posters release
-
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్‌పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్‌లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
విమానంలో చోరీ
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్‌హోస్టెస్‌గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్లో ‘లూట్కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్ల కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
ఓ సీత కథ
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న సినిమా ‘సీత’. రామబ్రహ్మాం సుకంర నిర్మిస్తున్నారు. అజయ్ సుకంర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌తో పాటు సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. పురాణాల్లో సీత ఫుల్ పాజిటివ్. ఆ సీతకు ఈ రీల్ సీతకు సంబంధం లేదు. ఈ రీల్ సీతలో కొత్త యాంగిల్ చూడబోతున్నామన్న మాట. ఈ సినిమాకు కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
లవ్లీకుమార్
‘జై’ వచ్చి మూడు నెలలైంది. జోరుగా హల్చల్ చేశాడు. స్టైలిష్‌గా, రఫ్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. సోమవారం ‘లవ’ వచ్చాడు. స్టైలిష్‌గా ఉన్నాడు. అయితే కూల్‌గా కనిపించాడు. ఇక, ‘కుశ’ ఎలా ఉంటాడో రానున్న రోజుల్లో చూస్తాం. హీరోగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ‘జై’ గెటప్‌ని ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మేలో విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని చూపించారు. వాస్తవానికి ఈ గెటప్‌కి సంబంధించి ఒక్క పోస్టర్ని మాత్రమే విడుదల చేయాలనుకున్నారు. అయితే, అన్నదమ్ములు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్లకు రెండు పోస్టర్లు నచ్చాయి. ఏది రిలీజ్ చేస్తే బాగుంటుందా? అని ఆలోచించి.. చివరకు ఎటూ తేల్చుకోలేక అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేశారు. రెండు ఫొటోలు విడుదల చేశారు. లవ అలియాస్ లవకుమార్ చాలా లవ్లీగా ఉన్నాడు కదూ! ఈ లుక్స్ చూసి అభిమానులు ఆనందపడిపోయారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు
మావోయిస్టులు మళ్లీ తమ ఉనికిని ఖమ్మం జిల్లాలో చాటుకున్నారు. చర్ల మండలం దానవాయిపేటలో మావోయిస్టుల పేరు మీద కొన్ని పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ రిక్రూట్మెంట్లను వెంటనే నిలిపివేయాలని, గిరిజనులపై పోలీసుల వేధింపులు ఆపాలని అందులో హెచ్చరించారు. గతం నుంచి కూడా ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఉనికి కనపడుతున్నా, గత కొన్నాళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఈ పోస్టర్ల రూపంలో తమ ఉనికిని వారు చాటుకున్నారు.