
'టాలీవుడ్‌లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్‌కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఆరుగురు తెలుగమ్మాయిలను..
నిజానికి ఎస్‌కేఎన్ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్‌గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్, ఆనంది, 'రొమాన్స్'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్ శోభన్‌తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్‌కేఎన్.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు.
కవర్ డ్రైవ్
ఫన్ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్‌మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్ జోహార్
Comments
Please login to add a commentAdd a comment