రాష్ట్రంలో అవినీతి పాలన
తెలంగాణలో అవినీతి, అసమర్థపాలన సాగుతోందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. హామీలన్నీ 99 శాతం పూర్తి చేశామని అబద్ధాలు, మాయమాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.
-
ప్రభుత్వంలో మంత్రులు జీవచ్చవాలు
-
ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో దోపిడీ
-
మల్లన్నసాగర్‌తో యుద్ధం మొదలైంది
-
బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి
ముకరంపుర: తెలంగాణలో అవినీతి, అసమర్థపాలన సాగుతోందని బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. హామీలన్నీ 99 శాతం పూర్తి చేశామని అబద్ధాలు, మాయమాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా కృషిచేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువలా ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు.కేసీఆర్ పాలనను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, కరువు ని«ధులను వినియోగించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు అధికారం లేకుండా జీవశ్చవంలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఒక్క రూపాయి కూడా మంజూరీ చేయలేదని, మంత్రివర్గం పూర్తిగా నామ్‌కే వాస్తేగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పాలనకు హనీమూన్ రెండేళ్లతో ముగిసిందని, మల్లన్నసాగర్‌తో యుద్ధం మొదలయ్యిందన్నారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనన్నారు. కేజీటూపీజీ, ఇంటికో ఉద్యోం, డబుల్‌బెడ్‌రూం, మూడెకరాల భూమి తదితర హామీలన్నీ మూలన పడ్డాయన్నారు.
ప్రతిపక్షాలు లేకుండా కేసీఆర్ శాసన వ్యవస్థను నాశనం చేస్తున్నాడని విమర్శించారు. మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్టు రీడిజైన్, మిషన్‌కాకతీయ, భగీరథల పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణలో హరించుకుపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాద్యత మీడియాపైనే ఉందన్నారు. ఆగస్టు 7న హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నాయకులు మీస అర్జున్‌రావు, బల్మూరి వనిత, వన్నాల శ్రీరాములు, న్యాలకొండ నారాయణరావు, కోమల ఆంజనేయులు, ముదుగంటి రవీందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, సుభాష్‌రావు, గాజుల స్వప్న, సుజాతరెడ్డి, గంట సుశీల, అయిల ప్రసన్న, పటేల్ దేవేందర్‌రెడ్డి, కన్నం అంజయ్య, పెండ్యాల సాయికృష్ణరెడ్డి పాల్గొన్నారు.