SKN
-
టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం గేమ్ ఛేంజర్(Gam Changer Movie). శంకర్(sankar) డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.186 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.వెంటాడుతున్న పైరసీ..అయితే సినీ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా వైరస్ పైరసీ. తాజాగా గేమ్ ఛేంజర్‌లో విషయంలోనూ పైరసీ ఇండస్ట్రీని షాకింగ్‌కు గురి చేస్తోంది. ఏకంగా లోకల్ ఛానెల్లో గేమ్ ఛేంజర్‌ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో పైరసీ అంశం మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్( శ్రీనివాస కుమార్) రియాక్ట్ అయ్యారు. వేలమంది శ్రమ దాగి ఉన్న సినిమాను వారం రోజులు కాకముందే ప్రసారం చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్కేఎన్ తన ట్విట్లో రాస్తూ.. 'ఇది ఏమాత్రం సహించదగినది కాదు. సినిమా విడుదలై కేవలం 4-5 రోజులు మాత్రమే అయింది. వారం రోజులు కాకముందే సినిమాను స్థానిక కేబుల్ ఛానల్స్, బస్సులలో ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. సినిమా అనేది కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతల గురించి మాత్రమే కాదు. ఎంతోమంది మూడు, నాలుగు సంవత్సరాల కృషి, వారి అంకితభావం, వేలాది మంది శ్రమ దాగి ఉంది. ఈ సినిమా విజయంపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి చర్యలు వారి కష్టాన్ని దెబ్బతీయడమే కాదు.. చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ప్రమాదకరం కూడా. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాను రక్షించడానికి.. సినీ ఇండస్ట్రీ మెరుగైన భవిష్యత్తు కోసం మనందరం ఐక్యంగా నిలబడి పోరాడుదాం.' అని పోస్ట్ చేశారు. అంతే కాకుండా 'సేవ్‌ది సినిమా' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు.లీక్ చేస్తామంటూ బెదిరింపులు..తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ ఛేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కొందరు బెదిరించారు. వారిపై చిత్రబృందం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. విడుదలకు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని.. సినిమా విడుదల కాగానే ఆన్లైన్లో లీక్ చేశారని మూవీ టీమ్ ఫిర్యాదులో పేర్కొంది.దీనిపై ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ ప్రచారం చేస్తున్న కొన్ని ఖాతాల పైనా కూడా చిత్రబృందం ఫిర్యాదు చేసింది. This is unacceptable. A film that was released just 4-5 days ago being telecasted on local cable channels & Buses raises serious concerns. Cinema is not just about the Hero, director or producers – it’s the result of 3-4 years of hard work, dedication and the dreams of thousands… https://t.co/ukPHIpi6ko— SKN (Sreenivasa Kumar) (@SKNonline) January 15, 2025 -
హీరోకు సలహా ఇచ్చిన ఎస్కేఎన్..
నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". అమర్ కామెపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఓయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎం.సి.రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలిచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో.. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ అవడం లేదు. అలాంటి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ టెక్నికల్ క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ అమర్ గారు ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న దర్శకుడిలా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. బేబి హిందీ వర్షన్ ఎక్కడిదాకా వచ్చిందంటే?మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్‌గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది. నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. మా బేబీ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ హందీ వెర్షన్ పనులు జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి అన్నారు. -
'పుష్ప-2 చూశా'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. తాజాగా పుష్ప-2 మూవీపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. 'ఓ వారం క్రితం పుష్ప-2 రెండు సీన్స్ చూశా. అల్లు అర్జున్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఏడేళ్లలో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను కొట్టేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది. ఒక యాక్టర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అలా ఉంటది. ఒక డైరెక్టర్ క్రియేటివిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటది. అందరికీ కూడా టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడు.. అలాంటి ప్రొడక్ట్ మాత్రమే వస్తది. అది చూసినప్పుడు నాకు అలా అనిపించింది. డిసెంబర్లో రిలీజయ్యే పుష్ప-2 తెలుగు సినిమాను ఇంకోస్థాయికి తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నా' అని అన్నారు.అంతేకాకుండా ప్రభాస్ ది రాజాసాబ్ గురించి ఆయన మాట్లాడారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 23 నుంచి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రారంభమవుతాయని నిర్మాత శ్రీనివాస కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. -
గుర్తింపు కోసం పాకులాట.. అందుకే ప్రభాస్‌పై అలాంటి కామెంట్స్
జనాలు ఎంతగానో ఆదరించిన కల్కి మూవీపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. సినిమా తనకు నచ్చలేదని, ప్రభాస్ లుక్ అయితే జోకర్లా ఉందని సెటైర్లు వేశాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపాయి. ప్రభాస్‌కు అతడు సారీ చెప్పాల్సిందేనంటూ నెట్టింట డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఎక్స్ (ట్విటర్) వేదికగా అర్షద్ వ్యాఖ్యలపై నిర్మాత శ్రీనివాస కుమార్(ఎస్కేఎన్) ఫైర్ అయ్యాడు. వారి ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా కష్టపడుతున్నారంటూ కామెంట్ చేశాడు. మరోవైపు నిర్మాత అభిషేక్ అగర్వాల్ సైతం స్పందిస్తూ.. సినిమాకు రివ్యూ ఇవ్వొచ్చు.. దాన్ని విమర్శించవచ్చు. కానీ అర్షద్ వార్సీ వ్యాఖ్యలు మాత్రం సద్విమర్శలుగా లేవు. కాస్త ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. -
విజయ్ బాగా డబ్బున్నోడు.. బేబీ నిర్మాత కౌంటర్
హీరో విజయ్ దేవరకొండ.. మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చినవాడే! ఎన్నో కష్టాలు పడి గొప్ప స్థాయికి ఎదిగాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీస్టార్ రేపు(ఏప్రిల్ 5న) రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు సినిమా తర్వాతే బైక్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను.. అప్పటివరకు నా జీవితంలో బండి ఫుల్ ట్యాంకు కొట్టించలేదు అని చెప్పాడు. ఇది చూసిన కొందరు అంత సీన్ లేదు.. నీకు మంచి బ్యాగ్రౌండ్ ఉంది.. నువ్వు మిడిల్ క్లాస్ అంటే నమ్మమంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ట్రోలింగ్‌పై బేబీ, టాక్సీవాలా చిత్రాల నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) స్పందించాడు. 'ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కంటెంట్ బాగోలేకపోతే సినిమా చూడం.. ఒకవేళ డబ్బులున్నవాడని కంటెంట్ బాగున్నా సినిమా చూడకుండా ఆగిపోము. కాబట్టి అతడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అతడు శ్రీనగర్‌లో మాకు దగ్గర్లోనే ఓ చిన్నపాటి ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు. నేను అతడిని ఫస్ట్ టైమ్ అక్కడే కలిశాను. కష్టపడి పైకి వచ్చినవాళ్లకు.. ఆ కష్టాన్ని చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉంది. అందుకే అది ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. డబ్బులు సంపాదించాలనే.. నచ్చితే సినిమా చూడు, లేకపోతే మనేయ్. ఎందుకు ఒకరి మీద పడి ఏడవడం సోదరా? వీలుంటే అతడి పదాలను ఇన్స్పిరేషన్గా తీసుకో.. కష్టపడి తనలా ఓ స్థాయికి ఎదుగు. అప్పుడు నీకు ఆ తృప్తి ఏంటో తెలుస్తుంది' అని కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి.. విజయ్ సోదరుడు ఆనంద్ అమెరికా వెళ్లాడుగా.. మరి మధ్యతరగతి వ్యక్తికి అదెలా సాధ్యమని ప్రశ్నించాడు. దీనికి ఎస్కేఎన్ స్పందిస్తూ.. మిడిల్ క్లాస్ కాబట్టే డబ్బులు సంపాదించుకుందామని పోయాడు. కోట్లు ఉంటే ఇక్కడే ఎంజాయ్ చేస్తారు కదా.. ఇప్పుడు అమెరికా, కెనడా పోయే విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారందరికీ కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. Middle class kabatte dabbulu sampadinchukondam ani poyindu Kotlu unte ikkade enjoy chestaru kadha Ippudu U S U K Canada poye students /job holders andaru crores unnaya — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 4, 2024 చదవండి: డేరింగ్ స్టంట్స్.. అజిత్ కారు ప్రమాదం వీడియో వైరల్ -
ఎన్టీఆర్ అభిమానికి ఆర్థిక సాయం చేసిన 'బేబి' నిర్మాత
'బేబి' నిర్మాత ఎస్కేఎన్ మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బాగా దెబ్బలు తగలడంతో.. ఇతడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ చెప్పారు. కానీ సదరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తోటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ సేకరించే ప్రయత్నాలు చేశారు. (ఇదీ చదవండి: అశ్లీలతతో నిండిన ఆ వెబ్‌సైట్స్, ఓటీటీ యాప్స్ బ్యాన్) ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ వరకు చేరింది. దీంతో ఆయన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడ్డారు. అతనిది పేద కుటుంబం కావడంతో తన వంతు సాయంగా రూ.50 వేలు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్‌కి కాస్త ఊరటగా నిలిచింది. అలానే మిగతా సెలబ్రిటీలు కూడా చావు బతుకుల మధ్య ఉన్న పవన్ కృష్ణకి సాయం చేయాలని సదరు ఫ్యాన్స్ కోరుతున్నారు. (ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!) -
'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు
బేబీ సినిమా కథ నాదేనంటూ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ ఫిర్యాదు చేశాడు. గతేడాదిలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చిత్రంగా 'బేబీ' సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రాన్ని సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తే ఎస్కేఎన్ నిర్మాతగా తెరకెక్కించారు. (ఇదీ చదవండి : వీధి పోకిరి చెంప చెళ్లు మనిపించా: టాప్ హీరోయిన్) ఈ సినిమా కథను కొన్నేళ్ల క్రితమే డైరెక్టర్ సాయి రాజేశ్‌కు తాను చెప్పానంటూ శిరిన్ శ్రీరామ్ తాజాగా తెలుపుతున్నాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడినట్లు ఆయన తెలుపుతున్నాడు. పోలీసులు చెబుతున్న ప్రకారం. ' 2015లో 'కన్నా ప్లీజ్' టైటిల్‌తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. ఆ కథకు 'ప్రేమించొద్దు' అని టైటిల్ పెట్టుకున్నారు. డైరెక్టర్ సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాసకుమార నాయుడు (SKN)కు కథ చెప్పాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 2023లో 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారు. సాయి రాజేశ్ డైరెక్టర్‌గా ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతలుగా బేబీ చిత్రాన్ని తీశారు. ఈ కథ మొత్తం తన 'ప్రేమించొద్దు' స్టోరీనే అని శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు నమోదు చేశారు. -
కంటెంట్‌పై మాకు నమ్మకం ఉంది.. అవి కేవలం రూమర్స్: బేబీ నిర్మాత
మణికందన్, గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ట్రూ లవర్". ఈ విభిన్నమైన ప్రేమ కథ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్కేఎన్, మారుతి పాల్గొన్నారు. నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - 'ఈ సినిమా తమిళ ప్రీమియర్స్ చూసిన వాళ్లు ఇటీవల ఇలాంటి మంచి లవ్ స్టోరి రాలేదని చెబుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా బేబి సినిమాకు కూడా ఇలాగే ముందు రోజు ప్రీమియర్ వేశాం. కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. మారుతికి యూత్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమా ఈ వాలెంటైన్ డే విన్నర్ అవుతుంది. రవితేజ ఈగల్తో మా సినిమాకు పోటీ లేదు. మాస్ మహారాజ్ రవితేజ అంటే నాకు ఇష్టం. నేను ఆయనతో ఓ సినిమా కూడా చేయాలని అనుకున్నా. బేబి హిందీ రీమేక్‌లో నేను నటిస్తున్నాననే అనే వార్తల్లో నిజం లేదు' అన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ - 'నేను ఈ సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమిళ ప్రీమియర్స్ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ఈ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ మూవీతో వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. ప్రస్తుతం ప్రభాస్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నా. ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌తో సినిమా రాలేదు.' అన్నారు. -
‘ఈగల్’తో మాకు పోటీ లేదు: నిర్మాత ఎస్కేఎన్
‘ట్రూ లవర్’అనేది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్‌తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా కూడా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత ఎస్కేఎన్. డైరెక్టర్ మారుతితో కలిసి తమిళ మూవీ లవర్ ను "ట్రూ లవర్" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఎస్కేఎన్. మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఫిబ్రవరి 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్కేఎన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► ఒక ఫ్రెండ్ ద్వారా "ట్రూ లవర్" సినిమా మా దృష్టికి వచ్చింది. ఆయన మారుతిని కలిసి సినిమా చూడమని అన్నాడు. మారుతి నాకు చెప్పి నువ్వూ రా ఇద్దరం మూవీ చూద్దాం అన్నాడు. మా ఇద్దరికీ మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది.లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. తను ఎంచుకున్న కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశాడు. ►ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. "ట్రూ లవర్" సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా. ►నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది. ►బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. ► ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ సూపర్ న్యాచురల్ మూవీ చేయాలి. సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తా. -
'బేబి' నిర్మాత నుంచి మరో సినిమా.. ఈసారీ అలాంటి ప్రేమకథే
రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ అంటే చాలామంది చెప్పే పేరు 'బేబి'. ప్రస్తుతం చాలామందికి తెలిసిన కథనే సినిమాగా తీస్తే బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. నిర్మాతకు మూడు నాలుగు రెట్ల లాభాలు తీసుకొచ్చిందని టాక్. ఇప్పుడు ఆ నిర్మాత నుంచి మరో క్రేజీ లవ్ స్టోరీ మూవీ రాబోతుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?) అయితే ఇది తెలుగు స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ ప్రేమకథ సినిమా. 'గుడ్ నైట్' చిత్రంతో గతేడాది హిట్ కొట్టిన మణికందన్.. ఇప్పుడు' ట్రూ లవర్'గా రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి గౌరిప్రియ హీరోయిన్. తమిళంలో లవర్ పేరుతో తీసిన ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కావొచ్చని అంటున్నారు. టీజర్ బట్టి చూస్తుంటే.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడతారు. కాకపోతే ఈ అబ్బాయి మరీ ఎక్కువగా ప్రేమించేయడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అమ్మాయి వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా సరే ఇతడు చిరాకుపడిపోతుంటాడు. కాస్త 'బేబి' పోలికలు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు మారుతి కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది మరో 'బేబి' అవుతుందా అనేది చూడాలి? (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
బేబీ నిర్మాత 'ఎస్కేఎన్' ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గారు అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగ ఆయన మరణించినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్కేఎన్ కుటుంబం తెలిపింది. చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్కేఎన్ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్‌గా ఆపై పీఆర్ఓగా ఇండస్ట్రీలో తన జర్నీ ప్రారంభించాడు. తర్వాత అల్లు అరవింద్ కుటుంబానితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు అయన డైరెక్టర్ సాయి రాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. . -
టాలీవుడ్లో ‘కల్ట్’ వివాదం.. టైటిల్ ఎవరిది?
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. తన సొంత బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకంపై `కల్ట్`(#CULT) పేరుతో సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వక్ సేన్ కథ అందించగా.. తాజుద్దీన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 25 మంది కొత్త యాక్టర్స్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు విశ్వక్ సేన్. నిజంగా జరిగిన ఓ సంఘటన నుంచి స్పూర్తి పొంది ఈ కథను రాశాడట విశ్వక్. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలతోపాటు 25 మంది ఆర్టిస్ట్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టు చెప్పాడు. ఔత్సాహికులు ఆడిషన్ వీడియోలు సెండ్ చేయొచ్చని చెబుతూ..దానికి సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేశారు. (చదవండి: ఓటీటీలపై అగ్రతారల కన్ను.. ఈ ఏడాది అత్యధిక పారితోషికం ఎవరికంటే?) ఇంతవరకు బాగానే ఉన్నా..ఇప్పుడు ఆ సినిమా టైటిల్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాంటి టైటిల్‌తోనే బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. `కల్ట్ బొమ్మ` పేరుతో సినిమా షూటింగ్‌ని కూడా ప్రారంభించాడు. తాజాగా విశ్వక్ సేన్ కూడా `యాష్ ట్యాగ్ కల్ట్` టైటిల్‌ని ప్రకటించడంతో ఓ రిపోర్టర్ ఎస్కేఎన్ ‘కల్ట్ బొమ్మ’ గురించి గుర్తు చేశాడు. ‘ఎస్కేఎన్ ఇప్పటికే కల్ట్ బొమ్మ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించుకున్నారు. మళ్లీ మీరు కల్ట్ అని పెడుతున్నారెందుకు? అని సదరు రిపోర్టర్ విశ్వక్‌ని ప్రశ్నించాడు. దానికి విశ్వక్ సమాధానం ఇస్తూ... కల్ట్ బొమ్మనా..ఏమో మాకు తెలియదు. మేము అయితే #Cult అని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. నాకు తెలిసినంతవరకు కల్ట్కు సంబంధించి టైటిల్ ఎవరి వద్దా లేదు’ అని అన్నారు. విశ్వక్ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో.. ఈ విషయంపై నిర్మాత ఎస్కేఎన్ ఎక్స్ వేదికగా స్పందించారు. (చదవండి: కుర్చీని మడతపెట్టి' సాంగ్.. తమన్‌పై నెటిజన్స్ ట్రోల్స్!) తాను ఇప్పటికే కల్ట్ బొమ్మ టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నానని తెలిపారు. ‘బేబీ సినిమా సమయంలో కల్ట్ బొమ్మ అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. దీంతో ఆ టైటిల్‌ని కొన్ని నెలల క్రితం తెలుగు ఫిల్మ్ ప్రొడూసర్స్ కౌన్సిల్లో నా తదుపరి సినిమాల్లో ఒకదాని కోసం బాధ్యతాయుతమైన చలన చిత్ర సభ్యునిగా, నిర్మాతగా ఈటైటిల్ని రిజిస్టర్ చేసుకున్నాం. టైటిల్ రిజిస్టర్ చేయకుండా ఎలాంటి ప్రకటన ఉండదు. మీ ప్రేమకి ధన్యవాదాలు’అని ఎస్కేఎన్ వివరణ ఇచ్చాడు. మొత్తానికి రెండు సినిమాల టైటిల్స్ దాదాపు ఒకేలా ఉండడంతో వివాదం చెలరేగే అవకాశం ఉందని కొంతమంది సినీ పండితులు చెబుతున్నారు. రెండు టైటిల్స్ మద్య చిన్న తేడా ఉంది కాబట్టి ఎలాంటి సమస్యలు రాకపోవచ్చని మరికొంత మంది అంటున్నారు. మరి ఈ కల్ట్ గోల ఎలా ముగుస్తుందో చూడాలి. Some media friends called me and asked did I announced the #CultBomma title without registration ? For such queries once and all I am clarifying The #CultBomma title is much popular from #Babythemovie promotions so I have registered it for one of my next films In TELUGU FILM… — SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 30, 2023 -
పోస్టర్ కోసం క్రియేట్ చేసిన పదం.. కొత్త సినిమా టైటిల్‌గా!
'బేబి' సినిమాతో నిర్మాత ఎస్కేఎన్.. తెలుగు ఇండస్ట్రీకి క్రేజీ హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరస మూవీస్ నిర్మిస్తున్నారు. 'బేబి' హీరోహీరోయిన్ కాంబోలో ఓ చిత్రం, రష్మిక మెయిన్ లీడ్‌గా 'గర్ల్‌ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) మరోవైపు సంతోష్ శోభన్, అలేఖ్య హారిక జంటగా ఓ సినిమా తీస్తున్న నిర్మాత ఎస్కేఎన్.. తను నిర్మించే ఓ కొత్త మూవీ కోసం 'కల్ట్ బొమ్మ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే 'బేబి' హిట్ కావడంతో అప్పుడు ప్రమోషన్స్ కోసం పోస్టర్స్‌పై కల్ట్ బొమ్మ అని వేశారు. ఇప్పుడు ఈ పదాన్ని ఏకంగా మూవీ టైటిల్ చేసేయడం డిఫరెంట్‌గా అనిపించింది. ఏమైనా బేబి ప్రమోషన్లో కల్ట్ బ్లాక్ బస్టర్, కల్ట్ బొమ్మ అనే పదాన్ని తన స్పీచుల్లో ఎస్ కే ఎన్ బాగా వాడి, ఆ పదాలను పాపులర్ చేశారు. ఈసారి అదే టైటిల్‌తో సినిమా చేస్తుండటం ఇంట్రెస్టింగ్గా ఉంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) -
కూతురి పెళ్లికి దాచిన డబ్బు చెదల పాలు.. సాయం ప్రకటించిన 'బేబీ' సినిమా నిర్మాత
పసి వయసులో చేయి పట్టుకొని నడిపిస్తూ ఈ విశాల ప్రపంచాన్ని తొలిసారి పరిచయం చేసేది నాన్నే. భుజాలపై ఎక్కించుకుని ఆడించినా.. అల్లరి చేసినప్పుడు దండించినా బిడ్డ భవిష్యత్తే నాన్నకు ముఖ్యం. ప్రధానంగా ఆడపిల్ల ఉన్న తండ్రి ఇంకా భిన్నంగా ఆలోచిస్తాడు. ఎంతో కష్టపడి అతని చేతిలో డబ్బున్నా తన గారాల బిడ్డ చదువు, ఆమె పెళ్లి కోసం డబ్బు దాస్తాడు. తన కోసం ఏదీ కొనుక్కోడు కానీ పిల్లల కోసం తన కోరికలను, ఆశలను చంపుకుని డబ్బు కూడాబెడుతాడు. అలాంటి డబ్బే చెదల పాలు అయితే ఆ తండ్రి వేదన భరించలేనిది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ తండ్రి కూడా బిడ్డల భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బు చెదల పాలు కావడంతో కన్నీరుమున్నీరు అయ్యాడు. తన కూతురి పెళ్లి కోసం రోజంతా కష్టపడి వచ్చిన డబ్బును తన ఇంట్లో దాచి ఉంచాడు. సుమారు రూ. 2 లక్షల మొత్తాన్ని అతను తన ఇంట్లో భద్రపరిచాడు.. కానీ ఆ డబ్బు చెదులు పట్టిందా..? లేదా ఎలుకలు కొరికాయో తెలియదు కానీ ఇలా ఆ మొత్తం డబ్బు వినియోగించుకునేందుకు పనికిరాకుండా పోయింది. ఆ డబ్బును చూసిన ఆ తండ్రి కంట కన్నీళ్లు ఆగడం లేదు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఆ తండ్రి కన్నీళ్లు చూసిన బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ (SKN) రియాక్ట్ అయ్యాడు. ఆ కుటుంబానికి సాయం చేసేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ తండ్రి వివరాలు తనకు పంపాలని... ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ. 2లక్షల డబ్బును ఆయన ఇస్తానని తన ఎక్స్‌లో తెలిపాడు. ఇందుకు గాను గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బ్యాంకులలో డబ్బును దాచుకునేలా వారికి అవగాహన కల్పించాల్సిన భాద్యత అందరిపైన ఉందని ఆయన తెలిపాడు. దీంతో ఎస్కేఎన్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. కష్టంలో ఉన్న వారికి ఇలాంటి సాయం చేయడానికి ముందుకు వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడేంటి రా ఇంత మంచోడు అంటూ మరోకరు తెలిపారు. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ కూడా తన ఫ్రెండ్ చేస్తున్న మంచి పనిని అభినందించినట్లు సమాచారం. ఏదేమైనా నష్టపోయిన ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్కేఎన్కు అందేలా చేయండని మరికొందరు తెలుపుతున్నారు. Sad to know & it's very unfortunate to see their innocence keep money like that Can any one share their contact please Would like to help them — SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023 -
మా ఊరి పొలిమేర 2 నా సినిమా లాంటిది
‘‘నా ‘క్షణం’ సినిమాకి పని చేసిన టీమ్ అంతా ‘‘మా ఊరి పొలిమేర 2’ టీమ్‌లో ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. ‘మా ఊరి పొలిమేర ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి, దానికి సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తీయడం ఆనందంగా ఉంది. ఇది నా సొంత సినిమా లాంటింది. తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర–2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథులుగా అడివి శేష్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ఎస్కేఎన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే కష్టమే. ప్రేక్షకులకు మంచి సినిమా కావాలి.. అంతే. ‘మా ఊరి పొలిమేర–2’కి హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ఇంత గ్రాండ్‌గా విడుదల కావడానికి కారణం వంశీ నందిపాటిగారు. మా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘సత్యం’ రాజేశ్, గౌరీకృష్ణ, అనిల్ విశ్వనాథ్. ఈ వేడుకలో కామాక్షీ భాస్కర్ల, గాయకుడు పెంచల్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
'మీరు బాదకముందే చెబుతున్నా ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి'
బేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా ‘హృదయకాలేయం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. తర్వాత కలర్ ఫోటోతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయి రాజేష్ తెరకెక్కించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు. (ఇదీ చదవండి: దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!) కలర్ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్ ఇద్దరూ.. గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. అలా బేబీ హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్' నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో వచ్చిందని సాయి రాజేష్ గుర్తు చేశారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు ఆ తర్వాత తాను నిర్మాతగా సినిమాలు నిర్మించలేదని సాయి రాజేష్ ఇలా చెప్పుకొచ్చాడు. ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్లీ సినిమా నిర్మించాలని అనుకున్నాను. ఈ కథ ప్రేక్షకులను మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు ఎన్ని తీస్తారురా 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు అని బాదకముందే నేనే ముందుగా చెప్తున్నాను. నాది, ఎస్కేఎన్ కాంబినేషన్లో మొత్తం 6 ప్రేమకథలు రాబోతున్నాయి. వీటిలో రెండు మీరు చూసేశారు. ఒకటి కలర్ ఫోటో.. రెండోది బేబి. రెండు నిర్మాణంలో ఉన్నాయి.. వైష్ణవి, ఆనంద్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక సినిమా ప్రకటించాం. ఇప్పుడు సంతోష్, హారిక కాంబినేషన్లో ఈ సినిమా రానుంది. ఇవి కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. కొందరు మాత్రం ఇదేమైనా సినిమాటిక్ యూనివర్సా.. స్టోరీలో ఏమైనా లింక్ అయ్యాయా..? సీక్వెల్ ఉంటుందా..? అంటే నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు.. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ.. మీ అందర్నీ మెప్పించేలా ఆరు ప్రేమ కథలు ఉన్నాయి. అవి నేను, ఎస్కేఎన్ కలిసి మీకు అందిస్తున్నాం. వాటిలో ఇదీ ఒకటి. ఇది నా మనసుకు చాలా దగ్గరైన ప్రేమ కథ. ఈ ప్రాజెక్ట్‌లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సుమన్ పాతూరి, హారిక అలేఖ్య, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్, సుహాస్, మేమందరం చాలా సంత్సరాలుగా స్నేహితులం. ఎస్కేఎన్, నేను చిన్నప్పటి నుంచీ ఫ్రెండ్స్. అందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తున్నాం.' అని సాయి రాజేష్ చెప్పారు. -
క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్
బిగ్‌బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేత్తడి అనే యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌బాస్ సీజన్-4 ఆఫర్ అందుకున్నఆమె టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది. తర్వాత ఆమె పలు షోలలో మెరిసింది. కానీ కొంత కాలంగా ఆమె బుల్లితెరకు దూరంగానే ఉంటూ వస్తుంది. తాజాగా అలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన కథానాయకుడు కాగా ఆయనకు జోడీగా ఆలేఖ్య హారిక హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బేబీ మేకర్స్ నిర్మాత SKN, డైరెక్టర్ సాయి రాజేష్‌లు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు టాక్. సాయి రాజేష్ ఇప్పటికే బేబీ సనిమాతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యకు బిగ్ ఛాన్స్ ఇచ్చాడు. యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హారికను హీరోయిన్గా సాయి రాజేష్ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. రేపు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. చిన్న సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా సంతోష్ శోభన్ ఉన్నారు. ఆతనితో తెరికెక్కించిన ప్రతి సినిమా మినిమమ్ ఆడియన్స్‌కు రీచ్ అవుతుందని తెలిసిందే. బిగ్‌బాస్ నుంచి వచ్చాక హారిక సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. తర్వాత కొద్దిరోజులకే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదరు. కానీ సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, హాట్‌హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ఫుల్ యాక్టివ్‌గా ఉంది. ఈ సినిమా ప్రాజెక్ట్ నిజంగానే పట్టాలెక్కుతే ఆమెకు మళ్లీ పలు ఛాన్స్‌లు రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
'బేబి' డైరెక్టర్‌కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
బేబి.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి:'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్‌కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!)