jack
-
ఏప్రిల్‌లో జాక్
వేసవిలో థియేటర్స్‌కు రానున్నాడు జాక్. ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ . ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ 80శాతంపైనే పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘జాక్’ పూర్తి వినోదాత్మక చిత్రం. సిద్ధు పాత్ర అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అచ్చు రాజమణి. -
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
ఫుడ్ బిజినెస్ ప్రారంభించిన అలిబాబా జాక్‌మా
అలీబాబా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చేది జాక్‌మా, ఈకామర్స్ బిజినెస్. కానీ సంస్థ ఛైర్మన్‌గా వైదొలిగిన జాక్‌మా తాజాగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించారని తెలిసింది. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను విక్రయించే కొత్త సంస్ధను జాక్ మా మొదలుపెట్టారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అలీబాబా ఛైర్మన్‌గా జాక్ మా 2019లో తన పదవి నుంచి వైదొలిగారు. తాజాగా ఎఫ్ఎంసీజీ కంపెనీని స్థాపించినట్లు తెలిసింది. జాక్ మా ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేరు హంగ్‌ఝూ మా కిచెన్ ఫుడ్‌గా నిర్ణయించారు. జాక్ మా స్వస్ధలం హంగ్‌ఝూ. అదే పేరును తన కొత్త బిజినెస్‌కు పెట్టారని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఈ కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ మీల్స్, ఎడిబుల్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తుంది. కరోనా మహమ్మరి అనంతరం ప్యాకేజ్డ్ ఫుడ్‌కు డిమాండ్ పెరగడం, జీవన శైలి మార్పుల కారణంగా జాక్ మా ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక చైనాలో రాబోయే మూడేళ్లలో దేశీ రెడీ మీల్స్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందనుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
జాక్స్‌ని చాలా బాధ పెట్టా : పూరి జగన్నాథ్
తనకెంతో ఇష్టమైన శునకం జాక్స్ మృతిచెందడం, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ని కలచివేసింది. సినిమా కష్టాల వల్ల జాక్స్‌ని కొన్ని ఏళ్లపాటూ వదిలేయాల్సి రావడంతో వాడు హర్ట్ అయ్యాడని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకానొక సమయంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా స్నేహితుడికి ఇచ్చేశాను. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేశాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. నా దగ్గరకు రాడు, నావైపు చూడడు, తోక కూడా ఊపి ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యింది. నేను లైఫ్‌లో ఎంత మందిని బాధపెట్టానో నాకు తెలియదు. కానీ, వీడిని మాత్రం చాలా బాధపెట్టాను. వాడు ఇంకా లేడు, ఇదే వాడికి చివరి రోజు' అంటూ ట్వీట్ చేశారు. మీ కామెంట్ చదివితేనే గుండె బరువెక్కుతోంది. అలాంటిది మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలం.. జాక్స్ ఆత్మకు శాంతి చేకూరాలి కోరుకుంటున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. pic.twitter.com/XOXG9Tz0J7 — PURIJAGAN (@purijagan) April 16, 2019 -
కెమెరా, ఆడియోజాక్ లపై టేప్ అంటించిన జుకర్ బర్గ్..
లక్షలమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద ఫోటోను పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన మ్యాక్ బుక్ పై కెమెరా, ఆడియో జాక్ లను టేప్ తో కవర్ చేయడం కనిపించింది. తన సామాజిక ఖాతాల పాస్వర్డ్ లు హ్యాక్ అయిన తర్వాత ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియో జాక్ లపై టేప్ అటించినట్లు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియా సైట్లతోపాటు, నెట్ బ్యాంకింగ్ ఖాతాలు ఇటీవల హ్యాకర్ల చేతుల్లోకి వెడుతున్నాయని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అటువంటి బాధితుల జాబితాలో సామాన్యులే కాక, ఏకంగా ప్రపంచ దిగ్గజాలు కూడ ఉంటున్నారు. అదే విషయంలో సోషల్ మీడియా దిగ్గజం మార్క్ జుకర్ బర్గ కూడ నిర్లక్ష్యం వహించి తన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలకు ఒకేరకమైన పాస్వర్డ్ పెట్టడంతో ఆయన ఖాతాలుసైతం హ్యాక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ నెలవారీ వినియోగదారులు 500 మిలియన్లు దాటిన సంతోషకర సందర్భంలో జుకర్ బర్గ్ ఓ హాస్యాస్పద చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ చిత్రంలో జుకర్ బర్గ్ చేతిలో ఓ చెక్క ఫ్రేమ్ పట్టుకొని ఉండగా, ఆయన వెనుక ఆయన ల్యాప్ ట్యాప్ కనిపిస్తుంది. ఆ సన్నివేశం చూస్తే ఆయనేదో సందేశం ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా ఆ ఫోటోను పరీక్షగా చూసిన ట్విట్టర్ వినియోగదారుడు క్రిస్ ఓల్సెన్.. జుకర్ బర్గ్ ల్యాప్ టాప్ కెమెరాను, టేప్ ప్ తో కవర్ చేశారంటూ కామెంట్ చేశాడు. అధునాతన హ్యాకర్లు కెమెరాద్వారా ల్యాప్ టాప్ ను నియంత్రిస్తారు. అందుకే జుకర్ బర్గ్ ఆయన మ్యాక్ బుక్ కెమెరా, ఆడియోజాక్ లను టేప్ తో చుట్టేశారంటూ మరో వినియోగదారుడు గిజ్మోడో తన కామెంట్లో జుకర్ బర్గ్ పై ఛలోక్తి విసిరాడు. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవేట్ సంభాషణలు, ప్రైవసీని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన ఫేస్ బుక్ సీఈవో.. ఇలా తన ప్రైవసీని కాపాడుకోవడానికి పడుతున్నతాపత్రయం అందరికీ ఆసక్తికరంగా కనిపిస్తోంది. జుకర్ బర్గ్ తన వెబ్ క్యామ్ కు కూడ టేప్ వేసి ఉంచినట్లు తాను ఇదివరకే ఓ సందర్శంలో గమనించాని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ చెప్తుండగా...కొన్నేళ్ళ క్రితంనుంచే ఆమెరికా ప్రభుత్వం సీక్రెట్ గా తమ పౌరులను వెబ్ క్యామ్ ల ద్వారా పరిశీలిస్తోందని క్వాంటికోలోని ఎఫ్ బీ ఐ ఆపరేషనల్ టెక్నాలజీ డివిజన్ లో మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మార్కస్ థామస్ చెప్తున్నారు. సో... తనదాకా వస్తే కానీ అన్న సామెత ఇక్కడ జుకర్ బర్గ్ కు కూడ వర్తింస్తోందన్న మాట. -
ఐ ఫోన్ 7లో కొత్త లీక్..!
ఆపిల్ మొబైల్ అంటేనే ఒక క్రేజ్..! మరి ఆ క్రేజీ థింగ్ లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే.. ప్రస్తుతం వస్తున్న లీక్ లు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇచ్చిన ఇంటర్వూలో రాబోయే రోజుల్లో ఐఫోన్ 7 లేకుండా ఉండలేరు అని చెప్పకనే చెప్పారు. మరి అది నిజమయ్యేలానే ఉంది. ఈ లీకులను చూస్తోంటే.. ఆపిల్ హెడ్ ఫోన్స్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కనిపించిన చిత్రాల్లో హెడ్ ఫోన్స్ పెట్టే 3.5 ఎమ్ఎమ్ జాక్ ను లేకుండా ఫోన్ కనిపించింది. దీనికి బదుల ప్రత్యేకంగా ఫోన్ కోసం తయారుచేసిన బీట్స్ బ్లూటూత్ హెడ్ సెట్ ను విక్రయించే విషయం ఆలోచిస్తోందని మరో లీక్..! కెమెరాలో కూడా మార్పులకు సిద్ధమవుతున్నట్లు మరో లీక్ లో వెల్లడైంది. రెండు ఐసైట్ కెమెరాలను ఫోన్ లో వాడనున్నట్లు తెలిసింది. ఏదేమైనా కొత్త డిజైనింగ్ తో కనిపిస్తున్న ఐఫోన్ 7 వినియోగదారులకు కొత్త అనుభవాన్ని మిగులుస్తుందని ఆశిద్దాం. -
ఇక ఐఫోన్లో ఆ ఫీచర్ ఉండదా!
న్యూయార్క్: లేటెస్ట్ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలతో ఊపుమీదున్న ఆపిల్.. 2016లో మార్కెట్లోకి తీసుకురానున్న కొత్త ఐఫోన్ మోడల్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే కొత్త మోడల్ ఐ ఫోన్లో హెడ్సెట్ జాక్ ఆప్షన్‌ను తీసేస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు జపనీస్ బ్లాగ్ 'మకోటకర' ప్రకటించింది. గతంలో ఇది ఐ ఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ ఫీచర్లను కూడా సరిగా అంచనా వేయడంతో హెడ్సెట్ జాక్ కనుమరుగవుతుందనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. అయితే 3.5 ఎమ్ఎమ్ హెడ్సెట్ జాక్‌కు బదులుగా లైటెనింగ్ పోర్ట్ ద్వారానే హెడ్‌సెట్‌ను అనుసంధానం చేసేలా దీనిని రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వైర్లెస్ హెడ్ఫోన్ల వాడకం పెరగడం, రానున్న మోడల్లో ఐ ఫోన్ మందం మరింత తగ్గించే చర్యల్లో భాగంగా ఆపిల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
క్యాలెండర్ కాదనర్హం.....
తెలుసుకుంటే పాతకాలం సంగతులు కూడా తమాషా. జాక్ లండన్ రోజుకు వెయ్యి పదాలు రాస్తానని పంతం పట్టి, రోజంతా ఎన్ని బేకార్ పనుల్లో ఉన్నా, అర్ధరాత్రయినా సరే అన్ని పదాలూ రాసి నిద్రపోయేవాడట. మార్క్ టై్వన్ సంగతి తెలిసిందే. ప్రతి ముక్కా నిలబడే రాసి తానొస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయినా లేచి నిలబడేంత పేరు సంపాదించాడు. ఇక హెమింగ్వేకు తెల్లవారుజామున మొదటి సూర్య కిరణం తాకుతుండగా రాయడం అలవాటు. జేమ్స్ జాయిస్ మంచం పై పొట్ట మీద వాలి (బోర్లా పడుకొని) రాయడం అందరికీ తెలుసు. మన కొ.కు కూడా సాయంత్రం చందమామ ఆఫీస్ నుంచి వచ్చీ రాగానే ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి ఇంటి హాలులో నేలపై పొట్ట మీద వాలి రాసుకుంటూ ఉండిపోయేవారట. అయితే కొందరు భావుకుల కథ వేరే. కొబ్బరి మీగడలాంటి కాగితం సుతారంగా నడిచే కలం కనబడటమే తరువాయి రాయడానికి పూనుకునేవారట మల్లాది రామకృష్ణశాస్త్రి. జాతక కథలను నేరుగా పాళీ నుంచి తెలుగులోకి అనువదించిన తల్లావఝల శివశంకరశాస్త్రి తాను ఏ పుస్తకం రాస్తూ ఉన్నా పక్కన పరిమళాలీనే ఒక పువ్వును ఉంచుకునేవారట. ఆచంట జానకీరామ్ కూడా అంతే. రాసేటప్పుడైనా, చదివేటప్పుడైనా తన ఎడమ చేతి గుప్పిట్లో రెండు మూడు గండుమల్లెలని ఉంచుకొని వాటి సువాసన ఆస్వాదిస్తూ రచనాలోకాల్లో విహరించేవారట. విశ్వనాథకు మధ్య మధ్య ఇంగ్లిష్ సినిమాల సైరు ఉంటే తప్ప కలం కదిలేదు కాదు. చలం మహాశయునికి ఈ గొడవంతా లేదు. ఎండ కావాలని, వాన కావాలని, వరండా కావాలని, వెన్నెల కావాలని అనేవారు కాదట. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది లోపల ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రాసేవారట. తొమ్మిది తర్వాత బంద్. కాకి అరిచినా పిల్లలు గోల చేసినా మూడ్ ఏ మాత్రం డిస్ట్రర్బ్ అయ్యేది కాదట. వాళ్ల గోల వాళ్లదే. ఈయన రాత ఈయనదే. పతంజలి చేతివేళ్లు చాలా బలంగా దృఢంగా చివర్లు కూసుగా ప్రొక్లయినర్ పళ్లలాగా ఉండేవి. ఆయన ఒక చేత్తో సిగరెట్ వెలిగించి ఒక చేత్తో పెద్ద పెద్ద అక్షరాలతో చకచకమని రాయడం- నల్లకుంటలో- ‘రాజుల లోగిళ్లు’ నవల అనుకుంటాను- చూశాను. మరి నెలలు నిండాయని గ్రహించక, సరంజామా దగ్గర ఉంచుకోక, ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యి లబోదిబోమంటుండగా, రాయడానికి ఏమీ దొరక్క గోడకు తగిలించి ఉన్న పంచాంగం క్యాలెండర్ అందుకొని పేజీల వెనుక వైపంతా గబగబా కథ రాసిన సందర్భాలు పెద్దిభొట్ల సుబ్బరామయ్యకు ఉన్నాయి. ‘ఫినిష్డ్ స్టోరీస్’ అంటారు. అంటే లోలోపలే కథంతా సంపూర్ణంగా తయారయ్యి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆటంకాలు అవరోధాలు లేకుండా బయట పడటం. సింగిల్ డ్రాఫ్ట్. దీనికి లోపల చాలా కసరత్తు జరగాలి. అందుకు చాలా అనుభవం కావాలి. కాని చాలామంది రాస్తూ రాస్తూనే తమకు కావలసిన కథను వెతుక్కుంటూ ముందుకు సాగుతారు. హెమింగ్వే ఇలాంటి సాధనే చేశానని చెప్పుకున్నాడు. అన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా సరే- రాయడం, తిరగ రాయడం తప్పని సరి. ఈ చూసుకోవడం సరి చేసుకోవడమే జీవితాంతం ఈ వెర్రిబాగులకు సిరి. - ఖదీర్ -
ఓపెన్ సెసేమ్...ఇదిగో ‘అలీబాబా’ విజయరహస్యం!
చైనాకు చెందిన ‘అలీబాబా’ కంపెనీ తన వెబ్ పోర్టల్స్ ద్వారా సేల్స్ సర్వీస్‌లు అందిస్తూ ‘ఇ-కామర్స్’ దిగ్గజంగా ఎదిగింది. మొన్నటికి మొన్న ‘సింగిల్స్ డే’ వ్యాపార ఉత్సవంలో సరికొత్త రికార్డ్ సృష్టించి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ‘అరేబియన్ నైట్స్’ కథల్లో నిధి ఉన్న గుహద్వారం తెరవడానికి అలీబాబాకు ‘ఓపెన్ సెసేమ్’ మంత్రం ఉపయోగపడింది. ‘నిధి, మంత్రం... రెండూ నీలోనే ఉన్నాయి. సత్తా, సామర్థ్యం నీలో ఉన్న నిధులు. అయితే కష్టించడం, కొత్తగా ఆలోచించడం అనేవి గుహ ద్వారాలు తెరిచే మంత్రాలు’ అంటాడు ‘అలీబాబా’ అనే ఇ-కామర్స్ దిగ్గజం జాక్ మా. చైనాలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన జాక్ మా ఇప్పుడు చైనాలోనే అత్యంత సంపన్నుడు. ఈ అలీబాబాకు మంత్రం కంటే మనోధైర్యమే ఉపయోగపడింది. ఒక్కసారి ఆయన జీవితంలోకి వెళ్లొద్దాం.... ఇంగ్లిష్ అనేది ప్రపంచ భాష. ఇంగ్లిష్ వస్తే ప్రపంచంతో సంభాషించే అవకాశం వచ్చినట్లే. అందుకే ఇంగ్లిష్ అంటే జాక్ మాకు ఇష్టం. కానీ, చైనాలో ఇంగ్లిష్ అనేది అరుదుగా మాత్రమే వినబడేది. పాఠశాలలో నేర్చుకున్న ఇంగ్లిష్ వల్ల కూడా అంతంత మాత్రమే ఉపయోగం ఉండేది. దీంతో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి హైస్కూలు రోజుల్లోనే రంగంలోకి దిగాడు జాక్. ఎండైనా, వానైనా, చలైనా లెక్క చేయకుండా బైక్ మీద విదేశీ పర్యాటకులను వెతుక్కుంటూ వెళ్లేవాడు. వారితో తనకొచ్చిన ఇంగ్లిష్ మాట్లాడేవాడు. వారు మాట్లాడుతున్నది జాగ్రత్తగా వినేవాడు. అలా ఎనిమిదేళ్ళలో జాక్ మాకు ఇంగ్లిష్ మీద మాంచి పట్టు వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్లొచ్చిన తరువాత... విదేశీ పర్యాటకులతో మాట్లాడడం అనే సరదాలో భాగంగా చైనాకు వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ కుటుంబంతో జాక్‌కు పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. పరస్పరం ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుకొనేవారు. వారి ఆహ్వానం మేరకు ఒకసారి వేసవి సెలవుల్లో ఆస్ట్రేలియా వెళ్లి నెలరోజులు గడిపాడు జాక్. ‘‘ప్రతి విషయం గురించి కొత్తగా ఆలోచించడం ఎలాగో అప్పటి నుంచే అలవడింది’’ అంటాడు జాక్. ఒక్క ఉద్యోగమూ రాలేదు! ఉద్యోగప్రయత్నాల్లో ఉన్నప్పుడు... అదృష్టమో, దురదృష్టమో గానీ జాక్‌కు ఒక్క ఉద్యోగమూ రాలేదు. చివరి ప్రయత్నంలో మాత్రం ‘కెంటకీ ఫ్రైడ్ చికెన్’ (కె.ఎఫ్.సి)లో జనరల్ మేనేజర్‌కు సెక్రటరీగా ఉద్యోగం వచ్చింది. ఒక వ్యాపార సదస్సులో పాల్గొనడానికి సీటెల్ (అమెరికా)కు వెళ్లిన జాక్ తొలిసారిగా మిత్రుడి ద్వారా ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు. నిజానికి పర్సనల్ కంప్యూటర్, ఇ-మెయిల్స్ గురించి జాక్‌కు అప్పటి వరకు బొత్తిగా తెలియదు. ఎప్పుడూ కీబోర్డ్‌ను టచ్ చేసింది కూడా లేదు. అలా మొదలైంది! ఇ-కామర్స్ అనే మాట వినబడుతున్నప్పటికీ అప్పటికి అది ఇంకా చైనాలో వ్యాప్తిలోకి రాలేదు. ఆ సమయంలో జాక్‌కు తనకంటూ ఒక ఇ-కామర్స్ కంపెనీ ఉండాలనే ఆలోచన వచ్చింది. 1999లో జాక్ తన ఇంటికి 18 మందిని పిలిచి ‘ఇ-కామర్స్’ గురించి తన ఆలోచనను వాళ్లతో పంచుకున్నాడు. రెండు గంటల సమావేశం తరువాత ఆ 18 మంది తమ వాటాగా తలా కొంత డబ్బును టేబుల్ మీద పెట్టారు. కంపెనీ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైనది కావాలనుకున్నాడు. అలా అలీబాబా కథ తెర మీదికి వచ్చింది. ‘ఓపెన్ సెసేమ్’ అంటూ నిధులున్న గుహ ముందు అలీబాబా ఇచ్చే ఆదేశం గురించి తెలియంది ఎవరికి! అందుకే ‘అలీబాబా’ అనేది గ్లోబల్ నేమ్‌గా అనిపించి ఆ పేరే తన కంపెనికీ పెట్టాడు జాక్ మా. ఏమీ లేక పోయినా... ‘గ్లోబల్ విజన్’ ఉండగానే సరిపోదు. దానికి ‘స్థానికత’ కూడా తోడవ్వాలి అని నమ్మాడు జాక్. పెద్దగా డబ్బు లేకపోయినా, సాంకేతిక జ్ఞానం అంతంతమాత్రంగానే ఉన్నా, ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం లాంటి జాగ్రత్తలు పాటించాడు. మిగిలిన చైనా కంపెనీలలాగా అమెరికా మోడల్‌ను కాపీ కొట్టకుండా తనదైన విధానానికి రూపకల్పన చేసుకున్నాడు. అలాగే, నాణ్యత మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. అంతే! ‘అలీబాబా’ ఇ-కామర్స్ కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కువ విజయమే సాధించింది. భవిష్యత్తులో... పది లక్షల ఉద్యోగాలను సృష్టించడం, చైనా ఆర్థిక-సామాజిక పరిస్థితులను మార్చడం, చైనాను ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా తీర్చిదిద్దడం... ఇవన్నీ తన ఆశయాలని చెబుతున్నాడు జాక్ మా. సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అసాధారణ విజయం సాధించిన జాక్ మా తన సరికొత్త ఆశయాన్ని నెరవేర్చుకుంటాడు అనడంలో అణుమాత్రమైనా సందేహం లేదు! సామాజిక స్పృహ ఏడేళ్ళ క్రితం... సూప్ కోసం షార్క్‌లను చంపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘నాతో పాటు నా కుటుంబసభ్యులు ‘షార్క్ సూప్‌ను జీవితంలో ముట్టం’’ అని నిర్ణయం తీసుకున్నాడు జాక్. అంతేకాదు... అలీబాబా గ్రూప్ తన ఇ-కామర్స్ వేదిక నుంచి ‘షార్క్ ఫిన్ సూప్’ ఉత్పత్తుల అమ్మకాన్ని నిషేధించింది. అలాగే, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి కూడా తగిన ప్రణాళికలు వేసుకుంటున్నాడు జాక్. ‘అలీబాబా’ వార్షిక ఆదాయం లో కొంత మొత్తాన్ని... పర్యావరణ పరిరక్షణ సంబంధ కార్యక్రమాలకు కేటాయిస్తున్నాడు. నేనూ... నా తత్త్వం! జాక్ మా కరడుగట్టిన వ్యాపారి కాదు. వ్యాపారం చేయడం, అందులో విజయం సాధించడం అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటాడు. ఒక రచయితలా, తాత్వికుడిలా జీవితానికి సంబంధించి భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఆయన ఆలోచనలలో కొన్ని... విజయ సాధనకు కష్టపడడం ఎంత ముఖ్యమో, ఓర్పు అంత కంటే ముఖ్యం. రాత్రికి రాత్రే విజయాలు రావు. అందుకే అంటాను... ఓపిక అత్యవసరం అని! నన్ను నేను సాధారణ మనిషి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. నాకు తెలిసిన సాంకేతిక జ్ఞానం చాలా తక్కువ. తెలిసినదాన్ని నా దృష్టితో కాకుండా సామాన్యులైన వినియోగదారుల దృష్టి నుంచే చూడడానికి ఇష్టపడతాను. నీ పోటీదారు నుంచి నేర్చుకో! కానీ మక్కికి మక్కీ కాపీ కొట్టకు. అలా చేస్తే నీకు నువ్వు హాని చేసుకున్నట్లే! నిజంగా చెప్పాలంటే నేను ఎంతమాత్రం సంతోషంగా లేను. ‘చైనాలో అత్యంత సంపన్నుడు’ అనే గుర్తింపు నన్ను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తోంది. అయినప్పటికీ నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను సంతోషంగా లేకుంటే నా సహచర సిబ్బంది సంతోషంగా ఉండరు. వారు లేకపోతే వినియోగదారులు ఉండరు. వ్యాపార విజయాలు మాత్రమే నాలో సంతోషాన్ని నింపవు. ఈ జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి చాలా అంశాలు ఉన్నాయి. -
జాక్.. ఒక జెమ్..!
స్కూల్, కాలేజీ స్థాయి సైన్స్ ఫెయిర్లలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూనే ఉంటారు. మాస్టార్ల పర్యవేక్షణల్లో చదువుకొచ్చిన సిద్ధాంతాల ఆధారంగా ప్రయోగపూర్వకంగా ప్రతిభను చాటుతూ ఉంటారు.. ఇలాంటి నేపథ్యమే ఉన్న హైస్కూల్ స్టూడెంట్ జాక్ పాల్గొన్నది కూడా సైన్స్ఫెయిరే! అయితే దానికి పర్యవేక్షకుడు అమెరికన్ అధ్యక్షుడు. జాక్ ప్రయోగం చేస్తున్నది వైట్‌హౌస్ లాన్లో... కొన్ని వందల మంది తలపండిన ప్రొఫెసర్ల మధ్య... మరి అంత చిన్నోడి కి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది! అంత పెద్ద పరీక్ష ఎందుకు? అంటే.. అది కష్టమూ కాదు, అతడికి పరీక్ష కాదు. అతడు ఆవిష్కరించిన అద్భుతానికి రుజువు ఆ కార్యక్రమం! అప్పటికే కొన్ని వందల ప్రయోగశాలల చుట్టూ తిరిగాడతను. అలాగే, తన ఆలోచన గురించి అనేకమంది ప్రొఫెసర్లకు చెప్పి చూశాడు. అయితే అందరూ అతడి వయసు, చదువు గురించి ఆలోచించారు కానీ.. అతడి థియరీలోని సత్తా గురించి ఎవ్వరూ ఆలోచించినట్టు లేదు. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన జాక్ ఆండ్రకాకు ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. అతడి థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా ఆ మహానుభావులెవరూ అడగలేదంటే... వారికి ఇతడు చెబుతున్న విషయం ఎంత అసంబద్ధంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికీ నిరాశ చెందక అతడు కొనసాగించిన ప్రయత్నమే క్లోమానికి సంబంధించిన క్యాన్సర్ల గుర్తింపులో కీలకావిష్కరణకు దారి తీసింది. అతడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. మనిషిని చాలా తొందరగా మృత్యుముఖానికి తీసుకెళ్లే క్యాన్సర్లలో ఒకటి క్లోమగ్రంథికి వచ్చే క్యాన్సర్. తొలిదశలోనే దీన్ని గుర్తించకపోతే మరణానికి సిద్ధపడిపోవడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి క్యాన్సర్‌తోనే మరణించాడు జాక్ వాళ్ల అంకుల్. తను అమితంగా అభిమానించే ఆయన మరణానికి కారణం గురించి తెలుసుకొన్న అతడికి నిద్రపట్టలేదు. అప్పుడతనికి నిండా పదిహేనేళ్లు కూడా లేవు. అయితేనేం ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ గురించి పరిశోధించాడు. ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తికాకపోయినా.. వైద్యరంగ పరిశోధకుడిగా మారిపోయాడు. రక్తంలో ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ కారకాలను గుర్తించే సెన్సర్‌ను రూపొందించాడు. మరి మహా వైద్య పరిశోధకులకే సవాలుగా మారిన ఆ వ్యాధి గురించి ఈ హైస్కూల్ విద్యార్థి వివరిస్తే ఎవరు వింటారు? ఆ వ్యాధిని తాను ప్రాథమిక దశలోనే గుర్తించగలనని అంటే ఎవరు నమ్ముతారు?! ఇలాంటి అహం చాలామంది పరిశోధకులను ఆ కుర్రాడి థియరీ ని జోక్‌గా తీసుకొనేలా చేసింది. అతడు చెబుతున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా అడగకుండా అనేక మంది పొమ్మన్నారు. అయినప్పటికీ జాక్ నిరాశపడలేదు. దాదాపు వందమంది ప్రొఫెసర్ల చుట్టూ తిరిగినా.. ఏ ఒక్కరూ ప్రయోగానికి కూడా ఆతడికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికీ జాక్ వెనుదిరగలేదు, వెనక్కు తగ్గలేదు. వయసుతో ఉన్న ఉత్సాహమో, తన ఆలోచనపై ఆత్మవిశ్వాసంతోనో కానీ అనేక పరిశోధనాలయాల అడ్రస్‌లు వెదికిపట్టుకొని తన థియరీని వివరించాడు. చివరకు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్లు జాక్ ఐడియాను గుర్తించారు. ప్రయోగపూర్వకంగా థియరీని నిరూపించడానికి అవకాశం ఇచ్చారు! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటివరకూ ఉన్న సెన్సర్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! ఆ ఆశ్చర్యానికి రెండు కారణాలు.. వైద్యవిధానంలో నవ్యమైన ఆవిష్కరణ చూడటం ఒకటైతే.. ఒక హైస్కూల్ స్టూడెంట్ దాన్ని రూపొందించడం మరోటి. హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనశాల మొదలు... వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ఒబామా ముందు జాక్ ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగశాల వరకూ.. అనేకసార్లు ఈ టీనేజర్ సెన్సర్‌కు సంబంధించిన థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. మొదట్లో ఇతడి థియరీని ఏమాత్రం పట్టించుకోని పరిశోధకులు కూడా తర్వాత జాక్‌ను వేనోళ్ల ప్రశంసించారు. ఇతడు రూపొందించిన సెన్సర్ అత్యంత వేగవంతంగా పనిచేయడమే కాక, అతి చౌకగా అందుబాటులో ఉంటుందని ధ్రువీకరించారు. ఇంటెల్ ఇంజనీరింగ్ ఫెయిర్-2012లో జాక్ ప్రతిభను మెచ్చి 75 వేల డాలర్ల గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు నిర్వాహకులు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు వాడైన జాక్ ఐడియాకు ఇంతకుమించిన పురస్కారం ఏమిటంటే... అతడు రూపొందించిన సెన్సర్‌ను ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు. మరి టీనేజ్‌లో ఇంతకుమించిన సాఫల్యం ఏముంటుంది! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటి వరకూ ఉన్న సెన్సార్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! -
కార్ల బీమా ప్రీమియంలకు రెక్కలు
ముంబై: ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి విలువ భారీగా క్షీణించిన నేపథ్యంలో కార్ల బీమా ప్రీమియానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కార్ల తయారీలో వినియోగించే విడి భాగాలను కొన్నింటిని దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఇటీవల కార్ల ధరలు పెరుగుతున్నాయి. దీంతో కారు ధర ఆధారంగా నిర్ణయమయ్యే బీమా ప్రీమియాల్లోనూ పెరుగుదలకు అవకాశమున్నదని సాధారణ బీమా రంగ నిపుణులు తెలిపారు. సాధారణంగా కారు ధరను బట్టి బీమా ప్రీమి యం ఉంటుందని, అయితే ఇటీవల దిగుమతి చేసుకునే విడిభాగాల ఖరీదు పెరగడం వల్ల ఆటో కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయని భారతీ ఆక్సా సాధారణ బీమా విభాగం సీఈవో అమరనాథ్ అనంతనారాయణ్ చెప్పారు. వెరసి బీమా ప్రీమియంలు 15-20% పెరిగే అవకాశముందన్నారు. మే నెల తరువాత రూపాయి విలువ 20% పతనమైన సంగతి తెలిసిందే.