దామోదర్, సంజయ్, అప్పిరెడ్డి
సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ–‘‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను. ఇక్కడ మా మైక్ టీవీకి బ్రాండింగ్ ఉండటంతో మైక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ నాకు ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. సబ్జెక్ట్ నచ్చడంతో బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం.
చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. జీవన్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్ చేయాలని మరొకరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్ సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సంజయ్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment