ఈసారి వేరే సినిమా | Bigg Boss Syed Sohel Ryan Movie Launch Press Meet | Sakshi
Sakshi News home page

ఈసారి వేరే సినిమా

Published Fri, Dec 25 2020 6:06 AM | Last Updated on Fri, Dec 25 2020 6:06 AM

Bigg Boss Syed Sohel Ryan Movie Launch Press Meet - Sakshi

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 4’తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సయ్యద్‌ సోహైల్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘జార్జ్‌ రెడ్డి’, ‘ప్రెషర్‌ కుక్కర్‌’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోహైల్‌ స్నేహితుడు శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇంతవరకు సినిమా రాలేదు’’ అన్నారు అప్పిరెడ్డి. ‘‘నేను సోహైల్‌తో ఎన్నో కథలు పంచుకున్నాను. ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు దర్శకుడు. ‘‘బిగ్‌బాస్‌కు వెళ్లకముందు చాలా సినిమాల్లో నటించా. అవేమీ  గుర్తింపునివ్వలేదు. బిగ్‌ బాస్‌ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని చాలామంది అనుకుంటారు. నిజంగానే ఈ సినిమా వేరేగా ఉంటుంది. అన్ని వర్గాల మనసునూ గెలుచుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు సోహైల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement