయ సన్యాసమే శరణ్యమని భావించి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జలాశయం నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ సమీపంలోని మానేరునదిపై వంతనె నిర్మాణానికి ఆయన రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధూసూధనాచారి, ఎమ్మెల్యే పుట్ట మధుతో గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని పెంచడం, భూసేకరణపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుంటే కన్నుకుట్టిన ప్రతిపక్ష నాయకులు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్లి జీవో 123ను రద్దు చేయించారని ఆరోపించారు. భూసేకరణలో నిర్వాసితులకు నష్టం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పరిహారం చెల్లింపుల్లో అన్ని రకాలుగా న్యాయం చేయడం కోసమే ప్రభుత్వం జీవో 123 విడుదల చేసిందన్నారు. జీవో 123 రద్దుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
జోరందుకున్న సంతకాల సేకరణ
కొండపాక: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎర్రవల్లిలో భూసేకరణ కోసం చేపట్టిన సమ్మతి ఫారాలపై సంతకాల సేకరణ జోరందుకుందని తహసీల్దార్ విజయ్‌భాస్కర్‌జీ పేర్కొన్నారు. మండలంలోని ఎర్రవల్లిలో బుధవారం భూసేకరణ కోసం ఫారం నంబరు (1), (2)లపై రైతుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. బయట వ్యవసాయ పనులు సాగుతుండటంతో మరింతగా వేగంగా సంతకాల సేకరణకు రైతులు మొగ్గు చూపడం లేదన్నారు. కేవలం 3 గంటల్లో 30 మంది రైతుల వద్ద నుంచి 86 ఎకరాల భూములు ప్రాజెక్టుకు ఇచ్చేందుకు సమ్మతి పత్రాలపై రైతులు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా 123 జీవో ప్రకారం భూములను అప్పగిస్తున్నారన్నారు. అందరి రైతుల వద్ద నుంచి సమ్మతి సంతకాల సేకరణలు ముగిసిన వెంటనే ఏ రైతుది ఎన్ని ఎకరాల భూమిని కోల్పోతున్నారో తెలిసేలా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టిస్తామన్నారు. తదుపరి భూముల రిజిస్ట్రేఫన్ పరంపర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉటుకూరి నర్సింహారెడ్డి , ఎంపీటీసీ ఎడ్ల నర్సింలు, వీఆర్వోలు జలంధర్, వెంకటనర్సయ్య, ప్రవీణ్, యాదగిరి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి హరీష్‌రావును భర్తరఫ్ చేయాలి
తొగుట: మల్లన్నసాగర్ నిర్మాణానికి రైతుల నుంచి దౌర్జన్యంగా భూములు లాక్కోవడమే కాకుండా అన్యాయంగా లాఠీచార్జి, కాల్పులకు కారణమైన రాష్ట్ర మంత్రి హరీష్‌రావును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోపాలస్వామి డిమాండ్ చేశారు. బుధవారం తొగుటలో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టంతో రైతులకు నష్టం జరుగుతుందంటూ రైతులను మభ్యపెట్టడం మంత్రికి తగదన్నారు. 123 జీవోతో మెరుగైన పరిహారం అందిస్తున్నామంటూ ప్రజలను తప్పదోవ పట్టించాడన్నారు. కొమరవెల్లి మల్లన్నసాగర్ నిర్మాణం కోసం రైతుల నుంచి దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేసిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమాయకపు ప్రజలపై దుర్మార్గంగా వ్వవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. అక్రమంగా ఆరెస్ట్ చేసి జైల్‌కు పంపిన సీపీఎం నాయకులను బేషరుతుగా విడుదల చేయాలన్నారు. కాగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఒంటెల రత్నాకర్ మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్నసాగర్‌కు సేకరించిన భూములకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కేంద్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 123 జీవోతో భూసేకరణ చేయడం దుర్మార్గమన్నారు. కాగా ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, తుక్కాపూర్, బి. బంజేరుపల్లి, వడ్డెరకాలనీలలో హైకోర్టు తీర్పుతో పండుగ వాతవరణం నెలకొంది. గ్రామాల్లోని ప్రజలు, యువకులు , రైతులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, టపాసుల కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబురాలు నిర్వహించారు. -
మా ఊరికి రావొద్దు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండపాక: ‘కాంగ్రెస్.. కమ్యూనిస్టు.. తెలుగుదేశం పార్టోళ్లూ మీ సాయం ఇగచాలు. ఊళ్లేకొచ్చి లేని గొళ్లెం పెట్టకుండ్రి.. మా ఊరికి రావొద్దు.. ఆగం జేయొద్దు. రాజకీయాలుంటే ఊరి బయటే చేసుకోండ్రి’ అని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఎర్రవల్లివాసులు ప్రతిపక్ష పార్టీలకు నిర్మోహమాటంగా చెబుతున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. ఈ మేరకు ‘గ్రామంలోకి ప్రతిపక్షాలు రావద్దు’ అని పలకలపై రాసి మంగళవారం ఊరు చుట్టూ బోర్డులు పెట్టారు. ‘2013వ సట్టం ఒప్పుకొమ్మని ఆగమాగం జేస్తిరి. మీ మాటలు ఇని ఆగమైనం. ఇంక మా ఊరికొస్తే మంచిగుండదు. తపాస్‌పల్లి పోయొచ్చినం.. మీ సక్కదనం జూసొచ్చినం’ అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపుతో ఇప్పటికే ఆగమైన తమను కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీలు రెచ్చగొడుతున్నాయని వాపోయారు. 123 జీఓ తమకు నచ్చిందని, మంత్రి హరీశ్ మాటలపై నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్లే కలసి మెలసి ఉంటున్న ఎర్రవల్లిలో గొడవలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జిలో గాయపడిన వేములఘాట్ ముంపు గ్రామస్తులను పరామర్శించడానికి సోమవారం కాంగ్రెస్ నాయకులు వెళ్లబోతే తమ ఊరిగుండా వెళ్లొద్దంటూ ఎర్రవల్లి ప్రజలు పొలిమేరలో కంప అడ్డం వేశారు. ప్రతిపక్షాలకు పరాభవం తప్పదు ఎర్రవల్లి ప్రజలకు కృతజ్ఞతలు. మిగతా గ్రామాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు పరాభవం తప్పదు. సిద్దిపేట నియోజకవర్గం ఇమాంబాద్, అనంతగిరి ప్రాజెక్టుల కింద భూ సేకరణను సైతం కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని చూశారుు. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో 120 రోజులు టెంటు వేస్తే వీళ్లు వచ్చి ఒకటే రెచ్చగొట్టుడు. కానీ 120 రోజుల తరువాత ఏం జరిగింది? నేను పోయి అదే టెంటు కింద కూర్చున్న. ఉన్న విషయాలు చెప్పి ఒప్పిం చిన. నిజంగా చెప్పాలంటే రైతులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ ఈ వచ్చిపో యే నాయకులకు ఉంటదా? ఒక్కరోజు బాగోతంగాళ్లు వాళ్లు. ఇయ్యాల ఒస్తరు రేపు పోతరు. నేను మళ్లీ చెప్తున్నా.. ముం పు గ్రామాల ప్రజలను కడుపుల పెట్టుకొని చూసుకుంటా. - మంత్రి హరీశ్‌రావు -
‘2013’ ప్రకారమే పరిహారం ఇవ్వాలి
దుబ్బాక రూరల్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు నష్ట పోతున్న బాధితులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఇల్లెందుల రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం దుబ్బాకలో ఆర్అండ్బీ అథితి గృహంలో నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్న సాగర్ భూ బాధితులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 123 జీఓ పూర్తిగా నష్టం కలిగిస్తుందన్నారు. కేజీ నుంచి పీజీ విద్య ఇంతవరకు అమలు పర్చలేదన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిరుద్యోగులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గడీల జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు స్వామిగౌడ్, కరికె శ్రీనివాస్, చేగుంట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, మండలాల అధ్యక్షులు దుబ్బాక రాజయ్య, సుధాకర్‌రెడ్డి, మేకల పరమేశ్, జహంగీర్, నర్సింహారెడ్డి, కాశయ్య తదితరులు పాల్గొన్నారు. -
భద్రత..మల్లన్నకెరుక?
– అమలుకు నోచుకోని ఎస్పీ ప్రతిపాదనలు – కనిపించని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు – సెల్ జామర్ల జాడ కరువు – సోలార్ ఫెన్సింగ్ ఊసే లేదు శ్రీశైలం: శ్రీశైలం..జ్యోతిర్లింగ క్షేత్రం. ఆగస్టు 12వ తేదీన ఇక్కడ కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. పాతాళగంగ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ వద్ద ఇటీవల కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన పుష్కరాల సమీక్షలో మొత్తం 22 భద్రతా అంశాలపై కలెక్టర్ విజయమోహన్‌కు జిల్లా ఎస్పీ రవికష్ణ నివేదిక సమర్పించారు. రెండు, మూడు మినహా మిగిలినవి ఏవీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఎస్పీ స్వయంగా చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ముందే ఆగస్టు 3 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. భక్తులరద్దీ లక్షల సంఖ్యలో ఉంటుందని, సుమారు 30 లక్షలకు పైగా భక్తులు పుష్కరాలలో పవిత్ర పుణ్యస్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్షేత్రంలో భద్రత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన మధుసూదన్‌రెడ్డి మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చి పలు సూచనలను జారీ చేశారు. అవేవి గడిచిన 9 ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత జిల్లా ఎస్పీ రవికష్ణ కూడా ఆలయప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందే బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. అలాగే దేవస్థానం అధికారులకు కూడా ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను చేయాల్సిందిగా సూచించారు. అయితే ఇప్పటి వరకు ప్రధానాలయ గోపురం ముందు రెండు డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు మినహా ఎక్కడా అమర్చలేదు. కేవలం సీసీ కెమెరాలతో నిఘాకు మాత్రమే ఆలయం పరిమితమైంది. ఆలయ రక్షణ కోసం ఏం చేయాలంటే... · మల్లన్న ఆలయరక్షణ చర్యలలో భాగంగా ఆలయప్రాకార కుడ్యానికి నాలుగు వైపులా వాచ్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. · ప్రవేటు భద్రతా సిబ్బంది ప్రస్తుతం 70 మంది మాత్రమే ఉన్నారు. మరో 40 మందికిపైగా నియమించాల్సి ఉంది. · కోట గోడ పై భాగం చుట్టూ నలువైపులా సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి. · బ్యాగ్ స్కానర్లను ఆలయప్రవేశానికి ముందే ఏర్పాటు చేయాలి. · ఆలయప్రాంగణంలో సెల్ జామర్లను వినియోగించాలి. · డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఆలయం ముందు భాగం, దర్శనం చేసుకుని వెళ్లే ఎగ్జిట్‌లో ఏర్పాటు చేయాలి. · మెటల్ డిటెక్టర్లు పనితీరు ఎప్పటికప్పుడు గమనించాలి. ·ప్రస్తుతం ఎప్పీఎఫ్ సిబ్బంది అమ్మవారికి గుడికి మాత్రమే పరిమితమయ్యారు. స్వామివారి ఆలయప్రాంగణంలో కూడా వీరిని నియమించాలి. · ఆలయప్రాంగణంలో ఏఆర్ సిబ్బందిని నియమించాలి. ·అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయాలి. · క్లాక్ రూమ్ వద్ద మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. ·అమ్మవారి గర్భాలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న ప్రాకారకుడ్యం ఎత్తు పెంచాలి. -
మల్లన్నసాగర్ పరిస్థితి సృష్టించవద్దు
రౌండ్ టేబుల్ సమావేశంలో సారంపల్లి మల్లారెడ్డి న్యూశాయంపేట : జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం చేపట్టే ప్రభుత్వ భూసేరణను మల్లన్నసాగర్ పరిస్థితి మాదిరిగా చేయెుద్దని, అలా చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదరుర్కోవలసి వస్తుం దని ఎఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్తి మల్లారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భూసేకరణ–నిర్వాసితుల సమస్య అనే అంశం పై పెద్దారపు రమేష్ అధ్యక్షతన హన్మకొండలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జీఓ 123 ప్రకారం నిర్బంధంగా రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూసేకరణకు పూనుకొందని విమర్శించారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా 2013 చట్టాన్ని అమలు చేయాలని డి మాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జి ల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరించి భూసేకరణ చేస్తే రైతులు చేసే ఉ ద్యమాలకు అండగా వుంటామన్నారు. సీపీఐ జి ల్లా కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ భూసేకరణ జీఓలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ రియల్టర్లకు, పెట్టుబడిదార్లకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. వివిధ పార్టీల నాయకులు ఎన్.రెడ్డి, హాంసారెడ్డి, రాజయ్య, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, ఈవి.శ్రీనివాస, రంగయ్య,చుక్కయ్య, రత్నమాల, దుబ్బ శ్రీనివాస సమ్మిరెడ్డి, కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తెస్తాం'
మెదక్: భూములు కోల్పోయిన ప్రజలకు ప్రాజెక్టులో చేపలు పట్టే హక్కు కోసం ప్రత్యేక జీవో తీసుకవస్తాం' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం మెదక్‌లో మల్లన్నసాగర్ ముంపు గ్రామం సింగారం ప్రజలతో హరీశ్‌రావు చర్చించారు. ఈ సమావేశంలో వారితో జరిపిన చర్చలు సఫలమైయ్యాయి. 123 జీవో ప్రకారం తమ భూములు ఇచ్చేందుకు సింగారం గ్రామస్తులు అంగీకారం తెలిపారు. 1986లో సింగూరు ప్రాజెక్టును మెదక్ జిల్లాలో కట్టారనీ, ఇప్పటివరకూ డబ్బులు రాక నిర్వాసితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం 123 జీవో ప్రకారం నేరుగా నిర్వాసితులకే డబ్బులు చెల్లిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. -
అడుగు గడప దాటకపోతే ఇక అంతే...!
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యపై విపక్షాలుగా విడివిడిగా నిర్వహిస్తున్న ఉద్యమాలు ఆయా పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయట. కేంద్రంలో భూసేకరణ చట్టం 2013ను తీసుకొచ్చిన ప్రభుత్వంగా... ఆ తర్వాత బీజేపీ పాలనలో పార్లమెంట్లో ఆ చట్టానికి సవరణలు తెచ్చే ప్రయత్నాలను అడ్డుకున్న ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తోందట. అయితే రాష్ట్రంలో మాత్రం కేంద్ర భూసేకరణ చట్టం అమలయ్యేలా చూడడంలో జీవో 123ను అడ్డుకోవడంలో టీపీసీసీ ముఖ్యనేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడిని తేలేకపోతున్నారని ఆ పార్టీ నాయకులు తెగ వాపోతున్నారట. మరోవైపు మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై సీపీఎం, ఇతర పార్టీలు ముందుండి రిలే నిరాహారదీక్షలు, పాదయాత్రలంటూ జోరుగా నిరసనలతో ముందుకు సాగుతున్నాయని గుర్తుచేసుకుని లోలోపల బాధపడుతున్నారట. గాంధీభవన్ నుంచి ‘చలో మల్లన్నసాగర్’ అంటూ మొదలెట్టి... కనీసం పార్టీ కార్యాలయం గేటు కూడా దాటకుండానే నేతలంతా అరెస్ట్ కావడం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారట! రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడే మార్గాలను పార్టీ నాయకత్వం తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు పనిలో పనిగా సలహాలిస్తున్నారట! -
ఇంత ఘోరం ఏనాడూ లేదు
మల్లన్నసాగర్ ఘటనలపై ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు వెళ్లకుండా పోలీసు వలయాన్ని ఏర్పాటు చేశారని, బాధితులను కలవనీయకుండా అడ్డుకునే ఇలాంటి అప్రజాస్వామిక ఘోరం ఏనాడూ లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు.శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరితే పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. నిర్వాసితులను పరామర్శించడానికి, వారికి న్యాయం దక్కడానికి ప్రయత్నాలు చేస్తున్న విపక్షాలకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించడం దారుణమని విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో వాస్తవంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.గోదావరి నదిలో 120 రోజుల పాటు వరద వస్తుందని, పంట పూర్తయ్యేదాకా వరద వస్తున్నప్పుడు ఎత్తిపోతలకు అవకాశం ఉందన్నారు. ఎత్తిపోతలకు అవకాశం ఉన్నప్పుడు 50 టీఎంసీల సామర్థ్యంతో భారీ రిజర్వాయర్‌ను నిర్మించాల్సిన అవసరం ఏముందని ఉత్తమ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను బయటపెట్టాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. డీపీఆర్‌ను దాచిపెట్టి, సీఎం కేసీఆర్ తన ఇంటికి సంబంధించిన వ్యవహారంలాగా చేస్తున్నారని ధ్వజమెత్తారు. భూములకోసం, పునరావాసంకోసం పోరాడుతున్న నిర్వాసితులను మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, అధికారులు బెదిరిస్తున్నారన్నారు. ఆ గ్రామాల్లోకి ఎవరు వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. మల్లన్నసాగర్ వెళ్లడానికి సిద్ధమైన కాంగ్రెస్‌నేతలను గాంధీభవన్‌లోనే అరెస్టు చేశారని, న్యాయవాదులనూ వదల్లేదని , నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులపైకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ కారును ఎక్కించడం వంటి చర్యలన్నీ అప్రజాస్వామ్యానికి, అరాచకానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి వైదొలగాలని డిమాండ్ చేశారు. -
న్యాయవాదుల ధర్నాలో ఉద్రిక్తత
హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదుల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో న్యాయవాదులు అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను ములుగు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ వాహనం న్యాయవాదులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌బాబు అనే హైకోర్టు న్యాయవాది కాలు విరిగింది. దీంతో న్యాయవాదులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. -
'మల్లన్నసాగర్ పై ప్రజల్లో అనుమానాలు'
హైదరాబాద్ : తెలంగాణ న్యాయవాదుల జేఏసీ శనివారం మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన రైతులను కలిసేందుకు బయల్దేరారు.ఈ సందర్భంగా తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌పై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. ప్రజల అనుమానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ వెళుతున్నవారిని అరెస్ట్ చేయడం సరికాదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. -
రాష్ట్రంలో అవినీతి పాలన
ప్రభుత్వంలో మంత్రులు జీవచ్చవాలు ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీ మల్లన్నసాగర్‌తో యుద్ధం మొదలైంది బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ముకరంపుర: తెలంగాణలో అవినీతి, అసమర్థపాలన సాగుతోందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. హామీలన్నీ 99 శాతం పూర్తి చేశామని అబద్ధాలు, మాయమాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కరీంనగర్లో శుక్రవారం జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా కృషిచేయాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువలా ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.కేసీఆర్ పాలనను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, కరువు ని«ధులను వినియోగించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు అధికారం లేకుండా జీవశ్చవంలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఒక్క రూపాయి కూడా మంజూరీ చేయలేదని, మంత్రివర్గం పూర్తిగా నామ్‌కే వాస్తేగా ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనకు హనీమూన్ రెండేళ్లతో ముగిసిందని, మల్లన్నసాగర్‌తో యుద్ధం మొదలయ్యిందన్నారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనన్నారు. కేజీటూపీజీ, ఇంటికో ఉద్యోం, డబుల్బెడ్రూం, మూడెకరాల భూమి తదితర హామీలన్నీ మూలన పడ్డాయన్నారు. ప్రతిపక్షాలు లేకుండా కేసీఆర్ శాసన వ్యవస్థను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టు రీడిజైన్, మిషన్‌కాకతీయ, భగీరథల పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణలో హరించుకుపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాద్యత మీడియాపైనే ఉందన్నారు. ఆగస్టు 7న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, బల్మూరి వనిత, వన్నాల శ్రీరాములు, న్యాలకొండ నారాయణరావు, కోమల ఆంజనేయులు, ముదుగంటి రవీందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, సుభాష్‌రావు, గాజుల స్వప్న, సుజాతరెడ్డి, గంట సుశీల, అయిల ప్రసన్న, పటేల్ దేవేందర్‌రెడ్డి, కన్నం అంజయ్య, పెండ్యాల సాయికృష్ణరెడ్డి పాల్గొన్నారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. జానారెడ్డి, షబ్బీర్ అలీని బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేతల వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అనుమతించలేదు. కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నెల 26న ఛలో మల్లన్న సాగర్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఛలో మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ నేతలు మళ్లీ మల్లన్నసాగర్ బయలుదేరారు. అయితే రెండోసారి కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘మల్లన్న’కు మేమూ భూములిస్తాం
సిద్దిపేట జోన్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం తాము కూడా భూములు ఇస్తామని మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామస్తులు ముందుకు వచ్చారు. గురువారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులతో మంత్రి హరీశ్‌రావు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. 70 శాతం మంది రైతులు జీవో 123 ప్రకారం భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మంత్రికి రైతులు అంగీకారపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమిని ఇచ్చిన భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారందరికి ప్రభుత్వ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. భూ నిర్వాసితుల జీవన ప్రమాణాలు మరింత మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. ఎర్రవల్లి రైతులకు రుణపడి ఉంటామని, వారికి ఎంత చేసినా తక్కువేనని, వారి త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రతిపక్షాల కుట్రలన్నీ కారుమబ్బుల్లాంటివన్నారు. సీఎం, మంత్రిపై విశ్వాసం మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో నాలుగు జిల్లాలు సస్యశ్యామలం అవుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై విశ్వాసంతో తాము భూములిచ్చేందుకు మనస్ఫూర్తిగా ఒప్పకున్నామని ఎర్రవల్లి గ్రామస్తులు తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో జీవో 123 కింద ప్రాజెక్టు నిర్మాణానికి స్వచ్ఛందంగా భూమిని ఇస్తున్నట్లు అంగీకార పత్రాలను అందజేసి మీడియాతో వారు మాట్లాడారు. -
తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు
కాంగ్రెస్ నేతలపై కర్నె ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్ రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని, వాళ్లు తీవ్రవాదుల కన్నా ప్రమాదకారులని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల ప్రజల సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని విపక్షాలు రెచ్చగొడుతన్నాయిని, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తై తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవనే భయంతోనే అడ్డుకోడానికి కుట్రలు చేస్తున్నాయని కర్నె ఆరోపించారు. -
నిర్వాసితులపై కేసులను ఎత్తేయాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ నిర్వాసితులపై అక్రమ కే సు ల్ని ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నిర్వాసితులపై కాల్పులు, లాఠీచార్జీపై ప్ర భుత్వం క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపా రు. పోలీసులు అరెస్టు చేసిన మెదక్ జిల్లా సీపీఎం కార్యదర్శి మల్లేశ్, మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ భాస్కర్ ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎక్కువ మంది రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని, భూఉద్యమ నాయకులను జైలుకు పంపి నిర్వాసితులను బలవంతంగా ఒప్పించడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. -
మల్లన్నసాగర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి
ఆలేరు : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు రాచకొండ జనార్దన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులు, ప్రజల మనోభావాలను పట్టించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి.కుమార్, వెంకటేశ్, రాజయ్య, భాస్కర్, కుమార్, నర్సింహారెడ్డి, ఉప్పలయ్య, శ్రీను పాల్గొన్నారు. -
‘కోదండరాం అడ్డుకోవటం విడ్డూరం’
మేడ్చల్(రంగారెడ్డి): ‘మా తెలంగాణ మాకు కావాలి.. మా నిధులు, మా నీళ్లు, మా ఉద్యోగాలు మాకే..’ అంటూ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మూడు జిల్లాల రైతులకు న్యాయంచేసే మల్లన్నసాగర్‌ను అడ్డుకోవాలని ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నగరపంచాయతీ అత్వెల్లిలో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ కోదండరాం ప్రతిపక్షాల ఉచ్చులో పడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల ప్రజలకు సాగు, తాగు నీరందించే మల్లన్నసాగర్‌ను అడ్డుకోవడం మంచిదికాదన్నారు. ముంపు గ్రామాలకు వెళ్లి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఉనికి కోసం మల్లన్న సాగర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. భూములు ఏ విధంగా తీసుకుంటున్నారో రేవంత్‌రెడ్డికి కనబడడంలేదా అని ప్రశ్నించారు. ప్రజాబలం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలాంటి శక్తులు ఏమీ చేయలేవన్నారు. -
‘మల్లన్నసాగర్ వెళ్లేందుకు భద్రత కల్పించండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలకు గాయపడిన రైతాంగాన్ని పరామర్శించడానికి మల్లన్నసాగర్లో పర్యటిస్తామని, తమకు అనుమతి ఇవ్వడంతోపాటు భద్రతను కల్పించాలని టీపీసీసీ ముఖ్యనేతలు రాష్ట్ర డీజీపీకి వినతిపత్రాన్ని ఇచ్చారు. రాష్ట్ర కార్యాలయంలో డీజీపీని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, నేతలు సునీతా లక్ష్మారెడ్డి, సురేష్‌శేట్కార్, పొన్నం ప్రభాకర్, జగ్గా రెడ్డి, కుసుమకుమార్, ఆరేపల్లి మోహన్, కిషన్, జడ్సన్, అనిల్‌కుమార్ యాదవ్, నేరేళ్ల శారద తదితరులు కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రైతులను పరామర్శించడానికి వెళ్లడమే నేరమైనట్టుగా కాంగ్రెస్‌పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. మల్లన్నసాగర్లో 144 సెక్షన్ పెట్టినట్టుగా చెబుతున్న పోలీసులు అక్కడే టీఆర్ఎస్ నేతల ర్యాలీలకు మద్దతులను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేసిన ప్రకటనలపైనా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటే కొట్టిస్తామని, జైల్లో పెడతామని ప్రకటనలు చేసిన మంత్రి తలసానిపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అధికార దాహంతో కుట్ర
ప్రతిపక్షాలపై మండిపడ్డ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ‘మల్లన్నసాగర్’ పూర్తి చేస్తాం న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీలు.. ప్రాజెక్ట్ ముంపు బాధితులను రె చ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టును పూర్తి చేసి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ముంపుప్రాంతాలు లేకుండా ఏ ప్రాజెక్టును నిర్మించలేమని, అలా నిర్మించిన ప్రాజెక్టులు దేశంలో ఏమైనా ఉంటే చూపించాలని ప్రతిపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. ప్రాజెక్ట్ ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముంపు బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయడంతోపాటు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల 12 వేల కుటుం బాలు నిర్వాసితులైన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరిచారా అని నర్సయ్య ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీలో వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్న టీడీపీ.. తెలంగాణలో నీతులు చెప్పడం సరికాదన్నారు. -
ప్రజా అనుమతితోనే మల్లన్నసాగర్
⇒‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ⇒దేశంలో అతితక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టు ఇదే ⇒నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. రైతులకు నష్టం చేయబోం ⇒అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే విపక్షాల ఆందోళన ⇒సీపీఎం, బయటి శక్తుల వల్లే హింసాత్మక ఘటనలని ఆరోపణ హైదరాబాద్: రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచి రెండు పంటలకు నీరందించేందుకే ప్రభుత్వం ‘ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్’ను చేపట్టిందని.. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. మల్లన్నసాగర్‌ను దేశంలోనే అతి తక్కువ ముంపుతో నిర్మితమయ్యే ప్రాజెక్టుగా పేర్కొన్న మంత్రి... ముంపు ప్రజల అనుమానాలను నివృత్తి చేసి, వారి అనుమతితోనే ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఈ రిజర్వాయర్ విషయంలో విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివాదం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న: ప్రాణహిత-చేవెళ్ల రీ ఇంజనీరింగ్‌తో సమస్య మొదలైనట్లుంది? హరీశ్‌రావు: గోదావరిలో తెలంగాణ వాటా 954 టీంఎసీలు.. కానీ ఏనాడూ ఈ వాటాను వాడుకోలేకపోయింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు పోగా.. మిగతా 110 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీరివ్వడం సాధ్యం కాదు. అందువల్లే వీలైనన్ని ఎక్కువ నీళ్లను వినియోగించుకునేలా రీ ఇంజనీరింగ్ చేపట్టాం. 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరమా అనే ప్రశ్నకు మీ సమాధానం? లక్షలాది ఎకరాలకు నీరు ఇవ్వాలంటే భారీ రిజర్వాయర్లు కట్టాలి. 45 టీఎంసీల పులిచింతల ప్రాజెక్టు కోసం 28 గ్రామాలు, ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకు 19 గ్రామాలు, మిడ్‌మానేరులో 25 టీఎంసీలకు 18 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మల్లన్నసాగర్లో 50 టీఎంసీలకు 8 గ్రామాలు మాత్రమే ముంపునకు గురవుతున్నాయనే విషయాన్ని గమనించాలి. ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి కదా! ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి. ప్రజల్లో అపోహలు కల్పించి, సమస్యలు సృష్టించి ప్రాజెక్టుల వేగాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే ఆరు గ్రామాలతో చర్చలు పూర్తయ్యాయి. మూడు గ్రామాలు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. నిర్వాసితులను ఒప్పించి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప బలవంతం చేయడం లేదు. ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలపై..? సంక్షేమ కార్యక్రమాలు చేపడితే దుబారా అంటారు, ప్రాజెక్టులు చేపడితే అవినీతి అంటారు. భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ఒత్తిడి చేస్తున్న టీడీపీ... ఇక్కడ అమలు చేయాలంటూ ధర్నాలు చేస్తోంది. ఆ పార్టీకి ఓ నాయకుడు, ఓ వైఖరీ లేదు. ఇదే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు పంటలు పండే భూములను లాక్కుంటున్నది. రాజధానికి 54 వేల ఎకరాలు తీసుకోవడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? మల్లన్నసాగర్‌ను వ్యతిరేకించడం టీడీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. పోలీసుల లాఠీచార్జీ, హింసాత్మక ఘటనలపై మీ వివరణ? సీపీఎం, బయటి నుంచి వచ్చిన శక్తులు రైతుల ఆందోళనను హింసాత్మకంగా మార్చాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే సంయమనం పాటించి అమాయక రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా.. విద్రోహ శక్తులను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మల్లన్నసాగర్‌పై అంత పట్టుదల ఎందుకు? ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల నుంచి 1,300 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు తెలంగాణకు హక్కు ఉన్నా.. అప్పటి ప్రభుత్వాలు ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. మేం అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి లభ్యత, నీటి కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌ను చేపట్టాం. మల్లన్నసాగర్ ద్వారా మెదక్ జిల్లాలో 9 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 2.30 లక్షల ఎకరాలకు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణ ద్వారా 2.50లక్షల ఎకరాలకు నీరందిస్తాం. తక్కువ ముంపుతో పెద్ద రిజర్వాయర్ నిర్మించే అవకాశం మల్లన్నసాగర్ వద్దే ఉంది. పరిహారంపై వస్తున్న విమర్శలకు మీ స్పందన? మల్లన్నసాగర్ విషయంలో బాధితులకు మెరుగైన నష్టపరిహారం అందిస్తాం. రాళ్లు, రప్పలున్నా ఎకరాకు రూ.ఆరు లక్షలతోపాటు బోరు, బావి, చెట్లకు కూడా డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. భూసేకరణ చట్టం-2013 కంటే జీవో 123 ఏవిధంగా మెరుగైందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇంగ్లిషు మీడియంలో రెసిడెన్షియల్ విద్య, కులవృత్తుల వారికి 80శాతం సబ్సిడీతో పథకాలు, చేపలు పట్టే అధికారం తదిత ర ప్రయోజనాలు చేకూరుస్తాం. అన్ని వసతులతో పునరావాస గ్రామాలు నిర్మిస్తాం. -
‘మల్లన్నసాగర్’తో సాగునీరు
రామన్నపేట మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బస్వాపురం రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలి పారు. బుధవారం మండలంలోని పల్లివాడలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.12లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.25లక్షల సీసీరోడ్డు, రూ.4లక్షలతో ఫార్మేషన్రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరితహారం కింద మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. చెట్లను బట్టి భూమి విలువను లెక్కగట్టే కేరళ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కరువును జయించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వీలైనచోటల్లా మొక్కలను పెంచాలని కోరారు. ప్రతీఇంటికీ ఐదుచొప్పున పండ్లమొక్కలను పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వివరించారు. బోరుమోటారును సమకూరుస్తానని ఎమ్మెల్యే హామీఇవ్వడంతో 20ఎకరాల్లో మొక్కలు నాటడానికి గ్రామస్తులు మందుకు వచ్చారు. లోవోలే్టజీ నివారణకు విద్యుత్సబ్స్టేçÙన్ను మంజూరు చేయాలని, పీహెచ్సీలో 24గంటల వైద్యసేవలు అం దేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. సర్పంచ్ గంగుల వెంకటరాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీడీ కె.జానకిరెడ్డి, డీఈ విష్ణువర్దన్రావ్, ఏఈ జి.కొండయ్య, ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, ఆర్ఐ డి.జానయ్య, వీఆ ర్ఓ సైదులు, పంచాయతీ కార్యదర్శి మానస, బందెల రాములు,కమ్మంపాటి శ్రీనివాస్, యాదగిరి, లింగయ్య పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్‌పై విపక్షాలది రాద్ధాంతం
సాగునీరు అందితే పుట్టగుతులు ఉండవనే జిమ్మిక్కులు పోలవరం, అమరావతి విషయంలో రైతులు గుర్తు రాలేదా? టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై విపక్షాలు లేనిపోని రాద్ధాం తం చేస్తున్నాయని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష సాధ న దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు అడుగడుగునా తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. రైతాంగానికి సాగునీరందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటే అడ్డు పడుతున్న విపక్షాల తీరును ప్రజ లు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయి రైతులకుసాగునీరందితే తమ కు పుట్టగతులు ఉండవనే భయం విపక్షాల్లో నెలకొం దని ఎద్దేవాచేశారు. 18 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎనిమిది గ్రామాలు ముంపునకు గురికానుండగా.. రెండు గ్రామాల ప్రజలను కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నేతలు తప్పదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 200 గ్రామాలు, 574 కుటుం బాలు, 1.70 లక్షల మందిని నిర్వాసితులను చేయగా అప్పుడు రైతులు గుర్తుకు రాలేదా అని రవీందర్రావు ప్రశ్నించారు. ఏపీలో అమరావతి నిర్మాణానికి మూడు పంటలు పండే భూములను లాక్కున్న టీడీపీకి రైతుల శ్రేయస్సు ఎందుకు పట్టలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు నష్టం జరుగొద్దని, వారికి ప్రయోజనం చేకూర్చేందుకు 123 జీఓను తీసుకొస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా భూసేకరణ జరుగుతుండగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రాంతంలో ఎందుకు లాఠీ చార్జీ జరిగిందో... కారకులెవరో ప్రజలు ఆలోచించాలని రవీందర్రావు కోరారు. తెలంగాణలో ఒక్క పంట కూడా పండని పరిస్థితులున్నాయని, ఈక్రమంలో రెం డు పంటలు పండేలా సాగునీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను సత్వ రం పూర్తి చేసేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్యా, ఇండ్ల నాగేశ్వర్రావు, కమరున్నీసాబేగం, నయీముద్దీన్, గైనేని రాజన్, జోరిక రమేష్, కోల జనార్థన్, వీ.ఎస్. యాకూబ్‌రెడ్డి, చింతం సదానందం, నాగపురి రాజేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నిరసన ర్యాలీకి వెళ్లిన కాంగ్రెస్ నేతల అరెస్టు
వరంగల్: మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు మద్దతుగా నిరసన ర్యాలీకి తరలి రావాలని పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌కు వెళ్లిన జిల్లా కాంగ్రెస్ నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గాంధీభవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీని అక్కడే అడ్డుకున్న పోలీసులు నాయకులను అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీఎల్పీ నాయకుడు జానారెడ్డి, శాసన మండలి నేత షబ్బీర్‌అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఇ¯Œæచార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు ఉన్నారు. -
మల్లన్నసాగర్ నిర్వాసితులకు అన్యాయం చేయెుద్దు
హన్మకొండ: మల్లన్న సాగర్ ప్రాజñ క్టు నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని తెలంగాణ విద్యా వంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వ ర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చం ద్రభాను అన్నారు. మంగళవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం .. 2013 భూసేకరణ, పునరావాస చట్టంపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 14 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కొత్తగా 123 జీఓను తీసుకిచ్చి ఇళ్లు నిర్మిస్తామని ఒప్పించి బలవంతంగా భూములు లాక్కొనే ప్ర యత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆం దోళన చేస్తున్న నిర్వాసితులపై లాఠీ చార్జి చేయ డం అమానుషమని పేర్కొన్నారు. ప్రజలు ని ర్వాసితులు కాకుండా గొలుసుకట్టు చెరువులు నిర్మించాలని, చిన్న నీటి వనరులతో నష్టం జరుగకుండా చూడాలని డిమాండ్ చేశా రు. సమావేశంలో టీవీవీ జిల్లా ఉపాధ్యక్షులు విద్యాసాగర్,బొనగాని రవీందర్, నాయకులు షేక్ జావి ద్, లక్ష్మయ్య, ప్రొఫెసర్ రమ పాల్గొన్నారు. -
రైతులకు నష్టం కలిగించొద్దు
భువనగిరి : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కోరారు. మంగళవారం భువనగిరిలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మించే నీటి ప్రాజెక్ట్‌లకు తాము వ్యతిరేకం కాదని, 2013 చట్టాన్ని అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. జిల్లాలో డిండి, సింగరాజుపల్లి వంటి రిజ ర్వాయర్లలకు చెందిన రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారని, ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. గ్రామం పోతే గ్రామస్తులకు భూమికి భూమి, ఇళ్లకు ఇళ్లు కల్పించాలన్నారు. 123 జీఓలో ఈ అంశాలన్ని లేవన్నారు. మల్లన్నసాగర్లో పోలీసులు లాఠీచార్జిు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు యానాల దామోదర్‌రెడ్డి, మండల కార్యదర్శి ఏశాల అశోక్, నాయకులు ఎండి.ఇమ్రాన్, గడ్డం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
విపక్షాలది అనవసర రాద్ధాంతం
చిలుకూరు : మల్లన్న సాగర్‌పై విపక్షాలు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం అన్ని విధాలుగా నిబంధనల ప్రకారం డిజైన్ చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 2.70 లక్షల ఎకరాలకు సాగునీరందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకంగా పోలేదని, చట్ట ప్రకారమే భూసేకరణ చేపట్టిందన్నారు. విపక్షాలు విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
పేదల పొట్ట కొట్టేందుకే మల్లన్న సాగర్
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం శాసనసభాపక్ష ఉప నేత జీవన్‌రెడ్డి మానకొండూర్: నిరుపేదల పొట్ట కొట్టేందుకే మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శాసనసభా ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అల్గునూర్‌లో అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేయడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. రైతులను నిరాశ్రయులను చేయడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. 2013 చట్టాన్నీ సర్కార్ ప్రభుత్వం నీరు గార్చుతోందన్నారు. ఈ చట్టాన్నీ రూపొందించేటప్పుడు కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఆ బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. 123 జీవోతో నిర్వాసితులకు ఎలాంటి లాభం లేదన్నారు. మంత్రి హరీష్‌రావు కేవలం ముఖ్యమంత్రి మెప్పు కోసమే మెదక్ జిల్లా రైతుల పొట్టగొట్టుతున్నాడని మండిపడ్డారు. నిర్వాసితుల హక్కులను కాలరాసే విధంగా పోలీసులు గాలిలో కాల్పులు జరపడమేంటని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కనీసం నోటిఫికేషన్ కూడా జారీచేయలేదన్నారు. మిషన్ భగీరథ, ప్రాణహిత ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్, జిల్లా పరిషత్తు మాజీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు దిండిగాల్ల మధు, టౌన్ ప్రెసిడెంటు కర్ర రాజశేఖర్, రామగుండం ఇన్చార్జి బాబర్ సలీం పాల్గొన్నారు. -
అల్గునూర్‌లో కాంగ్రెస్ నాయకుల అరెస్టు
మల్లన్నసాగర్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు పోలీసులపై ఆగ్రహం రాస్తారోకో చేసిన కాంగ్రెస్ నాయకులు తిమ్మాపూర్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అల్గునూర్‌లో మంగళవారం అరెస్టు చేశారు. కరీంనగర్ డీఎస్పీ రామారావు, తిమ్మాపూర్, వన్ టౌన్ సీఐలు వెంకటరమణ, విజయసారథితోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీసు బలగాలతో అల్గునూర్ చౌరస్తాలో మంగళవారం ఉదయమే మొహరించారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నాయకులు మల్లన్నసాగర్‌కు వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు అల్గునూర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. తరువాత జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం ఒకే వాహనంలో అల్గునూర్‌కు చేరుకోగా..వారిని డీఎస్పీ రామారావు, పోలీసులు అడ్డుకున్నారు. అద్దాలు దించాలని కోరినా.. వారు అలాగే కూర్చున్నారు. తర్వాత అద్దాలు దించి మాట్లాడుతుండగానే పోలీసులు వారి వాహనతాళంచెవిని లాక్కున్నారు. జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులపై లాఠీచార్జి చేయించిన ప్రభుత్వానిది తప్పు కాదా.. పరామర్శించేందుకు వెళ్తున్న తమదే తప్పా.. అంటూ మండిపడ్డారు. వాహనం నుంచి నాయకులను బయటకులాగి పోలీసులు తమ వాహనాల్లో బలవంతంగా ఎక్కించుకున్నారు. వారిని మానకొండూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అల్గునూర్ చౌరస్తాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనగా.. గంటకుపైగా నాయకులు అరెస్టు హైడ్రామా కొనసాగింది. రాస్తారోకోలో సీఎం డౌన్‌డౌన్ అంటూ, పోలీసుల జులుం నశించాలంటూ, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అరికట్టాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. రాస్తారోకో సమయంలో అల్గునూర్ చౌరస్తాకు మూడు దిక్కులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేతలను అరెస్టు చేసి తీసుకెళ్లిన తరువాత వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. బెజ్జంకి చెక్‌పోస్టులో అరెస్ట్ బెజ్జంకి: పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను పరామర్శించాడనికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులను బెజ్జంకి చెక్‌పోస్టులో సీఐలు వెంకటరమణ, నారాయణ అరెస్టు చేశారు. అనంతరం వారిని వాహనాల్లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
మల్లన్న రచ్చ
-
'వారిని ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయి'
హైదరాబాద్: మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం హైదారాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీడు భూములను రెండు పంటలుగా మార్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దానికోసం కొద్దిపాటి భూమి తీసుకుని ఎక్కువ రేటు ఇస్తే తప్పా? అని ప్రశ్నించారు. రాజధానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 54 వేల ఎకరాలు తీసుకున్నారని.. మరీ అది కరెక్టా? అని సూటిగా ప్రశ్నించారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు మూడు పంటలు పండే భూమి లాక్కున్నారని విమర్శించారు. పశ్చిమబెంగాల్లో పారిశ్రామికవేత్త కోసం 14 మంది రైతులను సీపీఎం చంపించందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పులిచింతల కోసం నల్లగొండ జిల్లాలో 28 గ్రామాలను ముంచిన ఘనత కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలదేనని దుయ్యబట్టారు. ప్రజలను మెప్పించి, ఒప్పించి భూమిని సేకరించాలనుకుంటున్నామనీ, అంతే తప్ప బలవంతంగా లాక్కునే ప్రయత్నం తాము చేయమని హరీశ్ స్పష్టం చేశారు. -
'వారిని ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయి'
-
అరెస్ట్‌లకు భయపడేది లేదు: కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై తాము పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు తాము భయపడబోమని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టీ హామీ ఇచ్చారు. -
ఆరు నూరైనా 'మల్లన్న' ఆగదు
నిజామాబాద్: ఆరు నూరైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఆగదు' అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నిజామాబాద్‌లో పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావొద్దని కాంగ్రెస్, టీడీపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు. ముంపు ప్రాంతం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం అనివార్యమని చెప్పారు. 800 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిసిపోతుంటే.. విపక్షాలకు కనిపించడం లేదని మంత్రి పోచారం విమర్శించారు. -
ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
-
ప్రభుత్వం పట్టింపులకు పోతోంది: జైపాల్
హైదరాబాద్ : ఛలో మల్లన్నసాగర్ వెళుతున్న కాంగ్రెస్ నేతల అరెస్ట్‌ను ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్ మల్లన్నసాగర్‌కు అవసరమా అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టింపులకు పోతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదని జైపాల్ రెడ్డి హితవు పలికారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు ఛలో మల్లన్న సాగర్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను పోలీసులు అడ్డుకుని, గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఎన్ని సార్లయినా జైలుకు..
- ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాగాలన్నదే మా లక్ష్యం: కోదండరాం - ప్రభుత్వ నిర్ణయాలపై చర్చ జరగాలి - జేఏసీ ఆధ్వర్యంలో ‘విద్యుత్’పై పుస్తకావిష్కరణ సాక్షి, హైదరాబాద్: ‘‘ఎన్నిసార్లు పోలీసుస్టేషన్లకు, జైళ్లకు వెళ్లాల్సి వచ్చినా వెనకాడం. మాకు ఏ రాజకీయ ఆకాంక్షాలు లేవు. ప్రజలు కేంద్రంగా అభివృద్ధే సాగాలన్నదే మా లక్ష్యం’’ అని మల్లన్నసాగర్ ఆందోళనలను ఉద్దేశించి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తి కాకుండానే దౌర్జన్యంగా ఏకంగా పదిహేను, ఇరవై రెవెన్యూ బృందాలు వెళ్లి, సంతకాలు పెట్టాల్సిందిగా ప్రజలను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తే ఆదివారం లాఠీచార్జి ఘటన జరిగేది కాదన్నారు. ‘ప్రాజెక్టులు కట్టాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే నిపుణులు సూచిస్తున్న ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నాం’ అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ రెండేళ్లలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, వాటి లాభానష్టాలను విశ్లేషిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త, టీజేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు రచించిన ‘తెలంగాణ విద్యుత్ రంగంలో ఏం జరుగుతున్నది?’ పుస్తకాన్ని కోదండరాం, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి సోమవారమిక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ఎవరిపై ద్వేషంతోనో, వ్యతిరేకతతోనో ఈ పుస్తకం రాయలేదన్నారు. ‘‘ఇది ఆరంభం మాత్రమే. త్వరలో నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టులపై నివేదికలు విడుదల చేస్తాం. ప్రభుత్వ నిర్ణయాలపై నిష్పక్షపాతంగా చర్చ జరగాలి. మనం మధ్యయుగపు కాలంలో లేం. అప్పట్లో పాలకులు ఇష్టం వచ్చినట్లు చేసుకునేవాళ్లు. రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో పాలన జరగాలని కోరుకుంటున్నాం. అందుకోసం ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తాం. పుస్తకాలు తీసుకొస్తాం’’ అని స్పష్టంచేశారు. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ డీలర్లకు మేలు చేసేందుకు గత సీమాంధ్ర పాలకులు అమలు చేసిన అభివృద్ధి నమూనా తెలంగాణకు పనికి రాదన్నారు. తెలంగాణ తొలి సీఎంకు ఉండాల్సిన అర్హతలన్నీ కేసీఆర్‌కు ఉన్నాయని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి పేర్కొన్నారు. లక్ష కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో చర్చ జరగడం లేదని పుస్తక రచయిత కె.రఘు పేర్కొన్నారు. -
లాఠీ చార్జి అమానుషం: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు వాసులపై లాఠీచార్జి చేయడం అమానుషమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. న్యాయం అడిగిన బడుగు, బలహీన వర్గాలను అణచాలని చూడడం బాధాకరమని, సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేద న్నారు.సోమవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాజకీయ పక్షాల బంద్‌కు సంఘీభావంగా వెళ్లిన కోదండరాం, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని రమణ ఖండిం చారు.బాధితులతో గవర్నర్‌ను కలుస్తామన్నారు. రైతులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మోత్కుపల్లి చెప్పారు. ప్రాజెక్టులకు ప్రత్యామ్నాయాలు ఉన్నా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రావుల అన్నారు. -
మెదక్ బంద్ పాక్షికం.. ఉద్రిక్తం
పోలీసుల అధీనంలో రాజీవ్ రహదారి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీల పిలుపు మేరకు చేపట్టిన మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ ప్రాంతంలోనే బంద్ ప్రభా వం కనిపించింది. ముందుగానే ప్రతిపక్షాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడం, భారీ ఎత్తున బలగాలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొం ది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఒంటిమామిడి.. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధి లో రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మందిని మోహరించారు. పోలీసు వలయంలో ముంపు పల్లెలు వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊళ్లోకి రాకుండా దిగ్బంధించారు. దీనికి నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ర్యాలీలు నిర్వహించారు.ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహ నం చేశారు. ఆందోల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలంటూ ర్యాలీ చేపట్టారు. సిద్దిపేటలో ప్రతిపక్షాల నేతలు బంద్‌లో భాగంగా దుకాణాలు మూసివేయించగా... వారి వెనకే టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి వాటిని తెరిపించాయి. -
మల్లన్న సామూహిక అభిషేకాలకు రంగం సిద్ధం
శ్రీశైలం: శ్రీశైల ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా రద్దీని దృష్టిలో ఉంచుకుని మల్లన్నకు సామూహిక అభిషేకాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 3వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతున్న సందర్భంగా అభిషేకాల నిర్వహణపై అధికారులు ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవల శ్రీశైల దేవస్థానం ఈఓగా బాధ్యతలను స్వీకరించిన నారాయణ భరత్ గుప్త గతంలో సామూహిక అభిషేకాలు ఎలా నిర్వహించారు, ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులు మొదలైన అంశాలపై అధికారులు, అర్చకులు, వేదపండితులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గతంలో రద్దీగా ఉండే, శని,ఆది,సోమవారాలలో సామూహిక అభిషేకాలను ఆలయప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో నిర్వహించేవారు. మిగిలిన రోజుల్లో స్వామివార్ల గర్భాలయంలోనే ఈప్రక్రియ జరిగేది. త్వరలో ఉత్తర్వులు జారీ: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కష్ణా పుష్కరాలు కూడా ప్రారంభమవుతున్న సందర్భంగా భక్తులరద్దీ అధికంగా ఉంటుందనే భావనతో సామూహిక అభిషేకాలను నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీశైల దేవస్థానం సామూహిక అభిషేకాలను నిర్వహించడం పట్ల విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆ సమయంలో తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. దేవాదాయ దర్మదాయ శాఖ ఆధీనంలోని అన్ని దేవస్థానాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని విమర్శించారు. పీఠాధిపతుల విమర్శలను, భక్తుల అభిప్రాయాలను దష్టిలో ఉంచుకుని కల్యాణమండపంలో సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్న తరువాత సేవా కర్తలకు శుద్ధ జలంతో స్వామివార్లను దర్శన సమయంలో అభిషేకించుకునే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఏదేమైనా సామూహిక అభిషేకాల నిర్వహణపై విధి విధానాలను రూపొందించిన తరువాత శ్రావణమాసంలో జరిగే అభిషేకాల నిర్వహణపై త్వరలో ఈఓ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. -
రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల రాద్ధాంతం
బాన్సువాడ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధిపొందడానికే టీడీపీ, కాంగ్రెస్‌లు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు., సోమవారం ఆ పార్టీలు పిలుపునిచ్చిన మెదక్ జిల్లా బంద్ పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం బాన్సువాడలోని పార్టీ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలం ప్రారంభం నుంచి జూలై 24 వరకు ప్రాణహిత, ఇందిరావతి నదుల నుంచి 770 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు. ఈ నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మళ్లిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలోని కొంత భాగంలో గల 3,000 గ్రామాల్లోని 40 లక్షల ఎకరాలకు నీరందుతుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు 45 సార్లు నిండుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం కోటి 40 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యం కాగా, వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 65 లక్షల ఎకరాల్లోనే పంటలను వేసారని తెలిపారు. 25 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉండగా, 3.40 లక్షల ఎకరాల్లో వేశారని తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల బాధితులతో జీవో నెంబర్ 123 ప్రకారం ముఖాముఖిగా మాట్లాడి నష్ట పరిహారం చెల్లించడం, లేదా 2013 పార్లమెంట్ బిల్లు ప్రకారం చెల్లంచడంపై వారితోనే అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. జీఓ 123 ప్రకారం వారు ఒప్పుకోగా, మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ. 6 లక్షలు, పొలాల్లో ఉండే నిర్మాణాలు, బోర్లకు అదనంగా పరిహారం చెల్లించేందుకు సిద్ధమయ్యామని, దీనికి ఏటిగడ్డ, కిష్టాపూర్ గ్రామస్తులు అంగీకరించారని తెలిపారు. ఎవరో టీడీపీ నేత ప్రభాకర్‌రెడ్డి, సొంత లబ్దికోసం మిగితా గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన చేస్తూ, పోలీసులపై రాళ్లు రువ్వారని, ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. మేధావి అయిన ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.9000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాణహిత–చేవేళ్ల పథకం ద్వారా ఒక్క ఎకరానికైనా నీరు లభించాయా అని మంత్రి పోచారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని కోటి ఎకరాలకు నీరందించడమే ధ్యేయంగా కాళేశ్వరం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గోదావరి, మంజీర నదులపై మహారాష్ట్ర, కర్ణాటకలు అక్రమ ప్రాజెక్టులను నిర్మించడంతో నేడు నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. కాళేశ్వరంతోనే ఈ ప్రాజెక్టులకు జీవం పోయడానికి వీలుంటుందని మంత్రి పేర్కొన్నారు. -
సీఎం ఇలాకాలో నేతల హల్చల్
వచ్చిన వారినల్లా అరెస్టు చేసిన పోలీసులు నాటకీయంగా పోలీసుల అదుపులోకి రేవంత్‌రెడ్డి, దామోదర, సునీతారెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గజ్వేల్: వేములఘాట్, ఎర్రవల్లి గ్రామాల్లో మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై లాఠీచార్జి, గాల్లో కాల్పులను నిరసిస్తూ సోమవారం చేపట్టిన మెదక్ జిల్లా బంద్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ కేంద్రంగా సాగింది. ఇక్కడ బంద్‌ను విజయవంతం చేయడానికి వివిధ మార్గాల్లో పోలీసుల కళ్లుగప్పి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ప్రధానంగా టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు సునీత, నేతలు దాసోజు శ్రావ¯ŒSకుమార్, దయాకర్, బీజేపీ నేత రఘునంద¯ŒSరావులు నాటకీయ పరిణామాల మధ్య ఇక్కడ అరెస్టయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలో ఉద్రిక్తత కొనసాగింది... మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ గజ్వేల్‌లో తెల్లవారుజామునే ప్రతిపక్ష పార్టీల నేతలు రోడ్డెక్కారు. ముందుగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్దకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీల నేతలు చేరుకుని డిపో గేటు ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉదయం 9గంటల వరకు ఈ నిరసన కొనసాగింది. ఆ తరువాత సీఐ సతీష్, ఎస్ఐ కమలాకర్‌లు అక్కడికి చేరుకుని నేతలందరిని అరెస్టు చేసి దౌల్తాబాద్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. ఆ తర్వాత గజ్వేల్‌కు ఏ పార్టీ నేతలను రాకుండా కట్టడి చేసేందుకు పట్టణానికి వచ్చే ప్రజ్ఞాపూర్, తూప్రా¯ŒS రోడ్డుతో పాటు పలు మార్గాలను దిగ్బంధించారు. రాజీవ్ రహదారిపై విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. అయినా ఎలాగైనా గజ్వేల్‌కు చేరుకుని బంద్‌లో పాల్గొనాలని టీడీపీ శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రావ¯ŒSకుమార్, అద్దంకి దయాకర్ తదితరులు పోలీసుల కళ్లుగప్పి ఆర్టీసీ బస్సులు, బైక్‌లు, మరికొందరు కార్లలోనే అడ్డదారుల నుంచి గజ్వేల్‌కు చేరుకున్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చి వర్గల్ మండలం సింగాయపల్లి స్టేజీ వద్ద దిగిన తరువాత టీడీపీ నాయకులు ఆయనను కారులో చౌదర్పల్లి, సంగాపూర్ మీదుగా గజ్వేల్ పట్టణానికి తీసుకువచ్చారు. ఇదే సమయానికి దామోదర్ రాజనర్సింహ, తదితరులు సైతం వివిధ మార్గాల్లో గజ్వేల్‌కు చేరుకున్నారు. ఆ తరువాత వీరంతా స్థానిక నాయకులతో కలిసి పట్టణంలోని బస్టాండ్ ప్రాంతం నుంచి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా మార్కెట్‌రోడ్డు వైపు వెళుతూ దుకాణదారులను బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఒక దశలో రెండు పార్టీల నేతలు ఘర్షణకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సీఐ సతీష్, ఎస్ఐ కమలాకర్‌లు బలగాలతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ముందుగా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డిని అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, బీజేపీ నేత రఘునంద¯ŒSరావులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించినా పోలీసులు నిలువరించగలిగారు. అనంతరం రేవంత్‌రెడ్డిని దౌల్తాబాద్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. ఇది పూర్తయ్యాక దామోదరతో పాటు దాసోజు శ్రావ¯ŒSకుమార్, అద్దంకి దయాకర్లను అరెస్టు చేసి గజ్వేల్ పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించి అక్కడి నుంచి బేగంపేట పోలీస్‌స్టేçÙ¯ŒSకు తీసుకెళ్ళారు. ఇదిలా ఉంటే డీసీసీ అధ్యక్షురాలు సునీత అనూహ్యంగా పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్దకు చేరుకుని రోడ్డుపై ఒంటరిగా బైఠాయించారు. సుమారు 15 నిమిషాలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ తర్వాత మహిళా పోలీసుల సాయంతో అరెస్టు చేసి గజ్వేల్ స్టేష¯ŒS నుంచి తూప్రా¯ŒS వైపు తరలించారు. కాగా బంద్ నేపథ్యంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించారు. సుమారు 10 నిమిషాలపాటు రాస్తారోకో కొనసాగగా పోలీసులు అరెస్టు చేసి ఆయనను రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. గజ్వేల్‌లో బంద్ సందర్భంగా విద్యాసంస్థలను మూసి వేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం బంద్ ఉన్నా మధ్యాహ్నం వరకు పూర్తిగా తెరుచుకున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం 9గంటల తరువాత యథావిధిగా నడిచాయి. -
హైదరాబాద్ బహిరంగ సభకు ప్రధాని రాక
బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వెల్లడి తొర్రూరు : తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాలకు 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతోం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. అదేరోజు హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారన్నారు. బూత్‌కు ఐదుగురి చొప్పున జిల్లా నుం చి 10వేల మంది కార్యకర్తలు సభకు తరలివెళ్లేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై లాఠీచార్జి చేయించడం దుర్మార్గమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమయ్య, మండల అధ్యక్షుడు పల్లె కుమార్, నాయకులు బొమ్మనబోయిన కుమార్, యాకయ్య, మధుసూదన్‌రెడ్డి, యాకయ్య, సురేష్ పాల్గొన్నారు. -
మల్లన్న బాధితులను ఆదుకుంటాం
గజ్వేల్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం 50 టీఎంసీల సామర్థ్యంతో చేపడుతున్న మల్లన్నసాగర్ వల్ల 14 గ్రామాలు ముంపునకు గురవుతుండడం వల్ల వందలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని, వారందరికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్‌తో ఎవరికి లాభం చేకూరుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అంతేగాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తూ ‘మల్లన్న’ బాధితులపై లాఠీఛార్జి చేయడం సహించరానిదన్నారు. ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించిన తరువాతే భూసేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘మల్లన్నసాగర్’ నిర్మించాల్సిందే..
సిద్దిపేట, జోగిపేటలో అనుకూల ర్యాలీలు సిద్దిపేట జోన్/జోగిపేట: జిల్లాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం బంద్ జరిగితే, సిద్దిపేట, జోగిపేటలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టులను వెంటనే నిర్మించాలంటూ అనుకూల ర్యాలీలు జరిగాయి. జోగిపేటలో మండల టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంతరావు తదితరు ఆధ్వర్యంలో ర్యాలీ జరగగా.. సిద్దిపేటలో మల్లన్నసాగర్‌ను నిర్మించాలని, ప్రతి పక్షాల బంద్‌ను పట్టణ ప్రజలు తిరస్కరించాలని కోరుతూ పట్టణ టీఆర్ఎస్ కౌన్సిలర్ల అధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్ పటేల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, వెంకట్‌గౌడ్, చిప్ప ప్రభాకర్, ప్రవీణ్, గ్యాదరీ రవీందర్, దీప్తి నాగరాజు, స్వప్నబ్రహ్మం, నర్సింలు,ఉమారాణి,ఐలయ్య, లలిత రామన్నతో పాటు పలువురు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముందని వారు పేర్కొన్నారు. -
రైతులపై లాఠీ చార్జీ దుర్మార్గపు చర్య
రైతుల భూములను లాక్కుంటారా ఇదేనా బంగారు తెలంగాణ అంటే ఇదేనా సమస్యలు పరిష్కరించని చేతగాని ప్రభుత్వం రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్ టేక్మాల్ఃరైతులపై లాఠీ చార్జీచేయడం ఎంతో దుర్మార్గపు చర్యయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం టేక్మాల్ ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ... మల్లన్నసాగర్ నిర్మాణమంటూ కడునిరుపేద రైతుల భూములను లాక్కోవడం సమంజసం కాదన్నారు. అడ్డుగా వస్తున్నా రైతులపై ఆడ, మగ, చిన్నా, పెద్దా తేడా లేకుండా విచక్షణ రహితంగా అధికార అహంతో పోలీసులతో దైర్జన్యంగా కొట్టించడం ఎంటని ప్రశ్నీంచారు. వైఎస్ఆర్ హయంలో రైతులకు ఉచిత కరెంట్ రైతే రాజుగా పలు సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్యేద్యేయంగా పని చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటునూ రైతుల పొట్టగొడుతూ, వారిపై దాడులు చేయిస్తుందని, వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చచేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రైతుల మూడెకరాల భూమని అందిస్తామి, డబుల్ బెడ్రూం పలు రకాల సంక్షేమ పథకాల పేర్లను చెబుతూ కాలయాపన చేస్తున్నారేతప్పా ఎవరికి సంక్షేమ పథకాలు అందిచడంలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీయంటూ ఇప్పటికి దిక్కులేదన్నారు. రైతు భూములను లాక్కుంటూ వారిపై లాటీ చార్జ్ చేయిస్తూ రైతుల పొట్టగొడుతున్న ఘతన కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని దుయ్యబుట్టారు. ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. వారి పక్షాన ప్రభుత్వ వ్యతిరేఖ ఉద్యమాలను చేపట్టెందుకు సిద్దంగా ఉందని హెచ్చరించారు. మల్లన్న సాగర్ ఘటన మళ్లి ఎక్కడ కూడా పున్రావృతం అయితే సహించేదిలేదన్నారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కోదండరామ్
-
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కోదండరామ్
మెదక్: మల్లన్నసాగర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ప్రాజెక్ట్ కోసం ఇరిగేషన్, రెవెన్యు అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పోలీసుల పహారా పెట్టొద్దని, తక్షణమే పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోదండరామ్ సూచించారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు. కాగా మల్లన్నసాగర్ ముంపు బాధితులను పరామర్శించేందుకు గజ్వేల్ వస్తున్న కోదండరామ్ బృందాన్ని మెదక్ జిల్లా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించటంతో కోదండరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'మొదటి ట్యాగ్ లైనే నీళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవరిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టకుండా విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నిన్న జరిగిన లాఠిఛార్జికి విపక్షలే కారణమన్నారు. హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. 8 గ్రామల్లో 6 గ్రామాలు భూ సేకరణ కు అంగీకరించాయని తెలిపారు. మరో రెండు గ్రామాల్లో భూ సేకరణ మిగిలివుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. సీపీఎం, టీడీపీ కార్యకర్తలు మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి సీపీఎం, టీడీపీ కార్యకర్తలను తరలించి హింస సృష్టించారని.. ఇవన్నీ బయటపెడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల గురించే జరిగిందన్నారు. ఉద్యమ నినాదం (నీళ్లు, నిధులు, నియామకాలు)లోని మొదటి ట్యాగ్ లైనే నీళ్లు అని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారని, రిజర్వాయర్ లన్నీ నీళ్లుంటేనే కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం లేదా జీవో 123.. రైతులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం ఇస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లాలో విపక్షాలు చేపట్టిన బంద్ విఫలమైందన్నారు. -
మల్లన్న నిర్వాసితులపై లాఠీ..
-
మల్లన్న నిర్వాసితులపై లాఠీ
-
టీడీపీ వాళ్లే రాళ్లు విసిరారు: మంత్రి హరీశ్ రావు
- ప్రతిపక్షాలవి కవ్వింపు చర్యలు: మంత్రి హరీశ్ సిద్దిపేట: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు కవ్వింపు చర్యకు దిగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టి రోడ్లపైకి తెచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు టీడీపీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకు ఆదివారం నాటి ఘటనే నిదర్శనమన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మల్లన్నసాగర్ నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు గ్రామాలు పూర్తిగా సంసిద్ధత వ్యక్తం చేశాయని, ఇంకో గ్రామం మరో రెండ్రోజుల్లో స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన వేములఘాట్, ఎర్రవల్లి గ్రామస్తులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. వారితో ఎన్నిసార్లరుునా చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, భూనిర్వాసితులను అన్ని రకాలుగా అదుకుంటామని ప్రతిపక్షాల మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్‌రెడ్డికి ఆ గ్రామాల్లో ఏం పని? టీడీపీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆదివారం తన అనుచరులతో వెళ్లి రైతులను రెచ్చగొట్టాడని, రైతుల వెనక టీడీపీవాళ్లు చేరి పోలీసులపై రాళ్లు విసిరారని హరీశ్ పేర్కొన్నారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. దీనిపై పోలీసులను హెచ్చరించామని, భవిష్యత్‌లో రైతులు ఎదురు తిరిగినా, గాయపర్చినా సంయమనంతో మెలగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రతాప్‌రెడ్డికి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఏం పని అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ పూర్తయితే రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతోనే టీడీపీ, కాంగ్రెస్‌లు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం రెండు పంటలు పండే 50 వేల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కుందని, అక్కడి రైతులు విలపించినా పట్టించుకోలేదన్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి 2013 భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలన్న తీర్మానంపై పార్లమెంట్లో సంతకం చేశారని గుర్తు చేశారు. అక్కడ చట్టం రద్దు కోసం సంతకం చేసి, ఇక్కడ భూసేకరణకు 2013 చట్టాన్ని అమలు చేయాలనడం టీడీపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని దుయ్యబట్టారు. వేములఘాట్, ఎర్రవల్లి గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని, వారి ఇష్టం మేరకే భూసేకరణను రెండు పద్ధతుల్లో నిర్వహిస్తామన్నారు. ఈ గ్రామాల రైతులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని టీడీపీ నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు బంద్‌కు పిలుపునిచ్చారో చెప్పాలన్నారు. నర్సాపూర్, జోగిపేటకు గోదావరి నీళ్లు రావడం ఇష్టం లేదా అని వారిని ప్రశ్నించారు. -
నిర్వాసితులపై లాఠీ
► ఉద్రిక్తతకు దారితీసిన మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళన ► రాజీవ్ రహదారి దిగ్బంధనానికి కదిలిన పల్లెపహాడ్, ఎర్రవల్లి ప్రజలు ► మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. ఇరుపక్షాల మధ్య తోపులాట ► పరిస్థితి చేయిదాటడంతో లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు ► గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. భయంతో పరుగులు తీసిన ► ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు ► గాయపడ్డ నిరసనకారులు, పోలీసులు ► లాఠీచార్జికి నిరసనగా నేడు మెదక్ బంద్‌కు ప్రతిపక్షాల పిలుపు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తొగుట/గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీచార్జి, నిర్వాసితుల ఆగ్రహావేశాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలతో విరుచుకుపడటం, గాల్లోకి కాల్పులు జరపడంతో మెదక్ జిల్లా పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇందులో అటు నిర్వాసితులు, ఇటు పోలీసులు గాయాలపాలయ్యారు. అసలేం జరిగింది?: ఆదివారం ముంపు గ్రామాల ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో వేములఘాట్ నుంచి పల్లెపహాడ్ చౌరస్తా, ఎర్రవల్లి మీదుగా కుకునూర్‌పల్లిలోని మంగోల్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా చేసేందుకు రైతులు, మహిళలు భారీగా కదిలారు. ర్యాలీ పల్లెపహాడ్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకోగానే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జికి దిగారు. అనుకోని ఘటనతో మహిళలు భయంతో సమీప పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. అయినా నిర్వాసితులు బెదరకుండా ఎర్రవల్లి వైపు వచ్చారు. దీంతో డీఎస్పీ మరింత మంది పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో వేములఘాట్ గ్రామస్తులకు ఎర్రవల్లి నిర్వాసితుల మద్దతు తోడైంది. పోలీసులకు, ఆందోళనకారులకు మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ దొరికిన వారిని దొరికినట్టు బాదారు. కొందరు భయంతో ఇళ్లల్లోకి వెళ్లగా బయటికి ఈడ్చుకొచ్చి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు 30 నిమిషాల తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత నిర్వాసితులు మళ్లీ పోగయ్యారు. ‘ఊర్లపై పడి భయపెడతారా..’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపక్షాల మధ్య మరోసారి తోపులాట జరగడంతో పోలీసులు మళ్లీ లాఠీచార్జి జరిపారు. వేములఘాట్, ఎర్రవల్లికి చెందిన మహిళలు, రైతులు చాలామంది గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రమేశ్ గాయపడ్డారు.