![Congress leader nagam Janardhan Reddy Supports Farmers Who Lost Land And Houses In Irrigation Project - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/12/tt.jpg.webp?itok=rJAevrx1)
కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి(పాత చిత్రం)
నాగర్ కర్నూల్ జిల్లా: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(పీఆర్‌ఎల్‌ఐ) భూనిర్వాసితులు చేస్తోన్న ఆందోళనకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి మద్ధతు తెలిపారు. బిజినాపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నిర్మాణమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్‌లో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుని హెచ్‌ఈఎస్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు.
తమ భూములకు, ఇండ్లకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసితులకు ఏవిధమైన పరిహారం ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో తాను పోరాడతానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపి సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment