Vaishnavi Chaitanya
-
ముచ్చటగా మూడు
‘బేబీ’ సినిమాతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు తెలుగు అమ్మాయి వైష్ణవీ చైతన్య. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ‘జాక్’ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ముచ్చటగా మూడు సినిమాలకు సైన్ చేశారని సమాచారం.అది కూడా తెలుగులో కాదు... తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో ఓ స్టార్ హీరో ఫిల్మ్‌లో హీరోయిన్గా వైష్ణవి అవకాశం దక్కించుకున్నారని తెలిసింది. అలానే తెలుగులోనూ సినిమాలు చేసేందుకు వైష్ణవి కథలు వింటున్నారు. ఇలా ఈ ఏడాది వైష్ణవీ చైతన్య ఫుల్ బిజీగా ఉంటారని ఊహించవచ్చు. -
జాక్‌కు జోడీగా..
సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బీవీఎస్‌ఎన్స్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా శనివారం (జనవరి 4) హీరోయిన్స్ వైష్ణవీ చైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాక్: కొంచెం క్రాక్’ చిత్రం నుంచి ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, మేకర్స్ విషెస్ తెలిపింది. ఈ ఫన్స్ రైడర్ మూవీలో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. -
2024 ఫోటోలు షేర్ చేసిన బేబీ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
చాన్నాళ్లకు నిధి అగర్వాల్ అలా.. బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్
చాన్నాళ్లకు చీరలో కనిపించిన నిధి అగర్వాల్నవరాత్రి స్పెషల్ చీరలో అందంగా వితికా షేరుబ్లర్ ఫొటోల్లోనూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన 'బేబి' వైష్ణవిడస్కీ బ్యూటీ బ్రిగిడ.. వయ్యారాలు చూడతరమాబేబీ బంప్‌తో ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా ఆర్యభర్తతో రొమాంటిక్ పోజుల్లో హిందీ బ్యూటీ శివలీకాచుడీదార్లో చూడముచ్చటగా కృతి సనన్ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Ishwarya Vullingala🇮🇳 (@actress_ishwarya_vullingala) View this post on Instagram A post shared by Priya Reddy ♥️ (@sreepriya__126) View this post on Instagram A post shared by Vishnu Priya (@vishnupriyaaofficial) View this post on Instagram A post shared by Shivaleeka Oberoi Pathak (@shivaleekaoberoi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Malavika_Manoj (@malavika_manojj) View this post on Instagram A post shared by Reshma Pasupuleti (@reshmapasupuleti) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) -
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
69th Filmfare Awards 2024: ఐదు అవార్డ్స్‌తో సత్తా చాటిన ‘బేబి’
69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో ‘బేబి’ సినిమా సత్తా చాటింది. 8 నామినేషన్స్‌లో ఏకంగా 5 అవార్డులను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. (చదవండి: Filmfare South 2024: ఆ మూడు సినిమాలకే దాదాపు అవార్డులన్నీ..)కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డుల పరంగానూ ‘బేబి’ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ల్లోనూ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు సొంతం చేసుకుంది.(చదవండి: ఒక్క సినిమాకు ఆరు అవార్డులు.. కోలీవుడ్‌లో ఎవరికి వచ్చాయంటే?)అలాగే తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
దెయ్యాన్ని చూసి భయపడే కథలు చాలానే ఉన్నాయి. కానీ దెయ్యాన్ని ఇష్టపడి, తనతో ప్రేమలో పడటం ఎప్పుడైనా చూశారా? అలాంటి కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా లవ్ మీ: ఇఫ్ యూ డేర్. టీజర్, ట్రైలర్‌తో బాగుందనిపించిన ఈ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. హారర్ సినిమాలను ఇష్టపడేవారు వెంటనే సినిమాపై ఓ లుక్కేయండి..కథేంటంటే..అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) యూట్యూబర్స్. మూడనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహలను పోగొట్టేలా వీడియోలు తీస్తూ ఉంటారు. ఓసారి ప్రతాప్.. తమ ఊరిలో జరిగిన మిస్టరీ ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ అపార్ట్మెంట్లో దెయ్యం ఉందని, అక్కడికి వెళ్లినవారిని అది చంపేస్తుందని తెలుసుకుంటాడు. అది విన్న అర్జున్.. ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. తర్వాత ఏం జరిగిందన్నది ఓటీటీలో చూసి తెలుసుకోవాల్సిందే! చదవండి: హత్యపై దర్శన్ కుమారుడు కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర -
'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా? ఏమో మరి ఓ షోలో ఈమె సహ నటుడే ఈ విషయాన్ని బయటపెట్టాడు. దీంతో అది ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పబోయే శుభవార్త ఏంటి? ఇంతకీ ఏం చెప్పాడు?షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య.. పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది. ఎప్పుడైతే 'బేబి' మూవీలో హీరోయిన్గా చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్ల ఈమెకు హీరోయిన్గా టాలీవుడ్లో మంచి ఛాన్సులు వస్తున్నాయి. రీసెంట్గా 'లవ్ మీ' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'సుమ అడ్డా' షోలో పాల్గొన్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ చోట హీరో అశిష్.. వైష్ణవి చైతన్య త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందని అన్నాడు. వెంటనే అందుకున్న సుమ.. రీసెంట్గా పెళ్లి జరిగింది నీకు, చెబితే నువ్వు చెప్పాలి అని సెటైర్ వేసింది.మరి వైష్ణవి చైతన్య నుంచి గుడ్ న్యూస్ అంటే పెళ్లి ఏమైనా చేసుకోబోతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఏదైనా పెద్ద మూవీలో హీరోయిన్గా అవకాశమైనా వచ్చి ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2'.. శంకర్ మార్క్ కనబడట్లేదే?) -
'లవ్ మీ' సినిమాకు తొలిరోజు షాకింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?
గత రెండు వారాలుగా థియేటర్లని చాలా చోట్ల మూసేశారు. ఈ వీకెండ్ పలు చిత్రాలు రిలీజ్ కావడంతో అవి మళ్లీ తెరుచుకున్నాయి. ఇక వచ్చిన వాటిలో దిల్ రాజు నిర్మించిన 'లవ్ మీ'.. ఉన్నంతలో కాస్త ఆసక్తి రేపింది. మరీ అంతలా కాకపోయినా ఓ మాదిరి టాక్ తెచ్చుకుంది. కానీ తొలిరోజు వచ్చిన వసూళ్లు మాత్రం నెటిజన్లకు షాకిచ్చాయి. ఇంతకీ ఎన్ని కోట్లంటే?(ఇదీ చదవండి: 'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ)తెలుగులో హారర్ సినిమాలకు డిమాండ్ ఉంది. సరైన కథతో తీయాలే గానీ ఎప్పుడొచ్చినా సరే అలరించడం పక్కా. ఇప్పుడు దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ 'లవ్ మీ'. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజు రూ.4.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.అయితే థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటం అనే విషయంలో ఇంతకు ముందులా జనాలు ఆసక్తి చూపించట్లేదు. అయితే ఇప్పుడు 'లవ్ మీ' వసూళ్లు చూసిన తర్వాత నిజంగా అంతమంది జనాలు ఈ సినిమా చూడటానికి వచ్చేశారా? అనే సందేహం వస్తోంది. అలానే మూవీ రిజల్ట్ ఏంటనేది ఈ వీకెండ్ ఆగితే తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: '96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్) -
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. -
వైష్ణవి చైతన్య లేటెస్ట్ మూవీ అప్డేట్
-
ఆ గ్యాప్‌లో లవ్ మీ చేశా: ఆశిష్
ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. శిరీష్ సమర్పణలో ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆశిష్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘లవ్ మీ’లో నేను అర్జున్ అనే యూ ట్యూబర్ పాత్ర చేశాను. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం నా పాత్రకు ఉన్న ఓ లక్షణం. ‘లవ్ మీ’లో హారర్ అనేది ఓ భాగం మాత్రమే. ఇందులో మంచి లవ్‌స్టోరీ, చక్కని ఎమోషన్స్ ఉన్నాయి. కీరవాణి, పీసీ శ్రీరామ్గార్లు ఈ సినిమా ఒప్పుకోవడం మా తొలి విజయంగా భావించాం. కథలో పట్టు లేకపోతే వారు ఒప్పుకునేవారు కాదు కదా. ‘లవ్ మీ’కు సీక్వెల్ చేయవచ్చు. కానీ అది ‘దిల్’ రాజుగారి చేతిలో ఉంది. ‘రౌడీ బాయ్స్’ తర్వాత యాభైకి పైగా కథలు విన్నాను. అలా నా రెండో చిత్రంగా ‘సెల్ఫిష్’ స్టార్ట్ చేశాం. కానీ ఈ మూవీలోని క్యారెక్టర్‌ను మరింత బాగా చూపించవచ్చని కథపై మళ్లీ వర్క్ స్టార్ట్ చేశాడు ఈ చిత్రదర్శకుడు కాశీ. ఈ గ్యాప్‌లో నేను ‘లవ్ మీ’ చేశాను. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’లో సినిమా కమిట్ అయ్యా. మరో రెండు కథలు విన్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య న్యూ లుక్.. క్యూట్ ఫొటోలు
-
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
తెలుగుతనం ఉట్టిపడుతున్న ‘బేబీ’ గర్ల్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)