damodar reddy
-
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
రాజకీయ నాయకుల గురించి పిల్లలకు ఎలాంటి మాటలు చెబుతున్నాడో చూడండి
-
కోటి సుపారీ: ‘హత్యకు కుట్ర.. అతనిపైనే అనుమానం’
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్‌రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు. బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్‌రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో దామోదర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్‌రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
కాంగ్రెస్‌లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
‘పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడు, అప్పుడు నాకు అన్యాయం జరగలేదా?’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ ఖరారు చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్‌లా వచ్చి కాంగ్రెస్‌లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు. -
బీఆర్ఎస్కు కూచుకుళ్ల, కేఎస్ రత్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్/కొల్లాపూర్/చేవెళ్ల: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరూ తమ రాజీనామా లేఖలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పంపించారు. ఈనెల 31న కొల్లాపూర్‌లో నిర్వహించనున్న ప్రియాంకాగాంధీ సభలో ఆమె సమక్షంలో దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. సభాస్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ పదవితో తగిన గుర్తింపు ఇచ్చినప్పటికీ, స్థానికంగా తనకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్టించుకోలేదన్నారు. సమస్యలను చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ను ఎన్నిసార్లు అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు. మంత్రి కేటీఆర్‌కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తాను గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని 15 రోజులకోసారి కలిసి స్థానిక అంశాలు మాట్లాడేవాడినని వివరించారు. కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశం లేదన్నారు. కాగా.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఇది వరకే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం శుక్రవారం బీజేపీలో చేరనున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పదేళ్లుగా పారీ్టలో తగిన ప్రాధాన్యత లేకపోయినా కేసీఆర్‌పై ఉన్న గౌరవంతో కార్యకర్తగా కొనసాగానని చెప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను బీఆర్ఎస్లో చేర్చుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని.. ఆ తరువాత రెండుసార్లు తనకు టికెట్ నిరాకరించారని ఆవేదన వ్యక్తంచేశారు. చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని.. చేవెళ్ల ప్రజల కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని పేర్కొన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
అందుకే నా రాజీనామా.. బీఆర్ఎస్కు కూచుకుళ్ల గుడ్‌బై
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు పంపారాయన. పార్టీలో సముచిత స్థానం దక్కినప్పటికీ.. స్థానిక సమస్యల కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందంటూ లేఖలో ప్రస్తావించారాయన. ‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారాయన. స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్‌ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్ఎస్కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. -
నేడు కాంగ్రెస్‌లోకి జూపల్లి, కూచుకుళ్ల
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పారీ్టలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ తదితరులు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం వీరంతా ఢిల్లీ వెళ్లారు. లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి తదితరులు పారీ్టలో చేరుతారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. వీలైతే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేక ప్రియాంకాగాంధీ ఈ చేరిక కార్యక్రమానికి రావొచ్చని అంటున్నారు. ప్రియాంకా సమక్షంలో చేరాల్సి ఉన్నా.. వాస్తవానికి, కొల్లాపూర్‌లో జరగాల్సిన బహిరంగసభలో ప్రియాంకాగాం«ధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పారీ్టలో చేరాల్సి ఉంది. కానీ, ఇప్పటికే రెండు సార్లు ఈ సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ సభ ఇక రద్దయినట్టేనని తెలుస్తోంది. అయితే సభ రద్దు కాలేదని, ఈనెల 7–14 తేదీల్లో ప్రియాంకాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాకు వస్తారని కానీ పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకే ఖర్గే సమక్షంలో జూపల్లి అండ్ టీం ఢిల్లీ వెళ్లి పారీ్టలో చేరుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. -
పోలీసులా.. రజాకార్లా..?
మహబూబ్‌నగర్: జిల్లాలోని పోలీసులు నిజాం కాలంలోని రజాకార్లలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మండిపడ్డారు.30 ఏళ్లుగా తనవెంటే ఉన్న నాయకుడు కృష్ణారెడ్డిని దొంగను చూసినట్టు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎవరైనా తప్పు చేస్తే అందుకు శిక్ష అనుభవించాల్సిందేనని, అయితే పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని అన్నారు. వ్యక్తులు తప్పు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పారు. అంతేకాని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడం అమానుషమన్నారు. మొదటగా ఎమ్మెల్యేకు సంబంధించిన పీఏ సోషల్ మీడియాలో తనను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టాడని చెప్పారు. దీనిపై స్పందించిన కృష్ణారెడ్డిపై ఎస్సై చేయి చేసుకున్నాడన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు పెట్టకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చూడలేదని చెప్పారు. నాగం జనార్దన్రెడ్డితోనూ తనకు 20 ఏళ్ల పాటు వైరం కొనసాగినా ఏనాడూ తిట్టుకోలేదని వివరించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో సగం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కౌన్సిలర్లుగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడని చెప్పారు. వారంతా ప్రజల భూములపై పడ్డారని విమర్శించారు. ఇటీవల వట్టెంలో ఎమ్మెల్యేపై ప్రజలు తిరగబడ్డారన్నారు. తన అనుచరులు, కార్యకర్తలపై కక్షగడితే తానే స్వయంగా పోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అరాచకాలకు ప్రజలే ఓటు ద్వారా బుద్ధిచెబుతారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, కావలి శ్రీను, తిరుపతయ్య, రాంచందర్ పాల్గొన్నారు. పోలీసులే బీఆర్ఎస్ను ముంచుతారు రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థనే బీఆర్ఎస్ పార్టీని ముంచుతుందని దామోదర్‌రెడ్డి అన్నారు. వారి అరాచకాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చెప్పినా వాళ్లు సర్దుకునే పరిస్థితుల్లో లేరని చెప్పారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల మెప్పుకోసమే పనిచేస్తున్నారని చెప్పారు. పోలీసుల తీరుతో చాలామందికి అన్యా యం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చెబితేనే పోలీసులకు పోస్టింగులు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో కొల్లాపూర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. -
‘చేతి’లో చెయ్యేసిన నాగం, కూచుకుళ్ల.. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి షాక్..!
సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృతస్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకోవాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్కు షాక్ .. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో కలవడం తమకు ఎంతో కలసివస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, ఆయన పార్టీ మారినా తమకు ఢోకా ఉండదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైపోగా.. మరోవైపు జూపల్లి సైతం హస్తం వైపే మొగ్గ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) జూపల్లి కృష్ణారావుతో కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి భేటీ అయ్యి.. చేరిక గురించే చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈలోగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పాలమూరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, మల్లు రవితో భేటీ కానున్నట్లు సమాచారం. తన తనయుడు రాజేష్‌తో సహా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వర్గీయులపై.. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని దామోదర్‌రెడ్డి.. తన వర్గీయుల వద్ద ప్రస్తావించినట్లు భోగట్టా. అదే విధంగా తనయుడు రాజేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. పార్టీ మారాలని దామోదర్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. విడిగా కాకుండా జూపల్లి కృష్ణారావుతో పాటే చేరితే మరింత మేలు జరగవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు వర్గీయులు చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు ఊహించని రీతిలో మారిపోతున్నాయి. ఇదిలా ఉంటే మల్లు రవితో పాటు కొల్లాపూర్ నియోజక వర్గ నేత జగదీశ్వర్ రావుతోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చలు జరిపారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ఈ వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తోనే మొదలైంది. కాంగ్రెస్ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో ఇలాగైతే కష్టమే! -
మరో వివాదంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-
పార్టీ మారనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
-
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గం
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షునిగా దామోదర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు అబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో రెండ్రోజులు జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. అధ్యక్షునిగా దామోదర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షునిగా విశ్వనాథం, ఉపాధ్యక్షులుగా జి.మోహన్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, పీఆర్ మోహన్, శ్రీహరిరెడ్డి, సీతారామయ్య, భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా టి.ప్రభాకర్, పి.శ్యామ్‌రావు, ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పి.శరత్‌బాబు, విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బక్కారెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కోశాధికారిగా గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా చందులాల్, శ్రీవాస్తవ్, రవీందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, పెంటయ్య తదితరులను ఎన్నుకున్నట్టు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. -
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఆర్.దామోదర్ రెడ్డి కీలక రిపోర్ట్
-
రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి: వి.ప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు (ఎత్తిపోతల పథకాలు), ఇంజనీర్ పెంటారెడ్డిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి బేషరతు క్షమాపణలు చెప్పాలని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.దామోదర్‌రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సోమవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. అంచనాలకు మించి వరద వచ్చినప్పుడు ఎత్తిపోతల పథకాల పంపులు మునగడం సహజమేనన్నారు. గతంలో శ్రీశైలం, కల్వకుర్తిలో పంపులు మునిగిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బాహుబలి లాంటి పంపులను తయారు చేయించడంలో ముఖ్యపాత్ర పోషించిన పెంటారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అన్నారం, మేడిగడ్డ పంపులు నీట మునగడంతో వేల కోట్ల నష్టమేమీ జరగలేదన్నారు. నీళ్లు తగ్గిన తర్వాత మళ్లీ బురదని తొలగించి సర్వీసు చేస్తే పంపులు నడుస్తాయని తెలిపారు. -
రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం నడుచుకుంటుంది
-
జార్జిరెడ్డి పాత్రే హీరో
సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ–‘‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను. ఇక్కడ మా మైక్ టీవీకి బ్రాండింగ్ ఉండటంతో మైక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. సబ్జెక్ట్ నచ్చడంతో బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం. చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. జీవన్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్ చేయాలని మరొకరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్ సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సంజయ్‌రెడ్డి. -
కారెక్కిన దామోదర్ రెడ్డి
-
టీఆర్ఎస్లో చేరిన దామోదర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దామోదర్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో దామోదర్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో నాగం జనార్దన్‌రెడ్డి చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు కూడా. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి నాగం చేరికపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని, తన మాటకు విలువలేదనే ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. -
టీఆర్ఎస్లోకి నేడు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి శనివారం టీఆర్ఎస్లో చేరనున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన దామోదర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానికసంస్థల నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు (కె.రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి) మాత్రమే గెలిచారు. మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తి చెందిన దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. -
టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ముఖ్యనేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి హస్తాన్ని వీడనున్నారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌కు దామోదర్‌రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి నాగం చేరికపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని , తన మాటకు విలువలేదనే ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దామోదర్‌రెడ్డి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని డీకే అరుణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
బాంబుల దాడి... అంతా ఓ డ్రామా
పీ కొత్తపల్లి,(పామిడి): పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని పీ కొత్తపల్లి–పామిడి స్టేషన్ పెట్రోల్‌బంకు మధ్య దాదిమి దామోదర్‌రెడ్డిపై గురువారం తెల్లవారుజామున జరిగిన బాంబుల దాడి ఓ నాటకమని ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు... దామోదర్‌రెడ్డికి ఫైనాన్స్ కింద రూ.3 లక్షలు అప్పు ఉందన్నారు. ఆ అప్పు ఎగ్గొటేందుకు పన్నాగంగా ఈ బాంబులదాడికి తెరలేపాడన్నారు. తన ద్విచక్ర వాహనాన్ని తానే తగిలేసి బాంబులదాడిలో ఆహుతైనట్లు నమ్మించాడన్నారు. తనపై బాంబులదాడి జరగడంతో డబ్బును దొంగిలించారన్న నెపంతో ఫైనాన్స్ డబ్బులను ఎగ్గొట్టాలన్నదే అతని ఎత్తుగడలో భాగమన్నారు. మరోవైపు తనపై దాడి జరగడానికి ఆస్తి వివాదమే కారణమని దామోదర్‌రెడ్డి చెబుతున్నాడు. తండ్రి సంజీవరెడ్డి, సోదరులు శివశంకర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కుమారులు సుఖసాగర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై బాంబుల వర్షం కురిపించారనీ, తాను సొమ్మసిల్లి పోవడంతో చనిపోయాననుకొని తన వద్ద ఉన్న రూ.10 లక్షలతో ఉడాయించినట్లు చెప్పాడు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తులో నిజానిజాలు తేలతాయని ఎస్ఐ చెప్పారు. -
దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకున్నందుకు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బాధపడుతున్నారని మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. నాగంను పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దామోదర్‌రెడ్డి పార్టీ మారుతున్నారని, ఆయనను టీపీసీసీ పెద్దలు బుజ్జగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో గురువారం మీడియాతో అరుణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దామోదర్‌రెడ్డిని కలసి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరానన్నారు. నాగం చేరిక విషయంలో వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని టీపీసీసీ నేతలకు సూచించానని, అయినా దామోదర్‌రెడ్డితో మాట్లాడకుండానే నాగంను పార్టీలో చేర్చుకున్నారన్న దానిపై ఆయన బాధపడుతున్నారని చెప్పారు. పార్టీ మారడం వల్ల అటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా నష్టం వస్తుందని దామోదర్‌రెడ్డికి వివరించినట్లు వెల్లడించారు. నాగం టీడీపీలోనే బలమైన నాయకుడు.. నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీలోనే బలమైన నాయకుడని, కాంగ్రెస్‌లో కాదని అరుణ వ్యాఖ్యానించారు. బలమైన నాయకులైతే అక్కడే గెలవాలి కదా అని ప్రశ్నించారు. నాగం పార్టీలో చేరేటప్పుడే రాహుల్‌కు నివేదిక ఇచ్చారని, ఆయన నాగంకు టికెట్ ఫైనల్ చేయలేదని చెప్పారు. తాను చెబితే దామోదర్‌రెడ్డి వింటారన్న ఆరోపణలను తనపై రాజకీయ కుట్రగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎవరు తనను టార్గెట్ చేసినా భయపడి ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదన్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం, రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం నిబద్ధతతో పనిచేస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్‌లో ఎప్పుడూ గ్రూపులు లేవని, ఇప్పుడే వినిపిస్తున్నాయని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను నిరుత్సాహ పడనని, తనను నిరుత్సాహ పరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమని ఆమె వ్యాఖ్యానించారు. -
నిరుద్యోగ సమస్య పరిష్కారంలో టీఆర్ఎస్ విఫలం
అర్వపల్లి (తుంగతుర్తి) : నిరుద్యోగ సమస్య పరి ష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫలమైందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి అన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీకై రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర బుధవారం అర్వపల్లికి చే రింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రా ష్ట్రంలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కాదు కదా వందల ఉద్యోగాలు కూడా రాలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేవలం కేసీఆర్ కుటుంబంలో తప్ప ఎవ్వరికి ఉద్యోగాలు రాలేదన్నారు. నిరుద్యోగులు ఎ లాంటి ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి కూడా చెల్లిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా అర్వపల్లి మండల కేంద్రంలో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీ తుంగతుర్తికి వెళ్లింది. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు చెవిటి వెంకన్నయాదవ్, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడిపాటి నర్సయ్య, డాక్టర్ వడ్డేపల్లి రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దరూరి యోగానందచారి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, టి. రాంబాబు, అన్నెబోయిన సుధాకర్, ఆకుల బుచ్చిబాబు, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, సంకేపల్లి కొండల్‌రెడ్డి, నాయకులు నర్సింగ శ్రీనివాస్‌గౌడ్, సోమయ్య పాల్గొన్నారు. -
హైకోర్టు లాయర్ల సంఘం అధ్యక్షుడిగా దామోదర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సి.దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి పొన్నం అశోక్‌గౌడ్‌పై 13 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దామోదర్‌రెడ్డికి 760 ఓట్లు రాగా, అశోక్ గౌడ్‌కు 747 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ న్యాయవాదుల మద్దతుతో బరిలో నిలిచిన ఆర్. వినోద్‌రెడ్డి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆయన 602 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఉపాధ్యక్షుడిగా సి.హరిప్రీత్ ఎన్నికయ్యారు. ఆయన 771 ఓట్లు సాధించారు. కార్యదర్శులుగా కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, సుంకరి జనార్దన్‌గౌడ్‌లు విజయం సాధించారు. కోమటిరెడ్డి 819 ఓట్లు సాధించగా, జనార్దన్‌గౌడ్‌కు 770 ఓట్లు వచ్చాయి. రెండు కార్యదర్శుల పోస్టులకు మొత్తం ఐదుగురు పోటీ పడ్డారు. సంయుక్త కార్యదర్శిగా ఉప్పాల శాంతి భూషణ్‌రావు విజయం సాధించారు. ఆయనకు 887 ఓట్లు వచ్చాయి. కోశాధికారిగా గెలుపొందిన జూకంటి అమృతరావు 1,052 ఓట్లు సాధించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా ఆకుల జనార్దన్ గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ.అనందరావు, ఎస్.శ్రీనివాసాచారి, పి.సత్య మంజులకుమార్, జె.కె.అనిత, సంజీవ్ కాల్వల, పెండెం సతీశ్ కుమార్, బొడ్డుపల్లి యాదయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా గెలుపొందిన దామోదర్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏజీ రాజీనామా ప్రభావం? అడ్వకేట్ జనరల్ (ఏజీ) పదవికి దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ న్యాయవాదుల మద్దతుతో బరిలోకి దిగిన వినోద్‌రెడ్డి విజయం ఖాయమని భావించినా, అనూహ్యంగా ఆయన మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆయన 620 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్‌రెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న న్యాయవాదులు దామోదర్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఓ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు గంపగుత్తగా దామోదర్‌రెడ్డికి మద్దతు పలికారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత ప్రతిరౌండ్‌లోనూ దామోదర్‌రెడ్డి ఆధిక్యత కనబరిచారు. మొదటి రౌండ్ నుంచి వినోద్‌రెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతూ వచ్చారు. వినోద్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి అన్న ప్రచారం బాగా జరగడం ఆయన విజయవకాశాలను దెబ్బతీసింది. కొందరు సీనియర్ న్యాయవాదులు గట్టిగా అంతర్గత ప్రచారం నిర్వహించడం, టీఆర్ఎస్ న్యాయవాదుల ఓట్లతో విజయం ఖాయమని భావించినా వినోద్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. మొదటి రౌండ్ నుంచీ దామోదర్‌రెడ్డి, పొన్నం అశోక్‌గౌడ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు 13 ఓట్ల తేడాతో దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. ఉదయం 10.30 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. ఎప్పుడూ ఓటింగ్ యంత్రాల ద్వారా జరిగే పోలింగ్ ఈసారి ఈవీఎంలు ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరించడంతో బ్యాలెట్ విధానంలో జరిగింది. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. ఎప్పుడూ రాత్రి 8 లేదా 8.30 గంటలకల్లా పూర్తయ్యే ఓట్ల లెక్కింపు ఈసారి రాత్రి 2 గంటల వరకు సాగింది. -
నాగం కాంగ్రెస్‌కి చాలా ద్రోహం చేశాడు..
సాక్షి, నాగర్ కర్నూల్: మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. అయితే టిక్కెట్ ఆశిస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. నాగంపై మరోసారి తన వ్యతిరేకతను చాటారు. రాజకీయంగా బతుకునిచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి తమ పార్టీలోకి రావడానికి కొందరు పెద్దలు మద్దతునివ్వడంపై దామోదర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాను నాగంకు ప్రత్యర్థిగా ఉన్నానని, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలెందరికో ద్రోహం చేశారని ఆరోపించారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే చాలామంది నాయకులు రాజీనామా చేస్తారని దామోదర్ రెడ్డి హెచ్చరించారు. అయినా పార్టీలో 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వబోమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. మెయిల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం రాజీనామా లేఖను పంపారు. -
నాగంకు షాక్.. పార్టీలోకి వస్తే సహకరించం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అన్నారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. నాగం పార్టీలో చేరితే.. పార్టీకి నష్టమేనని అన్నారు. నాగం క్యాడర్ లేని లీడర్ అని ఎద్దేవా చేశారు. నాగంను అభ్యర్థిగా నిలబడితే.. ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు. నాగంను పార్టీలోకి తీసుకుంటే.. తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను, డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నాగంను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. నాగం, జైపాల్ రెడ్డి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని, రేపు జైపాల్ రెడ్డి లోక్‌సభకు పోటీచేయకపోతేనే.. నాగంను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని షరతు పెట్టారు. నాగంను కావాలనే జైపాల్ రెడ్డి పార్టీలోకి తెస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో నాగం ఎంపీ అభ్యర్థిగా, ఆయన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తే.. వారికి డిపాజిట్ కూడా రాలేదని అన్నారు. -
జెండావిష్కరణలో వివాదం
సూర్యాపేటలో కాంగ్రెస్ నేతల అరెస్ట్.. దామోదర్‌రెడ్డి ధర్నా సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో జెండావిష్కరణ అంశం వివాదాస్పదంగా మారింది. జెండావిష్కరణను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడటంతో పాటు స్పృహ కోల్పోయారు. ఆయనను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. అసలేం జరిగిందంటే..: సూర్యాపేట పట్టణంలో క్లబ్ అపెక్స్ కమిటీ, కాంగ్రెస్ నాయకుడు వేణారెడ్డి వర్గం మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. వేణురెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలసి క్లబ్లో మంగళవారం ఉదయం జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వేణారెడ్డి, కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి మేళ్లచెరువు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ సూర్యాపేటలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి కార్యకర్తలతో కలసి నిరసనకు దిగారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు.. దామోదర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో దామోదర్‌రెడ్డి తలకు గాయం కావడంతో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను పోలీసు వ్యాన్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్ ఆస్పపత్రికి తరలించారు. దామోదర్‌రెడ్డి అరెస్టును ఎమ్మెల్యే పద్మావతితోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాలతో కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏం చేయలేరన్నారు. -
సాధనతోనే లక్ష్యం సాధ్యం
ఆదిలాబాద్ స్పోర్ట్స్ : క్రీడాకారులు సాధనతోనే విజయం దిశగా సాగుతూ లక్ష్యాన్ని చేరుతారని డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అండర్-17 కబడ్డీ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామోదర్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్య సాధన చేయాలని, క్రీడాస్ఫూర్తితో మెదలాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమేనన్నారు. జిల్లా స్థాయి క్రీడలే కాకుండా రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. జిల్లా రాష్ట్రస్థాయి క్రీడలను తీసుకురావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శికి ఆదేశించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.సుధాకర్‌రావు మాట్లాడుతూ క్రీడలు జీవితపు పాఠాలు నేర్పుతాయని, అన్ని విధాలుగా క్రీడలు భవిష్యత్తును అందిస్తాయని వివరించారు. జిల్లా స్థాయిలో క్రీడలకు హాజరైన క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో, క్రమశిక్షణతో నడుచుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 340 మంది బాలబాలికలు క్రీడా పోటీలకు హాజరయ్యారు. మూడు కోర్టులలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.రాంమోహన్‌రావు, హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కోరెడ్డి పార్థసారథి, గౌతమీ మోడల్ స్కూల్ రాష్ట్ర డెరైక్టర్ రమన్, ప్రిన్సిపల్ బసంత్‌కుమార్, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి దయానందరెడ్డి, పీఈటీలు రాష్ట్రపాల్, విఠల్‌రెడ్డి, స్వామి, నాందేవ్, సాయికుమార్, మమత, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కుమ్ములాటలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు షురువయ్యాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఆదిపత్య పోరు రోజుకింత ముదిరి పాకాన పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ దామోదర్‌రెడ్డి పై అవిశ్వాస తీర్మానం ఆ పార్టీ జిల్లా అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరును రచ్చ కీడ్చగా, తాజాగా ఇప్పుడు జిల్లా పరిషత్ కూడా ఈ అంతర్గత కుమ్ములాటలకు వేదికవుతోంది. వారం రోజుల క్రితం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీల నియామకాలు జరిగాయి. మొత్తం ఏడు స్టాండింగ్ కమిటీల సభ్యులను నియమించారు. ఈ కమిటీలకు గత నెల 27న జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసినప్పటికీ.. తెరవెనుక భారీ తతంగం చోటు చేసుకుంది. ఈ కమిటీల విషయంలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా ‘పనులు’, ‘ప్రణాళిక’ కమిటీల్లో సభ్యులుగా చేరేందుకు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పోటీ పడ్డారు. జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసే రూ.కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనుల కేటాయింపులు, ఆ పనుల ప్రగతిని సంబంధిత అధికారులతో సమీక్షించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. మిగిలిన ఐదు కమిటీల విషయంలో పెద్దగా అభ్యంతరాలేవీ లేకపోయినప్పటికీ ప్రధానమైన ఈ రెండు కమిటీల విషయంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలను ఏకాభిప్రాయానికి తేవడానికి జెడ్పీ చైర్మన్ శోభా సత్యనారాయణగౌడ్‌కు తల ప్రాణం తోకకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు కమిటీల్లో మంత్రి రామన్న, ఎంపీ నగేష్, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, నల్లాల ఓదేలు, రేఖానాయక్, విఠల్రెడ్డిలతోపాటు పలువురు జెడ్పీటీసీలకు చోటు దక్కింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే బీఆర్జీఎఫ్ నిధుల విషయంలోనూ జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య దూరం పెరుగుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.26.98 కోట్ల బీఆర్జీఎఫ్ వార్షిక ప్రణాళికకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. జిల్లా, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు.. నాలుగు కాంపోనెంట్ల కింద ఈ నిధులు మంజూరవుతాయి. జెడ్పీ కాంపోనెంట్ కింద రూ.5.39 కోట్లు నిధుల విషయంలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండకూడదని కొందరు జెడ్పీటీసీలు భావిస్తున్నారు. గ్రూపు తగాదాలకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి ఇప్పుడు టీఆర్ఎస్కు కూడా పాకుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
‘ఢిల్లీ’ నేతకు గల్లీలో గడ్డుకాలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కేంద్ర మంత్రిగా పనిచేసి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన వేణుగోపాలచారికి ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లా రాజకీయాలతోపాటు సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు ఎదురుగాలి వీస్తోంది. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం ఎపిసోడే ఇందుకు ఉదాహరణ. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన డీసీసీబీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డిని వెనకుండి నడిపించింది చారీనే అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తన అనుచరునికి డీసీసీబీ పదవి ఇప్పించుకుని తన ప్రభావాన్ని పెంచుకునేలా పావులు కదిపిన చారికి పార్టీలోని ఆయన వ్యతిరేకవర్గం చెక్ పెట్టింది. జిల్లా మంత్రి జోగు రామన్న చైర్మన్ దామోదర్‌రెడ్డికి అండగా నిలవడంతో ఈ అవిశ్వాసం అంశం అభాసుపాలైంది. ఇది చంద్రశేఖర్‌రెడ్డి కంటే చారి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసిందనే అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముథోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లోకి రావడంతో సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకు చెక్ పడినట్లయింది. నియోజకవర్గంలో అసలే నామమాత్రంగా ఉన్న ఆయన క్యాడర్ విఠల్‌రెడ్డి రాకతో చాలా మట్టుకు కనుమరుగవుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. సీనియర్ నేతగా పేరున్న వేణుగోపాలచారికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా అధినేతతో ఉన్న సంబంధాలతో క్యాబినేట్ స్థాయి పదవిని పొందగలిగారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. జిల్లాకు వచ్చేసరికి మాత్రం తన ప్రభావాన్ని చూపకోలేకపోతున్నారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన జిల్లా రాజకీయాలను శాసించేవారు. తన వర్గాన్ని పెంచుకునే పనిలో.. డీసీసీబీ ఎపిసోడ్.. విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లోకి రాక.. తదితర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తన పట్టును పెంచుకునే పనిలో వేణుగోపాలచారి పడినట్లు తెలుస్తోంది. ఇందు కోసం జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ఓ అనుచరవర్గాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. పక్షం రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గానికి వెళ్లిన చారి రోజంతా అక్కడే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రోజు మంత్రి రామన్న కూడా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగంపై కూడా పట్టు సాధించేందుకు చారి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఆయన కొందరు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ సమీక్షలకు మీరు ఎలా వెళతారని అధికార పార్టీలోని మరో వర్గం నేతలు అధికారులతో అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు ఇరుకున పడుతున్నట్లు తెలుస్తోంది. -
డీసీసీబీ కుంపటి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో షురువైన ‘అవిశ్వాస’ ముసలం అధికార టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్లో ఆధిపత్య పోరుకు దారితీస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి వర్గం నాయకుల ఆశీస్సులతో వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి పావులు కదుపగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు దామోదర్‌రెడ్డి అదే పార్టీకి చెందిన మంత్రి జోగు రామన్న వర్గాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో డీసీసీబీలో ప్రారంభమైన ముసలం టీఆర్ఎస్లోని అగ్రనేతల్లో వర్గపోరుకు ఆజ్యం పోసినట్లవుతోంది. ఎలాగైనా డీసీసీబీపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడంతోపాటు జిల్లా రాజకీయాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు టీఆర్ఎస్లోని ఇరువర్గాల నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మరోవైపు డీసీవో సూర్యచంద్రరావు నిర్వాకంతో ‘అవిశ్వాసం’ అంశం వివాదానికి దారి తీయడంతో ఈ వర్గపోరుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వరుస ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ క్రమంగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. ప్రాదేశిక ఎన్నికల్లో కూడా హవా కొనసాగించి ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్‌తోపాటు, అత్యధిక మండల పరిషత్లపైనా టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. ఇక కాంగ్రెస్ ఖాతాలో ఉన్న సహకార సంస్థలపై కూడా గులాబీ జెండాను ఎగురవేసేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలోనే వేణుగోపాలాచారి ఆశీస్సులతో చంద్రశేఖర్‌రెడ్డి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి తెరలేపడం.. చైర్మన్ మంత్రి రామన్నను ఆశ్రయించడం జరిగిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఈ డీసీసీబీ వివాదం అధికార పార్టీ అగ్రనేతల్లో గ్రూపు విభేదాలకు దారితీయడమే కాకుండా, సహకార పోరును రసకందాయంలో పడేసింది. టీడీపీ సహాయంతో వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం అవిశ్వాస తీర్మానం పెట్టిన వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఖానాపూర్ మండలం సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ సత్తెనపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెడితే డీసీసీబీలో ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చని డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి తెర వెనుక పావులు కదిపినట్లు సమాచారం. ఈ సొసైటీలోని టీడీపీకి చెందిన డెరైక్టర్లు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అనుచరులున్నారు. దామోదర్‌రెడ్డి సొదరుడు ప్రేమేందర్‌రెడ్డికి రాథోడ్ రమేష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ టీడీపీ డెరైక్టర్ల మద్దతును కూడగట్టి చంద్రశేఖర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సొసైటీ బలపరీక్ష కోసం ఈ నెల 16న ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డీసీవో సూర్యచంద్రరావు నిర్ణయించారు. టీఆర్ఎస్లోకి చైర్మన్, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన దామోదర్‌రెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కొద్ది రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున టీఆర్ఎస్లో చేరికలు ఉండే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరేందుకు ఇంతకుముందే ముహుర్తం ఖరారైనప్పటికీ.. అవిశ్వాసం అంశం తేలాకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు కూడా టీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయని, ఆయన అనుచరుడైన దామోదర్‌రెడ్డి ఆయనతో కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కొనసాగింది. అయితే ప్రేంసాగర్‌రావు రాకను జిల్లా టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
అవిశ్వాసం.. అయోమయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో గురువారం నిర్వహించాలని తలపెట్టిన ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొంది. చైర్మన్ దామోదర్‌రెడ్డిపై వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశానికి చైర్మన్ మద్దతు డెరైక్టర్లు గైర్హాజరు కాగా, వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి మద్దతు డెరైక్టర్లు హాజరయ్యారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు చేరుకున్న చంద్రశేఖర్‌రెడ్డి తన మద్దతు డెరైక్టర్లతో కలిసి డీసీసీబీ సమావేశం హాలులోకి వెళ్లారు. జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావుతో అరగంట పాటు చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి డీసీవోపై తీవ్ర ఆరోపణలు చేశారు. పక్షపాత ధోరణితో సహకార చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీసీవోను సస్పెండ్ చేయాలని డిమాం డ్ చేశారు. ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైనప్పటికీ, కేవలం తొమ్మిది మంది మాత్రమే సంతకాలు చేసినట్లు డీసీవో పేర్కొన్నారు. నేటికి వాయిదా : డీసీవో అవిశ్వాస తీర్మానం నోటీసు నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నాముని డీసీవో ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక రోజు వాయిదా వేసేందుకు తమకు అధికారం ఉందని పేర్కొన్నారు. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కో-ఆప్షన్ డెరైక్టర్లకు ఓటు హక్కు అంశంపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై రాత్రి ఏడు గంటలకు మరో ప్రకటన విడుదల చేశారు. ‘గురువారం 11 గంటలకు డీసీసీబీ పాలకవర్గ ప్రత్యేక సమావేశం డీసీవో అధ్యక్షతన జరుపబడినది. ఈ సమావేశానికి తొమ్మిది మంది పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు. చట్ట ప్రకారం 11 మంది సభ్యులు ఉంటేనే కోరం ఉన్నట్లు.. కానీ కోరం లేనందున సహకార చట్టం సెక్షన్ 34-ఎ (12) ప్రకారం ఈ సమావేశం జరుపబడలేదు’ అని ప్రకటనలో డీసీవో పేర్కొన్నారు. సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశామని మీడియాతో ప్రకటించిన డీసీవో.. సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో గందరగోళం నెలకొంది. అవిశ్వాసం వీగిపోయినట్లే.. : చైర్మన్ దామోదర్‌రెడ్డి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని చైర్మన్ దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. అవిశ్వాస నోటీసు ఇచ్చిన డెరైక్టర్లు ఆ మేరకు బలం నిరూపిం చుకోవాల్సి ఉంటుందని, లేనిపక్షంలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లేనని స్పష్టం చేస్తున్నారు. కారణం లేకుండా సమావేశాన్ని ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఒకవేళ రేపటికి వాయిదా వేసిన పక్షం లో ఈ మేరకు అధికారికంగా నోటీసులు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. డీసీవోపై రాజకీయ ఒత్తిళ్లు? డీసీసీబీ చైర్మన్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జిల్లా సహకార అధికారిపై తీవ్ర స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఒక వర్గం చైర్మన్ దామోదర్‌రెడ్డికి, మరోవర్గం ముఖ్య నాయకులు చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఒత్తిళ్లకు గురి చేసినట్లు సమాచారం. దీంతో సహకార అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నువ్వా? నేనా?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానంపై నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. 11 మంది డెరైక్టర్లు ఇచ్చిన నోటీసు మేరకు నిర్వహిస్తున్న డీసీసీబీ ప్రత్యేక సమావేశంలో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగిపోతుందా? అనేది తేలనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గించుకునేందుకు వైస్ చైర్మన్ చంద్ర శేఖర్‌రెడ్డి పావులు కదుపుతుండగా, పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇరువురు తమకు మద్దతిస్తున్న డెరైక్టర్లతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైస్ చైర్మన్ మద్దతు డెరైక్టర్లు నేరుగా సమావేశానికి రావాల ని నిర్ణయించారు. చైర్మన్ వర్గీయులు సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. 11మంది డెరైక్టర్లు హాజరైన పక్షంలో కోరం ఉన్నట్లుగా భా వించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చైర్మన్ కాకుండా జిల్లా సహకార అధికారి అధ్యక్షత వహించనున్నారు. సమావేశం ప్రారంభమైతే అవిశ్వాసం అంశంపై రెండు గం టలపాటు చర్చ జరుగుతుంది. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 14 మంది డెరైక్టర్ల మద్దతు అవసరం ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన పక్షంలో చైర్మన్‌కు రిమూవల్ నోటీసులు జారీ చేయనున్నారు. వీగిపోయిన పక్షంలో మరో ఏడాదిపాటుగా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు లేకుండా పోనున్నాయి. పకడ్బందీ ఏర్పాట్లు ఈ ప్రత్యేక సమావేశ నిర్వహణకు సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డీసీసీబీ వద్ద 144సెక్షన్ విధించారు. డీసీసీబీ సీఈవోతోపాటు, డీజీఎంకు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు. దామోదర్‌రెడ్డికి తప్పనున్న పదవీ గండం? చైర్మన్ దామోదర్‌రెడ్డికి పదవి గండం తప్పే అవకాశాలున్నాయి. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా మెజారిటీ డెరైక్టర్లతో ఆయన క్యాంపు నిర్వహిస్తున్నారు. -
తిరుగుబావుటా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా ‘సహకార’ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డిలపై డెరైక్టర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు ఆయా సంస్థల్లోని సగానికి పైగా డెరైక్టర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం నోటీసు(ఫాం-ఎఎఎ)లు జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావుకు అందాయి. దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ పదవులు తమ ఖాతాలోకి వేసుకునేందుకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పటికే జిల్లా పరిషత్, అత్యధిక మండల పరిషత్‌లను కైవసం చేసుకుంది. ఇప్పుడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సొసైటీలను గెలుచుకుంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సహకార సంఘాల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీన్ని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుని ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ, డీసీఎంఎస్‌లపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమైంది. డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నెల రోజులుగా రగులుతూనే ఉంది. ఎట్టకేలకు బుధవారం డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీసీఎంఎస్ పైనా.. డీసీఎంఎస్‌లో పది మంది డెరైక్టర్లు ఉన్నారు. ఇందులో సహకార సంఘాల చైర్మన్లు ఎన్నుకున్న డెరైక్టర్లు ఆరుగురు ఉండగా, బీ-క్లాస్ సొసైటీల నుంచి నలుగురు డెరైక్టర్లు ఉన్నారు. అయితే ఏడుగురు డెరైక్టర్లు చైర్మన్‌పై అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేసిన నోటీసును జిల్లా సహకార అధికారికి అందజేసినట్లు సమాచారం. ఏడుగురు డీసీఎంఎస్ డెరైక్టర్లు హైదరాబాద్‌లో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లను కైవసం చేసుకునేందుకు మంత్రి రామన్న, టీఆర్ఎస్ అనుబంధ ఎమ్మెల్యే ఐకేరెడ్డి చక్రం తిప్పుతున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రేసులో బోథ్ నియోజకవర్గానికి చెందిన సహకార సంఘం చైర్మన్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డీసీసీబీ, డీసీఎంఎస్‌లే కాకుండా మరోమూడు సహకార సంఘాల చైర్మన్లపై కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు జిల్లా సహకార అధికారికి అం దాయి. మంజులాపూర్, కౌట్లా (బి), తాండూర్ పీఏసీఎస్ చైర్మన్లపై ఆయా సంఘాల డెరైక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రత్యేక సమావేశాలకు ఏర్పాట్లు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన నోటీసులు రావడంతో సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్ డెరైక్టర్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు చర్యలు చే పట్టారు. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసు వచ్చిన నెల రోజు ల్లోపు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. ఈ సమావేశం నిర్వహించే ముందు వచ్చిన నోటీసుపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. నోటీసులో డెరైక్టర్లు చేసి న సంతకాలు సరైనవేనా కాదు.. వంటి అన్ని అంశాలు పరిశీలించాక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సహకార అధికారులు ముందస్తుగానే న్యాయసలహా తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించారనే అంశంపై సీనియర్ అధికారుల సలహా తీసుకుంటున్నారు. సహకార చట్టం ప్రకారం వ్యవహరిస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షిప్రతినిధి’తో పేర్కొన్నారు. -
మళ్లీ పంపండి
బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలు రద్దు 15లోగా కొత్త ప్రతిపాదనలు పంపాలి కొత్తగా పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టడంతో బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలు వెనక్కి పంపాం. ఈ నెల 15వ తేదీలోగా మండల పరిషత్ నుంచి తీర్మానాలు జెడ్పీకి పంపాలని అధికారులను ఆదేశించాం. 25వ తేదీలోగా జెడ్పీ పాలకవర్గం ఆమోదంతో మొత్తం ప్రతిపాదనలను కేంద్రానికి పంపిస్తాం. - దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ గ్రామాల్లో పనుల గుర్తింపు ప్రతిపాదనల్లో తమకూ అవకాశం ఇవ్వాలని ఎంపీపీలు, జెడ్పీటీసీలు అధికారులను కోరారు. దీనికి జెడ్పీచైర్మన్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో నిన్నామొన్నటి దాకా రూపొందించిన ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. 2014-15 ఆర్థిక సంవతర్సానికి గాను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం (బీఆర్జీఎఫ్) కింద కేంద్రం జిల్లాకు 33.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల కేటాయింపులో తమదైన ముద్ర వేసేందుకు ఎంపీపీలు, జెడ్పీటీసీలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నల్లగొండ: గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూపొందించిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. నిన్నామొన్నటి వరకు మండల, జిల్లా పరిషత్‌లో పాలకవర్గాలు లేవన్న కారణంతో బీఆర్జీఎఫ్ ప్రణాళికను మండలాధికారులు సిద్ధం చేసి జిల్లా పరిషత్‌కు పంపారు. దాదాపు అన్ని మండలాల్లో పనుల గుర్తింపు పూర్తయ్యాయి. తీర్మానాలు కూడా సిద్ధం చేశారు. గ్రామ, మండల స్థాయిలో తీర్మానాలు పూర్తి చేసి 25 మండలాలకు సంబంధించిన ప్రణాళికలు కూడా జిల్లా పరిషత్‌కు చేరాయి. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెల 5 తేదీన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు కొలువుదీరడంతో పనులు గుర్తింపులో తమకూ అవకాశం ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. దీనికి జెడ్పీ చైర్మన్ కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఇప్పటివరకు చేపట్టిన కసరత్తు అంతా కూడా మళ్లీ మొదటికొచ్చింది. గత ప్రతిపాదనలు రద్దు చేసి కొత్తవి తయారు చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవతర్సానికి గాను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం(బీఆర్జీఎఫ్) కింద కేంద్రం జిల్లాకు రూ.33.80 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామాల్లో పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఖర్చు చేస్తారు. అయితే పనుల ప్రతిపాదనలు పంపాలని రెండు నెలల క్రితమే జెడ్పీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ ఆదేశాలను జెడ్పీ అధికారులు మండల, మున్సిపల్ అధికారులకు పంపారు. అయితే అధికారుల వివిధ కారణాల దృష్ట్యా ప్రతిపాదనలు పంపడంలో తీవ్ర జాప్యం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 25 మండలాల నుంచి మాత్రమే వచ్చాయి. ఈలోగా జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో మిగతా మండలాల నుంచి ప్రతిపాదనలు రాకుండా అధికారులు ఆపేశారు. కలిసొచ్చిన అదృష్టం.. బీఆర్జీఎఫ్ నిధుల్లో గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30శాతం, జెడ్పీటీసీ సభ్యులకు 20శాతం నిధులు కేటాయిస్తారు. దీంతో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఈ నిధుల కేటాయింపుపై తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. కొలువుదీరిన వెంటనే బీఆర్జీఎఫ్ రూపంలో కలిసొచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆరాటపడుతున్నారు. దీనికి జెడ్పీ చైర్మన్ కూడా అంగీకారం తెలపడంతో జెడ్పీ అధికారులు ఇప్పటివరకు అందిన 25 మండలాల ప్రతిపాదనలు మండలాలకు తిప్పి పంపారు. తిరిగి పంపాలని సూచించారు. పనుల ప్రతిపాదనలకు సంబంధించి మండల పరిషత్, జెడ్పీ పాలకవర్గం సమావేశమై వారు ప్రత్యేకంగా తీర్మానం చేసుకునే అధికారం ఉంది. అయితే సర్పంచ్‌లు చేసిన తీర్మానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసే అధికారం మాత్రం మండల పరిషత్‌లకు లేదు. పనుల ప్రతిపాదనలకు సంబంధించి మండల పరిషత్, సర్పంచ్‌లు గుర్తించిన పనుల్లో ఏమైన తేడాలు ఉన్నట్లయితే వాటిని మాత్రమే సరిచేస్తారు. ఉదాహరణకు ఏదేని గ్రామంలో చేపట్టిన పనికి నిధులు చాలని పక్షంలో ఆ గ్రామానికి మండల పరిషత్ నుంచి కేటాయిస్తారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు గుర్తించిన పనులు రెండు ఒకేరకంగా ఉన్నట్లయితే వాటిని కూడా రద్దు చేస్తారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పనులకు కూడా మండల పరిషత్ కోటా నుంచి నిధులు కేటాయించే అవకాశం ఉంది. పనులను ప్రతిపాదించడంలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సర్పంచ్‌లు చేసిన తీర్మానాలను కూడా తిప్పి పంపారు. -
సీఎం రేసులో లేనంటే ఒప్పుకోరు: జానారెడ్డి
- అతిపెద్ద పార్టీగా అవతరించేది కాంగ్రెస్సే సాక్షి, హైదరాబాద్: తాను ముఖ్యమంత్రి రేసులో లేనని చెబితే ఎవరూ ఒప్పుకోరని మాజీమంత్రి కె.జానారెడ్డి అన్నారు. అందరూ తనను లాక్కొచ్చి సీఎం రేసులో నిలబెడతారని, ఈ విషయాన్ని మనం కూడా ఒప్పుకోక తప్పదని చెప్పారు. అయితే ‘రేసుగుర్రం’ ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. ఆదివారం తన నివాసంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించబోతుందని జోస్యం చెప్పారు. అత్యధిక స్థానాలతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, దీంతోపాటు తెలంగాణలో తమ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విశ్లేషిస్తే ఈ విషయం అర్ధమవుతోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎన్నికల్లో అంతటా ప్రచారం చేయలేదని, నియోజకవర్గాలకే పరిమితమయ్యారని అనడం సరికాదన్నారు. నల్లగొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తిరిగానని, తెలంగాణలో పార్టీకి ఇబ్బంది ఉన్నచోట అందరితో మాట్లాడి సమన్వయం చేశానని చెప్పారు. జానారెడ్డి కంటే అర్హుడెవరు..?: దామోదర్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కీలకమైన నాయకుడిగా ఉన్న జానారెడ్డికంటే అర్హులైన వ్యక్తి ఎవరున్నారని ప్రశ్నించారు. ఆదివారం జానారెడ్డి నివాసానికి వచ్చిన దామోదర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘సీఎం పదవికి జానారెడ్డి అన్ని విధాలా అర్హుడు. అన్ని శాఖలు నిర్వహించిన వ్యక్తి. పాలనలో అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను జిల్లా నేతగా చూడొద్దు. తెలంగాణలో ఆయనే పెద్ద లీడర్. తెలంగాణ నవ నిర్మాణంలో ఆయన పాత్ర అత్యంత కీలకం’’అని కొనియాడారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు రవీందర్రావు, మహేశ్వరరెడ్డి కూడా జానారెడ్డిని కలసి తెలంగాణలో పోలింగ్ సరళి, పార్టీ విజయావకాశాలపై చర్చించారు. -
మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు మావే: జానారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో విజయం కాంగ్రెస్‌దే విజయమని మాజీ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. మైజార్టీ తగ్గినా అత్యధిక స్థానాలు గెల్చుకున్న పార్టీగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు ప్రజా ఆదరణ ఉన్నప్పటికీ మెజార్టీ స్థానాలు గెలుచుకునేంతగా ఆ పార్టీ బలపడలేదని విశ్లేషించారు. ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని టీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు పైరవీలు చేసినా ప్రయోజనం ఉండదని జానారెడ్డి అన్నారు. సీఎంగా జానారెడ్డి అన్ని అర్హతలు ఉన్నాయని దామోదర్‌రెడ్డి అన్నారు. మంత్రిగా పలు శాఖలు నిర్వహించారని, నవ తెలంగాణ నిర్మాణానికి జానారెడ్డి సేవలు అవసరమని చెప్పారు. -
పరిషత్‌ల్లోనూ పోరు
నల్లగొండ, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించగా, శనివారం ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్ టి. చిరంజీవులు, జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 59 ఎంపీపీ స్థానాలకుగాను జనరల్ 31, మహిళలకు 28 స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీలు-7, ఎస్సీలు-10, బీసీలు-23, జనరల్-19 స్థానాలను రిజర్వు చేశారు. కాగా రిజర్వేష న్ల తంతు పూర్తికావడంతో ప్రస్తుతం ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో యంత్రాంగం తలమునకలైంది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని స్థానిక ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా వేర్వేరుగా ఓటర్ల జాబి తాను సిద్ధం చేస్తున్నట్లు సీఈఓ తెలిపారు. సోమవారం ఈ జాబితాను మండలాల్లో ప్రచురిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే రోజున ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జారీ చేయనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్, సీఈఓ శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితాలో నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గిరిజనులకే జెడ్పీ పీఠం.. జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. తొలిసారిగా గిరిజనులకు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లభించింది. 1958లో జిల్లా పరిషత్ పాలన ప్రారంభంకాగా తొలిసారిగా జీఎస్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే జెడ్పీ స్థానం రిజర్వు అయ్యింది. 2001లో బీసీ మహిళలకు కేటాయించగా వేమవరపు ప్రసన్న చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె అకాల మరణం తర్వాత కీతా లక్ష్మమ్మను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మళ్లీ 2006లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం జెడ్పీ పరిపాలనలో బీసీలకు ఒకసారి అవకాశం రాగా, తొలిసారిగా ఎస్టీలకు కేటాయించారు. కాగా 59 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 7 కేటాయించగా వాటిల్లో మహిళలకు 4, జనరల్‌కు 3 స్థానాలు రిజర్వు చేశారు. జనరల్ స్థానాలు చిలుకూరు, చింతపల్లి, నూతనకల్ మండలాలు కాగా, మహిళలకు కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తుంగతుర్తి మండలాలు కేటాయించారు. ఈ మండలాల్లో గెలుపొందిన జెడ్పీటీసీ అభ్యర్థులనే చైర్మన్ స్థానం వరించనుంది. ఎంపీపీ స్థానాలకు హోరాహోరీ పోరు.. 17 చోట్ల ఎంపీపీ స్థానాలకు అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాలు, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉండబోతుంది. బొమ్మలరామారం, చందంపేట, చింతపల్లి, గరిడేపల్లి, హుజూర్నగర్, కనగల్, కేతేపల్లి, మఠంపల్లి, మోతె, మునుగోడు, నిడమనూ రు, నూతనకల్, పెన్‌పహాడ్, శాలి గౌరారం, తుంగతుర్తి, తుర్కపల్లి, వలిగొండ ఎంపీపీ స్థానాలకు హోరాహోరీ పోరు జరగనుంది. అదేలాగంటే ఉదాహరణకు మోతె ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఈ మండలంలో రాఘవాపురం ఎంపీటీసీ స్థానం మాత్రమే ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్టీ కోటాలో మహిళలకు కూడా రెండు స్థానాలు కేటాయిం చడంతో ఈ మండలంలో ఎంపీపీ స్థానం కోసం త్రిముఖ పోటీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా శాలిగౌరారం ఎంపీపీ స్థానం జనరల్ మహిళలకు కేటాయించారు. ఈ మండలంలో మన్నెమద్దె ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు రిజర్వు అయ్యింది. దీంతో మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సైతం ఎంపీపీ స్థానం కోసం పోటీ అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలే మిగతా 15 చోట్ల ఉత్పన్నమయ్యే సూచనలు ఉన్నాయి. దీని వల్ల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారనుంది. -
ఉద్రిక్తం..
భువనగిరిటౌన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డితో పాటు మరి కొందరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు గంటకుపైగా ధర్నా నిర్వహించారు. కేసునమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేశారని ఎంపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డిపై కేసునమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే తమను కులం పేరుతో దూషించారని దామోదర్‌రెడ్డి వర్గీయులు ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, సతీష్‌లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇకసాగవు భువనగిరి, న్యూస్‌లైన్: జిల్లాలో సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి హత్యారాజకీయాలు ఇక సాగబోవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలో 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్న దామోదర్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై స్వయంగా దాడి చేసిన దామోదర్‌రెడ్డి.. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను జిల్లాలో నడుపుతున్నారని ఆరోపించారు. తమసోదరుల జోలికి వచ్చిన ఆర్డీఆర్‌ను సొంత జిల్లా అయిన ఖమ్మంకు పంపించడం ఖాయమన్నారు. ‘‘నీ హత్యా రాజకీ యాలకు ఇక్కడ ఎవరూ బయపడరని.. జిల్లా ప్రజలకు నీవు ఏం చేశావని నీకొడుకును ఎంపీ చేయాలని అనుకుంటున్నావు’’ అని దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నప్పటికీ ఆర్డీఆర్ తన కొడుకును పోటీలో దింపడానికి టికెట్ కోరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల మంచి పేరున్న నూతన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఓడిపోయిన చింతల వెంక టేశ్వర్‌రెడ్డికి మరో మారు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీ దూతను కోరినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కోమటిరెడ్డి సోదరులను ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసిన ఆర్డీఆర్.. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవికోసం సీఎం పంచన చేరారని ఆరోపించారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, బర్రె జహంగీర్, భాస్కర్, చంద్రకళ ఉన్నారు. ఆర్డీఆర్‌ను వెంటనే అరెస్టు చేయాలి నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు దళిత యువకులపై దాడులకు పాల్పడిన సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఆర్పై అట్రాసిటీ కేసునమోదు చేసి అరెస్టు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. దామోదర్‌రెడ్డి స్వయంగా రౌడీలతో వెళ్లి రాజగోపాల్‌రెడ్డిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆర్డీఆర్‌ను జిల్లా ప్రజలు ఆదరించిన విషయాన్ని మరచి హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. కిరాయి హత్యలు చేయించే స్వభావం ఉన్న ఆర్డీఆర్.. రాజగోపాల్‌రెడ్డిపై కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతోనే ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయించామన్నారు. తాము తలుచుకుంటే నార్కట్‌పల్లి మీదుగా సూర్యాపేటకు కూడా వెళ్లలేవని సవాల్ చేశారు. దామోదర్‌రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దామోదర్‌రెడ్డి చర్యలకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రోత్సాహం ఉందని, వెంటనే మంత్రి తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. -
పది జిల్లాలతో తెలంగాణ కావాలి