తెలుగమ్మాయిలపై వివాదాస్పద కామెంట్స్: టాలీవుడ్ నిర్మాత వివరణ | Tollywood Producer SKN Released A Video About His Comments In Event | Sakshi
Sakshi News home page

SKN: 'తెలుగమ్మాయిలపై వివాదాస్పద కామెంట్స్'.. వీడియో రిలీజ్ చేసిన ఎస్‌కేఎన్

Published Tue, Feb 18 2025 3:21 PM | Last Updated on Tue, Feb 18 2025 4:03 PM

Tollywood Producer SKN Released A Video About His Comments In Event

ఇటీవల డ్రాగన్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించమని.. వారిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను చెప్పిన వాటిలో వివాదమేముందని ఎస్‌కేఎన్‌ రిప్లై కూడా ఇచ్చారు.

(ఇది చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇ‍వ్వకూడదు: ఎస్‌కేఎన్‌)

అయితే తాజాగా ఈ వివాదంపై నిర్మాత ఎస్‌కేఎన్‌ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగమ్మాయిలను పరిచయం నిర్మాతల్లో తాను కూడా ఉన్నానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగువారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాదాన్యతగా భావిస్తానని ట్విటర్‌లో వీడియోను పంచుకున్నారు. అందుకే దయచేసి తనపై  ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.  

వీడియోలో ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడా. కానీ నేను తెలుగు అమ్మాయిలతో పని చేయనని రాశారు. కానీ చాలా మంది తెలుగు నటీమణులను పరిశ్రమకు పరిచయం చేసిన కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారని నేనే పరిచయం చేశా. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశానని' అన్నారు. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement