దుబ్బాక: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుకు వెయ్యి ఏనుగుల బలమని, మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలయ్యాయని చిల్లర రాజకీయా లు చేసిన కాంగ్రెస్..ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలని మాజీమంత్రి టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు చేరడంతో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులతో కలసి శుక్రవారం హరీశ్‌రావు సందర్శించి పూజలు చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉంటే ఈ రోజు మల్లన్నసాగర్‌లోకి ఇంత నీరు ఎక్కడి నుంచి వచి్చందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీబరాజ్, అన్నపూర్ణ బ్యారేజ్ నుంచి రంగనాయకసాగర్, అక్కడి నుంచి మల్లన్నసాగర్.. ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ దాక గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండటం వల్లనే సాధ్యమైందని చెప్పారు.
మల్లన్నసాగర్ వద్ద ఉద్రిక్తత
మల్లన్నసాగర్‌ను సందర్శనకు హరీశ్‌రావు తదితరులు వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ నాయకుల ను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు పంపించారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్, వందలాది మంది బీఆర్‌ఎస్ శ్రేణులతో హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లన్నసాగర్ పరిసరాలు అంతా పోలీస్ నిఘా నీడలోనే కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment