కొంచెం క్రాక్‌ | Siddu Jonnalagadda is jaunty in New Year Day poster Release | Sakshi
Sakshi News home page

కొంచెం క్రాక్‌

Published Thu, Jan 2 2025 5:19 AM | Last Updated on Thu, Jan 2 2025 5:19 AM

Siddu Jonnalagadda is jaunty in New Year Day poster Release

‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్‌ – కొంచెం క్రాక్‌’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్‌ వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

 ‘‘సరికొత్త జోనర్‌లో ‘జాక్‌– కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది. ఫన్‌ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్‌గాడిగా కనిపించే జాక్‌ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement