
టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గారు అయిన శ్రీ గాదె సూర్య ప్రకాశరావు గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. దీంతో ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగ ఆయన మరణించినట్లు తెలుస్తోంది.దీంతో పలువురు సినీ ప్రముఖులు ఎస్‌కేఎన్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. నేడు (జనవరి 4) సాయంత్రం 4 గంటలకు ఫిలిమ్‌నగర్ దగ్గర్లో ఉన్న మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఎస్‌కేఎన్ కుటుంబం తెలిపింది.
చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎస్‌కేఎన్ మొదట చిన్నపాటి డిస్ట్రిబ్యూటర్‌గా ఆపై పీఆర్‌ఓగా ఇండస్ట్రీలో తన జర్నీ ప్రారంభించాడు. తర్వాత అల్లు అరవింద్ కుటుంబానితో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం అతన్ని నిర్మాతను చేసింది. దీంతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన గతేడాది తన స్నేహితుడు అయన డైరెక్టర్ సాయి రాజేష్‌తో కలిసి బేబీ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
.
Comments
Please login to add a commentAdd a comment