
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి హస్తాన్ని వీడనున్నారు. రేపు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌కు దామోదర్‌రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకనొక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేశారు. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి నాగం చేరికపై చర్చించినట్టు ప్రచారం జరిగింది. అయినా నాగంను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దామోదర్‌రెడ్డి తీవ్ర మనస్థాపం చెందారు. తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని , తన మాటకు విలువలేదనే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దామోదర్‌రెడ్డి పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని డీకే అరుణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
Comments
Please login to add a commentAdd a comment