సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. బీవీఎస్‌ఎన్స్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది.
కాగా శనివారం (జనవరి 4) హీరోయిన్స్ వైష్ణవీ చైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాక్: కొంచెం క్రాక్’ చిత్రం నుంచి ఆమె కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, మేకర్స్ విషెస్ తెలిపింది. ఈ ఫన్స్ రైడర్ మూవీలో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment