appireddy
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరపాలని అప్పిరెడ్డి తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.దీంతో న్యాయమూర్తులు జస్టిస్ సత్తిరెడ్డి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్‌ల ధర్మాసనం లంచ్ మోషన్ రూపంలో గురువారం అత్యవసర విచారణకు అంగీకరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, హోదా వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలవుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అడిగిందే తడవుగా, సీఈవో ఆ మార్గదర్శకాలకు తూట్లు పొడిచారు. టీడీపీకి అనుకూలంగా వాటిని సడలించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి.. పేరు, హోదా వివరాలు చేతితో రాయకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్‌ను ఆమోదించాలంటూ ఈ నెల 25, 27వ తేదీల్లో మెమోలు జారీ చేశారు. ఈ నిర్ణయం అత్యంత వివాదాస్పదంగా మారింది. కూటమి తప్ప, అన్నీ రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రధాన అధికారి నిర్ణయంపై అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారుతుందని భయపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని నిబంధన ఏపీలో అమలు సీఈవో ఇచ్చిన సడలింపుల అమలును నిలిపేసి, కేంద్ర ఎన్నికల సంఘం గత ఏడాది జూలైలో జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా, నిజమైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ప్రతివాదులుగా చేర్చింది. మధ్యాహ్నం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి, న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ వాదనలు వినిపించారు. దాదాపు రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి.సీఈవో తన పరిధి దాటి మరీ మెమోలు జారీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలు చేస్తున్నారని తెలిపారు. సీఈవో మెమోల వల్ల వచ్చే నష్టం గురించి ధర్మాసనానికి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని, తన పేరు, డిజిగ్నేషన్ వివరాలు చేతితో రాసినా కూడా ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని, ఇందుకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటే, దానిని తిరస్కరించవచ్చని తెలిపారు.అయితే ఇప్పుడు సీఈవో ఆ మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అమలు చేయడం లేదన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో నిష్పాక్షికత కోసమే ఈ వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. నిబంధనలకు తూట్లు పొడిచే అధికారం సీఈవోకు లేదన్నారు. కొన్ని రాజకీయ పారీ్టలకు మేలు చేసేందుకే సీఈవో ఈ మెమో జారీ చేశారని తెలిపారు.పేరు, హోదా, సీలు లేకపోయినా ఆమోదించాలి 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సీఈవో తమ అభిప్రాయాన్ని కోరారని తెలిపారు. అధికారుల సంతకం విషయంలో ఏదైనా సందేహం ఉన్నా, వెరిఫికేషన్ అవసరం అయినా, ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారుల నమూనా సంతకాలు, పేర్లు, హోదాల వివరాలను తీసుకోవాలంటూ ఈ నెల 25వ తేదీన జారీ చేసిన మెమోలోని రెండో పేరాను ఉపసంహరించుకుంటున్నట్లు అవినాష్ చెప్పారు.ఈ రెండో పేరాకు అనుగుణంగా 27న జారీ చేసిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫాంపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లను ఆమోదించాలంటూ తాజాగా (30వ తేదీన) ఆదేశాలు జారీ చేశామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీటిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ, 25న ఇచ్చిన మెమోలోని పేరా 2, 27న ఇచ్చిన మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పిన విషయాన్ని రికార్డ్ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించి, అవినాష్ చెప్పిన విషయాలను రికార్డ్ చేసింది. అవినాష్ జోక్యం చేసుకుంటూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఇది రెగ్యులర్ కేసు కాదని గుర్తు చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
వదినా మరుదుల కుట్ర ఫలితమే విధ్వంసం
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రే కనిపిస్తోందని’.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయి. ఈ మూకలు అంతగా రౌడీయిజం చెలాయిస్తూ, వైఎస్సార్సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా, పోలీసుయంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం.. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్నికల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని’.. అప్పిరెడ్డి వివరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా జరిగిన పెత్తందార్ల దాడులివి. వదిన మరుదులు పురందేశ్వరి, చంద్రబాబుల ధ్వంసరచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలయ్యారు. పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయి. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి. మేం అధికారంలోకి రాగానే తప్పుడు అధికారులపై చర్యలుంటాయి..’ అని అప్పిరెడ్డి హెచ్చరించారు. ‘సీఎం జగన్ నాయకత్వమే మళ్లీ రావాలని పేదలు కోరుకున్నారని ఆ వర్గాన్నే టార్గెట్ చేసి దాడులు చేయడం భావ్యమేనా? ఇప్పటికైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలని కోరుతున్నాం. మేము అధికారంలోకి రాగానే విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచేసిన వారందరినీ లెక్కగట్టి శాఖాపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం..’ అని అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
హాయిగా నవ్వుకుంటారు
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ వినోదాత్మక చిత్రం. మూఢ నమ్మకాలపై సెటైర్లా ఉండే ఈ కథ కొత్తగా అనిపించింది.. అందుకే నిర్మించాం. మా సినిమా చూసి ప్రేక్షకులు రెండు గంటలు హాయిగా నవ్వుకుంటారు’’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ నెల 29న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ– ‘‘వ్యాపారరీత్యా అమెరికా వెళ్లాం. అక్కడ 2016లో ఓ హాలీవుడ్ మూవీ నిర్మించాం. 2017కి ఇండియా వచ్చి, తెలుగులో మొదటి సినిమాగా ‘జార్జ్ రెడ్డి’ నిర్మించాం. ఏఆర్ శ్రీధర్ చెప్పిన కథ నచ్చడంతో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ తీశాం. మా బ్యానర్లో నిర్మించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఆగస్టు 18న రిలీజ్ చేస్తాం’’ అన్నారు. – అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి -
గుంటూరులో ఎంఎల్‌సి అప్పిరెడ్డి అభినందన సభ
-
మీడియా తో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
-
ఈసారి వేరే సినిమా
‘బిగ్‌బాస్ సీజన్ 4’తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సయ్యద్ సోహైల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘నేను సోహైల్‌తో ఎన్నో కథలు పంచుకున్నాను. ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చాలా సినిమాల్లో నటించా. అవేమీ గుర్తింపునివ్వలేదు. బిగ్ బాస్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని చాలామంది అనుకుంటారు. నిజంగానే ఈ సినిమా వేరేగా ఉంటుంది. అన్ని వర్గాల మనసునూ గెలుచుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్. -
చెరకు నుంచి జీరిక వైపు!
నీటి వనరులను కొల్లగొట్టే చెరకు సాగుకు స్వస్తి చెప్పి, ఆరోగ్యదాయకమైన జీరిక చెట్ల సాగు వైపు తెలుగు రాష్ట్రాల్లో అభ్యుదయ రైతుల దృష్టి మరలుతోందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే సమాధానం వస్తుంది. తామర తంపరగా సుగర్ వ్యాధి వ్యాప్తికి తెలుగు రాష్ట్రాలు కేంద్రాలుగా నిలుస్తున్న నేపథ్యంలో ఆరోగ్యదాయకమైన తాటి, ఈత, ఖర్జూర, జీరిక చెట్ల నీరాతో తయారయ్యే బెల్లం, చక్కెర, సిరప్ తదితర ఉత్పత్తుల వాడకంపై నగర, పట్టణ వాసుల దృష్టి మరలుతోంది. సుగర్ వ్యాధిగ్రస్తులు సైతం నిక్షేపంగా ఉపయోగించదగిన తీపి పదార్థాలు కావటంతో వీటికి మార్కెట్లో అధిక ధర లభిస్తోంది. దీంతో అభ్యుదయ రైతులు జీరిక చెట్ల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వీరిలో అగ్రగణ్యులు ఎం. అప్పిరెడ్డి. ‘తాటి, ఈత, కొబ్బరి చెట్ల కన్నా అత్యంత నాణ్యమైన నీరాను జీరిక చెట్టు అందిస్తుంది. దీన్నే గిరిక తాడి, జీలుగ, డాలర్ చెట్టు అని పిలుస్తున్నారు. అంతేకాకుండా.. ఏడాదిలో 6 నెలలకు పైగా రోజుకు 40–50 లీటర్ల మేరకు ఎటువంటి పోషణా లేకుండా నీరా దిగుబడిని అందిస్తుంది. ఈ నీరాతో తయారయ్యే బెల్లం, పంచదారలో ఫ్రక్టోజు అధికంగా ఉంటుంది. కాబట్టి, సుగర్ వ్యాధిగ్రస్తులు కూడా దీన్ని వాడొచ్చు. అందుకే నేను 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న చెరకు సాగుకు స్వస్తి చెప్పి జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నా..’ అంటున్నారు సీనియర్ రైతు నేత అప్పిరెడ్డి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నివాసం ఉంటున్న ఆయన అఖిల భారత రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌గా ఉన్నారు. తెలంగాణా రాష్ట్ర చెరకు రైతుల సంఘం మాజీ అధ్యక్షులు కూడా. ‘ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా నష్టదాయకమైన చెరకును వదిలెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా తాటి, ఈత, ఖర్జూర, జీరిక నీరా ద్వారా బెల్లం, పంచదార, బెల్లం పాకం తదితర 200 ఉత్పత్తులు తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. తూ.గో. జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ తాటి ఉత్పత్తుల పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డా. వెంగయ్య విస్తృతంగా పరిశోధనలు చేసి, ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. మూడేళ్ల క్రితం సాక్షి సాగుబడిలో ప్రచురితమైన డా. వెంగయ్య వ్యాసాల ద్వారానే అద్భుత వృక్షం జీరిక గురించి రైతులోకానికి తెలియవచ్చింది.. అన్నారాయన. కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇనుమడిస్తున్న ఆరోగ్యదాయకమైన ఆహార స్పృహ తాటి, జీరిక నీరాతో బెల్లం, పంచదార ఇతర తీపి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ బాగా పెరుగుతోందని ఆయన అంటున్నారు. జీరిక పంచదారకు కిలో రూ. వెయ్యి వరకు ధర పలుకుతోంది. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందువల్లనే తాను ఈ ఏడాది వంద ఎకరాల్లో జీరిక సాగుకు శ్రీకారం చుడుతున్నానని అప్పిరెడ్డి అంటున్నారు. కోట్లాదిగా ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరించి వాడుకలోకి తేవటంతోపాటు.. అంతకు ఎన్నోరెట్లు ఎక్కువ మోతాదులో నీరాను అందించే జీరిక చెట్ల పెంపకంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను ఎంతగానో పెంపొందించవచ్చని అప్పిరెడ్డి ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ ఏజన్సీ ప్రాంతాల్లో జీరిక చెట్లు వేల సంవత్సరాల నుంచి సహజ సిద్ధంగా పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, స్థానికులు వీటి నుంచి నీరాను తీస్తూ ఆరోగ్యాన్ని పొందటమే కాక ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు. ఒక్క చెట్టుకు సంవత్సరానికి కౌలుకు ఇస్తే రూ. 30–35 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. సొంతంగా నీరా తీసే వారు ఏడాదికి చెట్టుకు రూ. లక్ష వరకు సంపాయిస్తూ, అదే తమ ముఖ్య ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఏ మాత్రం పోషణ ఖర్చు లేకుండానే జీరిక చెట్లు ఇస్తున్న ఆదాయం ఇది. జీరిక మరుగున పడిన గొప్ప ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్టు. వీటి సాగును అభివృద్ధి చేయటం ద్వారా, రైతాంగం ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎంతో అవకాశం ఉందని శాస్త్ర పరిశోధనల ద్వారా రూఢి అయ్యింది. మన దేశ ప్రజల అవసరాలు తీర్చటంతో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయవచ్చు. శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాలు ఈ జాతి చెట్ల నీరా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయాన్ని గడిస్తున్నాయి. మన ప్రభుత్వాలు, రైతులు జీరిక చెట్ల పెంపకం ఆవశ్యకతను గుర్తెరగాలి. జీరిక మొక్క నాటిన ఆరేళ్లలో నీరా దిగుడిని ఇవ్వటం ప్రారంభం అవుతోంది. మరింత త్వరగా నీరా దిగుబడినిచ్చే విధంగా టిష్యూకల్చర్ మొక్కల ఉత్పత్తి కోసం కూడా చురుగ్గా ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పిరెడ్డి తెలిపారు. స్వల్ప వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చు. గ్రామీణ ప్రాంతీయులకు ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చు. ప్రభుత్వాలు జీరిక ప్రయోజకత్వాన్ని గుర్తించాలి. ఇందుకోసం పెద్దగా నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. కావలసిందల్లా శాస్త్రీయ దృక్పథం. సంకల్పం మాత్రమే అని అప్పిరెడ్డి (83090 24948) అంటున్నారు. -
జార్జిరెడ్డి పాత్రే హీరో
సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. ‘దళం’ ఫేమ్ జీవన్‌రెడ్డి దర్శకత్వంలో అప్పిరెడ్డి, దామోదర్‌రెడ్డి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ–‘‘అమెరికాలో ఉన్నప్పుడే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాలనుకున్నాను. ఇక్కడ మా మైక్ టీవీకి బ్రాండింగ్ ఉండటంతో మైక్ మూవీస్ అనే బ్యానర్‌ను స్థాపించి మంచి సినిమాలు చేయాలనుకున్నాను. జార్జిరెడ్డి కథ నాకు ఇన్స్పైరింగ్గా అనిపించింది. సబ్జెక్ట్ నచ్చడంతో బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ సెట్‌ను వేశాం. చిరంజీవిగారు మా సినిమా చూస్తాను అని చెప్పారు’’ అన్నారు. ‘‘జార్జిరెడ్డి కథ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఈ కథకు స్టార్ హీరోలు అవసరం లేదు. జార్జిరెడ్డి క్యారెక్టరే హీరో. ఆయనలో హీరోకు ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఆయన ఒక బాక్సర్, ఫైటర్. ఓ సందర్భంలో జార్జిరెడ్డిపై ఓ డాక్యుమెంటరీ తీశాం. అప్పుడే సినిమా చేద్దామనే ఆలోచన కలిగింది. జీవన్‌రెడ్డి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు. జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను హైలైట్ చేయాలని మరొకరిని తక్కువగా చూపించలేదు. ప్రమోషన్స్, బిజినెస్, పబ్లిసిటీ మాకు కొత్త. సంజీవ్‌రెడ్డిగారు మాతో కలవడం ప్లస్’’ అన్నారు. ‘‘కొత్త కథలను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబుగార్లు మా సినిమాకు మోరల్ సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు సంజయ్‌రెడ్డి. -
గోరీ కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
పట్నంబజారు(గుంటూరు): కార్మికుల కడుపులు కొట్టి.. వారి జీవితాలు రోడ్డున పడుతున్నా.. తమకేమి పట్టనట్లు బడా వ్యాపారులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు సర్కార్‌కు కార్మికులు గోరీ కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భజరంగ్ జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు. జూట్ మిల్లు యాజమాన్యం మిల్లులోని సరుకుతో పాటు యంత్రాలను తరలించేందుకు మంగళవారం మరోసారి ఉపక్రమించింది. ఇప్పటికే రెండు సార్లు శతవిధాలా ప్రయత్నించి ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులపై కోర్టు ద్వారా మరింత ఒత్తిడి పెంచి.. తన ఎత్తులను పారించుకునేందుకు చకచక పావులు కదిపింది. భారీగా పోలీసులను మొహరింపజేసి బలప్రయోగంతో సరుకు మాటున యంత్రాలను తీసుకుని వెళ్లేందుకు సమాయత్తమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే కార్మికులు, పరిరక్షణ సమితి నేతలతో కలిసి పెద్ద సంఖ్యలో జూట్ మిల్లు వద్దకు చేరుకున్నారు. యాజమాన్య దుశ్చర్యలను అడ్డుకునేందుకు సమాయత్తమయ్యారు. దీనితో మరోమారు స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. చర్చలకు పిలిచిన డీఎస్పీ సౌమ్యలత : జూట్ మిల్లు వద్ద ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ డీఎస్పీ పి.సౌమ్యలత జోక్యం చేసుకున్నారు. పరిరక్షణ సమితి నేతలు, కార్మికులను చర్చలకు ఆహ్వానించారు. గతంలో కోర్టు ఆదేశాలు యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, కార్మికుల ఆకలి కేకలు క్రమంలో తాము సంయమనం పాటించామని ఆమె తెలిపారు. దీనిపై యాజమాన్యం కోర్టు ధిక్కరణ కేసును తమపై హైకోర్టులో వేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాలను శిరసావహించాల్సిందేనని వివరించారు. ప్రస్తుత సమస్యను దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. నగరంపాలెంలోని ఆమె కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సుమారు గంటన్నరకుపైగా భేటీ అయి పూర్తిస్థాయిలో చర్చించారు. కోర్టును ధిక్కరించాలన్నది తమ ఉద్దేశం కాదని డీఎస్పీ సౌమ్యలతకు వివరించారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని, మెటీరియల్ ముసుగులో మిషనరీ తరలింపే తమకు అభ్యంతరమని తెలిపారు. దీనికి ఆమె కోర్టు ఉత్తర్వులను అనుసరించి కేవలం సరుకు మాత్రమే యాజమాన్యం తీసుకుని వెళ్లేలా చూస్తామని హామీనిచ్చారు. యంత్ర పరికరాలను తరలనివ్వబోమని స్పష్టం చేశారు. ఇంకా ఏమైనా సందేహం ఉంటే కార్మికుల తరఫున న్యాయవాదిని, ఒక కార్మికుడిని మిల్లులోకి పంపి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఊపిరి పీల్చుకున్న పోలీసులు : పోలీసులతో చర్చల అనంతరం మరోసారి పరిరక్షణ సమితి నేతలు కార్మికులతో భేటీ అయ్యారు. డీఎస్పీ సౌమ్యలతతో జరిగిన చర్చల సారాంశం వివరించారు. సరుకు తరలించేందుకు యాజమాన్యానికి అనుగుణంగా ఉన్న కోర్టు ఉత్తర్వులు, తద్వారా పోలీసులకు ఎదురవుతున్న చిక్కులను కార్మికులకు వెల్లడించారు. యంత్ర పరికరాల జోలికి వెళ్లకుండా సరుకు మాత్రమే తరలించుకుపోతారని తెలిపారు. దీంతో అప్పటి వరకు నెలకొన్న ఉద్రిక్తత పూర్తి ప్రశాంతంగా మారటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎంను కలిసేందుకు సహకరించండి : సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరుకు రానున్న నేపథ్యంలో ఆయన్ను కలిసి సమస్యను వివరించేందుకు సహకరించాలని పరిరక్షణ సమితి నేతలు డీఎస్పీ సౌమ్యలతను కోరారు. దీనిపై సానూకూలంగా స్పందించి ఆమె ఎస్పీ సిహెచ్.విజయారావు దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని, సీఎం అపాయింట్మెంట్కు తన వంతు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం సమర్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం మిల్లు అంశంలో మొదటి నుంచి పొంతన లేని విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకటకృష్ణారెడ్డి, సీపీఎం నేతలు భావన్నారాయణ, నళినీకాంత్, కార్మిక నేతలు ఎబ్బూరి పాండురంగ, నూకరాజు, సింగు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
‘పగలు కాంగ్రెస్‌తో కాపురం.. రాత్రి బీజేపీతో సంసారం’
సాక్షి, గుంటూరు : టీడీపీ నాయకులు వైఎస్ జగన్ సతీమణిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముస్తాఫా, అప్పిరెడ్డిలు హెచ్చరించారు. టీడీపీ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎలాగో అలా గెలవాలని టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. నియోజక వర్గంలోని నాయకులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ముందే తెలుసుకొని అన్ని విధాల జగన్‌ను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నారన్నారు. అధికారాలను, డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పగలు కాంగ్రెస్‌తో కాపురం, రాత్రి బీజేపీతో సంసారం చేయడం టిడీపీకే చెల్లుబాటు అవుదుందని ఎద్దేవా చేశారు. వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు అధికారుల అండతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే లక్షకు పైగా ఓట్లను తొలగించారని ఆరోపించారు. డోర్ నెంబర్ మారుపేరుతో మున్సిపల్ అధికారులు నియోజకవర్గాన్ని అస్తవ్యస్తంగా తయారుచేశారని విమర్శించారు. ఓకే డోర్ నెంబర్లోని ఓట్లు, ఓకే కుటుంబానికి చెందిన ఓట్లు నాలుగు బూతుల్లో కేటాయించారని ఆరోపించారు. అధికారుల్లో ఇప్పటికైనా మార్పురావాలని, లేకపోతే భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనారీటీలపై టీడీపీకి ప్రేమ ఉంటే నాలుగెళ్లల్లో ఒక్క మంత్రి పదవైనా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. మైనార్టీలు టీడీపీని తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి
► ఆ బాధ్యత ప్రచార విభాగంపై ఉంది ► వైఎస్సార్సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ గాంధీనగర్(విజయవాడ) : రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లో విస్త్రతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రచార విభాగం నూతన కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ పార్టీలో మిగిలిన విభాగాల కంటే ప్రచార విభాగం ఎంతో కీలకమైందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్ని ప్రలోభాలకు గురిచేస్తోందని, జగన్‌పై అసత్యప్రచారం చేస్తోందని చెప్పారు. దాన్ని సమర్థంగా ప్రచార విభాగం తిప్పికొట్టాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తోందన్నారు. ప్రభుత్వంలో నిత్యం ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార విభాగం సన్నద్ధం కావాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు జగన్ చేస్తున్న పోరాటాలను ప్రజలకు తెలియజేయాలని, పార్టీ విధివిధానాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కోరారు. అనంతరం ప్రచార విభాగం జిల్లా, నగర కమిటీ సభ్యులను అభినందించారు. ప్రచార విభాగం నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్రాజు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, ప్రచార విభాగం నగర అధికార ప్రతినిధి తాడి శివ, కృష్ణారావు, ప్రధాన కార్యదర్శులు వెలధి అనిల్‌కుమార్, వున్నం రమేష్, శివ, సొంగా చందన్, ఆకురాతి రమాకాంత్, కేరిన్, కే శివ, కృష్ణారావు, ప్రకాశరావు, కార్యదర్శులు బషీర్ అహ్మద్, నూతలపాటి మేరీ, అయ్యప్పరెడ్డి, పాశం శివ పాల్గొన్నారు. -
పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం
-
వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడిగా అప్పిరెడ్డి
ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ యువజన విభాగం నగర అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్‌రెడ్డి ఖమ్మం అర్బన్: వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడిగా తుమ్మా అప్పిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జమలాపురం రామకృష్ణ, యువజన విభాగం నగర అధ్యక్షుడిగా ఆదూరి రాజవర్దన్‌రెడ్డి ఎంపికయ్యారు. వీరిని నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూచనలతో జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఖమ్మం నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని ఖమ్మం నగరంలో బలోపేతం చేస్తామని, తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘బకాయిల’పై సర్కారు సీరియస్
బోధన్, న్యూస్‌లైన్ : చెరుకు రైతులకు బకాయిల చెల్లింపులో ఫ్యాక్టరీ యాజమాన్యం జాప్యం చేయడాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. క్రషింగ్‌కు చెరుకు పంటను తరలించిన రైతులకు డబ్బులు చెల్లించాలని కేన్ కమిషనర్ ఆదేశించారు. పక్షంలోగా డబ్బులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) పరిధిలో బోధన్, కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబోజిపల్లి యూనిట్లకు రైతులు చెరుకు సరఫరా చేశారు. అయితే రైతులకు బిల్లు లు చెల్లించడంలో ఫ్యాక్టరీలు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తున్నాయి. ఈ మూడు యూనిట్ల పరిధిలో సుమారు రూ. 45 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. ఒక్క బోధన్ యూనిట్ పరిధిలోనే రూ. 10.50 కోట్ల బకాయిలున్నాయి. ఈ విషయమై చెరుకు రైతులు, బోధన్‌కు చెందిన నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కేన్ కమిషనర్ బద్రు మల్హోత్ను కలిశారు. రైతుల బాధలు వినిపిం చారు. దీనిపై ఆయన స్పందించి అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్లకు ఫోన్ చేశారు. ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి గతనెల 15వ తేదీన షోకాజ్ నోటీసులు జారీ చేశామని బోధన్ అసిస్టెంట్ కేన్ కమిషనర్ వివరించారు. మే 31 వరకు బకాయిలు చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మంగళవారం నోటీసులు పంపించామన్నారు. ఈ నోటీసు ప్రకారం పదిహేను రోజుల్లోగా ఫ్యాక్టరీ స్పందించకపోతే చట్ట ప్రకారం ఫ్యాక్టరీ ఆస్తులను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. క్రషింగ్ ప్రారంభం నుంచి వివాదమే 2013-14 క్రషింగ్ సీజన్ ప్రారంభం నుంచి బోధన్‌లోని శక్కర్‌నగర్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం వివాదాస్పదంగా వ్యహరిస్తోంది. 2013 నవంబర్ ఆఖరులో క్రషింగ్ ప్రారంభమవ్వాల్సిన సమయంలో క్రషింగ్‌ను నిలపివేసింది. రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ ప్రద్యుమ్న జోక్యం చేసుకున్నారు. దీంతో డిసెంబర్ 7వ తేదీన క్రషింగ్ ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకు సాగింది. ఈ సీజన్లో లక్షా 72 వేల టన్నుల చెరుకును క్రషింగ్ చేశారు. ధర విషయంలోనూ.. మద్దతు ధర విషయంలోనూ ఫ్యాక్టరీ ఏకపక్షంగా వ్యవహరించింది. టన్ను చెరుకుకు రూ. 3,500 మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరగా 2012-13 సీజన్లో చెల్లించినట్లుగా టన్నుకు రూ. 2,600 ప్రకటించింది. గత్యంతరం లేక రైతులు ఇదే ధరకు చెరుకును విక్రయించారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు 15 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదు. ముందుగా చెప్పినట్లుగా రూ. 2,600 చెల్లించాల్సి ఉండగా మొదటి నాలుగు రౌండ్లలో రూ. 2,400 చొప్పునే చెల్లించింది. ఐదో రౌంట్లో రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు మొత్తం రూ. 10.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులకోసం రైతులు మూడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఒప్పందాలను ఉల్లంఘించింది శ్రీనివాస్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, బోధన్ ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఒప్పం దాలను ఉల్లఘించింది. చెరుకు బిల్లులు సరఫరా చేసిన 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. చెరుకు సరఫరా చేసి నాలుగు నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఆర్‌ఆర్‌ఏ ప్రకారం నోటీస్ ఇచ్చాం జాన్ విక్టర్, అసిస్టెంట్ కేన్ కమిషనర్, బోధన్ ఆర్‌ఆర్‌ఏ ఫాం నెంబర్-1 ప్రకారం ఎన్డీఎస్ఎల్ యాజమాన్యానికి మంగళవారం నోటీసులిచ్చాం. 15 రోజుల్లో ఫ్యాక్టరీ స్పందించాలి. లేకపోతే ఫ్యాక్టరీ ఆస్తులు సీజ్ చేస్తాం.