సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు.
మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ ఖరారు చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు.
2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment