ఇక ఐఫోన్‌లో ఆ ఫీచర్ ఉండదా!
న్యూయార్క్: లేటెస్ట్ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలతో ఊపుమీదున్న ఆపిల్.. 2016లో మార్కెట్లోకి తీసుకురానున్న కొత్త ఐఫోన్ మోడల్ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే కొత్త మోడల్ ఐ ఫోన్లో హెడ్సెట్ జాక్ ఆప్షన్ను తీసేస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు జపనీస్ బ్లాగ్ 'మకోటకర' ప్రకటించింది. గతంలో ఇది ఐ ఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ ఫీచర్లను కూడా సరిగా అంచనా వేయడంతో హెడ్సెట్ జాక్ కనుమరుగవుతుందనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది.
అయితే 3.5 ఎమ్ఎమ్ హెడ్సెట్ జాక్కు బదులుగా లైటెనింగ్ పోర్ట్ ద్వారానే హెడ్సెట్ను అనుసంధానం చేసేలా దీనిని రూపొందిస్తున్నారు. ఇటీవలి కాలంలో వైర్లెస్ హెడ్ఫోన్ల వాడకం పెరగడం, రానున్న మోడల్లో ఐ ఫోన్ మందం మరింత తగ్గించే చర్యల్లో భాగంగా ఆపిల్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.