
కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్‌లో బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) తెలుగమ్మాయిలపై చేసిన కామెంట్స్ వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం అవుతుందో బాగా తెలిసిందని..ఎస్‌కేఎన్ అనడం.. ఆ వాఖ్యలు తన చివరి సిసిమా ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించే చేశారంటూ బాగా ట్రోల్ చేశారు. ఆ మరుసటి రోజే ఎస్‌కేఎన్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పటికే తాను ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్‌గా మార్చానని.. మరో 25 మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) ఈ వివాదంపై స్పందించారు.
ఆమె హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘జాక్’(Jack). సిద్ధు జొన్నలగడ్డ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీ నుంచి ‘కిస్’ (kiss Song) సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎస్‌కేఎన్ కామెంట్స్‌పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది.
దీనిపై వైష్షవి స్పందిస్తూ.. ‘ఎన్‌కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు. ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వివాదంపై ఆయన ఓ వీడియో కూడా చేసి పెట్టారు. నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేనెందుకు స్పందిస్తాను’ అని బదులిచ్చింది. అలాగే ఎస్‌కేఎన్ బ్యానర్‌లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ.. ‘బేబీ టీమ్‌తో చేయాల్సిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరో చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఆ టీమ్‌తో కలిసి పని చేయడం నాకు మంచి అనుభవం’ అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment