
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి శనివారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన దామోదర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానికసంస్థల నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు (కె.రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి) మాత్రమే గెలిచారు. మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో అసంతృప్తి చెందిన దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment